ఆరో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక | Sri Lanka down 6 Wickets in Vizag Odi | Sakshi
Sakshi News home page

ఆరో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

Published Sun, Dec 17 2017 4:20 PM | Last Updated on Sun, Dec 17 2017 4:20 PM

 Sri Lanka down 6 Wickets in Vizag Odi - Sakshi

సాక్షి, విశాఖ: భారత్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో శ్రీలంక ఆరో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోర్‌ 197 పరుగుల వద్ద తిసారా పెరీరా(6) చాహల్‌ బౌలింగ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 136 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న శ్రీలంక కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (95) వికెట్‌ కోల్పోవడంతో వరుస వికెట్లను చేజార్చుకుంది. రెండో వన్డే సెంచరీ సాధించిన మాథ్యూస్‌ సైతం ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు.

దీంతో శ్రీలంక 61 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్‌ 3 వికెట్లతో చెలరేగగా కుల్దీప్‌ రెండు వికెట్లు, బుమ్రా ఓ వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక స్కోర్‌ 204/6, క్రీజులో గుణరత్నే(10) పతిరణ(6)లున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement