
జబాలియా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడి తర్వాత నిరంతరాయంగా కొనసాగిస్తున్న భీకరదాడులను ఇజ్రాయెల్ మరింత పెంచింది. ఉత్తర గాజాలోని జబాలియా పట్టణంలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు.
డజన్ల మంది గాయాలపాలయ్యారు. ‘‘శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. నా బంధువుల పిల్లలు ముగ్గురు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 110 మృతదేహాలను దగ్గర్లోని అల్–ఫలూజా శ్మశానవాటికకు తరలించలేని పరిస్థితి. అక్కడ ఆగకుండా బాంబుల వర్షం కురుస్తోంది. దిక్కులేక దగ్గర్లోని నిరుపయోగంగా ఉన్న పాత శ్మశానవాటికలో పూడ్చిపెట్టాం’ అని గాజా ప్రాంత ఆరోగ్య విభాగ డైరెక్టర్ జనరల్ మునీర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment