Israel-Palestine Conflict
-
అటు నలుగురు.. ఇటు 200
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరువైపులా బందీల విడుదల ప్రక్రియ రెండోదఫా సజావుగా సాగింది. పెద్ద సంఖ్యలో తమ వాళ్లు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలకావడంతో వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లా నగరంలో పాలస్తీనియన్లు సంబరాలు చేసుకున్నారు. నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులు కరీనా అరీవ్(20), డేనియెలా గిల్బోవా(20), నామా లెవీ(20), లిరి అల్బాగ్(19)లను హమాస్ సాయుధులు విడిచిపెట్టారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ సైతం తమ కారాగారాల్లోని 200 మంది పాలస్తీనియన్లను వదలిపెట్టింది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఒఫెర్ జైలు నుంచి బయటకొచ్చిన ఖైదీలను జెరూసలేం, రమల్లా సిటీలకు తరలించారు. విడుదలైన 200 మంది బస్సుల్లో బయల్దేరారు. ఈ 200 మందిలో 121 మంది జీవితఖైదు పడిన వాళ్లు ఉన్నారు. వీళ్లంతా గతంలో ఇజ్రాయెలీలపై దాడులకు పాల్పడ్డ నేరాలకు ఇజ్రాయెల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. విడుదలైన వారిలో కరుడుగట్టిన ఉగ్రవాదులు మొహమ్మద్ ఓదేహ్(52), వేయిల్ ఖాసిమ(54) సైతం ఉన్నారు. విడుదలైన 200 మందిలో 70 మందిని బహిష్కరించి ఈజిప్ట్ కు పంపేశారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంలో ఈజిప్ట్ కీలక మధ్యవర్తిగా ఉన్న నేపథ్యంలో కొందరు ఖైదీలను ఈజిప్ట్ కు తరలించినట్లు అక్కడి ఖహేరీ టీవీ పేర్కొంది. అంతకుముందు ఈ నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులను గాజా సిటీలోని పాలస్తీన్ స్క్వేర్ వద్ద రెడ్‌క్రాస్ బృందానికి హమాస్ సాయుధులు అప్పగించారు. ఈ మహిళలు పూర్తి ఆరోగ్యంతో, నవ్వుతూ అక్కడి వేలాది మంది స్థానికులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. వీళ్ల రాకను ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగర వీధుల్లో ఎల్ఈడీ స్క్రీన్లపై చూసిన వందలాది మంది స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ‘‘నమ్మలేకపోతున్నా. వాళ్లు అలా విడుదలకావడం చూసి మనసు ఉప్పొంగింది. యుద్ధం శాశ్వతంగా ఆగిపోతే ఎంత బాగుంటుందో’’అని సంబరాలు చేసుకున్న అవీవ్ బెర్కోవిచ్ అనే స్థానికుడు ఆనందం వ్యక్తంచేశారు. ఈ మహిళా సైనికులు సురక్షితంగా తమ ఆర్మీ స్థావరానికి చేరుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం ధృవీకరించింది. -
నేనొచ్చేలోపే బందీలను వదిలేయండి
వాషింగ్టన్: హమాస్– ఇజ్రాయెల్ యుద్ధంలో బందీలుగా మారిన ఇజ్రాయెల్, అమెరికన్ పౌరుల విడుదలపై కాబోయే అమెరికా అధ్యక్షుడు (Donald Trump)డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ శివారు ప్రాంతాలపై దాడిచేసి అపహరించుకుపోయిన అమాయకులను జనవరి 20వ తేదీలోపు విడుదలచేయకుంటే దారుణ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హమాస్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. ఫ్లోరిడాలోని మార్–ఏ–లాగో రిసార్ట్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికే ఖతార్ వేదికగా (Hamas)హమాస్ ప్రతినిధులు, ఇజ్రాయెల్ ఉన్నతాధికారులకు మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల పై చర్చలు జరుగుతు న్న విషయం తెల్సిందే. ఈ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు.అంత అమానుషంగా ప్రవర్తిస్తారా?‘‘ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియకు నేను భంగం కల్గించదల్చు కోలేదు. నేను అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈలోపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరాల్సిందే. బందీలను క్షేమంగా తిరిగి పంపకపోతే హమాస్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. నేను అధ్యక్షుడిని అయ్యాక పశ్చిమాసియా దారుణ పరిస్థితులను చవిచూస్తుంది. ఇంతకు మించి హమాస్‌కు నేనేం చెప్పను. అసలు వాళ్లు అలా దాడి చేయకుండా ఉండాల్సింది. వాళ్లను కిడ్నాప్ చేయకుండా ఉండాల్సింది. వాళ్లు ఇంకా బందీలుగా ఉండకూడదు. బందీలను విడిచి తీసుకురావాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రజలు నన్ను వేడుకున్నారు. కనీసం మా అబ్బాయి మృతదేహమైనా మాకు అప్పగిస్తారా? అని కొందరు తల్లులు, తండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ అమ్మాయిలను జడలు పట్టి వాహనాల్లో పడేశారు. ఆ రోజు కిడ్నాప్‌కు గురైన అమ్మాయి చనిపోయింది. అసలు అమ్మా యిలతో అంత అమానుషంగా ప్రవర్తిస్తారా?’’ అని ట్రంప్ ఆగ్రహంగా మాట్లాడారు.చివరి దశలో చర్చలుపశ్చిమాసియా పర్యటన ముగించుకుని వచ్చిన ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కోఫ్ సైతం మాట్లాడారు.‘‘ చర్చలు చివరి దశలో ఉన్నాయి. దోహాలో చర్చలు ఇంకా ఎందుకు ముగింపునకు రాలేదనేది నేను ఇప్పుడే వెల్లడించలేను. కాబోయే అధ్యక్షుడి హెచ్చరికలను హమాస్ దృష్టిలో పెట్టుకో వాలి’’ అని విట్కోప్ అన్నా రు. కాల్పుల విరమణ ఒప్పందం అమలైతే ఇద్దరు అమెరికన్లుసహా 34 మంది బందీలను విడుదలచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఖతార్ చర్చల్లో హమాస్ ప్రతినిధులు చెప్పారు. జో బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం 2023 అక్టోబర్ ఏడున దాడి జరిగిన కొద్దివారాలకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాదాపు ఓ కొలిక్కి తెచ్చింది. ఆ సమయంలో డజన్ల మంది బందీలను హమాస్ విడుదల చేసింది. తర్వాత హమాస్, ఇజ్రాయెల్ పర స్పర దాడులు అధికమవడంతో బందీల విడు దల ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. ఆ తర్వాత కాల్పుల విరమణ, బందీల విడు దలపై చర్చల్లో పీఠముడి పడి ఇంతవరకు ఓ కొలిక్కిరాలేదు. బందీలను విడిచించాలని ట్రంప్ హెచ్చరించిన వేళ గాజాలో ఒక బందీ మృతదేహాన్ని ఇజ్రాయెల్ బలగాలు గుర్తించాయి. మరో మృతదేహం లభించినా అది ఎవరిది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మృతిచెందిన బందీని యూసెఫ్ అల్ జైదానీగా గుర్తించారు. -
బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తారా?
అక్టోబరు 23 (బుధవారం)న సాక్షి దిన పత్రిక ఎడిట్ పేజీలో పాలస్తీనా సమస్యపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ రాసిన వ్యాసం వాస్తవాలకు భిన్నంగా ఇజ్రాయెల్‌కు వత్తాసు పలికేలా ఉంది. వ్యాసం మొత్తంగా చూసినప్పుడు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ కాండకు మద్దతిస్తున్నట్లే ఉంది. రాజ్య నైజాన్ని గురించి కానీ, దానికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరప్ దేశాల పాత్ర గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా బాధితులనే దోషులుగా చిత్రించేందుకు వ్యాసకర్త యత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వ్యవహారమంతా నాగరికతకు సంబంధించిన సమస్య అనడం అంతకన్నా శోచనీయం. ఆ వ్యాసంలో ఒక చోట ఆయన ‘ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ... ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కు అమలు లోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇజ్రాయెల్ ఒక లౌకిక ఘనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్ప దలచుకున్నారా? అలా చెప్పడమంటే వాస్తవాన్ని చూడ నిరాకరించడమే అవుతుంది.ప్రముఖ యూదు చరిత్రకారుడు, యూరోపియన్ సెంటర్ ఫర్ పాలస్తీనా స్టడీస్ డైరెక్టర్ ఇలాన్ పాపే ఇటీ వల బ్రస్సెల్స్‌లో ‘అనడోలు’ అనే వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో... పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నది ముమ్మాటికీ జాతి నిర్మూలన కార్యక్ర మమేనని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాజకీయాలు సెటి ల్మెంట్ల నిర్మాణం నుంచి యూదు దురహంకారాన్ని రెచ్చగొట్టే దశకు వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ శక్తులే ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ తిష్ట వేసుక్కూర్చున్నాయి. ఈ నాయకత్వం వల్లే ఇజ్రాయెల్ దురాక్రమణదారుగా పాలస్తీనా అంతటా విస్తరిస్తోంది. నీరు, ఆహారం, మందులపై ఆంక్షలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఒక వైపు అమానుష చర్యలకు పాల్పడుతూ, మరోవైపు పాలస్తీనియన్లే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలకూ కారకులుగా, అనైతిక చర్యలకు పాల్పడే వారిగా చిత్రిస్తున్నారు. వీరిని అక్కడ నుంచి వెళ్లగొట్టడమే పరిష్కారమన్న ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అమెరికా, యూరప్‌లు చాలా కాలంగా ప్రచారంలో పెడుతూ వస్తున్నాయి. 76 ఏళ్ల తరువాత కూడా అదే పాచికను ప్రయోగిస్తే అది చెల్లుబాటు కాదు అని చరిత్ర కారుడు పాపే తేల్చి చెప్పాడు.రెండవ అంశం: ‘అక్టోబరు 7 నాటి మారణ కాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతునిస్తూ ఈ యుద్ధంలోకి ప్రవేశించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి’ అని ప్రొఫెసర్ గారు సూత్రీకరించారు. అది వాస్తవమా? పాలస్తీనా, అలాగే యావత్ పశ్చిమా సియా ప్రాంతానికి పెనుముప్పుగా తయారైంది ఇజ్రా యెల్. పశ్చిమ దేశాలు తమ ఆధిపత్యానికి కాలం చెల్లుతుండడం, ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో బెంబేలెత్తి వలస వాదాన్ని మళ్ళీ విస్తరించేందుకు పూనుకుంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయిల్ గాజాపై దాడిని... లెబ నాన్కు, అటు నుంచి ఇరాన్‌కు, తద్వారా యావత్ పశ్చి మాసియాకు విస్తరింపజేయాలనే పన్నాగాన్ని ఈ సంద ర్భంగా గుర్తించాలి.ఇందుకోసం ఇజ్రాయిల్‌కు అమెరికా వంటి దేశాలు పెద్ద యెత్తున ఆయుధాలు, డబ్బు అందజేస్తున్నాయి. మూడవ అంశం... 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అంగీకరించి సంతకం చేయగా పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించాయనీ... 1948కు ముందున్న చోటికి తిరిగి వెళ్లాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోందని’ ఐలయ్య తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య వర్తిత్వంలో 1993లో ఓస్లో ఒప్పందం (నార్వే ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని ఐజాక్ రాబిన్, పాలస్తీనా విమో చనా సంస్థ నేత యాసర్ అరాఫత్ సంతకాలు చేశారు. ఆ తరువాత ఆ ఒప్పందానికి ఇజ్రాయెలే తూట్లు పొడిచింది. నాల్గవ అంశం... హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్ హుడ్లు ప్రపంచం మొత్తానికి సమస్యలు సృష్టిస్తున్నాయి అని చెప్పడం కన్నా అన్యాయం ఏముంటుంది? అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఈ ప్రాంతంలో సాగిస్తున్న అణచివేత, దురాక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటం లోంచి పుట్టుకొచ్చినవే హమాస్ వంటి సంస్థలు.అయిదవదీ, చివరిదీ నాగరికతకు సంబంధించిన అంశం: ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య అని ప్రొఫెసర్ ఐలయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఏది నాగరికతో ఏది అనాగరికతో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాగతాలను కప్పి పుచ్చి ఆ దేశ నాగరికత, ప్రజాస్వామ్యం గురించి కీర్తించడాన్ని ఏమనాలి? ఇప్పుడు జరగాల్సింది యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహునూ, ఆయనకు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలను బోనులో విలబెట్టడం. – కె. గడ్డెన్న ‘ సీనియర్ పాత్రికేయుడు -
Israel-Hamas war: వెస్ట్‌బ్యాంక్‌పై భీకర దాడి
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
అడుగు దూరంలో ఉన్నాం.. ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గాజాతో జరుగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హమాస్ వద్ద ఉన్న బంధీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాతో యుద్ధంలో విజయానికి అడుగు దూరంలోనే ఉన్నాం. ఇప్పటివరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరం. ఒప్పందానికి సిద్ధమే, లొంగిపోవడానికి కాదు. అంతర్జాతీయంగా వస్తోన్న ఈ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై చేసే బదులు.. దీనిని హమాస్ వైపు మళ్లించాలి. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు. ఇదిలాఉంటే, హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటికే వరకు దాదాపు 33వేల మంది మరణించినట్టు సమాచారం. యుద్ధం కారణంగా గాజాలో విపత్కర పరిస్థితుల నెలకొన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో నెతన్యాహు ఇలా కామెంట్స్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. -
Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్–హమాస్ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ ల్యూయిస్ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే. -
ఇజ్రాయెల్ అమానుషం.. నెతన్యాహుపై జో బైడెన్ సీరియస్
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో విషయంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తీరుపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, గాజాలో కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న జో బైడెన్.. బెంజమిన్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగం తర్వాత సెనెటర్ మైకెల్ బెన్నెట్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితరులతో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా గాజాలో మానవ సంక్షోభంపై బెన్నెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బైడెన్ సమాధానమిస్తూ.. గాజా విషయంలో నెతన్యాహుతో ముందుగానే చెప్పినట్టు తెలిపారు. అలాగే, గాజాలో మానవ సంక్షోభాన్ని నివారించడానికి నెతన్యాహు చేయాల్సినంత చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌కు సహాయం చేసే దాని కన్నా ఆదేశ ప్రజలను బాధపెట్టేలా ఉందన్నారు. నెతన్యాహుకు ఇజ్రాయెల్‌ను కాపాడే హక్కు ఉంది. ఇదే సమయంలో ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. Latest: Benjamin Netanyahu 'hurting Israel more than helping Israel' with Gaza war approach - Joe Biden — Totlani Krishan🇮🇳 (Modi Ka Parivar) (@kktotlani) March 10, 2024 ఇదిలాఉండగా.. కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 30వేలకుపైగా ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మరోవైపు.. హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో 1200 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఇక, ఇజ్రాయెల్ నుంచి హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో 99 మంది గాజాలో సజీవంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. -
గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రయెల్‌పై సోమవారం ఓ క్షిపణి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన ఈ దాడి.. లెబనాన్‌కు చెందిన హెజ్జుల్లా మిలిటెంట్ గ్రూప్ పనిగా తేలింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఓ భారతీయుడు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురే కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. మరణించిన వ్యక్తిని కేరళలోని కొల్లంకు చెందిన పాట్ నిబిన్ మాక్స్మెల్గా గుర్తించగా.. గాయపడిన ఇద్దరిని జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌లుగా గుర్తించారు, ఇద్దరు ఇడుక్కికి చెందగా..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా 31 ఏళ్ల పాట్ నిబిన్ రెండు నెలల కిత్రమే ఇజ్రాయెల్ వెళ్లారు. అతడి భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. వీరికి అయిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే తన భర్త, తండ్రికి అవే చివరి చూపులు అవుతాయని ఇద్దరూ ఊహించి ఉండరేమో.. ఈ దాడిపై నిబిన్ తండ్రి పాథ్రోస్ మాట్లాడుతూ.. తన పెద్ద కొడుకు ఇజ్రాయెల్ వెళ్లడంతో చిన్న కుమారుడైన నిబిన్ కూడా వారం రోజుల వ్యవధిలోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ముందు మస్కట్, దుబాయ్ వెళ్లి ఇంటికి వచ్చిన అతడు అనంతరం రెండు నెలల కిత్రం ఇజ్రాయెల్ వెళ్లినట్లు తెలిపారు. తన కోడలు ద్వారా కొడుకు మృతి చెందినట్లు తెలిసినట్లు చెప్పారు. ‘సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె నాకు ఫోన్ చేసి, నిబిన్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. తరువాత అర్ధరాత్రి 12.45 గంటలకు, అతను మరణించినట్లు మాకు సమాచారం వచ్చింది. నిబిన్ నాలుగున్నరేళ్ల కుమార్తెను, అతని భార్య(ఏడు నెలల గర్భవతి)ని వదిలి ఇజ్రాయెల్ వెళ్లాడు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక నిబిన్ మృతదేహాన్ని నాలుగు రోజుల్లో కేరళకు తీసుకురానున్నారు’ అని పేర్కొన్నారు. భారత్ అడ్వైజరీ జారీ ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో తొలిసారి భారతీయ వ్యక్తి మరణించడంతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు.. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరిపి.. భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఖండించిన ఇజ్రాయెల్ ఈ దాడిని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఖండించింది. పండ్లతోటను సాగు చేస్తున్న వ్యవసాయ కార్మికులపై షియా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా జరిపిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలోన్ మాక్స్వెల్ సోదరుడితో మాట్లాడి, అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. -
Israel-Hamas war: గాజాలో ఆకలి కేకలు
గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు. 80 శాతం మంది గాజావాసులు ఇజ్రాయెల్ దాడులకు తాళలేక, దాని బెదిరింపులకు తలొగ్గి ఇప్పటికే ఇల్లూ వాకిలీ వదిలేశారు. కొద్ది నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎలాంటి సహాయక సామగ్రినీ ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో అన్నమో రామచంద్రా అంటూ అంతా అలమటిస్తున్నారు. వారిలోనూ కనీసం 5 లక్షల మంది అత్యంత తీవ్రమైన కరువు బారిన పడ్డారని ఐరాస ఆవేదన వెలిబుచ్చింది. తాళలేని ఆకలిబాధతో దుర్భర వేదన అనుభవిస్తున్నారని ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) తాజా నివేదికలో వెల్లడించింది. వారికి తక్షణ సాయం అందకపోతే అతి త్వరలోనే గాజా ఆకలిచావులకు ఆలవాలంగా మారడం ఖాయమని హెచ్చరించింది... నరకానికి నకళ్లు... గత ఆదివారం గాజా శరణార్థి శిబిరంలో ఓ రెణ్నెల్ల పసివాడు ఆకలికి తాళలేక మృత్యువాత పడ్డాడు. గాజాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చని ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు అక్కడ పదులు, వందలు, వేలల్లో, అంతకుమించి ఆకలి చావులు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నాయి. ప్రతీకారేచ్ఛతో పాలస్తీనాపై నాలుగున్నర నెలలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆ క్రమంలో గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేయడమే ఇందుకు కారణం. గాజాకు ఆహారం, నిత్యావసరాల సరఫరాను కూడా ఇజ్రాయెల్ వీలైనంతగా అడ్డుకుంటూ వస్తోంది. చివరికి ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కూడా అనుమతించడం లేదు. దాంతో గాజావాసులు అల్లాడిపోతున్నారు. శరణార్థి శిబిరాలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. కొన్నాళ్లుగా ఆకలి కేకలతో ప్రతిధ్వనిస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలినాళ్లలో గాజాలోకి రోజుకు 500 పై చిలుకు వాహనాల్లో సహాయ సామగ్రి వచ్చేది. క్రమంగా 50 వాహనాలు రావడమే గగనమైపోయింది. ఇప్పుడవి 10కి దాటడం లేదు! ఉత్తర గాజాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతానికి ఎలాంటి మానవతా సాయమూ అందక ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. యూఎన్ఆర్డబ్ల్యూఏ కూడా చివరిసారిగా జనవరి 23 అక్కడికి సహాయ సామగ్రిని పంపింది. నాటినుంచి ఇజ్రాయెల్ ఆంక్షలు తీవ్రతరం కావడంతో చేతులెత్తేసినట్టు సంస్థ చీఫ్ ఫిలిప్ లాజరిని స్వయంగా అంగీకరించారు! గాజా ఆకలి కేకలను పూర్తిగా మానవ కలి్పత సంక్షోభంగా ఆయన అభివరి్ణంచారు. ‘‘సహాయ సామగ్రితో కూడిన వాహనాలేవీ గాజాకు చేరకుండా చాలా రోజులుగా ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకుంటోంది. కనీసం ఆహార పదార్థాలనైనా అనుమతించాలని కోరినా పెడచెవిన పెడుతోంది’’ అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. కలుపు మొక్కలే మహాప్రసాదం ఆకలికి తట్టుకోలేక గాజావాసులు చివరికి కలుపు మొక్కలు తింటున్నారు! ఔషధంగా వాడాల్సిన ఈ మొక్కలను ఆహారంగా తీసుకుంటే ప్రమాదమని తెలిసి కూడా మరో దారి లేక వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మాలో అని పిలిచే ఈ మొక్కలను కట్టకింత అని రేటు పెట్టి మరీ అమ్ముకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకలికి తాళలేక గుర్రాల కళేబరాలనూ తింటున్నారు! మాటలకందని విషాదం... యూఎన్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఓసీహెచ్ఏ) గణాంకాల మేరకు గాజాలోని మొత్తం 23 లక్షల మందినీ తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. వారిలోనూ ► లక్షల మందికి పైగా తీవ్రమైన కరువు పరిస్థితుల బారిన పడ్డారు. ఇజ్రాయెల్ వైఖరే ఇందుకు ప్రధాన కారణం... ► గాజాలోకి సహాయ సామ్రగి కోసం ఇజ్రాయెల్ కేవలం ఒకే ఒక ఎంట్రీ పాయింట్‌ను తెరిచి ఉంచింది. ► ఆ మార్గంలోనూ దారిపొడవునా లెక్కలేనన్ని చెక్ పాయింట్లు పెట్టి ఒక్కో వాహనాన్ని రోజుల తరబడి తనిఖీ చేస్తోంది. ► దీనికి తోడు అతివాద ఇజ్రాయెలీ నిరసనకారులు పాలస్తీనా వాసులకు సాయమూ అందడానికి వీల్లేదంటూ భీష్మించుకున్నారు. ► దక్షిణ గాజా ఎంట్రీ పాయింట్‌ను కొన్నాళ్లుగా వారు పూర్తిగా దిగ్బంధించారు. ► సహాయక వాహనాలకు భద్రత కలి్పస్తున్న స్థానిక పోలీసుల్లో 8 మంది ఇటీవల ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు. అప్పట్నుంచీ ఎస్కార్టుగా వచ్చే వారే కరువయ్యారు. ► దాంతో గాజాలో సహాయక వాహనం కనిపిస్తే చాలు, జనమంతా ఎగబడే పరిస్థితి నెలకొని ఉంది! వాహన సిబ్బందిని చితగ్గొట్టి చేతికందినన్ని సరుకులు లాక్కెళ్తున్నారు. ► మరోవైపు దీన్ని సాకుగా చూపి ఇజ్రాయెల్ సహాయ వాహనాలను అడ్డుకుంటోంది. ► గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి వందల మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. యుద్ధానికి కారణంగా నిలిచిన ఈ దాడిలో ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) సిబ్బంది పాత్రా ఉందని ఇటీవల తేలడంతో ఆ సంస్థ గాజా నుంచి దాదాపుగా వైదొలగింది. సహాయక సామగ్రి చేరవేతలో ఇన్నాళ్లూ వ్యవహరించిన ఆ సంస్థ నిష్క్రమణతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Hamas war: గాజా ఆస్పత్రిని చుట్టుముట్టిన ఐడీఎఫ్
రఫా: ప్రాణాలతో మిగిలి ఉన్న బందీలను హమాస్ మిలిటెంట్లు నాసిర్ ప్రాంగణం అడుగునున్న సొరంగాల్లో దాచినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్)అనుమానిస్తున్నాయి. దీంతో, వారం రోజులుగా ఆస్పత్రిని దిగ్బంధించి అణువణువూ శోధిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ దాడితో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆస్పత్రిలోని 460 మందికి పైగా సిబ్బంది, రోగులను ఎలాంటి సౌకర్యాలు లేని ఆ పక్కనే ఉన్న పాతభవనంలోకి తరలివెళ్లాలని ఆర్మీ ఆదేశించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఆక్సిజన్ నిల్వలు అడుగంటడంతో ఐసీయూలోని ఆరుగురు రోగుల్లో ఐదుగురు చనిపోయినట్లు గాజా అధికారులు శుక్రవారం తెలిపారు. -
అక్టోబర్ 7న అందుకే దాడులు: హమాస్ ప్రకటన
జెరూసలేం: హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దారితీసిన అంశంపై హమాస్ స్పందించింది. ఈ సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో తాము కాల్పులు జరిపినట్టు సమర్థించుకుంది. అలాగే, తమ భవిష్యత్‌ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందన్నారు. అయితే, అక్టోబర్ 7 నాటి దాడులను హమాస్ సమర్థించుకుంది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తోన్న కుట్రలను ఎదుర్కొనేందుకు దాన్ని అనివార్యమైన చర్యగా పేర్కొంది. అది సాధారణ ప్రతిస్పందనేనని తెలిపింది. ఈ మేరకు 16 పేజీల లేఖను విడుదల చేసింది. దీనిలో ఇజ్రాయెల్ భద్రత, సైనిక వ్యవస్థ వేగంగా కుప్పకూలిపోవడం, గాజా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా కొన్ని లోపాలు సంభవించినట్లు వెల్లడించింది. హమాస్ ఈ విషయాలను ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ తన దురాక్రమణను, పాలస్తీనీయులపై నేరాలను, జాతి హననాన్ని తక్షణమే నిలిపివేయాలని హమాస్ డిమాండ్ చేసింది. గాజా యుద్ధానంతర భవిష్యత్తును నిర్ణయించడంపై అంతర్జాతీయ సమాజం, ఇజ్రాయెల్ ప్రయత్నాలను తిరస్కరించింది. ‘తమ భవిష్యత్‌ను నిర్ణయించుకునే, అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకునే సామర్థ్యం పాలస్తీనా ప్రజలకు ఉంది. ప్రపంచంలో ఎవరికీ వారి తరఫున నిర్ణయం తీసుకునే హక్కు లేదు’ అని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. ఆ ఘటనలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై టెల్అవీవ్ భీకర దాడులతో విరుచుకుపడింది. ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం దాదాపు 9వేల మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు సమాచారం. -
Israel-Hamas war: 25,000 దాటిన గాజా మృతులు
రఫా(గాజా స్ట్రిప్): తమతమ మతసంబంధ పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం ఘర్షణలతో మొదలై మెరుపు దాడులతో తీవ్రతరమై మహోగ్రరూపం దాలి్చన హమాస్– ఇజ్రాయెల్ పోరు పాతికవేల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మరోవైపు వంద మందికిపైగా బందీలను విడిపించుకున్నాసరే అందర్నీ విడిపిస్తామని, హమాస్ సభ్యులందర్నీ హతమారుస్తామని ఇజ్రాయెల్ సేనల ప్రతినబూనడం చూస్తుంటే యుద్ధ బాధితులు, మరణాల సంఖ్య ఇక్కడితో ఆగేలా లేదు. యుద్ధం ఇంకొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు తాజాగా ప్రకటించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా బందీలను విడిపించలేకపోవడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు ప్రదర్శలు పెరిగాయి. -
Israel: మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. నెతన్యాహు సంచలన కామెంట్స్
టెల్ అవీవ్: గాజా సిటీలపై ఇజ్రాయెల్ సేనల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యుద్థం గెలిచే వరకు ఆగే ప్రసక్తేలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో విజయం సాధించే వరకు తమను ఎవరూ ఆపలేరని అన్నారు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. అదే మా లక్ష్యం. హేగ్, ఈవిల్ మమ్మల్ని ఏం చేయలేవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, గాజా భూభాగంలో ఇప్పటికే అనేక హమాస్ బెటాలియన్లను అంతమొందించామని చెప్పారు. ఉత్తర గాజాలో నిర్వాసితులైన వారు తమ ఇళ్లకు తిరిగి రాలేరని తెలిపారు. అయితే, ఐక్యరాజ్యసమితిలోని అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో.. ఇజ్రాయెల్ దాడి యూఎన్ఓ జెనోసైడ్ కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూపుల కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు ఇలా కామెంట్స్ చేశారు. Israeli Prime Minister Benjamin Netanyahu announced that the Israeli army will continue its massacres in Gaza despite the genocide case at the International Court of Justice (ICJ). Netanyahu: We will continue the war in Gaza until all our goals are achieved. Neither the ICJ nor… pic.twitter.com/zcCzamWeFC — Readean (@readeancom) January 14, 2024 మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో భీకర దాడుల కారణంగా ఆకలి కేకలు.. 23వేలకుపైగా మరణాలు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీటన్నింటికీ ఎప్పుడు తెరపడుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. టెల్ అవీవ్‌లో వందలాది మంది యుద్ధ బాధితులను గుర్తుచేసుకోవడానికి ప్రజలు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మరణించిన వారి కోసం కొవ్వొత్తులను వెలిగించారు. ఇక, బంధీలను విడుదల చేయాలని కోరుతూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. On the 100th day of the #Israel-Hamas conflict, hundreds in Tel Aviv lit candles to remember the war's victims. They protested against Prime Minister Benjamin Netanyahu and the current Israeli government, urging the release of hostages. 📸: AA pic.twitter.com/195vs1n2Ka — Zoom News (@zoomnewskrd) January 14, 2024 -
ఎరుపెక్కిన సముద్ర వర్తకం
సమీపకాలంలో భారత్‌కు అత్యంత ఆందోళనకర పరిణామం ఇది. బలవత్తరమైన శక్తిగా ఎదగడానికి సముద్ర వర్తకం ముఖ్యమైన వేళ... వాణిజ్య నౌకలపై వరుస దాడులు నిరంతర అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. వేర్వేరు వాణిజ్య నౌకలపై అరేబియా సముద్రంలో ఇటీవల జరిగిన దాడులతో, భారత నౌకాదళం మూడు క్షిపణి విధ్వంసక నౌకలను మోహరించాల్సి వచ్చింది. వాటిని వివిధ ప్రాంతాల్లో గస్తీకి నిలిపి, ముష్కరుల దొంగదాడులకు మన నేవీ చెక్ పెట్టే పనిలో పడింది. వారం రోజుల్లో... భారతీయ సిబ్బందితో కూడిన రెండు వాణిజ్య నౌకలు మన దేశానికి వస్తూ, దాడికి గురవడం మన సముద్ర వర్తకం భద్రతపై ప్రశ్నలు రేపింది. పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ళ దూరం నుంచి 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన ఎమ్వీ చెమ్ ప్లూటోపై డిసెంబర్ 23న డ్రోన్ దాడి జరిగింది. అప్రమత్తమైన భారత నౌకాదళం, భారత తటరక్షక దళం సదరు వర్తక నౌకకు రక్షణగా నిలిచాయి. తర్వాత కొద్ది గంటలకే... పాతిక మంది భారతీయ సిబ్బందితో కూడిన వాణిజ్య క్రూడాయిల్ ట్యాంకర్ ఎమ్వీ సాయిబాబాపై ఎర్రసముద్రం దక్షిణ ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో,నౌకాదళం గస్తీ పెంచింది. దాడులు జరిపిన ముష్కరులు సముద్ర గర్భంలో దాగివున్నా సరే, వెతికి పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. లెక్కలు తీస్తే... నవంబర్ 19 నుంచి ఇప్పటికి ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై 30 డ్రోన్ దాడులు, సముద్రపు దొంగల దాడులు జరిగాయి. అంటే, దాదాపు రోజుకో దాడి. ఈ 30 దాడుల్లో సగం ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే సముద్ర వర్తక మార్గంలో ఎర్ర సముద్రంలో జరిగినవే. ఇది ఆందోళనకరం. తాజాగా ఎమ్వీ చెమ్ ప్లూటోపై జరిగిన దాడి తాలూకు శిథిలాలను సేకరించి, దాడి తీరుతెన్ను లను కనిపెట్టే ప్రయత్నం సాగుతోంది. దాడి మరో నౌకపై నుంచి చేశారా, లేక తీర ప్రాంతం నుంచి జరిగిందా లాంటి అంశాలను నిర్ధారణ చేసే పనిలో ఇండియన్ నేవీ నిమగ్నమైంది. ఒకపక్క గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంతో ఉద్రిక్తతలు పెరగగా, అదే సమయంలో వాణిజ్య నౌకలపై ఇలా డ్రోన్ దాడులు జరగడం యాదృచ్ఛికమేమీ కాదు. అక్కడి యుద్ధం తాలూకు ప్రభావం ఇక్కడకు విస్తరించింది. యెమెన్‌లో అధిక ప్రాంతాలను తమ నియంత్రణలో పెట్టుకున్న హౌథీ రెబల్స్ నవంబర్ మధ్య నుంచి ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్నారు. గాజా లోని హమాస్‌కు సంఘీభావంగా రెబల్స్ ఈ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో స్పష్టమైన సంబంధం లేని నౌకలపైనా ఈ దాడులు సాగడం గమనార్హం. వీరికి ఇరాన్ అండదండలున్నట్టు కథనం. దాడులకు బాధ్యత తమదేనంటూ ఈ యెమనీ రెబల్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఎమ్వీ సాయిబాబాపై హౌథీలు దాడి జరిపారనీ, ఎమ్వీ చెమ్‌ప్లూటోపై ఇరాన్ నుంచి డ్రోన్‌ను ప్రయో గించారనీ అమెరికా కేంద్ర కమాండ్ సమాచారం. దాడులకు ఎర్ర సముద్రాన్ని ఎంచుకోవడంలో ముష్కరులకు పెద్ద వ్యూహం ఉంది. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం, వ్యాపారంలో 12 శాతం, సముద్రజలాలపై పెట్రోలియమ్ వాణిజ్యంలో 10 శాతం మధ్యధరా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే జరుగుతాయి. దాడుల వల్ల నౌకలు రూటు మార్చి, ఒకప్పటిలా గుడ్‌హోప్ అగ్రం చుట్టూ తిరిగిరావాలి. దూరం, దరిమిలా ప్రయాణకాలం పెరిగే ఈ సుదీర్ఘయానం వల్ల చమురు, దిగుమతుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు మరింత ప్రియమవుతుంది. చమురు సరఫరాలకు ప్రధానంగా ఆ ప్రాంతంపై ఆధారపడే భారత్‌కు ఇది దెబ్బ. ఇజ్రాయెల్ – హమాస్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగడమే అందుకు నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్లను సైద్ధాంతికంగా వ్యతిరేకించే హౌథీల దాడుల దెబ్బకు ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రమైపోయింది. గాజాకు మానవతా సాయం అందేవరకు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అవరోధాలు కల్పించాలన్న వారి ఆలోచన ఫలిస్తోంది. దీన్ని ప్రతిఘటించి, ముష్కరుల దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా గత వారం ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ పేర బహుళ దేశీయ నౌకా దళాన్ని ప్రారంభించింది. అయితే, అగ్రరాజ్య సారథ్యంలోని ఈ బలగంలో పలు దేశాలు చేరలేదు. సూయజ్ కాలువ ద్వారా వర్తకం తగ్గినందు వల్ల భారీగా నష్టపోయే ఈజిప్ట్ ఇంతవరకు హౌథీల దుశ్చర్యలను ఖండించలేదు. చివరకు యెమెనీ గ్రూపుతో శాంతి ప్రక్రియ చర్చలు సాగిస్తున్న సౌదీ అరేబియా సైతం అమెరికా సారథ్య నౌకాబలగాన్ని సమర్థించలేదు. ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన శత్రుత్వం వహించే పాకిస్తాన్ ఉన్నందున, మిగిలిన దిక్కుల్లో వాణిజ్యానికి సంబంధించి ఆచరణలో భారత్ ద్వీపదేశమే. అందుకే, మనకు సముద్ర వర్తకం కీలకం. మన దేశ వాణిజ్య పరిమాణంలో 98 శాతం, విలువలో 68 శాతం సముద్ర మార్గాల్లోనే సాగుతాయి. దానికి తగ్గట్టే హిందూ మహాసముద్ర ప్రాంతానికి కావలి పాత్రను భారత్ పోషిస్తోంది. వాణిజ్యం పెరగాలంటే, మిత్రదేశాలతో కలసి ఈ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలి. ఆ పనే భారత్ చేస్తోంది. అయితే, ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో సమదూరం పాటిస్తూ వచ్చిన మనకు తాజా పరిస్థితులు కొత్త బరువ నెత్తిన పెట్టాయి. సోమాలీ సముద్ర దొంగల్ని నిరోధించేందుకు ఈ సరికే గస్తీ సాగిస్తున్న భారత్, ఇకపై వాణిజ్య నౌకల్ని భద్రంగా ఎర్ర సముద్రం దాటించే పని తప్పదు. ఒకవేళ దాడులు సాగితే, అది మరో యుద్ధభేరి అవుతుంది. అందుకే, ఈ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం గాజాలో యుద్ధానికి తెర పడడం, శాంతి నెలకొనడమే! -
Israel-Hamas war: కుటుంబాన్ని కూల్చేశారు
రఫా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా మెల్లగా దాడులు మొదలెట్టిన ఇజ్రాయెల్ రోజురోజుకూ రెచి్చపోతోంది. అ మాయక పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటోంది. శనివారం ఇజ్రాయెల్ సేనల నిర్దయ దాడులకు ఒక ఉమ్మడి కుటుంబం నిట్టనిలువునా కుప్పకూలింది. గాజా సిటీలో జరిపిన దాడుల్లో ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఉద్యోగి ‘అల్–మగ్రాబీ’ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 76 మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ పట్టణ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలో స్థానిక టీవీ పాత్రికేయుడు మొహమ్మద్ ఖలీఫా ఉమ్మడి కుటుంబం బలైంది. ఈ దాడిలో 14 మంది కుటుంబసభ్యులు మరణించారు. మొత్తం దాడుల్లో 90 మందికిపైగా మరణించారని గాజా పౌరరక్షణ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. -
Israel-Hamas war: గాజాలో 20,057కి చేరిన మృతుల సంఖ్య
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో సామాన్యులే సమిధలవుతున్నారు. అక్టోబర్ 7న ఇరుపక్షాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులకు దిగుతోంది. సాధారణ జనావాసాలపై బాంబలు వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 20,057 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది మృత్యువాత పడినట్లు స్పష్టమవుతోంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. సరిపడా ఆహారం, నీరు అందక గాజాలో జనం ఆకలిలో అల్లాడిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల మందికి ఆహారం అందడం లేదని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాకు మానవతా సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొంది. యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరగాల్సిన ఓటింగ్ వాయిదా పడింది. రెండు రోజుల్లో 390 మంది బలి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరస్థాయిలో విరుచుకుపడుతోంది. గత రెండు రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ దాడుల్లో ఏకంగా 390 మంది పాలస్తీనియన్లు బలయ్యారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. 734 మంది క్షతగాత్రులుగా మారారని తెలియజేసింది. గాజాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. -
Israel-Hamas war: 24 గంటల్లో 110 మంది దుర్మరణం
జబాలియా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడి తర్వాత నిరంతరాయంగా కొనసాగిస్తున్న భీకరదాడులను ఇజ్రాయెల్ మరింత పెంచింది. ఉత్తర గాజాలోని జబాలియా పట్టణంలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. డజన్ల మంది గాయాలపాలయ్యారు. ‘‘శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. నా బంధువుల పిల్లలు ముగ్గురు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 110 మృతదేహాలను దగ్గర్లోని అల్–ఫలూజా శ్మశానవాటికకు తరలించలేని పరిస్థితి. అక్కడ ఆగకుండా బాంబుల వర్షం కురుస్తోంది. దిక్కులేక దగ్గర్లోని నిరుపయోగంగా ఉన్న పాత శ్మశానవాటికలో పూడ్చిపెట్టాం’ అని గాజా ప్రాంత ఆరోగ్య విభాగ డైరెక్టర్ జనరల్ మునీర్ చెప్పారు. -
బందీలపై కాల్పులు!
రఫా(గాజా స్ట్రిప్): కదనరంగంలో తమను దీటుగా ఎదిరించే సత్తా హమాస్ సాయుధులకు లేదని అతివిశ్వాసంతో ఉన్న ఇజ్రాయెల్ సేనలు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు అమాయక బందీలు బలైపోయారు. హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిని హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం తర్వాత తీరిగ్గా చెప్పింది. ఉత్తరగాజాలోని షెజాయా పట్టణంలో హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిపై కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ చెప్పారు. దాడి వివరాలను మరో ఉన్నతాధికారి వెల్లడించారు. ‘ ఇజ్రాయెల్ దాడికి భయపడి ఈ ముగ్గురినీ బంధించిన హమాస్ మిలిటెంట్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఈ ముగ్గురు బందీలు చొక్కాలు విప్పేసి తెల్ల జెండాలు ఊపుతూ భవనం బయటకు వచ్చారు. అయినాసరే సైన్యం వీరిపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇద్దరు మరణించారు. మూడో వ్యక్తి ప్రాణభయంతో మళ్లీ భవంతిలోపలికి ఏడుస్తూ పరుగెత్తాడు. అయినాసరే సైన్యం కాల్పులు జరపడంతో అతనూ మరణించాడు’’ అని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇజ్రాయెల్‌కు చెందిన యోటమ్ హైమ్(28), సమీర్ తలాల్కా(22), అలోన్ షామ్రిజ్(26)గా గుర్తించారు. ఈ ఘటనపై దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్
డెయిర్ అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు భీకర రూపం దాలుస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి తెచ్చిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారంతో కాలదన్నిన దరిమిలా ఇజ్రాయెల్ ఆదివారం మరింత రెచ్చిపోయింది. అమెరికా నుంచి తాజాగా మరింతగా ఆయుధ సంపత్తి అందుతుండటంతో ఇజ్రాయెల్ భీకర గగనతల దాడులతో చెలరేగిపోతోంది. 23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఆదివారం ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించకపోవడం గమనార్హం. దాదాపు రూ.834 కోట్ల విలువైన యుద్ధట్యాంక్ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ‘ఐరాస భద్రతా మండలిలో మాకు బాసటగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కొనసాగింపునకు వీలుగా కీలక ఆయుధాలు అందేందుకు సహకరిస్తున్న అమెరికాకు నా కృతజ్ఞతలు’ అని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్ ‘హమాస్‌ను ఈలోపే అంతంచేయాలని అమెరికా మాకు ఎలాంటి గడువు విధించలేదు. హమాస్ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుంది. హమాస్ అంతానికి వారాలు కాదు నెలలు పట్టొచ్చు. బం«దీలందర్నీ విడిపిస్తాం’’ అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు టజాచీ హెనెగ్బీ శనివారం అర్ధరాత్రి తేలి్చచెప్పారు. ‘‘ గాజాలో సరైన సాయం అందక సరిదిద్దుకోలేని స్థాయిలో అక్కడ మానవ విపత్తు తీవ్రతరమవుతోంది. ఇది పశ్చిమాసియా శాంతికి విఘాతకరం’’ అని ఖతార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. షిజాయాహ్, జబాలియా శరణార్థి శిబిరాల వద్ద నిరంతరం దాడుల కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ప్రతి వాహనంపైనా దాడి జరుగుతోంది. శిథిలాలతో నిండిన మా ప్రాంతాలకు అంబులెన్స్‌లు రాలేకపోతున్నాయి’’ అని జబాలియా ప్రాంత స్థానికురాలు ఒకరు ఏడుస్తూ చెప్పారు. ఖాన్ యూనిస్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హమాస్, ఇజ్రాయెల్ సేనల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. గంటలు నిలబడినా పిండి దొరకట్లేదు సెంట్రల్ గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ‘‘ ఇంట్లో ఏడుగురం ఉన్నాం. ఐరాస ఆహార కేంద్రానికి రోజూ వస్తున్నా. ఆరేడు గంటలు నిలబడ్డా రొట్టెల పిండి దొరకట్లేదు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. పిండి కరువై ఉట్టిచేతుల్తో ఇంటికెళ్తున్నా’’ అని అబ్దుల్లాసలాం అల్–మజ్దాలా వాలా చెప్పారు. ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. -
కాల్పుల విరమణపై తీర్మానం..అమెరికా వీటో!
న్యూయార్క్: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్ అబుషాహబ్ విచారం వ్యక్తం చేశారు. -
గాజాలో భయం భయం
ఖాన్ యూనిస్: గాజా్రస్టిప్‌లో పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైనికులు ప్రతి ఇంటినీ సోదా చేస్తున్నారు. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, ఉత్తర గాజాలోని జబాలియా, షుజాయియా నగరాలను ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు చుట్టుముడుతున్నాయి. ఈ మూడు నగరాల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు చిక్కుకుపోయారు. దక్షిణ గాజాలో 6 లక్షల మందికి పైగా ఉన్నారని, వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గాజాలోని శరణార్థి శిబిరాలన్నీ ఇప్పటికే బాధితులతో నిండిపోయాయని, ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎవరికీ దిక్కుతోచడం లేదని పేర్కొంది. ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఖాన్ యూనిస్ సిటీపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం బాంబుల వర్షం కురిపించింది. హమాస్ ముఖ్యనేతలంతా ఖాన్ యూనిస్‌లో మాటు వేశారని, వారిని బంధించక తప్పదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. -
గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి
వారం రోజుల విరమణకు తెర పడటంతో గాజా స్ట్రిప్ మళ్లీ కాల్పులతో దద్దరిల్లుతోంది. విరామం అనంతరం ఇజ్రాయెల్ శుకరవారం రెట్టించిన తీవ్రతతో మళ్లీ దాడులకు దిగింది. గాజాలోని ఇళ్లు, భవనాలపై క్షిపణులు, రాకెట్లు, బాంబులతో విరుచుపడిందిదీంతో ఖాన్ యూనిస్‌లో ఒక భారీ భవన సముదాయం నెలమట్టమైనట్లు తెలుస్తోంది. హమాద్లో కూడా ఒక అపార్ట్‌మెంట్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల్లో గాజాలో కనీసం 178 మంది మరణించినట్లు హమాస్ తాజాగా ప్రకటించింది. దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయెల్ సేనలు తమ దాడులను ఉధృతం చేసేలా కనిపిస్తోంది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ రోజంతా అక్కడ కరపత్రాలు జారవిడవడం దీన్ని బలపరుస్తోంది. అక్కడి ఖాన్ యూనిస్ తదితర ప్రాంతాలు ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాలుగా మారాయని వాటిలో హెచ్చరించింది. ‘యుద్ధ లక్ష్యాల సాధనకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. బందీలందరినీ విడిపించుకోవడం, హమాస్‌ను నిర్మూలించడం, గాజా మరెప్పుడూ ఇజ్రాయెలీలకు ముపపుగా మారకుండా కట్టుదిట్టటమైన చర్యలు తీసుకునే దాకా సైనిక చర్య కొనసాగుతోంది’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. మహిళా బందీలందరినీ వదిలేస్తామన్న ఒప్పంద వాగ్దానాన్ని హమాస్ ఉల్లంఘించడం వల్లే దాడులను తిరిగి మొదలు పెట్టాల్సి వచ్చిందని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయెలే రక్త దాహంతో తమ ప్రాతిపాదనలన్నింటినీ బుట్టదాఖలు చేసి దాడులకు దిగిందని హమాస్ రోపించింది. ఇక ఇజ్రాయెల్ సైన్యం- హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7 ప్రారంభమైన భీకర యుద్ధం దాదాపు రెండు నెలలుగా సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్పటి వరకు 13,300 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు .ఇటీవల ఏడు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించుకున్నాయి. కాల్పుల విరమణ సమయంలో హమాస్ 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయారని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. ఇంకా హమాస్ వద్ద 137 మంది బందీలుగా ఉన్నారని, వారిలో 115 మంది పురుషులు, 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక గురువారం ఇజ్రాయెల్, హమాస్ మధ్య వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో గాజాలో మళ్లీ కాల్పుల మోత మోగుతోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Israel-Hamas war: ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం పొడిగింపు
గాజా్రస్టిప్/జెరూసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్–హమాస్ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా. జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్మ్యాన్ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. -
‘విరమణ’ మరో రెండు రోజులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం ముగిసింది. ఒప్పందంలో భాగంగా మిలిటెంట్లు ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలను విడుదల చేశారు. ఇజ్రాయెల్ అధికారులు 117 మంది పాలస్తీనియన్ ఖైదీలను జైలు నుంచి విడిచిపెట్టారు. నాలుగో విడత కింద స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి తర్వాత మరికొంత మంది బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీనిపై సంబంధిత బందీల కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ అధికారులు సమాచారం ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులపాటు పొడిగించడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఒప్పందం పొడిగింపు అమల్లో ఉన్నన్ని రోజులు నిత్యం అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్ వదిలేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే విషయంలో ఈజిప్టు, ఖతార్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాయి. ఇజ్రాయెల్‌లో ఎలాన్ మస్క్ పర్యటన సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టి విమర్శల పాలైన ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్టోబర్ 7న హమాస్ దాడిలో ధ్వంసమైన కిబుట్జ్ పట్టణాన్ని దర్శించారు. అక్కడి పరిస్థితిన పరిశీలించారు. ఈ సందర్భంగా మస్క్ వెంట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నారు. -
హమాస్ నుంచి బందీల విడుదల.. నెతన్యాహు షాకింగ్ కామెంట్స్
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో సాఫీగా సాగింది. ఇక, తాజాగా 17 మంది బంధీలను విడుదల చేసింది. దానికి ప్రతీగా ఇజ్రాయెల్.. దాదాపు 75 మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టింది. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండు, మూడు విడతల బందీల విడుదల కొనసాగింది. మూడో విడతలో భాగంగా ఆదివారం 14 మంది ఇజ్రాయెలీలతోపాటు ముగ్గురు విదేశీయులను హమాస్ విడిచిపెట్టింది. వీరిలోనూ కొంత మంది ఈజిప్టునకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఇజ్రాయెల్‌కు రెడ్‌క్రాస్ అప్పగించింది. ప్రతిగా 39 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఆదివారం నాటికి మొత్తం 63 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడిచిపెట్టినట్లయింది. ఇక, బంధీల తరలింపు ప్రకియ నాలుగు రోజలు పాటు కొనసాగనుంది. İsrail'in Serbest Bıraktığı, Filistinli Mahkumlar, Aileleri İle Buluşmaya Devam Ediyor. Gazze Bursa Tevfik Göksu Osman Gökçek Ankara Yeşim #ikizlerdolunayı Deniz Binali Yıldırım Murat Kurum Hamas #koraypehlivanoğlututuklansın Filistin pic.twitter.com/aC7mevApCx — 🇹🇷 Abdulhamid Denge 🇹🇷 (@AbdulhamidDenge) November 27, 2023 More and more children are being released from Israeli prisons Yes, you read that right, KIDS. For years, Israel has kept children in prisons as adults. 8, 10, 16 years doesn't matter. They are imprisoned, mistreated and beaten for years. Why are they accused? As… pic.twitter.com/s8df6SStes — Megatron (@Megatron_ron) November 26, 2023 ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం గాజాలో అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను సరిచేయడం’ అని అన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. היום בסיור בעזה: נמשיך עד הסוף - עד לניצחון. pic.twitter.com/e2aEA7Gfa4 — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 26, 2023 -
Israel-Hamas war: గాజాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జెరూసలేం: గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అక్కడ అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ‘‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను ‘సరిచేయడం’’ అని అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. -
Israel-Hamas war: మరో 17 మంది బందీల విడుదల
గాజా్రస్టిప్: ఇజ్రాయెల్–హమాస్ గ్రూప్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో సందిగ్ధత వీడింది. ఒప్పందానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉంటున్నాయి. మూడో విడత కింద ఆదివారం మరో 17 మంది బందీలకు హమాస్ విముక్తి కలిగించింది. వీరిలో 14 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అలాగే 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ అధికారులు విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ హమాస్ మిలిటెంట్లు శనివారం బందీలను విడుదల చేయడానికి నిరాకరించారు. ఒప్పందం అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఒప్పందం యథాతథంగా అమలవుతున్నట్లు కొన్ని గంటల తర్వాత తేటతెల్లమయ్యింది. శనివారం బందీల్లోని 13 మంది ఇజ్రాయెలీలను, నలుగురు థాయ్‌లాండ్ జాతీయులను హమాస్ విడుదల చేసింది. వీరిలో నాలుగేళ్ల అమెరికన్–ఇజ్రాయెలీ చిన్నారి అబిగైల్ ఎడాన్ కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులను అక్టోబర్ 7న మిలిటెంట్లు హత్య చేశారు. అమెరికా బందీలంతా సైతం అతిత్వరలో విడుదలవుతారని ఆశిస్తున్నామని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ చెప్పారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై అనూహ్యంగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా మార్చి, గాజాకు తరలించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలకు హమాస్ స్వేచ్ఛ కలి్పంచింది. నాలుగో విడత కింద సోమవారం మరికొంత మంది విడుదల కానున్నారు. మరోవైపు శనివారం రాత్రి ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్ దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ సీనియర్ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడిలో హమాస్ సీనియర్ కమాండర్ అహ్మద్ అల్–ఘందౌర్(56) మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ ఆదివారం స్వయంగా ప్రకటించింది. అయితే, ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న సంగతి బయటపెట్టలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా మరణించిన హమాస్ కమాండర్లలో అహ్మద్ అల్–ఘందౌర్ అత్యంత పెద్ద హోదా ఉన్న నేత కావడం గమనార్హం. ఉత్తర గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నాడు. హమాస్ సాయుధ విభాగంలో హై–ర్యాకింగ్ కలిగి ఉన్నాడు. 2002నుంచి ఇజ్రాయెల్ సైన్యం సాగించిన హత్యాయత్నాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నాడు. -
ఇజ్రాయెల్–హమాస్: బందీల విడుదలలో కీలక పరిణామం..
జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం తెలిసిందే. ఇదే సమయంలో బందీలను విడుదల చేయకపోవడంతో గాజాపై తమ సైన్యాలు దాడికి దిగడానికి సద్ధమవుతున్నాయని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది. దీంతో శనివారం అర్ధరాత్రి తర్వాత 17 మందిని విడుదల చేసింది. ఈజిప్ట్ వైపున్న రఫా సరిహద్దుల్లో వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండగా, మరో నలుగురు థాయ్ జాతీయులు. అందులో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, టీనేజర్లు ఉన్నారని అధికారులు చెప్పారు. వారిని ఇజ్రాయెల్‌లోని దవాఖానల్లో చేర్చినట్లు వెల్లడించారు. కాగా, ఒప్పందంలో భాగంగా తన వద్ద బందీగా ఉన్న 42 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. తొలివిడుతలో 24 మంది బందీలను హమాస్ వదిలేసిన విషయం తెలిసిందే. మరోవైపు, గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఇదిలా ఉండగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అతిక్రమించిందని హమాస్ ఆరోపించింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనియన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుమారు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఈ నెల 24న విరామం లభించింది. ఇరుపక్షాలు నాలుగు రోజులపాటు కాల్పులు జరపొద్దని ఒప్పందం చేసుకున్నాయి. దీంతో శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే రెండు రోజులు గడవకముందే ఇజ్రాయెల్ ఆ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ.. వెస్ట్ బ్యాంక్‌లోని క్వబాటియా, రమాల్లా, జెనిన్ ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడిందని ప్రకటించింది. -
నిలిచిన బందీల విడుదల!
జెరుసలేం: ఇజ్రాయెల్–హమాస్ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం తెలిసిందే. ఆ మేరకు గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా ఒప్పందం మేరకు బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని ఇజ్రాయెల్ విశ్వాసం వెలిబుచి్చంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య బుధవారం నాలుగు రోజుల కాల్పుల విరామణ ఒప్పందం కుదరడం తెలిసిందే. అందులో భాగంగా 50 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు హమాస్, ప్రతిగా 150 మంది పాలస్తీనియా ఖైదీలను వదిలేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించాయి. గాజాకు మరింత అత్యవసర సాయాన్ని అనుమతించేదుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. శుక్రవారం తొలి రోజు 24 మందిని హమాస్, 39 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. శనివారం 14 మందిని వదిలేయనున్నట్టు హమాస్ ప్రకటించింది. 42 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
Israel-Hamas war: తిరుగుబాటు గళానికి స్వేచ్ఛ
రమల్లా: ఆమె పేరు మారా. పాలస్తీనా యువతి. వయసు 24 ఏళ్లు. కానీ ఎదిగే దశలో అత్యంత కీలకమైన 8 ఏళ్లు ఇజ్రాయెల్ చెరలో జైలు గోడల నడుమ గడిపింది! వందేళ్లకు సరిపడా అనుభవాలు చవిచూసింది. టీనేజీలో అత్యంత అవసమైన అమ్మ ఆసరా కోసం ఎంతగానో అంగలార్చింది. అలాగని ధైర్యం మాత్రం కోల్పోలేదు. ఉత్తర ఇజ్రాయెల్‌లో తనను ఉంచిన డామన్ జైల్లోని పాలస్తీనా మహిళలు, మైనర్ల తరఫున గళమెత్తింది. చూస్తుండగానే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కీలక రాజకీయాంశంగా కూడా మారిపోయింది. దాంతో అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడి అనంతరం ముందు జాగ్రత్త చర్యగా మారాను మరో జైలుకు మార్చి ఇతరులతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా ఉంచింది ఇజ్రాయెల్ ప్రభుత్వం! బందీల పరస్పర విడుదలలో భాగంగా శుక్రవారం ఇజ్రాయెల్ వదిలిపెట్టిన 39 మంది పాలస్తీనియన్లలో ఆమె కూడా ఉంది. లాంఛనాలన్నీ పూర్తై ఎట్టకేలకు శుక్రవారం రాత్రి విడుదలై రమల్లా చేరింది. తల్లి సౌసన్ అప్పటికే అక్కడ ఆమె కోసం క్షణమో యుగంగా ఎదురు చూస్తోంది. కూతురు వాహనం దిగుతూనే పరుగెత్తుకెళ్లి ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. ఎనిమిదేళ్ల ఎడబాటును తలచుకుంటూ వారిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లీకూతుళ్ల కలయికను చూసిన వాళ్లందరిలోనూ హర్షాతిరేకాలు పెల్లుబికాయి. ‘‘నేను చెప్పలేదూ! నా కూతురు పోరాటాలతో రాటుదేలి అంతర్గత సౌందర్యంతో మెరిసిపోతోంది’’ అని పాలస్తీనా మీడియాతో చెబుతూ మురిసిపోయింది సౌసన్. స్కూలుకు వెళ్తుండగా... మారా స్వస్థలం ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న తూర్పు జెరూసలేం. కొద్ది దూరంలోని స్కూలుకు వెళ్లే క్రమంలో తూర్పు, పశి్చమ జెరూసలేం మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్ వేను దాటాల్సి వచ్చేది. 2015 అక్టోబర్‌లో 16 ఏళ్ల టీనేజర్‌గా స్కూలుకు వెళ్తుండగా ఎక్స్‌ప్రెస్ వే మీద ఇజ్రాయెల్ సైన్యం ఆమెపై కాల్పులకు దిగింది. గాయాలతో పడున్న మారాను అరెస్టు చేసింది. ఇజ్రాయెలీ సైనికాధికారిని పొడిచేందుకు ప్రయతి్నంచిందన్న అభియోగాలపై ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష పడింది. చేతిని తూట్లు పొడిచిన 12 తూటా గాయాలు శాశ్వతంగా అవిటిగా మార్చేశాయి. జైల్లో రోజులు అత్యంత దుర్భరంగా గడిచాయి. ముఖ్యంగా ఓ టీనేజర్‌గా తల్లి తోడు అత్యంత అవసరమైన తొలి రోజులు!’’ అని తల్లి చేతులను గట్టిగా పట్టుకుంటూ గుర్తు చేసుకుంది మారా. కష్టాన్నైనా తట్టుకునే శక్తిని కూడా ఇచ్చాయని చెప్పుకొచ్చింది. -
Israel-Hamas War: కన్నలూ, నన్ను మిస్సయ్యారా!?
జెరుసలేం/టెల్ అవీవ్: శుక్రవారం రాత్రి వేళ. ఇజ్రాయెల్‌లోని ష్నెయ్డర్ పిల్లల ఆస్పత్రి. ప్రధాన ద్వారమంతటా భావోద్వేగ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 57 ఏళ్ల అవీ జిచ్రీ చాలాసేపటి నుంచి ఎంతో ఆత్రుతతో, ఉద్వేగంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికీ ప్రధాన ద్వారం కేసి చూస్తూ గడుపుతున్నాడు. ఎట్టకేలకు అతని ఎదురుచూపులు ముగిశాయి. తొమ్మిదేళ్ల చిన్నారి ఒహద్ అతని వైపు మెరుపు వేగంతో పరుగెత్తుకొచ్చాడు. వస్తూనే, ‘నాన్నా!’ అంటూ గట్టిగా కరుచుకుపోయాడు. ఆ క్షణాన వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ వెనకే అవీ భార్య, తల్లి కూడా వచ్చి అతన్ని అమాంతం వాటేసుకున్నారు! ఆ పక్కనే ఉన్న 38 ఏళ్ల అషెర్దీ అతని పరిస్థితే! తన భార్య డొరాన్, కూతుళ్లు అవివ్ (4), రజ్ (2) ఆస్పత్రి ప్రాంగణంలో రెడ్ క్రాస్ వాహనం దిగీ దిగగానే వారి దగ్గరికి పరుగులు తీశాడు. ముగ్గురినీ బిగ్గరగా వాటేసుకున్నాడు. తనను చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న కూతుళ్లను పదేపదే ఆప్యాయంగా తడిమి చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘కన్నలూ, నన్ను మిస్సయ్యారా? నన్నే తలచుకుంటూ బాధ పడ్డారు కదూ!’’ అంటూ కూతుళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు. 49 రోజుల హమాస్ నిర్బంధం నుంచి తొలి విడతలో విడుదలైన 13 మంది ఇజ్రాయెల్ బందీలు తమవారిని కలుసుకున్న సందర్భంలో కనిపించిన భావోద్వేగ సన్నివేశాలివి. వీటికి సంబంధించి ఆస్పత్రి విడుదల చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. అక్టోబర్ 7 నాటి మెరుపు దాడిలో వీరంతా హమాస్ మిలిటెంట్లకు బందీలుగా చిక్కారు. చిన్నారి ఒహద్ హమాస్ చెరలోనే తొమ్మిదో పుట్టినరోజు చేసుకోవడం విశేషం! ఆ రోజు ఇజ్రాయెల్ అంతా అతని పుట్టినరోజు వేడుకలు జరిపి సంఘీభావం ప్రకటించింది! ఒహద్తో పాటే అతని తల్లి, నాయనమ్మ విడుదలైనా తాతయ్య హమాస్ చెరలోనే ఉన్నాడు. ఎమిలియా అలోనీ అనే ఐదేళ్ల చిన్నారి కూడా తల్లితో పాటు విడుదలైంది. తమకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న నాయనమ్మను కలుసుకుని ఆనందంలో మునిగిపోయింది. -
Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ
గాజా స్ట్రిప్/జెరూసలేం: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గాజా స్ట్రిప్‌లో శుక్రవారం భూతల, వైమానిక దాడులు ఆగిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజాలో ఏడు వారాల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. పాలస్తీనియన్ల ఎదురు చూపులు ఫలిస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మానవతా సాయం, ఇంధనం గాజాకు చేరుకుంటోంది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాల చొరవతో ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన సంధి శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచి్చంది. తాత్కాలిక కాల్పుల విరమణ నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఒప్పందం మేరకు హమాస్ చెరలోని బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిరోజు 13 మంది ఇజ్రాయెలీ బందీలకు హమాస్ మిలిటెంట్లు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారు. వీరిలో ఆరుగురు వృద్ధులు, నలుగురు పిల్లలున్నారు. వారిని రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. మొత్తం 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టిందని, వారిని 4 వాహనాల్లో ఈజిప్టుకు చేర్చామని రెడ్‌క్రాస్ వెల్లడించింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడున్నట్టు ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. హమాస్ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. వీరిలో 24 మంది మహిళలు కాగా 15 మంది చిన్నారులు. వారిని తీసుకుని వాహనాలు వెస్ట్ బ్యాంక్‌లోని జైళ్ల నుంచి రమల్లాకు బయల్దేరాయి. నాలుగు రోజుల వ్యవధిలో 50 మంది బందీలకు హమాస్ విముక్తి కల్పించాల్సి ఉంది. అలాగే 150 మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. ప్రస్తుతం 7,200 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. ‘ఉత్తరాది వలస’లపై కాల్పులు.. ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు ఆగిపోవడంతో దక్షిణ గాజా నుంచి జనం ఉత్తర గాజాకు కాలినడకన తిరిగివస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయతి్నస్తోంది. శుక్రవారం పలుచోట్ల వారిపై కాల్పులు జరిపింది. ఎవరూ వెనక్కి వెళ్లొద్దంటూ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలియజేసింది. అక్టోబర్ 7న గాజాపై దాడులు మొదలైన తర్వాత ఇజ్రాయెల్ హెచ్చరికల వల్ల ఉత్తర గాజా నుంచి లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలసవెళ్లారు. వారంతా స్వస్థలాలకు తిరిగి రావాలని భావిస్తున్నారు. గాజాకు 1.30 లక్షల లీటర్ల డీజిల్ కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కావడంతో గాజాకు మానవతా సాయం చేరవేతలోనూ వేగం పెరిగింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, దుస్తులు తదితర సామగ్రితో దాదాపు 90 వాహనాలు శుక్రవారం ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ గుండా గాజాలోకి ప్రవేశించాయి. అలాగే 1.30 లక్షల లీటర్ల డీజిల్ కూడా గాజాకు అందింది. డీజిల్ లేక, జనరేటర్లు పనిచేయక గాజా ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఇప్పటికే నిలిచిపోయాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్న నాలుగు రోజుల్లో రోజుకు 1.30 లక్షల లీటర్ల డీజిల్‌ను గాజాకు సరఫరా చేయడానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచి్చంది. వాస్తవానికి గాజాకు నిత్యం 10 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. కాల్పుల విరమణ పొడగిస్తారా ? ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం నాలుగు రోజులపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒప్పందాన్ని పొడిగిస్తారని సమాచారం. హమాస్ చెరలో 240 మంది బందీలు ఉన్నారు. వారందరినీ విడుదల చేయించాలంటే నాలుగు రోజుల సమయం సరిపోదు. అందుకే ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
Israel-Hamas war: నేటి నుంచే కాల్పుల విరమణ!
ఖాన్ యూనిస్: గాజాలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ, దాదాపు 50 మంది బందీలకు విముక్తి, ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా ఫైటర్ల విడుదలపై ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం ఒక్కరోజు ఆలస్యంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఖతార్ ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది. తొలుత 13 మంది బందీలు విడుదలవుతారని తెలియజేసింది. వాస్తవానికి గురువారం ఉదయం నుంచే ఈ ఒప్పందం అమలు కావాలి. చివరి క్షణంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. కాల్పుల విరమణకు, బందీల విడుదలకు తగిన సానుకూల పరిస్థితులను సృష్టించే పనిలో మధ్యవర్తులు నిమగ్నమయ్యారని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్–అన్సారీ వివరించారు. ఈ కార్యాచరణ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఒప్పందం కుదిర్చే విషయంలో ఖతార్ అత్యంత కీలకంగా వ్యవహరించింది. గాజాలో హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తుల విడుదల కోసం బందీల కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ దేశంలోని జైళ్ల నుంచి విడుదల కావడానికి అర్హతలు కలిగిన 300 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్ న్యాయ శాఖ బహిర్గతం చేసింది. వీరిలో చాలామంది యువకులే ఉన్నారు. గత ఏడాది కాలంలో వీరంతా అరెస్టయ్యారు. రాళ్లు విసరడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడడం వంటి కారణాలతో ఇజ్రాయెల్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేస్తే, ఒప్పందం ప్రకారం 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది. అల్–షిఫా డైరెక్టర్, డాక్టర్ల అరెస్టు గాజాలోని అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాల్మియాతోపాటు ఇద్దరు సీనియర్ డాక్టర్లను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన వాహనాల్లో రోగులతోపాటు ప్రయాణిస్తుండగా సైన్యం వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్, వైద్యులను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అల్–షిఫా కింద హమాస్ సొరంగం, బంకర్లు గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో భారీ సొరంగంలో హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే చెబుతోంది. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాన్ని సైన్యం తాజాగా బయటపెట్టింది. విదేశీ జర్నలిస్టుల బృందాన్ని హమాస్ సొరంగంలోకి తీసుకెళ్లి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించింది. రాళ్లతో నిర్మించిన ఈ సొరంగం 150 మీటర్ల పొడవు ఉంది. అల్–షిఫా కింద అండర్‌గ్రౌండ్ బంకర్లను కలుపుతూ దీన్ని నిర్మించారు. సొరంగం చివర వసతి గృహం లాంటిది కనిపిస్తోంది. ఏసీ, వంటగది, బాత్రూమ్, రెండు ఇనుప మంచాలు ఉన్నాయి. గచ్చుపై తెల్లటి టైల్స్ పరిచారు. ఈ టన్నెల్ చాలా రోజులు ఉపయోగంలో లేనట్లు దుమ్ముధూళితో నిండిపోయి ఉంది. అల్–షిఫా కిందనున్న హమాస్ సొరంగం దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాజాలోని ఆసుపత్రులను హమాస్ మిలిటెంట్లు ప్రధాన స్థావరాలుగా మార్చుకున్నారని, వాటి కింది భాగంలో సొరంగాలు, బంకర్లు నిర్మించుకున్నారని, ఆయుధాలు నిల్వ చేశారని, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆసుపత్రులపై గురిపెట్టి వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండిస్తోంది. -
Israel-Hamas war: కాల్పులకు విరామం
జెరూసలేం/ఐరాస: తాత్కాలికంగానైనా ప్రార్థనలు ఫలించాయి. ప్రపంచ దేశాల విన్నపాలు ఫలితమిచ్చాయి. తీవ్ర ప్రతీకారేచ్ఛతో గాజాపై ఆరు వారాలుగా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగొచి్చంది. అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ‘‘ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తుంది. బదులుగా హమాస్ తన చెరలో ఉన్న 240 మంది పై చిలుకు బందీల్లో 50 మందిని విడిచిపెడుతుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు సమాచారం. హమాస్ చెర నుంచి బయట పడేవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉంటారని చెబుతున్నారు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచి పెట్టనుందని ఖతర్ వెల్లడించింది. ఈజిప్టు, అమెరికాతో పాటు ఖతర్ కూడా ఇరు వర్గాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. నిత్యావసరాలతో సహా సర్వం నిండుకుని మానవీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న గాజాకు ఈ నాలుగు రోజుల్లో అదనపు సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు ఖతర్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం మలి దశలో భాగంగా మున్ముందు ఇరువైపుల నుంచి మరింత మంది బందీలు విడుదలవుతారని చెప్పుకొచి్చంది. కాల్పుల విరమణ గురువారం ఉదయం పదింటి నుంచి అమల్లోకి రానుంది. యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టారు! నాలుగు రోజుల విరామం ముగియగానే గాజాపై దాడులు పునఃప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేం ముట్టడిలో ఉన్నాం. హమాస్‌ను నిర్మూలించి మా లక్ష్యాలన్నింటినీ సాధించేదాకా యుద్ధాన్ని కొనసాగించి తీరతాం’’ అని ప్రకటించారు. దీర్ఘకాలిక యుద్ధానికి సైన్యం మరింతగా సన్నద్ధమయ్యేందుకు విరామం ఉపయోగపడుతుంది తప్ప సైనికుల స్థైర్యాన్ని తగ్గించబోదని ఆయన అన్నారు. అయితే హమాస్ చెరలోని బందీల్లో ప్రతి 10 మంది విడుదలకు ప్రతిగా కాల్పుల విరామాన్ని ఒక రోజు చొప్పున పెంచేందుకు ఇజ్రాయెల్ సమ్మతించింది. కాల్పుల విరమణను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు స్వాగతించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపు దాడికి దిగడం తెలిసిందే. 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను హతమార్చడంతో పాటు 240 మందికి పైగా బందీలుగా గాజాకు తరలించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగి గాజాపై ఆరు వారాలుగా క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది. ఏం జరగనుంది... ► ఇజ్రాయెల్, హమాస్ రెండూ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తాయి. ►ముందు తమ వద్ద ఉన్న బందీల్లోంచి 50 మంది మహిళలు, చిన్నారులను రోజుకు 12 మంది చొప్పున హమాస్ విడుదల చేస్తుంది. ►అనంతరం ఇజ్రాయెల్ కూడా తన జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని ఖతర్ ప్రకటించింది. ►బహుశా గురువారమే బందీల విడుదల ప్రక్రియ మొదలవ్వొచ్చని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. ►ఈ నాలుగు రోజుల్లో గాజాకు అదనపు మానవీయ సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇప్పట్లో మళ్లీ కాల్పులుండనట్టే...! విరామానికి స్వస్తి చెప్పి ఇజ్రాయెల్ ఇప్పట్లో గాజాపై మళ్లీ దాడులకు దిగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘50 మంది బందీలు విడుదలైతే మిగతా వారినీ విడిపించాలంటూ కుటుంబీకుల నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అందులోనూ హమాస్ తన చెరలో ఉన్న సైనికులను చిట్టచివరన గానీ వదిలిపెట్టదు. అప్పటిదాకా దాడులు మొదలు పెట్టేందుకు వారి కుటుంబాలు ఒప్పుకోకపోవచ్చు’’ అని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో హమాస్ దీన్ని తమ విజయంగా చెప్పుకుంటే అది నెతన్యాహూ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఉత్తర గాజాలో జబాలియా శరణార్థి శిబిరం బాంబు దాడులతో దద్దరిల్లింది. హమాస్ కూడా రోజంతా ఇజ్రాయెల్‌పైకి రాకెట్ దాడులు కొనసాగించింది. -
Israel-Hamas war: అల్–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు
ఖాన్ యూనిస్: అల్–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్–షిఫా నుంచి అంబులెన్స్‌ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్‌కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. బందీల విడుదలకు యత్నాలు గాజాలో హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్ అల్–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్ గల్ఫ్ దేశమైన ఖతార్ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్ ప్రతినిధులు హమాస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి. -
Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం
ఖాన్ యూనిస్ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్‌తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నడుపుతున్న అల్ ఫలా స్కూల్‌పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్ ఫకూరా స్కూల్‌పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ అల్ జాతర్ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది. దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే. ఇంధన సరఫరా తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది. గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి. నోవా ఫెస్ట్ మృతులు 364 మంది ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ను హమాస్ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్‌లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది. పులి మీద పుట్రలా... ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో పౌరుల మృతిని ఖండించిన మోదీ
ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. అభంశుభం తెలియని చిన్నపిల్లలు, మహిళలు బలి అవుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. ఈ ఏడాది రెండోవసారి జరుగుతున్న ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నన్నారు. భారత్ సారథ్యంలో జరగుతున్న ఈ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్లోబల్ సౌత్ మధ్య ఐక్యత, సహాకరం అత్యవసరమని పేర్కొన్నారు. హింస, ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని మరోసారి మోదీ స్పష్టం చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను కూడా ప్రధాని ఖండించారు. ఇరు దేశాల మధ్య వివాద పరిష్కారానికి సంయమనం పాటించాలని కోరారు. యుద్ధం ఆపేసి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. చదవండి: భారత్‌తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు ‘అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఖండించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ భారత్ సంయమనం పాటించింది. చర్చలు, దౌత్యా మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రాధాన్యత ఇస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో పౌరుల మరణాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నా. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడిన అనంతరం పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా పంపాము. గ్లోబల్ సౌత్‌లోని దేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం ఇది’ అని మోదీ పేర్కొన్నారు. కాగా గ్లోబల్ సౌత్ అనేది ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దక్షిణ అమెరికాలోని దేశాల సమాహారాన్ని సూచిస్తుంది. ఇది 21వ దశాబ్దంలో మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన వేదిక. ఇందులో వందకు పైగా దేశాలున్నాయి. కలిసికట్టుగా.. అందరి అభివృద్ధి కోసం.. అందరి నమ్మకంతో’’ అనే థీమ్‌తో ఈసారి గ్లోబల్ సౌత్ సదస్సు జరుగుతోంది. ఇక హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటి వరకు 1200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు.మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 11,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణౠలు కోల్పోయారు. ఇదిలా ఉండగా గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయెల్సైన్యం ప్రకటించింది. దీనికి సబంధించిన ఫొటోలు, వీడియోలను శుక్రవారం విడుదల చేసింది. ‘ఆస్పత్రిలోని హమాస్ సొరంగం నెట్‌వర్క్‌ను గుర్తించామంటూ ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. Exposing another layer of Hamas’ exploitation of three of the largest hospitals in Gaza: 🔻Inside the Shifa Hospital complex, a Hamas terrorist tunnel was uncovered. 1/3 pic.twitter.com/uGo4uBdTly — Israel Defense Forces (@IDF) November 17, 2023 -
Israel-Hamas War: టార్గెట్ దక్షిణ గాజా!
ఖాన్ యూనిస్: గాజాలో సాధారణ పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. హమాస్ మిలిటెంట్లపై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. భూతల, వైమానిక దాడులతో భారీ భవనాలు క్షణాల్లో శిథిలాల దిబ్బలుగా మారిపోతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో జనం కాళ్లు, చేతులు విరిగి క్షతగాత్రులుగా మారుతున్నాయి. యుద్ధం దక్షిణ గాజాకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టి పెట్టింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తోంది. పల్లెలు, పట్టణాలను ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లాలని ఇజ్రాయెల్ సేనలు హెచ్చరిస్తుండడంతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఇలాంటి కరపత్రాలను ఉత్తర గాజాలోనూ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఉత్తర గాజా నుంచి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలస వచ్చారు. ఇక్కడ కూడా దాడులు ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ చెబుతుండడంతో ఇక ఎక్కడికి వెళ్లాలని విలపిస్తున్నారు. ఉత్తర, దక్షిణ గాజా అనే తేడా లేకుండా హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాగి ఉన్న దాడులు తప్పవని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ స్పష్టంచేశారు. గాజా ప్రజలను తమ భూభాగంలోకి అనుమతించే ప్రసక్తే లేదని పొరుగు దేశం ఈజిప్టు మరోసారి తెగేసి చెప్పింది. అల్–షిఫా ఆసుపత్రిలో రెండో రోజూ తనిఖీలు గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ సైన్యం తనిఖీలు రెండో రోజు గురువారం కూడా కొనసాగాయి. ఈ హాస్పిటల్ ప్రాంగణంలో ఓ భవనంలోని ఎంఆర్ఐ ల్యాబ్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూప్ పెద్ద ఎత్తున ఆయుధాలు నిల్వ చేసిందంటూ సంబంధిత వీడియోను సైన్యం విడుదల చేసింది. అసాల్ట్ రైఫిల్స్, గ్రెనేడ్లు, హమాస్ దుస్తులు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే, ఇన్నాళ్లూ చెబుతున్నట్లు అల్–షిఫా ఆసుపత్రి కింద భూగర్భంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇప్పటిదాకా ఎలాంటి సాక్ష్యాన్ని బయటపెట్టలేదు. అల్–షిఫా ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. అల్–షిఫాలో తుపాకీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు గురువారం చెప్పారు. ఇజ్రాయెల్ జవాన్లు కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు. ఆసుపత్రుల్లో మృత్యు ఘంటికలు గాజాలో ఆసుపత్రులన్నీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రాణం పోయాల్సిన ఆసుపత్రుల్లో మృత్యు ఘంటికలు వినిపిస్తున్నాయి. గాజాలో మొత్తం 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 26 ఆసుపత్రులు పని చేయడం లేదు. విద్యుత్, ఇంధనం, ఔషధాల కొరత వల్ల ఇక్కడ వైద్య సేవలు నిలిపివేశారు. పని చేస్తున్న కొన్ని ఆసుపత్రుల్లో వసతులు లేక రోగులు, శిశువులు విగత జీవులవుతున్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో ఇప్పటివరకు 12,000 మందికిపైగా మరణించారు. 2,700 మంది అదృశ్యమయ్యారు. వీరంతా శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. హమాస్ నాయకుల ఇళ్లపై క్షిపణుల వర్షం గాజాలో హమాస్ ముఖ్యనేతల నివాసాలను ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేసింది. ఇప్పటికే పలువురు నాయకులను హతమార్చింది. సీనియర్ హమాస్ కమాండర్ ఇస్మాయిల్ హనియేహ్ ఇంటిని నేలమట్టం చేశామని సైన్యం గురువారం ప్రకటించింది. అయితే, ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది తెలియరాలేదు. ‘ఆగ్నేయ ఆసియా’ రక్షణ మంత్రుల వినతి ఇజ్రాయెల్–హమాస్యుద్ధంలోఅమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమని ఆగ్నేయ ఆసియా దేశాల రక్షణ శాఖ మంత్రులు పేర్కొ న్నారు. 1967 నాటి సరిహద్దులతో ఇజ్రాయెల్‌తోపాటు స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసే దిశగా శాంతి చర్చలు ప్రారంభించాలని సూచించారు. ఈ మేరకు ‘అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్టు ఆసియన్ నేషన్స్’ పేరిట గురువారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తీర్మానం ఆమోదం ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో సామాన్య పాలస్తీనియన్లు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని మండలి ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించేందుకు గాజా అంతటా ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయాలని, వారికి తగిన రక్షణ కలి్పంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు సూచిస్తూ మండలిలో తీర్మానాన్ని ఆమోదించారు. బందీలను వెంటనే విడుదల చేయాలని ఈ తీర్మానంలో హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. మండలిలో 15 సభ్యదేశాలుండగా, మాల్టా దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతుగా 12 దేశాలు ఓటువేశాయి. అమెరికా, యూకే, రష్యా గైర్హాజరయ్యాయి. -
Israel-Hamas War: రణరంగం అల్–షిఫా
ఖాన్ యూనిస్: గాజాలో నెల రోజులకుపైగా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరుకుంది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలోకి బుధవారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు ప్రవేశించాయి. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడే భూగర్భంలో ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆసుపత్రి కింది భాగంలో సొరంగాల్లో హమాస్ నాయకులు మాటు వేశారని చెబుతోంది. మిలిటెంట్లపై కచి్చతమైన, లక్షిత ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించింది. అల్–షిఫా హాస్పిటల్ ఇప్పుడు రణభూమిగా మారిపోయింది. ఇజ్రాయెల్ సైనికులు ప్రతి గదినీ అణువణువూ గాలిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా ప్రశి్నస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అన్ని డిపార్టుమెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు సైతం అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్లో ఇజ్రాయెల్ సైనికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు, ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. పురుషులను నగ్నంగా మార్చి, కళ్లకు గంతలు కట్టి నిర్బంధిస్తున్నారని తెలిపారు. తరచుగా తుపాకీ మోతలు వినిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వార్డుల్లో 180కి పైగా మృతదేహాలు పడి ఉన్నాయని, బయటకు తరలించేవారు లేక కుళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉందన్నారు. 16 నుంచి 40 ఏళ్ల లోపు పురుషులంతా ఆసుపత్రి గదుల నుంచి బయటకు వెళ్లాలని, బయట అందరూ ఒకేచోటుకు చేరుకోవాలని లౌడ్స్పీకర్లో అరబిక్ భాషలో ఇజ్రాయెల్ సైనికులు హెచ్చరికలు జారీ చేశారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. పురుషులను బట్టలు విప్పించి ప్రశి్నస్తున్నారని పేర్కొన్నారు. 200 మందిని దూరంగా తీసుకెళ్లారని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైనికులు అదుపులోకి తీసుకున్నారని, ఇతర భవనాలతో కాంటాక్ట్ లేకుండాపోయిందని ప్రధాన భవనంలోని డాక్టర్లు చెప్పారు. ఇజ్రాయెల్ వాదనకు అమెరికా మద్దతు అల్–షిఫా హాస్పిటల్ కింద సొరంగాల్లో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న ఇజ్రాయెల్ వాదనకు అమెరికా మద్దతు పలికింది. కమాండ్ సెంటర్‌ను తమ నిఘా వర్గాలు గుర్తించాయని వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్, అమెరికా ప్రకటనలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆందోళన అల్–షిపా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ సేనల తనిఖీలను ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఖండించారు. ఇజ్రాయెల్ చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు బుధవారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్లు తెలిసింది. అల్–షిఫా ఎందుకంత ముఖ్యం? అల్–షిఫా అంటే స్వస్థత కేంద్రం అని అర్థం. గాజాలోనే అతిపెద్దదైన ఈ ఆసుప్రతిని 1946లో అప్పటి బ్రిటిష్ పాలనలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. దీన్ని గాజా గుండెచప్పుడు, ఆరోగ్య ప్రదాయినిగా పరిగణిస్తుంటారు. వైద్య సేవల విషయంలో ఇదొ వెన్నుముక లాంటింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడల్లా అల్–షిఫా హాస్పిటల్‌పై దాడులు జరగడం పరిపాటిగా మారింది. 2008–2009లోనూ ఒక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2014లో జరిగిన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ సమయంలో అల్–షిఫా హాస్పిటల్లో 9 రోజులపాటు వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ మిలిటెంట్లు ఈ ఆసుపత్రిని ప్రధాన స్థావరంగా మార్చుకున్నారని ఇజ్రాయెల్ గత కొన్ని దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. -
జస్టిన్ ట్రూడో Vs నెతన్యాహు.. ఇజ్రాయెల్ దాడులపై కౌంటర్లు..
జెరూసలేం: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులో పిల్లలు, మహిళలు భారీగా సంఖ్యలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచమంతా చూస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన వైద్యులు, కుటుంబాలను కోల్పోయిన వారిని, ప్రాణాలతో బయటపడినవారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూస్తున్నాము. మహిళలు, పిల్లలను టార్గెట్ చేస్తూ కూడా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికైనా వారి విషయంలో మానవత్వం చూపించాలని కోరారు. ఇదే సమయంలో హమాస్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సామాన్య పాలస్తీనియన్లను అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడిచిపెట్టారని కామెంట్స్ చేశారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నెతన్యాహు.. అక్టోబర్ ఏడో తేదీన హమాస్ దాడుల గురించి ప్రస్తావించారు. వారి దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యవాపడ్డారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నది ఇజ్రాయెల్ కాదు. హోలోకాస్ట్ నుండి యూదులపై జరిగిన దాడుల్లో హమాస్ ఎంతో దారుణంగా వ్యవహరించింది. సామాన్య పౌరులను ఊచకోత కోసింది. ఇజ్రాయెల్.. గాజా పౌరుల కోసం సేఫ్ జోన్లు, మానవతా కారిడార్లను అందిస్తోంది. కానీ, హమాస్ వాటిని కూడా అడ్డుపెట్టుకుని నేరాలకే పాల్పడుతోంది. వారి వెనుక దాక్కోని కాల్పులకు తెగబడుతోందన్నారు. హమాస్ అనాగరిక చర్యలను ఓడించేందుకు అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని కోరారు. .@JustinTrudeau It is not Israel that is deliberately targeting civilians but Hamas that beheaded, burned and massacred civilians in the worst horrors perpetrated on Jews since the Holocaust. While Israel is doing everything to keep civilians out of harm’s way, Hamas is doing… — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 15, 2023 -
Israel-Hamas War: అదే గాజా.. అదే దీన గాథ!
దెయిర్ అల్ బలాహా/ఖాన్ యూనిస్ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి. ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోం గేబ్రెయేసస్ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు. చిన్నారులను కాపాడేందుకు... ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంధన రగడ ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది. అల్ రంటిసి, అల్ నస్ర్ ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది. అల్ స్వెయిదీ లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు. అల్ షిఫా 700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. అల్ ఖుద్స్ గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్ అక్సా ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది. -
కెనడాలో ఉద్రిక్తతలు.. యూదు పాఠశాలపై మళ్లీ కాల్పులు
మాంట్రియల్, కెనడా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో కెనడాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాంట్రియల్‌లోని ఒక యూదు పాఠశాలపై కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ యూదు పాఠశాలపై కాల్పులు జరగడం వారం రోజుల్లో ఇది రెండోసారి. ఆదివారం (నవంబర్ 12) అక్కడి కాలమాణం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు కాల్పుల శబ్దాలు వినిపించాయని, కాల్పులు జరిగినప్పుడు పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. బుల్లెట్ల ధాటికి పాఠశాల భవనం గోడలు దెబ్బతిన్నాయని, నేలపై గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా ఒకే స్కూల్‌పై పదేపదే దాడులు చేస్తున్నారని ఆ పాఠశాల ప్రతినిధి లియోనెల్ పెరెజ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. వారం ప్రారంభంలో మాంట్రియల్ నగరంలోని కాంకోర్డియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనియన్, ఇజ్రాయెల్ అనుకూల సమూహాలు ఘర్షణ పడినప్పుడు మాంట్రియల్ ప్రార్థనా మందిరం అగ్నిబాంబు దాడిలో స్వల్పంగా దెబ్బతింది. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. -
Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
దెయిర్ అల్‌బలాహ్ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు. షిఫా.. శిథిల చిత్రం అల్ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్ మాట మార్చింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్ అహిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పడకేసిన వైద్యం గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. -
Israel-Hamas war: దిగ్బంధంలో ఆస్పత్రులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: దక్షిణ గాజాకు బారులు కట్టిన జనం.. హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీధుల్లో భూతల పోరాటాలు.. ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు.. గాజా స్ట్రిప్‌లో ప్రస్తుత దృశ్యమిదీ. గాజా సిటీలోని నాలుగు పెద్ద ఆసుపత్రులపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్లు అక్కడే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని తేల్చిచెప్పింది. శుక్రవారం తెల్లవారుజామునే నాలుగు ఆసుపత్రుల సమీపంలో క్షిపణి దాడులు చేసింది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటల వ్యవధిలో ఐదుసార్లు క్షిపణులు ప్రయోగించింది. కొన్ని వార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే భద్రత ఉంటుందని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వేలాది మంది జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగంలా కాలం గడిపారు. అల్–ఫిఫా హాస్పిటల్ వద్ద జరిగిన దాడుల్లో ఒకరు మరణించారని, మరికొందరు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ, తమ సైన్యం దాడుల్లో 19 మంది మిలిటెంట్లు హతమయ్యారని, వీరిలో హమాస్ కీలక కమాండర్, ప్లాటూన్ కమాండర్ సైతం ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. 20 రాకెట్ లాంచర్లు నిల్వ చేసిన హమాస్ షిప్పింగ్ కంటైనర్‌ను ధ్వంసం చేశామని తెలియజేసింది. గాజాసిటీలోని నాలుగు ఆసుపత్రుల చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఇజ్రాయెల్ సేనలు గాజా నగరంలోకి మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాసిటీలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా, 20 పాలస్తీనియన్లు మరణించారని స్థానిక అధికారులు చెప్పారు. మృతులు 11,078.. క్షతగాత్రులు 27,000 ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 11,078 మంది మరణించారని, వీరిలో 4,506 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. 27,000 మంది గాయపడ్డారని తెలిపింది. మరో 2,650 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా ఇప్పటికే మృతిచెంది ఉండొచ్చని తెలుస్తోంది. వలస వెళ్తున్నవారిపై వైమానిక దాడులు! ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు చేరుకోవడానికి వీలుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిరోజూ దాదాపు 4 గంటలపాటు దాడులకు విరామం ఇస్తోంది. ఇకపై నిత్యం విరామం అమల్లో ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. గత ఐదు రోజుల్లో 1,20,000 మంది దక్షిణ గాజాకు వెళ్లిపోయారు. వారిపైనా వైమానిక దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందుతోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలతోప్రతిరోజు దాదాపు 100 వాహనాలు గాజాకు చేరుకుంటున్నాయి. మరోవైపు, హమాస్ మిలిటెంట్లపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. గాజాలో హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవరకూ అవి కొనసాగుతాయన్నారు. ఉత్తర గాజా.. భూమిపై నరకం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల స్థావరాలతోపాటు సాధారణ జనవాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం కాగా, గాజాలో ఇప్పటికే దాదాపు 50 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలుగా మారిపోయాయి. ప్రధానంగా ఉత్తర గాజాలో పరిస్థితి భీతావహంగా మారింది. ఈ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్ ఆఫీసు ఉత్తర గాజాను ‘భూమిపై నరకం’గా అభివరి్ణంచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర
ఖాన్ యూనిస్: హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం మరో మలుపు తిరిగింది. గాజా్రస్టిప్‌లో అతిపెద్ద నగరమైన గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. 100కుపైగా హమాస్ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతోపాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్–షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేలి్చచెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలోనే మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గాజాలోని అల్–ఖుద్స్ హాస్పిటల్‌పైనా సైన్యం దృష్టి పెట్టింది. ఇక్కడ వంద మందికిపైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హమాస్ మిలిటెంట్లు అల్–ఖుద్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మకాం వేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. క్షతగాత్రుల ముసుగులో తప్పించుకుంటున్నారని చెబుతోంది. ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. వెస్ట్‌బ్యాంక్‌పై దాడి.. 11 మంది మృతి గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య గురువారం 10,812కు చేరుకుంది. మరో 2,300 మంది శిథిలాల కిందే ఉండిపోయారు. వారు మరణించి ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింసాకాండ కొనసాగుతోంది. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ ఫొటో జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని చిత్రీకరించిన ఫొటో జర్నలిస్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ గురువారం డిమాండ్ చేసింది. గాజాకు చెందిన ఈ జర్నలిస్టులు అంతర్జాతీయ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్నారు. హమాస్ దాడిని కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. మీడియాకు విడుదల చేశారు. హమాస్ దాడి గురించి వారికి ముందే సమాచారం ఉందని, అందుకే కెమెరాలతో సర్వసన్నద్ధమై ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. మానవత్వంపై జరిగిన నేరంలో వారి పాత్ర ఉందని మండిపడింది. వారి వ్యవహార శైలి పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధమని ఆక్షేపించింది. సదరు ఫొటోజర్నలిస్టులు పనిచేస్తున్న మీడియా సంస్థకు ఇజ్రాయెల్ లేఖలు రాసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు.. ఉత్తర గాజా–దక్షిణ గాజాను కలిపే ప్రధాన రహదారిని ఇజ్రాయెల్ సైన్యం వరుసగా ఐదో రోజు తెరిచి ఉంచింది. నిత్యం వేలాది మంది జనం ఉత్తర గాజా నుంచి వేలాది మంది దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. పిల్లా పాపలతో కాలినడకనే తరలి వెళ్తున్నారు. కొందరు కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారు. ఉత్తర గాజాలో హమాస్ స్థావరాలపై దాడులు ఉధృతం చేస్తామని, సాధారణ ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాలో జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి, మానవతా సాయం అందించడానికి వీలుగా ప్రతిరోజూ 4 గంటలపాటు దాడులకు విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలియజేశారు. -
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. ఇజ్రాయెల్‌కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్‌పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
ఇజ్రాయెల్ గుప్పిట్లో గాజా
గాజా్రస్టిప్: హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాను పూర్తిగా చుట్టుముట్టింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర ప్రాంతాలతో ఉత్తర గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర గాజా మొత్తం దిగ్బంధంలో చిక్కుకుంది. గాజా స్ట్రిప్‌ను రెండు ముక్కలుగా విభజించామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర గాజా ఇప్పుడు తమగుప్పిట్లో ఉందని పేర్కొంది. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని, ఇకపై కీలక దాడులు చేయబోతున్నామని తెలియజేసింది. గాజా సిటీలోకి అడుగుపెట్టడానికి ఇజ్రాయెల్ సేనలు ముందుకు కదులుతున్నాయి. సైన్యం ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్తర గాజాపై నిప్పుల వాన కురిపించింది. వైమానిక దాడులు ఉధృతం చేసింది. 450 లక్ష్యాలను ఛేదించామని, మిలిటెంట్ల స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సీనియర్ మిలిటెంట్ జమాల్ మూసా హతమయ్యాడని వివరించింది. హమాస్ కాంపౌండ్ ఒకటి తమ అ«దీనంలోకి వచ్చిందని పేర్కొంది. మిలిటెంట్లకు సమీపంలోనే ఉన్నామని, అతిత్వరలో వారిపై మూకుమ్మడి దాడి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వెల్లడించారు. హమాస్‌కు గాజా సిటీ ప్రధానమైన స్థావరం. మిలిటెంట్లు ఇక్కడ పటిష్టమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయుధ నిల్వలను సిద్ధం చేసుకున్నారు. గాజా సిటీ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులతో ముఖాముఖి తలపడేందుకు వారు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఒక్క రాత్రి 200 మంది బలి! గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకూ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దాదాపు 200 మంది మరణించారని గాజా సిటీలోని అల్–íÙఫా హాస్పిటల్ డైరెక్టర్ చెప్పారు. పెద్ద సంఖ్యలో మృతదేహాలు తమ ఆసుపత్రికి చేరుకున్నాయని తెలిపారు. చాలామంది క్షతగాత్రులు చికిత్స కోసం చేరారని వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. కాల్పుల విరమణకు ససేమిరా గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని, పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలంటూ మిత్రదేశం అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. కాల్పుల విరమణ పాటించాలంటూ జోర్డాన్, ఈజిప్టు తదితర అరబ్ దేశాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడుదల చేసే వరకూ గాజాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. గాజాలో సంక్షోభం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జోర్డాన్ సైనిక రవాణా విమానం సోమవారం ఉత్తర గాజాల్లో క్షతగాత్రులకు, రోగులుకు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలను జార విడిచింది. మరోవైపు ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు ఆగడం లేదు. ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో నలుగురు పౌరులు మరణించారు. 10,022 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై నెల రోజులవుతోంది. ప్రాణనష్టం నానాటికీ పెరిగిపోతోంది. గాజాలో మృతుల సంఖ్య 10 వేలు దాటింది. ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 10,022 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మృతుల్లో 4,100 మంది చిన్నారులు, 2,600 మంది మహిళలు ఉన్నారని తెలియజేసింది. వైమానిక దాడుల్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ భూభాగం వైపు హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 500కుపైగా రాకెట్లు గాజాలోనే కూలిపోయాయని, వాటివల్ల పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. డేర్ అల్–బాలహ్ పట్టణంలో సోమవారం ఉదయం ఓ ఆసుపత్రి సమీపంలోనే 66 మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. ముగిసిన ఆంటోనీ బ్లింకెన్ పర్యటన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్యప్రాచ్యంలో పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమయ్యారు. ఆయన సోమవారం తుర్కియే రాజధాని అంకారాలో ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్‌తో సమావేశమయ్యారు. అమెరికాకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. గాజాలో సంక్షోభాన్ని నివారించే ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు మరోసారి సూచించారు. ఇజ్రాయెల్–హమాస్ సంఘర్షణకు తెరదించడం, బందీలను విడిపించడంతోపాటు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా చర్యలు తీసుకొనే లక్ష్యంతో మధ్య ప్రాచ్యం చేరుకున్న బ్లింకెన్ పాక్షికంగానే విజయం సాధించారు. మధ్యప్రాచ్యం చేరుకున్న అమెరికా జలాంతర్గామి ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా తన గైడెడ్ మిస్సైల్ జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి పంపించింది. ఓహాయో క్లాస్ సబ్‌మెరైన్ తనకు కేటాయించిన ప్రాంతంలో అడుగుపెట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈజిప్టు రాజధాని కైరోకు ఈశాన్య దిక్కున సూయెజ్ కెనాల్లో జలాంతర్గామి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తమ గైడెడ్ మిస్సైల్ జలాంతర్గాముల ఎక్కడ మకాం వేశాయన్నది అమెరికా సైన్యం ఇలా బహిరంగంగా ప్రకటించడం అత్యంత అరుదు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ జోలికి ఎవరూ రావొద్దన్న హెచ్చరికలు జారీ చేయడానికే అమెరికా తన జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి తరలించినట్లు తెలుస్తోంది. ఖాన్ యూనిస్‌లోని భవన శిథిలాల్లో బాధితుల కోసం అన్వేíÙస్తున్న ఓ పాలస్తీనా వాసి ఉద్వేగం రఫాలో శిథిలాల మధ్య చిన్నారులు -
గాజాపై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం.. 10 వేల పాలస్తీనియన్ల మృత్యువాత
ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య యద్ధం గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య భీకర పోరు రోజురోజుకీ తీవ్ర స్థాయికి చేరుతుంది. హమాస్ నెట్‌వర్క్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజా పట్టీపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక, బాంబు దాడుల్లో ఇప్పటివరకు మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య తాజాగా 10 వేలకు చేరుకుంది. గాజాపై ఇజ్రాయెల్ మరణహోమంలో 10,022 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. వీరిలో 4,104మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధిక మంది ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతిచెందినట్లు తెలిపింది. అయితే హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన 500కుపైగా రాకెట్లు గాజాపై ల్యాండ్ అయ్యాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్ దేశస్తులు మరణించారు. ఇక గాజా నగరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు దానిని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. ఇది ఈ యుద్ధంలో చాలా ముఖ్యమైన దశ అని, తాము మరింత కీలకంగా దాడులు చేయబోతున్నామని పేర్కొంది. ఇదిలా ఉండగా గాజాలోని సాధారణ పాలస్తీనియన్లు తలదాంచుకుంటున్న శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి.సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై జరిగిన బాంబు దాడుల్లో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చదవండి: యుద్ధంలో కీలక ఘట్టాన్ని చేరాం: ఇజ్రాయెల్ -
Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు
గాజాసిటీ/ఖాన్ యూనిస్/జెరూసలేం: గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్‌లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అల్–ఖుద్స్ ఆసుపత్రి సమీపంలో పేలుడు గాజాలో ఆదివారం ఉదయం అల్–ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్ వేటు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిపై సస్పెన్షన్ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అబ్బాస్‌తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్ 7 తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. జర్నలిస్టుకు తీరని దుఃఖం అల్–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్ అలలౌల్కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. -
Israel-Hamas war: స్కూళ్లు, ఆస్పత్రులపై దాడులు
టెల్అవీవ్: గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు మరింతగా చొచ్చుకుపోతున్నాయి. శనివారం మరిన్ని ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసినట్టు సైన్యం ప్రకటించింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో జరిగిన బాంబు, క్షిపణి దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆంబులెన్సులో పారిపోతున్న ఉగ్రవాదులను ఏరేయడానికి దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతోపాటు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలో ఓ స్కూలుపై జరిగిన క్షిపణి దాడిలో మరో 15 మంది దాకా మరణించారు. దాడులు ఉత్తర గాజాలోని ఐరాస శరణార్థి శిబిరాలకు కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇజ్రాయెల్ హెచ్చరిక మేరకు భారీ సంఖ్యలో దక్షిణాదికి వలస వెళ్లిన వారు పోగా ఇంకా 3 లక్షల మంది దాకా ఉత్తర గాజాలోనే చిక్కుబడ్డారు. వీరంతా ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పోరులో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 9,500 దాటినట్టు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, హమాస్ చీఫ్ నివాసంపై కూడా క్షిపణి దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. సాయం... తక్షణావసరం గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లకు అత్యవసరాలు కూడా అందని దుస్థితి అలాగే కొనసాగుతోంది. అతి త్వరలో లక్షలాది మంది ఆకలి చావుల బారిన పడే ప్రమాదముందని అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస తదితర అంతర్జాతీయ సంస్థల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజావాసులకు మానవీయ సాయం అందేలా చూడాలని అమెరికా, యూరప్‌తో సహా అంతర్జాతీయ సమాజమంతా ముక్త కంఠంతో ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే స్పందించాలని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కాకపోతే యుద్ధక్షేత్రంలో చిక్కుబడ్డ పౌరులు దక్షిణాదికి పారిపోయేందుకు వీలుగా శనివారం మూడు గంటలపాటు దాడుల తీవ్రతను తగ్గించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనావాసులకు అత్యవసర సాయం అందేలా చూసే మార్గాంతరాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. రోజుకు ఆరు నుంచి 12 గంటల పాటు కాల్పుల విరామ ప్రకటించి మానవీయ సాయం అందేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు వీలు కలి్పంచాలని ఈజిప్ట్, ఖతర్ కోరుతున్నాయి. అలాగే బందీల విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనియన్లలో వృద్ధులు, మహిళలను వదిలేయాలని ప్రతిపాదిస్తున్నాయి. వీటిపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా స్పందించలేదు. రోజుకు రెండే బ్రెడ్డు ముక్కలు గాజావాసులు సగటున రోజుకు కేవలం రెండు బ్రెడ్డు ముక్కలు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నట్టు అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస సంస్థల డైరెక్టర్ థామస్ వైట్ వాపోయారు. అవి కూడా ఐరాస సేకరించిన పిండి నిల్వల నుంచే వారికి అందుతున్నట్టు చెప్పారు. గాజాలో ఒక్క ప్రాంతం కూడా సురక్షితమని చెప్పడానికి వీల్లేకుండా ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవీయ చట్టాలను గౌరవిస్తూ పాలస్తీనావాసులకు సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కానీ మానవీయ సాయం నిమిత్తం దాడులకు కాస్త విరామమివ్వాలన్న అంతర్జాతీయ విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. తమ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దాడులను తగ్గించేది లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ కూడా సమ్మతం కాదన్నారు. మరోవైపు ద్వంద్వ పౌరసత్వాలున్న 380 మందికి పైగా పాలస్తీనియన్లు శుక్రవారం ఈజిప్టు చేరుకున్నారు. తామిక ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్టేనని హెజ్బొల్లా నేత సయ్యద్‌హసన్ నస్రల్లా ప్రకటించారు. -
Israel-Hamas War: చక్రబంధంలో గాజా సిటీ!
ఖాన్ యూనిస్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ పదాతి సేనలు, వైమానిక దళాలు శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, ప్రశంసనీయమైన విజయాలు సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడులను తమ జవాన్లు గట్టిగా తిప్పికొడుతున్నారని పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, వారి సొరంగాలు నామరూపాల్లేకుండా పోయాయని తెలియజేసింది. గాజా సిటీలో దాడులు ఉధృతం చేయబోతున్నామని ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం నాటికి గాజాలో 9,200 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మిలిటెంట్ల అదీనంలో ఉన్న 240 మంది బందీల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైన్యం ముమ్మరంగా ప్రయతి్నస్తోంది. ఇందుకోసం అమెరికా డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గత వారం రోజులుగా గాజా ఉపరితలంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గాజాని చుట్టుముట్టాం: ఇజ్రాయెల్ గాజాలో ప్రధాన నగరం, హమాస్ మిలిటెంట్ల ముఖ్యమైన అడ్డా అయిన గాజా సిటీని తమ సేనలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ప్రకటించారు. భూతల దాడులు ప్రారంభమైన వారం రోజుల తర్వాత గాజా సిటీ చుట్టూ తమ దళాలు పూర్తిస్థాయిలో మోహ రించినట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ప్రపంచ దేశాల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారు: హమాస్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యానికి దారుణ పరాజయం ఎదురు కాబోతోందని హమాస్ మిలిటరీ విభాగమైన ఖాసమ్ బ్రిగేడ్స్ స్పష్టం చేసింది. తమ భూభాగంలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ సైనికులు నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారని హెచ్చరించింది. తద్వారా వారికి తమ చేతుల్లో చావు తప్పదని పేర్కొంది. కాల్పుల విరమణ లేదు: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేసే దాకా గాజాలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. మానవతా సాయం గాజాకు చేరవేయడానికి, విదేశీయులను బయటకు పంపించడానికి వీలుగా తాత్కాలికంగా కాల్పు ల విరమణ పాటించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థనపై ఆయన స్పందించారు. నెతన్యాహూ శుక్రవారం అమెరి కా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలస్తీనియన్లను కాపాడండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్య పాలస్తీనియన్లు మరణిస్తుండడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజలను కాపాడడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. లేకపోతే ‘శాంతికి భాగస్వాములు’ ఎవరూ ఉండరని చెప్పారు. గాజాను శ్మశానంగా మార్చొద్దని పరోక్షంగా తేలి్చచెప్పారు. గాజాకు భారీస్థాయిలో మానవతా సాయం అవసరమని, ఆ దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని అన్నారు. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలోకి విస్తృతంగా అనుమతించాలని, ఈ విషయంలో ఆంక్షలు తొలగించాలని చెప్పారు. ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. పవిత్ర యుద్ధం చేస్తున్నాం: హసన్ నస్రల్లా ఇజ్రా యెల్‌పై దా డుల విషయంలో అమెరికా హెచ్చరికలు తమను భయపెట్టలేవని లెబనాన్‌కు చెందిన షియా మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ అధినేత హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి హెజ్బొల్లా దూరంగా ఉండాలంటూ అమెరికా చేసిన హెచ్చరికలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌పై తొలుత దాడిచేసిన హమాస్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌పై పవిత్ర యుద్ధంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. మధ్యధరా సముద్రంలో అమెరికా సైనిక బలగాలను చూసి తాము బెదిరిపోవడం లేదని అన్నారు. తమ దగ్గర బలమైన సైన్యం ఉందని, అన్నింటికీ సిద్ధపడే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నట్లు నస్రల్లా పేర్కొన్నారు. నస్రల్లా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా కారి్మకులు వెనక్కి తమ దేశంలో పని చేస్తున్న పాలస్తీనియన్ కారి్మకులను వారి సొంత ప్రాంతమైన గాజాకు పంపించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. శుక్రవారం పదుల సంఖ్యలో కారి్మకులను గాజాకు పంపించింది. భారమైన హృదయంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్ 7 నుంచి ఘర్షణ మొదలైంది. అంతకంటే ముందు 18,000 మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ప్రభుత్వం వర్క్ పరి్మట్లు జారీ చేసింది. వారిలో చాలామంది ఇజ్రాయెల్‌కు చేరుకొని, వేర్వేరు పనుల్లో కుదురుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పాలస్తీనియన్లు వెనక్కి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. -
భీకర యుద్దం..పాలస్తీనియన్ల కోసం ఈ చిన్నారి చేసిన పని తెలిస్తే!
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 8,525వేల మంది పాలస్తీనియన్లు బలయ్యారు. ఈ నేపథ్యంలో దాడులను ఆపివేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తున్నాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. అయితే ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర యుద్దం నేపథ్యంలో వర్తక, వాణిజ్యాల్లో కుదుపులకు కారణమవుతోంది. ఈ క్రమంలో పాలస్తీనియన్ల కోసం భారీగా నిధులు సమకూరుతున్నాయి. సిరియాలోని ఓ మసీదులో పాలస్తీయన్ల కోసం పలువురు విరాళాలు ఇస్తుండగా, ఓ చిన్నారి సైతం తనకు తోచినంత సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Crowd funding was being done for Palestinians in a Mosque in Syria when this little girl arrived with her small gift❤️#StopGenocideInGaza #Palestine pic.twitter.com/njxeUyLH7R — هارون خان (@iamharunkhan) November 1, 2023 -
Israel-Hamas war: గాజాలో మరణ మృదంగం
ఖాన్ యూనిస్/జెరూసలేం: హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులు ఉధృతం చేస్తుండడం గాజాలో సాధారణ పాలస్తీనియన్లకు ప్రాణసంకటంగా మారింది. సోమవారం మరిన్ని దళాలు ఇజ్రాయెల్ భూభాగం నుంచి గాజాలోకి అడుగుపెట్టాయి. ఇజ్రాయెల్ సేనలు గాజాలోకి మరింత ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాలో 24 గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువూ గాలిస్తున్నాయి. గాజాలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి అయిన ‘టర్కిష్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్’ సమీపంలోనే ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి స్వల్పంగా ధ్వంసమయ్యింది. ఉత్తర, దక్షిణ గాజాను అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారిని ఇజ్రాయెల్ యుద్ధట్యాంకులు, బుల్డోజర్లు దిగ్బంధించాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. ఇందుకు కారణం ఏమిటన్నది బయటపెట్టడం లేదు. ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వెళ్లలేకపోతున్నారు. ఉత్తర గాజాలకు భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హమాస్ వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 304 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 8,306 మంది పాలస్తీనియన్లు మరణించారని, 21,048 మంది గాయపడ్డారు. ఇంకా 1,950 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించింది. ఇజ్రాయెల్‌లో 1,400మందికిపైగా మృత్యువాత పడ్డారు. అరకొర సాయమే ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న మానవతా సాయం ఇప్పుడిప్పుడే గాజాకు చేరుకుంటోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, దుస్తులు, నీటి శుద్ధి యంత్రాలు వంటివి అందుతున్నాయి. 75 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ తాజాగా ఈజిప్టు నుంచి దక్షిణ గాజాలోకి అడుగుపెట్టింది. ఈ వాహనాలు టన్నుల కొద్దీ ఆహారం, తాగు నీరు, పలు రకాల కీలక ఔషధాలను చేరవేశాయి. గాజాలోని 23 లక్షల జనాభాకు ఈ సాయం ఏమాత్రం చాలదని అక్కడి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. దక్షిణ గాజాలో రెండు నీటి సరఫరా పైపులైన్లను పునరుద్ధరించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. యూదుల కోసం విమానంలో గాలింపు ఇజ్రాయెల్ నుంచి వచి్చన విమానంలో యూదుల కోసం రష్యాలోని ముస్లింలు గాలించడం సంచలనాత్మకంగా మారింది. ఆదివారం టెల్ అవీవ్ నుంచి విమానం రష్యాలో ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన మాఖాచ్కలాలోని దగెస్తాన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో యూదులు ఉన్నారన్న అనుమానంతో వందలాది మంది ముస్లింలు ఎయిర్‌పోర్టును దిగ్బంధించారు. పాలస్తీనా జెండాలను చేబూని, ఎయిర్‌పోర్టులోకి లోపలికి ప్రవేశించి అలజడి సృష్టించారు. యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చంపేయాలంటూ నినదించారు. కొందరు రన్‌వే పైకి దూసుకెళ్లారు. ఇజ్రాయెల్ విమానాన్ని చుట్టుముట్టారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూదులపై దాడి చేయడానికే ఎయిర్‌పోర్టుకు వచి్చనట్లు తెలుస్తోంది. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపైనా తిరగబడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అపహరించిన షానీ లౌక్‌ను హత్య చేశారు 23 ఏళ్ల యువతి షానీ లౌక్ ఈ నెల 7న ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్‌లో ఓ సంగీత వేడుకలో ఉండగా హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడి చేశారు. కొందరిని కాలి్చచంపారు. షానీ లౌక్తోపాటు మరికొందరిని అపహరించారు. బందీలుగా బలవంతంగా గాజాకు లాక్కెళ్లారు. అయితే, మిలిటెంట్ల చెరలో షానీ లౌక్ క్షేమంగా ఉండొచ్చని ఆమె తల్లి, సోదరి భావించారు. త్వరలోనే ప్రాణాలతో తిరిగివస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే దుర్వార్త తెలిసింది. గాజాలో మిలిటెంట్లు ఓ యువతి మృతదేహాన్ని వాహనంలో ఉంచి, ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తూ గాజా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శవంగా మారిన ఆ యువతి షానీ లౌక్ అని తల్లి రికార్డా లౌక్, సోదరి అడీ లౌక్ గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇజ్రాయెలీ–జర్మన్ జాతీయురాలైన షానీ లౌక్‌ను మిలిటెంట్లు హత్య చేయడం దారుణమని, ఈ ఘటన తమను కలచివేసిందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది. -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. వారిని రక్షించాలన్న జో బైడెన్
జెరూసలేం: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఒకవైపు ఇజ్రాయెల్ వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూంటే ఇంకోవైపు పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. ఇరవైనాలుగు గంటల వ్యవధిలో 450 హమాస్ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక సూచన చేశారు. హమాస్ మిలిటెంట్లు, పౌరుల మధ్య తేడాను గుర్తించాలని బైడెన్ కోరారు. దాడుల్లో గాజాకు చెందిన అమాయక ప్రజలు మృతిచెందకుండా వారిని కాపాడాలన్నారు. పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఇజ్రాయెల్‌కు ఆత్మ రక్షణ హక్కు ఉన్నప్పటికీ సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. BREAKING NEWS FROM ISRAEL Israeli forces destroying cameras as they were raiding homes in Jenin they are targeting male Palestinian [Saudi,Putin's Russia,WhatsApp,Amin Emery, Halloween,Dame,Jones, Rickman, Chiefs]pic.twitter.com/Yw8peVSbLG — 🌎🏞️ YOBBY THE FIRST (@Obayobrian1) October 30, 2023 ‘ద్విదేశ’ విధానమే పరిష్కారం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, అరబ్ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని చెప్పారు. בשעות האחרונות צה"ל המשיך לתקוף ולחסל מחבלים ברצועת עזה, לוחמי צה"ל שפעלו בסמוך למעבר ארז זיהו מספר מחבלים שיצאו מפיר של מנהרה בשטח רצועת עזה, לאחר הזיהוי הלוחמים ניהלו מולם קרב, הרגו מספר מחבלים ופצעו נוספים. במקביל, התרחשו מספר קרבות נוספים בהם חוסלו מחבלים>> pic.twitter.com/R4TpMIJupy — צבא ההגנה לישראל (@idfonline) October 29, 2023 ఆటలొద్దు.. గల్లంట్ వార్నింగ్ ఇదిలా ఉండగా.. హమాస్‌పై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బందీలపై హమాస్ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. మానసికంగా తమను బెదిరించే ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే, బందీలను విడిపెట్టేందుకు పలు షరతులు విధిస్తోందన్నారు. కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన 300 మందికిపైగా పౌరులు గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. గాజాలోని హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్, ఇజ్రాయెల్‌తో తక్షణ ఖైదీల మార్పిడికి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ సిద్ధంగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే. -
Israel-Hamas war: హమాస్ స్థావరాలే లక్ష్యం
గాజాస్ట్రిప్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. మరోవైపు వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 450 హమాస్ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మిలిటెంట్ల కమాండ్ సెంటర్లు, అబ్జర్వేషన్ పోస్టులు, యాంటీ–ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలియజేసింది. గాజాలోకి మరిన్ని పదాతి దళాలు అడుగుపెట్టబోతున్నాయని పేర్కొంది. ఖాన్ యూనిస్ సిటీలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. వీరిలో 10 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. హమాస్ కమాండ్ పోస్టు ఉందని భావిస్తున్న షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. గాజా సిటీలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందలాది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది బలయ్యారన్నది తెలియరాలేదు. హమాస్‌పై రెండో దశ యుద్ధం కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో శత్రువులపై భీకర పోరు తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లు సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పైకి అప్పుడప్పుడు రాకెట్లు ప్రయోగిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో తరచుగా సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. మూడు వారాలు దాటిన ఘర్షణ ఇజ్రాయెల్ దాడుల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 3,300 మంది మైనర్లు, 2,000 మందికిపైగా మహిళలు ఉన్నారని ప్రకటించింది. శిథిలాల కింద మరో 1,700 మంది చిక్కుకుపోయినట్లు అంచనా. వారు ఎంతమంది బతికి ఉన్నారో చెప్పలేని పరిస్థితి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌దాడులు తీవ్రతరం కావడం పాలస్తీనియన్లలో గుబు లు పుట్టిస్తోంది. ఇలాంటి భీకర దాడులను తామెప్పుడూ చూడలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీకి నెతన్యాహూ క్షమాపణ ఇజ్రాయెల్ భద్రతా దళాలకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ క్షమాపణ చెప్పారు. ఈ నెల 7న జరిగిన హమాస్ దాడిని ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైందంటూ ఆయ న తొలుత ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాడికి సంబంధించి భద్రతా దళాల అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని తప్పుపట్టారు. నెతన్యాహు పోస్టుపై ఆయన సహచర మంత్రులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భద్రతా సిబ్బంది ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం ఏమిటని పలువురు మండిపడ్డారు. దీంతో బెంజమిన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. భద్రతా బలగా లకు క్షమాపణ చెప్పారు. వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. పశి్చమాసియాలో శాంతి నెలకొనాలి: మోదీ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పశి్చమాసియాలో ఉద్రిక్తత పెరిగిపోతుండడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీతో ఫోన్లో మాట్లాడారు. పశి్చమాసియా పరిణామాలపై చర్చించారు. గాజాలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సాధారణ ప్రజలు మరణిస్తుండడం తీవ్ర విచాకరమని మోదీ పేర్కొన్నారు. పశి్చమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని, ఇందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు మోదీ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గాజాకు మానవతా సాయం అందిస్తామన్నారు. గోదాములు లూటీ మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల 23 లక్షల మంది గాజా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చల్లారని ఆకలి మంటలు వారిని లూటీలకు పురికొల్పుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూఎన్ఆర్డబ్ల్యూఏ సంస్థ గోదాముల్లో భద్రపరుస్తోంది. ప్రజలకు పంపిణీ చేస్తోంది. అయితే, ఆకలికి తాళలేని జనం గోదాములను లూటీ చేస్తున్నారని, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాలు, పరిశుభ్రతకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్నారని వెల్లడించింది. గాజాలో ‘సివిల్ ఆర్డర్’ గతి తప్పుతోందని పేర్కొంది. పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారతోందని, ఆవేశంలో ఉన్న ప్రజలను నియంత్రించలేకపోతున్నామని తెలియజేసింది. రణభూమిగా మారిన గాజాలో ఉండలేక, ఇతర దేశాలకు వలస వెళ్లే మార్గం కనిపించక జనం నిరాశలో మునిగిపోతున్నారని, అంతిమంగా వారిలో హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని స్పష్టం చేసింది. ‘ద్విదేశ’ విధానమే పరిష్కారం: బైడెన్ ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, అరబ్ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని అన్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో మరో దారుణం ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లోని నబ్లూస్లో ఓ యూదు సెటిలర్ జరిపిన కాల్పుల్లో బిలాల్ సాలెహ్ అనే పాలస్తీనియన్ రైతు మరణించాడు. ఈ రైతు ఆలివ్ తోటలు సాగుచేస్తుంటాడు. వెస్ట్‌బ్యాంక్‌లో గత 23 రోజుల్లో యూదు సెటిలర్ల దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇక్కడ 110 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. -
ఇజ్రాయెల్-హమాస్: యుద్ధం వేళ కీలక పరిణామం!
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజావైపునకు దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. గాజాలో భూతల దాడులను మరింత తీవ్రంచేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య రాజీ కుదుర్చేందుకు మధ్యప్రాశ్చ్య దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, బంధీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలా రాజీకుదిర్చేలా యత్నిస్తున్నాయి. దీనికి హమాస్ వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. ప్రతిగా బంధీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని షరతు విధించింది. తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలన్నారు. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. #Gaza_Genocide Very heavy bombing / artillery strikes on Gaza tonight. It’s a densely packed city where over 50% of the population are under 18. pic.twitter.com/eV3n5yTaWF — Monty (@Monty1745) October 29, 2023 మరోవైపు గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది. ఉత్తర గాజాలో 150 సొరంగాలు, బంకర్లను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థపై కూడా దాడులు చేయడంతో దాదాపు 23 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొంటామని హమాస్ తెలిపింది. Israel is ARRESTING refugees in the West Bank. Israel claims to be fighting Hamas. Hamas is not in the West Bank.#FreePalaestine, 🇵🇸#FreeHamas#FreeGaza pic.twitter.com/MczCsoAbMO — Sikandar Akram (@mrsikandarakram) October 29, 2023 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. -
ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అల్లాడిపోతున్న గాజా
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. దానిపై భూతల దాడుల తీవ్రతను శనివారం మరింత పెంచింది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజాకేసి దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమా స్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. వాటి తీవ్రత యుద్ధం మొదలైన ఈ మూడు వారాల్లో కనీవినీ ఎరగనంత ఎక్కువగా ఉందంటూ గాజావాసులు ఆక్రోశిస్తు న్నారు. వాటి దెబ్బకు గాజాలో ఇప్పటిదాకా మిగిలి ఉన్న అరకొర సమాచార వ్యవస్థలన్నీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో గాజాలోని 23 లక్షల మందికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని భావిస్తున్నారు. దాడుల ఫొటోల విడుదల గాజాలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్న యుద్ధ ట్యాంకుల వరుసలు తదితరాల ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భారీ సంఖ్యలో సైన్యం, ట్యాంకులు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ‘‘మా సైన్యాలు గాజాను కమ్ముకుంటున్నాయి. యుద్ధం కొనసాగుతోంది’’ అని సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ప్రకటించారు. మరోవైపు, యుద్ధం కీలక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. ‘‘గత రాత్రి గాజాలో భూకంపం పుట్టించాం. నేలమీద, భూగర్భంలో ఉన్న హమాస్ స్థావరాలపై భారీగా దాడులకు దిగాం’’ అని వివరించారు. గాజాపై ఇప్పటిదాకా రాత్రిపూట దాడులకే సైన్యం పరిమితమవుతూ వచి్చంది. కానీ ఇక ఆ ప్రాంతమంతటినీ ఆక్రమించడమే ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యమని చెబుతున్నారు. అయితే హమాస్ విస్తృత భూగర్భ నెట్వర్క్ తదితరాలను నాశనం చేసేందుకు చాలా సమయం పడుతుందన్న సైన్యం వ్యాఖ్యల నేపథ్యంలో పోరుకు ఇప్పట్లో తెర పడే సూచనలు కని్పంచడం లేదు...! ఆస్పత్రే హమాస్ కేంద్రం! గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అయిన షిఫా నిజానికి హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రధాన కార్యాలయమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆస్పత్రి కిందే దాని ప్రధాన స్థావరం దాగుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ సిమ్యులేటెడ్ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. వందలాది మంది హమాస్ మిలిటెంట్లు ఆస్పత్రి కింద తలదాచుకున్నారని పేర్కొంది. ‘‘ఆస్పత్రి కింద లెక్కలేనన్ని భూగర్భ కాంప్లెక్సులున్నాయి. ఉగ్రవాదులు వాటిని యథేచ్ఛగా వాడుకుంటున్నారు’’ అని ఆరోపించింది. ఆస్పత్రి కింద ఉన్న నెట్వర్క్ మొత్తాన్నీ బట్టబయలు చేసి తుడిచి పెట్టి తీరుతామని ప్రకటించింది. షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌పై భారీ దాడికి సైన్యం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తుండటం తెలిసిందే. హమాస్ దురాగతాలు ఐసిస్‌ను మించిపోయాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దుయ్యబట్టారు. ఆస్పత్రులనే ప్రధాన స్థావరాలుగా మార్చుకునే నైచ్యానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. గాజాకు స్టార్‌లింక్ కనెక్టివిటీ గాజాలో పాలస్తీనియన్లకు కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రయతి్నస్తున్న అంతర్జాతీయ సంస్థలకు స్టార్‌లింక్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ తదితర కనెక్టివిటీ సౌకర్యం కలి్పస్తామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ శనివారం ప్రకటించారు. గాజాలో అన్ని సమాచార సదుపాయాలనూ ధ్వంసం చేయడం దారుణమంటూ అమెరికా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కొరెట్జ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మస్క్ ఈ మేరకు ప్రకటన చేశారు. స్టార్ లింక్ మస్క్ తాలూకు అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఉపగ్రహ నెట్వర్క్ వ్యవస్థ. 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. సర్వం స్తంభించింది... ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్ఖిద్రా తెలిపారు. ► అంబులెన్స్‌లకు సమాచారమివ్వడం అసాధ్యంగా మారిపోయింది. ► అవసరమైన చోట్లకు ఎమర్జెన్సీ బృందాలను పంపడం నిలిచిపోయింది. ► ఇజ్రాయెల్ సైనిక వాహనాల హోరు, బాంబుల మోతల మధ్యే వైద్య బృందాలతో కూడి న వాహనాలు క్షతగాత్రుల కోసం చెదురుమదురుగా వెదుకులాడుతున్నాయి. ► చాలాచోట్ల గాయపడ్డవారిని పౌరులే తమ వాహనాలపై ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ► బాంబు దాడుల ధాటికి నేలమట్టమవుతున్న ఒక వీధిలో నుంచి పాలస్తీనియన్లు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటం స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. గాయాలతో కుప్పకూలి అల్లాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్ అని అరుస్తుండటం అందులో కనిపిస్తోంది. ► తాము కేవలం హమాస్ మిలిటెంట్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కానీ వారు పౌరులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. బందీల బంధువుల నిరసన అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చెరపట్టిన 200 మంది పై చిలుకు ఇజ్రాయెలీల బంధువులు టెల్ అవీవ్ నగరంలో నిరసనకు దిగారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చి తమ గోడు వినాలంటూ నినాదాలు చేశారు. బందీలను విడిపించి వెనక్కు తీసుకొచ్చే ఆలోచన ఎవరూ చేయడం లేదంటూ మండిపడ్డారు. ► హమాస్ చెరలో 229 మంది ఉన్నట్టు సైనిక అధికార ప్రతినిధి హగరీ నిర్ధారించారు. అయితే వారిని విడుదల చేస్తే కాల్పులు విరమిస్తామని ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ► ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం ఫలితంగా నలుగురు బందీలను హమాస్ ఇటీవల విడుదల చేయడం తెలిసిందే. -
ఇజ్రాయెల్-గాజా యుద్ధం: కీలక ప్రకటన చేసిన ఎలాన్ మస్క్
ఇజ్రాయెల్ దాడి కారణంగా అన్ని కమ్యూనికేషన్లు ఆగిపోయి యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (elon musk) మద్దతుగా నిలిచారు. గాజాకు ఇంటర్నెట్ సపోర్ట్ అందించనున్నట్లు ప్రకటించారు. హమాస్ నేతృత్వంలో ఉన్న గాజాను ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. అన్ని వైపుల నుంచి దాడులు ముమ్మరం చేశాయి. దీంతో ఆ ప్రాంతంలో కమ్యూకేషన్ పూర్తిగా స్తంభించింది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని యూఎన్, ఇతర అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సహాయ సమూహాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో తన ‘స్టార్‌లింక్’ (starlink) సహాయపడుతుందని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో #StarlinkForGaza అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. స్పేస్ఎక్స్ (SpaceX) నిర్వహిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల సముదాయాన్ని స్టార్‌లింక్ కలిగి ఉంది. ఇది మారుమూల ప్రాంతాలకు సైతం కనెక్టివిటీని అందించగలదు. అక్టోబర్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధకాల కమ్యూనికేషన్లను పెంచే ప్రయత్నంలో స్పేస్ఎక్స్తో చర్చలు కూడా ప్రారంభించింది. ఈ నెట్వర్క్ ఫ్రంట్‌లైన్‌లకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ పట్టణాలకు నిరంతర ఇంటర్నెట్ సేవను కలిగి ఉండటానికి అనుమతిస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రతినిధిని ఉటంకిస్తూ, గాజాలో అన్ని ఇంటర్నెట్, ఫోన్ సేవలను ఇజ్రాయెల్ స్తంభింపజేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గాజాలో ప్రస్తుతం కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించింది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు రోజంతా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ కమ్యూనికేషన్లను తొలగించిదని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. Starlink will support connectivity to internationally recognized aid organizations in Gaza. [ComStar] — Elon Musk (@elonmusk) October 28, 2023 -
Israel-Hamas war: గాజాలో నరకయాతన
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. 9 వేలు దాటిన మృతుల సంఖ్య మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది. ఇంధనాన్ని అనుమతించేది లేదు సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది. మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు. బందీల్లో 30 మంది పిల్లలు! ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది. బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది. సిరియాలో అమెరికా దాడులు వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది. -
గాజాపై భూతల దాడులు
రఫా/వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఊహించినట్లుగానే ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాపై భూతల దాడులు ప్రారంభించింది. హమాస్ స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ పదాతి దళాలు, యుద్ధ ట్యాంకులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిహద్దు దాటి గాజా భూభాగంలోకి అడుగుపెట్టాయి. ‘లక్ష్యాల’పై స్పల్పస్థాయిలో దాడులు నిర్వహించాయి. గురువారం తెల్లవారుజాము వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఉత్తర గాజాపై అతిత్వరలో పూర్తిస్థాయి భూతల యుద్ధం ప్రారంభం అవుతుందని ఇజ్రాయెల్ సైన్యం సంకేతాలిచి్చంది. యుద్ధక్షేత్రాన్ని సిద్ధం చేయడానికే స్వల్పంగా భూతల దాడులు చేశామని గురువారం వెల్లడించింది. చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, హమాస్ మౌలిక సదుపాయాలను, ఆయుధ వ్యవస్థను ధ్వంసం చేశామని పేర్కొంది. గత 24 గంటల్లో గాజాపై దాదాపు 250 వైమానిక దాడులు చేశామని ప్రకటించింది. గాజాలో సహాయక చర్యలకు ఆటంకాలు సృష్టించవద్దని, భూతల దాడులను విరమించుకోవాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసినా ఇజ్రాయెల్ సైన్యం లెక్కచేయకపోవడం గమనార్హం. ప్రాణనష్టం.. ఊహించలేం పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ 2007 నుంచి గాజాలో అధికారం చెలాయిస్తోంది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా విరుచుకుపడింది. భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. తమ భద్రతకు సవాలు విసురుతున్న హమాస్‌కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. గాజాపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరుపక్షాల మధ్య గత 20 రోజులుగా హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,000 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. వీరిలో 2,900 మంది చిన్నపిల్లలు, 1,500 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తిస్థాయిలో భూతల దాడులు మొదలైతే గాజాలో ప్రాణనష్టం ఊహించని స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఖాన్ యూనిస్‌లో 15 మంది బలి ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఉత్తర గాజాపై భూతల దాడులతోపాటు దక్షిణ గాజాలో వైమానిక దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో ఖాన్ యూనిస్ సిటీలో 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. సామాన్య ప్రజలకు హాని కలిగించడం లేదని, కేవలం హమాస్ స్థావరాలపైనే దాడుల చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. మరోవైపు మిలిటెంట్లు సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని పెటా తిక్వా నగరంపై రాకెట్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మానవతా సాయం అంతంత మాత్రమే గాజాలో ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక జనం పిట్టల్లా రాలిపోతుండడంతో ఇజ్రాయెల్‌పై ప్రపంచదేశాలు ఒత్తిడి పెంచాయి. ఇజ్రాయెల్ అనుమతితో ఈజిప్టు నుంచి ఇప్పటివరకు 70కి పైగా వాహనాలు గాజాలోకి అడుగుపెట్టాయి. ఈజిప్టు నుంచి అందుతున్న మానవతా సాయం ఏ మూలకూ చాలడం లేదని గాజా అధికారులు చెబుతున్నారు. ఈ సాయం సముద్రంలో నీటి»ొట్టంత అని గాజాలోని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌క్రాస్ ప్రతినిధి విలిమయ్ ష్కోమ్బర్గ్ అన్నారు. ఆకలితో అలమటించిపోతున్న ప్రజల ప్రాణాలు నిలబెట్టాలంటే ఇంకా ఎన్నో రెట్ల సాయం కావాలని కోరారు. అల్–జజీరా జర్నలిస్టు భార్య, పిల్లలు మృతి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో బుధవారం అంతర్జాతీయ మీడియా సంస్థ అల్–జజీరా సీనియర్ జర్నలిస్టు వాయెల్ దాహ్‌దౌ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు ప్రాణాలు కోల్పోయారు. గాజాలోని నుసీరాత్ శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో వారు మరణించారు. మరికొందరు కుటుంబ సభ్యులు కనిపించకుండాపోయారు. గురువారం వాయెల్ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన భార్య, కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలు కలిచివేశాయి. సంతాపం ప్రకటిస్తూ వారు పోస్టులు పెట్టారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే మా పిల్లలను బలి తీసుకోవాలా? అని వాయెల్ నిలదీశారు. పాలస్తీనా జాతీయుడైన వాయెల్ చాలా ఏళ్లుగా గాజాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇక్కడి ప్రజల దీనగాథలను, ఇజ్రాయెల్ సైన్యం దుశ్చర్యలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఆ ఎకనామిక్ కారిడార్ వల్లే హమాస్ దాడి!: బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్‌లో జి–20 సదస్సులో ప్రకటించిన ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను హమాస్ మిలిటెంట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ ప్రాజెక్టును విరమించుకొనేలా ఒత్తిడి పెంచడానికే ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడి చేశారన్న వాదన కొంతవరకు తనకు సబబుగానే కనిపిస్తోందని అన్నారు. హమాస్ దాడికి గల కారణంపై తన అంతరాత్మ ఇదే చెబుతోందని వ్యాఖ్యానించారు. అయితే, దీనికి తనవద్ద స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నారు. అమెరికా పర్యటనకు వచి్చన ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బానీస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎకనామిక్ కారిడార్ గురించి బైడెన్ ప్రస్తావించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. రైలు, రోడ్డు మార్గాలతో ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ దేశాలను అనుసంధానించడానికి ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను జి–20 దేశాలు తలపెట్టిన సంగతి తెలిసిందే. -
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబం మృతి, భోరున విలపించిన జర్నలిస్టు
గాజాపై ఇజ్రాయెల్(Israeil) జరిపిన వైమానిక దాడిలో గాజాలోని జర్నలిస్టు కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. బుధవారం రాత్రి అల్ జజీరా జర్నలిస్ట్,అరబిక్ బ్యూరో చీఫ్ వేల్ అల్ దహదౌహ్ కుటుంబ సభ్యులు మరణించారు. సెంట్రల్ గాజాలోని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్ క్యాంప్ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో భార్య, కుమార్తె , కొడుకును కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె గాజాలో నివసిస్తున్నారు. సురక్షితమైన ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వైమానిక దాడులకు దిగబోతున్నాయనే విషయాన్ని భార్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా వారిపైదాడి జరిగింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దహదౌహ్ భార్య, కుమారుడు, కుమార్తె మరణించారని అల్ జజీరా రిపోర్ట్ చేసింది. వారంతా శిథిలాల కింద సమాధి అయ్యారని వెల్లడించింది. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న కుటుంబ సభ్యులను చూసిన దహదౌహ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. “ఏమి జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లలు, మహిళలు , పౌరులే టార్గెట్‌గా చేస్తున్న వరుస దాడులివి. ఇజ్రాయెల్ దాడులు నుసైరాత్‌తో సహా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేస్తున్న దాడుల గురించి యార్మూక్ నుండి రిపోర్టు చేస్తున్నాను..అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వారికి శిక్షించకుండా వదిలి పెట్టరనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా లక్ష్యంగా చేసుకుని చంపడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది.మరికొంతమంది జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా గల్లంతు అయినట్టు సమాచార.ం తీవ్ర విషాదానికి ముందు మమ్మల్ని కాపాడండి అంటూ వేల్ దహదౌ కుమారుడు మహమూద్, తల్లి, సోదరితో కలిసి మొరపెట్టుకున్న కొద్దిరోజులకే వారంతా చనిపోయారు.గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి గురించి సోదరి ఖోలౌద్‌తో కలిసి ప్రపంచానికి ఒక వీడియో సందేశం పంపాడు. కాగా అక్టోబరు 7న హమాస్ ఆకస్మిక దాడిలో దాదాపు 1,400 మందిని చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దాడులకారణంగా గాజాలో 6,500 మందికి పైగా మరణించినట్టు అంచనా. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా దాదాపు 6,00,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇది ఇలా ఉంటే పాలస్తీనా జర్నలిస్టుల యూనియన్ ప్రకారం గాజా బాధితుల్లో 22 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారు. “This is the ‘safe’ area that the occupation army spoke of.” Al Jazeera's Wael Dahdouh lost his wife, son and daughter in an Israeli air raid in the southern Gaza Strip, where Israel told Palestinians to forcibly evacuate for their safety https://t.co/kaf1moxPRa pic.twitter.com/U12h7kWoFq — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 My colleague at @AJArabic Wael Al Dahdouh just lost his wife, daughter, and son in an Israeli strike “ that targeted his home “ in #Gaza. He reported on that strike earlier, without knowing that some family members were among the dead in that Israeli bombing.#Gazabombing pic.twitter.com/SObiuP5zer — Wajd Waqfi وجد وقفي (@WajdWaqfi) October 25, 2023 "Help us to stay alive" was their outcry to the world from Gaza. Mahmoud, Al Jazeera Arabic’s Wael Dahdouh son, joined by his sister Kholoud, sent a message to the world, days before Mahmoud, his mother, and younger sister Sham were killed in an Israeli airstrike in Gaza ⤵️ pic.twitter.com/HWJ8SjIpvx — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 -
Israel-Hamas war: గాజాలో కన్నీటి చుక్కలు
రఫా/టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండాపోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరతవల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇటీవల అనుమతి ఇచి్చంది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచి్చన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్‌ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెబుతోంది. చేతులేత్తేయడమే మిగిలింది ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్ లేక, పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడింట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సిరియాలో 8 మంది జవాన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హమాస్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఒక్కతాటిపైకి మిలిటెంట్ సంస్థలు! ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్ నస్రల్లా బుధవారం హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన మీకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్‌ను హెజ్బొల్లా హెచ్చరించింది. హమాస్‌కు ఇరాన్ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఇరాన్‌లోని మిలిటెంట్ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్ భూభాగల నంచి ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బందీల విడుదలకు ఖతార్ యత్నాలు హమాస్ చెర నుంచి బందీలు విడుదలయ్యే విషయంలో మరిన్ని సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహా్మన్ అల్–థానీ చెప్పారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్ల తరలింపు! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే, అక్కడున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు ఇజ్రాయెల్ వదిలి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉన్నారు. యుద్ధం గనుక విస్తరిస్తే వారి భద్రతకు భరోసా ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిస్థితి అదుపు తప్పకముందే వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సౌరే అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఘర్షణను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు రోజుల్లో 750 మంది మృతి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రత పెంచింది. బుధవారం కొన్ని టార్గెట్లపై క్షిపణులు ప్రయోగించింది. హమాస్ స్థావరాలను, సొరంగాలను, ఆయుధాగారాలను, సమాచార వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది క్షతగాత్రులుగా మారారు. 10 మంది యూదులను చంపేశా! ఇజ్రాయెల్‌లో 10 మంది యూదులను చంపేశానంటూ హమాస్ మిలిటెంట్ ఒకరు తన తల్లిదండ్రులతో మొబైల్ ఫోన్లో చెప్పిన ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచి్చంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ దీన్ని విడుదల చేసింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ భూభాగంలోని కిబుట్జ్‌లో తానున్నానని, తాను ఒక్కడినే 10 మంది యూదులను మట్టుబెట్టానని సదరు మిలిటెంట్ గాజాలోని ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి గర్వం తొణికిసలాడే స్వరంతో ఆనందంగా చెప్పాడు. దాంతో వారు అతడిని శభాష్ అంటూ అభినందించారు. మిలిటెంట్ ఉపయోగించిన ఫోన్ అతడి చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుడిదే కావడం గమనార్హం. అయితే, ఈ ఆడియో రికార్డు నిజమైందో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. -
బంధించారు.. కర్రలతో కొట్టారు.. నరకం కనిపించింది!
టెల్ అవీవ్: 17 రోజులుగా తమ చెరలో ఉన్న యోచెవ్డ్ లిఫ్షిట్జ్(85), నురిట్ కూపర్(79) అనే ఇద్దరు మహిళలను హమాస్ మిలిటెంట్లు సోమవారం విడుదల చేశారు. మానవతా దృక్పథంతోపాటు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్లు తెలిపారు. స్నేహితులైన వారిద్దరూ ఇజ్రాయెల్–గాజా సరిహద్దు లోని కిబుట్జ్ నిర్ ఓజ్ నివాసితులు. మంగళవారం టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. మిలిటెంట్ల అధీనంలో తనకు ఎదురైన అనుభవాలను యోచెవెడ్ లిఫ్షిట్జ్ మీడియాతో పంచుకున్నారు. ‘ఈ నెల 7న మిలిటెంట్లు నన్ను బంధించారు. మోటార్‌బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ప్రతిఘటించినందుకు కర్రలతో కొట్టారు. రోదించినా పట్టించుకోలేదు. గాజాకు బలవంతంగా తరలించారు. ఒక సొరంగంలోకి తీసుకెళ్లారు. భూగర్భంలో సాలెగూళ్లలాంటి సొరంగాలు ఉన్నాయి. మేము వెళ్లేసరికి డాక్టర్లు, వైద్య సిబ్బంది అక్కడున్నారు. తాము ఖురాన్‌ను విశ్వసిస్తామని, ఎలాంటి హాని కలిగించబోమంటూ మిలిటెంట్లు మాతో చెప్పారు. డాక్టర్లు మాకు వైద్య సేవలు అందించారు. కావాల్సిన ఔషధాలు ఇచ్చారు. సొరంగాలు తడిగా, తేమగా ఉన్నాయి. అక్కడ పారిశుధ్య సౌకర్యాలు ఫరవాలేదు. మాకు ఎలాంటి అస్వస్థత కలగలేదు. పరుపులపై నిద్రించాం. మిలిటెంట్లు మొదట్లో గాజాకు తీసుకెళ్లేటప్పుడు హింసించినా అక్కడికి వెళ్లిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దులో నిర్మించిన రక్షణ కంచె గురించి చెప్పాలి. లక్షల డాలర్లు ఖర్చుచేసి ఇజ్రాయెల్ సైన్యం ఈ నిర్మించిన ఈ కంచెతో ఉపయోగం శూన్యం. దేశానికి అది ఏమాత్రం రక్షణ క ల్పించడం లేదు. అత్యంత ఖరీదైన ఈ ఫెన్సింగ్‌ను మిలిటెంట్లు సులభంగా ధ్వంసం చేసి వచ్చి, మమ్మల్ని అపహరించారు. హమాస్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని లిఫ్షిట్జ్ఆక్షేపించారు. లిఫ్షిట్జ్, నురిట్ కూపర్ భర్తలు ఇంకా హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. -
బాధితుల గోడు వినేదెవరు?
ఒకప్పుడు ప్రపంపంచంలో తన కంటూ ఒక చిరునామా లేని జాతి అది. అనేక రకాలుగా చరిత్రలో అవమానాలూ, బాధలూ ఎదుర్కొని చివరికి పాలస్తీనియన్ల చెంతకు చేరింది. తాము ఉండడానికి కాసింత స్థలం అడిగింది. తమ పవిత్ర గ్రంథం ఆ ప్రాంతం తమ పూర్వీకులదని చెబుతోందనీ,అందువల్ల ఈ ప్రాతం తమదేననీ పేచీపెట్టి పాలస్తీనియన్లతో కయ్యానికి దిగింది. అమెరికా వెన్నుదన్నుతో ఐక్యరాజ్యసమితి చేత తాను ఆక్రమించు కున్న ప్రాంతాన్ని 1947లో ఒక దేశంగా ప్రకటింపజేసుకొంది. ఆ జాతే యూదు జాతి. వారిదేశమే ‘ఇజ్రాయెల్’. ఇక ఆతిథ్యం ఇచ్చి మోసపోయిన అరబ్ ప్రజలు మాత్రం ‘పాలస్తీనా’ పేరుతో ఉన్న అతి చిన్న ప్రాంతానికి పరిమితమై అనేక అగచాట్లు పడుతూ ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతున్నారు. మానవాళిని పట్టి పీడిస్తున్న యుద్ధాలు మానవత్వాన్ని మట్టుపెడుతున్నాయి. జంతు దశ నుంచి నాగరికత కలిగిన ఆధునిక మానవునిగా ఎదిగిన మాన వుడు తాను అభివృద్ధి చేసుకున్న ఆయుధాలు, శాస్త్త్ర విజ్ఞానంతో తన అభివృద్ధిని తానే నాశనం చేసుకొంటున్నాడు. ఇందుకు తాజా ఉదాహరణ ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య చెలరేగిన ప్రస్తుత యుద్ధం. ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా వంటి అగ్రరాజ్య హస్తం ఉండడం మామూలయ్యింది. ఇజ్రాయెల్‌ను మొదటి నుంచీ అమెరికా అన్ని విధాలా వెనకేసుకొస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను భౌగోళికంగా గుర్తించకుండా కేవలం ఇజ్రాయెల్‌ను మాత్రమే ఒక దేశంగా గుర్తిస్తూ 1948లో ఐక్యరాజ్య సమితితో ప్రకటన చేయించటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇజ్రాయెల్‌తో పాటుగా పాలస్తీనాను కూడా భౌగోళికంగా గుర్తించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదు. వారి నిర్లక్ష్య ఫలితమే నేడు ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్ రిపబ్లిక్ అయిన తర్వాత పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించటం అనంతరం పాల స్తీనా ఓడిపోవటం జరిగింది. అయితే అప్పటినుంచీ పాలస్తీనా ప్రజల్లో అసంతృప్తి, ఆవేశం, అస్థిరత గూడు కట్టుకోవడం క్రమంగా పెరిగింది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా పాలస్తీనా తిరుగుబాటు దారులు ఇజ్రాయెల్‌పై దాడిచేసి హింసకు పాల్పడుతున్నారు. అందులో భాగమే ఇటీవల వందలాది రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తించిన ఘటనను చూడాలి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు మద్దతుగా ఐదు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగాయి. కాని, ఇజ్రా యెల్ అరబ్ దేశాలపై విజయం సాధించింది. ఐక్యరాజ్య సమితి పాల స్తీనా సమస్యను ప్రపంచ శాంతి భద్రతల సమస్యగా పరిగణించి పరిష్కరించకపోవటం చారిత్రక తప్పిదంగా చెప్పుకోవాలి. తమ సొంత భూభాగంలోనే ఒక మూల పరాయి వాళ్లుగా జీవించవలసి రావడం, గాజాను దాటాలంటే ఇజ్రాయెల్ ఆధికారుల అనుమతి తీసుకోవలసి ఉండడం, తనిఖీల పేరుతో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం ఇబ్బంది పెట్టడం, తమ ఆంక్షలను ధిక్కరిస్తే అమాన వీయంగా చంపివేయడం, ఇళ్లను కూల్చడం వంటి అనేక అంశాలు స్వతంత్ర పాలస్తీనా కోరికను మరింత బలపడేలా చేసింది. గాజాలోని ‘‘అల్ అఖ్సా’’ మసీదులోకి వెళ్ళాలంటే కూడా ఇజ్రాయెల్ పోలీసుల అనుమతి తీసుకొని రావాల్సి ఉండటం పాలస్తీనియన్లకు అత్యంత బాధ కల్గిస్తున్న విషయం. ఈ క్రమంలోనే ‘పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్’, ‘పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’, ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్’ వంటి సంస్థలు ఆవిర్భవించాయి. యాసర్ అరాఫత్ నేతృత్వంలో (1969–2004) ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య 1993, 1995లలో శాంతి ఒప్పందాలు కుదిరాయి. దీంతో 1994లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఇత్జాక్ రాబిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి షిమన్ పెరెస్, పాలస్తీనా విమోచనా సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్లకు నోబెల్ శాంతి బహుమతి సంయుక్తంగా లభించింది. అయితే 1995లో రాబిన్ హత్యకు గురయ్యాడు. అనంతరం జరిగిన పరిణామాల్లో 2004లో యాసర్ అరాఫత్ అనుమానాస్పదంగా మరణించాడు. ఫలితంగా సమస్య మళ్ళీ మొదటి కొచ్చింది. రెండు వైపులా రైట్ వింగ్‌కు చెందిన వారు సమస్యను ప్రస్తుత స్థితికి సాగదీస్తూ వచ్చారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యను రెండు ప్రాంతాల మధ్య మత ఘర్షణలుగా చూడడం సరికాదు. పాలస్తీనియన్లు భౌగోళికమైన ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంగా మాత్రమే పరిగ ణించాలి. ‘భద్రతలను కలిగి ఉండటం వలన వ్యక్తిలో ఉద్భవించే మానసిక ప్రశాంతతయే స్వేచ్చ’ అంటాడు అమెరికన్ రాజకీయవేత్త మాంటెస్క్యూ. ఇక్కడ పాలస్తీనీయన్లు అభద్రతాభావానికి గురైన సందర్భంలోంచి వచ్చినదే నేటి ‘హమాస్’ సంస్థ. ‘ఆరు భద్రతా మండలి తీర్మానాల’నూ, 1993 పాలస్తీనాతో జరిగిన ‘‘ఓస్లో’’ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. పైగా ఐక్యరాజ్యసమితి లోని వీటో అధికారం కల్గిన దేశాల మద్దతుతో తరచుగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను ఉగ్రవాదం పేరుతో వేధించటం, చంపటం, పాల స్తీనా భూభాగాన్ని ఆక్రమించటం చేసింది. పాలస్తీనాతో ఘర్షణ తలెత్తిన దాదాపు ప్రతిసారీ ఎంతో కొంత వారి భూభాగాన్ని ఆక్రమించడం పనిగా పెట్టుకొంది ఇజ్రాయెల్ ఆ విధంగా ఇజ్రాయెల్ తన భూభాగాన్ని విస్తరిస్తూపోయి పాలస్తీనా ప్రజలను కొన్ని మైళ్ల భూభాగానికి పరిమితం చేసింది. అందుకే పాలస్తీనియన్లలో ఇజ్రా యెల్ అంటే విపరీతమైన ద్వేషం! ఆ ద్వేషం మరోసారి ప్రకోపించి ఇజ్రాయెల్‌పై తాజా దాడికి దారితీసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజ మిన్ నెత న్యాహూ ఈ సందర్భాన్ని అచ్చమైన రాజకీయ నాయకునిగా తనకు అనుకూలంగా మలచుకొంటున్నాడని విశ్లేషకుల మాట. తనపై ప్రజలలో పెరుగుతున్న అసమ్మతిని పాలస్తీనియన్లపై భీకర యుద్ధం చేయడం ద్వారా తగ్గించి, వారిని మళ్ళీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వారి అభిప్రాయం. యుద్ధం ఎవరి వైపు నుండి మొద లైనా నష్టపోయేది సాధారణ పౌరులే, సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు, ఇతర భవనాలూ పేకమేడల్లా కూలుతున్న దృశ్యాలూ, శిథిల భవనాల్లోంచి వినిపిస్తున్న చిన్న పిల్లల, మహిళల, వృద్ధుల హాహాకారాలూ మనసును చలింపజేసే విధంగా ఉన్నాయి. ప్రపంచ శాంతి కోసం పుట్టుకొచ్చిన ఐక్యరాజ్య సమితి కోరలు లేని సింహం అయినందు వల్లనే ఇవాళ ప్రపంచంలో అనేక చోట్ల అశాంతి, అభద్రతలు రాజ్యమేలుతున్నాయి, ఒక్క ఇజ్రాయెల్ – పాలస్తీనా ప్రాంతమే కాదు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, చైనా – వియత్నాం సమస్య, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, చైనా – అమె రికా, ఉత్తర కొరియా – అమెరికాల మధ్య కొనసాగుతున్న వివా దాలూ, అలాగే భారత్ – చైనా సరిహద్దు వివాదం, భారత్ – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ‘కశ్మీర్’ సరిహద్దు వివాదం... వంటివన్నీ ఐక్య రాజ్యసమితి నిష్క్రియాపరత్వం, బలహీనతల కారణంగా భవిష్య త్తులో ఏదో ఒకరోజు అగ్ని పర్వతం బద్దలైనట్లుగా హింసకు దారి తీసేవే అనేది విశ్లేషకుల అంచనా. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలపై జరిగిన దాడి తర్వాత అమెరికా ‘అల్ ఖైదా’ ఉగ్రవాదు లపై యుద్ధం పేరుతో ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడం పైకి చూడడానికి బాగానే ఉన్నా ఈ పని చేయవలసింది ఐక్యరాజ్యసమితి. కానీ అమెరికా ఆర్థిక సహాయంపై అధికంగా ఆధారపడి ఉన్న ఐరాస నోరు మెదపకుండా ఉండిపోయింది. అలాగే ఇరాక్ ప్రమాదకర జీవ రసాయన ఆయుధాలు తయారు చేసిందని దానిపై దాడిచేసి పాలకుడైన సద్దాం హుస్సేన్‌ను ఉరితీయించడం వంటి దుశ్చర్యలు సూపర్ పవర్‌గా ఎదిగిన దేశం తన ఇష్టం వచ్చినట్లు చిన్న దేశా లపైనా, ప్రజా ఉద్యమాలపైనా ఉక్కుపాదం మోపిందని చెప్పడానికి ఉదాహరణ. ఐక్యరాజ్య సమితి బలంగా ఉంటే ఇటువంటి సంఘ టనలు చోటు చేసుకునేవేనా? ఇక ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్య దగ్గరకు వస్తే... దీన్ని అత్యంత పాధాన్యం గల అంతర్జాతీయ సమస్యగా అన్ని దేశాలూ పరిగణించాలి. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే ఐక్యరాజ్య సమితి కొంత వరకూ పాలస్తీనియన్లకు అండగా నిలిచే అవకాశం ఉంది. పది సంవత్సరాల పాలస్తీనా బాలిక నేలమట్టమైన ఇంటి ముందు నిలబడి ‘నేను ఏం పాపం చేశాను? ఏం తప్పు చేశాను? నా వాళ్ళందరూ ఇజ్రాయెల్ సైన్యం దాడిలో చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి’ అని ప్రపంచాన్ని ప్రశ్నించింది. దీనికి ఎవరు, ఏమని సమా ధానం చెబుతారు ఆ చిట్టి తల్లికి? డా‘‘ మహ్మద్ హసన్ వ్యాసకర్త నల్గొండ ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకుడు -
ఇజ్రాయెల్-హమాస్ ముఖాముఖి పోరు
గాజా: ఇన్నాళ్లూ పరస్పరం వైమానిక దాడులకు, రాకెట్ దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్ సైనికులు, హామస్ మిలిటెంట్లు తొలిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. గాజా భూభాగంలో ఇరుపక్షాల మధ్య ముఖాముఖి పోరు సాగిందని హమాస్ సైనిక విభాగం అల్–ఖసమ్ బ్రిగేడ్స్ ఆదివారం వెల్లడించింది. ఈ నెల 7న యుద్ధం మొదలైన తర్వాత భూభాగంపైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రత్యక్షంగా ఘర్షణ జరగడం ఇదే మొదటిసారి. తమ భూభాగంలోకి దూసుకొచి్చన ఇజ్రాయెల్ మిలటరీకి చెందిన రెండు బుల్డోజర్లను, ఒక యుద్ధ ట్యాంక్‌ను ధ్వంసం చేశామని హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. తమ ఎదురుదాడిని తట్టుకోలేక ఇజ్రాయెల్ సైన్యం వాహనాలు వదిలేసి కాలినడకన వారి సరిహద్దు వైపు పలాయనం చిత్తగించిందని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్–ఖసమ్ బ్రిగేడ్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఖాన్ యూనిస్ సిటీలో ఇజ్రాయెల్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని తెలియజేసింది. అల్–ఖసమ్ బ్రిగేడ్స్ ప్రకటనపై ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందించింది. దక్షిణ గాజాలో సెక్యూరిటీ ఫెన్స్ వద్ద విధి నిర్వహణలో ఉన్న తమ బలగాలపై స్వల్పంగా కాల్పులు జరిగాయని స్పష్టంచేసింది. కాల్పులు జరిపిన మిలిటెంట్లపై తమ యుద్ధ ట్యాంకు నుంచి ప్రతిదాడి చేశామని పేర్కొంది. దాంతో వారంతా చెల్లాచెదురు అయ్యారని వెల్లడించింది. గాజా భూభాగంలో తమ సేనలు మకాం వేసిన మాట వాస్తవమేనని ఇజ్రాయెల్ మరోసారి అంగీకరించింది. ఈ నెల 13న కూడా ఇదే మాట చెప్పింది. కానీ, హమాస్‌తో ముఖాముఖి ఘర్షణ జరిగినట్లు వెల్లడించడం మాత్రం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ప్రముఖ నేత ముహమ్మద్ కటామాష్ హతమయ్యాడు. -
చిన్నారులే సమిధలు.. గాజాలో ప్రతి 15 నిమిషాలకు..
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపువారే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనియన్ స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని తెలియజేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాలో 3,400 మందికిపైగా జనం మరణించారు. వీరిలో 1,000 మందికిపైగా బాలలు ఉన్నట్లు అంచనా. అంటే ప్రతి ముగ్గురు మృతుల్లో ఒకరు చిన్నపిల్లలే కావడం గమనార్హం. గాజాలో అచ్చంగా నరమేధమే సాగుతోందని డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్–పాలస్తీనా(డీసీఐపీ) అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం తక్కువ. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1,400 మంది మృతిచెందగా, వీరిలో 14 మంది బాలలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ► గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించింది. ఆహారం, నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు చెబుతున్నా అవి చాలామందికి అందడం లేదు. ► తగినంత ఆహారం, నీరు లేక గాజాలో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. పారిశుధ్య వసతులు లేకపోవడంతో డయేరియా వంటి వ్యాధులు ప్రబులుతున్నాయని పేర్కొంటున్నారు. ► యుద్ధం కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక అధికారులు చెప్పారు. అకారణంగా భయపడడం, రోదించడం వంటివి చేస్తున్నారని తెలియజేశారు. ► రణక్షేత్రంలో దాడులు, ప్రతిదాడులు చూస్తూ పెరిగిన పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరుగుతుందని, భవిష్యత్తులో వారు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. ► యుద్ధాల సమయంలో బాలలకు హక్కులుంటాయి. వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇరుపక్షాలకూ ఉంటుంది. ► చిన్నారుల ప్రాణాలను రక్షించాలంటూ 1949లో జెనీవాలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని 1951లో ఇజ్రాయెల్ ఆమోదించింది. -
Israel-Hamas war: హమాస్‌పై ముప్పేట దాడి
రఫా(గాజా్రస్టిప్)/జెరూసలేం/న్యూఢిల్లీ/టెల్ అవీవ్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇజ్రాయెల్ భీకర యుద్ధం ప్రారంభించింది. ఇప్పటిదాకా గాజాలో వైమానిక దాడులు నిర్వహించగా, ఇక సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్ స్థావరాలపైనా దృష్టి పెట్టింది. గాజాతోపాటు సిరియాలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుపై క్షిపణులు ప్రయోగించింది. శనివారం రాత్రి మొదలైన ఈ దాడుల ఆదివారం కూడా కొనసాగాయి. మూడు ప్రాంతాల్లోని టార్గెట్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్ మసీదును హమాస్ మిలిటెంట్లు అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నారని, అందుకే ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సిరియా ఎయిర్‌పోర్టులపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. రన్వేలు దెబ్బతిన్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దళాలు సైతం ప్రతిదాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైన్యం సన్నద్ధతపై నెతన్యాహూ సమీక్ష ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఇప్పటివరకు గాజాలో 4,385 మంది జనం మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించారు. గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ శనివారం రాత్రి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో సైన్యం సన్నద్ధతపై ఈ భేటీలో సమీక్ష సమాచారం. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో వేలాదిగా ఇజ్రాయెల్ సైనికులు మోహరించారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే 7 లక్షల మంది జనం దక్షిణ గాజాకు వెళ్లిపోయినట్లు అంచనా. అనూహ్య స్థాయిలో ‘తదుపరి దాడి’ గాజాపై జరుగుతున్న వైమానిక దాడులు ‘యుద్ధంలో తదుపరి దశ’కు రంగం సిద్ధం చేయడానికేనని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు. తదుపరి దాడి అనూహ్య స్థాయిలో ఉంటుందని అన్నారు. తమ పదాతి దళాలు గాజా భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీలుగా సానుకూల పరిస్థితులు సృష్టించడానికి వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడే తదుపరి దశ యుద్ధంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని అన్నారు. హమాస్‌ను అంతం చేయడానికి గాజాలో అడుగుపెడతామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవీ చెప్పారు. మిలిటెంట్ల సన్నద్ధతను తక్కువ అంచనా వేయొద్దని తమ సైన్యానికి సూచించారు. ఆయన తాజాగా ఇజ్రాయెల్ సైనికాధికారుతో సమావేశయ్యారు. గాజాలో ప్రవేశించిన తర్వాత ఊహించని పరిణామాలకు సైతం సిద్ధంగా ఉండాలని అన్నారు. కిక్కిరిసిన జనాభాతో గాజా స్ట్రిప్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. శత్రువులు మన కోసం అక్కడ ఎన్నో యుద్ధ రీతులను సిద్ధం చేసి పెట్టారని, మన ప్రతిస్పందన అత్యంత చురుగ్గా, వేగంగా ఉండాలని సూచించారు. ఇజ్రాయెల్ తాజా హెచ్చరిక గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణం గాజాకు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. అలా వెళ్లనివారిని హమాస్ మిలిటెంట్ల సానుభూతిపరులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే మొబైల్ ఫోన్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు చేరవేశారు. ‘‘ఉత్తర గాజాలో మీకు ముప్పు పొంచి ఉంది. దక్షిణ గాజాకు వెళ్లకుండా ఉత్తర గాజాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నవారిని హమాస్ సానుభూతిపరులుగా పరిగణిస్తాం’’ అని అందులో పేర్కొన్నారు. పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం గాజాలోని పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. 6.5 టన్నుల ఔషధాలు, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని పంపించింది. ఔషధాలు, సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానం ఆదివారం భారత్ నుంచి నుంచి బయలుదేరింది. ఇది ఈజిప్టులోని ఎల్–అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. మానవతా సాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో గాజాకు చేరవేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అత్యవసర ప్రాణ రక్షక ఔషధాలు, సర్జికల్ సామగ్రి, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్టు, శానిటరీ వస్తువులు, నీటి శుద్ధి మాత్రలు తదితర సామగ్రిని గాజాకు పంపించినట్లు తెలియజేశారు. పాలస్తీనియన్లకు మరింత సాయం పంపిస్తామని వెల్లడించారు. గాజాలో సామన్య ప్రజల మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొమమ్మద్కు అబ్బాస్‌కు ఫోన్ చేసి, సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు నుంచి గాజాకు రెండో షిప్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడులతో అల్లాడిపోతున్న గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం ఇప్పుడిప్పుడే చేరుతోంది. నిత్యావసరాలు, ఇతర సహాయక సామగ్రితో కూడిన 17 వాహనాలు ఆదివారం ఈజిప్టు నుంచి గాజాలో అడుగుపెట్టాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో షిప్మెంట్. శనివారం 20 వాహనాలు ఈజిప్టు నుంచి గాజాకు చేరుకున్నాయి. -
చేరువ కానివ్వని విరోధం!
ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితులమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు వారి వారి కరడుగట్టిన సమూహాలు వారిని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. ఇంకా అధ్వాన్నమైన సంగతి ఏమిటంటే... వారి స్నేహితులు, మిత్ర పక్షాలు.. వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. ఇజ్రాయెల్–పాలస్తీనా వ్యవహారాలు నాకు ఏ విధంగానూ అంతుబట్టనివి. నిజానికి ఆ రెండు దేశాల మధ్య వివాదం గురించి నాకు తెలిసిన రవ్వంత కూడా నేను ఈ రెండు మూడు వారాలుగా తెలుసుకుంటూ వచ్చినదే. అయితే ఆ తెలివిడి నాకు ప్రశ్నలు అడిగేందుకు సరిపోయేదే తప్ప, జవాబులు ఇవ్వగలిగేటంతటిది కాదు. అయినప్పటికీ ఆ మాత్రపు జ్ఞానం నాలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచి దానిని నేను పూర్తిగా విశ్వసించేలా క్రమంగా నాలో నమ్మకాన్ని పెంచుతూ వచ్చింది. ఈ ఉదయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నది ఇదే. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితు లమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. అయితే బాధ కంటే కూడా గర్వమే తరచూ ఆ ప్రభామండలం చుట్టూతా కాంతిలా ప్రకాశిస్తూ కనిపిస్తోంది. చరిత్రపై తమ దృష్టికోణమే నరైనదనే నమ్మకంతో, ఎవరికివారు స్వీయ నైతిక వర్తనను కలిగి ఉన్నామన్న విశ్వాసాన్ని సమానంగా కలిగి ఉన్నారు. వారు వర్తమానాన్ని ఎలా చూస్తున్నారన్న విషయంలోనూ ఇదే నిజం. ‘అవతలి’ దేశం తమ పట్ల ఘోరమైన తప్పిదాలకు ఒడిగట్టిందని ఆ రెండు దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అయితే వారు అంగీకరించలేని విషయం ఏమిటంటే... శత్రువు పట్ల తాము వ్యవహరిస్తున్న తీరులో ఇద్దరూ కూడా సరి సమానంగా దోషులేనన్నది! తమకేదైతే జరిగిందో సరిగ్గా అదే తమ ప్రత్యర్థికీ జరిగిందని వారు అంగీకరించరు, అంగీకరించబోరు. ఆ విధమైన ‘సమాన త్వాన్నే’ వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. అందుకే చాలా తక్కువ మినహాయింపులతో – వాస్తవానికి మీరు వాటిని బహుశా చేతి వేళ్లపైన కూడా లెక్కించవచ్చు – ఇంటర్వ్యూలన్నీ భయానకమైన ఏకపక్ష ధోరణితో ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రశ్న వేసినా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆహ్వానిత పాలస్తీనీయుడు ఆ ప్రశ్నకు జవాబుగా ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తూ తామెంత ధర్మ బద్ధులో, రుజు ప్రవర్తన కలిగినవారో చెప్పుకుంటారు. ఒక ఇజ్రాయె లీని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కచ్చితంగా ఇదే విధమైన స్వీయ సమర్థన వైఖరి వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ! ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభంపై పద్నాలుగు రోజులలో పది ఇంటర్వ్యూల తర్వాత... ఈ రెండు వర్గాల వారు ఒకే భూమిపై – నిస్సందేహంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూనే, గాయాల రక్తం ఓడుతూనే – కలిసి ఉంటూ కూడా భిన్న ప్రపంచాలలో జీవిస్తున్నారని నేను గ్రహించాను. పర్యవసానంగా తమ భిన్న చరిత్రల నుంచి మాత్రమే కాకుండా తాము పంచుకున్న చరిత్రల నుంచి కూడా వారు అంగీకరించిన కఠిన సత్యాలతో వారికొక జగమొండి ప్రాపంచిక దృష్టి కోణం ఏర్పడింది. తర్వాత అది వర్తమానంలోని విరుద్ధ కోణాలతో బలోపేతం అయింది. వాస్తవాలు ఒకేలా ఉన్నప్పటికీ వాటి అర్థ, వివరణలు పూర్తిగా భిన్నమైనవి. విచారకరమైన వాస్తవం ఏంటంటే – ఈ రెండు దేశాల స్నేహి తులు, మిత్రపక్షాలు దేనికి దానిని విడిగా చూడటం అనే ఏక వైఖరి దృష్టి కోణానికి లోబడి ఉండటం. ‘ఏంటిది?!’ అని పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌ను ఏమాత్రం నిలదీయకుండా భూత వర్తమానాలపై ఆ దేశపు దృష్టి కోణాన్ని అంగీకరిస్తుండగా, మధ్యప్రాచ్యంలోని అరబ్, ముస్లిం దేశాలు పాలస్తీనా పట్ల తమ తమ అవగాహనలపై ఒకే విధమైన నిబద్ధతతో నిలబడి ఉన్నాయి. పర్యవసానంగా మీరు ఎవరికి మద్ధతు ఇస్తున్నారనేది మీరెలాంటి ఆలోచనను కలిగివున్నారన్న దానిని మాత్రమే కాక, జరుగుతున్న పరిణామాల పట్ల మీ స్పందనను కూడా నిర్ధారణగా తెలియజేస్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ తోక పశ్చిమ కుక్కను ఊపుతుంది, అదే సమయంలో పాలస్తీనా తోక మధ్యప్రాచ్య కుక్కల్ని గుర్రుమని చూసేలా, మొరిగేలా ప్రేరేపించి వాటిని రెచ్చగొడుతుంది. బహుశా అందుకే పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాదం నేడు మనం ఎదుర్కొంటున్న వాటన్నింటిలోనూ కొంచెమైనా కొరుకుడు పడని అత్యంత కఠినమైన పరిస్థితిగా పరిణమించింది. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు కూడా వారి వారి కరడుగట్టిన సమూహాలు ఆ సంశయా త్మక ప్రారంభ ఉద్దేశాన్ని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. బహుశా అధ్వాన్నమైన విషయం ఏమిటంటే వారి స్నేహితులు, మిత్ర పక్షాలు... వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. శత్రుత్వ విరమణ కోసం, స్వల్పకాలిక అర్భక ఒప్పందాల కోసమైతేనే నెడతాయి. కానీ ఏదైనా – అసలు స్వరూపాలకు భిన్నంగా నిజాయితీతో అడుగు వేసినప్పుడు మాత్రమే సాధ్యం అయ్యే – దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రం నెట్టవు. అందుకే నేను చేసిన గత రెండు వారాల ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా ఉన్నాయి తప్పితే, ఆశాజనకంగా ఏమీ లేవు. పైగా నిస్పృహను కలిగించేలా ఉన్నాయి. నిజానికి, చెరగని విధంగా వారు వేసిన ముద్రే ఇక ఎటువంటి ఆశల్నీ పెట్టుకోలేని మనఃస్థితికి కారణం అయింది. ఇజ్రాయెల్–పాలస్తీనా ఊబిని బాగు చేయడం, ఆ సమస్యను పరిష్క రించడం అసాధ్యంలా కనిపిస్తోంది. నా భయం ఏంటంటే అనంతంగా అది నిరంతరం సాగిపోతూనే ఉంటుందని! రేపన్నది మిగతా ప్రపంచానికి మరొక రోజు కావచ్చు కానీ ఇజ్రాయెల్–పాలస్తీనాలకు మార్పును వాగ్దానం చేయని రోజూ ఉండే ఒక రోజే! కాబట్టి మనం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆలోచించండి. భీకరమైన హమాస్ దాడి ఇజ్రాయెల్ ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేసి,ఆ దాడిని తిప్పి కొట్టాలన్న ఆగ్రహ జ్వాలల్ని రగిల్చినందువల్ల – సాధ్యమైతే – ఏకంగా హమాస్‌ను తుడిచిపెట్టాలన్న ఇజ్రాయెల్ ప్రతీకారం వల్ల తీవ్రమైన మనోవేదన, ఎంతకూ తరగని బాధ మాత్రమే మిగిలి అనివార్యంగా అది భవిష్యత్తులో అధ్వాన్న పరిస్థితికి పునాదులు వేస్తుంది. ఇది దేనిని సూచిస్తోంది? అత్యంత విచార కరమైన, శోచనీయమైన ముగింపు ఏమిటంటే ఈ అంతులేని కథలో మరొక విషాద అధ్యాయానికి పునాది పడబోతుండటం! భవిష్యత్తు ప్రతిసారీ కూడా తిరిగి మనల్ని గతంలోకే తీసుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మీరు ఆ ప్రాంతాన్ని తక్షణమే వీడండి.: ఇజ్రాయెల్ మరోసారి హెచ్చరికలు
జెరూసలేం: ఉత్తర గాజాపై మరోసారి భూతల దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తర గాజా, దక్షిణ గాజాలపై వైమానికి దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. దాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమైంది. ఉత్తర గాజాలో ఉన్న వాళ్లంతా తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాల్సిందేనని హెచ్చరించింది ఇజ్రాయెల్, . ఒకవేళ ఎవరైనా ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాకు వెళ్లకుంటే వారిని ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని సంకేతాలు పంపింది ఇజ్రాయెల్. హమాస్‌ను అంతంమొందించాలనే లక్ష్యంతో ఉన్న ఇజ్రాయెల్.. వారికి స్థావరంగా ఉన్న ఉత్తర గాజాపై ఫోకస్ పెట్టింది. ఒకవైపు దక్షిణా గాజాపై కూడా దాడులు చేస్తూనే, ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించడానికి కారణాలు మాత్రం అంతుపట్టడంలేదు. కొన్ని రోజుల క్రితం ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి వారంతా దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మళ్లీ ఇప్పుడు ఉత్తర గాజాలో ఎవరైనా ఉన్నట్లైతే వెంటనే దక్షిణ గాజాకు తక్షణమే వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. చదవండి: ఇద్దరు అమెరికన్లను విడుదల చేసిన హమాస్.. త్వరలోని మరికొంతమంది! ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఇక, ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ గాజా గజగజలాడుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో, అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి వారంతా దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మరోవైపు.. ఐరాస, అంతర్జాతీయ సంస్థల వారం రోజుల పై చిలుకు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గాజాకు సహాయ సామగ్రి అందించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత గాజా ‘తలుపులు’ తెరుచుకున్నాయి. ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న పాలస్తీనా ప్రజల కోసం.. రఫా బార్డర్ పాయింట్‌ను ఈజిప్టు ఓపెన్ చేసింది. దీంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బోర్డర్ దాటాయి. పలు ట్రక్కులు గాజాలోకి ఎంటర్ అవుతున్న వీడియోలను ఈజిప్ట్ ప్రభుత్వం టీవీ ప్రసారం చేసింది. కానీ, 20 ట్రక్కులను మాత్రమే అనుమతించారు. 20 trucks when the Gaza Strip usually receives several hundred per day isn’t something you should be applauding UN officials say at least 100 trucks a day are required Israel has denied the entrance of fuel & restricted all aid stay in the south You should be condemning this — ℅ Her Gourdliness ♙ (@MichelleSuiter) October 22, 2023 ఇక, గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ రూట్ నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు. దీంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు.. రఫా బార్డర్ వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో ట్రక్కులు వచ్చేందుకు ఇజ్రాయెల్ ఓకే చెప్పింది. గాజా ప్రజలకు సాయం పంపిణీకి సంబంధించి రఫా బార్డర్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పరిశీలించారు. ‘ఇవి కేవలం ట్రక్కులు మాత్రమే కాదు.. గాజా ప్రజల లైఫ్‌లైన్. గాజాలోని ఎంతో మంది ప్రజల చావు – బతుకుల మధ్య వ్యత్యాసమే ఆ ట్రక్కులు’ అని ఆయన చెప్పారు. Gaza Receives First Aid Trucks Since Hamas Attack as Egypt Border Opens Briefly 🙏 pic.twitter.com/QA8fBJsaSm — 3 STOCKS A DAY (@3Stocksaday) October 21, 2023 ట్రక్కుల్లోని సామగ్రిని చిన్న చిన్న మోటార్లపై తరలిస్తున్నారు. వందలాది ట్రక్కు లు సహాయ సామగ్రితో వారం రోజులకుపైగా ఈజిప్టు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నాయి. తినేందుకు, తాగేందుకు దిక్కులేక 23 లక్షల మంది గాజావాసులు అల్లాడుతున్నారు. ఉప్పు నీరు తాగి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు! గాజాలో పరిస్థితి ఘోర మానవీయ విపత్తు దిశగా సాగుతోందని ఐరాస ఆహార పథకం ఆందోళన వెలిబుచ్చింది. -
దద్దరిల్లుతున్న దక్షిణ గాజా
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ గాజా గజగజలాడుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించడం తెలిసిందే. దాంతో అంత మందీ నానా పాట్లు పడి అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అక్కడి ఖాన్ యూనిస్ నగరంతో పాటు పలు ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ క్షిపణులు వచ్చి పడుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. దాడుల్లో ఇప్పటికే కనీసం 4,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. 13 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు వివరించింది. ఇజ్రాయెల్‌లో ఇప్పటిదాకా 1,500 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు గాజాపై భూతల దాడికి అన్ని విధాలా ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. లెబనాన్ వైపు సరిహద్దుల్లో ఉన్న పెద్ద పట్టణాలను ఆగమేఘాల మీద ఖాళీ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్ ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దుల వెంబడి తన నగరాలు, ఆవాసాలను ఖాళీ చేయిస్తోంది. హమాస్‌కు నేరుగా దన్నుగా బరిలో దిగాలని లెబనీస్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లా నిర్ణయం తీసుకుందని ఇజ్రాయెల్ తాజాగా ఆరోపించింది. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. హెజ్బొల్లా ఇప్పటికే దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ ఏడో తేదీన మెరుపుదాడికి దిగిన సందర్భంగా బందీలుగా పట్టుకున్న వందలాది మందిలో ఇద్దరు అమెరికన్లను హమాస్ తాజాగా విడుదల చేసింది. జుడిత్ రానన్, ఆమె 17 ఏళ్ల కూతురు నటాలీ హమాస్ చెర నుంచి బయటపడ్డట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. కీలక భేటీ యుద్ధాన్ని ఆపే మార్గాంతరాలపై డజనుకు పైగా ప్రాంతీయ, పాశ్చాత్య దేశాలకు అధినేతలు, నేతలు, ఉన్నతాధికారులతో ఈజిప్ట్ శనివారం సమావేశం నిర్వహించింది. యుద్ధానికి తెర వేయడం, వీలుకాని పక్షంలో కనీసం కాల్పుల విరమణకైనా ఇరు వర్గాలను ఒప్పించే మార్గాంతరాలపై నేతలు చర్చించారు. ఇందులో ఇటలీ, పెయిన్, గ్రీస్, కెనడా ప్రధాన మంత్రులతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు పాల్గొన్నట్టు ఈజిప్ట్ ప్రభుత్వం పేర్కొంది. ఖతర్, యూఏఈ తదితర దేశాల ఉన్నత స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. మరోవైపు, ఇరాక్ నుంచి తక్షణం అమెరికా బలగాలు పూర్తిగా వైదొలగాలని ఇరాన్ దన్నున్న స్థానిక మిలిటెంట్ సంస్థలు హెచ్చరించాయి. థన్‌బర్గ్ ట్వీట్‌కు దీటుగా బదులిచి్చన ఇజ్రాయెల్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ చేసిన ట్వీ ట్‌కు ఇజ్రాయెల్ గట్టి సమాధానం ఇచి్చంది. యు ద్ధంపై పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ చేసిన ట్వీట్‌కు ఇజ్రాయెల్ దీటుగా బదులిచి్చంది. గాజాకు మద్దతుగా కొందరు వ్యక్తులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న చిత్రాన్ని థన్‌బర్గ్ ట్వీట్‌చేశారు. ‘పాలస్తీనా, గాజాకు మద్దతిస్తున్నాం. పోరుపై ప్రప ంచం స్పందించాలి. పాలస్తీనా ప్రజలు, ఇతర బాధితుల కోసం కాల్పుల విరమణ ప్రకటించాలి. న్యా యం, స్వేచ్ఛ కోసం పిలుపు ఇవ్వాలి’ అని గ్రేటా ట్వీట్‌చేశారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘హమాస్ దాడుల వల్ల ఎంతోమంది అమాయకులై న ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధ బాధితుల్లో మీ స్నేహితులూ ఉండొచ్చు. వారి కోసం పోరాడండి’ అని వ్యాఖ్యానించింది. -
Israel-Hamas war: గాజాలో తీరని వ్యథ
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్/వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య అనూహ్యంగా మొదలైన యుద్ధం సాధారణ పాలస్తీనియన్ల ఉసురు తీస్తోంది. బతికి ఉన్నవారికి కడుపు నిండా అన్నం లేదు, కంటికి నిద్రలేదు. ఆకలి, అగచాట్లే మిగులుతున్నాయి. సేఫ్‌జోన్ అని భావించే దక్షిణ గాజాలో కూడా ఇప్పుడు భద్రత లేకుండాపోయింది. ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలతో ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస వెళ్లిన జనం మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నారు. దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతంగా కొనసాగుతుండడమే ఇందుకు కారణం. శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై విరుచుకుపడింది. క్షిపణుల వర్షం కురిపించింది. ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంలో నష్టం అధికంగా జరిగింది. హమాస్‌కు చెందిన 100కుపైగా టార్గెట్లపై దాడులు చేశామని, మిలిటెంట్ల సొరంగాలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం శుక్రవారం 14వ రోజుకు చేరింది. ఇరువైపులా ప్రాణ, ఆస్తి నష్టం పెరుగుతోంది. ఈ యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు 4,137 మంది మృతిచెందారని, 12,500 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ తెలియజేసింది. మరో 1,300 మంది ఇంకా శిథిలాల కిందే ఉన్నారని, వారు బతికి ఉన్నారో లేదో చెప్పలేమని వెల్లడించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ల అధీనంలో 203 మంది బందీలు ఉన్నట్లు గుర్తించామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. గాజాలో సేఫ్ జోన్లు లేవు తమ లక్ష్యం కేవలం హమాస్ మిలిటెంట్లు మాత్రమేనని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ గ్రూప్‌ను నిర్మూలించిన తర్వాత సాధారణ ప్రజలను తమ నియంత్రణలోకి తీసుకురావాలన్న ఉద్దేశం ఏదీ లేదని అన్నారు. గాజాలో ఇప్పుడు సేఫ్ జోన్లు అంటూ ఏవీ లేవని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిర్ దినార్ చెప్పారు. గాజా అంతటా మిలిటెంట్ల స్థావరాలు, సొరంగాలు ఉన్నాయని, వాటిపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు దక్షిణ గాజాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయని, జనజీవనం స్తంభించిపోతోందని, ఉత్తర గాజా నుంచి వచి్చనవారు వెనక్కి మళ్లుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అధికార ప్రతినిధి రవీనా శామ్దాసానీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల కారణంగా క్షతగాత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గాజాలోని ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. పరిమితంగా ఉన్న ఔషధాలు ఏ మూలకూ చాలడం లేదు. హాస్పిటళ్లలో కరెంటు లేకపోవడంతో డాక్టర్లు మొబైల్ ఫోన్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఈజిప్టు నుంచి ఔషధాలు, నిత్యావసరాలు దిగుమతి చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నామని గాజా అధికారులు చెప్పారు. క్షిపణులు, డ్రోన్లను కూలి్చవేసిన అమెరికా సైన్యం మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద సంస్థలు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తున్నాయి. గురువారం ఇజ్రాయెల్ దిశగా దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను ఉత్తర ఎర్ర సముద్రంలోని తమ యుద్ధనౌక యూఎస్ఎస్ కార్నీ కూల్చివేసిందని అమెరికా సైన్యం వెల్లడించింది. యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాద శక్తులు ఈ ఆయుధాలను ప్రయోగించాయని ఆరోపించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా నుంచి జరిగిన తొలి ప్రతిదాడి ఇదే కావడం గమనార్హం. హమాస్ అగ్రనేత హసన్ యూసఫ్ అరెస్టు హమాస్ మిలిటెంట్ సంస్థ అధికార ప్రతినిధి హసన్ యూసఫ్‌ను గురువారం వెస్ట్‌బ్యాంక్‌లో అరెస్టు చేసినట్లు ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో నిర్వహించిన దాడుల్లో హమాస్‌కు చెందిన 60 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేసింది. హమాస్ కోసం హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై హసన్ యూసఫ్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. హసన్ యూసఫ్ పాలస్తీనాలో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం హవ ూస్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. వెస్ట్‌బ్యాంక్ చట్టసభలో సభ్యుడుగా వ్యవహరిస్తున్నాడు. హసన్ యూసఫ్ గతంలో 24 ఏళ్లు జైల్లో ఉన్నాడు. అంతర్జాతీయ మీడియాలో హమాస్ ప్రతినిధిగా ప్రముఖంగా కనిపించేవాడు. ఇజ్రాయెలీలకు వీసా లేకుండా అమెరికా యానం ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం చాలారోజులు కొనసాగే అవకాశం ఉండడంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ప్రజల కోసం వీసా రద్దు పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఇజ్రాయెలీలు వీసాకు దరఖాస్తు చేసుకోకుండానే అమెరికాకు చేరుకొని, 90 రోజులపాటు ఇక్కడ నివసించవచ్చు. ఈ పథకం గురువారం నుంచే అమల్లోకి వచి్చందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. డ్రగ్స్ మత్తులో ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ల దాడి! హమాస్ మిలిటెంట్లు ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. వారు ఆ సమయంలో మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నారని ‘ద జెరూసలేం పోస్టు’ పత్రిక వెల్లడించింది. కాప్టాగాన్ అనే డ్రగ్స్ మాత్రలు తీసుకున్నారని, ఒళ్లు తెలియని స్థితిలో రెచి్చపోయారని, సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఎదురుదాడిలో పలువురు మిలిటెంట్లు మరణించారు. మృతదేహాలను సోదా చేయగా కాప్టాగాన్ డ్రగ్స్ మాత్రలు లభించాయని ఆ పత్రిక వివరించింది. హమాస్ నాయకత్వమే మిలిటెంట్లకు ఈ మాత్రలు ఇచి్చనట్లు తెలిపింది. కాప్టాగాన్ను పేదల కొకైన్‌గా పిలుస్తుంటారు. అన్నం దొరకని సందర్భాల్లో ఆకలి వేయకుండా, మత్తులో మునిగి ధైర్యం పొందడం కోసం కాప్టాగాన్ తీసుకుంటూ ఉంటారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ విజయం అమెరికాకు రక్ష: బైడెన్ ప్రత్యర్థులతో ప్రస్తుతం సాగిస్తున్న యుద్ధాల్లో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దేశాలు విజయం సాధించాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ల విజయం అమెరికా జాతీయ భద్రతకు చాలా కీలకమని అన్నారు. ఆయన గురువారం రాత్రి శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసు నుంచి అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. సైనిక సాయం కింద ఇజ్రాయెల్, ఉక్రెయిన్తోపాటు తైవాన్‌కు బిలియన్ల డాలర్లు ఇవ్వాలని, అందుకోసం మనం సిద్ధం కావాలని సూచించారు. నిధుల మంజూరు కోసం కాంగ్రెస్‌ను విజ్ఞప్తి చేశానని, రాబోయే ఏడాది వ్యవధిలో 100 బిలియన్ డాలర్లు కావాలని చెప్పారు. ఇదొక తెలివైన పెట్టుబడి అవుతుందని, దీనివల్ల అమెరికాలో భవిష్యత్తు తరాలకు భద్రమైన జీవితం లభిస్తుందని, అదే మనకు లభించే సత్ఫలితమని స్పష్టం చేశారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు కావాలి: సౌదీ యువరాజు 1967 నాటి సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. శుక్రవారం జీసీసీ, ఆసియాన్ ఉమ్మడి శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. గాజాలో హింసాకాండ, అమాయక ప్రజల మరణంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ పౌరులపై దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. -
చేతులు కాలకముందే...
ఆగ్రహం ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు. కానీ సంయమనం మరిచి ఆగ్రహకారకుల్ని నిర్మూలించాలనుకోవటం ఉన్మాదమవుతుంది. చివరికది స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది. ఈ విషయంలో అమెరికాకు చాలా అనుభవం ఉంది. అందుకే కావొచ్చు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన సలహా ఎంతో విలువైనది. ఆగ్రహాగ్నిని సకాలంలో చల్లార్చుకోనట్టయితే అది మిమ్మల్నే దహిస్తుందని చెప్పటమే కాదు... ఉగ్రదాడి తర్వాత అమెరికా తీసుకున్న చర్యలు ఎలా పరిణమించాయో గుర్తు చేశారు. ఈనెల 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా వందలమందిని హతమార్చటాన్ని ఎవరూ సమర్థించలేదు. అదే సమయంలో దాడి కార కులపై అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చర్య తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరారు. మిలిటెంట్లు రెచ్చిపోయి నప్పుడో, దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడో ఇజ్రాయెల్ అతిగా వ్యవహరించి పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీస్తుండటం దశాబ్దాలుగా రివాజైంది. వెస్ట్‌బ్యాంక్, గాజా, లెబనాన్‌లపై అపాచే హెలి కాప్టర్లు, ఎఫ్–16 యుద్ధ విమానాలతో క్షిపణుల వర్షం కురిపిస్తూ ఆసుపత్రులు, స్కూళ్లు, జనావా సాలు నేలమట్టం చేసిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ఇలాంటి సమయాల్లో క్షతగాత్రుల్ని ఆదుకోవ టానికీ, ఇతరత్రా సాయం అందించటానికీ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కూడా అనుమతులు లభించవు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. మందులు, ఆహారపదార్థాలు అందించ టానికి ఈజిప్టువైపునున్న సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు రెండురోజులుగా నిలిచిపోయాయి. మరోపక్క ఇజ్రాయెల్ భీకర దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒక ఆసుపత్రిపై జరిగిన రాకెట్ దాడిలో 500 మంది చనిపోయారు. ఇప్పటికే దాదాపు అయిదువేల మంది పాలస్తీనా పౌరులు చనిపోగా, పదివేలమంది గాయాలపాలయ్యారు. హమాస్ ప్రయోగించిన రాకెట్ గురి తప్పి ఆసుపత్రిపై పడిందని ఇజ్రాయెల్, అది ఇజ్రాయెల్ దళాల పనేనని హమాస్ అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ హితవచనం కీలకమైనది. కానీ ఆసుపత్రిపై జరిగిన దాడి విషయంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకు రావటం సరైందేనా? యుద్ధమంటూ మొదలయ్యాక కారకులు ఎవరో వెంటనే గుర్తించలేకపోవటం సర్వసాధారణం. కనీసం ఆ సంగతి తేలేవరకూ కూడా ఆగకుండా ఇజ్రాయెల్ వాదనను సమర్థించటం న్యాయమేనా? వేలాదిమంది క్షతగాత్రులకు వైద్య సాయం నిలువరించి, పదిలక్షల మందిని ఆకలిదప్పుల్లో ఉంచటం సమస్యను చక్కదిద్దగలదని ఆయన విశ్వసిస్తున్నారా? ఈ విషయంలో ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టాల్సిన అవసరం లేదా? హమాస్ చెరలో బందీలుగా వున్న 200 మందినీ విడుదల చేసేవరకూ గాజాకు ఏ రకమైన మానవతా సాయం అందనీయబోమని నెతన్యాహూ చేసిన ప్రతిన ఏ నాగరిక ప్రమాణాలతో చూసినా నిర సించదగ్గది. ఇజ్రాయెల్ రక్షణకు కావాల్సిన ‘అసాధారణ ప్యాకేజీ’ కోసం అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతి పాదిస్తానని చెబుతున్న బైడెన్‌కు సాధారణ ప్రజానీకం గోడు పట్టిన దాఖలాలు లేవు. 2001లో అమె రికాపై ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలతో తమకు న్యాయం దక్కిందని, ఆ క్రమంలో తప్పులు కూడా జరిగాయని ఆయన అంగీకరించటం మంచిదే. ఆనాడు ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధానికి సెనెటర్‌గా ఆయన కూడా మద్దతునిచ్చారు. అది ఇరాక్ వినాశనానికే కాక, అమెరికా ఆర్థిక పతనానికి సైతం కారణమైంది. ఈ చేదు అనుభవాలను బైడెన్ పరోక్షంగా ప్రస్తావించటంకాక కుండబద్దలు కొట్టినట్టు చెప్పివుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అక్షరాలా ఉగ్రరూపం దాల్చింది. గతంలో కేవలం ఒకే ఒక సైనికుడి కోసం వేయిమంది పాలస్తీనా పౌరులను విడిచిపెట్టిన ఆ దేశం... హమాస్ చెరలో 200 మంది ఇజ్రాయెల్ పౌరులుండగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో బందీగా ఉన్న యువతి షెమ్ వీడియో తెలియజేస్తోంది. బాంబుల మోతలతో తాము చావుబతుకుల్లో బిక్కుబిక్కుమంటూ వున్నామని, తమను రక్షించటానికి పూనుకోవాలని ఆమె వేడుకుంటోంది. వాస్తవానికి ఇంకా సైన్యం భూతల దాడులకు దిగ లేదు. అది మొదలైతే ఇంకెన్ని వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో అనూహ్యం. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 6 వేల మంది పాలస్తీనా పౌరుల విడుదల, భూతల దాడుల ప్రయత్నాలకు స్వస్తి హమాస్ డిమాండ్లు. పాలస్తీనాలో శాంతి స్థాపన ఇజ్రాయెల్, హమాస్లకు లేదా పశ్చిమాసియాకు మాత్రమే కాదు... అమెరికాకు కూడా అత్యవసరం. ఇజ్రాయెల్ తన మతిమాలిన చర్యల ద్వారా ఇప్పటికే సంక్షోభాన్ని మరింత పెంచింది. ఇజ్రాయెల్‌కు అండగా ఉన్నట్టు కనబడకపోతే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఇంటిదారి పట్టాల్సివస్తుందని బైడెన్ భయపడుతూ ఉండొచ్చు. కానీ ఆ పని చేస్తే అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు పీటముడి వేయాలన్న అమెరికా లక్ష్యం గల్లంతవుతుంది. గాజా ఆసుపత్రిపై మారణకాండ తర్వాత ఆ ఛాయలు కనబడుతూనే వున్నాయి. సౌదీ అరేబియా–ఇజ్రాయెల్ మైత్రికి సంబంధించిన యత్నాలు కొన్ని వారాల క్రితమే ఫలించగా, అవి కాస్తా నిలిచి పోయాయి. ఇరాన్‌తోనూ ఒప్పందం కుదర్చాలని అమెరికా తహతహలాడింది. దానికి కూడా గండి పడింది. బైడెన్‌తో జరగాల్సిన సమావేశాన్ని పాలస్తీనా నాయకుడు మహమ్మద్ అబ్బాస్ రద్దు చేసుకున్నారు. జోర్డాన్, ఈజిప్టు దేశాల్లో బైడెన్ రెండో దశ పర్యటన వాయిదా పడింది. భూతల దాడులు మొదలైతే అరబ్ దేశాల్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుని, ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది. దాన్ని నివారించటమే అమెరికాకైనా, మరొక దేశానికైనా అంతిమ లక్ష్యం కావాలి. -
‘గాజాలోని భారతీయుల తరలింపు.. ప్రస్తుతం కష్టమే’
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం బుధవారం 13వ రోజుకు చేరింది. ఇరు వర్గాల పోరులో మరణించిన వారి సంఖ్య అయిదు వేలకు చేరువైంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 3,478 మంది పాలస్తీనియన్లు మరణించారని, 12,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. మరో 4,562 మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది బందీలు ఇప్పటికీ హమాస్ ఆధీనంలోనే ఉన్నారు. తరలింపు కష్టం తాజాగా గాజాలోని భారతీయుల తరలింపుపై విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ స్పందించింది. గాజాలో నలుగురు భారతీయులు ఉన్నారని, ప్రస్తుతం వారిని తరలించే పరిస్థితి లేదని ఏఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. గాజాలో పరిస్థితి కారణంగా పౌరుల తరలింపు కష్టంగా మారిందని.. అయితే అవకాశం దొరికితే వారిని స్వదేశానికి తీసుకొస్తామని చెప్పారు. నలుగురిలో ఒకరు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొన్నారు. భారతీయులెవరూ మరణించలేదు గాజాలో పౌరుల మరణాలు, మానవతా పరిస్థితులపై భారత్ ఆందోళన చెందుతోందని అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన.. ఇజ్రాయెల్- గాజా పోరులో ఇప్పటి వరకు ఏ ఒక్క భారతీయుడు ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు.కే రళకు చెందిన ఓ మహిళా కేర్‌టేకర్, తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా గాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలిపారు. చదవండి: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్ నేరుగా చర్చించాలి ‘ఆపరేషన్ అజయ్’ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయిదు విమానాల్లో1,200 మందిని ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు తరలించినట్లు బాగ్చీ వెల్లడించారు. వీరిలో 18 మంది నేపాలీ పౌరులు కూడా ఉన్నారు. 2002-23 మధ్యకాలంలో పాలస్తీనాకు భారత్ దాదాపు 30 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాలస్తీనాపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుందన్నారు. ఈ సమస్యపై పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోందని చెప్పారు. దారుణంగా గాజా పరిస్థితి హమాస్ మిలిటెంట్లు, వారి కార్యకాలపాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడులతో గాజా ప్రాంతంలో పరిస్థితులు ఆధ్వానంగా మారాయి. ఆహారం, నీరు, కరెంట్ కోతలతో పాలస్తీనియన్లు అల్లాడుతున్నారు. వేలాది నిరాశ్రయులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఆదేశాలతో లక్షలాది మంది ఉత్తర గాజా నుంచి తరలివెళ్తున్నారు. -
ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతు: రిషి సునాక్
టెల్ అవివ్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ గురువారం యుద్ధ ప్రభావిత ప్రాంతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన రిషి సునాక్‌కు.. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. హమాస్లా కాకుండా తమ పౌరులకు ఏ హానీ జరగకుండా ఇజ్రాయెల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తమకు తెలుసన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు నెతన్యాహుకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులే కాక పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. To have a child taken from you is a parent’s worst nightmare. This morning I heard from families going through this unbearable agony. Working with our partners, we’re determined to secure the release of the hostages taken by Hamas terrorists. pic.twitter.com/F7AV021o9x— Rishi Sunak (@RishiSunak) October 19, 2023 మానవతా సహాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. అన్నింటికంటే మించి ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యను ఎదుర్కొంటుందని, యునైటెడ్ కింగ్డమ్, తాను ఆ దేశానికి అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు British PM Rishi Sunak arrives in Tel Aviv, Israel, according to Reuters. (Photo source: Reuters) pic.twitter.com/V2plUYLe2p — ANI (@ANI) October 19, 2023 కాగా పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. మరింత ప్రాంతాలకు వ్యాపించకుండా యుద్ధంవెంటనే ఆపాలని ప్రపంచ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమై యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హమాస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరులో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే నేడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ యుద్ధ భూమిలో అడుగుపెట్టారు. -
సాధారణ పరిస్థితులు నెలకొనేనా?
అక్టోబర్ 7 నాటి హమాస్ వరుస రాకెట్ దాడులను ఇజ్రాయెల్ తనదైన ‘9/11’గా అభివర్ణిస్తోంది. ఇరాన్, లెబనాన్ కూడా ఘర్షణ కేంద్రాలుగా మారితే వివాదం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పాలస్తీనా సమస్యను అరబ్ రాజ్యాలతో సహా అన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. ఇప్పుడు ఇదే ప్రాంతీయ, ప్రపంచ రాజకీయాలకు కేంద్రం అవుతుంది. సరిగ్గా హమాస్ సాధించాలనుకున్నది ఇదే. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల స్థాపన చర్చలను నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఇజ్రాయెల్, దాని నౌకాశ్రయం హైఫాను కలుపుకొని ప్రకటించిన ‘ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరోప్ ఎకనామిక్ కారిడార్’ సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. 2007 నుండి గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, అక్టోబర్ 7న, ఇజ్రాయెల్‌పై వరుస రాకెట్ దాడులను ప్రారంభించింది. ఆపై ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దులో కమాండో దాడులతో, ఇజ్రాయెల్ పౌరులను, విదేశీయులను విచక్షణారహితంగా చంపడమే కాకుండా, ఇజ్రాయెల్ పౌరులను, అనేక మంది ఇజ్రాయెల్ రక్షణ సిబ్బందిని అపహరించుకుపోయింది. సరిహద్దు సమీపంలో సంగీత ఉత్సవాన్ని ఆస్వాదిస్తున్న 250 మంది యువ ఇజ్రాయెలీలను, విదేశీయులను విచక్షణారహితంగా చంపివేశారు. ఈ హమాస్ దాడిని ఇజ్రాయెల్ తనదైన ‘9/11’గా అభివర్ణిస్తోంది. ఇతర ఇజ్రాయెలీలు అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో హోలోకాస్ట్ అని పిలుస్తున్న మారణకాండలో లక్షలాదిమంది యూదులను హిట్లర్ పాలనలోని జర్మనీలో గ్యాస్ ఛాంబర్లకు పంపిన తరహాలో మళ్లీ యూదులను అత్యంత దారుణంగా లక్ష్యంగా చేసుకున్న హత్యాకాండగా అభివర్ణించారు. మనం ఇప్పుడు 20 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు నివసించే గాజా స్ట్రిప్‌లో ఒక పెద్ద మానవ విషాదం అంచున ఉన్నాము. గాజా ఉత్తర భాగంలో నివసించే ప్రజలను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి స్ట్రిప్ దక్షిణ భాగం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరించాయి. అయితే, ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఫిరంగి బాంబు దాడులు కొనసాగుతున్నందున, దక్షిణం వైపునకు వెళ్లడానికి కూడా సురక్షితమైన మార్గాలు లేవు. ఈజిప్ట్‌కు వెళ్లే ఏకైక నిష్క్రమణ స్థానం రఫాహ్ చెక్‌పాయింట్ ద్వారా వెళుతుంది. దాన్ని కూడా మూసి వేశారు. ఈజిప్ట్ కోరుకునే చివరి విషయం వేలాది పాలస్తీనియన్ల వలసే. ఇజ్రాయెల్ దిగ్బంధనం వల్ల అత్యవసరంగా కావలసిన ఆహారం, నీరు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇవన్నీ ఇజ్రాయెల్ ద్వారానే వస్తాయి. ఇప్పటికీ పనిచేస్తున్న ఆసుపత్రులు, క్లినిక్‌లలో వైద్య సామగ్రి అయిపోయింది. అమెరికా జోక్యం నీటి సరఫరా పునఃప్రారంభానికి దారితీసింది కానీ ఇది దక్షిణ గాజాకు మాత్రమే. గాజాలో పాలస్తీనియన్ల ఈ సామూహిక శిక్ష, హమాస్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే అవకాశం లేదు. దాని నాయకులు కొందరు ఇప్పటికే ఒమన్ లో ఆశ్రయం పొందారు. మరికొందరు ఇరాన్ లేదా లెబనాన్ కు పారిపోయి ఉండవచ్చు. లెబనాన్ లోని ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మల్లే, ఇరాన్ హమాస్‌కు మద్దతు ఇస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడిలో పలువురు బందీలు మరణించినట్లు హమాస్ ఇప్పటికే ప్రకటించింది. ప్రపంచ స్థాయి నిఘా, సైనిక సామర్థ్యాలు ఉన్నప్పటికీ దాడిని నిరోధించలేకపోయిన బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయె లీలకు ఆగ్రహం ఉంది. అకస్మాత్తుగా, అనేకమంది ఊహించినట్లుగా ఇజ్రాయెల్ అభేద్యంగానూ, సురక్షితంగానూ కనిపించడం లేదు. ప్రణాళికాబద్ధమైన దాడి నెతన్యాహు వైఫల్యాల నుండి దృష్టిని మళ్లించి, ప్రజలు ద్వేషిస్తున్న శత్రువుకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసే రాజకీయ ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడుతుంది. 1967 నుండి 2005 వరకు దక్షిణ గాజాలోని తన ఆవాసాలను ఖాళీ చేసి పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (పీఎన్ఏ)కి పగ్గాలు అప్పగించి నట్లుగానే, ఇప్పుడు సైతం గాజాను ఆక్రమించడానికి ఇజ్రాయెల్ విముఖత చూపవచ్చు. కానీ 2007లో హమాస్ గాజా బాధ్యతలు స్వీకరించింది. అప్పటి నుండి పీఎన్ఏకి ఎటువంటి పాత్రా లేదు. గాజా దాని మధ్యధరా తీరంపై ఇజ్రాయెల్ గగనతల నియంత్రణను కొనసాగించింది. గాయపడిన, శత్రు జనాభాతో నిండివున్న గాజాను తాత్కాలికంగా తిరిగి ఆక్రమించడం కూడా ఇజ్రాయెల్ భద్రతను ఎలా మెరుగుపరుస్తుందో చెప్పడం కష్టం. ఇజ్రాయెల్, కీలకమైన అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించే ధోరణి ఇప్పుడు సవాలును ఎదుర్కొంటోంది. ఇజ్రా యెల్‌తో దౌత్య సంబంధాల స్థాపన, రాయబార కార్యాలయాల మార్పిడికి దారి తీస్తుందని భావిస్తున్న కీలకమైన చర్చలను నిలిపి వేస్తున్నట్లు సౌదీ అరేబియా ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఇజ్రాయెల్, దాని నౌకాశ్రయం హైఫాను కలుపుకొని ప్రకటించిన ‘ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరోప్ ఎకనామిక్ కారిడార్’ ఇప్పుడు సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు అమాయక పాలస్తీనియన్లను చంపడం, తీవ్రంగా గాయపర్చడం అనేది ఇప్పటికే అరబ్ వీధుల్లో ఆందోళన కలిగిస్తోంది. పైగా ఇజ్రాయెల్‌తో సామీప్యతను ప్రదర్శించడం ద్వారా అరబ్ పాలకులు తమ భద్రతకు హాని కలగాలని కోరుకోవడం లేదు. అమెరికా, యూరప్‌లోని గణనీయమైన అరబ్ డయాస్పోరాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మరియు ముస్లిమే తర ప్రజలలో కూడా ఆగ్రహావేశాలతో కూడిన ప్రదర్శనలు జరిగాయి. పాలస్తీనా సమస్యను అరబ్ రాజ్యాలతో సహా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టేశాయి. ఇప్పుడు ఇదే ప్రాంతీయ, ప్రపంచ రాజకీయాలకు కేంద్రం అవుతుంది. సరిగ్గా హమాస్ సాధించాలనుకున్నది ఇదే. శాంతి, శ్రేయస్సుతో కూడిన యుగానికి దారి తీస్తూ, ఇజ్రాయెల్‌ను పశ్చిమాసియా రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురాగల... అమెరికా మద్దతు కలిగిన ప్రాంతీయ ఒడంబడిక వైపు మొగ్గు చూపడం అనేది ఇప్పుడు సమాధి అయిపోయింది. ఇంకా చెప్పాలంటే పాలస్తీనా సమస్య ప్రస్తుతం స్తంభించిపోయింది. ఇది రివర్స్ కావచ్చు కూడా. ఇరాన్, లెబనాన్ కూడా ఘర్షణ కేంద్రాలుగా మారితే వివాదం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. విస్తృత స్థాయి యుద్ధంగా మారితే మహా విపత్తు అవుతుంది. పౌరుల లక్ష్యాలపై హమాస్ ప్రారంభించిన భయంకరమైన ఉగ్రదాడుల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు సంఘీ భావం తెలిపారు. అది అప్పుడు సముచితమే. కానీ తదుపరి పరిణా మాలకు ఒక కారకం అవసరం. గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై జరిగిన దాడిలో పాలస్తీనా పౌరులకు జరిగిన తీవ్ర నష్టాన్ని కూడా అంగీకరించాలి. వారి హక్కులు ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నంత ముఖ్య మైనవి, బలమైనవి కూడా. మన పశ్చిమ పొరుగు ప్రాంతంలో పరిస్థితి భౌగోళికంగా, రాజకీయపరంగా ప్రమాదభరితంగా మారితే భారతదేశం కూడా నష్టపోతుంది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే అంచనాతో ఇప్పటికే చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నివసి స్తున్న, పని చేస్తున్న దాదాపు 80 లక్షలమంది భారతీయుల సంక్షేమం కూడా ప్రమాదంలో పడుతుంది. ఇటీవలి కాలంలో, ఈ ప్రాంతంలో నిర్బంధం, సయోధ్య పట్ల సాధారణ ధోరణిని ఉపయోగించుకున్న భారతదేశం అరబ్ దేశాలతో, ఇజ్రాయెల్‌తో ఏకకాలంలో బలమైన భాగస్వామ్యాలను కొనసాగించగలిగింది. ఐ2యూ2 (ఇండియా– ఇజ్రాయెల్, యూఏఈ–యూఎస్) భాగస్వామ్యం ఆ ధోరణి కొన సాగుతుందనే అంచనాపై ఆధారపడి ఉంది. ఈ ఊహను పునః పరిశీలించవలసి ఉంటుంది. మనం ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మాత్రమే కాకుండా పశ్చిమాసియాలో సంభవించే పెను మంటతో కూడా పోరాడవలసి ఉంది. వచ్చే ఏడాది అమెరికాలోనూ, మన దేశంలోనూ ఎన్నికలు జరగనుండగా, పెద్ద ఎత్తున రాజకీయ పరివర్తనలు కూడా జరుగు తున్నాయి. అనిశ్చితి, అనూహ్యత అపూర్వమైన స్థాయికి చేరు కున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం విజయవంతమైన ప్రకాశాన్ని, వాస్తవికత తాలూకు తాజా మోతాదుతో తగ్గించా ల్సిన అవసరం ఉంది. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో
Indian Super Women In Israel: ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ దాడి చేసి (అక్టోబర్ 7) 11 రోజులు గడిచాయి. ఇంకా భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతీ రోజు పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళ మహిళల సూపర్ విమెన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం (అక్టోబర్ 17) సోషల్ మీడియాలో వీరికి సంబంధంచి ఒక వీడియోను ఎక్స్( ట్విటర్) లో పోస్ట్ చేసింది. హమాస్ దాడిలో మహిళలు తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను కూడా కాపాడారు దీనికి సంబంధించి వీడియోను షేర్ చేసింది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మహిళలు అక్కడ కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. హమాస్ ఉగ్రదాడిలో చాలా ధైర్యసాహసాలను ప్రదర్శించి వృద్ధురాలిని ప్రాణాలను కాపాడిన వైనం విశేషంగా నిలుస్తోంది. ఈ మహిళల ప్రయత్నాలను, సంకల్పాన్ని అభినందిస్తూ ఇజ్రాయెల్ ఎంబసీ "ఇండియన్ సూపర్ వుమెన్" అంటూ ొక వీడియోను పోస్ట్ చేసింది. డోర్ హ్యాండిల్‌ను పట్టుకుని హమాస్ టెర్రరిస్ట్‌లు లోనికి రాకుండా అడ్డుకున్న భయానక స్థితిని ఈ వీడియోలో ఒకరు వివరించారు. బుల్లెట్ గుర్తులతో ఉన్న తలుపులు, గోడలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సాహస వనితల పేర్లు సబిత,మీరా మోహనన్ కాల్పుల మోత మోగినా నుంచి వెనక్కి తగ్గలే..! ఏఎల్‌ఎస్‌తో బాధ పడుతున్న రాచెల్ అనే వృద్ధురాలికి కేర్ టేకర్స్‌గా మీరాతో పాటు గత మూడేళ్లుగా పనిచేస్తున్నామనీ సబిత చెప్పారు. నైట్ డ్యూటీలో ఉండగా ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సైరన్ మోతలు వినిపించాయి. బయలు దేరబోతుండగానే పరిస్థితి మరింత ముదిరిందని ఆమె పేర్కొన్నారు. అసలు ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో రాచెల్ కుమార్తె ఫోన్ చేసి తలుపులన్నీ లాక్ చేసుకోమని ఆమె చెప్పారు. నేలపై మరింత పట్టు సాధించడానికి చెప్పులు కూడా తీసేసి అలా భయంతో ఉన్నాం. మరి కొద్ది నిమిషాల్లో, ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి కాల్పులు మొదలు పెట్టారు. అద్దాలు పగలగొట్టేశారు. మళ్ళీ కూతురికి ఫోన్ చేసి ఏం చేద్దాం అని అడిగాం. డోర్ పట్టుకుని అలాగే ఉండమని చెప్పడంతో అలాగే నాలుగైదు గంటలు అక్కడే వారిని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించామంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అసలు బయట ఏమి జరుగుతుందో అర్థం కావడంలేదు. మధ్యాహ్నం 1 గంటకు, వారికి మళ్లీ షాట్లు వినిపించాయి. అయితే ఈ సారి ఇజ్రాయెల్ సైన్యం వచ్చిందని ఇంటి యజమాని ష్ములిక్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని సబిత వెల్లడించారు. క్షిపణులు పడతాయని తెలుసు కానీ ఉగ్రదాడి జరుగుతుదని అస్సలు ఊహించలేదన్నారు. మీరా పాస్‌పోర్ట్, ఎమర్జెన్సీ బ్యాగ్ అన్నీ వాళ్లు పట్టుకు పోయారని, ఇపుడు తమ వద్ద ఏమీ లేవని చెప్పారు. ఇదిలావుండగా, గాజాలోని ఒక ఆసుపత్రిలో మంగళవారం జరిగిన పేలుడులో కనీసం 500 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ప్రకటిచింది. भारतीय वीरांगनाएं ! 🇮🇳🇮🇱 मूलतः केरला की रहने वाली सबिता जी, जो अभी इजराइल में सेवारत हैं, बता रही हैं कि कैसे इन्होने और मीरा मोहन जी ने मिलकर इसरायली नागरिकों कि जान बचाई। हमास आतंकवादी हमले के दौरान इन वीरांगनाओं ने सेफ हाउस के दरवाजे को खुलने ही नहीं दिया क्योंकि आतंकवादी… pic.twitter.com/3vu9ba4q0d — Israel in India (@IsraelinIndia) October 17, 2023 -
బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన.. షాకిచ్చిన మూడు దేశాలు
అమ్మాన్: గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు.. యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం పర్యటించనున్నారు. #WATCH | Joint Base Andrews, Maryland: US President Joe Biden departs for Israel. (Source: Reuters) pic.twitter.com/lp2A0PHErf — ANI (@ANI) October 17, 2023 గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో బైడెన్ చర్చలు జరుపనున్నారు. గాజాకు సాయం అందించేందుకు ఓ ప్రణాళికను రూపొదించేందుకు ఇజ్రాయెల్, అమెరికా మధ్య అంగీకారం కుదిరినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. జో బైడెన్‌కు జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా దేశాలు షాక్ ఇచ్చాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వస్తున్న బైడెన్‌తో తాము భేటీ అయ్యేది లేదని వెల్లడించాయి. అయితే, గాజా యుద్ధాన్ని ఆపే లక్ష్యంతో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లతో తమ దేశ రాజధాని అమ్మాన్ వేదికగా బుధవారం సదస్సును నిర్వహించాలని జోర్డాన్ భావించింది. ఈ సమావేశానికి హాజరవుతానని బైడెన్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. Arab Leaders' Meeting With Biden Cancelled Over Gaza Hospital Attack Jordan's Foreign Minister Ayman Safadi announced that Biden's summit in Amman scheduled to take place on Wednesday with Jordan's King Abdullah, Egypt's President Abdel Fattah El-Sissi and Palestinian Authority pic.twitter.com/Y0oob96eDd — BBC NEWS RSVK (@Raavivamsi49218) October 18, 2023 మంగళవారం అర్ధరాత్రి గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో వందలాది మంది రోగులు చనిపోవడంతో.. జోర్డాన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించిన జోర్డాన్ రాజు అబ్దుల్లా ఈ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ సమాచారాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. ఇక, జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాది కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టర్కీలోని నాటో కార్యాలయం దగ్గర కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గాజాకు సాయం అందించాలని ప్రజలు టర్కీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Jordanian protesters raise their shoes in the capital Amman, refusing to accept US President Joe Biden. pic.twitter.com/cOwsgHbzrh — Iran Observer (@IranObserver0) October 17, 2023 People are now attacking the US embassy in Lebanon. Thanks Joe Biden. pic.twitter.com/VwvDUbGG1E — Gunther Eagleman™ (@GuntherEagleman) October 17, 2023 -
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం వేళ.. జో బైడెన్ కీలక నిర్ణయం
పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ ఉగ్రవాదులను అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో 3 లక్షలకు పైగా సైనికులను, భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. హమాస్, ఇజ్రాయెల్ భీకర పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌లో జో బైడెన్ బుధవారం పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. గాజాకు సాయం అందించేందుకు ఓ ప్రణాళికను రూపొదించేందుకు ఇజ్రాయెల్, అమెరికా మధ్య అంగీకారం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. అరబ్ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్‌కు బ్లింకెన్ తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోపాటు అధికారులతో దాదాపు ఎనిమిది గంటలపాటు సమవేశామయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మాట్లాడుతూ జో బైడెన్ పర్యటన విషయాన్ని వెల్లడించారు. హమాస్‌తోపాటు ఇతర ఉగ్రవాదుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నిరోధించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తెలిపారు. ఇజ్రాయెల్‌లో పర్యటించే విషయాన్ని బైడెన్ స్వయంగా ఎక్స్(ట్విటర్)లో వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు బుధవారం ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మనవతా సాయం అందించే విషయంపై జోర్దాన్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడి నాయకులను కలిసి పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికారం కోసం హమాస్ నిలబడదనే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు. On Wednesday, I'll travel to Israel to stand in solidarity in the face of Hamas's brutal terrorist attack. I'll then travel to Jordan to address dire humanitarian needs, meet with leaders, and make clear that Hamas does not stand for Palestinians' right to self-determination. — President Biden (@POTUS) October 17, 2023 తమ ప్రజలను రక్షించడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైన విషయాలపై బైడెన్ వెళ్లి చర్చిస్తారని.. వాటిని తీర్చేందుకు తాము పనిచేస్తూనే ఉంటామని బ్లింకెన్ పేర్కొన్నారు. హమాస్ ఆధిపత్యంలోని గాజా భూభాగంపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. గాజా స్ట్రిప్‌కు విదేశీ సహాయాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయడంపై యునైటెడ్ స్టేట్స్కు ఇజ్రాయెల్ హామీ ఇచ్చిందని తెలిపారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మంగళవారం పదకొండవ రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు. కాగా హమాస్ ఉగ్రవాదుల చెరలో 199 మంది ఇజ్రాయెల్ దేశ పౌరులు బందీలుగా ఉన్నారు. -
మోహరించిన ఇజ్రాయెల్ సేనలు
జెరూసలేం/గాజా స్ట్రిప్/రఫా: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్ల అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. పదాతి దళాలు పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. 3 లక్షలకుపైగా ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు గాజా సరిహద్దుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం సోమవారం పదో రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు. ఇప్పటిదాకా 6 లక్షల మందికిపైగా జనం వెళ్లిపోయినట్లు అంచనా. ఇజ్రాయెల్‌కు సాయంగా మిత్రదేశం అమెరికా పంపించిన అత్యాధునిక యుద్ధవిమాన వాహక నౌకలు మధ్యదరా సముద్రంలో గాజా తీరంలో మోహరించాయి. గాజాను గుప్పిట్లో పెట్టుకొని తమ భద్రతకు ముప్పుగా పరిణమించిన హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపాల్లేకుండా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఇజ్రాయెల్ సైన్యం తేలి్చచెబుతోంది. గాజాలో ప్రజల కష్టాలకు తెరపడడం లేదు. ఆహారం, నీరు, ఇంధనం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాయపడిన వేలాది మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో వారి పరిస్థితి మరింత హృదయవిదారకంగా మారింది. చికిత్సలు ఆగిపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను భద్రపర్చడానికి ప్లాస్టిక్ బ్యాగ్‌లు కూడా లేవని వాపోతున్నారు. హమాస్ చేతిలో బందీలు 199 మంది గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో ప్రస్తుతం 199 మంది బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ సోమవారం వెల్లడించారు. దాదాపు 150 మంది బందీలు ఉన్నట్లు ఇప్పటిదాకా భావించామని, కానీ, 199 మంది ఉన్నట్లు తేలిందని చెప్పారు. బందీల్లో చాలామంది ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, బందీల్లో విదేశీయులు ఉన్నారో లేదో ఆయన బహిర్గతం చేయలేదు. వైమానిక దాడులు నిలిపివేస్తే బందీలు విడుదల గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీలను విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం తెలియజేసింది. కానీ, దీనిపై హమాస్ స్పందించలేదు. తమపై దాడులు ఆపడంతోపాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే, అందుకు బదులుగా తమ వద్దనున్న బందీలను విడుదల చేయాలన్న ఆలోచనలో హమాస్ ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో.... లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న యూ దులంతా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయా లని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లెబనాన్ సరిహద్దుల సమీపంలో 28 యూదు కాలనీలు ఉన్నాయి. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోనూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్ ప్రభుత్వ మద్దతున్న షియా తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా సభ్యుల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాల్లోని నిఘా కెమెరాలను హెజ్బొల్లా సభ్యులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. తమ కదలికలను ఇజ్రాయెల్ గుర్తించకుండా ఉండేందుకు వారు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య జరిగిన తాజా ఘర్షణలో ఒక ఇజ్రాయెల్ సైనికుడు, ఒక పౌరుడు మరణించారు. లెబనాన్‌లో ఒక జర్నలిస్టు సహా ముగ్గురు పౌరులు మృతిచెందారు. వచ్చేవారం ఇజ్రాయెల్‌కు జో బైడెన్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేవారం ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారని తెలిసింది. ఈ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్‌కు తిరిగివచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతోపాటు అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. గాజాపై ఆధిపత్యం పొరపాటే అవుతుంది: బైడెన్ ఇజ్రాయెల్ సేనలు గాజాలో సుదీర్ఘకాలంపాటు ఉండడం పెద్ద పొరపాటుగా పరిణమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. గాజాపై యుద్ధం వద్దంటూ ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సూచించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. గాజాలో పాలస్తీనియన్ల ఆధ్వర్యంలోనే పాలన కొనసాగాలని తాను ఆశిస్తున్నట్లు బైడెన్ తాజాగా స్పష్టం చేశారు. మొత్తం పాలస్తీనియన్లకు హమాస్ మిలిటెంట్లు ప్రతినిధులు కాదని తేల్చిచెప్పారు. గాజాను ఇజ్రాయెల్ ఎక్కువ కాలం అ«దీనంలో ఉంచుకుంటుందని తాను భావించడం లేదన్నారు. మమ్మల్ని పరీక్షించొద్దు: నెతన్యాహూ తమ దేశ ఉత్తర సరిహద్దుల్లో తమను పరీక్షించవద్దని ఇరాన్, హెజ్బొల్లా సంస్థను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఆయన సోమవారం ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో ప్రసంగించారు. హమాస్‌ను ఓడించడానికి ప్రపంచ దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘ఈ యుద్ధం మీ యుద్ధం’ అని అన్నారు. హమాస్ మిలిటెంట్లు నాజీ ముష్కరుల్లాంటివారేనని నెతన్యాహూ తేలి్చచెప్పారు. దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే: ఇరాన్ గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దురాక్రమణ సాగిస్తున్న ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రాంతంలో అందరూ సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దొల్లాహియాన్ స్పష్టం చేశారు. గాజాపై దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయని, ఇజ్రాయెల్‌కు గుణపాఠం తప్పదని తేలి్చచెప్పారు. గాజాలో సాధారణ పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను వెంటనే ఆపాలని అమెరికాకు ఇరాన్ సూచించింది. గాజాపై వైమానిక దాడులు ఆపకపోతే తాము ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బందీలను వెంటనే విడుదల చేయాలి: ఐరాస బందీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హితవు పలికారు. అలాగే గాజా స్ట్రిప్‌కు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని సోమవారం ఇజ్రాయెల్‌కు సూచించారు. ప్రపంచ దేశాల నుంచి పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా ఆంక్షలు తొలగించాలని, సరిహద్దులు తెరవాలని అన్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హర్షించదగ్గ పరిణామం కాదని చెప్పారు. ఈజిప్టు, జోర్డాన్, వెస్ట్‌బ్యాంకు నుంచి నిత్యావసరాలు పాలస్తీనియన్లకు అందేలా ఇజ్రాయెల్ చొరవ తీసుకోవాలని కోరారు. ఘర్షణ ఆగిపోవాలి: రిషి సునాక్ ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మరింత విస్తరించవద్దని కోరుకుంటున్నానని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఘర్షణ ఆగిపోవాలని, ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని, ఈ దిశగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి పని చేస్తానని వివరించారు. రిషి సునాక్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో లండన్‌లో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై వారితో చర్చించారు. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు రిషి సునాక్ సూచించారు. -
మానవత్వం మరిస్తే...
పది రోజులైంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ప్రాంత తీవ్రవాద గ్రూపు హమాస్ జరిపిన దాడి తాలూకు ప్రకంపనలు ఆగేలా లేవు. హమాస్‌ను తుదముట్టిస్తామంటూ గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడి అంతకంతకూ తీవ్రతరమవుతోంది. భూతల దాడులకు దిగడానికి సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే గాజాను ఈ యూదు దేశం అష్టదిగ్భంధనం చేయడంతో అక్కడి పాలెస్తీనియన్లకు తినడానికి తిండి కాదు కదా తాగడానికి నీళ్ళయినా లేని పరిస్థితి. ఆగని యుద్ధంలో ఇప్పటికి 2600 మందికి పైగా పాలస్తీనియన్లు, ఇరువైపులా కలిపి 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది వేల మందికి పైగా గాయపడ్డారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులనే తేడా లేకుండా, బాధితుల కనీసపాటి అవసరాలకు కూడా అక్కర లేకుండా అంతర్జాతీయ మానవతావాద చట్టానికి (ఐహెచ్ఎల్)కి నీళ్ళొది లేస్తున్న ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం చివరికి మానవ సంక్షోభంగా మారిపోయే సూచనలు న్నాయి. మానవతా దృక్పథం అవసరమనే అంతర్జాతీయ సమాజంలో ఇది ఆందోళన రేపుతోంది. పాలస్తీనా జనాభా 23 లక్షలైతే, 11 లక్షల మంది పైగా పౌరులు ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఇప్ప టికే ఉత్తర గాజా విడిచివెళ్ళారు. అంటే సగం మంది నిరాశ్రయులయ్యారు. గాజా నుంచి ఈజిప్టులోకి వెళ్ళేందుకు రాఫా మార్గం తెరిచేందుకు దౌత్య యత్నాలు జరుగుతుండడంతో మరింతమంది అటూ వెళ్ళవచ్చు. యుద్ధం సృష్టించిన ఈ బీభత్సంలో సొంత గడ్డ విడిచివెళ్ళాల్సిన దైన్యంలో పడిన వీరి జీవితకాలపు దుఃఖాన్ని ఎవరు తీర్చగలరు? ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే, ఇప్పటికే తిండి, నీళ్ళు, విద్యుత్తు, ఇంధనం లేక అల్లాడుతున్న ప్రాంతంపై అది అమానుష దాడి. హమాస్ మాటేమో కానీ, అన్నెం పున్నెం ఎరుగనివారు బలైపోతారు. ఐరాస ప్రతినిధి అన్నట్టు అది సామూహిక ఉరిశిక్ష వేయడమే! ‘ఆరుబయలు కారాగారం’గా పేరుబడ్డ గాజా ‘ఆరు బయలు శవాగారం’ అవుతుంది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడినీ, వందలమంది మరణానికి కారణమైన తీరునూ, అమాయకు లను బందీలుగా తీసుకెళ్ళిన వైనాన్నీ మానవతావాదులు ఎవరూ సమర్థించరు. కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నదేమిటి? ఆత్మరక్షణ ధోరణిని అతిక్రమించి, గాజాను తుడిచిపెట్టేయాలనీ, పాల స్తీనాను ఉనికిలో లేకుండా చేయాలనీ తెగబడుతున్న తీరును ఏమనాలి? ఒకప్పుడు సురక్షితంగా బతకడానికి తమకంటూ ఓ దేశం కావాలని మొదలైన యూదులు నాటి సువిశాల ఒట్టోమన్ సామ్రా జ్యంలో పాలస్తీనా ప్రావిన్స్‌లో భూములు కొనడంతో ఆరంభించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతర పరిణామాల్లో చివరకు పాలస్తీనా విభజనకూ, 1948లో స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటుకూ కారణమయ్యారు. ఆనాడు పాలస్తీనాకు యూదులు వలసొస్తే, ఈనాడు పాలస్తీనియన్లు వలస పోతున్న పరిస్థితి. రావణకాష్ఠంలా సాగుతున్న పాలస్తీనా అంశంలో ఇరుపక్షాల తప్పులూ కొల్లలు. ఇజ్రాయెల్ – పాలస్తీనా అంశాన్ని ముస్లిమ్ – యూదు సమస్యగా చిత్రీకరించి, అగ్నికి ఆజ్యం పోస్తున్న ఇరుపక్షాల దేశాలకూ చివరకు స్వప్రయోజనాలే కీలకం. పెదవులపై సానుభూతి, ఆయుధాలు అందించి యుద్ధాన్ని పెద్దది చేయడంతో పెరిగే మంటలు ప్రజలకు పనికిరావు. గాజా కేవలం 41 కి.మీ.ల పొడవాటి చిన్న భూభాగమే కావచ్చు. దాన్ని కైవసం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ ఆకాంక్ష నెరవేరడం సులభమేమీ కాదు. గతంలో 2009లో 15 రోజులు, 2014లో 19 రోజులు గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేయకపోలేదు. అన్నిటికీ యుద్ధం పరిష్కారమైతే అనేక సమస్యలు ఏనాడో పరిష్కరమయ్యేవి. పాలస్తీనియన్లలో 44 శాతం మంది 2006లో తీవ్రవాద హమాస్‌కు ఓటు వేసి తప్పు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. అన్నీ కోల్పోయి, భవితపై ఆశ లేని దుఃస్థితికి వచ్చారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోదామన్నా అభ్యంతరం చెబుతూ, అమాయకులైన వారినే హమాస్ అడ్డం పెట్టుకొంటున్న వార్తలు విచారకరం. ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధం తక్షణం ఆగేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాలి. బాధితులకు తక్షణ సాయం, శాంతిస్థాపన తక్షణ కర్తవ్యం కావాలి. దురదృష్టవశాత్తూ ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా చీలిపోయి మాట్లాడుతున్నాయి. అయితే, హమాస్ దాడితో వచ్చిన సానుభూతి క్షీణిస్తూ, విమర్శలు పెరగడాన్ని ఇజ్రాయెల్ సైతం గమనిస్తోంది. గాజాకు అత్యవసర సాయం అందేందుకు దోవ ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతెన్యాహూ అన్నట్టు తాజా వార్త. అలాగే, దాడులు ఆపేస్తే ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడిచిపెడతానందని ఇరాన్ మాట. హమాస్ నుంచి ఆ మేరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, యుద్ధాన్ని ఆపే అలాంటి కనీస ప్రయత్నాలు అత్యవసరం. మన సంగతికొస్తే, మునుపటితో పోలిస్తే భారత ఆర్థిక సౌభాగ్యానికీ, జాతీయ భద్రతకూ ఇటీవల అతి కీలకమైన మధ్యప్రాచ్యంపై దేశంలో అధికార, ప్రతిపక్షాలు దేశీయంగా హిందూ, ముస్లిమ్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం మానాలి. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని, క్రమం తప్పకుండా సమావేశమై, మారుతున్న పరిస్థితుల్నీ, మన దేశం అనుసరిస్తున్న వ్యూహాన్నీ ఎరుకపరచాలి. సంక్షోభం ముదురుతున్న వేళ సమతూకమే భారత మంత్రం. యుద్ధంలో మానవీయ చట్టాలను గౌరవించాల్సిందిగా ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేయాలి. హమాస్ దుశ్చర్యకు గాజాలో అమాయకులపై ప్రతీకారం అర్థరహితమని నచ్చజెప్పాలి. అలాగే, హమాస్ వద్ద బందీలైన ఇజ్రాయెలీలను వెంటనే విడిపించేందుకు అరబ్ మిత్ర దేశాలు పాటుపడేలా కృషి చేయాలి. అటు ఇజ్రాయెల్‌తోనూ, ఇటు ఇరాన్, ఖతార్ మొదలు సౌదీ అరేబియా, ఈజిప్ట్ దాకా మధ్యప్రాచ్యంలోని కీలక దేశాలతోనూ ఉన్న సత్సంబంధాల రీత్యా భారత్ ఈ యుద్ధానికి తెరపడేలా చూడాలి. మధ్యప్రాచ్యాన్ని కమ్ముకొస్తున్న మానవ సంక్షోభాన్ని నివారించాలి. -
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: పెట్రోలు, నిత్యావసరాల ధరల వాత తప్పదా?
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం దేశీయంగా ప్రజలపై పెనుభారం పడనుందా? పెట్రోలు సహా, పలు వినియోగ వస్తువులు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం ప్రపంచ ముడి చమురు సరఫరాను ప్రభావితం చేయనుంది. దీంతో పాటు వివిధ వినియోగ ఉత్పత్తులు ఇతర మరెన్నో ప్రపంచ సరఫరాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రభావ తీవ్రతను కచ్చితంగా అంచనా లేనప్పటికీ ధరల పెరుగుదల తప్పదనేది నిపుణుల మాట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ గోధుమ సరఫరాపై ప్రభావం చూపినట్లే, ఇజ్రాయెల్-హమాస్ వార్ ప్రపంచ ముడి చమురు సరఫరాకు ముప్పు తెస్తుందని, తద్వారా దేశంలో హైదరాబాద్ లాంటి ఇతర ప్రధాన నగరాల్లోని ప్రజల గృహవినియోగం భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 7.5 శాతానికి పైగా పెరిగింది.ఇప్పటికే బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఎన్‌సిఆర్‌కు చెందిన వైట్ గూడ్స్ తయారీదారు సూపర్ప్లాట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ప్రకారం, యుద్ధం మరో పక్షం రోజులు కొనసాగితే, నవంబర్‌లో స్మార్ట్ టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెంపు తయారీదారులను రెండు రంగాల్లో ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాలలో కీలకమైన పదార్థం ప్లాస్టిక్ ధరలు, లాజిస్టిక్స్, సరఫరా ఖర్చులు పెరుగుతాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ఉత్పత్తి , డెలివరీ ఖర్చులో ఈ రెండింటి వాటా దాదాపు 33 శాతం. ఇంకా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వస్తువులు వంటివి ప్రభావితం కావచ్చు. దేశంలోని ఎఫ్ఎంసీజీ తయారీదారులు ఇప్పటికే పేలవమైన అమ్మకాలు, గ్రామీణ కుటుంబాల నుండి తగ్గిన డిమాండ్‌తో సతమత మవుతున్నారు. Nuvama ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకుల ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ వృద్ధి తక్కువగానే ఉంటుంది, ఆగస్టు నెలలో వర్షపాతం లోటు వందేళ్ల గరిష్టానికి చేరడంతో ప్రముఖ FMCG కంపెనీల వృద్ది సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది.బీఎన్పీ పారిబాస్ డైరెక్టర్-హెడ్ ఆఫ్ ఇండియా ఈక్విటీ రీసెర్చ్, కునాల్ వోరా ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. అంతర్జాతీయ ఆదాయంలో మధ్య-ప్రాచ్య ప్రాంతం వాటా ఉన్న డాబర్ , మారికో లాంటి భారతీయ కంపెనీలకు నష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి అక్టోబర్ 6 నాటికి ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.58 డాలర్లు ఉండగా, ఈరోజు (అక్టోబర్ 16) 90.98 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధరలు పైకి ఎగియ వచ్చు. దీంతో భారతదేశంతో సహా చమురు-దిగుమతి చేసుకునే దేశాలకు చమురు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం ఉండదనే అంచనాలున్నాయి. అంతేకాదు ఈ యుద్ధంతో దేశీయ టీ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంనుంచి తేయాకును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్‌పై ప్రభావం చూపితే అది తమ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన ఆందోళన. గాజాలో ఇజ్రాయెల్ తన చర్యలను ఆపకపోతే తాము చూస్తూ ఉరుకోబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వార్‌లో ఇరాన్- లెబనాన్ చేరిపోతే మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితి మరింత ముదురుతుందనే ఆందోళన నెలకొంది. -
గాజాపై ఇజ్రాయెల్ ఆధిపత్యం.. జో బైడెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వాషింగ్టన్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కారణంగా వేల సంఖ్యలో పౌరులు, మిలిటెంట్ల మృత్యువాతపడ్డారు. ఇక, హమాస్ దాడులను ఇజ్రాయెల్ గట్టిగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ ప్రతిదాడితో గాజా వణికిపోతోంది. ఇప్పటికే పలువురు గాజాను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. హమాస్ మిలిటెంట్లను కూడా ఇజ్రాయెల్ బంధించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ బలగాలు సుదీర్ఘకాలం గాజాలో ఉండటం పెద్ద పొరబాటుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని సూచించారు. గాజాను ఇజ్రాయెల్ తన ఆధీనంలో ఎక్కవ కాలం ఉంచుకొంటుందని తాను భావించడంలేదన్నారు. అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలోనే అక్కడి పాలన నిర్వహించాలన్నారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందన్నారు. ప్రస్తుతం గాజా పరిస్థితి చూడండి.. హమాస్ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు అని తెలిపారు. US President Joe Biden said that Israel taking control of the Gaza Strip would be 'a big mistake', but Tel Aviv 'must respond' and 'go after Hamas' after the movement launched attacks aimed at entered Israel last weekend. #Israel, #PalestineGenocide, #HamasisISIS, #USA, #Gaza pic.twitter.com/bY0veoQRih — SamTin❤️🍀 (@Dng21509147) October 16, 2023 ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో జో బైడెన్ పర్యటిస్తారన్న వార్తలపై వైట్ హౌస్ స్పందించింది. ఈ సందర్బంగా వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదివారం కూడా జోబైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ దాడుల తర్వాత ఆయన ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడటం ఇది ఐదోసారి. -
Israel-Palestine Conflict: ఆకలి కేకలు.. ఆర్తనాదాలు
గాజా స్ట్రిప్/జెరూసలేం: కాలే కడుపులకు తిండి లేదు, దాహంతో అలమటిస్తున్న గొంతులకు గుక్కెడు నీరు లేదు, ఆసుపత్రుల్లో ఔషధాలు లేవు, రాత్రయితే కరెంట్ లేదు. దూసుకొస్తున్న రాకెట్లు, కళ్లెదుటే కుప్పకూలుతున్న భవనాలు, ప్రాణాలు కోల్పోతున్న సామాన్య జనం. ఇజ్రాయెల్ బలగాల నిర్బంధంలో చిక్కుకున్న గాజాలో ప్రస్తుత దయనీయ పరిస్థితి ఇది. గాజాలోకి ఆహారం, నీరు, కరెంటు సరఫరా కాకుండా దారులు మూసుకుపోయాయి. ఈజిప్టు తన సరిహద్దును మూసివేసింది. గాజాలోని 23 లక్షల మంది జనం అల్లాడిపోతున్నారు. కొందరు మరో దారిలేక ఉప్పునీరు, అపరిశుభ్రమైన నీరు తాగుతున్నారు. ఇజ్రాయెల్ కరుణిస్తే తప్ప వారికి ఆహారం, మంచినీరు దొరకదు. హమాస్ చేతిలో ఉన్న బందీలు విడుదలైన తర్వాతే సరఫరాల గురించి ఆలోచిస్తామని ఇజ్రాయెల్ తేల్చిచెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై వారం రోజులు దాటింది. ఇరుపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. శత్రువులను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు దూసుకెళ్తోంది. మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్లు ఎక్కుపెడుతున్నారు. ఈ పోరాటంలో గాజాలో ఇప్పటిదాకా 2,329 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో 1,300 మందికిపైగా జనం మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,000కుపైగా ఇళ్లు కూలిపోయాయి. Children in Gaza suffer from panic attacks as a result of the heavy lsraeli bombing which hasn’t stopped for nine consecutive days. pic.twitter.com/tMDmTYk2En — TIMES OF GAZA (@Timesofgaza) October 15, 2023 పాలస్తీనియన్ల కోసం రెండు కారిడార్లు ఉత్తర గాజాను వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, సొంత ఇళ్లు వదిలేసి వెళ్లిపోతున్నారు. వారికోసం రెండు సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఉత్తర గాజా క్రమంగా ఖాళీ అవుతోంది. 10 లక్షల మందికిపైగా జనం తరలివెళ్లాలంటే వారం రోజులకుపైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడి, గాజాలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వేలాది మంది బాధితులు ఎటూ కదల్లేకపోతున్నారు. ఆసుపత్రుల్లో ఔషధాలు, ఇంధనం కొరతతో చికిత్సలు ఆగిపోయాయి. గాజాలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలను సమూలంగా నాశనం చేయక తప్పదని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం పునరుద్ఘాటించింది. మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించింది. కలుగులో దాక్కున్నా చావు తప్పదని హమాస్ సభ్యులను హెచ్చరించింది. ఆసుపత్రుల్లో బాలింతలు, శిశువులు యుద్ధం ఉధృతంగా మారుతుందని, ఉత్తర గాజా నుంచి సామాన్య ప్రజలంతా సాధ్యమైనంత త్వరగా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఆదివారం ఇజ్రాయెల్ సూచించింది. విమానాల ద్వారా కరపత్రాలు జారవిడిచింది. కాగా, ఉత్తర గాజా నుంచి ఎవరూ వెళ్లొద్దని, ఇళ్లల్లోనే ఉండాలని పాలస్తీనియన్లకు హమాస్ విజ్ఞప్తి చేసింది. ఉత్తర గాజాలోని ఆసుపత్రిల్లో 2,000 మందికిపైగా బాధితులు ఉన్నారని, చాలామంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, ఇంక్యుబేటర్లలో శిశువులు ఉన్నారని, తరలింపు కార్యక్రమం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బందీల కుటుంబ సభ్యుల ఆగ్రహం హమాస్ అ«దీనంలో ఉన్న 150 మంది బందీల క్షేమ సమాచారం తెలియడం లేదు. బందీలను వెంటనే విడిపించాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులు టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తన భార్య, ముగ్గురు బిడ్డలను మిలిటెంట్లు అపహరించారని, వారిని క్షేమంగా తన వద్దకు చేర్చాలని అవిహై బ్రాడ్జ్ అనే వ్యక్తి కన్నీటితో వేడుకున్నాడు. ఈజిప్టు సరిహద్దు తెరిస్తే.. ఈజిప్టు–గాజా మధ్యనున్న రఫా సరిహద్దును తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈజిప్టుతో చర్చిస్తోంది. గాజా ప్రజల కోసం వివిధ దేశాలు ఇచి్చన ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలు ప్రస్తుతం ఈజిప్టులో ఉన్నాయి. వాటిని గాజాకు చేర్చడానికి సరిహద్దును తెరవాలని అమెరికా అంటోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధ సాయం అందిస్తోంది. ఇప్పటికే ఒక యుద్ధవిమాన వాహక నౌకను మధ్యదరా సముద్రానికి పంపించింది. యూఎస్ఎస్ ఐసెన్‌హోవర్ యుద్ధనౌకను పంపించినట్లు అమెరికా రక్షణ మంత్రి అస్టిన్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సౌదీ అరేబియా యువరాజు సల్మాన్‌తో సమావేశమయ్యారు. దక్షిణ గాజాకు వెళ్లకుండా అడ్డుకుంటున్న హమాస్ ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. అయితే, జనం వెళ్లిపోకుండా హమాస్ మిలిటెంట్లు ఎక్కడికక్కడ బలవంతంగా అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సామాన్య ప్రజలను రక్షణ కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్ దాడుల నుంచి కాపాడుకోవాలన్నదే మిలిటెంట్ల అసలు లక్ష్యమని వెల్లడించింది. ఉత్తర గాజా ప్రజలు ముందుకు వెళ్లకుండా మిలిటెంట్లు వాహనాలను అడ్డుగా పెట్టి రోడ్లను దిగ్బంధిస్తున్నారని పేర్కొంది. వారి ఆరాటమంతా సొంత భద్రత కోసమేనని విమర్శించింది. హమాస్ మిలిటెంట్ల ఏరివేత కోసం ఉత్తర గాజాపై భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ సైన్యం అక్కడున్న పాలస్తీనియన్లకు మరికొంత సమయం ఇవ్వాలని యోచిస్తోంది. జనమంతా దక్షిణ గాజాకు చేరుకున్న తర్వాత భూతల దాడులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. హమాస్ సీనియర్ కమాండర్ బిలాల్ అల్–ఖేద్రా హతం హమాస్ మిలిటెంట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాజా స్ట్రిప్‌లో శనివారం రాత్రి జరిగిన ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ బిలాల్ అల్–ఖేద్రా మరణించాడు. అంతేకాకుండా పలువురు ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులు సైతం హతమయ్యారు. ఈ విషయన్ని ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం ట్వీట్ చేసింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్ నిరిమ్, నిర్ ఓజ్‌లో గతవారం జరిగిన పలు దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. హమాస్ నుఖ్బా యూనిట్‌కు చెందిన దక్షిణ ఖాన్ యూనిస్ బెటాలియన్‌కు బిలాల్ నేతృత్వం వహిస్తున్నాడు. నెతన్యాహూ, అబ్బాస్‌కు జో బైడెన్ ఫోన్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. గాజాలోని పాలస్తీనా ప్రజలకు వెంటనే మానవతా సాయం అందాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో జో బైడెన్ వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ ముదరకుండా చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు సరఫరా చేయడానికి వీలుగా ఐక్యరాజ్యసమితితోపాటు ఈజిప్టు, జోర్డాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి మొదలైన తర్వాత మొహమ్మద్ అబ్బాస్‌తో బైడెన్ మాట్లాడడం ఇదే మొదటిసారి. నెతన్యాహూతో మాట్లాడడం ఐదోసారి. టెస్లా కారు ప్రాణం కాపాడింది ఇజ్రాయెల్‌లో హమాస్‌లో చేసిన దాడిలో టెస్లా మోడల్–3 ఎలక్ట్రిక్ కారు ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ అధినేత గిలాద్ అల్బర్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. అయితే బాధితుడి వివరాలను బహిర్గతం చేయలేదు. గిలాద్ కథనం ప్రకారం.. బాధితుడు అత్యవసర బృందంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 7న హమాస్ మిలిటెంట్లు దాడి చేస్తున్నారని తెలియడంతో తన టెస్లా మోడల్–3 కారులో అసెంబ్లీ పాయింట్ వద్దకు బయలుదేరాడు. అతడిని చూడగానే మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. అది ఎలక్ట్రిక్ కారు అనే విషయం వారికి తెలియదు. డీజిల్ ట్యాంకు ఉండే భాగంపై కాల్పులు జరిపారు. నిజానికి అందులో డీజిల్ ట్యాంకు ఉండదు. టైర్లపై కూడా కాల్చారు. అయినా కారు చెక్కుచెదరలేదు. బాధితుడు మరింత వేగంగా కారులో ముందుకు దూసుకెళ్లాడు. కొన్ని బుల్లెట్లు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. రక్తం కారుతున్నా అలాగే ఆసుపత్రికి చేరుకున్నాడు. వైద్యులు అతడికి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై టెస్లా, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. టెస్లా కారు వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. -
శాంతి అనిత్యం, యుద్ధమె నిత్యం
బతుకు–చావు, యుద్ధమూ–శాంతి, ప్రేమ–విద్వేషం, కారుణ్యం–కర్కశత్వం... ఇవి పరస్పర వ్యతిరిక్తాలూ, ఒకదానికొకటి ఎంతో దూరాలూ అనుకుంటాం. కానీ, వాస్తవంలో ఎంత దగ్గరగా ఉంటాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతుకును అంటిపెట్టుకునే చావు ఉంటుందని తెలిసినా; అది హత్యో, ఆత్మహత్యో, యుద్ధం పేరిట సామూహిక హత్యో కాక, సహజ మరణమైతే, ఆ దారి వేరు. బతుక్కీ, చావుకీ మధ్య ఉంటుందనుకునే దూరాన్ని చెరిపివేస్తూ హఠాత్తుగా యుద్ధాలు బద్దలవుతాయి. ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య పదిరోజుల క్రితం మొదలైన యుద్ధం ఇప్పటికే వేలసంఖ్యలో బతుకు దీపాలను ఆర్పివేసింది. బతుకునిచ్చే అమ్మతనాన్ని భక్తితో స్మరించుకుంటూ తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో అమ్మవారిని మన దగ్గర కొలుచుకోనున్న రోజుల్లోనే, అక్కడ ఆ మూల సమరనాదాలు, తల్లుల గర్భశోకాలు మిన్నంటడం వైచిత్రి. అమ్మ ఎక్కడైనా అమ్మే! అమ్మకు, అమ్మతనానికి ప్రాంత, మత, భాషాభేదాలు లేవు. చారిత్రకంగా చూసినా ఒకప్పుడు ప్రపంచమంతటా మొదటగా కొలుపులందుకున్నది అమ్మే; అయ్య కొలుపు ఆ తర్వాతే వచ్చింది. అమ్మ అంటే అన్నమూ, అభయమూ కూడా! అమ్మవారిని ధనలక్ష్మిగాను, ధాన్యలక్ష్మిగానూ కూడా భావించుకుంటాం. అమ్మ చేతుల్లో వరికంకులను, చెరుకుగడలను అలంకరిస్తాం. అమ్మకు రకరకాల అన్నాలు ఇష్టమని చెప్పి నివేదించి ఆ అన్న ప్రసాదాలను మనమే ఆరగిస్తాం. మన దగ్గరే కాదు, ఒకప్పుడు అమ్మ ఆరాధన ఉన్న ప్రతిచోటా అమ్మను అన్నానికి ప్రతీకగానే కొలిచారు. అమ్మను బతుకమ్మ అనడంలోనే, పది కాలాలపాటు సుఖశాంతులతో బతికించే అమ్మ ఆశీస్సు ఉంది. అమ్మను కొలుస్తూనే అమ్మ మనసుకు దూరమై యుద్ధానికి దగ్గరవడమే మనిషి జీవితంలోని పెను విషాదం. తను దగ్గరవడమే కాదు; అన్నసాధనాలు ధరించిన అమ్మ చేతుల్లో కూడా ఆయుధాలు ఉంచి; అన్నపూర్ణను ఆయుధపూర్ణగా మలచిన చరిత్ర మనిషిది. మానవ చారిత్రక ప్రస్థానంలో ఇది ఎప్పుడు మొదలైందో కానీ, ఇప్పటికీ తనకు యుద్ధమే కావాలో శాంతే కావాలో తేల్చుకోలేని సందిగ్ధంలోనే మనిషి ఉన్నాడు. యుద్ధానికీ, శాంతికీ మధ్య మనిషి చక్రభ్రమణం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. యుద్ధమే ప్రధానమై శాంతి ఎంత అప్రధానమైందంటే,రెండు యుద్ధాల మధ్య తాత్కాలిక విరామాన్నే శాంతిగా నిర్వచించుకునే పరిస్థితికి వచ్చాం. శాంతికాలంలో యుద్ధాన్ని జపించడం, యుద్ధకాలంలో శాంతిని స్మరించడం మనిషికి పరిపాటిగా మారింది. యుద్ధం కడుపున శాంతిశిశువును, శాంతి కడుపున యుద్ధశిశువును కోరుకోవడమూ అంతే నిత్యసత్యమైంది. యుద్ధమొచ్చి శాంతిని చెదరగొడుతున్నట్టు భ్రమిస్తాం కానీ; వాస్తవానికి శాంతే మధ్య మధ్య వీచే మలయమారుతమై ప్రచండమైన యుద్ధపు వేడిగాడ్పులకు అవరోధ మవుతోందన్న ఎరుక మనకు లేదు. యుద్ధమే ఇక్కడ శాశ్వతంగా తిష్ఠవేసిన చుట్టమై; శాంతి ఎప్పుడైనా తొంగిచూసే అతిథి మాత్రమైంది. యుద్ధమనే ఎడారిలో శాంతీ, సుఖసంతోషాల ఒయాసిస్‌లను లియో టాల్‌స్టాయ్ నవల ‘యుద్ధమూ–శాంతీ’ అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. అమెరికా అంతర్యుద్ధం దరిమిలా ఎంత విధ్వంసం జరిగిందో, ఎందరి బతుకులు తలకిందులయ్యాయో మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’ అనితరసాధ్యంగా చిత్రిస్తుంది. ఇంకా వెనక్కి, మహాభారతానికి వెడితే, యుద్ధాన్ని యజ్ఞంగా పేర్కొని పవిత్రీకరించడమే కాదు; రోగమొచ్చి చావడం కన్నా యుద్ధంలో చావడం పరమపుణ్యప్రదమని కీర్తించడం కనిపిస్తుంది. చివరికది అపార జననష్టంతో పాటు, యోధజాతి మొత్తం ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఒక మహావిలయ సదృశంగా చిత్రిస్తుంది. అందులోని స్త్రీపర్వం మొత్తం భర్తలను, కొడుకులను, తండ్రులను, సోదరులను కోల్పోయి గుండెలు బాదుకునే స్త్రీ నిర్భరశోకాన్ని కరుణ రసార్ద్రంగా వినిపిస్తుంది. ఆ దుఃఖం గాంధారినోట శాపంగా మారి యాదవకుల విచ్ఛిత్తి రూపంలో మరో విధ్వంసం వైపు నడిపిస్తుంది. యుద్ధాన్ని ఆకాశానికెత్తిన మహాభారతమే, దాని విపరీత పర్యవసానాలను ఎత్తిచూపి సామాన్యులూ, మాన్యులైన మునులూ కూడా తీవ్రంగా గర్హించిన సంగతినీ నమోదు చేయడం విశేషం. యుద్ధపశ్చాత్తాపం జీవితాంతమూ ధర్మరాజును ఎంతగా వెన్నాడుతూ వచ్చిందంటే, అశ్వమేధయాగాన్ని తలపెట్టి అర్జునుని అశ్వం వెంట పంపిస్తూ, రాజులను ఓడించు కానీ ప్రాణనష్టం మాత్రం కలిగించవద్దని హెచ్చరించవలసి వచ్చింది. ప్రాంతాలు, మతాలు, సంస్కృతులు, భాషల మధ్య ఎక్కడా కనిపించనంత సాదృశ్యం యుద్ధాలలో కనిపిస్తుంది. యుద్ధరూపంలోని ఊచకోత ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్ చెప్పిన ఇలియడ్ అచ్చం మహాభారతానికి ప్రతిబింబంలా ఉంటుంది. అది చిత్రించిన ట్రాయ్ యుద్ధం చివరిలో కూడా అయినవారిని కోల్పోయిన తల్లులు, భార్యల దుఃఖారావాలూ, ఆర్తనాదాలూ గుండెల్ని పిండివేస్తాయి. ఇన్ని అనుభవాలున్నా; ఇన్నిన్ని శోకసముద్రాలు కట్టలు తెంచుకున్న ఉదాహరణలు కళ్ళముందున్నా మనిషిలో యుద్ధోన్మాదం ఉపశమించలేదు; సమర మోహం తీరలేదు; రుధిరదాహం చల్లారలేదు. శాంతియుతంగా జీవించడం మనిషి ఇప్పటికీ నేర్చు కోలేదు. యుద్ధంలో చివరికి అటూ ఇటూ విజితులే తప్ప విజేతలెవరూ ఉండరనీ; మిగిలేవి శవాలూ, జీవచ్ఛవాలు మాత్రమేనన్న నిష్ఠురసత్యాన్ని మనిషి ఇప్పటికీ జీర్ణించుకోలేదు. బతుకు నిచ్చే, బతకనిచ్చే అమ్మతత్వానికి దూరంగా చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం ఎంతకాలం?! -
ఇజ్రాయెల్ వార్‌పై ఒవైసీ రియాక్షన్.. ఆయనో డెవిల్ అంటూ..
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇలాంటి తరుణంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఇజ్రాయెల్ వార్‌పై ఘాటుగా స్పందించారు. తన మద్దతు పాలస్తీనాకు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు. కాగా, ఒవైసీ శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒవైసీ మాట్లాడుతూ.. తాను పాలస్తీనా వైపే ఉంటానని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పటికీ పోరాడుతున్న వారికి లక్షలాదిమంది సెల్యూట్ చేస్తున్నారని అన్నారు. గాజాకు విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపివేయడంతో లక్షల మంది పౌరులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 21 లక్షల జనాభా ఉన్న గాజాలో 10 లక్షల మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా కూడా ప్రపంచం మౌనంగా ఉంది. 70 ఏళ్లుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఆక్రమణదారుగా ఉంది. అక్కడ దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | Hyderabad: On the Israel-Palestine conflict, AIMIM chief Asaduddin Owaisi says, "The poor people of Gaza, with a population of 21 lakh, 10 lakh have been rendered homeless...The world is silent...For 70 years Israel has been an occupier...You cannot see the occupation,… pic.twitter.com/9riNvVEOV1 — ANI (@ANI) October 15, 2023 ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహును దుష్టశక్తిగా(డెవిల్) అభివర్ణించారు. ఆయన క్రూరుడని, యుద్ధ నేరగాడని మండిపడ్డారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిండంపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. మన త్రివర్ణ పతాకంతోపాటు తాను పాలస్తీనా జెండాను కూడా గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. తాను పాలస్తీనా పక్షానే ఉంటానని తేల్చి చెప్పారు. పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ మానవత్వంతో స్పందించాలని కోరారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇది మానవతా సమస్య అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాలస్తీనాకు ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇరు దేశాల మధ్య వెంటనే కాల్పుల విరమణ పాటించాలని నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. -
అల్‌ఖైదా కంటే ప్రమాదకరం
వాషింగ్టన్: పాత మసీదులు, యూదుల పురాతన ఆలయాల ఆనవాళ్లు ఉన్న పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం మొదలైన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం పలు మలుపులు తీసుకుంటున్న వేళ హమాస్ సాయుధసంస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని ఫిలడెలి్ఫయాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ మాట్లాడారు. 2001 సంవత్సరంలో 9/11 సెపె్టంబర్ దాడులకు తెగబడిన అల్‌ఖైదా ఉగ్రసంస్థ కంటే హమాస్ ప్రమాదకరమైనదని అభివరి్ణంచారు. హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్ ఏకంగా వేయి మందికిపైగా అమాయకులను పొట్టనబెట్టుకుంది. అల్‌ఖైదా సృష్టించిన 9/11 దాడులకంటే ఈ దాడి అత్యంత దారుణం. అల్‌ఖైదా కంటే హమాస్ ప్రమాదకరం. అల్‌ఖైదాను మించిన దుషు్టలు వీరు. మొదట్నుంచీ చెబుతున్నట్లే మేం ఇజ్రాయెల్‌కు బాసటగా నిలబడతాం. ఆత్మరక్షణ కోసం, ప్రతిదాడుల కోసం ఇజ్రాయెల్ తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతీ చర్యకూ అమెరికా అండగా ఉంటుంది. గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు’ అని బైడెన్ చెప్పారు. ఐరాసతోనూ చర్చిస్తున్నాం ‘ఇజ్రాయెల్ ప్రభుత్వంతోనేకాదు దాని పొరుగున ఉన్న జోర్డాన్, ఈజిప్ట్ ఇతర అరబ్ దేశాలతో మంతనాలు జరుపుతున్నాం. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్‌లలో నెలకొన్న మానవీయ సంక్షోభం పోగొట్టేందుకు ఐక్యరాజ్యసమితితోనూ సమష్టిగా కృషిచేస్తున్నాం. చర్చిస్తున్నాం’ అని అన్నారు. -
235 మందితో రెండో విమానం రాక
న్యూఢిల్లీ: సంక్షుభిత ఇజ్రాయెల్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అజయ్’ పేరిట భారత సర్కార్ మొదలుపెట్టిన పౌరుల తరలింపు కార్యక్రమంలో భాగంగా శనివారం 235 మందితో ఇజ్రాయెల్ నుంచి బయల్దేరిన విమానం భారత్‌కు చేరుకుంది. ఢిల్లీకి ఈ విమానం చేరుకుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ శనివారం వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పౌరులు చేరుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. టెల్ అవీవ్ నగరం నుంచి తొలి విమానం వచి్చన సంగతి తెల్సిందే. ఎయిర్ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆపరేషన్ కింద తొలి విమానంలో 200కుపైగా భారతీయులు స్వదేశానికి రాగలిగారు. వీరికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు. ‘ మోదీ సర్కార్ తక్షణం స్పందించి తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడం పట్ల వీరంతా సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి ట్వీట్‌చేశారు. దీంతో శనివారంనాటికి మొత్తంగా 400కుపైగా భారత్‌కు చేరుకున్నారు. మరో రెండు విమానాలూ వస్తున్నాయ్ టెల్ అవీవ్ స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదింటికి, రాత్రి 11 గంటలకు మరో రెండు ప్రత్యేక విమానాలు భారత్‌కు బయల్దేరతాయని టెల్ అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. సాయంత్రం విమానంలో 230కిపైగా, రాత్రి విమానంలో 330కిపైగా ప్రయాణికులు స్వదేశానికి రానున్నారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవి బయల్దేరతాయి. సంబంధిత వివరాలను ఎంబసీ ట్వీట్‌చేసింది. విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులు, వజ్రాల వ్యాపారులు సహా పలు రంగాలకు చెందిన దాదాపు 18,000 మంది భారతీయపౌరులు ఇజ్రాయెల్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్ భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఈ రెండు సరీ్వస్‌లు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానం, అమృత్సర్ నుంచి స్పైస్‌జెట్ విమానం బయల్దేరతాయి. ఆదివారంకల్లా రెండూ ఢిల్లీకి వస్తాయి. -
ఉత్తరం నుంచి దక్షిణానికి...వలస వ్యధ!
జెరుసలేం: ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ సంస్థ చేసిన మతిలేని దాడి సొంత ప్రజలైన పాలస్తీనియన్ల పాలిట భస్మాసుర హస్తంగా మారుతోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు. ఇన్ని లక్షల మందీ మరో దారిలేక దక్షిణ గాజా వైపు సాగుతున్నారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలతో పాటు దేనికీ దిక్కులేక కటకటలాడుతున్న దక్షిణ గాజా, అక్కడి జనాభాకు సమాన సంఖ్యలో వచ్చి పడుతున్న తోటి పాలస్తీనియన్లకు ఏ మేరకు ఆశ్రయం కల్పిస్తుందో, ఎలా ఆదుకోగలదో... అంతా అగమ్యగోచరం! ఈ మనకాలపు మహా విషాదానికి ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సమాజం కూడా మౌన ప్రేక్షకురాలిగా మారుతోంది...! పెను ఉత్పాతానికి, మానవ సంక్షోభానికి దారి తీయగల ఈ భారీ వలసలు వద్దంటున్న ఐరాస, అందుకు మరో ప్రత్యామ్నాయమేమీ చూపలేని పరిస్థితుల్లో చేష్టలుడిగింది. సామూహిక వలసలు... కార్లు, ట్రక్కులు, గాడిదలు, కాలినడకన... ఎలా వీలైతే అలా ఉత్తర గాజావాసులు వలస బాట పట్టారు. భారమైన మనసులతో ఇల్లూ వాకిలీ ఖాళీ చేసి కుటుంబాలతో సహా తరలి వెళ్తున్నారు. చుట్టూ వచ్చి పడుతున్న బాంబులు, రాకెట్లు, క్షిపణుల మధ్యే బిక్కుబిక్కుమంటూ సాగుతున్నారు. ఎట్టకేలకు దక్షిణ గాజా చేరినా సురక్షితంగా ఉంటామో లేదో తెలియని అయోమయం! తాగడానికి, తినడానికి కూడా దిక్కుండదేమోనన్న భయం!! వెరసి అంతులేని దైన్యమే వారిని వెంటాడుతోంది. మరోవైపు ఎటూ కదల్లేక ఆస్పత్రుల్లో దీనావస్థలో ఉన్న వేలాది మంది క్షతగాత్రులు, రోగులు నిస్సహాయంగా కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెలీల ప్రతీకారేచ్ఛ హమాస్ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా శుక్రవారం రాత్రి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం వారి భావోద్వేగాలను ప్రతిఫలించింది. హమాస్‌ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజా ఖాళీ అయ్యాక ఇజ్రాయెల్ ఏ స్థాయి దాడులకు దిగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కి భవనాలు, నిర్మాణాలు ఇప్పటికే చాలావరకు ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో నేలమట్టమయ్యాయి. అయితే, అమాయక పాలస్తీనియన్లకు హాని కలగకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి జొనాథన్ కొన్రికస్ ప్రకటించారు. తక్షణం దక్షిణాదికి వెళ్లిపోవాలంటూ ఉత్తర గాజా అంతటా సైన్యం కరపత్రాలు జారవిడిచింది. సోషల్ మీడియాలోనూ విజ్ఞప్తి చేసింది. రెండు ప్రధాన రహదారులపై ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగింటి వరకూ ఎలాంటి హానీ తలపెట్టకుండా వలసలను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే, యుద్ధం ముగిశాక వారు ఉత్తర గాజాకు తిరిగొచ్చేందుకు అనుమతిస్తామన్న హామీని ఇజ్రాయెల్ నిలుపుకోవడంపై ఈజిప్ట్ తదితర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అనుమతిస్తాం: ఈజిప్టు దక్షిణ రఫా సరిహద్దు క్రాసింగ్‌ను తెరిచి ఉత్తర గా జా వాసులను దక్షిణాదికి అనుమతిస్తామని ఈజి ప్టు ప్రకటించింది. గత వారం రోజుల్లో అక్కడ నిర్మించిన తాత్కాలిక గోడలను కూల్చేస్తామని పేర్కొంది. తమవైపు ఇప్పటిదాకా 2,200 మందికి పైగా మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే హమాస్ దాదుల్లో మరణించిన ఇజ్రాయెలీల సంఖ్య 1,500 దాటినట్టు ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. వలస వెళ్తున్నవారి కార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని హమాస్ ఆరోపించింది. ఈ దాడులు ఏకంగా 70 మంది అమాయకులను బలిగొన్నాయని పేర్కొ ంది. మరోవైపు ఏ క్షణంలోనైనా హమాస్‌కు ద న్నుగా బరిలో దిగేందుకు సిద్ధమని హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ పునరుద్ఘాటించింది. గాజావాసు ల కోసం ఐరాస పంపిన ఔషధాలు తదితరాల తో కూడిన విమానాలు ఈజిప్టులోనే నిలిచిపోయాయి. పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ దారు ణంగా ప్రవర్తిస్తోందంటూ 57 ఇస్లామిక్ దేశాల కూటమి మండిపడింది. వలసలు పూర్తయేందుకు ఇజ్రాయెల్ మరింత సమయమివ్వాలని యూరోపియన్ యూనియన్ సూచించింది. కళ్లముందు 1948 వలసలు ప్రస్తుత సంక్షోభం 1948 నాటి పాలస్తీనా వలసలను గుర్తు తెస్తోంది. ఇజ్రాయెల్ ఆవిర్భావం సందర్భంగా అరబ్ దేశాలతో జరిగిన యుద్ధం సందర్భంగా ఏకంగా 7 లక్షల మంది పాలస్తీనియన్లు ప్రస్తుత ఇజ్రాయెలీ భూభాగాల నుంచి ఇలాగే వలస బాట పట్టారు. దీనినే వారు నక్బా (భారీ ఉత్పాతం)గా పిలుస్తారు. నాటినుంచి వారు ఇప్పటిదాకా తమ స్వస్థలాల ముఖం చూసేందుకు నోచుకోలేదు! వారు, వారి వారసులు కలిపి 60 లక్షల మంది దాకా వెస్ట్‌బ్యాంక్‌తో పాటు లెబనాన్, సిరియా, జోర్డాన్లలో తలదాచుకుంటున్నారు. గాజాలోనూ ఎక్కువ మంది వీరే. నాటి బాధాకరమైన ఉదంతం ఇప్పుడు పునరావృతమవుతోందని వారు ఆక్రోశిస్తున్నారు. దాడుల్లో హమాస్ కమాండర్ హతం: ఐడీఎఫ్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి సారథ్యం వహించిన హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన కమాండర్ అలీ ఖాదీ హతమయ్యాడు. నక్బా యూనిట్ కంపెనీ కమాండర్‌గా ఉన్న అతన్ని కచ్చితమైన సమాచారం మేరకు డ్రోన్ దాడిలో మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) శనివారం ప్రకటించింది. 2005లో పలువురు ఇజ్రాయెల్ పౌరుల కిడ్నాపింగ్, హత్య కేసుల్లో అలీని అదుపులోకి తీసుకున్నారు. కానీ గిలాత్ శాలిద్ ఖైదీల మారి్పడి ఒప్పందంలో భాగంగా విడుదల చేయాల్సి వచి్చంది‘ అంటూ ఆ దేశ వైమానిక దళం ట్వీట్ చేసింది. హమాస్ ఉగ్రవాదులందరికీ అలీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది. -
ఇజ్రాయెల్‌కు ఊహించని షాక్.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం!
రియాద్: ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అరబ్ దేశమైన సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్(అరబ్ లీగ్‌లో భాగంగా)తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు సౌదీ బ్రేక్ వేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు సమాచారం. అయితే, కొన్నేళ్లుగా అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 1979లో ఇజ్రాయెల్.. ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. ఇదే సమయంలో యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఇందుకు అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలిచింది. తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేసింది. తాజా యుద్ధంతో అమెరికా ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదనే ఆలోచన సౌదీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో, ఇజ్రాయెల్ అరబ్ దేశాల్లో బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియాతో సంబంధాలు చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయని చెప్పుకోవచ్చు. Saudi Arabia switches focus from Israel to Iran to cool tensions following Hamas terrorist attack: reporthttps://t.co/2RMro1ZLgm — deborah green (@NewaiGreen) October 14, 2023 పాలస్తీనానే సమస్య.. అరబ్‌లీగ్‌లో కీలకంగా సౌదీ అరేబియా కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌తో సౌదీ సంబంధాలు ఏర్పరచుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇతర దేశాలు సైతం సౌదీ బాట పట్టే అవకాశం ఉంది. సాధారణంగా పాలస్తీనా సమస్య.. అరబ్ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ విషయంలో ఇన్నాళ్లూ కఠిన వైఖరినే అవలంబిస్తూ వచ్చాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. కాగా, ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా పాలస్తీనీయుల హక్కులకు వెన్నుపోటు పొడవడమే అవుతుందని ఇరాన్ కూడా పేర్కొంది. దీంతో, మరిన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌లో సంబంధాలపై ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. చర్చల విషయంలో సౌదీకి ఇరాన్‌కు కూడా కీలక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. -
Video: బందీల పిల్లలను ఆడిస్తున్న హమాస్ ఉగ్రవాదులు
హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరు వైపుల భారీ ప్రాణ నష్టం జరిగింది. హమాస్ దాడుల వల్ల ఇజ్రాయిల్‌లో 1300 మంది, ఇజ్రాయిల్ దాడుల్లో 1900 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై కాల్పులు ప్రారంభించిన హమాస్ మిలిటెంట్లు.. ఆదేశానికి చెందిన 150 మందికి పైగా పౌరులను బంధించి గాజాకు తరలించిన విషయంతెలిసిందే. తాజాగా హమాస్ మిలిటెంట్లు ఆధీనంలో బంధీలుగా ఉన్న చిన్నారులకు దీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ చేతిలో తుపాకీలు పట్టుకొని ఉన్న హమాస్ మిలిటెంట్లు మరోచేత బందీల పిల్లలను ఆడిస్తూ, కనిపిస్తున్నారు. చిన్నారులు ఏడుస్తుండగా వారిని ఉయ్యాలలో ఊపుతూ, వారికి తాగడానికి నీళ్లు అందిస్తూ ఉండటం కూడా కనిపిస్తోంది. మిలిటెంట్ల వద్ద కనిపిస్తున్న పిల్లలందరూ నాలుగు నుంచి ఆరేళ్ల లోపు వయసు వారే ఉన్నారు. You can see their injuries, hear their cries and feel them trembling from fear as these children are held hostage in their own homes by Hamas terrorists and their parents lie there dead in the next room. These are the terrorists that we are going to defeat. pic.twitter.com/myDsGnOzT1 — Israel Defense Forces (@IDF) October 14, 2023 ఈ వీడియోను హమాస్ ముందుగా తమ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు అనేక అకృత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం, తమపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. బందీలను తాము క్షేమంగానే చూసుకుంటున్నామనే సందేశాన్నిచ్చేందుకే హమాస్ ఈ వీడియోను విడుదల చేసినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘హమాస్ చెరలో బందీ అయిన ఈ పిల్లలకు గాయాలయ్యాయి. వారు ఏడుస్తున్నారు. భయపడుతున్నారు. ఈ ఉగ్రవాదులనే మేము ఓడించబోతున్నాం’’ అని తెలిపింది.. -
ఇజ్రాయిల్ దాడుల్లో రాయిటర్స్ జర్నలిస్టు మృతి, మరో ఆరుగురికి గాయాలు
జెరుసలేం: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టు మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. జ్రాయిల్ సరిహద్దు దగ్గరున్న అల్మా అల్-షాబ్ సమీపంలో ఆ దేశ మిలిటరీతో పాటు లెబనీస్ మిలిటరీ హిజ్బుల్లా కాల్పులకు పాల్పడుతోంది. అదే ప్రాంతంలో అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్‌పీ)కు చెందిన జర్నలిస్టులు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దిశ నుంచి వచ్చిన మిస్సైల్ దాడిలో రాయిటర్స్ వీడియో జర్నలిస్ట్ ఇస్సామ్ అబ్దల్లా హత్య ప్రాణాలు కోల్పోయాడు. జర్నలిస్టు మృతికి ఇజ్రాయిల్ కారణమని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ఆరోపించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు తమ జర్నలిస్టు మృతిపట్ల రాయిటర్స్ వార్తా సంస్థ స్పందించింది. సౌత్ లెబనాన్ నుంచి లైవ్ అందిస్తున్న ఇస్సామ్ అబ్దుల్లా మృతిపట్ల సంతాపం ప్రకటించింది. ఇజ్రాయెల్ వైపు నుంచి వస్తున్న క్షిపణి కాల్పులను వీడియో తీస్తుండగా, మరో మిస్సైల్ దూసుకురావడంతోఅతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. రాయిటర్స్‌కు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులు అల్ సుడానీ, మహేర్ నజే సైతం గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపింది. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం Video showing the scene before Reuters journalist Issam Abdallah was killed. Journalists clearly marked as journalists, in an open landscape, doing their jobs. Not endorsing the commentary, just sharing the video. pic.twitter.com/weaKiYqFet — Aislinn Laing (@Simmoa) October 14, 2023 ఇదిలా ఉండగా హమాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య వారం రోజులుగా భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అంతం చేసి గాజాను చేజిక్కిచుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు బాంబ్‌లు, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ దాడుల్లో తాజాగా హమాస్‌కు గ్రూపుకు చెందిన వైమానిక దళ నేత మురాద్ అబూ మురాద్‌ను ఇజ్రాయెల్ అంతమొందించింది. శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో మురాద్ చనిపోయినట్లు ఇవాళ ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. వైమానిక కార్యకలాపాలను సాగిస్తున్న హమాస్ ప్రధాన కార్యాలయంపై చేసిన దాడుల్లో మురాద్ హతమైనట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా హమాస్ మిలిటెంట్లకు మురాద్ దిశానిర్దేశం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాంగ్ గ్లైడర్ల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌లో అడుగుపెట్టడానికి మురాద్ కారణమని చెబుతున్నారు. -
ఇజ్రాయెల్ ఆదేశాలు.. గాజా నుంచి తరలివెళ్తున్న వేలాది పాలస్తీనియన్లు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 600 చిన్నారులతో 1,900 పాలస్తీన్లు, సహా మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు. తాజాగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించడంతో ఇక్కడి పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాజాలో కరెంట్, మంచి నీళ్లు, ఆహారం, ఇంధన కొరతతో అల్లాడుతున్న అక్కడి పౌరులు ఇజ్రాయెల్ ఆదేశాలతో మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వేలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ నడకన సౌత్ గాజాకు తరలివెళ్తున్నారు. ఆరంభం మాత్రమే.. మరోవైపు హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది. గాజాను ఆక్రమించుకునేందుకు దాని సరిహద్దుల్లో 3.60 లక్షలమంది రిజర్వ్ సైనికులు సిద్ధం చేసింది. గత ఏడు రోజులుగా గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సేనలు తాజాగా గ్రౌండ్ ఆపరేషన్ దాడులను ప్రారంభించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ దేశం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టిందని తెలిపారు. ఇజ్రాయెల్ సేనలు సింహాల్లా పోరాడుతున్నాయని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. ఉత్తర గాజాలోనే హమాస్ మిలిటెంట్ల మకాం ఉత్తర గాజాపై హమాస్‌కు గట్టి పట్టుంది. అగ్రనాయకులంతా అక్కడే మకాం వేశారు. అందుకే తొలి టార్గెట్‌గా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను వదిలి దక్షిణ గాజాకు వెళ్లాలని పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత వారంతా తిరిగిరావొచ్చని సూచించింది. హమాస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల్లో మకాం వేసి, కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ప్రజలను అక్కడి తరలిస్తే మిలిటెంట్ల ముసుగు తొలగిపోతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా గాజా మొత్తం జనాభా 20 లక్షలు కాగా ఉత్తర గాజాలో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు జనాలు దక్షిణ గాజాకు పయనవతున్నారు.అయితే ఇప్పటికే జనంతో కిక్కిరిపోయిన దక్షిణ గాజాపై మరింత ఒత్తిడిపెరగనుంది. చదవండి: అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం దారుణంగా గాజా పరిస్థితి గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళనతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గడుతున్నారు. ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఇజ్రాయెల్‌కు సూచించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకోడంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగిస్తోంది. ఇటు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను దక్షిణ ప్రాచ్చంలోని దేశాలు ఖండిస్తున్నాయి. బీరూట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్ బహ్రెయిన్‌లో పాలస్తీనియన్లకు భారీగా మద్దతు లభిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసలను వ్యక్తం చేస్తున్నారు. -
అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం
అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. హమాస్ పని పట్టేందుకు గాజా స్ట్రిప్ వద్దే ప్రస్తుతం ఏకంగా 3 లక్షల మంది సైనికులను మోహరించింది! గాజాపై భూతల దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందనేందుకు ఇది కచి్చతమైన సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి అన్నివిధాలా అందుతున్న సాయంతో ఇజ్రాయెల్ సైనికంగా తేరిపార చూడలేనంతగా బలోపేతమైంది. మధ్యప్రాచ్యంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా భావించడమే ఇందుకు కారణం... సైనిక శక్తియుక్తులను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు, నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఆ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా సైన్యంలో చేరాల్సిందే. పురుషులు కనీసం 32 నెలల పాటు, మహిళలు రెండేళ్ల పాటు సైన్యంలో పని చేయాలి. ఇవిగాక అణు సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ సొంతమని చెబుతారు. అణు వార్ హెడ్లను మోసుకెళ్లగల జెరిషో మిసైళ్లు, విమానాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారు తొలినాళ్లలో సైనిక అవసరాలకు ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడ్డ ఇజ్రాయెల్, చూస్తుండగానే సంపన్న దేశాలకు కూడా అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ, నిఘా వ్యవస్థలు తదితరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది! ► 2018–22 మధ్య కనీసం 35 దేశాలు ఇజ్రాయెల్ నుంచి 320 కోట్ల డాలర్ల పై చిలుకు విలువైన ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి. ► వీటిలో ఏకంగా మూడో వంతు, అంటే 120 కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను భారతే దిగుమతి చేసుకుంది. ► ఆ ఐదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ ఆయుధ దిగుమతులు 270 కోట్ల డాలర్లకు చేరాయి. ఇవన్నీ కేవలం అమెరికా, జర్మనీ నుంచే కావడం విశేషం! అందులోనూ 210 కోట్ల డాలర్ల దిగుమతులు ఒక్క అమెరికా నుంచే జరిగాయి! ఇంజనీరింగ్ అద్భుతం.. ఐరన్‌డోమ్ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. స్వల్పశ్రేణి రాకెట్లను రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేయగల సామర్థ్యం దీని సొంతం... ► హెజ్బొల్లా తొలిసారి ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలకొద్దీ రాకెట్లతో దాడి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2006లో ఐరన్ డోమ్ నిర్మాణానికి ఆ దేశం తెర తీసింది. ► ఇది 2011లో వాడకంలోకి వచి్చంది. ► 2021 మొత్తంలో హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ప్రయోగించిన రాకెట్లలో 90 శాతానికి పైగా ఐరన్‌డోమ్ నిర్వీర్యం చేసి సత్తా చాటింది. ► డోమ్ నిర్మాణానికి అమెరికా ఎంతగానో సాయం చేసింది. ► 1946–2023 మధ్య ఏకంగా 12,400 కోట్ల డాలర్ల విలువైన సైనిక, రక్షణపరమైన సాయాన్ని అమెరికా నుంచి ఇజ్రాయెల్ అందుకుంది!! ► అమెరికా తన 2022 బడ్జెట్లో కేవలం ఇజ్రాయెల్‌కు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నిమిత్తమే ఏకంగా 150 కోట్ల డాలర్లు కేటాయించింది! – పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! ► పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! రక్షణపై భారీ వ్యయం చుట్టూ శత్రు సమూహమే ఉన్న నేపథ్యంలో రక్షణపై ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తుంది. 2022లో సైనిక అవసరాలకు ఏకంగా 2,340 కోట్ల డాలర్లు వెచ్చించింది. ► దేశ జనాభాపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ తలసరి సైనిక వ్యయం ఏకంగా 2,535 డాలర్లు. ఖతర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
30 గంటల్లో కార్ పార్క్.. కాస్తా భారీ భూగర్భ ఆసుపత్రిగా: ఫోటోలు వైరల్
world's largest underground hospital in 30 hours ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఏడో రోజుకు చేరిన ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అణిచి వేసేందుకు ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు హైఫాలోని కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రపంచంలోని అతిపెద్ద అండర్ గ్రౌండ్ ఆసుపత్రి సిద్దమైపోయింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రాంబమ్ హెల్త్ కేర్ క్యాంపస్ (RHCC) పార్కింగ్ స్థలంలో తాత్కాలిక అత్యవసర అండర్‌గ్రౌండ్ ఆసుపత్రి సిద్దం చేశారు. అదీ కేవలం 30 గంటల్లో భారీ భూగర్భ ఆసుపత్రిగా మార్చారు. 1,300 పడకలతో, ఆక్సిజన్, వైద్య , శానిటరీ సామాగ్రి కోసం ఫిట్టింగ్‌లతో పూర్తి చేశారు. షవర్లు, సింక్లు, నీటి సరఫరాతో మరుగుదొడ్లు , మురుగు నీటి కనెక్షన్లు, 1,300 పడకలు క్లీన్ షీట్లు , దుప్పట్లతో అన్ని సిద్దంగా ఉన్నాయి. క్యూబికల్ల మధ్య ఉండే కేబుల్స్ ఆక్సిజన్ సరఫరాను లోపలికి పంపేలా, లేదా లోపలి మానవ స్రావాలను బయటకు పంపేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్లాస్ట్రోఫోబియా ఉన్నవారిలో ఆందోళన తగ్గించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది గోడలను పూల పోస్టర్లతో అలంకరించడం ద్వారా ఆ ప్రాంతాన్ని సజీవంగా మార్చడానికి ప్రయత్నించడం గమనార్హం. ఈ స్థలం చాలా అందంగా ఉండకపోవచ్చు, కానీ చాలా సురక్షిత మైందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నర్సు అయినట్ పెరెక్స్ అన్నారు. మూడు అంతస్తుల్లో, ప్రతి అంతస్తు 20వేల చదరపు మీటర్లకు పైగా ఉంటుందనీ, సాధారణ రోజుల్లో ఇది పార్కింగ్ స్థలం కానీ అత్యవసర పరిస్థితుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ ఆసుపత్రిగా మారిపోతుందని రాంబమ్ హాస్పిటల్ సీఈవో, డైరెక్టర్ జనరల్ మైఖేల్ హాల్బెర్తాల్ చెప్పారు. వాస్తవానికి 2006లో హిజ్బుల్లాతో జరిగిన సెకండ్ లెబనాన్ వార్ సందర్బంగా ద్వంద్వ-వినియోగ ఆలోచనతో ఇది ముందుకొచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రి చుట్టూ 400 రాకెట్ల వర్షం కురిసిందని అనస్థటిస్ట్ ఫిలిప్ అబెకాసిస్ గుర్తు చేసుకున్నారు. యుద్ధం తిరిగి వస్తే , దురదృష్టవశాత్తు యుద్ధం తిరిగి వస్తుందని తెలుసు. అపుడు ఈ పార్కింగ్‌ను అండర్‌గ్రౌండ్ హాస్పిటల్‌గా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వచ్చిందన్నారు. దాని ఫలితమే ఇది అని వెల్లడించారు. -
Israel Hamas War: చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై కత్తితో దాడి
ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిపై చైనాలో దాడి జరిగింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుల చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తను కత్తితో పొడిచినట్లు తెలిపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చిక్సి అందిస్తున్నారని.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడికి గల కారణాలు తెలియరాలేదు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ఏ విధమైన ప్రకటన చేయలేదు. బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఓ వైపు హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలు, యూదులు అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి ఇజ్రాయెల్, చైనా మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులను చైనా ఖండించకపోవడంపై బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుద్ధ పరిణామాల పట్ల చైనా వైఖరికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు మరోవైపు వారం రోజులుగా గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజా సరిహద్దు వెంట ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతున్న హమాస్ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. బాంబ్, వైమానిక దాడులతో విరుచుపడుతోంది. ఇప్పటి వరకు 6 వేల బాంబులను గాజాపై ప్రయోగించింది. గాజాస్ట్రిప్‌లోని ఇళ్ల కింద ఉన్న టన్నెల్స్‌లో హమాస్ టెర్రరిస్టులు దాక్కుడటంతో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. 24 గంటల్లో సిటీ వదిలి దక్షిణం వైపు వెళ్లాలని, ఉగ్రవాదులకు దూరంగా ఉండాలని గాజా పౌరులకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా హెచ్చరికలు జారీ చేసిందిమరోవైపు ఆహారం, ఇంధనం, నీరు, కరెంట్ నిలిపివేయడంతో గాజాలో పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళ వ్యక్తం చేసింది. పౌరుల తరలి వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు, విదేశీ బందీల మృతి -
తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా ఇరు వర్గాల మధ్య భయంకరమైన పోరు కొనసాగుతోంది. బాంబులు, వైమానిక దాడులతో నువ్వా-నేనా అనే రీతిలో ఇరు వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,417 మంది మృత్యువాడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహాస్ ఉగ్రవాదులకు చెందిన 1500 మృతదేహాలను ఇజ్రాయెల్‌లో గుర్తించారు, మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్‌కు చంఎదిన 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందిని బంధీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. గాజా సరిహద్దుల్లో హమాస్ దాడుల్లో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు రోడ్లపై, వీధుల్లో కుప్పలుకుప్పలుగా పడి ఉండిపోయాయి. ఈ మృతదేహాలను వివిధ స్వచ్చంద సంస్థలకు చెందిన వాలంటీర్లు సేకరిస్తున్నారు. అష్దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ.. జాకా అనే సంస్థలో గత 33 ఏళ్లుగా వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు అక్కడి మృతదేహాలను సేకరిస్తుంటుంది. దశాబ్ధాలుగా ఇదే పని చేస్తున్న యోసి.. తాజాగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలోనూ ఈ విధులే నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి ఈ క్రమంలో గాజా సరిహిద్దులో మరణించిన వారి మృతదేహాలను సేకరించే పనిలో పడ్డ యోసి.. హమాస్ మరణహోమంలో బలైన వారి శవాలను చూసి అతని గుండె తరుక్కుపోయింది. రోడ్డుపై శవాల కుప్పల, అత్యంత ఘోర స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదు. గర్భిణి అయిన మహిళ పొట్టను చీల్చి మరీ లోపలున్న శిశువును చంపడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ భయానక దృశ్యాల అనుభవాలను అతను ఓ మీడియాతో పంచుకున్నాడు. ‘రాకెట్ దాడులు జరుగుతున్నట్లు శనివారం ఉదయం నేను సైరన్ శబ్ధాలు రావడంతో క్షణాల్లోనే షెల్టర్లలోకి వెళ్లిపోయాం. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొచ్చుకొచ్చారని మాకు తెలిసింది. అనంతరం మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరాం. ఆ దారిలో మేం చూసిన దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. గాజా సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో కార్లు బోల్తా పడి ఉన్నాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇంత దారుణ విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను సేకరించేందుకు మేం వెళ్లాం. సాధారణంగా ఆ రోడ్డును దాటాలంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ప్రతి మృతదేహాన్ని సేకరించి బ్యాగుల్లో పెడుతూ ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు పట్టింది. బుల్లెట్లు దిగి, ధ్వంసమైన అనేక కార్లు ఇప్పటికీ దక్షిణ ఇజ్రాయెల్‌లో చెత్తకుప్పల్లా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతదేహాలను గుర్తించి ట్రక్కులో ఎక్కించాం. అక్కడి నుంచి కిబ్బుట్జ్‌లోని బీరీ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం గాజాకు కేవలం 5 కి.మీల దూరంలోనే ఉంటుంది. అక్కడ మొదట ఓ మహిళ మృతదేహాన్ని చూడగానే నాతో పాటు మా బృందం మొత్తానికీ స్పృహ కోల్పోయి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. గర్భవతైన మహిళ పొట్టను చీల్చి శిశువును బయటకు తీసి చంపారు. ఆ బిడ్డకు బొడ్డుతాడు ఇంకా అలానే ఉంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి' 20 మంది చిన్నారులతో సహా కొందరు పౌరుల చేతులను వెనక్కి కట్టి వారిని కాల్చి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని లాండౌ తెలిపారు. కొందరు యువతలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కిబ్బుట్జ్ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ జరిపిన మారణహోమంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్ ప్రేమ జంట ఫోటో వైరల్
Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్‌లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని, చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్‌బర్డ్స్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్ నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్, నిర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!) View this post on Instagram A post shared by Jewish Lives Matter (@jewishlivesmatter) జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది. లక్కీగా వారు ప్రాణాలతో బైటపడ్డారు. కానీ ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ కమెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు. ఎంత అద్భుతం, ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి ధన్యవాదాలు మరొకరు రాశారు. -
హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!
ఇజ్రాయెల్-హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్నిమిగులుస్తోంది. హృదయాల్నిమెలిపెట్టే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్‌లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని మరణం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇజ్రాయెలీ వార్తా సంస్థ Ynet ప్రకారం చావు బతుకులమధ్య అత్యంత దయనీయ పరిస్తితుల్లో కుటుంబ సభ్యులకు పంపిన సందేశం వైరల్ అవుతోంది. హమాస్ సాయుధుడి దాడిలో బోని తలకు తీవ్ర గాయమైంది. అయినా ఎలాగోలా తప్పించుకుంది. ఓ తాత్కాలిక షెల్టర్‌లో తలదాచుకుని అక్కడినుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. ‘‘నా మీద కాల్పులు జరిగాయి. మీ గురించి చాలా బాధపడుతున్నాను. నా తలకు తీవ్ర గాయమైంది’’ అంటూ మెసేజ్ చేసింది. కాసేపటి తరువాత మరో అప్డేట్ను కూడా ఇచ్చింది. తనకు సమీపంలోనే ఉగ్రవాది ఉన్నాడనీ, ఏ క్షణాన్నైనా తనను కాల్చేయొచ్చనే అందోళన వ్యక్తం చేసింది. ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తోంది, మానవ ప్రాణనష్టం జరిగినట్లు కనిపిస్తోందంటూ అక్కడి పరిస్థితిని వివరించింది. అలాగే ప్రస్తుతం తాను గోలానీ బ్రిగేడ్‌కు చెందిన గాయపడిన సైనికుడితో ఉన్నాననీ. ఇక్కడ తమకు ఎలాంటి బలగాలు అందుబాటులో లేవని కూడా ఆ మెసేజ్‌లో ఆమె పేర్కొంది. ఆ తరువాత తీవ్రంగా గాయపడిన బ్రెజిలై మెడికల్ సెంటర్లో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇక లేదని అధికారుల వివరాల బట్టి తెలుస్తోంది. అఫులాలో పుట్టి పెరిగింది బోని. ఏడు నెలల క్రితమే అక్కడి సైన్యంలో చేరింది. ఒక వారం క్రితం ఆమె పుట్టిన రోజును జరుపుకున్న బోనీ తిరిగి రావాలని కోరుకున్న కుటుంబ సభ్యులకు చివరకు విషాదమే మిగిలింది. కాగా హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఐదు రోజుల క్రితం వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి 2.3 మిలియన్ల జనాభాఉన్న గాజా స్ట్రిప్‌లోని పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నాటికి 1,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఎంత మంది పౌరులు ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలోగాజా నగరంలో ఆహార కొరత నెలకొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి వచ్చే రోగులతో నిండిపోయింది. ఒకవైపు ఆక్సిజన్‌తో సహా ఇతర అత్యవసర మందుల నిల్వలు క్షీణిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ అంతరాయంతో రోగులను కాపాడేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. -
Israel Palestine Conflict: హమాస్ దాడి వెనుక...
ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి ఒక్క ఆ దేశాన్నే గాక ప్రపంచమంతటినీ నిర్ఘాంతపరిచింది. నెలల తరబడి పక్కాగా ప్రణాళిక వేసుకుని మరీ చేసిన ఈ దాడి వెనక, ఇదే సమయాన్ని ఎంచుకోవడం వెనక కారణాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకరకంగా పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ మితిమీరిన దూకుడు విధానాలు ఈ దాడిని సమరి్థంచునేందుకు హమాస్‌కు అవకాశం కూడా కలి్పంచినట్టు కన్పిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న తెల్లవారుతూనే ఉరుముల్లేకుండానే పిడుగులు పడ్డాయి. జనం పిట్టల్లా రాలిపోయారు. రక్తం ఏరులై పారింది. బందీలుగా చిక్కిన వంద మందికి పైగా సైనికులు, పౌరులు నరకం చూస్తున్నారు. ఇంతటి ఉత్పాతానికి కారణమైన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడి గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ బలాబలాలు, నానాటికీ పెరుగుతున్న ఇజ్రాయెల్ దూకుడు దాన్ని ఇందుకు పురిగొలి్పన కారణాల్లో ప్రధానమైనవని భావిస్తున్నారు. అరబ్–ఇజ్రాయెల్ బంధం అరబ్ దేశాలతో సాధారణ సంబంధాల స్థాపనకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు కాస్తో కూస్తో ఫలించేలా కని్పస్తుండటం హమాస్‌ను కలవరపరిచిన రెండో అంశం. కొంతకాలంగా పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌పై అరబ్ దేశాల ఒత్తిడి తగ్గుతూ వస్తుండటం మరింత ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో అరబ్ దేశాల పెద్దన్నగా భావించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తుండటంతో హమాస్ అప్రమత్తమైంది. ఇదిలాగే కొనసాగితే పాలస్తీనాకు పూర్తి స్వాతంత్య్రం ఇక కల్లోని మాటేనన్న అంచనాకు వచి్చంది. ఇరాన్ దన్ను ఇరాన్‌తో కొన్నేళ్ల కిందటి దాకా క్షీణ దశలో ఉన్న సంబంధాలను హమాస్ క్రమంగా పట్టాలకెక్కించుకుంటూ వచి్చంది. 2022లో హమాస్ ప్రతినిధుల బృందం సిరియాలో ఇరాన్ నేతలతో పలుమార్లు భేటీ అయింది. అనంతరం లెబనాన్, ఇరాన్లలో జరిగిన పలు సమావేశాల ద్వారా సంబంధాల పునరుద్ధరణ జోరందుకుంది. ఇవన్నీ ఇజ్రాయెల్‌పై భారీ ఆకస్మిక దాడికి కావాల్సిన హేతుబద్ధమైన కారణాలు, అవకాశాలతో పాటు సాయుధ, ఆర్థిక తదితర వనరులను కూడా హమాస్‌కు చేకూర్చాయి. ఇప్పుడే ఎందుకు? హమాస్‌ను తాజా దాడి వెనక ప్రధానంగా మూడు కారణాలు కని్పస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది అతివాద ఇజ్రాయెల్ సర్కారు దూకుడు విధానాలు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్, జెరూసలేంల్లో యూదు సెటిలర్ల హింసను అది బాహాటంగా ప్రోత్సహించడం పాలస్తీనియన్ల ఆగ్రహానికి కారణమైంది. చివరికి ప్రతీకారేచ్ఛగా మారింది. సరిగ్గా అదే సమయంలో వెస్ట్‌బ్యాంక్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా దక్షిణాది నుంచి సైన్యాన్ని ఇజ్రాయెల్ ఉత్తరానికి తరలించడం హమాస్‌కు కలిసొచి్చంది. ఇప్పుడేం జరగనుంది? ముస్లింలకు అతి పవిత్రమైన అల్ అక్సా మసీదు వద్ద యథాతథ స్థితిని ఇజ్రాయెల్ ఉల్లంఘించకుండా చూడాలన్న స్వల్పకాలిక లక్ష్యాన్ని ఈ దాడి ద్వారా హమాస్ సాధించినట్టే కని్పస్తోంది. కానీ దీర్ఘకాలంలో సాధించదలచిన ఇజ్రాయెల్ వినాశనం, ముస్లిం రాజ్య ఏర్పాటు లక్ష్యాలు నెరవేరడం దేవుడెరుగు, గాజా స్ట్రిప్‌ను నామరూపాల్లేకుండా చేయకుండా ఇజ్రాయెల్‌ను అడ్డుకోవడమే హమాస్‌కు తలకు మించిన భారం కాగలదంటున్నారు. ఇజ్రాయెలీ బందీలను అడ్డుపెట్టుకున్నంత కాలమే హమాస్ ఆటలు సాగేలా కని్పస్తున్నాయి. అంతమెప్పుడు? ఈ పోరుకు ముగింపు ఎప్పుడు, ఎలా జరగనుందన్నది ప్రస్తుతానికైతే అస్పష్టమే. దీనికి సమీప భవిష్యత్తులో ఏదో రకంగా తెర పడాలంటే బహుశా అంతర్జాతీయ సమాజపు జోక్యమే ఏకైక మార్గమని భావిస్తున్నారు. ఆ సందర్భంగా తన దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ సైనికులు, పౌరులకు బదులుగా ఖైదులో ఉన్న పాలస్తీనియన్లను విడిపించుకోవడం హమాస్ ఉద్దేశంగా కని్పస్తోంది. ఆలోపు ఇజ్రాయెల్ భారీ ప్రతీకార దాడులకు దిగకుండా అడ్డుకునేందుకు కూడా బందీలు ఉపయోగపడతారని భావిస్తోంది. గాజాలో పౌర ఆవాసాలపై ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగిన మరుక్షణం బందీలను హతమార్చడం మొదలు పెడతామని హమాస్ అధికార ప్రతినిధి అబూ ఉబైదా ఇప్పటికే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో గాజాలోకి చొచ్చుకెళ్లి దాడులకు దిగడంపై ఇజ్రాయెల్ ఇప్పటికైతే ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. మరోవైపు ఈ దాడి ద్వారా గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాల్లో తనకు పెరిగిన ప్రతిష్ట రాజకీయంగా మరింతగా బలపడేందకు పనికొస్తుందని కూడా హమాస్ ఆశిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం
జెరూసలేం/టెల్ అవివ్/న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు. తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు. బందీలను ఎక్కడ దాచారో? ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య! హమాస్ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది. గాజాలో ఆకలి కేకలు ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది. మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్ అల్ షేక్ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వెల్లడించింది. హమాస్ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయాప్ ఎర్డోగాన్ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం భరోసా ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌దే పైచేయి! హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్ ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్, టెల్ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. -
Video: హమాస్ పైశాచికం.. ఇజ్రాయెల్ కుటుంబాన్ని బంధించి, బెదిరింపులు..
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయిదు రోజులుగా కొనసాగుతోంది. గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌లోకి చొరబడి మెరుపు దాడి ప్రారంభించిన హమాస్ వెనువెంటనే 5 వేల రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్దం ప్రకటించి వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది హమాస్ ఆక్రమించిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ మెల్లమెల్లగా గాజాపై పైచేయి సాధిస్తోంది. గాజాలో ఉగ్రవాదుల ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం కదంతొక్కుతుంది. ఇరుపక్షల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు. ఈ మారణహోమంలో పాలస్థీనా కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య జరుగుతున్న భీకర పోరులో పలు కంటతడి పెట్టించే వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, దాడులు చేయడం, రాకెట్ల ప్రయోగం వంటి వీడియో ఇప్పటికై వైరల్‌గామారిన విషయం తెలిసిందే. తాజాగా మరో హృదయ విదాకర వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లోకి చోరబడి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్న హమాస్ సైన్యం వారితో అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. మహిళలు, చిన్నారులను అడ్డుపెట్టుకొని ఫేస్బుక్ లైవ్ ద్వారా మహాస్ ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియోలో.. ఓ వ్యక్తి, అతని పక్కన భార్య, ఆమె ఒడిలో ఓ చిన్నారి ఉన్నారు. వీరితోపాటు పక్కన మరికొంతమంది చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తూ నోరు పట్టుకొని ఉండటం కనిపిస్తోంది. చదవండి: భారత్-కెనడా వివాదం: అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య భేటీ! వ్యక్తి కాలు వెంట రాక్తం కారుతున్నప్పటికీ.. ఓ ముష్కరుడు ఆ కుటుంబాన్ని మాట్లాడమంటూ ఆదేశించాడు. ‘మీ దేశంతో మాట్లాడండి. మేము ఇక్కడ ఉన్నామని వారికి చెప్పండి’ అంటూ హమాస్ ఉగ్రవాది వారితో అనడం వినిపిస్తోంది. అతను గాజాకు దగ్గరగా ఉన్న నహాల్ ఓజ్ కిబ్బత్జ్‌లో ఉన్న ఇంట్లోకి ప్రవేశపెట్టినట్లు హమాస్ మిలిటెంట్ చెప్పాడు. ఆ వ్యక్తి కాలిలోకి బుల్లెట్లు దించినట్లు కెమెరాను చూస్తూ చెప్పాడు. దంపతుల కుమారిడిపై తుపాకీ గురిపెట్టి.. పక్కన ఉన్న వ్యక్తులను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బెదిరించాడు. దీనికి సంబంధఙంచిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి మారణహోమం సృష్టించిన హమాజ్ మిలిటెంట్ సంస్థ.. చిన్నారులు, మహిళలు సహా 150 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుంది. ఎలాంటి హెచ్చరిక లేకుండా గాజా స్ట్రిప్‌లోని పౌరుల నివాసాలపై ఇజ్రాయెల్ బాంబును వేసిన ప్రతిసారీ ఒక బందీని చంపేస్తానని బెదిరించింది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ముట్టడించాలని ఆదేశించి.. ఆ ప్రాంతానికి విద్యుత్, ఆహారం, ఇంధనం, నీటిని నిలిపివేసిన తరువాత హమాస్ నుంచి ఈ హెచ్చరికలు చేసింది. Hamas broke into a Kibbutz and killed over 100 innocent people... They even decapitated children.... But the first thing Sinn Fein supporters and Gerry Carroll do, is wave their Palestinian flegs... When people show you their morals the first time, remember to believe them... pic.twitter.com/KCF3r2coLJ — The Wee Doggie (@The_Wee_Doggie) October 11, 2023 ఈ బెదిరింపుల కారణంగా గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగేందుకు ఇజ్రాయెల్ సైన్యం వెనకాడుతోంది. అయితే బందీల అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా హమాస్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్వదేశంలోనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బందీలను చంపే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై తన భారీ సైనిక దాడిని సడలించే సంకేతాలను చూపించడం లేదు. దీనికితోడు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌ను ఐసీస్‌తో పోల్చుతూ.. గాజా ఉగ్రవాదులు పిల్లలను బంధించి, కాల్చివేసి, ఉరితీశారని అన్నారు. -
ఇజ్రాయెల్ వార్‌పై పుతిన్ షాకింగ్ కామెంట్స్.. అమెరికాకు వార్నింగ్!
మాస్కో: ఇజ్రాయెల్‌లో భయంకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య బాంబు దాడుల నేపథ్యంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజా పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికా పాలసీనే వైఫల్యమే కారణమని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఇజ్రాయల్-పాలస్తీనా అంశంపై పుతిన్ స్పందించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ‘స్వతంత్ర సార్వభౌమ’ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ‘అవసరం’ ఉందని పుతిన్ అన్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య హింస చెలరేగడానికి అమెరికా పాలసీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా స్వతంత్ర పాలస్తీనా దేశ ఆవశ్యకతను విస్మరించిందన్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాల వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా యత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. ఇరువైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదుర్చడంలో వాషింగ్టన్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 1967 యుద్ధంలో జెరూసలెంని ఇజ్రాయిల్ ఆక్రమించింది. రష్యా ఇరు దేశాలతో టచ్ లో ఉందని, వివాదాన్ని పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పుతిన్ చెప్పారు. Is the World War 3 near? I am warning that America doesn't interfere in Palestine Israel war, If America does that we will openly help Palestine ~Vladimir Putin#IsraelPalestineWar #VladimirPutin #Russia pic.twitter.com/gAcka9qJ27 — Harsh Sharma (@kikalikesyou) October 9, 2023 ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఏడాదిన్నరకు పైగా రష్యా సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అయితే, ఒకవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తూనే మరొకవైపు పుతిన్.. పాలస్తీనాకు మద్దతుగా ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని, సిరియా, ఇరాన్‌లను యుద్ధంలోకి దూకవద్దని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే భారీ యుద్ధ నౌకను అక్కడికి పంపిన విషయం తెలిసిందే. His Entire Nuclear Family Wiped Out During The B*mbing of Gaza. Drone Footage! Music | Selena | Rihanna |YE | 50 CENT| Israel War | Hamas | Iran | US United States | UK Britain London England | #viralvideo #snapchat #Esther | #ViralPicture #Memes #LGBT #Offset #Israel #Hamas pic.twitter.com/0GVH7kwQV0 — Coon Memes (@CoonMeme) October 11, 2023 ఇది కూడా చదవండి: ఫలిస్తున్న ఇజ్రాయెల్ ప్లాన్.. హమాస్‌కు ఊహించని షాక్! -
హమాస్ అరాచకం.. చనిపోయినట్లు నటించినా.. చంపేశారు
ఇజ్రాయెల్- గాజా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల అమానవీయ చేష్టలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గాజా సరిహద్దుల్లోని మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కిబ్బుజ్ రీమ్ వద్ద శనివారం జరిగిన సూపర్ నోవా పార్టీకి హాజరైన ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు భీకర కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 250 మంది అమాయక ప్రజలు మరణించారు. ముష్కరులకు భయపడి చెట్లు, పొదల చాటున దాక్కున్న వారినీ వెతికి మరీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఓ 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ చనిపోయినట్లు నటించినా.. ఆమె శ్వాసను గుర్తించి బతికే ఉందని గ్రహించి ప్రాణం తీశారు. ఈ ఘటనలో తన సోదరి అత్యంత దారుణంగా మరణించినట్లు ఇజ్రాయెల్ టెలివిజన్ హోస్ట్‌గా చేస్తున్న మాయన్ అడమ్ తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హృదయవిదాకర పోస్టు షేర్ చేసింది. ఇందులో తన సోదరి మరణించిన విధానాన్ని తన ఫాలోవర్లకు వివరించింది. The aftermath of Hamas attack on the music festival in Israel. At least 200 people were killed, and the number is likely to grow. This reminds me so much of Bucha. The murders of innocent civilians. The destruction. The fear. Pure terrorism. pic.twitter.com/qhxeKFGbUC — Anton Gerashchenko (@Gerashchenko_en) October 9, 2023 మాయన్ ఆడమ్ సోదరి మపల్ ఆడమ్ ఆమె ప్రియుడు రోయ్తో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లిందని కాసేపటికకే అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో భయంతో వీరిద్దరూ ఓ ట్రక్కు కింద దాక్కున్నట్లు తెలిపింది. ముష్కరుల నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటించినట్లు వెల్లడించింది. అయినా ఉగ్రవాదులు గుర్తించి, దగ్గరకొచ్చి శ్వాస ఉన్నట్లు తెలిసి కాల్చి చంపినట్లు తెలిపింది. ఈ ఘటనలో మాపల్ ఆడమ్ ప్రాణాలు కోల్పోగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్ రోయ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొంది. అంతేగాక చనిపోయే ముందు ట్రక్కు కింద దాక్కొని ఉండగా ఓ ఫోటో కూడా తీసింది సోదరికి పంపించింది.ఆ ఫొటోను మాయన్ ఆడమ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ..‘మాపల్ చనిపోయే ముందు తన ఫోన్లో తీసిన చివరి ఫొటో ఇది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం కొన్ని గంటల పాటు వారు కదలకుండా చనిపోయినట్లు నటించారు. కానీ ఉగ్రవాదులు ఆమెను అతి దారుణంగా చంపేశారు. ప్రియుడి చేతిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ తుపాకీ గాయాలతో పక్కన పడిపోయాడు. మా కుటుంబం ముక్కులుగా నలిగిపోయింది. ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మపల్ గతంలో సైన్యంలో పనిచేశారు. ఇదిలా ఉండగా సౌత్ ఇజ్రాయెల్‌లోని మారుమూల ప్రాంతంలోశనివారం సూపర్నోవా పార్టీ జరిగింది. వేలాది మంది యువతి, యువకులు ఈ పార్టీలో డాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడుతుండగా.. ఇజ్రాయెల్ పైరులపై హమాస్ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. ఆకాశంలో నుంచి పారాచూట్లతో దిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఉన్నట్టుండి కాల్పుల శబ్ధాలు వినిపించడంతో చాలా మంది తమ ప్రాణాలను కాపాడటం కోసం పార్కింగ్ వైపు పరుగుతీశారు. అయినప్పటికీ హమాస్ ఉగ్రవాదులు ఫెస్టివల్‌కు హాజరైన దాదాపు 250 మందిని కాల్చి చంపేశారు. -
పాలస్తీనాకు కాంగ్రెస్ సపోర్ట్.. సోషల్ మీడియాలో పొలిటికల్ వార్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైతం.. గాజాపై ఎదురుదాడికి దిగింది. ప్రతిదాడులు చేస్తూ మిలిటెంట్లను తరమికొడుతోంది. మరోవైపు.. భారత్ సహా కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ప్రకటించాయి. ఇక, భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. దీంతో.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా మాటల పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పాలస్తీనీయులకు మద్దతుగా తీర్మానం చేసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్ ఉగ్రవాదులకు ఊతమిస్తోందని, వారికి మద్దతుగా నిలుస్తోందని పలువురు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ బెంగళూరు పార్లమెంటు సభ్యుడు, బీజేపీ యువ నేత తేజస్వీ సూర్య చేసిన ట్వీట్ తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సోషల్ మీడియా వార్.. కాగా, తేజస్వీ సూర్య ట్విట్టర్ వేదికగా.. ‘ఇజ్రాయెల్ ముద్ధంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం.. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు చక్కటి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టేసింది. మోదీ రాకతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. దీనికి కాంగ్రెస్ కౌంటరిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసిన పాత లేఖ ఒకదాన్ని కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. గత ఏడాది నవంబరు 22న రాసిన ఈ లేఖ పాలస్తీనీయులను ఉద్దేశించింది కావడం గమనార్హం. Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour. — Narendra Modi (@narendramodi) October 7, 2023 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ పాలస్తీనా సందర్భంగా రాసిన ఈ లేఖలో పాలస్తీనా కారణానికి భారత్ గట్టిగా మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలను ఈ లేఖలో ప్రస్తావించారు. పాలస్తీనా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి భారత్ చేస్తున్న సాయాన్ని ప్రస్తావించారు. అయితే.. తాజాగా పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం మొదలైన సందర్భంగా మోదీ.. ఇజ్రాయెల్‌కు మద్దతు పలకడం విశేషం. హమాస్ జరిపిన ఆకస్మిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీంతో, బీజేపీ డబుల్ గేమ్ విధానాలను కాంగ్రెస్ ఎత్తిచూపుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. Congress’s CWC resolution on Israel war is a classic example of how Indian foreign policy was hostage to Congress’s minority vote bank politics, until Modi happened. Also, a reminder on how quickly things will go back to zero if we aren’t vigilant in 2024. https://t.co/nJYk3mDCwq — Tejasvi Surya (@Tejasvi_Surya) October 9, 2023 -
భార్యకు గుడ్‌బై.. ఇజ్రాయెల్ కోసం భర్త సంచలన నిర్ణయం
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్లె లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. దీంతో, ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. I am drafted as well to serve and defend my country Israel. 🇮🇱 I said goodbye to my wife India, who sent me with blessings and protection of God. From now on she will be managing and posting on my behalf so be nice to her. 😉🇮🇱😊 @indianaftali pic.twitter.com/K8O56kAQH7 — Hananya Naftali (@HananyaNaftali) October 9, 2023 ఇదిలా ఉండగా.. తాను పుట్టిన దేశంలో కోసం ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధ రంగంలోకి దిగుతున్నారు. దేశానికి సేవ చేసేందుకు తమంట తాముగా ముందుకు వస్తున్నారు. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెల్‌వాసులు కదనరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది. దీంతో, కన్నబిడ్డలను, కుటుంబాలను వదిలి.. హమాస్‌పై పోరాడేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ జర్నలిస్టు సైతం తాను సైన్యంలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. The reason we are deployed is not just to defend our borders, it’s literally to defend our homes and families. This is a war between good and evil. #IsraelUnderAttack pic.twitter.com/xNWmJmHhxX — Hananya Naftali (@HananyaNaftali) October 9, 2023 వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు తన భార్యను వదిలి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన గైర్హాజరీలో తన సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ‘నా దేశాన్ని రక్షించుకునేందుకు, సేవ చేసేందుకు వెళ్తున్నాను. నా భార్య ‘ఇండియా నఫ్తాలీ’కు గుడ్‌బై చెప్పేశాను. ఆమె నన్ను ఆశీర్వదించింది. భగవంతుడి రక్షణ నాకు అండగా ఉంటుందని చెప్పింది. ఇక నుంచి నా తరపున నా సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’ అని తెలిపారు. ఇదే సమయంలో ఇది మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. I rushed to the bomb shelter as rocket sirens sounded in Tel Aviv. My heart breaks for my neighbors. I see some of their kids crying and the elderly not making it down the stairs in time. pic.twitter.com/G6C3xgAVzM — India Naftali (@indianaftali) October 9, 2023 ఆ తర్వాత నఫ్తాలీ మరో వీడియోను పోస్టు చేస్తూ.. తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదని, తమ ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవడానికని పేర్కొన్నారు. ఓ బాంబు షెల్టర్‌లో నఫ్తాలీ-ఇండియా ఇద్దరూ ఉన్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ఇండియా నఫ్తాలీ కంటతడి పెడుతూ కనిపించారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ జర్నలిస్తు నఫ్తాలీని ప్రశంసిస్తున్నారు. దేశంలో తనకున్న అంకితభావంపై అభినందనలు కురిపిస్తున్నారు. నిజమైన దేశభక్తి ఇదీ అంటూ పొగుడుతున్నారు. "I promised him I’ll be back soon." This is only one father out of thousands of parents who have had to say goodbye to their children, as 300,000 Israelis report for reserve duty. The IDF and the people of Israel will stand strong and united in the face of any threat. pic.twitter.com/356qUyLtEW — Israel Defense Forces (@IDF) October 9, 2023 ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో 9 మంది అమెరికన్లు మృతి -
Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం
జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దక్షిణ గాజాలోని రఫాలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 19 మంది మృతిచెందారు. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. అడపాదడపా రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. గాజాలో వెయ్యికి పైగా టార్గెట్లపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గాజా దిగ్బంధానికి ఆదేశాలు గాజాలో హమాస్ ముష్కరులను, వారి ప్రభుత్వాన్ని తుదముట్టిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. హమాస్‌ను ఇప్పటికే చాలావరకు బలహీనపర్చామని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ తమ సైన్యాన్ని ఆదేశించారు. గాజాకు విద్యుత్, ఆహారం, ఇంధనం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో 24 కాలనీలు ఉండగా, 15 కాలనీలను ఖాళీ చేయించారు. మిగిలినవాటిని 24 గంటల్లోగా ఖాళీ చేయిస్తామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. గాజాపై ఇప్పటిదాకా వైమానిక దాడులకే పరిమితం అయిన ఇజ్రాయెల్ ఇక భూ యుద్ధంపై దృష్టి పెట్టింది. నేరుగా భూమిపైనుంచే క్షిపణులు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. యుద్ధం వల్ల గాజాలో 1,23,000 మంది నిరాశ్రయులయ్యారని, ఇళ్లు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గాజా బయట తమ పోరాటం కొనసాగుతోందని, సోమవారం ఉదయం మరికొంతమంది ఇజ్రాయెల్ పౌరులను బంధించామని హమాస్ ప్రతినిధి అబ్దెల్–లతీఫ్ అల్–ఖనౌవా చెప్పారు. ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడిపించి, స్వేచ్ఛ ప్రసాదించడమే తక్ష లక్ష్యమని ఉద్ఘాటించారు. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడానికి సహకరించాలంటూ ఇజ్రాయెల్ కోరిందని ఈజిప్టు అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం మిత్రదేశం ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. సైనిక సాయం అందిస్తోంది. తూర్పు మధ్యదరా సముద్రానికి యుద్ధ నౌకలను పంపించింది. ఇంకా అదనపు సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 260 మృతదేహాలు లభ్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో శనివారం సూపర్నోవా ఫెస్టివల్లో ఆనందంగా గడుపుతున్న జనంపై హమాస్ ముష్కరులు హఠాత్తుగా దాడి చేశారు. సైనిక దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 260కిపైగా మృతదేహాలను ఇజ్రాయెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం గాజాకు సమీపంలోనే ఉంది. నా భార్యాబిడ్డలను అపహరించారు యువకుడు యెనీ అషెర్ గాజా సరిహద్దుకు సమీపంలో ఇజ్రాయెల్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. హమాస్ మిలిటెంట్లు అతడి భార్య డోరన్, కుమార్తెలు రజ్(5), అవివ్(3)ను శనివారం అపహరించారు. ఎక్కడ దాచారో తెలియడం లేదు. వారి కోసం అషెర్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. వారిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకంటున్నాడు. ఫోన్లో మాట్లాడుతుండగానే చంపేశారు ఇలాన్ ట్రోయెన్ అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె డెబోరా మతియాస్, అల్లుడు స్కోమ్లీ మతియాస్, మనవడు ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. శనివారం ఆమె అమెరికాలో ఉన్న తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతుండగా హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డెబోరా, స్కోమ్లీ దంపతులు బలయ్యారు. వారి 16 ఏళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు ఇజ్రాయెల్ ఆయాగా పనిచేస్తున్న కేరళ మహిళ షీజా ఆనంద్ హమాస్ మిలిటెంట్ల దాడిలో గాయపడ్డారు. కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పయ్యావూర్కు చెందిన షీజా ఆనంద్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని సముద్ర తీర నగరం అషె్కలాన్లో ఆయాలో పని చేస్తున్నారు. శనివారం హమాస్ మిలిటెంట్ల అషె్కలాన్పై రాకెట్లు ప్రయోగించంతో ఆమె గాయాలపాలయ్యారు. భారత్‌లో ఉన్న భర్త ఆనంద్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు షీజా ఆనంద్‌ను ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆదివారం మధ్యాహ్నం షీజా భారత్‌లోని తన తల్లితో మాట్లాడారు. ‘అమ్మా.. ఐయామ్ ఓకే’ అని చెప్పారు. -
Israel-Palestine war: ఫార్మాపై ప్రభావం తక్కువే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలస్తీనా–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత ఫార్మాపై పడే అవకాశం లేదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. దేశం నుంచి ఇజ్రాయెల్‌కు 2022–23లో ఎగుమతైన ఔషధాల విలువ రూ.766 కోట్లు. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం కంటే అధికం. దేశీయ మార్కెట్ నుంచి బల్క్ డ్రగ్స్ (ఏపీఐ), డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఆ దేశానికి సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఫార్మా రంగంలో వాణిజ్యం తక్కువగా ఉన్నందున.. ఫార్మాస్యూటికల్ వ్యాపారంపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ‘ఔషధ తయారీ రంగంలో ఇజ్రాయెల్ బలంగా ఉంది. అలాగే అధిక నియంత్రణ కలిగిన ఫార్మా మార్కెట్ ఆ దేశం ప్రత్యేకత. సహజంగానే యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఉంటాయి’ అని అభిప్రాయపడ్డారు. -
రత్నాలు–ఆభరణాల వాణిజ్యంపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ వివాదం భారత్– ఇజ్రాయెల్ మధ్య రత్నాలు, ఆభరణాల వ్యాపారంపై ప్రభావం చూపుతుందని ఎగుమతిదారులు సోమవారం తెలిపారు. 2021–22లో భారత్ రెండు దేశాల మధ్య రత్నాలు, ఆభరణాల వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ విలువ 2.04 బిలియన్ డాలర్లుగా ఉంది. కట్, పాలి‹Ù్డ వజ్రాలు భారతదేశం నుండి ఇజ్రాయెల్‌కు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. తర్వాతి స్థానంలో ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాల వాటా ఉంది. ఇక ఇజ్రాయెల్ నుంచి భారత్ ప్రధానంగా కఠిన (రఫ్) వజ్రాలను దిగుమతి చేసుకుంటోంది. 2022–23లో సరుకులు, సేవల రంగాలలో మొత్తం భారతదేశం–ఇజ్రాయెల్ వాణిజ్యం దాదాపు 12 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23లో ఇజ్రాయెల్ నుండి భారత్‌కు జరిగిన ఒక్క సరుకు ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లు. వెరిసి ఇది 6.1 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుకు దారితీసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో డీజిల్, కట్, పాలి‹Ù్డ వజ్రాలు ఉన్నాయి. దిగుమతుల్లో రఫ్ డైమండ్స్, కట్ అండ్ పాలి‹Ù్డ డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, టెలికం పరికరాలు, పొటాషియమ్ క్లోరైడ్, హెర్బిసైడ్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో భారత్ వాణిజ్యం ఎక్కువగా ఎర్ర సముద్రంలో ఉన్న ఈలాట్ నౌకాశ్రయం ద్వారా జరుగుతోంది. నిపుణులు ఏమన్నారంటే... ఇజ్రాయెల్‌కు భారత ఎగుమతులపై తాజా పరిణామాల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇక్క డ రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురికావచ్చు. రఫ్ వజ్రాలకు దేశంలో కొరత ఏర్పడే వీలుంది. – కొలిన్ షా, కామా జ్యువెలరీ ఎండీ ఇజ్రాయెల్‌లోని మూడు అతిపెద్ద నౌకాశ్రయాలు – హైఫా, అష్డోద్, ఈలత్లలో కార్యకలాపాలు అంతరాయం కలిగితే ఆ దేశంతో భారత్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎగుమతులకు ప్రతికూల పరిణామం ఇది. – అజయ్ శ్రీవాస్తవ, జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు ఈ వివాదం స్వల్పకాలంలో భారతీయ ఎగుమతిదారులపై ప్రభావం చూపుతుంది. యుద్ధం తీవ్రతరం అయితే, ఆ ప్రాంతానికి ఎగుమతులు జరిపే ఎగుమతిదారులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. – శరద్ కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ -
మానవాళి కోరుకోని యుద్ధం
ఆ దృశ్యాలు ఏదో హార్రర్ సినిమానో, మరేదో అమెరికన్ వార్ సినిమానో చూస్తున్నట్లుంది. ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ‘హమాస్’ తీవ్రవాద సంస్థ జరిపిన ఆకస్మిక దాడులు, బదులుగా గాజా భూఖండంపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల దృశ్యాలు మూడు రోజులుగా చూస్తున్న వారికి ఒళ్ళు ఝల్లుమనేలా చేస్తున్నాయి. భారీ విధ్వంసాలు, 1200 మందికి పైగా మృతులు, వేలల్లో నిరాశ్రయులు, పసిపిల్లల మొదలు పదహారేళ్ళ పడుచుల దాకా తీవ్రవాదుల చేతిలో చిక్కిన వందకు పైగా బందీల కథ మానవతావాదుల గుండెను బరువెక్కిస్తోంది. పొరుగున ఉన్న అరబ్ దేశాలతో ఇప్పుడిప్పుడే ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపడుతున్నాయనీ, ఆర్థిక సహకారం – శాంతి సాధనే ధ్యేయంగా సరికొత్త మధ్యప్రాచ్యానికి బాటలు పడుతున్నాయనీ భావిస్తున్న వేళ ఉరుము లేని పిడు గులా హమాస్ దాడి మొత్తం కథను మార్చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చేసిన అనివార్య యుద్ధప్రకటన కాలాన్ని వెనక్కి తిప్పేసింది. తాజా ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో దశాబ్దాల పాటు మధ్యప్రాచ్యంలో కొనసాగిన అశాంతి మళ్ళీ భూతమై తిరిగొచ్చింది. ఇది యాభై ఏళ్ళ నాటి జ్ఞాపకాలను తట్టిలేపింది. అప్పట్లో 1973 అక్టోబర్ 6న యూదుల లెక్కలో పవిత్రమైన యోమ్ కిప్పూర్ రోజున ఈజిప్ట్, సిరియాలు సరిగ్గా ఇలాగే ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి. 1949, 1956, 1967 తర్వాత ‘నాలుగో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం’గా పేరుబడ్డ ఆ 19 రోజుల యుద్ధంలో చివరకు ఇజ్రాయెల్ పైచేయి సాధించి, పొరుగు భూభాగాలను స్వాధీనం చేసు కుంది. దాంతో, పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అప్పటిలానే మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్‌పై భయానక దాడి జరిగింది. అదీ పవిత్ర హిబ్రూ బైబిల్లోని తొలి అయిదు భాగాల సమాహారమైన తోరా పఠనం ప్రారంభించే రోజున జరిగింది. గూఢచర్యంలో, దాడుల్ని నిరోధించే వ్యవస్థల్లో పేరున్న ఇజ్రాయెల్ ఈసారీ ఏమరుపాటుతో ఉంది. అక్టోబర్ 7 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న వేళ ఆకాశ, సముద్ర, భూ మార్గాలు మూడింటి ద్వారా, ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో హమాస్ తీవ్రవాదులు ఆకస్మిక దాడి జరిపి, దిగ్భ్రాంతికి గురిచేశారు. 5 నుంచి 7 వేల రాకెట్ల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్ అన్నట్టు ఒక రకంగా ఇది... 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో అంతర్జా తీయ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై అల్–ఖైదా తీవ్రవాదుల ‘9/11 దాడుల’ను గుర్తుచేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ క్షిపణి – రాకెట్ నిరోధక వ్యవస్థ ‘ఐరన్ డోమ్ సిస్టమ్’ను సైతం తప్పించుకొని, వందలాది రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొని రావడం నివ్వెరపరింది. ఇది నెతన్యాహూ సర్కార్ వైఫల్యాల్లో కొత్త చేరిక. తూర్పు జెరూసలేమ్‌లోని పవిత్ర అల్–అక్సా మసీదుకు వచ్చే పాల స్తీనా భక్తులపై దాడులు, మసీదులోకి యూదుల ప్రవేశం లాంటి రెచ్చగొట్టే చర్యలు పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చాయి. తాజా దాడి నుంచి ఇజ్రాయెల్ వెంటనే తేరుకొని, హమాస్ కీలక కేంద్రాలపై ప్రతి దాడులు జరిపింది. జొరబడిన హమాస్ తీవ్రవాదులను నిర్వీర్యం చేసింది. ఇప్పుడప్పుడే తెగే అవ కాశం లేని ఈ యుద్ధంలో సైనిక బలిమితో చివరకు ఇజ్రాయెలే గెలవచ్చు కానీ, ఇరువైపులా జరిగే నష్టం మాటేమిటి? ఇరాన్‌ను శత్రువుగా భావిస్తూ, దాన్ని శిక్షించడానికి ఇజ్రాయెల్‌ను వాటంగా చేసు కుంటున్న అమెరికా ఈ ఒత్తిడి వ్యూహం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు చల్లారవని గ్రహించాలి. మధ్యప్రాచ్యంలో మంటలు ఈనాటివి కావు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో లక్షలాది పాలస్తీనియన్లు నిరాశ్రయులై, సొంత గడ్డ మీదే శరణార్థులు కావాల్సి వచ్చింది. నాటి నుంచి పాలస్తీనియన్లకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య పోరు సాగుతూనే ఉంది. గతంలో 2008–09లో, 2014లో ఇజ్రాయెల్‌కీ, హమాస్‌కీ మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ, కథ కంచికి చేరలేదు. నిజానికి, పాలస్తీనియన్ ప్రజలందరికీ హమాస్ ప్రతినిధి అనుకోవడం కూడా పొరపాటే. ఆ తీవ్రవాద సంస్థ చేసిన చర్యలన్నిటికీ పాలస్తీనాను తప్పుబట్టలేం. కానీ, దీర్ఘకాలిక పాలస్తీనా సమస్యకు పరిష్కారానికి చర్చలు, శాంతియుత మార్గమే సాధనం. అది గ్రహించకుండా హింసకు దిగేవారిని కూడా క్షమించలేం. తీవ్రవాద దాడుల దుష్ఫలితం ఇప్పటికే ప్రతిదాడుల రూపంలో గాజా భూఖండంలో అమాయకులపై పడింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, సుస్థిరతలు కావాలంటే పాలస్తీని యన్లకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య పరస్పర అంగీకారయోగ్యమైన రాజకీయ రాజీ కుదరాలి. స్వతంత్ర పాలస్తీనా దేశమనేది అసాధ్యమైన వేళ ఆచరణయోగ్య పరిష్కారం వైపు ఆలోచించాలి. పాలస్తీనా పక్షాన ఇజ్రాయెల్‌కు ఎదురొడ్డుతున్న ఇరాన్, సిరియా, లెబనాన్‌లోని హెజ్బొల్లా బృందం అది గ్రహించాలి. ఉక్రెయిన్ యుద్ధంతో అస్తుబిస్తవుతున్న ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు. భారత్ సంగతికొస్తే, రక్షణ వ్యవహారాల్లో బలమైన భాగస్వామి అయిన ఇజ్రాయెల్ చేతిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో దశాబ్దాల తరబడి పాలస్తీనా అంశంలో బాధితుల గళానికి మద్దతుగా నిలిచిన చరిత్ర మనది. ఆ చారిత్రక వైఖరిని పూర్తిగా వదిలేసి, ఇరాన్‌తో పాటు వివిధ అరబ్బు దేశాలతో స్నేహానికి పీటముడి వేసుకోనూ లేము. ‘ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తున్నాం’ అని భారత ప్రధాని ప్రకటించారు. దురాక్రమణలు, తీవ్రవాద దాడులను విస్పష్టంగా ఖండించాల్సిందే. అదే సమయంలో గాజా భూఖండంపై ప్రతీకార దాడుల వల్ల ఇప్పటికే నిరాశ్రయులైన లక్షా పాతిక వేల మంది సామాన్య పౌరులపై మానవతాదృష్టి సారించాల్సిందే. అందుకు మనం ఇప్పుడు ఆచితూచి అడుగేయాలి. తటస్థంగా ఉంటూ, శాంతి స్థాపనకు కృషి చేయాలి. పాలస్తీనియన్లకు కొద్దిపాటి సడలింపులిస్తే ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలకు సిద్ధపడ్డ సౌదీ అరేబియా సైతం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మానవాళి కోరుకోని ఈ యుద్ధం ఆగాలి. -
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి, రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా?
తమ దేశ భూభాగంలోకి చొరబడి..హమాస్ ఉగ్రవాదులు పారించిన రక్తపుటేరులపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. హమాస్ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలోని ముష్కరుల స్థావరాలను నేలమట్టం చేస్తోంది. వారిని ఏరిపారేస్తుంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా ఉద్రికత్తలు రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? విశ్లేషకులు ఏమంటున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వల్ల భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అనలిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలోని పెట్టుబడుల్ని పెంచారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక శాతానికి పైగా పెరిగాయి. మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్ (28.35 గ్రాము)కు 1.2 శాతం పెరిగి 1,853.79 డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.2 శాతం పెరిగి 1,867.80 డాలర్లకు చేరుకుంది. రానున్న రోజుల్లో బంగారం 1,880 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, అయితే 1,900 డాలర్లు అధిగమించి బాండ్ ఈల్డ్స్ (బాండ్స్) వచ్చే ఆదాయం గణనీయంగా మరింత గణనీయంగా పడిపోవడంపై ఆధారపడి ఉంటుందని సిటీ ఇండెక్స్ సీనియర్ అనలిస్ట్ మాట్ సింప్సన్ రాయిటర్స్‌తో అన్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు సురక్షితమని భావిస్తున్నారు. కాబట్టే బంగారం ధరలు పెరుగుతున్నాయని యూకేకి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సిటీ ఇండెక్స్ సీనియర్ అనలిస్ట్ మాట్ సింప్సన్ రాయిటర్స్‌తో అన్నారు. అనిశ్చితి సమయాల్లోనూ బంగారమే ఇజ్రాయెల్ - పాలస్తీనా ఉద్రికత్తలు ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకు కారణం చమురు ధరలు పెరుగుదలకు కారణమైంది. పైగా యుఎస్ ట్రెజరీస్, యుఎస్ డాలర్, జపనీస్ యెన్, బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచింది. దీంతో ఏడు నెలలుగా తక్కువగా ఉన్న పసిడి ధర గత శుక్రవారం ఏడు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అనిశ్చితి సమయాల్లో బంగారం పెట్టుబడులపై ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. ఏదేమైనా, అమెరికాలో ఉద్యోగాల నియామకాల్ని పరిమితం చేసింది. ఇది సమీప భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది. -
ఇజ్రాయెల్ యుద్ధం.. ఆయిల్ ధరలకు రెక్కలు!
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ శనివారం (అక్టోబర్ 7) ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున రాకెట్ల దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం ఎక్కువగా దెబ్బతింది. వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కల్పోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం (అక్టోబర్ 9) 4 శాతానికి పైగా పెరిగాయి. ముడి చమురు అధికంగా ఉన్న ప్రాంతంలో యుద్ధ వాతారణం నెలకొనడంతో చమురు సరఫరాలపై ఆందోళనలు తలెత్తాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఆసియా మార్కెట్లె బ్రెంట్ 4.7 శాతం పెరిగి 86.65 డాలర్లకు చేరుకోగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 4.5 శాతం పెరిగి 88.39 డాలర్లకు చేరుకుంది. సర్వత్రా ఆందోళన హమాస్ ఆకస్మిక దాడి, దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటన చేయడం వల్ల 1,000 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఇరాన్లలో ఉద్రిక్తతలు విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, సౌదీ అరేబియా ఉత్పత్తి కోతల కారణంగా సరఫరా తగ్గిపోవడంతో చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి. తాజాగా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధ సంక్షోభం ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళలను మరింత పెంచుతోంది. -
ఇజ్రాయెల్‌కు అమెరికా విమాన వాహక నౌక.. ఇక హమాస్‌కు చుక్కలే?
టెల్ అవివ్/జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి విమాన వాహక నౌకను పంపాలని అమెరికా నిర్ణయించింది. ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అక్కడికి వెళ్లాలని ఆదివారం పెంటగాన్ ఆదేశించినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. 5వేల నావికులు, యుద్ధ విమానాలతో కూడిన ద యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వాహక నౌకను, క్రూజ్లను, డిస్ట్రాయర్స్‌ను పంపనున్నట్లు తెలిపారు. The United States is moving the USS Gerald R. Ford, the world's largest aircraft carrier and largest warship, to the shores of Israel. Hamas Statement: "The relocation of the American aircraft carrier does not frighten us, and the Biden administration must understand the… pic.twitter.com/7CjUGchzSB — OLuyinka🀄️🔌 (@Luyinkacoaltt) October 9, 2023 LATEST:-Hamas fires Hundreds of rockets towards Tel Aviv Airport,, Israel.#IsraelPalestineWar #IsraelPalestineWar #hamasattack #hamasattack #FreePalastine #FreePalastine #Palestine #IStandWithPalestine #طوفان_القدس #IsraelPalestineWar pic.twitter.com/3LyEl2FJ2E — M Musharraf sheikh (@m_m_musharraf) October 9, 2023 ఇది ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడంతోపాటు హమాస్‌కు అదనపు ఆయుధాలను సమకూర్చే వారిపై నిఘా ఉంచనుంది. వర్జీనియా కేంద్రంగా ఉండే ఈ విమాన వాహక నౌక ప్రస్తుతం మధ్యధరా సముద్ర ప్రాంతంలోనే ఉంది. నౌకా విన్యాసాల కోసం ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ గ్రూప్‌లో క్రూజ్ యూఎస్ఎస్ నార్మండీ, డిస్ట్రాయర్లు యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రాంపేజ్, యూఎస్ఎస్ క్యార్నీ, యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్‌తోపాటు ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి. Gaza is being heavily bombed at the moment. Video from today’s bombing. #GazaUnderAttack #Gaza #IsraelPalestineWar#Palestine #Hamas #Palestinian #IsraelUnderAttack #Israel #Mossad #Israel #IsraelUnderAttack #PalestinaLibre #Hizbullah #Lebanon #IsraelAtWar pic.twitter.com/4siVZpl8Mp — Pulkit Sharma (@_Pradhyumn_) October 9, 2023 ఇక, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వడంపై టర్కీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అనవసరంగా ఈ విషయంలో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. 🚨BREAKING🚨 Turkey Leader🇹🇷 Tayyip Erdoĝan: "America stay away ,we will defend palestine at any price". #طوفان_القدس #جوري_المغربيه #FreePalestine #Israel #IsraelUnderAttack #Palestine #Gaza #Hamas #حماس_تنتصر #حماسpic.twitter.com/ZaHvdozUX9 — Mahad (@MahadCricket) October 9, 2023 ఇదిలా ఉండగా.. యుద్ధం తీవ్రతరం కావడం వల్ల మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. ఇజ్రాయెల్‌లో 700 మందికి పైగా మరణించారు. గాజాలో కనీసం 400 మంది మరణించినట్టు సమాచారం. ఇరువైపులా 2,000 మంది చొప్పున గాయపడినట్లు తెలుస్తోంది. తమ సైనిక దళాలు 400 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలియజేశాయి. చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. Gaza is being heavily bombed at the moment. Video from today’s bombing. #GazaUnderAttack #Gaza #IsraelPalestineWar#Palestine #Hamas #Palestinian #IsraelUnderAttack #Israel #Mossad #Israel #IsraelUnderAttack #PalestinaLibre #Hizbullah #Lebanon #IsraelAtWar pic.twitter.com/4siVZpl8Mp — Pulkit Sharma (@_Pradhyumn_) October 9, 2023 బందీలపై తీవ్రవాదుల అత్యాచారాలు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లో బీభత్సం సృష్టించారు. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వీరిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ బందీలను అడ్డం పెట్టుకొని పెద్ద బేరమే ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనావాసులు ఖైదీలుగా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉన్నారు. వీరిని విడిపించుకోవడానికి మిలిటెంట్లు ఇజ్రాయెల్ బందీలను పావులుగా ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు చాలామంది ఇజ్రాయెల్ పౌరులను మిలిటెంట్లు అపహరించినట్లు ప్రచారం సాగుతోంది. BREAKING – Hamas militants started a new air assault on parts of Israel !!#Israel #hamasattack #GazaUnderAttack #IsraelUnderAttack #Palestine #Gaza #Israel_under_attack #IsraelPalestineWar pic.twitter.com/z0YbHdyB43 — عساف (@Sa91af) October 8, 2023 భారతీయులు క్షేమం.. ఇజ్రాయెల్, గాజాలో భారతీయులంతా ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. భారతీయులకు తాము అందుబాటులో ఉంటున్నామని, వారి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నామని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశాయి. మరోవైపు గాజాలో వాతావరణం భయంకరంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు. ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌కు ఈ నెల 14 దాకా తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
Israeli-Palestinian Conflict: రంగంలోకి లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లు
టెల్ అవివ్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువులైన హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హెజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం ఒక్కడి నుంచి మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.ప్రతిగా ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో లెబనాన్ వైపు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఉత్తర సరిహద్దులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులుండగా దక్షిణ ప్రాంతంలో పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది. -
Israeli-Palestinian Conflict: దేశాన్నే వణికిస్తున్న బుల్లి సంస్థ!
హమాస్. అత్యాధునిక నిఘాలో, అంతకుమించిన సైనిక సంపత్తిలో ప్రపంచంలోనే తిరుగులేనిదని పేరున్న ఇజ్రాయెల్‌ను మెరుపు దాడులతో నిలువునా వణికించిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్. పక్కా ప్రణాళిక ప్రకారం భూ, జల, వాయుతలాల గుండా దాడులకు దిగి గుక్కతిప్పుకోనివ్వలేదు. ఇంతకీ ఏమిటీ సంస్థ? ఎందుకు ఈ స్థాయిలో దాడులకు దిగింది? ఇంతటి శక్తి సామర్థ్యాలను ఎలా సంతరించుకుంది...? పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న సాయుధ సంస్థ హమాస్. ఇజ్రాయెల్ వినాశనం, ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనే లక్ష్యమని ప్రకటించుకుంది. 2007లో గాజాను చేజిక్కించుకున్న నాటినుంచీ ఇజ్రాయెల్‌తో ఎన్నోసార్లు పోరుకు దిగింది. హమాస్ అంటే హర్కతల్ ముఖవమా అల్ ఇస్లామియా. రాజకీయ పారీ్టగా మొదలై సాయుధ సంస్థగా మారింది. 2000లో రెండో తిరుగుబాటులో భాగంగా ఇజ్రాయెల్‌పై భారీ దాడులకు పాల్పడి వందల మందిని బలి తీసుకుంది. ► శనివారం నాటి దాడి ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన వాటిలో అత్యంత తీవ్రమైనది. ఈజిప్టు, సిరియా ఇలాగే ఇజ్రాయెల్‌పై సరిగ్గా 50 ఏళ్ల కింద, 1973లో మెరుపు దాడికి దిగాయి. అది మధ్యప్రాచ్యంలో తీవ్ర యుద్ధంగా çమారింది. ► 2000లో బందీగా దొరికిన ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడిని అడ్డం పెట్టుకుని వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయించుకుంది. తాజాగా భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులను నిర్బంధించిన ఆ సంస్థ, ఈసారి ఏ స్థాయిలో బేరం పెడుతుందన్నది తేలాల్సి ఉంది! ► ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్ హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. ► ఈ సంస్థకు ఇరాన్ దన్నుగా నిలుస్తోంది. నిధులు, ఆయుధాలతో పాటు సాయుధ శిక్షణ ఇస్తోంది. తుర్కియే, ప్రవాస పాలస్తానీయులు, ప్రైవేటు దాతలతో పాటు పలు ఇస్లామిక్ సంస్థలు సాయం చేస్తుంటాయి. పాలస్తీనా సంగతేంటి? ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణ ఇప్పటిది కాదు. అవి ఆవిర్భవించినప్పటి నుంచీ నిత్య రావణకాష్టంలా రగులుతోంది. వెస్ట్‌బ్యాంక్, గాజాలను కలిపి పాలస్తీనాగా పిలుస్తారు. రోమన్ సామ్రాజ్య కాలంనాటి పాలస్తీనాలో నేటి తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్ కలిసే ఉంటాయి. బైబిల్లో వీటిని యూదు రాజ్యాలుగా పేర్కొన్నారు. యూదులు వీటిని తమ పూర్వీకుల భూభాగంగా పరిగణిస్తారు. ► 1948లో ఇజ్రాయెల్ తనను తాను స్వతంత్రదేశంగా ప్రకటించుకుంది. దీన్ని పాలస్తీనా ముస్లింలు మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ► పాలస్తీనియన్లతో పాటు అరబ్ దేశాలు తమ సైనిక చర్యలో పాల్గొని ఇజ్రాయెల్‌ను తుడిచి పెట్టాలని హమాస్ సైనిక కమాండర్ మొహమ్మద్ దెయిఫ్ శనివారం దాడులు మొదలయ్యాక వీడియో సందేశంలో పిలుపునిచ్చాడు. ► అరబ్బు దేశాల మాట అటుంచితే వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం పాలస్తీనియన్లు ఆ పిలుపునకు ఏ మేరకు స్పందిస్తారన్నది చూడాలి. ► పాత జెరూసలేంలోని అల్ అక్సా మసీదుపై నియంత్రణ దాడికి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. క్రైస్తవులతో పాటు ముస్లింలు, యూదులకు ఇది అతి పవిత్ర ప్రాంతం. ఇది ఇజ్రాయెల్ అ«దీనంలో ఉంది. శాంతి ఒప్పందానికి లోబడి అక్కడ ముస్లింల ప్రార్థనలకు అనుమతిస్తూ వస్తోంది. మసీదుకు పహారాగా ఉండే ఇజ్రాయెలీ దళాల దన్నుతో యూదు అతివాదులు అక్కడ హల్చల్ చేస్తుండటం హమాస్ ఆగ్రహానికి మరో కారణం. గాజా స్ట్రిప్ కథ ఇదీ.. ఇజ్రాయెల్, ఈజిప్టు, మధ్యదరా సముద్రం మధ్యన ఉండే కేవలం 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు భూభాగమిది. అక్కడ జనాభా ఏకంగా 23 లక్షలు! ► గాజా గగనతలమే గాక చాలావరకు సముద్ర తీరం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి గాజాలోకి ఆహార పదార్థాలు, నిత్యావసరాల సరఫరాను అనుమతిస్తోంది. అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వం! దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో రాజకీయ పారీ్టలన్నీ చేతులు కలుపుతున్నాయి. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అన్ని పారీ్టల ప్రతినిధులతో కూడిన అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు జరుపుతున్నాయి. దీనిపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, విపక్ష నేతలు యాయిర్ లాపిడ్ బెన్నీ గాంట్జ్ ఇప్పటికే చర్చించుకున్నారు. అత్యవసర ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరేందుకు విపక్ష నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కళ్లు గప్పి.. ఇజ్రాయెల్‌కు పకడ్బందీగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ప్రపంచం నలుమూలల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్ నిఘా వర్గాలకే మొట్టమొదట సమాచారం అందుతుంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇజ్రాయెల్ కళ్లు గప్పి హమాస్ మిలిటెంట్లు ముప్పేట దాడులకు తెగబడడం అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలైన షిన్బెత్, మొసాద్‌ల గురించి ఎప్పుడూ ఆ దేశం గర్వంగా చెప్పుకుంటుంది. గాజా సరిహద్దుల్లో భారీగా భద్రతా సిబ్బంది మోహరించి ఉంటారు. నిరంతరం సీసీ కెమెరాలు పని చేస్తూ ఉంటాయి. ఆర్ట్ థర్మల్ ఇమేజింగ్, మోషన్ సెన్సర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లను దాటుకొని హమాస్ మిలిటెంట్ల దాడులకు దిగారంటే కచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్న అభిప్రాయాలున్నాయి. మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో సరిహద్దుల్లో కంచెలు దాటిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దిగుతూనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.సరిహద్దులు దాటడానికి పారా గ్లైడర్లు హమాస్ వినియోగిస్తుందని ఇజ్రాయెల్ ఊహకి కూడా అందలేదు. ుద్యాధర సముద్రం నుంచి చిన్న చిన్న బోట్లలో గాజా మీదుగా ఇజ్రాయెల్‌లోకి అడుగు పెట్టారు. పికప్ ట్రక్కుల్లో భారీ మిషన్ గన్లుతో భూ మార్గంలో చొచ్చుకువచ్చారు. సరిహద్దులు దాటినప్పుడు భారీగా పేలుడు పదార్థాలు వినియోగించారు. కొందరు మిలిటెంట్లు వైర్లను కట్ చేసుకుంటూ కంచెలు అడ్డం తొలగించి లోపలికి వచ్చారు. ఇలా ఏకకాలంలో మూడు మార్గాల ద్వారా దాడులకు దిగడంతో తేరుకొని ఎదురు దాడులకు దిగేలోపుల నష్టం జరిగిపోయింది. హమాస్ మిలిటెంట్లు పకడ్బందీగా దాడులు జరపడానికి పదేళ్ల కిందట నుంచే విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పారాగ్లైడర్ల దాడికి శిక్షణ తీసుకున్న వీడియోలను హమాస్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐరన్ డోమ్‌ను దాటుకొని మరీ.. ఇజ్రాయెల్ వద్ద శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఉంది. దూసుకొచ్చే శుత్రుదేశ రాకెట్ల దిశకు తగ్గట్లు ప్రతిగా రాకెట్లను ప్రయోగించి వాటిని ధ్వంసం చేయడంలో ఐరన్‌డోమ్ వ్యవస్థ పేరుగాంచింది. అయితే హమాస్ మిలిటెంట్లు ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ తికమకపడేలా లెక్కలుమిక్కిలిగా అంటే 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లను ప్రయోగించారు. ఇన్నాళ్లూ 80% సక్సెస్ రేటుతో పని చేసిన ఐరన్ డోమ్ వ్యవస్థ దీంతో ఒక్కసారిగా చేతులెత్తేసింది. ఈ రాకెట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Palestine war: భీకర యుద్ధం
టెల్ అవివ్/జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం మొదలైన ఘర్షణ ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకువచి్చన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది. ఈ దాడుల్లో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే 20,000 మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్లు అంచనా. దాడులు, ప్రతి దాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌లో 600 మందికిపైగా, గాజాలో 370 మందికిపైగా మొత్తంగా దాదాపు వేయి మంది మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో ఉన్నట్లు ప్రధాని నెతన్యాహూ కేబినెట్ ఆదివారం ప్రకటించింది. సంక్షోభ నివారణకు సైనిక పరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. బందీలపై తీవ్రవాదుల అత్యాచారాలు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లో బీభత్సం సృష్టించారు. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వీరిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ బందీలను అడ్డం పెట్టుకొని పెద్ద బేరమే ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనావాసులు ఖైదీలుగా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉన్నారు. వీరిని విడిపించుకోవడానికి మిలిటెంట్లు ఇజ్రాయెల్ బందీలను పావులుగా ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు చాలామంది ఇజ్రాయెల్ పౌరులను మిలిటెంట్లు అపహరించినట్లు ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్‌లో వందలాది మంది... ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో మరణించిన వారి సంఖ్య ఇప్పటిదాకా 600కు చేరినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో 44 మంది సైనికులు ఉన్నారని తెలిపాయి. ఇజ్రాయెల్ ఎదురుదాడిలో గాజాలో 370 మందికి పైగా మృతి చెందారని పాలస్తీనా అధికారులు చెప్పారు. ఇరువైపులా 2,000 మంది చొప్పున గాయపడినట్లు సమాచారం. తమ సైనిక దళాలు 400 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలియజేశాయి. చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. తల్లిదండ్రుల కళ్లెదుటే పసిబిడ్డ హత్య హమాస్ తీవ్రవాదులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వారి ఘాతుకం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచి్చంది. తీవ్రవాదులు ఇజ్రాయెల్‌లో ఓ కుటుంబాన్ని బందీలుగా మార్చారు. తమ అ«దీనంలో ఉన్న భార్యాభర్తలు, వారి ఇద్దరి కుమార్తెలు, కుమారుడిని హింసించారు. ఒక పసిబిడ్డను ఆమె తల్లిదండ్రుల కళ్లెదుటే మెడు తాడు బిగించి చంపేశారు. అది చూసి బిగ్గరగా రోదిస్తున్న మరో కుమార్తె, కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ సోదరి స్వర్గానికి వెళ్లింది’ అని అరుస్తూ చెప్పారు. ఇజ్రాయెల్ జర్నలిస్టు హనాయా నఫ్తాలీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతీయులు క్షేమం.. ఇజ్రాయెల్, గాజాలో భారతీయులంతా ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. భారతీయులకు తాము అందుబాటులో ఉంటున్నామని, వారి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నామని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశాయి. మరోవైపు గాజాలో వాతావరణం భయంకరంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు. ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌కు ఈ నెల 14 దాకా తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
ఇజ్రాయెల్‌లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్
Updates.. ►హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 250 మంది మృతి ►ఇజ్రాయెల్ దాడుల్లో 232 మంది పాలస్తీనియన్లు మృతి యుద్ధంలోకి లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ ►ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. ►ఆదివారం హెజ్బొల్లా గ్రూప్ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్ షెల్స్‌ను ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ►ఈ స్థావరాలు ఇజ్రాయెల్ ఆధీనంలోని గోలన్‌హైట్స్ వద్ద ఉన్నాయి. ►ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది. ►తాము పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా దాడి చేసినట్లు ప్రకటన చేసింది. ►ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. జిబ్‌డెన్ ఫామ్, షీబా ఫామ్స్ వద్ద ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ►ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్ నుంచి మద్దతు లభించిందని హమాస్ ప్రకటించింది. ►తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది. An entire Israeli Artillery Battery consisting of at least 5 M109A5 “Doher” 155mm Self-Propelled Howitzers, 2 M548 “Alfa” Support Vehicles, and a M113 Command Vehicle spotted on the move tonight in the City of Sderot near the Gaza Strip. pic.twitter.com/DuzTH0yUif — OSINTdefender (@sentdefender) October 8, 2023 పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు ►మరోవైపు హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్ దళాలు తిప్పికొట్టాయి. ►ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం వెల్లడించలేదు. ►తమపైకి మోర్టార్ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించంది. ►గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ 1981లో స్వాధీనం చేసుకుంది. Rockets being fired from Southern Lebanon into Israel. It is heading towards a full blown Arab-Israel war like 1967.pic.twitter.com/9x6MGOaKd8 — Shining Star 🇮🇳 (@ShineHamesha) October 8, 2023 బందీలుగా సైనికులు, పౌరులు ►హమాస్ గ్రూప్ చేసిన ఉగ్రదాడిలో కనీసం 100 మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు బందీలయ్యారు. ►హమాస్ మిలిటెంట్ల దాడిలో ప్రాణాల కోసం పోరాటం జరుగుతోంది. ►ఈ మేరకు యూఎస్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ట్విట్టర్లో పేర్కొంది. పాలస్తీనా అధ్యక్షుడితో బ్లింకన్ చర్చలు.. ►పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్లో చర్చలు జరిపారు. ►వెస్ట్‌బ్యాంక్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. ►అదే సమయంలో ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు బ్లింకన్ వెల్లడించారు. ►ఆ ప్రాంతంలోని దేశాలు కూడా ఈ దాడిని ఖండించాలని పేర్కొన్నారు. ►ఈ విషయాన్ని పాలస్తీనా అథారిటీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. The aftermath of a Hamas raid on a kibbutzim#MilitaryPOV #Israel #Gaza #TelAviv #Palestina #Palestinian #BREAKING #OperationIronSwords #IsraelUnderAttack #Hamas #AlAqsaFlood pic.twitter.com/RugDQ8wEWd — MilitaryPOV (@MilitaryPOV) October 8, 2023 ఎలాంటి చర్యలకైనా సిద్ధం.. ►తమ పౌరులను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యలనైనా చేపడతామని ఐరాస భద్రతా మండలికి ఇజ్రాయెల్ ప్రతినిధి గలీద్ ఎర్డాన్ వెల్లడించారు. ►ఈ మేరకు ఆయన శనివారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ►ప్రస్తుతం గాజా పట్టీ నుంచి జరుగుతున్న దాడుల నుంచి తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని తెలిపారు. డ్యాన్స్ పార్టీపై హమాస్ దాడులు.. ►ఇజ్రాయెల్‌లో ఉత్సాహంగా జరుగుతున్న ఓ డ్యాన్స్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. ►ప్రాణాలు కాపాడుకునేందుకు నిస్సహాయంగా పరుగులు తీస్తున్నవారిని పిట్టల్లా కాల్చిచంపారు. ►కొద్దిసేపట్లోనే ఆ పార్టీ జరుగుతున్న పొలం రక్తసిక్తమైంది. ►మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ►రాకెట్ల దాడి ఆగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పార్టీకి హాజరైన అతిథులు కార్లను ఒకేసారి తీయడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ►ఆ ప్రాంతంలోకి వచ్చిన హమాస్ ఉగ్రవాద బృందాలకు ఇది అవకాశంగా దొరికింది. వారిని చుట్టుముట్టి ఫైరింగ్ మొదలుపెట్టారు. Remember it’s not a warcrime when Israel and NATO allies do it#USA #EU #Britain #Palestine #Gaza pic.twitter.com/yCVa28Ga52 — K Boz (@KBoz3) October 8, 2023 ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించిన ప్రపంచదేశాలు ►భారత్ సహా బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. ►మరోవైపు కొందరు హమాస్ మద్దతుదారులు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. ►దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ►హమాస్ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో లండన్ వీధుల్లో సంబురాలు చేసుకుంటూ కనిపించారు. ►దీనిపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు స్పందించారు. ►భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారి తీయొచ్చు. ►లండన్ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించం. అలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసు గస్తీని పెంచాం. నెటిజన్ల ఆగ్రహం.. ►ఇజ్రాయెల్‌లో ఎంతోమంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారు. ►అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ►దాడి చేసిన వారికి మద్దతుగా లండన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. ►యూరప్‌లో చాలా మంది యూదులపై మాత్రమే దాడి జరుగుతుందనుకుంటున్నారు. ►హమాస్ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని భావించడం మూర్ఖత్వం అని ట్వీట్లు చేస్తున్నారు. Muslims in London celebrate the atrocities in Israel. #Israel #Hamas #Palestine #Palestinian #IronDome #Gaza #TelAviv pic.twitter.com/0rySuFpge8 — Paul Golding (@GoldingBF) October 7, 2023 ►ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. ►పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. మిలిటెంట్ల దాడుల్లో దాదాపు 500 మంది మృత్యవాతపడినట్టు తెలుస్తోంది. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ►ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఈ దాడులను ప్రతిఘటించడంలో ఇజ్రాయెల్‌కి అమెరికా అండగా ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ►ఈ సందర్బంగా బైడెన్ మాట్లాడుతూ.. ‘మానవీయ కోణంలో ఇదొక ఘోరమైన విషాదం. నేను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడాను. ఈ ఉగ్రదాడిని ఎదుర్కొంటున్న దేశ ప్రజల వెంట అమెరికా ఉంటుందని హామీ ఇచ్చాను. ఈ సమయంలో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడానికి ఇజ్రాయెల్‌కు పూర్తి హక్కు ఉంది. నా పాలనలో ఇజ్రాయెల్ భద్రతకు ఇచ్చే మద్దతు అచంచలమైనది. వారి ప్రజలకు సాయం చేయడంలో, దాడుల్ని ప్రతిఘటించడంలో వెన్నంటే ఉంటాం. ఇజ్రాయెల్ శత్రులెవరైనా ఈ దాడుల్ని అడ్డుపెట్టుకొని ప్రయోజనం పొందాలని చూడొద్దు అంటూ హెచ్చరించారు. "In this moment of tragedy, I want to say to them and to the world, and to terrorists everywhere, that the United States stands with Israel. We will not fail to have their back" : President Joe Biden.#IsraelUnderAttack #IsraelPalestineWar pic.twitter.com/bSRlyyXLuH — Vijesh Kumawat (@Real_Vijesh) October 8, 2023 ► మరోవైపు.. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ దాడులపై ట్రంప్ స్పందిస్తూ.. దాడులకు ఖండిస్తున్నాం. ఈ దాడులకు జో బైడెన్‌నే కారణం. అమెరికా పౌరులు చెల్లించిన పన్నులే ఈ దాడులు చేయడానికి సాయపడ్డాయి. బైడెన్ పరిపాలనా యంత్రాంగం నుంచి వచ్చిన అనేక నివేదికలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. ► ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా అమెరికా ఇరాన్‌కు గత నెలలో 6 బిలియన్ డాలర్లను మంజూరు చేసింది. ఆ నిధులనే హమాస్ దాడులకు వినియోగించారని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోందన్నారు. ఇదే సయమంలో హమాస్ దాడులు దారుణమైనవని, సాయుధ బలగాలతో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడానికి అన్ని హక్కులూ ఇజ్రాయెల్‌కు ఉన్నాయన్నారు. Trump condemns Hamas attacks on Israel, suggests Biden Criminal Gang funding behind attacks https://t.co/rS2XKPlxn2 — Charles 🇺🇲 🙏🇮🇱 (@Charles36896311) October 8, 2023 ►ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులను భారత్ కూడా ఖండించింది. ఇజ్రాయెల్‌లో దాడులపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ►ఈ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. బాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడుతాం’ అని స్పష్టం చేశారు. ఇక, మోదీ మద్దతుపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. ఆపదలో భారత్ మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే? -
Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని, చేజిక్కించుకున్న ఇజ్రాయెల్ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఊహించని దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ తేరుకుని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరువర్గాల ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోరా్టర్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది. తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే’’అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ముందుగా చొరబాటుదారులను ఏరేస్తాం. అనంతరం భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరతాం’’అని ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్నేళ్లలో ఆ దేశంపై జరిగిన అతి తీవ్ర దాడి ఇదే. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 14 చోట్లనుంచి చొరబాటు...! ఇజ్రాయెల్‌లోకి కనీసం 7 నుంచి 14 ప్రాంతాల గుండా మిలిటెంట్లు చొచ్చుకొచి్చనట్టు చెబుతున్నారు. తొలుత వివాదాస్పద గాజా స్ట్రిప్ నుంచి తెల్లవారుజామున రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశమంతటా వాయుదాడి సైరన్లు మోగాయి. ఆ వెంటనే మిలిటెంట్లు దేశంలోకి చొచ్చుకొచ్చారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దక్షిణాన గాజా–ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్‌సైకిళ్లు, వాహనాల్లో, పారా గ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. ప్రతిగా సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది. అల్ హక్సా మసీదుపై ఇజ్రాయెల్ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్ మిలిటరీ వింగ్ నేత మొహమ్మద్ దెయిఫ్ పేర్కొన్నాడు. దీన్ని ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’గా అభివరి్ణంచాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్ దాకా ఉన్న పాలస్తీనియన్లంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఈ దాడి నెతన్యాహూ నాయకత్వ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తింది. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, భారీ ఆందోళనలకు ఆయన కారకుడవడం తెలిసిందే. దాడి నేపథ్యంలో సైనిక ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండ: మోదీ ఇజ్రాయెల్‌పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. బాధిత పౌరులు, కుటుంబాల క్షేమం కోసం ప్రారి్థస్తున్నానంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడిని అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించగా. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పలు ఇతర దేశాలు కోరాయి. అక్కడి భారతీయులకు అడ్వైజరీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయు లు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అ నవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దని పేర్కొంది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఇంగ్లిష్తో పా టు హిందీ, మరాఠా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయె ల్లో 18 వేల మంది దాకా భారతీయులున్నారు. -
ఇజ్రాయెల్ X పాలస్తీనా వందేళ్ల కుంపటి..!
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్‌కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూరీ్వకులకు చెందిన ప్రాంతమని తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్బులు అదే తమ మాతృభూమి అని దానిని వదల్లేమని కరాఖండీగా చెబుతూ వచ్చారు. 1920–40 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యూరప్‌లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదులు సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆరంభమైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు యూదులు, అరబ్బుల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇచ్చి జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఇజ్రాయెల్ ఆవిర్భావంతో యుద్ధవాతావరణం ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. దీంతో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకంచడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోయారు. అప్పట్నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. హమాస్ ఏర్పాటుతో సంక్షోభం 1987లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ హమాస్ సంస్థ ఆవిర్భావం తర్వాత సంక్షోభం మరింత ముదిరింది. పాలస్తీనాకు చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించిన హమాస్ తొలుత రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. 2000 సంవత్సరంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతల నివారణకు క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనియన్లకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం గాజా సిటీ హమాస్ ఆ«దీనంలో ఉంది. వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ అ«దీనంలో ఉండడంతో తరచూ ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో మరోసారి ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలవంతంకాలేదు. దీంతో సమస్య అలాగే ఉండిపోయింది. కొలిక్కి రాని సమస్యలివే..! ఇజ్రాయెల్ జెరూసలేం మొత్తాన్ని తన రాజధానిగా ప్రకటించుకుంటే, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను తమ భవిష్యత్ రాజధానిగా ప్రకటించుకున్నారు. ► 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగినప్పటికీ ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే చూస్తోంది. ► వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం ఇప్పటికి ఇంకా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉంది. ► ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ మారాయి. ► వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనల్ని తోసిరాజని ఎన్నో అక్రమ కట్టడాలను నిర్మించింది. వాటిని తొలగించే అంశంలో వివాదం నెలకొంది. ► పాలస్తీనా శరణార్థుల భవిష్యత్‌పై ఆందోళనలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్‌లో భయానక దాడులు.. స్పందించిన మోదీ..
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. హమాస్ మిలిటెంట్లు.. రాకెట్లు ప్రయోగంతో విరుచుకుపడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. బాంబు దాడుల కారణంగా ఇప్పటికే 50 మందికి పైగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఇక, ఈ దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇజ్రాయెల్‌లో దాడులపై స్పందిచారు. ఈ నేపథ్యంలో మోదీ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం.. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. ఇక, ఇజ్రాయెల్‌లో దాడులపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఈ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. బాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడుతాం’ అని స్పష్టం చేశారు. Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour. — Narendra Modi (@narendramodi) October 7, 2023 మరోవైపు.. ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌ను పాటించాలని కోరింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే బాంబ్ షెల్టర్ల వద్ద ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండంటూ టెల్ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. Breaking : Indian Gov has released an advisory for Indian Nationals currently living in #Israel to stay safe & be in the regular contact with Indian Embassy. If Situations severe more in coming days GOI may ask it's citizen to leave Israel 🇮🇱 🇮🇳#Israel #IsraelUnderAttack pic.twitter.com/769Cy8kFih — Vivek Singh (@VivekSi85847001) October 7, 2023 ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులను అగ్రరాజ్యం అమెరికా కూడా ఖండించింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మేం అండగా ఉంటాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే? -
ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే?
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడులతో పదుల సంఖ్యలో సామాన్యపౌరులు మృతిచెందారు. వీరు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి 5వేల రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. Approximate of 2000 people running from a party where hamas militants attacked #Israel #Palestine pic.twitter.com/BRiOGm7cPK — meh° (@ImMehulOkk) October 7, 2023 మరోవైపు.. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్ ఆల్-అక్సా స్ట్రామ్’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. హమాస్ ఏర్పాటు ఇలా.. హమాస్ ఒక మిలిటెంట్ ఉద్యమం. హమాస్, హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామియా (ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్) యొక్క సంక్షిప్త రూపం. ఇది గాజా స్ట్రిప్‌లో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లను పాలిస్తుంది. ఈ హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్‌కు సాయుధ ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందింది. షేక్ అహ్మద్ యాసిన్ అనే పాలస్తీనా మత గురువు హమాస్‌ను స్థాపించాడు. డిసెంబర్ 1987లో గాజాలో హమాస్‌ను బ్రదర్హుడ్ రాజకీయ విభాగంగా యాసిన్ తయారు చేశారు. More Israelis being taken hostage. #Israel #Hamas #Palestine #Palestinian #IronDome #Gaza #TelAviv pic.twitter.com/v005TC7IC7 — Paul Golding (@GoldingBF) October 7, 2023 ఇజ్రాయెల్ నాశనమే టార్గెట్.. ఆ సమయంలో హమాస్ యొక్క ఉద్దేశ్యం పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ), ఇజ్రాయెల్‌ను హింసాత్మకంగా ప్రతిఘటించడమే లక్ష్యం. ఈ మేరకు 1988లో, హమాస్ తన చార్టర్‌ను ప్రచురించింది. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని, చారిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. PLO నాయకుడు యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యిట్జాక్ రాబిన్ ఓస్లో ఒప్పందాలపై సంతకం చేయడానికి ఐదు నెలల ముందు ఏప్రిల్ 1993లో హమాస్ మొదటిసారిగా ఆత్మాహుతి బాంబు దాడిని ప్రారంభించింది. హమాస్‌కు ఎలా నిధులు సమకూరుతాయి? డజన్ల కొద్దీ దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. 1997లో అమెరికా హమాస్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హమాస్‌కు ఇరాన్ వస్తుపరంగా, ఆర్థికపరంగా సహాయాన్ని అందిస్తోంది. టర్కీ దాని అగ్ర నాయకులలో కొంతమందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని పాలస్తీనా ప్రవాసులు మరియు ప్రైవేట్ దాతలు నిధులను అందిస్తున్నారు. అదనంగా, పశ్చిమ దేశాలలోని కొన్ని ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు హమాస్ మద్దతు ఉన్న సామాజిక సేవా సమూహాలకు డబ్బును పంపిస్తున్నాయి. హమాస్ ద్వారా వందల మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించడానికి ఇజ్రాయెల్ ఖతార్‌కు అనుమతిస్తోంది. ఇతర విదేశీ సహాయం సాధారణంగా PA మరియు UN ఏజెన్సీల ద్వారా గాజాకు చేరుకుంటుంది. 2017 నుంచి దాడులు తీవ్రం.. ఇదిలా ఉండగా.. 2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు. జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు అంటూ అప్పట్లోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. శాంతి కోరుతున్న అంతర్జాతీయ సమాజం.. ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు విన్నవిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా వీలైనంత త్వరగా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కోరాయి. కానీ, దాడులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వందల మంది సామాన్యపౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. -
యుద్ధ భయం.. ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం సూచనలు
ఇజ్రాయెల్, గాజా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడిన పాలస్తీనా హమాజ్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. ఆపరేషన్ అల్-అక్సా’ పేరుతో శనివారం ఉదయం నుంచి 5 వేల మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణాల్లోకి ప్రవేశించి వీధుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 22 మరణించగా.. 500 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. Palestine has invited its doom! In today’s episode of f*Ck around & find out,brought to you by #Mossad/ #Israel. We Indians know it’s not Islamists vs Zionists;it’s Humanity vs Terrorists. May Allah help Netanyahu finish off Islamic terrorism from #Gazapic.twitter.com/9CJ5Vh3mBp — Pranav Pratap Singh (@PranavMatraaPPS) October 7, 2023 ఆకస్మిక దాడులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జెరూసలెంతో సహా ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు తెలిపింది. దక్షిణ, మధ్య ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలపింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది. హమాజ్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్’ పేరుతో గాజాలోని హమాజ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశం యుద్ధంలో పోరాడుతుందని, తప్పకుండా విజయం సాధిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ పౌరులను రక్షించుకుంటామని పేర్కొన్నారు. దాడులకు ప్రతిఫలంగా హమాజ్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. We are at war. We will protect our citizens. We will not give in to terror. We will make sure that those who harm innocents pay a heavy price. — Israel ישראל 🇮🇱 (@Israel) October 7, 2023 భారతీయ పౌరులకు అడ్వైజరీ.. ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌ను పాటించాలని కోరింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే బాంబ్ షెల్టర్ల వద్ద ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండంటూ టెల్ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. Just surreal! Footage of Palestinian Hamas terrorists who infiltrated into Israel from Gaza, firing at residents in Sderot from an SUV. pic.twitter.com/ffUO5XwG1I — Arsen Ostrovsky (@Ostrov_A) October 7, 2023 గాజా సరిహద్దులోకి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాజ్ ఉగ్రవాదులు పౌరుల నివాసాలపై కాల్పులకు తెగబడుతున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దులోని వందలాది మంది జనాలు ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. Palestine has invited its doom! In today’s episode of f*Ck around & find out,brought to you by #Mossad/ #Israel. We Indians know it’s not Islamists vs Zionists;it’s Humanity vs Terrorists. May Allah help Netanyahu finish off Islamic terrorism from #Gazapic.twitter.com/9CJ5Vh3mBp — Pranav Pratap Singh (@PranavMatraaPPS) October 7, 2023 ఎందుకీ ఘర్షణలు ఇదిలా ఉండగా.. 2007లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి గాజాలో హమాజ్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ గజాన్ కార్మికులకు సరిహద్దులను మూసివేసిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఏడాది జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయిలీలు, ఇద్దరు విదేశీయులు మరణించారు. వీరిలో సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు.