పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ల వర్షం.! | Upul Tharanga Half century in Vizag odi | Sakshi
Sakshi News home page

పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ల వర్షం.!

Published Sun, Dec 17 2017 2:34 PM | Last Updated on Sun, Dec 17 2017 2:34 PM

Upul Tharanga Half century in Vizag odi - Sakshi

సాక్షి, విశాఖ: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో లంక ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ అర్థ సెంచరీ సాధించాడు.  టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా వేసిన 8 ఓవర్‌లో వరుసగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో శ్రీలంక 9 ఓవర్లలోపే 65 పరుగులు చేసింది. ఈ ఓవర్‌కు ముందు లంక స్కోర్‌ 45/1 ఉండగా.. అనంతరం తరంగ 20 పరుగుల పిండుకోవడంతో 65 పరుగులకు చేరింది.

ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు లంక స్కోర్‌ 73/1. క్రీజులో తరంగ(50)తొ పాటు సమరవిక్రమా(10)లున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement