
రఫా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా మెల్లగా దాడులు మొదలెట్టిన ఇజ్రాయెల్ రోజురోజుకూ రెచి్చపోతోంది. అ మాయక పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటోంది. శనివారం ఇజ్రాయెల్ సేనల నిర్దయ దాడులకు ఒక ఉమ్మడి కుటుంబం నిట్టనిలువునా కుప్పకూలింది.
గాజా సిటీలో జరిపిన దాడుల్లో ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఉద్యోగి ‘అల్–మగ్‌రాబీ’ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 76 మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ పట్టణ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలో స్థానిక టీవీ పాత్రికేయుడు మొహమ్మద్ ఖలీఫా ఉమ్మడి కుటుంబం బలైంది. ఈ దాడిలో 14 మంది కుటుంబసభ్యులు మరణించారు. మొత్తం దాడుల్లో 90 మందికిపైగా మరణించారని గాజా పౌరరక్షణ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment