హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలస్తీనా–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత ఫార్మాపై పడే అవకాశం లేదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. దేశం నుంచి ఇజ్రాయెల్‌కు 2022–23లో ఎగుమతైన ఔషధాల విలువ రూ.766 కోట్లు. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం కంటే అధికం. దేశీయ మార్కెట్ నుంచి బల్క్ డ్రగ్స్ (ఏపీఐ), డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఆ దేశానికి సరఫరా అవుతున్నాయి.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఫార్మా రంగంలో వాణిజ్యం తక్కువగా ఉన్నందున.. ఫార్మాస్యూటికల్ వ్యాపారంపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ‘ఔషధ తయారీ రంగంలో ఇజ్రాయెల్ బలంగా ఉంది. అలాగే అధిక నియంత్రణ కలిగిన ఫార్మా మార్కెట్ ఆ దేశం ప్రత్యేకత. సహజంగానే యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఉంటాయి’ అని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment