Manila airport
-
పాస్‌పోర్టు బ్లాక్.. ఫిలిప్పీన్స్‌లో హైదరాబాద్ యువతి తిప్పలు
ఫిలిప్పీన్స్‌లో నవ్య అనే తెలుగు యువతి తిప్పలు పడుతోంది. మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్‌పోర్ట్ బ్లాక్ అయ్యిందని, తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. దీంతో మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో రాత్రంతా నవ్యదీప్తి పడిగాపులు కాసింది. అయితే తన పాస్‌పోర్ట్‌ను కావాలనే బ్లాక్ చేశారని నవ్య ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనిల్లా ప్రాంతంలో నవ్య 2 ఏళ్ళుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. కోవిడ్ టైంలో అధిక డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి ఓనర్ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె చెబుతోంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్ బ్లాక్ చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగారని..డబ్బులు కట్టనందుకు పాస్ పోర్ట్ బ్లాక్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ పాస్ పోర్ట్ ఆఫీస్‌లోనే ఇంటి ఓనర్ పనిచేస్తున్నట్లు నవ్య తెలిపారు. కాగా మెడిసిన్ కోసం నవ్య మూడేళ్లేగా ఫిలిప్పీన్స్‌లో ఉంటోంది. కోవిడ్ సమయంలో ఇండియాకు చేరుకున్న ఆమె ప్రస్తుతం పరిస్థితులు చక్కపడటంతో తిరిగి ఫిలిపిన్స్‌కు బయలు దేధారు. రెండు రోజుల క్రితం నవ్య హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లారు. అయితే మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం సింగపూర్ ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్న ఆమెను.. తిరిగి ఇండియా వెళ్ళేవారకు లగేజ్ ఇవ్వమని తెలిపారు. -
ఆరు రోజుల చిన్నారిని బ్యాగులో కుక్కి..
-
షాకింగ్: ఆరు రోజుల చిన్నారిని బ్యాగులో కుక్కి..
మనీలా : ప్రయాణం చేసే సమయాల్లో ఎవరైనా బ్యాగుల్లో దుస్తులు, సామాన్లు తీసుకెళ్తారు... లేదంటే తినే వస్తువులు తీసుకెళ్తారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ మాత్రం ఆరు రోజుల పాపాయిని బ్యాగులో తీసుకువెళ్లింది. ఈ షాకింగ్ ఘటన పిలిఫ్పీన్స్లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన మహిళ దేశాన్ని విడిచి వెళ్లే క్రమంలో మనీలా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు తనిఖీ విభాగం అధికారులు సదరు మహిళ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో చిన్నారి కనిపించింది. ఈ ఘటన గురించి పిలిఫ్పీన్స్ ఇమిగ్రేషన్ బ్యూరో ప్రతినిధి మాట్లాడుతూ.. 43 సంవత్సరాల ప్రయాణికురాలి బ్యాగులో ఓ పసిపాపను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఎయిర్‌పోర్టులోకి మహిళ ఒంటరిగా ప్రవేశించిందని, తన వ్యక్తిగత పాస్‌పోర్టు అధికారులకు సమర్పించిన అనంతరం తనిఖీలు నిర్వహించే సమయంలో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. కాగా ఆ చిన్నారి మయస్సు కేవలం ఆరు రోజులు మాత్రమే అని, మహిళ వద్ద చిన్నారికి సంబంధించిన ఎలాంటి వివరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు తెలయలేని తెలిపారు. ఈ క్రమంలో అధికారులు మహిళను విచారించగా చిన్నారికి వరుసకు అత్తయ్య అవుతానని తెలిపింది. అయితే ఈ విషయం పై ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారలు ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌లో కాల్పులు
-
ఫిలిప్పీన్స్‌లో కాల్పులు
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం చోటుచేసుకుంది. మనీలా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న రిసార్టులో ఓ వ్యక్తి మారణహోమం సృష్టించాడు. తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు.. అక్కడ ఉన్న గేమింగ్ టేబుల్స్‌కు నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రిసార్ట్స్ వరల్డ్ క్యాసినోలో గురువారం రాత్రి ముసుగు ధరించిన ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన పౌరులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. మరికొందరు బిల్డింగ్ రెండో ఫ్లోర్‌నుంచి దూకేశారు. టేబుల్స్‌కు నిప్పుపెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరై ఎక్కువమంది మృతి చెందినట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఘటనను ఉగ్రవాదుల దాడిగా భావించారు. పోలీసులు చేపట్టిన కౌంటర్ ఎటాక్ ఆపరేషన్‌లో.. రిసార్ట్‌లోని ఓ గదిలో దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించారు. రిసార్ట్‌లో దోపిడీ చేయడానికి దుండగుడు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఫిలిప్పీన్స్‌లో కాల్పులు