ఇజ్రాయెల్‌లో భయానక దాడులు.. స్పందించిన మోదీ.. | PM Modi's Response Over Terrorist Attacks In Israel - Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో భయానక దాడులు.. స్పందించిన మోదీ..

Published Sat, Oct 7 2023 6:46 PM | Last Updated on Sat, Oct 7 2023 7:21 PM

PM Modi Response Over Terrorist Attacks In Israel - Sakshi

ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. హమాస్‌ మిలిటెంట్లు.. రాకెట్లు ప్రయోగంతో విరుచుకుపడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. బాంబు దాడుల కారణంగా ఇప్పటికే 50 మందికి పైగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఇక, ఈ దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇజ్రాయెల్‌లో దాడులపై స్పందిచారు. ఈ నేపథ్యంలో మోదీ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం.. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.

ఇక, ఇజ్రాయెల్‌లో దాడులపై ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఈ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. బాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడుతాం’ అని స్పష్టం చేశారు.

మరోవైపు.. ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌ను పాటించాలని కోరింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే బాంబ్‌ షెల్టర్ల వద్ద ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండంటూ టెల్‌ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది.


ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో హమాస్‌ దాడులను అగ్రరాజ్యం అమెరికా కూడా ఖండించింది. ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి మేం అండగా ఉంటాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో హమాస్‌ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement