వాషింగ్టన్: అమెరికా(USA)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. హమాస్(Hamas)కు హెచ్చరికలు జారీ చేశారు. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బంధీలను విడిచిపెట్టాలని అన్నారు. అలా జరగని పక్షంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘నేను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తాను. ఈలోపు హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తాను. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే బందీలను విడుదల చేయండి’ అని హెచ్చరించారు.
ఇదే సమయంలో గతంలో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. ఏ విధంగానూ ప్రతికూలంగా ఉండవలసిన అవసరం లేదు. కానీ, అధ్యక్షుడు తని స్థాయికి తగినట్టుగా వ్యవహరించాలి. నేను రేపు ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్నాను. పలు అంశాలపై అక్కడ పురోగతి లభిస్తుందని అనుకుంటున్నాను. ఇజ్రాయెల్-హమాస్ మద్య చర్చలను నేను దెబ్బతీయాలని అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ (Hamas) మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అమెరికా-ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడారు. ఈ వీడియోలో అతను మాట్లాడుతూ.. ‘నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నాను. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి’ అని అభ్యర్థించాడు. ఈ క్రమంలోనే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment