Israel: మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. నెతన్యాహు సంచలన కామెంట్స్‌ | Israel PM Netanyahu Says No One Will Stop Us In Gaza War | Sakshi
Sakshi News home page

Israel: మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. నెతన్యాహు సంచలన కామెంట్స్‌

Published Sun, Jan 14 2024 11:49 AM | Last Updated on Sun, Jan 14 2024 11:58 AM

Israel PM Netanyahu Says No One Will Stop Us In Gaza War - Sakshi

టెల్‌ అవీవ్‌: గాజా సిటీలపై ఇ‍జ్రాయెల్‌ సేనల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. యుద్థం గెలిచే వరకు ఆగే ప్రసక్తేలేదని వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో విజయం సాధించే వరకు తమను ఎవరూ ఆపలేరని అన్నారు.  యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. అదే మా లక్ష్యం. హేగ్, ఈవిల్ మమ్మల్ని ఏం చేయలేవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, గాజా భూభాగంలో ఇప్పటికే అనేక హమాస్ బెటాలియన్లను అంతమొందించామని చెప్పారు. ఉత్తర గాజాలో నిర్వాసితులైన వారు తమ ఇళ్లకు తిరిగి రాలేరని తెలిపారు. అయితే, ఐక్యరాజ్యసమితిలోని అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో.. ఇజ్రాయెల్ దాడి యూఎన్ఓ జెనోసైడ్ కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూపుల కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు ఇలా కామెంట్స్ చేశారు. 

మరోవైపు, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో భీకర దాడుల కారణంగా ఆకలి కేకలు.. 23వేలకుపైగా మరణాలు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీటన్నింటికీ ఎప్పుడు తెరపడుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. టెల్ అవీవ్‌లో వందలాది మంది యుద్ధ బాధితులను గుర్తుచేసుకోవడానికి ప్రజలు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మరణించిన వారి కోసం కొవ్వొత్తులను వెలిగించారు. ఇక, బంధీలను విడుదల చేయాలని కోరుతూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement