India REQUEST
-
ఇజ్రాయెల్‌లో భయానక దాడులు.. స్పందించిన మోదీ..
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. హమాస్ మిలిటెంట్లు.. రాకెట్లు ప్రయోగంతో విరుచుకుపడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. బాంబు దాడుల కారణంగా ఇప్పటికే 50 మందికి పైగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఇక, ఈ దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇజ్రాయెల్‌లో దాడులపై స్పందిచారు. ఈ నేపథ్యంలో మోదీ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం.. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. ఇక, ఇజ్రాయెల్‌లో దాడులపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఈ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. బాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడుతాం’ అని స్పష్టం చేశారు. Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour. — Narendra Modi (@narendramodi) October 7, 2023 మరోవైపు.. ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌ను పాటించాలని కోరింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే బాంబ్ షెల్టర్ల వద్ద ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండంటూ టెల్ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. Breaking : Indian Gov has released an advisory for Indian Nationals currently living in #Israel to stay safe & be in the regular contact with Indian Embassy. If Situations severe more in coming days GOI may ask it's citizen to leave Israel 🇮🇱 🇮🇳#Israel #IsraelUnderAttack pic.twitter.com/769Cy8kFih — Vivek Singh (@VivekSi85847001) October 7, 2023 ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులను అగ్రరాజ్యం అమెరికా కూడా ఖండించింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మేం అండగా ఉంటాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే? -
స్విస్ ఖాతాదారులకు నోటీసులు
-
స్విస్ ఖాతాదారులకు నోటీసులు
♦ రెండు ప్రముఖ సంస్థలు సహా 10 మందికి జారీ ♦ గెజిట్ విడుదల చేసిన స్విస్ ఫెడరల్ ట్యాక్స్ అధికారులు ♦ 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకుల్లో భారత కంపెనీలు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మరో అడుగుముందుకు పడింది. భారత్‌లో పన్ను చెల్లించకుండా స్విట్జర్లాండ్ బ్యాంకులో డబ్బుదాచుకున్న పదిమంది ఖాతాలకు సంబంధించిన వివరాలివ్వాలని భారత్ కోరటంతోపాటుగా ఇందుకు సంబంధించిన ఆధారాలను అందజేసింది. దీనికి స్పందించిన స్విస్ పన్ను విభాగం ఆ ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్ వివరాలు కోరిన పది ఖాతాల్లో రెండు లిస్టెడ్టెక్స్టైల్ కంపెనీలు (నియో కార్పొరేషన్ ఇంటర్నేషనల్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్) ఉండగా కొన్ని ఆర్ట్ క్యురేటర్, కార్పెట్ ఎక్స్‌పోర్టు వ్యాపారుల అకౌంట్లున్నాయి. ఈ కంపెనీలు విదేశాల్లోనూ వ్యాపారం చేస్తున్నట్లు రికార్డుల్లో వెల్లడించాయి. పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో కంపెనీలు స్థాపించిన సంస్థలూ జాబితాలో ఉన్నాయి. అబ్దుల్ రషీద్ మిర్, ఆమిర్ మిర్, సబేహా మిర్, ముజీబ్ మిర్, తబస్సుమ్మిర్ పేర్లతోపాటుగా కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్స్పొజిషన్, మోడల్ ఎస్ఏ, ప్రొగ్రెస్ వెంచర్స్ గ్రూప్‌లు కూడా నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నాయి. ఇందులో పేర్లు కొన్ని పనామా పేపర్స్ లీక్ వ్యవహారంలో తెరపైకి వచ్చాయి. పక్కా వ్యూహంతో.. భారత్ వివరాలు కోరిన ఖాతాదారులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) నోటీసులు జారీ చేసింది. ఇందులో 30 రోజుల్లో వివరణతోపాటుగా వ్యక్తులు/కంపెనీలు తమ ప్రతినిధులను పంపించాలని కోరింది. భారత్‌కు సమాచారాన్ని చేరవేసేముందు ఖాతాదారుల వాదన వినాలనుకుంటున్నట్లు పేర్కొంది. కొంతకాలంగా స్విస్ బ్యాంకు అకౌంట్లున్న వారి వివరాలివ్వాలని, పాలనాపరమైన సహాయం అందించాలంటూ భారత్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతోంది. భారత్‌తో పన్ను ఎగ్గొట్టి ఆ మొత్తాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్నారనే వ్యక్తులు/కంపెనీలపై అనుమానాలను బలపరుస్తూ పలు ఆధారాలనూ అందించింది. -
విదేశాల్లో నల్లధనంపై దృష్టి
⇔ స్విస్ బ్యాంకుతో సంప్రదింపులు ⇔ పది మంది వ్యక్తులతోపాటు సంస్థల వివరాలు కోరిన స్విస్ ⇔ నోటీసులు జారీ చేసిన పన్ను విభాగం ⇔ నెలలోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు న్యూఢిల్లీ/బెర్న్: విదేశాల్లో నల్లధనంపై కేంద్రం దృష్టిసారించింది. పదిమంది వ్యక్తులతోపాటు సంస్థలు బ్యాంకుల్లో దాచిఉంచిన పన్ను చెల్లించని సొమ్ము తాలూకు వివరాలు అందజేయాల్సిందిగా స్విట్జర్లాండ్‌కు విన్నవించింది. ఇందులో టెక్స్టైల్ కంపెనీలతోపాటు తివాచీ ఎగుమతి వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. భారత్ విన్నపం నేపథ్యంలో స్విట్జర్లాండ్ పన్ను విభాగం ఆయా వ్యక్తులు, సంస్థలకు గత వారం నోటీసులు పంపింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్విట్జర్లాండ్ నిబంధనల ప్రకారం అనుమానిత పన్ను నేరాలకు సంబంధించి విదేశీ ప్రభుత్వాలు వివరాలు కోరినట్టయితే ఆ సమాచారాన్ని వారితో పంచుకునే ముందు ఆయా సంస్థలు, వ్యక్తులకు ఒక ఒకే అవకాశం ఉంటుంది. సంబంధిత వ్యక్తులు నేరుగాగానీ లేదా ఆయా బ్యాంకులద్వారాగానీ అందుబాటులో లేకపోతే ఈ నోటీసులను గెజిట్ నోటిఫికేషన్లద్వారా బహిర్గతం చేస్తుంది. ఒకేసారి ఇలా పదిమంది వ్యక్తులు, సంస్థలకు నోటీసులు పంపడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ నోటీసులు అందుకున్న సంస్థల్లో నియో కార్పొరేషన్ ఇంటర్నేషనల్, ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనం తాలూకు కొన్ని ఆధారాలను సేకరించిన కేంద్రం...ఇందుకు సంబంధించి పాలనాపరమైన చేయూత ఇవ్వాలంటూ ఆ దేశంపై కొంతకాలంగా ఒత్తిడి చేస్తుండడం తెలిసిందే. స్విట్జర్లాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోనూ కొంతమంది భారతీయుల పేర్లు బయటపడడం తెలిసిందే.