
ఫిలిప్పీన్స్‌లో కాల్పులు
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం చోటుచేసుకుంది. మనీలా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న రిసార్టులో ఓ వ్యక్తి మారణహోమం సృష్టించాడు. తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు.. అక్కడ ఉన్న గేమింగ్ టేబుల్స్‌కు నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. రిసార్ట్స్ వరల్డ్ క్యాసినోలో గురువారం రాత్రి ముసుగు ధరించిన ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన పౌరులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. మరికొందరు బిల్డింగ్ రెండో ఫ్లోర్‌నుంచి దూకేశారు. టేబుల్స్‌కు నిప్పుపెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరై ఎక్కువమంది మృతి చెందినట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఘటనను ఉగ్రవాదుల దాడిగా భావించారు. పోలీసులు చేపట్టిన కౌంటర్ ఎటాక్ ఆపరేషన్‌లో.. రిసార్ట్‌లోని ఓ గదిలో దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించారు. రిసార్ట్‌లో దోపిడీ చేయడానికి దుండగుడు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.