ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ శనివారం (అక్టోబర్ 7) ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున రాకెట్ల దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం ఎక్కువగా దెబ్బతింది. వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కల్పోయారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం (అక్టోబర్ 9) 4 శాతానికి పైగా పెరిగాయి. ముడి చమురు అధికంగా ఉన్న ప్రాంతంలో యుద్ధ వాతారణం నెలకొనడంతో చమురు సరఫరాలపై ఆందోళనలు తలెత్తాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఆసియా మార్కెట్‌లె బ్రెంట్ 4.7 శాతం పెరిగి 86.65 డాలర్లకు చేరుకోగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 4.5 శాతం పెరిగి 88.39 డాలర్లకు చేరుకుంది.
సర్వత్రా ఆందోళన
హమాస్ ఆకస్మిక దాడి, దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటన చేయడం వల్ల 1,000 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌లలో ఉద్రిక్తతలు విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రష్యా, సౌదీ అరేబియా ఉత్పత్తి కోతల కారణంగా సరఫరా తగ్గిపోవడంతో చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి. తాజాగా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధ సంక్షోభం ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళలను మరింత పెంచుతోంది.
Comments
Please login to add a commentAdd a comment