
మనీలా: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే మంగళవారం అరెస్ట య్యారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ను మనీలా లోని అంతర్జాతీయ విమా నాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ దుతర్తే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్ర వివా దాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)ఆయనపై విచారణకు చర్యలు ప్రారంభించింది.
అయితే, ఆ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఐసీసీ నుంచి వైదొలగుతున్నట్లు అధ్యక్షుడిగా ఉన్న దుతర్తే ప్రకటించారు. 2022 ఎన్నికల్లో ఫెర్డినాండ్ మార్కోస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతర పరిణామాల్లో దుతర్తేపై వచ్చిన ఆరోప ణలపై విచారణను తిరిగి ప్రారంభించనున్నట్లు 2023 జూలైలో ఐసీసీ ప్రకటించింది.
జన హననా నికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై దుతర్తే కు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లకు స్పందనగానే దుతర్తేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలి పారు. దుతర్తేపై విచారణకు ఐసీసీకి సహక రిస్తామని అధ్యక్షుడు మార్కోస్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment