situation
-
బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ , ఖైబర్ పక్తున్‌ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్సింధ్, ఆక్రమిత కశ్మీర్‌ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్ఏ కోరుతున్నది. ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్‌లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్‌లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది. 1947 నుంచే వేర్పాటు బీజంనిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్‌లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్‌తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్‌కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తు న్నాయి. బెలూచిస్తాన్‌లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగు తాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్‌లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.బుగ్తీని చంపిన తప్పిదంబెలూచిస్తాన్ లిబరేషన్ఆర్మీ మొన్నటి ఆగస్ట్‌లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్‌కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం. డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే!
అత్తాకోడళ్లంటే శత్రువులు అనే భావన చాలామందిలో స్థిరపడిపోయింది. వీరి మధ్య జరిగే వివాదాలను టీవీ సీరియళ్లలో ఆసక్తికరంగా చూపిస్తుంటారు. చిన్నపాటి విషయానికే కొందరు అత్తాకోడళ్లు తెగ తిట్టేసుకుంటారని, కొట్టేసుకుంటారనే ఆరోపణలు వినిపిస్తుంటాయ. తాజాగా అత్తాకోడళ్లకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రోడ్డున పడిన అత్తాకోడళ్ల ఉదంతం చోటుచేసుకుంది. సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో అత్తాకోడళ్లు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, కొట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరస్పరం తిట్టుకోవడంతో పాటు దుస్తులు చించుకునే వరకూ వెళ్లడాన్ని ఈ వీడియోలొ చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులు అత్తాకోడళ్లను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం ఫలితం ఉండదు. Kalesh b/w Mother-in-Law and Daughter-in-Law Outside Court, Nashik MHpic.twitter.com/QAjcpr6sYu— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025ఈ అత్తాకోడళ్లు(Daughter-in-laws) యద్ధంలో ముందుగా అత్త తన కోడలి జుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. అయితే కోడలు తాను ఏం తక్కువ తిన్నానంటూ అత్తపై దాడికి దిగుతుంది. ఈ వీడియోలో నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ అత్తా కోడళ్ల యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం కుటుంబ కలహాలకు మించిన రేంజ్లో ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. ఇది కూడా చదవండి: Mahashivratri: మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే.. -
విపత్కర పరిస్థితులలో వేడుకోవాలి
మహనీయ ముహమ్మద్ (సఅసం) ప్రవచనం: పీడలు, విపత్కర పరిస్థితుల బాధనుంచి, దౌర్భాగ్యకర స్థితి దాపురించడం నుంచి, దురదృష్టకర జాతకం నుంచి, శత్రువులు పరిహాసం చేయటం నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి.వివరణ: ఈ హదీసులో స్థూలంగా నాలుగు విషయాల నుండి రక్షణ కోరమని చెప్పినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి ఈ నాలుగు విషయాలలోనే ఇహ పరాలకు సంబంధించిన అన్ని చెడుగులు కఠిన పరీక్షలు, కష్టాలు కడగండ్లు వచ్చేశాయి. వాటిలో మొదటిది (జిహాదిల్ బలా) అంటే ఏదైనా ఆపద లేక పీడన వల్ల కలిగే యాతన. మనిషిని శారీరకంగా బాధించి మానసిక క్షోభకు గురి చేసే ప్రతిదీ అతని పాలిట పీడే. ఈ విపత్కర స్థితి ప్రాపంచికమైనదీ కావచ్చు. ఈ ఒక్క పదంలోనే అన్నిరకాల ఆపదలు, విపత్తులు, పీడలు, పరీక్షలు చేరి ఉన్నాయి. రెండవ మూడవ అంశాలు: నిజానికి ఏ దాసునికైతే దౌర్భాగ్యకర స్థితి నుంచి, దురదృష్టం నుంచి దేవుని తరపున రక్షణ లభించిందో అతనికి సర్వస్వం ప్రార్థించినట్లే.నాలుగవ అంశం: షమాతతుల్ ఆదాయి అంటే మనకు కలిగిన ఏదేని కష్టంపై ఎదురైన గడ్డు పరిస్థితిపై మన శత్రువు నవ్వటం, దెప్పి ΄÷డవడం, ఎగతాళి చేయడం, సంకట స్థితిలో శత్రువు చేసే పరిహాసం తీవ్ర వ్యాకులతకు గురిచేస్తుంది. అందుకే ప్రత్యేకంగా దీని నుంచి కూడా దేవుని శరణు వేడమని ఉపదేశం.ప్రవక్త (స) వారి ఈ ఉపదేశాన్ని పాటిస్తూ, ఈ నాలుగింటి నుండి శరణు వేడే సరైన తీరు ఇది: (2) ఓ అల్లాహ్ గండం వల్ల కలిగే బాధనుండి, దౌర్భాగ్యకర స్థితి నెలకొనడం నుండి, శత్రువులు నవ్విపోవడం దురదృష్టకర జాతకం జాతకం నుండి నేను నీ శరణు వేడుతున్నాను. (3) ఓ అల్లాహ్! విచారం, దుఃఖం నుండి, అధైర్యం నుండి, సోమరితనం నుండి, పిరికితనం నుండి, పిసినారితనం నుండి, జనుల ఒత్తిడి నుండి నేను నీ శరణు వేడుతున్నాను.ఈ (దువా) వేడుకోలులో 8 విషయాల రక్షణ కోరబడింది. ఈ ఎనిమిది విషయాలలో నాలుగు మరీ ముఖ్యమైనవి అవి: విచారం, దుఃఖం, రుణభారం, ప్రజల శత్రువుల ప్రాబల్యం, ఒత్తిడి ఈ నాలుగు విషయాలకు లోనైన మనిషి సున్నిత మనస్కుడై ఉంటే అతని బతుకు దుర్భరమైపోతుంది. తత్కారణంగా అతనిలోని తెలివితేటలు, శక్తియుక్తులు చచ్చుబడి పోతాయి. ఫలితంగా ఇహపరాలలోని ఎన్నో విజయ శిఖరాలను అందుకోలేక పోతాడు. అధైర్యం, సోమరితనం, పిసినారితనం, పిరికితనం... ఈ నాలుగు బలహీనతలకు లోనైనా మనిషిలో సంకల్పబలం ధైర్యం తెగువ క్షీణిస్తాయి. అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లం) ఈ అంశాలన్నిటి నుంచి అల్లాహ్ శరణు వేడుకోవడమే కాకుండా ఈ విధంగా ్ర΄ార్థిస్తూ ఉండమని తన అనుయాయులకు కూడా నొక్కి చెప్పారు.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్∙ -
Himachal: వరదలతో విలవిల.. 87 రహదారులు మూసివేత
గత కొన్ని రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ పరిస్థితులను గమనించిన అధికారులు మనాలి-లేహ్ జాతీయ రహదారితో పాటు 87 ఇతర రహదారులను మూసివేశారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రకటించిన వాతావరణ శాఖ ఆగస్టు 7, 8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా చంద్రభాగ్ నది నీటిమట్టం పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. లాహౌల్, స్పితి జిల్లాలో రెండు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. జింగ్ జింగ్బర్ సమీపంలో మనాలి-లేహ్ జాతీయ రహదారి మట్టిపెళ్లలు పేరుకుపోయాయి. దర్చా, సర్చు పోలీసు చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బ్రో) హైవేపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తోంది. కాగా కేదార్నాథ్ నడక మార్గంలో భారీ వర్షం కారణంగా వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన యాత్రికులు, స్థానికులను రక్షించే కార్యక్రమం ఐదవ రోజు కూడా కొనసాగింది. సోమవారం 1,401 మందిని రక్షించారు. గుజరాత్‌లోని నవ్సారి, వల్సాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
కాళీనది ఉగ్రరూపం.. ఉత్తరాఖండ్ అతలాకుతలం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లెక్కలేనన్ని ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఉగ్రరూపాన్ని దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడ్డివాములు నదుల్లోకి చేరుతున్నాయి. రోడ్లపై చేరిన చెత్తాచెదారం రహదారులను మూసేస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దులోని ధార్చులలో గల కాళీనది ఉగ్రరూపాన్ని దాల్చింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తం కావాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.ఎన్డిఆర్ఎఫ్ బృందం కాళీనది పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాళీనదిలోని నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. కాళీనది ఉగ్ర రూపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకంతకు నదిలో పెరుగున్న నీటి మట్టాన్ని ఈ వీడియోలలో గమనించవచ్చు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వంతెనలు కూలిపోవడంతో పాటు పలు రహదారులు మూసుకుపోయాయి. రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. भारत नेपाल बॉर्डर : उत्तराखंड के धारचूला में फटा बादल, SDRF को अलर्ट मोड पर रखा गया#CloudBurst | #Dharchula | #Uttarakhand | #HeavyRain | #SDRF pic.twitter.com/wLlWQYMGrA— NDTV India (@ndtvindia) July 12, 2024 -
మణిపూర్‌లో భారీ వర్షాలు.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ఈ నేపధ్యంలో మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అటానమస్ బాడీలు, ప్రభుత్వ పరిధిలోని సొసైటీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, పాఠశాలలను మూసివేశారు.మరోవైపు మణిపూర్ విద్యాశాఖ డైరెక్టరేట్ రాష్ట్రంలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా జూలై 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.మణిపూర్‌లోని ప్రధాన నదుల నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బలహీనమైన కట్టడాల్లో నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
అమృత్సర్: మోదీ సర్కార్ హయాంలో దేశపరిస్థితులు రష్యాను తలపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘‘ భారత్‌లో కొనసాగుతున్న ఈ నియంతృత్వ పాలనకు ఇంక ఎంతమాత్రం ఆమోదించేదిలేదు. గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇలా పనిగట్టుకుని విపక్షనేతలను జైల్లో పడేయడం ఎన్నడూ చూడలేదు. రష్యాలో అయితే కీలక విపక్షనేతలందర్నీ జైలుకు పంపేసి, కొందర్ని చంపేసి పుతిన్ దేశాధ్యక్ష ఎన్నికలు జరిపి 87 శాతం ఓట్లు గుప్పిట బిగించారు. ఎన్నికల్లో విపక్షాలు లేకపోవడంతో ఓట్లు పొందడానికి నువ్వు ఒక్కడివే మిగులుతావు’’ అని మోదీనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘ వాళ్లు(బీజేపీ) నన్ను, ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైల్లో పడేశారు. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే మంత్రులను జైలుకు పంపారు. విపక్ష నేతలను చెరసాలలో వేశాక ఒకే పార్టీ, ఒక్కడే అగ్రనేత సాధ్యం. అప్పుడు ప్రజాస్వామ్యం అసాధ్యం. ఇది జరక్కుండా మనం ఆపాలి’’ అని అన్నారు. ‘ నేను జైలు గదిలో ఉన్నపుడు గదిలో రెండు సీసీటీవీ కెమెరాలతో 13 మంది అధికారులు అనుక్షణం గమనించేవారు. ఒక ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్లేది. అక్కడ రెండు టీవీల్లో గమనించేవారు. నన్ను ఎలాగైనా అణచేస్తామని విశ్వప్రయత్నం చేశారు. అరెస్ట్‌తో అంతా అయిపో తుందని, పార్టీ ముక్కలు చెక్కలై ప్రభుత్వం కూలు తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆప్ ఒక కుటుంబం. కుటుంబానికి ఏదైనా కష్టమొస్తే కుటుంబసభ్యులంతా ఏకమై పోరాడతారు. నా అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కేజ్రీవాల్‌గా మారి పోరాడారు’’ అని అన్నారు.నన్ను నిరుత్సాహపరచకండి‘‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జైలులో ఎవరినైనా కలవడానికి వస్తే గదిలో మాట్లాడే ఏర్పాటుచేయాలని జైలు నియమావళిలో ఉంది. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వచ్చినపుడు ఒక గదిలో జైలు సూపరింటెండెంట్ భేటీ ఏర్పాట్లుచేయలేదు. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్తానాలను గెల్చుకునేలా ఆప్ నేతలు కష్టపడాలి. జూన్ రెండో తేదీన జైలుకెళ్తా. జూన్ 4 నాటి ఫలితాలను అక్కడి టీవీలో చూస్తా. టీవీలో ‘పంజాబ్‌లో అన్ని సీట్లు ఆప్ గెలిచింది’ అనే వార్త కోసం ఎదురుచూస్తుంటా. నన్ను నిరుత్సాహ పరచకండి’’ అని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. -
ఏడాది వర్షం ఒకే రోజు.. దుబాయ్ అతలాకుతలం.. 18 మంది మృతి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ భారీ వర్షాలకు తల్లడిల్లిపోయింది. ఎడతెగని వర్షాలు వీధులు, ఇళ్లు, మాల్స్‌ను జలమయం చేశాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. Everything Problem has a Solution, But...#Dubai #dubairain #DubaiStorm #dubairains #meme #Dubaifloods pic.twitter.com/IqoiuElg3J — Ashique Hussain / عاشق حسين (@47aq_) April 17, 2024 ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది. బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Easy guys @LarryMadowo @kipmurkomen #DubaiMetro pic.twitter.com/sPyy97EMBK — EVOLUTION EXPRESS LOGISTICS (@LetsGoEvolution) April 16, 2024 జాతీయ వాతావరణ కేంద్రం నిపుణుడు అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించారు. This is the Dubai airport after the biggest flood of history. pic.twitter.com/Kv2Hgam9jM — Baba Banaras™ (@RealBababanaras) April 17, 2024 దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ తుఫాను కారణంగా మంగళవారం మధ్యాహ్నం 25 నిమిషాల పాటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశామని, ఆ తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 🚨🇦🇪 Severe weather today in Dubai#برشلونه_باريس #TSTTPD #bbtvi #Dubai #dubairain #dubairains pic.twitter.com/n426GYnZX7 — Imranzeemi (@imranzeemi) April 17, 2024 వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల (3.2 అంగుళాలు) కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది. దుబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక రోజులో దాదాపు 1.5 సంవత్సరాల సగటు వర్షపాతం. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 తుఫాను కారణంగా పలు పాఠశాలలను మూసివేయగా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ భారీ వర్షాలు దాదాపు అన్ని అరబ్ దేశాలలో విపత్తుకు కారణంగా నిలిచాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షపాతం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్త అహ్మద్ హబీబ్ తెలిపిన వివరాల ప్రకారం క్లౌడ్ ఫార్మేషన్ల నుంచి ప్రయోజనాన్ని పొందడానికి గల్ఫ్ స్టేట్‌లోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అల్ ఐన్ విమానాశ్రయం నుండి సీడింగ్ విమానాలను పంపింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనూ భారీ వర్షాలు పడ్డాయి. 🚨 UAE🇦🇪 View of Dubai Airport after heavy Rain pic.twitter.com/wY2ALp35A8 — Izlamic Terrorist (@raviagrawal3) April 16, 2024 -
Ugadi 2024: నూతన సంవత్సరంలో.. 2024-25 కాల నిర్ణయమిదే..
ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతాం. ఇది తెలుగువాళ్ల పండుగ. ఈ తెలుగు సంవత్సరాదిలో మన రాశి ఎలా ఉంది. ఈ ఏడాది కర్తరీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి? వంటివి చూసుకుని గానీ కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. మరీ ఈ ఏడాది డొల్లు కర్తరీ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే..? డొల్లు కర్తరీ ప్రారంభం.. ది.04.05.2024 ప.12:35లకు చైత్ర బహుళ ఏకాదశీ శనివారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం.. ది.05.11.2024, ఉ.10:27లకు వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజు నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. కర్తరీ త్యాగం.. ది.28.05.2024 రా.7:21 వైశాఖ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం రోజు కర్తరీ త్యాగం. ‘‘మృద్దారు శిలాగహకర్మాణివర్జయేత్’’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించుటకు కర్తరీకాలము సరియగునది కాదు. పై సూత్రం ఆధారంగా వాస్తుకర్మలు నూతనంగా ఈ రోజు నుండి చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, కప్పు విషయమై పని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. రాబోవు విశ్వావసు నామ సంవత్సరం (2025–26) కర్తరీ నిర్ణయము 4 మే 2025 వైశాఖ శుద్ధ సప్తమి సుమారు సా.గం.7:00లకు డొల్లు కర్తరీ ప్రారంభం. 11 మే 2025 వైశాఖ శుద్ధ చతుర్దశీ సుమారు సా.గం.5:00లకు పెద్ద కర్తరీ ప్రారంభం. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విదియ రోజు సుమారు రా.గం.2:00లకు కర్తరీ త్యాగం. నవనాయక ఫలితాలు (2024– 2025) రాజు కుజుడు: కుజుడు రాజయిన సంవత్సరం అగ్నిభయం, వాయువు చేత అగ్ని రెచ్చ గొట్టబడడం, గ్రామ పట్టణాలలో తరచు అగ్ని భయములు ఉండును. వర్షములు ఉండవు. ధరలు అధికం అవుతాయి. రాజులకు యుద్ధములుండును. మంత్రి శని: వర్షపాతము తక్కువ. పంటలు తక్కువగా ఉంటాయి. సమాజంలో ఎక్కువ పాపకర్మలు ఇబ్బందులు సృష్టిస్తాయి. అన్ని వ్యవహారములు మందఫలములు ఇస్తాయి. తరచుగా సమాజంలో నిరంతరం ఆపదలు ఉంటాయి. గోవులకు ఇబ్బంది. తక్కువ స్థాయిలో ఉన్నవారు అందరూ అభివృద్ధిలోకి వస్తారు. సేనాధిపతి శని: సేనలకు రాజుకు సయోధ్య ఉండదు. ప్రజలు అధర్మ వర్తనులు అగుదురు. నల్లధాన్యములు ఫలించును. రాజులు అధర్మవర్తనులు అగుదురు. ప్రజలు పాప కర్మలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యములలో యిబ్బంది ఉంటుంది. సస్యాధిపతి కుజుడు: కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యజాతులు, ఎర్ర భూములు మంచి ఫలితాలనిస్తాయి. మెట్ట ధాన్యములు బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు, మధ్యమ ఫలితాలు యిస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు: గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చును. వ్యాధులు ఉండవు. దేశము సువృష్టితో సుభిక్షంగా ఉండును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసముగా ఉండును అని గ్రంథాంతర వచనము. అర్ఘాధిపతి శని: అర్ఘాధిపతి శని అయినచో మహాభయములు కలుగును. వర్షములు తగ్గును. రోగ, చోర, అగ్ని భయములు కలుగును. ఆహార సౌకర్యములు తగ్గును. ప్రజలలో భయము పెరుగును. పాఠాంతరంలో నల్లభూములు, నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మవస్తువులు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసముగా ఉండును. మేఘాధిపతి శని: వర్ష ప్రతిబంధకములు ఎక్కువ. రాజులకు ధనము లోటు ఉండును. చలిబాధలు ప్రజలకు జ్వరములు, ఆహార ధాన్యం కొరత. వ్యాధులు ప్రబలును. నల్ల ధాన్యములు బాగా పండును. రసాధిపతి గురువు: గురువు రసాధిపతి అయినచో చందన, కర్పూర, కంద మూలములు సులభముగా దొరకును. కుంకుమ పువ్వు మొదలగు ఇతర రస వస్తువులు దొరకవు. అన్ని పంటలకు అనుకూల వర్షములు ఉంటుంది. వృక్షజాతులు ఫలించును. ఆరోగ్యములు బాగుంటాయి. పాఠాంతరంలో బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. నీరసాధిపతి కుజుడు: పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడును. దానిమ్మ వంటివి బాగా ఫలించును. ఇవి చదవండి: Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..! -
తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష
-
బీజేపీ కార్యకర్తల ఆందోళన పోలీసులతో ఘర్షణ
-
ఎలాంటి వారికి సీజెరియన్ సజెస్ట్ చేస్తారు?
ఇప్పుడు నాకు 9వ నెల. నార్మల్ డెలివరీ అంటే భయం. అసలు సిజేరియన్ బర్త్ అంటే ఏంటీ? ఎలాంటి వారికి దీన్ని సజెస్ట్ చేస్తారు? – వి. హీరా, ధర్మాబాద్ చాలామందికి 9వ నెల చివర్లో సహజంగా నొప్పులు వచ్చి నార్మల్‌గా వెజైనల్ బర్త్ అవుతుంది. కానీ కొంతమంది గర్భిణీలు ఇలా నొప్పులు తీయడానికి భయపడుతుంటారు. ఇంకొంతమందిలో బిడ్డ పొజిషన్ నార్మల్ డెలివరీకి అనుకూలంగా ఉండదు. అలాంటివాళ్లందరికీ సిజేరియన్ బర్త్ను సజెస్ట్ చేస్తారు. సిజేరియన్ బర్త్‌లో బిడ్డకు, తల్లికి కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇది చిన్న ప్రొసీజర్ కాదు. పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ సంబంధిత రిస్క్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ మీ డాక్టర్ మీతో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తారు. వ్యక్తిగత కారణాలు, కన్సర్న్స్, ఫీలింగ్స్‌తో మీకు ఆపరేషనే కావాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని గౌరవించి ఆపరేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు.. తలెత్తే సమస్యలను మీకు వివరిస్తారు. వెజైనల్ డెలివరీకి భయపడి.. ఆపరేషన్‌కి వెళ్లేవారికి కౌన్సెలింగ్ సెషన్‌ని ఏర్పాటు చేస్తారు. ఈ సెషన్లో గైనకాలజిస్ట్, మత్తు డాక్టర్, మానసిక వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. భయాన్ని ఎలా ఎదుర్కోవాలో.. పెయిన్ రిలీఫ్‌కి బెస్ట్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో సూచిస్తారు. ఆందోళన, టెన్షన్‌కి కారణాలు చెప్పి.. వాటిని అధిగమించి వెజైనల్ బర్త్‌కి ప్రయత్నించమనీ చెప్తారు. ఎపిడ్యూరల్ ఎనాలిసిస్, బర్తింగ్ ఎక్సర్సైజెస్ చెప్తారు. ఈ కౌన్సెలింగ్ తర్వాత కూడా మీరు సిజేరియన్ బర్త్నే కావాలనుకుంటే.. ఎప్పుడు ఆ డెలివరీని ప్లాన్ చేస్తే మంచిదో చెప్తారు. కొన్ని కేసెస్‌లో సిజేరియన్ డెలివరీ తర్వాత బిడ్డకు ఏర్పడే రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల బిడ్డను ఎన్ఐఐయులో అడ్మిట్ చేసే చాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటివి ఎదురవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. సిజేరియన్ సెక్షన్ తర్వాత కుట్లు నొప్పి లేకుండా.. ఇన్ఫెక్షన్ సోకకుండా త్వరగా మానడానికి స్పెషల్ మెడికేషన్ ఇస్తారు. ఆపరేషన్ వల్ల టిష్యూలో Adhensions ఏర్పడే చాన్సెస్ పెరుగుతాయి. దీనివల్ల తర్వాత డెలివరీ అప్పుడు ఆపరేషన్ టైమ్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చు. బ్లాడర్, పేగు వంటివీ గాయపడే చాన్సెస్ ఉంటాయి. సాధారణంగా 39 వారాలు పూర్తయిన తర్వాత సిజేరియన్ చెయ్యడం మంచిది. కానీ మీకు బీపీ, సుగర్, బిడ్డ పెరుగుదలలో సమస్యలు ఉంటే కనుక కొంచెం ముందుగా ప్లాన్ చేస్తారు. స్ట్రెచ్ మార్క్స్ మాయం ప్రసవం తర్వాత మహిళలను స్ట్రెచ్ మార్క్స్ చాలానే ఇబ్బంది పెడుతుంటాయి. కొంత మందిలో పెరిగిన బరువు తగ్గిన తర్వాత కూడా ఇవి ఏర్పడుతుంటాయి. వీటినిపోగొట్టేందుకు చాలామంది అనేక రకాల క్రీములు వాడుతుంటారు. అయితే సహజమైన పద్ధతుల్లో వీటిని తగ్గించుకోవచ్చు. చర్మానికి తేమను అందించే గుణం కొబ్బరినూనెకు ఉంటుంది. అందుకే రోజూ రాత్రి పడుకునే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేయాలి. దీని వల్ల చారలు పోవడమే కాకుండా సాగిన పొట్ట కూడా తగ్గుతుంది. అలాగే బంగాళదుంప రసం, కలబంద గుజ్జునూ స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్టేందుకు వాడొచ్చు. వీటిని స్ట్రెచ్ మార్క్స్ పైరాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే క్రమంగా మార్క్స్ తగ్గటంతో పాటు ఇవి మంచి మాయిశ్చరైజర్స్గానూ పనిచేస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?) -
2050 నాటికి ఏ దేశాల్లో హిందువులు అధికం? భారత్ పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2015లో ఈ పరిశోధన నిర్వహించింది. రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన, పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడయ్యింది. హిందూ మతంతో పాటు క్రైస్తవం, ఇస్లాం, అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి. ఈ పరిశోధన ద్వారా రాబోయే 40 ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో 15 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుంది. అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా 2050 నాటికి 1.297 (ఒక బిలియన్.. 100 కోట్లు) బిలియన్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించేవారు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 79 శాతానికి పైగా ఉంది. హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది. నేపాల్‌లో హిందువుల జనాభా 3.812 కోట్లు. 2006కి ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2050నాటికి అమెరికాలో 47.8 లక్షల మంది హిందువులు ఉంటారు. 2015లో అమెరికాలో హిందువుల జనాభా 22.3 లక్షలు. ఇండోనేషియాలో వచ్చే 27 ఏళ్లలో హిందువుల జనాభా 41.5 లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. శ్రీలంక, మలేషియా, బ్రిటన్, కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. ఇది కూడా చదవండి: టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? -
Israel-Palestine war: ఫార్మాపై ప్రభావం తక్కువే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలస్తీనా–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత ఫార్మాపై పడే అవకాశం లేదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. దేశం నుంచి ఇజ్రాయెల్‌కు 2022–23లో ఎగుమతైన ఔషధాల విలువ రూ.766 కోట్లు. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం కంటే అధికం. దేశీయ మార్కెట్ నుంచి బల్క్ డ్రగ్స్ (ఏపీఐ), డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఆ దేశానికి సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఫార్మా రంగంలో వాణిజ్యం తక్కువగా ఉన్నందున.. ఫార్మాస్యూటికల్ వ్యాపారంపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ‘ఔషధ తయారీ రంగంలో ఇజ్రాయెల్ బలంగా ఉంది. అలాగే అధిక నియంత్రణ కలిగిన ఫార్మా మార్కెట్ ఆ దేశం ప్రత్యేకత. సహజంగానే యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఉంటాయి’ అని అభిప్రాయపడ్డారు. -
అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం!
భారతదేశంలో వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది. అదే సమయంలో అమెరికాలో వర్షాలు, వరదలు ఉగ్ర రూపాన్ని దాలుస్తున్నాయి. అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. న్యూయార్క్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. నగర ప్రజలు ఇళ్లలోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. New York City is facing major flooding as heavy rain slams New York, New Jersey, Pennsylvania and Connecticut. Brooklyn is submerged under more than 6 inches of rain, while Central Park has recorded more than 5 inches of rainfall so far. pic.twitter.com/wlbaYYSpwt — ABC News (@ABC) September 29, 2023 మీడియాకు అందిన వివరాల ప్రకారం న్యూయార్క్‌లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, సబ్‌వేలు జలమయమయ్యాయి. వరదల దృష్ట్యా న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమెరికా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం పలు ప్రాంతాల్లో 6 అంగుళాల మేర వర్షపాతం నమోదయ్యింది. రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. I am declaring a State of Emergency across New York City, Long Island, and the Hudson Valley due to the extreme rainfall we’re seeing throughout the region. Please take steps to stay safe and remember to never attempt to travel on flooded roads. — Governor Kathy Hochul (@GovKathyHochul) September 29, 2023 -
ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి?
ఆఫ్రికాలోని నైగర్‌లో సైన్యం సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. జాతీయ టీవీలో నైగర్ సైనికులు ఈ తిరుగుబాటును ప్రకటించారు. నైజర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తర్వాత దేశ సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారికాదు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ నాలుగుసార్లు తిరుగుబాటు జరిగింది. నైగర్‌కు ముందు జిహాదీ తిరుగుబాటు,ఆ తర్వాత పొరుగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలలో తిరుగుబాటు జరిగింది. తాజాగా ఈ చిన్న దేశంలో జరిగిన తిరుగుబాటు ప్రపంచ దేశాలలో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా తీవ్ర ఆగ్రహం నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. నైగర్ చాలా పేద దేశం అయినప్పటికీ యురేనియం నిల్వల విషయంలో అగ్రగామిగా ఉంది. ఇదే అమెరికా ఆందోళనను మరింతగా పెంచింది. 80 శాతం భూమి ఎడారిగా ఉన్న దేశంలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటుతో అమెరికా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా నైగర్ అంతర్జాతీయ ఏజెన్సీలకు, అనేక దేశాలకు భారీగా రుణపడి ఉంది. What's Happening in Niger? Most Americans do not seem to pay attention to Africa much, but Africa, particularly Niger are huge exporters of important materials and play a crucial role in international politics. So what's going on? - Last week a junta seized power from President… pic.twitter.com/6t0vAd1SS6 — Brian Krassenstein (@krassenstein) August 1, 2023 అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్ ఒకటి. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (డబ్ల్యుఎన్‌ఏ) తెలిపిన వివరాల ప్రకారం నైగర్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. రేడియోధార్మిక యురేనియం నిల్వలను కలిగి ఉన్న ఈ దేశంలో రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అణుబాంబు, అణుశక్తిలో వినియోగించే యురేనియం నిల్వలున్న ఈ చిన్న దేశంపై అమెరికాతో పాటు ప్రపంచమంతా దృష్టి సారించింది. నైగర్..యూరోపియన్ యూనియన్‌కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు. నైగర్ నియంత్రణ సైన్యం చేతికి వచ్చినప్పటి నుంచి ఈ దేశాల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు సైనిక తిరుగుబాటు తర్వాత నైగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తిరుగుబాటుకు మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు లభించింది. ఫలితంగా ఇతర దేశాలకు మరింత ముప్పు పెరిగింది. ఈ సైనిక తిరుగుబాటుకు మద్దతిచ్చిన మూడు దేశాలు ప్రస్తుతం తిరుగుబాటు సైనికుల పాలనలో ఉన్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా, ఫ్రాన్స్ తన పౌరులను నైజర్ నుండి తరలించడం ప్రారంభించింది. నైగర్‌లో కొనసాగుతున్న తిరుగుబాటు కారణంగా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మీడియాకు తెలిపారు. అదే సమయంలో పెరుగుతున్న సంఘర్షణల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెయిన్ కూడా 70 మందికి పైగా పౌరులను విమానంలో తరలించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇటలీ కూడా తమ దేశ పౌరులను రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు నైగర్ నూతన సైనిక నాయకులు సీనియర్ రాజకీయ నాయకులను అరెస్టు చేయడంతో పాటు దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను అతని ప్యాలెస్‌లో బంధించారు. ఈ తిరుగుబాటు తర్వాత జూలై 30న ఫ్రెంచ్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. ఈ సమయంలో, నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వాటిపై ఫ్రెంచ్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
ప్రొద్దుటూరులో దారుణం.. ఒకరు మృతి
-
తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది
-
కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్!
నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి? తెగేసి చెబుతున్నారట.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్‌లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట. అయితే వారు అజీజ్‌ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట. బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పాపం.. బలిపశువు మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా-భారత్‌ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమస్య పరిష్కారమైతే గానీ భారత్, చైనా మధ్య సంబంధాలు యధాస్థితికి రాలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాలు బలగాలు ఉపసంహరణ విషయంలో కాస్త పురోగతి సాధించాయి. ఘర్షణ ప్రాంతాల్లో సైన్యాన్ని తగ్గించేందుకు కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ లడఖ్‌లోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారత్ చైనాల మద్య పరిస్థితి చాలా పెళుసుగా, ప్రమాదకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నా దృష్టిలో చైనాతో పరిస్థితి ఇప్పటికి ముప్పుగానే ఉందని, ఎందుకంటే మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయని అన్నారు. సైనిక అంచనాల ప్రకారం ఇంకా కొన్ని ప్రదేశాల వద్ద పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది అని అన్నారు. పైగా ఆయా ప్రాంతాల్లో సైనిక బలగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఈ ప్రాంతాల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించగా, సుమారు 40 మందికి పైగా చైనీస్ సైనికులు మరణించడం లేదా గాయపడటం జరిగింది. అంతేగాదు 2020 మధ్యలో ఈప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడూ దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి సద్ధుమణిగింది. అలాగే డిసెంబర్లో గుర్తింపులేని సరిహద్దులోని తూర్పు సెక్టార్లో హింస చెలరేగింది. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదు. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్
రష్యాలో భాగంగా ప్రకటించిన ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో గట్టి భద్రత తోపాటు నిఘాను పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సడెన్‌గా దళాలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉందని మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌కు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై నిరవధిక దాడి జరిపి సెప్టెంబర్ 30న ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖేర్సన్ తదితర ప్రాంతాలను తమ భూభాగంలోని భాగంగా ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం పుతిన్ బెలారస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే రష్యా ఈ శీతకాలంలో ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి ఎముకలు కొరికే చలితో అల్లాడిపోయేలా చేసింది. అదీగాక ప్రస్తుతం పుతిన్ బెలారస్ పర్యటన ఉక్రెయిన్‌ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యుద్దాన్ని మరింత తీవ్రతరం చేసే ఎత్తుగడలో భాగంగానే పుతిన్ అకస్మాత్తుగా బెలారస్లో పర్యటిస్తున్నట్లు ఆరోపించింది. అంతేకాదు రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌ని ఉక్రెయిన్‌పై దాడి చేయమని ఒత్తిడి చేసే అవకాశం ఉందంటూ ఉక్రెయిన్ తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేసింది. వాస్తవానికి ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా సిద్దమయ్యేలా చేసింది కూడా బెలారస్నే కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడి నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే బెదిరింపులు, స్వదేశంలోని దేశద్రోహులు తదితరాల దృష్ట్యా పుతిన్ గట్టి నిఘా ఉంచాలని దళాలను ఆదేశించారు కూడా. పుతిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో ఇరు దేశాలకు ఒకే రక్షణ స్థలం ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు సమాచారం. కానీ పుతిన్ పొరుగు దేశాన్ని మింగేయడానికి ఇదోక ఎత్తుగడని పలు దేశాలు విమర్శలు గుప్పించాయి. ఐతే రష్యా మాత్రం ఎలాంటి విలీనానికి మాస్కోకి ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. అలాగే ఉక్రెయిన్‌లోకి తమ దేశ సైన్యాన్ని పంపే ఉద్దేశం కూడా తనకు లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కూడా పదేపదే చెబుతున్నాడు. కానీ పలువురు విశ్లేషకులు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యా బెలారసియన్ సైనికులు మద్దతును కోరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం ఈ యుద్ధాన్ని మరింత వేగవంతంగా ముగించేలా పశ్చిమ దేశాలు తమకు ఆయుధ సంపత్తి తోపాటు కొత్త రక్షణ సామర్థ్యాలను అందిస్తాయని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్ ప్లాన్‌తో తీవ్ర ఇబ్బందులు) -
తుఫాన్ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
2050 నాటికి వెయ్యికోట్లు మించిపోతే, పరిష్కారం ఏమిటి? లోపం ఎక్కడుంది?
2050 నాటికి ప్రపంచ జనాభా మరో 250 కోట్లు పెరుగుతుందని అంచనా. అప్పటికి అందరికీ సరిపడ ఆహారాన్ని సాధించాలంటే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. అవి కాగితాలపై లెక్కలే. అసలు లెక్క వేరే ఉంది. ఆహార ఉత్పత్తులను పెంచినంత మాత్రాన అవి పేదల ఇళ్లకు చేరతాయా? చేరవు. చేరాలంటే పేదల దగ్గర అవి కొనుగోలు చేసే స్థోమత ఉండాలి. ప్రపంచంలోనే అత్యధికంగా అసమానతలు ఉన్న దేశం మనది. ఇప్పటికీ సమాజపు అట్టడుగు వర్గాల జీవితాలు అత్యంత దుర్భర ప్రాయం. వాళ్ల జీవితాలు బాగు చేయకుండా జీవన ప్రమాణాలు పెంచకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఎంత పెంచితే మాత్రం ఏంటి లాభం? పెరిగే జనాభా కలసి కట్టుగా ఆప్యాయంగా కలిసి జీవనం సాగించేలా పరిస్థితులను నెలకొల్పుకోగలమా అసలు? మన ముందున్న సవాల్ అతి పెద్ద సవాల్ ఇదే. అందరూ దృష్టి సారించాల్సింది కూడా దీనిపైనే.సంపద పంపిణీలోనే పెద్ద లోపం ఉంది. లోపం ఎక్కడుందో కనుక్కుని తక్షణమే దాన్ని సరిదిద్దుకోవల్సిన అవసరం ఉంది. మనుషుల మధ్య మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా ఆప్యాయంగా ఉండాలి. (ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?) ఇన్ని వర్గాలూ ఒక్కతాటిపై ముందడుగు వేసి ఒక్కటిగా మనుగడ సాగించేలా చేయగలగడంపై దృష్టి సారించాలి. అది సాధ్యమా? తమ రాజకీయ ప్రయోజనాల కోసం మానవహక్కులను ఉక్కుపాదాలతో తొక్కేసి మానవ సంబంధాల మధ్య చిచ్చు రేపి మనుషుల మధ్య విద్వేషాలు రగిల్చే పరిస్థితులు పోనంత వరకు మనుషులంతా ఒక్కటే అన్న ఆలోచన రావడం చాలా కష్టం. యంగిస్థాన్ పరిస్థితి ఏంటి? చైనా, అమెరికాల తర్వాత భారత దేశం ఆర్ధికంగా దూసుకుపోతోందని గర్వపడుతున్నాం. ఇంగ్లాండ్, ఫ్రాన్స్,జర్మనీ వంటి యూరప్ దేశాలను దాటేసి ముందడుగు వేస్తున్నామని ఆనందిస్తున్నాం. అన్నింటినీ మించి ప్రపంచంలోనే ఏ దేశానికీ లేనంతటి యువశక్తి ఒక్క భారత్ కే ఉందని పొంగిపోతున్నాం. యంగిస్థాన్ అని మురిసిపోతున్నాం. మరి అదే యంగిస్థాన్ లో యువతకు ఎంత నాణ్యమైన విద్య అందుతోందని ఆరా తీస్తే గుండెలు గుభేలు మంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య ఎంతమందికి అందుతోంది? ఎక్కువ మంది యువత ఉండేది గ్రామాల్లో. అక్కడ సరియైన విద్యాసంస్థలే లేని పరిస్థితి ఉంది. బడ్జెట్ లో విద్యారంగంపై అరకొరగా నిధులు కేటాయిస్తోన్న నేపథ్యంలో ముందుగు ప్రభుత్వం దృష్టి సారించాల్సింది విద్యావ్యవస్థపై కాదా? ఏదో ఒక చదువు చదివేశాంలే అనుకుంటే ఇపుడు యంగిస్థాన్గా ఉన్న భారత దేశమే 20 ఏళ్ల తర్వాత ఓల్డిస్థాన్ గా మారిపోతుంది. ఆ ఓల్డిస్థాన్ లోని వృద్ధులైనా తమ కాళ్లపై తాము నిలబడి సమాజానికి పనికొచ్చేది ఏమైనా చేయగలరా అంటే చెప్పడం కష్టమే అంటున్నారు మేథావులు.జనాభా పెరుగుతుంది.జనాభాతో పాటే పెరగాల్సినవి అవకాశాలు. విద్యాప్రమాణాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు. ప్రగతి పథంలో దూసుకుపోడానికి అవసరమైన సదుపాయాలు. అన్నింటినీ మించి ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు. అవి పెరగాలి. అంతే కానీ జనాభాతో పాటు కేవలం ఆహార ఉత్పత్తులు పెంచేస్తే ఒరిగేదేమీ ఉండదు. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. దానికి తగ్గట్లు వారి ఆదాయాలు పెంచాలి. అలా చేయాలంటే వారికి ఉపాధి అవకాశాలు పెంచాలి. దానికోసం కొత్త అన్వేషణలు చేయాలి. అందుకోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలి. వాటిని నామమాత్రంగా కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఇప్పటికీ అంటరాని తనాన్ని రూపు మాపలేని నిస్సహాయ స్థితిలో గ్రామాలు ఉన్నాయంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచమంతా జీరో హంగర్ లక్ష్యాన్ని సాధించాలని నిశ్చయించుకుంది. అయితే కోవిడ్ పాపమా అని అది సాధ్యం కాలేదు. కేవలం అందరి కడుపులు నింపడమే పరిష్కారం కాదు. అదే అభివృద్ది కాదు. ఒకపక్క పూట గడవడమే గగనమయ్యే దుర్భర పేదరికం. మరో వైపు విందులు వినోదాల పేరుతో లక్షల కోట్ల విలువ చేసే ఆహారాన్ని వృధా చేసే నిర్లక్ష్యం. ఆహార వృధాను అరికట్టినంత మాత్రాన పేదల ఆకలి తీరదు. వృధాను అరికడుతూనే పేదల కడుపుల్లో కి బువ్వ చేరే ఆలోచనలు చేయడం ముఖ్యం. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. మాట్లాడుకున్నంత ఆషామాషీ కాదు. బలమైన సంకల్పం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. కాకపోతే అది తప్ప వేరే దారీ లేదు. గుక్కెడు పాలు అందక ఏటా కోట్లాది మంది చిన్నారులు తలలు వాల్చేస్తోన్న విషాదాలు కళ్ల ముందు కరాళ నృత్యాలు చేస్తూనే ఉన్నాయి. వాటిని చూసి అయినా మనసులో ఎక్కడో మూల చివుక్కుమనకపోవడమే దుర్మార్గం. ఒక్క భారత దేశమే కాదు యావత్ ప్రపంచం చూడాల్సింది దీన్నే పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, ఆదాయ మార్గాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అంటున్నారు మేథావులు. అన్నింటినీ మించి మనుషులంతా అన్యోన్యంగా కలసి మెలసి ఆనందంగా జీవించే వాతావరణాన్ని సృష్టించాలని వారు సూచిస్తున్నారు. కేవలం ఆహార ఉత్పత్తులను పెంచేసి చేతులు దులుపుకుంటే దమ్మిడీ ప్రయోజనం ఉండదని వారు అంటున్నారు. భిన్న వర్గాలు,కులాలు,తెగలు ఉన్న భారత్ వంటి దేశంలో అంతా ఒక్కతాటిపైకి వచ్చి హాయిగా జీవించాలంటే అసమానతలకు చరమగీతం పాడాలని హితవు పలుకుతున్నారు. ఆ దిశగా అడుగులు పడాలని వారంటున్నారు. పెరిగిన జనానికి అనుగుణంగా వనరులను పెంచుకోవాలి. ఉన్న వనరులు ఆవిరైపోకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి. రేపటి తరానికి ఎదిగేందుకు అవసరమైన చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలి. అంతిమంగా మనుషుల మధ్క మంచి సంబంధాలు ఉండేలా మానవ హక్కులకు పెద్ద పీట వేస్తూ పాలకులు ముందుకు సాగాలి. అప్పుడే ఈ భూమే ఓ స్వర్గం అవుతుందంటున్నారు మేథావులు. -సీఎన్ఎస్ యా జులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఫారెక్స్ నిల్వలు పుష్కలం పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయంటూ నెలకొన్న ఆందోళనలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ తోసిపుచ్చారు. దీన్ని ‘మరీ ఎక్కువగా‘ చేసి చూపుతున్నారని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ దగ్గర పుష్కలంగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని సేఠ్ చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహం తగ్గడం, వాణిజ్య లోటు అధికంగా ఉండటం వల్ల మారక నిల్వలు తగ్గాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఆయన చెప్పారు. వరుసగా ఏడో వారం ఫారెక్స్ నిల్వలు తగ్గిన నేపథ్యంలో సేథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 2.23 బిలియన్ డాలర్లు తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81ని కూడా దాటేసి ఆల్‌టైం కనిష్టానికి పడింది. మరోవైపు, దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, అంతర్జాతీయంగా డాలరు బలపడుతుండటమే రూపాయి క్షీణతకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్జిల్లాలో కారు పార్టీ జోరుకు బ్రేక్ పడుతుందా? కాషాయ సేన కదం తొక్కుతుందా? హస్తం బతికి బట్ట కడుతుందా? జిల్లాలోని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ విజయంతో కమలం దూకుడు మీదుంది. కాంగ్రెస్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. చదవండి: ‘గులాబీ’ బాస్ ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..? ‘గులాబీ’కి వ్యతిరేక పవనాలు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్కు కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారమైతే జరుగుతోంది. గణేష్ బిగాల రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ప్రజా సంబంధాల విషయంలో.. నగర సమగ్రాభివృద్ధి విషయంలో అంతగా చొరవ చూపలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనూ ఎమ్మెల్యే ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో పాటే భూ కబ్జాలు చేశారంటూ పతాక శీర్షికలకెక్కడం వంటివాటితో ఈసారి ఆయన గెలుపు అంత తేలిక కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు ధర్మపురి అరవింద్ ఎంపీ అయ్యాక నిజామాబాద్‌నగరంలో బీజేపీలో కొంత స్పీడ్కనిపిస్తోంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ధన్ పాల్ సూర్యనారాయణకు మళ్లీ బీజేపీ టిక్కెట్ లభిస్తే... ఆయనపై నున్న సానుభూతి సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు గండి కొట్టొచ్చనే చర్చ జరుగుతోంది. పాచిక పారుతుందా? నిజామాబాద్ అర్బన్‌నుంచి ఎంపీ అరవింద్ కూడా బీజేపీ తరపున పోటీలో ఉండేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కమలం పార్టీ అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ కేటాయిస్తుంది.. అరవింద్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతాడు... ఎవరికి టికెట్ వస్తే ఎవరి స్పందనలెలా ఉంటాయి. ఐకమత్యంగా ఉండగలరా... లేక, పార్టీలోనే ఉంటూ కోవర్ట్ రాజకీయాలకు తెరతీస్తారా అనే పలు అంశాలు బీజేపి విజయావకాశాలను నిర్దేశించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డి. శ్రీనివాస్ పాచికలు పారి తన పెద్ద కొడుకు సంజయ్‌కు కాంగ్రెస్‌పార్టీ టిక్కెట్ దక్కితే మాత్రం పోటీ రక్తి కడుతుంది. అన్నదమ్ముల సవాళ్లు ప్రజలకు వినోదాన్ని పంచుతాయి. నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ సంజయ్‌కు గతంలో కొంత వ్యతిరేకత ఉన్నా.. ఈ మధ్య క్షేత్రస్థాయిలో సంజయ్ తన పని తాను చేసుకుంటున్నారు. ఎక్కడా కాంట్రవర్సీల జోలికి వెళ్లకపోవడం వెనుక పెద్దాయన డీఎస్ వ్యూహాలు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సంజయ్ బరిలోకి దిగితే అది గణేష్ బిగాలకే కాకుండా.. డీఎస్ ఫ్యామిలీకి పెట్టింది పేరైన ఇందూరు కోటలో సానుభూతి దక్కి బయటపడుతాడనుకుంటున్న ధన్‌పాల్‌కు కూడా ఇబ్బందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్‌లో ఇప్పటి వరకున్న సమీకరణాలను బట్టి త్రిముఖ పోటీకి అవకాశం ఉండటమే గాకుండా.. అధికార పార్టీకైతే గడ్డురోజులని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిస్థితి చూస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు మాస్ లీడర్‌గా పేరుంది. గతంలో ఆర్మూర్ నుంచి, బాన్సువాడ నుంచి గెలుపొందిన ఘనత ఆయన సొంతం కాగా.. రూరల్ నియోజకవర్గం నుంచి కూడా గెల్చి తన పట్టును నిలుపుకోగలిగారు. ఈ క్రమంలో మళ్లీ బాజిరెడ్డి పోటీ చేస్తారో, ప్రస్తుత జెడ్పీటీసీ అయిన ఆయన కుమారుడుని బరిలోకి దింపుతారా అనే చర్చ నడుస్తోంది. బాజిరెడ్డి గోవర్ధన్ వైపే మొగ్గు కానీ పార్టీ అధిష్ఠానం తన సర్వేల ప్రకారం బాజిరెడ్డి గోవర్ధన్ వైపే మొగ్గు చూపుతున్నదని విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఇదే స్థానం నుంచి గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి అనర్హత వేటుకు గురైన ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడైన భూపతిరెడ్డి కూడా బరిలో ఉండనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకునే రీతిలో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరి ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందా.. బాజిరెడ్డినిగాని, ఆయన కొడుకును గాని అధికార పార్టీ బరిలోకి దింపితే భూపతిరెడ్డి ఏమేరకు ఎదుర్కొంటారన్నది ఆసక్తి కల్గించే విషయం. బీజేపి నుంచి బాజిరెడ్డి అనుచరుడు.. దినేష్ రెడ్డి పోటీలో ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది. త్రిముఖ పోరు నెలకొంటున్నట్టుగా కనిపించినా... ఇప్పటికిప్పుడైతే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే పరిస్థితి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడా మున్నూరుకాపు సామాజికవర్గంతో పాటు.. దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు విజయావకాశాల్ని ప్రభావితం చేయనున్నారు. హాట్ టాపిక్‌గా ఆర్మూర్ సెగ్మెంట్ ఆర్మూర్ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచే అసెంబ్లీ బరిలోకి దిగనున్నాడన్న ప్రచారంతో పాటుగా.. పెర్కిట్‌లో ఆయన నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడి పాలిటిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గెల్చిన అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అరవింద్ రాక సవాల్ గా మారే అవకాశం లేకపోలేదు. మున్నూరుకాపు సామాజికవర్గమే ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో... అరవింద్‌కి అది కొంత ప్లస్ అవుతుందంటున్నారు. రెండుసార్లు గెలిచిన జీవన్ రెడ్డిపై ఉండే సహజమైన వ్యతిరేకతకు తోడు.. ఈమధ్య జరిగిన కొన్ని ఘటనలు ఆయన కెరీర్లో మసకలాంటివేనని చెబుతున్నారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డికి అధిష్ఠానం జిల్లా అధ్యక్షుడి పదవినిచ్చిందని.. నెక్స్ట్ ఆయనకు టిక్కెట్ కష్టమేనన్న ప్రచారమూ సాగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉన్న వినయ్ రెడ్డికి అధికారపార్టీ అవకాశం ఇవ్వనున్నట్టుగా మరో ప్రచారమూ ఉంది. లేదంటే మళ్లీ జీవన్ రెడ్డి బరిలో నిల్చినా... అరవింద్ గెలుపు నల్లేరు మీద నడకేం కాదంటున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డికి మాస్ లీడరనే పేరుంది. ఇక కాంగ్రెస్‌కు సంబంధించి మళ్లీ ఎవ్వరు బరిలోకి దిగుతారాన్న క్లారిటీ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. మంత్రికి ప్లస్ అవుతుందా? బాల్కొండ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా కొనసాగుతోంది. గతంలో పీఆర్పీ నుంచి గెల్చి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న అనిల్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎంతవరకూ ఢీకొట్టగలడన్నది ఓ సందేహమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనిల్ నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు అంతగా లేకపోవడం.. ఇదే సమయంలో మంత్రి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో కనిపించే రోడ్లు, వీధి దీపాలు, ఇతర పనులన్నీ మంత్రికి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునుండే మంత్రుల్లో ఒకరిగా ఇప్పటికే ప్రశాంత్ రెడ్డికి పేరుంది. ఇక బీజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనయుడు మల్లికార్జున్ పేరు.. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నా... లోపాయికారీ ఒప్పందాలు, మల్లికార్జున్‌తో మంత్రికున్న చుట్టరికం వీటన్నింటి దృష్ట్యా... మంత్రి ప్రశాంత్ రెడ్డీదే మళ్లీ పైచేయిగా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత? బోధన్‌లోనూ అధికారపార్టీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన అల్లర్లు.. ఆపత్కాలంలో ప్రజలతో ఉండాల్సిన సంబంధాలు.. బోధన్ పట్టణాభివృద్ధి.. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఇంకా తెరుచుకోకపోవడం వంటివెన్నో ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే షకీల్ కు తలబొప్పి కట్టించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఈసారి బోధన్ టిక్కెట్ షకీల్ కు ఇస్తారో, లేదోనన్న ప్రచారమూ కొంత జరగ్గా.. ఇప్పటికైతే అలాంటి పరిస్థితులేమీ కనిపించడంలేదు. అయితే బోధన్ పక్కనే ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అత్తగారి ఊరు ఉండటంతో ఈసారి ఆమే ఇక్కడి నుంచి బరిలో ఉండవచ్చనే ఊహాగానాలూ వినిపించాయి. అయితే ఆమె మళ్లీ ఎంపీకిగానీ.. లేదంటే నిజామాబాద్ అర్బన్ నుంచిగానీ పోటీ చేసే అవకాశాలూ ఉన్నట్టు మరో ప్రచారం ఊపందుకుంది. మైనార్టీ ఓట్లే కీలకం.. కాంగ్రెస్ విషయానికి వస్తే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హవా కొంత కనిపిస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా అన్నీ తానై నడిపిస్తున్న సుదర్శన్ రెడ్డి ఈమధ్య యాక్టివ్ గా తిరుగుతుండటం... ఆయనపై కొంత సానుభూతి ఉండటం కలిసివచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. బీజేపి నుంచి పెద్దగా పేరున్న అభ్యర్థులెవరూ కనిపించకపోవడం ఆ పార్టీకి మైనస్సే. ఈ క్రమంలో పోటీ కచ్చితంగా సుదర్శన్ రెడ్డి, షకీల్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా నిజామాబాద్ అర్బన్ లాగే ముస్లిం మైనార్టీ ఓట్లు చాలా కీలకం కాగా.. అవే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. -
సామ్రాజ్య భారతి: 1918,1919/1947 ఘట్టాలు
1918 స్పానిష్ ఫ్లూ. ఇండియాలో మూడేళ్ల పాటు ప్రబలింది. దేశంలో కోటీ 70 లక్షల మంది మరణించారు. ఖేడా సత్యాహగ్రహం. గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతులకు మద్దతుగా గాంధీజీ ఈ సత్యాగ్రహాన్ని చేపట్టారు. జలియన్‌వాలా బాగ్ మారణకాండ (1919) రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు గాంధీజీ పిలుపు ‘జమైత్ ఉలేమా–ఇ–హింద్’ స్థాపించిన ముస్లిం పండితులు. చట్టాలు: యుషూరియస్ లోన్స్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, రౌలత్ చట్టం అమలు ప్రారంభం, పాయిజన్స్ యాక్ట్. జననాలు: శంకర్ దయాళ్ శర్మ : భారతదేశ 9వ రాష్ట్రపతి (భోపాల్); ఎస్.వి.రంగారావు : సినీ నటులు, దర్శకులు (రాజమండ్రి); కె.కరుణాకరన్ : రాజకీయవేత్త, కేరళ సీఎం; బాల సరస్వతి : నృత్యకారిణి, భరతనాట్యం (మద్రాసు); కె.వి. మహదేవన్ : సంగీత దర్శకులు (తమిళనాడు). ఇ.కె.నయనార్: కమ్యూనిస్టు యోధులు, కేరళ ముఖ్యమంత్రి; ఖైఫీ అజ్మీ: కవి (ఉత్తరప్రదేశ్); విక్రమ్ సారాభాయ్ : భౌతిక శాస్త్రవేత్త (గుజరాత్); మన్నా డే : సినీ నేపథ్య గాయకులు (కలకత్తా); గాయత్రీదేవి : జైపూర్ మహారాణి (లండన్); నౌషద్ : సంగీత దర్శకులు (లక్నో); డి.కె.పట్టమ్మాళ్ : కర్ణాటక సంగీత విద్వాంసురాలు (తమిళనాడు); భండారి రామ్ : సైనికుడు, విక్టోరియా క్రాస్ గ్రహీత (హిమాచల్ ప్రదేశ్). (చదవండి: చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ) -
లంక గ్రామంలో తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
-
ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు
-
ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం
-
భారతీయ వ్యవసాయం (1947–2022): ఉన్నచోటే అన్నదాత..
ఆంగ్లేయుల దుష్ట పాలనలో 28 సార్లు క్షామం బారిన పడిన దేశాన్ని స్వాతంత్య్రానంతరం అహరహం చమటోడ్చుతూ తిండికి దిగుల్లేకుండా చేసిన అన్నదాతలకు చివరకు దక్కిందేమిటి? స్వతంత్ర భారత 75 ఏళ్ల అమృతోత్సవ వేళ దేశ పాలకులు ఎన్ని కబుర్లు చెప్పినా.. రైతుల ఆదాయ పరిస్థితి మాత్రం అట్టడుగున కునారిల్లుతూ వెక్కిరిస్తున్నది. రసాయనాల పుణ్యాన పంట భూములు సారం కోల్పోయి పిప్పిగా మారిన నేపథ్యంలో వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని మరింత కష్టతరంగా మార్చుతూ రైతులను మరింత వణికిస్తున్నాయి. 1951 నాటికి మన దేశ జనాభా 36 కోట్లు. గ్రామీణ జనాభా 29.8 కోట్లు. వీరిలో రైతులు 7 కోట్లు. రైతు కూలీలు 2 కోట్ల 73 లక్షలు. 2011 నాటికి జనాభా 121 కోట్లకు పెరిగింది. గ్రామీణ జనాభా 83.37 కోట్లు. వీరిలో రైతులు 11.88 కోట్లు. రైతు కూలీలు 14.43 కోట్లు. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన వ్యవసాయ ఉత్పత్తి చాలా తక్కువ (సుమారు 5 కోట్ల టన్నులు). వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణావకాశాలు పెంపొందించుకుంటూ హరిత విప్లవ సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపుదలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. 1951లో పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వచ్చిన తర్వాత దేశాభివృద్ధి వేగాన్నందుకుంది. ఈ క్రమంలో 60ల నుంచి 80ల వరకు తొలి దశగా భావిస్తారు. సరికొత్త ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడుల నేపథ్యంలో వ్యవసాయోత్పత్తి కూడా పుంజుకుంది. అయినా, విదేశీ ఆహార సహాయంపై ఆధారపడాల్సిన దుస్థితిలో దేశం మిగిలిపోయింది. 60వ దశకంలో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఉత్సాహపరిచింది. పాల సహకార సంఘాలకు శ్రీకారం చుట్టడంతో శ్వేత విప్లవం వచ్చింది. తదనంతర కాలాలలో ఇందిరా గాంధీ చల్లిన విత్తనాలు ‘హరిత విప్లవాని’కి ఆధారభూతాలయ్యాయి. మెక్సికో నుంచి అధికోత్పత్తినిచ్చే పొట్టి గోధుమ రకాలను దిగుమతి చేసుకొని, సాగు నీటి సదుపాయాలు కల్పించి, రసాయనిక ఎరువులు, పురుగుమందులను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. తొలిదశలో పంజాబ్, హర్యానాతోపాటు దేశంలోని ఎంపిక చేసిన కొన్ని జిల్లాలలో కూడా సాంద్ర వ్యవసాయ పద్ధతిని అమలుపరిచారు. వాటిల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. 1967లో హరిత విప్లవ సాంకేతికత అమల్లోకొచ్చిన తొలి పంట కాలంలో పెరిగిన 30 లక్షల టన్నుల ఆహార ధాన్యాలతో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వచ్చింది. ఐదేళ్లలో దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించగలిగింది. సాగు నీటి విస్తీర్ణం, సాగు భూమి విస్తీర్ణం, పెరిగినకొద్దీ ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది. హరిత విప్లవ కాంతులు ఆహార ధాన్యాల (వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు) ఉత్పత్తి 1966–67లో (సాగు విస్తీర్ణం 11.53 కోట్ల హెక్టార్లు) 7.42 కోట్ల టన్నుల నుంచి 1985–86 నాటికి (సాగు విస్తీర్ణం 12.80 కోట్ల హెక్టార్లు) 15.04 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ కాలంలో ఆహారోత్పత్తుల దిగుబడి హెక్టారుకు 644 కిలోల నుంచి 1,175 కిలోలకు పెరిగింది. అదేవిధంగా.. 2020–21 నాటికి (సాగు విస్తీర్ణం 12.93 కోట్ల హెక్టార్లు) ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.86 కోట్ల టన్నులకు పెరిగింది. హెక్టారుకు దిగుబడి 2,386 కిలోలకు పెరిగింది. నీటిపారుదల సదుపాయం కలిగిన సాగు భూమి విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. 1950–51లో 18% భూములకు సాగు నీటి సదుపాయం ఉండగా, 1986–87 నాటికి 32%కి, 2018–19 నాటికి 54%కి పెరిగింది. వ్యవసాయ సంక్షోభం హరిత విప్లవం నేపథ్యంలో భారత్ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అద్భుత విజయాలే సాధించినప్పటికీ.. ఇతరత్రా అనేక ముఖ్య విషయాల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సాంద్ర రసాయనిక వ్యవసాయ పద్ధతులు పర్యావరణ పరమైన సంక్షోభాన్ని సృష్టించాయి. మట్టిలో సేంద్రియ కర్బనం (0.2–0.4%కి) తగ్గిపోయింది. భూసారం అడుగంటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోయింది. 1970లో కేజీ రసాయనిక ఎరువులు వేస్తే 13.4 కేజీల ఆహార ధాన్యం ఉత్పత్తి›అయ్యేది. 2005 నాటికి ఇది 3.7 కిలోలకు.. 2011 నాటికి 2.4 కేజీలకు తగ్గిపోయింది. వీటికి తోడు.. ఆహారంలో రసాయనిక అవశేషాల వల్ల ప్రజారోగ్యం దెబ్బతిని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అన్నిటికీ మించి, ఉపకరణాలన్నిటినీ చిల్లర ధరకు మార్కెట్లో కొనుక్కొని పంటలు పండించే రైతులు టోకు ధరలకు పంట దిగుబడులను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్కెట్ శక్తుల మాయాజాలం దెబ్బకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఏతా వాతా తేలిందేమంటే.. దేశం ఆకలి తీరినా రైతు డొక్కలు ఎండిపోయాయి. నెల ఆదాయం రూ. 8,059 మన దేశంలో రైతుల్లో 80–90% వరకు చిన్న, సన్నకారు రైతులే. అరెకరం నుంచి ఐదెకరాల లోపు సాగు భూమి కలిగి ఉన్న వారు. 2015–16 నాటికి దేశంలో రైతు కుటుంబం సగటు నెల ఆదాయం రూ. 8,059. అంటే.. ఏడాదికి రూ. 97 వేలు. దీన్ని ఏడేళ్లలో (2022 భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల నాటికి) రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, ఆరేళ్లు గడచిపోయినా రైతుల ఆదాయం 30%కి మించి పెరగలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయం ద్వారా కన్నా వ్యవసాయేతర పనుల ద్వారా చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది వర్షాధార సేద్యంపై ఆధారపడినవారే. జాతీయ గణాంక నివేదిక 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం, దేశంలో 57 శాతం రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారంగా వ్యవసాయ యంత్రాలను కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తేవాలి. సంస్థాగత రుణాలు అవసరం మేరకు అందించి ఆదుకోవాలి. పంటల సాగుతో పాటు పాడి పశువుల పెంపకం, కోళ్లు, గొర్రెలు, మేకలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ వ్యాపకాలపై రైతులు ఎక్కువగా ఆధారపడేలా ప్రభుత్వం దోహదం చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన అన్ని సేవలనూ అందించేందుకు దోహదం చేయాలి. పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నంత వేగంగా కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచటం లేదు. వరి, గోధుమ, పత్తి వంటి కొన్ని పంటలను మాత్రమే ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సేకరించి చేతులు దులుపుకుంటున్నది. పంట ఏదైనా సరే మార్కెట్ ధర పతనం అవుతున్నప్పుడు కనీసం 25% పంటను ప్రభుత్వాలు మద్దతు ధరకు సేకరించాలి. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగానైనా పాలకులు చిత్తశుద్ధితో వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి కదలాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు prambabu.35@gmail.com -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై భద్రతా మండలి ఏకగ్రీవ ప్రకటన
ఐరాస/జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధంపై, ఫలితంగా ఆ దేశంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది. ఈ దిశగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు 15 మంది సభ్యుల సమితి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ప్రకటనలో యుద్ధం అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. రక్తపాతం ద్వారా ఏ పరిష్కారమూ దొరకదని, దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలన్నది ముందునుంచీ భారత వైఖరి అని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ పునరుద్ఘాటించారు. మే 9 విక్టరీ డే సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్‌ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నట్టుండి దాడులను తీవ్రతరం చేసింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపైనా దాడులను భారీగా పెంచింది. శుక్ర, శనివారాల్లో ప్లాంటు నుంచి 50 మందికి పైగా బయటపడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తూర్పున డోన్బాస్లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్క్లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్టు సమాచారం. భాగస్వాములను కాపాడుకోలేని అమెరికా బలహీనత వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిందని అల్‌ఖైదా నేత అల్ జవహరీ విమర్శించారు. అమెరికా అగ్రరాజ్యం కాదు. దిగజారిపోతోంది’’ అన్నారు. రొమేనియా సాయం సూపర్: జిల్ బుఖారెస్ట్: దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను రొమేనియా ఆదుకున్న తీరు సాటిలేనిదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ కొనియాడారు. 4 రోజుల యూరప్ పర్యటనలో ప్రస్తుతం రొమేనియాలో ఉన్న ఆమె ఆదివారం మాతృ దినోత్సవాన్ని స్లొవేనియాలో ఉక్రెయిన్ సరిహద్దుల సమీప గ్రామంలో శరణార్థులతో గడపనున్నారు. రొమేనియా అధ్యక్షుని భార్య కామెరాన్ అయోహనిస్తో జిల్ భేటీ అయ్యారు. వరల్డ్ చాంపియన్ మృతి అంతర్జాతీయ యుద్ధ క్రీడల్లో ప్రపంచ చాంపియన్, రష్యా యుద్ధ ట్యాంకుల నిపుణుడు బటో బసనోవ్ (25) ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడు. అతని యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్ దళాలు పేల్చేశాయి. గతేడాది జరిగిన వరల్డ్ ట్యాంక్ బయాథ్లాన్‌లో గంటకు 50 మైళ్ల వేగంతో కూడిన లక్ష్యాలను ఒక్కటి కూడా వదలకుండా ఛేదించి బసనోవ్ రికార్డు సృష్టించాడు. యుద్ధంలో 38వ కల్నల్‌ను రష్యా డోన్బాస్లో కోల్పోయింది. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్‌ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధరించిన ఖాకీ జాకెట్ లండన్‌లో జరిగిన వేలంలో 90 వేల డాలర్ల ధర పలికింది. -
స్వాతికిరణం సిండ్రోమ్
మజ్రూ సుల్తాన్‌పురి అప్పుడప్పుడే కవిత్వం రాసి పేరు సంపాదిస్తున్నాడు. సుల్తాన్‌పూర్‌లో ఇది కొందరికి కడుపులో గులామ్ బులామ్ రేపింది. ఆ ఊళ్లోనే ఉండే మసియుద్దీన్ మసీ అనే కవిని రెచ్చగొడితే అతను మజ్రూ వెంటబడ్డాడు. మజ్రూ ఏం రాసినా వెక్కిరిస్తూ రాసేవాడు. మజ్రూ బాగా క్షోభ పడ్డాడు. ఇబ్బంది పడ్డాడు. కొన్నాళ్లకు భవిష్యత్తును వెతుక్కుంటూ సుల్తాన్పూర్ నుంచి బాంబే వెళ్లాడు. సినీ గేయరచయిత అయ్యాడు. సూపర్ హిట్ పాటలు రాశాడు. సర్వోన్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు. ఇవాళ్టికీ మనం రోజూ మజ్రూని వింటూనే ఉన్నాం. మరి మసియుద్దీన్ మసి సంగతి? మంట వెలిగినట్టు మసి వెలుగునా? మనం కూడా తక్కువ తిన్లేదు. మహా పండితుడు చిన్నయసూరి ఎంతో శ్రమించి, మేధను కరిగించి ‘బాల వ్యాకరణం’ రాస్తే, ఫస్ట్ ఎడిషన్ వచ్చి రికార్డు స్థాయిలో అమ్ముడు పోతుంటే శిష్టు కృష్ణమూర్తి అనే కవి దానిని ‘కాపీ’ అని గగ్గోలు లేవదీశాడు. (అబ్రాహ్మణుడైన) చిన్నయ సూరికి అంత సామర్థ్యం ఎక్కడ చచ్చింది అన్నాడు. ఆ కాలంలోని ఒకరిద్దరు గట్టి పండితులు ఈ విమర్శకు వత్తాసు పలికితే చిన్నయసూరి మౌనంగా ఉండిపోయాడు. సత్యాన్ని ఎంత అణుచుదామని చూసినా అది పొట్ట మీదే నేలక్కరుచుకుంటుంది తప్పితే వీపు మీద కాదు. తెలుగు భాషాకాశంలో భాస్కరుడు చిన్నయసూరి. గగ్గోలుదారులు ఆ మార్తాండ తేజానికి నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోయారు. పి.శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల సంచలనం. ఒక పరిణీత తప్ప దానిని మరొకరు రాయలేరని చదువరులు గ్రహిస్తారు. ‘అబ్బే... ఆ నవలను గోరా శాస్త్రి రాశాడండీ’ అని ఆయన అకౌంట్లో వేయడానికి చూసే పెద్దమనుషులు ఉన్నారు. గోరా శాస్త్రి తెచ్చిన ‘తెలుగు స్వతంత్ర’లోనే ఆరుద్ర ‘త్వమేవాహం’, ఆలూరి బైరాగి ‘నూతిలో గొంతుకలు’ వచ్చాయి. అయితే వాటిని గోరా శాస్త్రి రాయలేదట. ‘తెలుగు స్వతంత్ర’లోనే వచ్చిన పి.శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ మాత్రం గోరా శాస్త్రి రాశాడట. ఇంతా చేసి గోరా శాస్త్రి శబ్ద నాటికలు తప్ప ఒక్క గొప్ప నవలను అటెంప్ట్ చేయలేదు. ఆయనకు నవల రాసే ఆసక్తి ఉంటే రాసే చేయి ఊరకే ఉండేది కాదు. కళాకారుల లోకంలో కీర్తి అనే వెలుతురుతో పాటు కల్మషం అనే నీడ కూడా ఉంటుంది. సృజన లోకంలో రాణించాలనుకున్నవారు, రాణించేవారు, వెలిగినవారు, వెలగలేక ఆరిపోయిన, స్టేక్‌హోల్డర్స్ అయిన పాఠకులతో సహా ఈ వెలుగు నీడల ప్రభావానికి ఏదో ఒక సందర్భంలో గురి కాకుండా పోలేదు. శ్రీశ్రీని తగ్గించి శ్రీరంగం నారాయణబాబును నిలబెట్టాలని ఒక వర్గం ఎంత ప్రయత్నించినా శ్రీశ్రీయే మిగిలాడు. చలంను తెలుగు సరిహద్దుల నుంచి తరిమి కొట్టగలిగారుగానీ తెలుగు హృదయాల నుంచి కాదు. చిన్నబుచ్చేకొద్దీ జాషువా పద్యం ఎదిగి పండింది. అయినా సరే మనం గత పాఠాల నుంచి ఏమీ నేర్చుకోలేదు. ‘సాగర సంగమం’లో తన కళా వికాసానికి వీలు దొరకని కమలహాసన్ తన ఫెయిల్యూర్‌కి కుంగిపోతాడు. ఎవరినీ నిందించడు. కానీ ‘స్వాతికిరణం’లో మమ్ముట్టి అలా కాదు. ఆస్తిపాస్తి, పేరు, కీర్తి అన్నీ ఉన్నా తన సమ కళాకారులనే కాదు ఎక్కువ–తక్కువ ప్రతిభ ఉన్నవారిని చూసి కూడా ఓర్వలేకపోతాడు. అతడి ఈర్ష్య ఎంత తీవ్రమైనదంటే బంగారు భవిష్యత్తు ఉన్న ఒక బాలకళాకారుడు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఎదుటివారి ప్రాణాలు తీసేంత, పిచ్చివాళ్లను చేసేంత, జడిసి సాధన విరమింపజేసుకునేంత, వగచి ఒంటరితనంలోకి వెళ్లేంత ఈర్షా్య ద్వేషాన్ని కలిగి ఉండటం నుంచి కళాలోకం– ఆ అసూయాపరుల సంఖ్య ఎంత తక్కువైనా కానీ– ఎదగలేక పోతున్నది. సోషల్ మీడియా వచ్చాక ఈ వెర్రి శ్రుతి మించిపోతోంది. నాలుగు వ్యూస్ కోసం ‘తేనెమనసులు రామ్మోహన్ని సూపర్‌స్టార్ కృష్ణ ఎలా తొక్కేశాడో తెలుసా?’ అనే థంబ్‌నెయిల్ పెడితే ‘అవునవును... మాకు తెలుసు’ అని డయపర్ల వయసు దాటని వారు కూడా కామెంట్లు పెడుతుంటారు. ఇద్దరూ ఒకే సినిమాతో బయలుదేరినా కృష్ణ పద్మాలయ చేరడానికీ, రామ్మోహన్ మాసిన గడ్డంతో రాక్ క్యాజిల్‌లో తారసపడటానికీ కారణం ఎవరికి వారే! మనమే మన గమ్యం. మన ఫలితం. విషాదం ఏమంటే ఈ ‘స్వాతికిరణం సిండ్రోమ్’ ఇప్పుడు అన్ని సామాజిక దొంతరల్లోనూ నిండి కనపడటం! గతంలో ‘నువ్వు బాగుపడితే చూడాలని ఉంది’ అని వీధిలో వాళ్లు కూడా అనేవారు. ఇప్పుడు ‘నువ్వెలా బాగుపడతావో చూస్తాను’ అని ఆత్మీయులే అనుకుంటున్నారు. ఏదో లాటరీ తగిలి రాత్రికి రాత్రి బాగుపడితే ఈర్ష్య పడటం సరే. కానీ కష్టపడి పిల్లాడు ర్యాంకు తెచ్చుకున్నా, అమ్మాయికి మంచి సంబంధం కుదిరినా, లోన్ పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నా, అప్పోసప్పో చేసి కారు ఇంటికి తెచ్చుకున్నా, మొగుడూ పెళ్లాలు కొట్లాడుకోకుండా ఉన్నా, పిల్లలు బుద్ధిగా మాట వింటూ ఉన్నా, ఆఖరికి మన ఇంట్లో మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నా కుతకుతలాడిపోయేవారు, లోలోపల కీడు కోరుకునేవారు, బంధాలను అనుబంధాలను తెంపుకుపోయేవారు, చెడు ప్రచారానికి పూనుకునేవారు, చేతలతో కాకపోయినా మాటలతో హాని చేద్దాం అనుకునేవారు ఉంటే ఇది ఏమి సంస్కారం? ఇది ఏమి సమాజం? ఈర్ష్యతో ఒకరి చెడుకు చేసే ‘అసత్య వాదన మహాపాపం’ అన్నది వేదం. ‘గీబత్’ (చాడీలు), ‘తొహమత్’ (లేనివి కల్పించడం) చేసేవారికి నిష్కృతి లేదు అంది ఇస్లాం. ‘ఈర్ష్య పడువాని ఎముకలు కుళ్లును’ అన్నది బైబిల్. ప్రేమించేంత ఐశ్వర్యం లేనప్పుడు హాని చేయలేనంత పేదరికంలో ఉందాం! లోకం అదే బతుకుతుంది. -
రహస్య సర్వే: హస్తం కేడర్‌పై.. అధిష్టానం నజర్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై రహస్య సర్వే ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పరిస్థితి, నాయకుల పనితీరు.. ఎవరెవరు క్రియాశీలకంగా ఉన్నారు? ఎవరెవరు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు? అన్న విషయాలపై రేవంత్‌రెడ్డి నియమించిన ప్రత్యేక నిఘా బృందం వివరాలు తెప్పించుకుంటోంది. చదవండి: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రాబల్యాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా చాటుకుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ పార్టీ జిల్లాలో క్రమంగా జనాదరణకు దూరమవుతూ వస్తోంది. కీలకమైన నాయకులు టీఆర్ఎస్, ఇతర పార్టీలకు వెళ్లిపోవడంతో కేడర్పరంగా పార్టీ బాగా బలహీనంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక.. పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చేవారంలో రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని, వేములవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోపు జిల్లా కేడర్, స్థితిగతులపై రేవంత్‌కు పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు గాంధీభవన్ వర్గాలు సిద్ధమయ్యాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భంగపాటు..! టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రోడ్‌షోల కు జనాల నుంచి అపూర్వ స్పందన వచ్చినా పార్టీ వాటిని ఓట్లుగా మలచుకోవడంలో విఫలమైంది. ♦ఉమ్మడి జిల్లా నాయకులంతా రేవంత్ సభలకు హాజరైనా.. కనీసం డిపాజిట్ దక్కించుకోలేక ఘోర పరాజయం మూటగట్టుకుంది. ♦అయితే.. అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ పరాజయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ♦ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. ♦ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులంతా ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరించారు. ♦అయితే.. ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు మాత్రం మంచి స్పందన రావడం పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. సీనియర్లకు సైతం ఫోన్స్.. కొంతకాలంగా కొత్త జిల్లాల వారీగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు నేతలు మాత్రమే క్రియాశీలకంగా ఉంటున్నారు. పార్టీపరంగా నిరసనలు, ధర్నాలకు వారు మాత్రమే హాజరవుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వెలుగువెలిగిన చాలామంది సీనియర్లు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా ఉండటంతో కేడర్ కూడా నిస్తేజంలోకి జారిపోతోంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచి పార్టీని సమాయత్తం చేయాలని టీపీసీసీ రేవంత్‌రెడ్డి వర్గం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే.. సీనియర్ నేతలకు ఫోన్లు చేసి తిరిగి వారిని క్రియాశీలకంగా మార్చే యత్నాలను ప్రారంభించారు. యువత, పనిచేసేవారికే టికెట్లు..! అదేసమయంలో పార్టీలో కొత్తనాయకుల పనితీరుపై దృష్టి సారించారు. పార్టీలో ఎవరు నిత్యం వార్తల్లో ఉంటున్నారు? ఎవరు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి? కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్నవారి ఆర్థిక స్థితిగతులు ఏంటి? వారి అంగబలం, ఆర్థిక సామర్థ్యం, జనాదరణ ఎలా ఉంది? తదితర విషయాలపై రేవంత్ స్పెషల్ టీమ్ రహస్య సర్వే నిర్వహిస్తోంది. ఉత్తర తెలంగాణలో అందులోనూ పార్టీకి కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెరికల్లాంటి యువ నాయకులకు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసేలా దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తం అవుతోంది. మొత్తానికి ఎన్నికల ముందు చుట్టపు చూపులా వచ్చి టికెట్లు తీసుకునే సంప్రదాయానికి ఇకపై చెల్లదని, ప్రజాదరణే ప్రామాణికంగా టికెట్లు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ సర్వే నిర్వహిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కాంగ్రెస్‌కు చన్నీ చూపిన బాట
కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పో యిన తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్క రాష్ట్ర స్థాయి యువనేత కూడా బీజేపీతో పోరాడగలిగే స్థితిలో లేకపోవడం దీనికి ఒక కారణం. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ నేతలు గెలుపు సాధిస్తుండగా అక్కడ కూడా కాంగ్రెస్ తరఫున గెలిచే నాయకులు కరువయ్యారు. ప్రత్యర్థులను సవాలు చేస్తూ ఎదిగిన ఏ నాయకుడినీ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం నిలుపుకొన్న పాపాన పోలేదు. ప్రజాకర్షక నేతలుగా ఎదిగివచ్చిన యువనేతలను ఆ పార్టీ దూరం చేసుకుంది. వీరిలో కొందరు సొంత ప్రాంతీయ పార్టీలను ఏర్పర్చుకున్నారు. దీనికి మమతా బెనర్జీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కటి ఉదాహరణ. ఇప్పుడు వీరు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పాలిస్తూ శక్తిమంతమైన ప్రాంతీయ నాయకులుగా విలసిల్లుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఓట్లను రాబట్ట లేనివారి మార్గదర్శకత్వంలోనే పనిచేస్తోంది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పార్టీ అధిష్ఠానంగా మారిన తర్వాత, క్షేత్రస్థాయిలో అనుభవం కలిగిన ఒక్క నేతను కూడా నెహ్రూ కుటుంబం అంతర్గతంగా తయారు చేసుకోలేకపోయింది. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ... ఇలా వీరందరికీ కుటుంబపరంగా మంచి పేరు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనుభవం లేకుండా పోయింది. పైగా ఆరెస్సెస్, బీజేపీ తరహా శక్తులతో పోరాడటానికి అవసరమైన రాజ కీయ, సామాజిక, భావజాలపరమైన అనుభవం వీరికి కరువైంది. ఇందిరాగాంధీ అనంతరం నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నాయకులందరూ అద్దాలమేడలో పెరుగుతూ వచ్చారు. కాగా, విదే శాల్లో చదువుకుని వచ్చిన ద్విజ (బ్రాహ్మణ, వైశ్య, కాయస్థ, ఖాత్రి, క్షత్రియ) మేధావులు మెల్లగా కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. వీరు రాజ్యసభ ద్వారానే అధికార స్థానాల్లోకి ప్రవేశించి, ఓట్లు, సీట్లు గెలవ డానికి నెహ్రూ కుటుంబ సభ్యులపైనే ఆధారపడుతూ వచ్చారు. తర్వాత వీరు మంత్రులుగా మారి పాలించారు. దీంతో అనేక రాష్ట్రాల్లో ఓట్లను భారీగా రాబట్టే నేతలు కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నేతలు చాలావరకు శూద్రులు, దళితులు, ఆదివాసీ నేపథ్యంలోంచే వచ్చారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి, విలాసరావు దేశ్‌ముఖ్ వంటివారికి శూద్ర వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి బలమైన రాష్ట్ర స్థాయి నేతలను ఢిల్లీ స్థాయిలో కీలక పాత్ర పోషించడానికి కాంగ్రెస్ ఎన్నడూ అనుమతించలేదు. ఆదివాసీ నేపథ్యం నుంచి పీఏ సంగ్మా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు కానీ, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న చన్నీ వంటి శక్తిసామర్థ్యాలు, దళిత నేపథ్యం కలిగిన నేతలు ఏ రాష్ట్రం లోనూ ఆ పార్టీలో ఆవిర్భవించలేదు. యూపీలో అఖిలేష్ యాదవ్, బిహార్‌లో తేజస్వీ యాదవ్ బీజేపీని బలంగా ఢీకొంటున్నారు. ఇలాంటి నేతలను ఎదగనిచ్చి ఉంటే కాంగ్రెస్‌లో కుటుంబ కేంద్రక రాజకీయాలు తగ్గుముఖం పట్టేవి. అయితే అధిష్ఠానం చుట్టూ తిష్ఠ వేసిన కోటరీకి ఢిల్లీ వెలుపల క్షేత్ర స్థాయిలో ప్రజలను కూడగట్టడం, సంఘటితం చేయడం వంటి పార్టీ నిర్మాణ కౌశలాలు ఏ కోశానా లేవు. ఈ కారణం వల్లే బీజేపీ అతిశక్తి మంతమైన పార్టీగా ఆవిర్భవించడమే గాకుండా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యం లోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి యువ దళిత నాయకుడు కష్ట కాలంలో కాంగ్రెస్‌కి దారి చూపుతూ పంజాబ్ ముఖ్యమంత్రిగా రంగం మీదికి వచ్చారు. భూస్వామ్య ప్రభువు లాంటి అమరీందర్ సింగ్‌ను తోసిరాజనడమే కాకుండా, సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధూ వంటి దూకుడైన క్రికెట్ ప్లేయర్‌ను ఎదుర్కొని అగ్ర పదవిని చేపట్టారు. రాహుల్ గాంధీ నష్టం జరుగుతుందేమోనని అనుమానిస్తూనే, చన్నీని సీఎం స్థానంలో కూర్చుండబెట్టారు. అయితే చన్నీ అనతికాలంలోనే తానొక సమర్థనేతనని నిరూపించుకోవడమే కాదు... పంజాబ్ వంటి రాష్ట్రంలో ప్రధాని మోదీ అవలంబించే ముందస్తు ఎన్నికల జిత్తులను ఎదుర్కొనే సమయస్ఫూర్తి గల రాజకీయ నేతగా ముందుకొచ్చారు. చన్నీ విద్యాధికుడు. ఆయన లా, ఎంబీయే చదివారు. ప్రస్తుతం పీహెచ్డీ కూడా చేస్తున్నారు. జనవరి 5న ప్రధాని నరేంద్రమోదీ తన భద్రత విషయంపై గరిష్ఠ స్థాయిలో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తూ చన్నీపై నేరుగా దాడి చేశారు. ‘‘భటిండా విమానాశ్రయానికి నేను సజీవంగా తిరిగి వచ్చినందుకు మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపండి’’ అని మోదీ వ్యంగ్యంగా విమర్శించారు. కానీ చన్నీ ఎంత చురుగ్గా స్పందించా రంటే, ‘‘ఈరోజు ఫిరోజ్‌పూర్ జిల్లా నుంచి ప్రధాని మోదీ వెనక్కు వెళ్లవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. మా ప్రధానిని మేము గౌర విస్తాం’’ అంటూ తిప్పికొట్టారు. పైగా తన సహచరుడికి కోవిడ్ పాజిటివ్ రావడంతో తనతో సన్నిహితంగా ఉన్నందున, ప్రధానిని కలవలేకపోయానన్నారు. తన ప్రత్యర్థులను ఎలా తుదముట్టించాలో మోదీకి బాగా తెలుసు. కానీ గతంలో ఎవరూ చేయలేనట్లుగా దళితుడిగా ఉంటూనే ఈ వ్యవహారాన్ని దారిలోకి తెచ్చుకోగలనని చన్నీ బ్రహ్మాండంగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత కూడా పంజాబ్ ప్రభుత్వాన్ని రద్దు చేసే వైపుగా మోదీ, ఆయన బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది కానీ చన్నీ దృఢంగా నిలబడగలిగారు. ఆయన పంజాబీల ఆత్మగౌరవ సమస్యను లేవనెత్తారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘకాలికంగా పంజాబ్ రైతులు చేసిన శాంతియుత నిరసన ప్రదర్శనలను, మోదీ పర్యటన సందర్భంగా రైతుల నిరసనను కూడా చన్నీ సమర్థించారు. ప్రధానికి ప్రాణాపాయం అంటూ బీజేపీ నేతలు చేసిన అతిశయ ప్రకటనలపై చన్నీ నిజంగానే నీళ్లు చల్లారు. దీనికోసం ఆయన సర్దార్ పటేల్ సూక్తిని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ‘‘కర్తవ్య నిర్వహణ కంటే తన జీవితం గురించి ఎక్కువ శ్రద్ధ వహించే వారు భారత్ వంటి దేశంలో పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరించకూడదు.’’ ఈ ఒక్క ట్వీట్ చన్నీని హీరోను చేసింది. ప్రధాని ఆరోజు బహిరంగ సభకు వెళ్లలేకపోవడం వాస్తవమే కానీ ఆయనపై ఏ హింసా త్మక దాడీ జరగలేదు. ‘నిజానికి ఆరోజు ప్రధానికి వ్యతిరేకంగా ఎవరూ నినాదాలు చేయలేదు, రాళ్లు విసరలేదు, కాల్పులు జరప లేదు, ఏమీ జరగలేదు. అయినా ఇలాంటి ముతక నాటకాలు ఎందుకు ఆడుతున్నా’రంటూ చన్నీ నిలదీశారు. ఒక యువ నేత ఇంత పెద్ద సమస్యను, దుష్ప్రచారాన్ని ఎదుర్కొని నిలబడాలంటే ఎంతో ధైర్య సాహసాలు కావాలి. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని ఢిల్లీ నాయకత్వం చన్నీని కోరిన నేపథ్యంలోనూ ఇంత పెద్ద పరిణామం జరిగింది. పంజాబ్‌లోనే కాకుండా దేశంలో కూడా చన్నీకి గుర్తింపు వచ్చేసింది. శూద్ర, దళిత, ఆదివాసీ మూలాలు కలిగిన ఇలాంటి తెగువ, చేవ ఉన్న విద్యాధిక నేతలను ప్రతి రాష్ట్రంలోనూ ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గ్రహించాలి. అప్పుడు మాత్రమే ఈ వర్గాలనుంచి భవిష్యత్తులోనైనా ప్రధాని కాగలరు. చక్కటి ఆధునిక విద్య, పాలనానుభవంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ పని చేయగలిగిన వ్యక్తులను ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశ మివ్వాలి. వారి విద్య, కమ్యూనిటీ నేపథ్యం ఏదైనా, ఢిల్లీనుంచి రుద్దబడిన నాయకులు ఎవరూ ఎన్నికల్లో గెలుపొందలేరు. ప్రస్తుత కుల పరిస్థితులు, సంక్షేమం, ఓటర్ల చైతన్యం వంటివి ఢిల్లీలో అధిష్టాన వ్యవహార తీరుకు భిన్నంగా నడుస్తున్నాయి. పంజాబ్‌లో ముఖ్య మంత్రి పదవికి చన్నీని ఎంపిక చేయడమనేది కచ్చితంగా కొత్త మార్గాన్ని సూచిస్తోంది. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రజాకర్షణ, క్షేత్రస్థాయి పునాది కలిగిన ప్రాంతీయ నేతలను వరుసగా దూరం చేసుకున్నందుకే కాంగ్రెస్ ఇవాళ పతనావస్థను చవిచూస్తోంది. మమతా బెనర్జీ, వైఎస్ జగన్మోహన్రెడ్డితో మొదలైన ఈ పరిణామం ఇప్పుడు బలమైన ప్రాంతీయ నేతలు లేని దుఃస్థితికి కాంగ్రెస్‌ని నెట్టింది. ఈ నేపథ్యంలో దళిత నేపథ్యం కలిగిన చన్నీని పంజాబ్ ముఖ్యమంత్రిని చేయడం, ప్రధాని భద్రతా వివాదంలో చన్నీ హీరో కావడం– కాంగ్రెస్ కొత్త మార్గంలో పయ నించాలని సూచిస్తున్నాయి. శూద్ర, దళిత, ఆదివాసీ మూలాలు కలిగిన ఇలాంటి తెగువ, చేవ ఉన్న విద్యాధిక నేతలను ప్రతి రాష్ట్రంలోనూ ప్రోత్సహించా ల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గ్రహించాలి. అధిష్ఠానం ఆశీస్సులు మాత్రమే ఉన్న నాయకులు ఓట్లను రాబట్టలేరని అర్థం చేసుకోవాలి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
క్యాచ్–22 సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా?
జీవితంలో మనకు అప్పుడప్పుడూ కొన్ని రకాల సందర్భాలు ఎదురవుతుంటాయి. కింద ఇచ్చిన పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైతే ‘క్యాచ్–22 సిచ్యువేషన్’లో ఉన్నట్లు. ► ఏదైనా ఒక సందర్భంలో ఒక అడుగు ముందుకు వేయబోతే సమస్యల్లో చిక్కుకునే పరిస్థితి ఎదురుకావడం. (క్లిక్: ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?) ► మీరు మీ కళ్లజోడును ఎక్కడో పెట్టి మరిచిపోతారు. అయితే అవి ఎక్కడున్నాయో వెదకాలంటే కళ్లజోడు తప్పనిసరి. ఇదొక విచిత్ర పరిస్థితి. ∙మీరు కారు డ్రైవ్ చేస్తూ ఒక సైకిలిస్ట్‌ను ఢీకొట్టారు. ‘నువ్వు సైకిలిస్ట్‌ను చూశావా?’ అని జడ్జి అడుగుతాడు. ‘చూశాను’ అని అంటే ‘చూస్తూ కూడా ఎందుకు ఢీకొట్టావు?’ అని అడుగుతాడు. ‘చూడలేదు’ అని చెబితే ‘అంత నిర్లక్ష్యమా!’ అంటాడు. ఇదొక సంకట పరిస్థితి. (నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?) జోసెఫ్ హెలీ రాసిన క్యాచ్–22 సెటైరికల్ నవలతో ఈ ‘క్యాచ్–22’ అనే ఎక్స్ప్రెషన్ మొదలైంది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యం తీసుకొని రాసిన ఈ నవలలో యుద్ధంలో ఉండే క్రూరత్వం, వినాశనాన్ని వ్యంగ్యాత్మకంగా చెబుతారు రచయిత. (క్లిక్: అక్కడి పరిస్థితి హెలైసియస్గా ఉంది..!) -
ఉపశమనం
-
తెలంగాణలో భారీగా కోవిడ్ కేసులు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఆదేశించిన మేరకు ఆర్టీపీసీఆర్ పరీ క్షలను పెంచాలని, రోజుకు లక్ష పరీక్షలు నిర్వ హించాలని తేల్చిచెప్పింది. ప్రజలు గుమిగూడ కుండా చూడాలని, ప్రజలు భౌతికదూరం పాటించేలా, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈనెల 24లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు సంబంధించి వేర్వేరుగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. 50 వేలకు మించి చేయడం లేదు రోజుకు తప్పసరిగా లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించిందని, అయితే అప్పుడప్పుడు మినహా రోజుకు 50 వేలకు మించి పరీక్షలు చేయడం లేదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ నివేదించారు. ప్రధానంగా ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలన్న ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. కరోనా కేసుల ఆధారంగా కంటైన్మెంట్, మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఆరోపించారు. సరైన నియంత్రణ చర్యలు లేక అనేకమంది న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారని తెలిపారు. కాగా కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమై చర్చించనుందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. రోజుకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజన్ పరీక్షలు కలిపి లక్ష వరకు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన ధర్మాసనం.. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై 24లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. -
సాఫీగా ప్రయాణం
-
కోవిడ్ సమయాలు.. చిన్న చిన్న సంతోషాలకు స్వాగతం
పెరట్లో కొమ్మల గుబురు మాటున ఒక జామ పిందె లేత పసుపు కాయగా ఎదుగుతుంది. చూట్టానికి మనకు టైం ఉండదు. ఇంట్లో పిల్లవాడు హోమ్‌వర్క్ చేస్తూ చేస్తూ ఏదో అర్థం లేని కూనిరాగం అద్భుతంగా తీస్తాడు. వినడానికి మనకు టైం ఉండదు. దారిన పోతూ ఉంటే సూర్యుడి మీదకు మబ్బు తెరగట్టి చల్లటిగాలిని విసురుతుంది. ఆస్వాదించడానికి సమయం లేదే. అప్పుడే పుట్టిన దూడ చెంగనాలు వేస్తుంది. మనం బైక్ కిక్ కొట్టి ఎటో వెళ్లిపోతూ ఉంటాం. ఆగండ్రా... ఎక్కడికి ఆ పరుగు అని చెప్పడానికే మహమ్మారి పదే పదే వస్తున్నట్టుంది. లాక్డౌన్ విధించినా ఇంటి పట్టున ఒక్కరోజు ఉండలేనంత పరుగుకు అలవాటు పడిపోయాం. హాసం లాస్యం స్నేహం సౌఖ్యం నెమ్మది స్థిమిత మది వీటికి దగ్గరవ్వాలి. పిల్లలకూ దగ్గర చేయాలి. 2007. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి మెట్రో స్టేషన్. శీతగాలులు వీస్తున్న జనవరి నెల. ఉదయం పూట. ఒక మూల ఒక వయొలినిస్టు నిలబడి తన అద్భుతమైన వయొలిన్ వాదన మొదలెట్టాడు. అతని చేతిలోని ‘బౌ’ ఆరోహణ అవరోహణ చేస్తుంటే వేళ్లు తీగలను నిమురుతూ స్వరాలను పలికిస్తున్నాయి. జనం వస్తున్నారు. వెళుతున్నారు. స్వింగ్డోర్లు తెరుచుకుంటున్నాయి. మూసుకుంటున్నాయి. 45 నిమిషాలు అతను కచేరి చేస్తూ ఉంటే 1,097 మంది అతని ముందు నుంచి రాకపోకలు సాగించారు. కేవలం 7 మంది ఆగి మొత్తం కచ్చేరి విన్నారు. తల్లులతో వెళుతున్న పిల్లలు కుతూహలంతో ఆగబోతే తల్లులు వారిని లాక్కుంటూ తీసుకెళుతుంటే పిల్లలు తలలు తిప్పి ఆ వయొలినిస్ట్ను చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. 27 మంది అంత బిజీలోనూ ఒక్క క్షణం ఆగి, ఆ సంగీతం మీద ఏ మాత్రం పట్టింపు లేకుండా, పోనీలే పాపం అని ఎదుట పరిచిన హ్యాట్లో చిల్లర వేసి వెళ్లారు. మొత్తం 32 డాలర్లు వచ్చాయి. ఆ ఉదయం, ఆ మెట్రో స్టేషన్ రద్దీలో, ఒక గొప్ప కచ్చేరి అనామకంగా ముగిసింది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మూగలేదు. ఆ కళాకారుణ్ణి భుజాల మీదకు ఎత్తుకోలేదు. కాని అంతకు రెండు రోజుల ముందు బోస్టన్‌లో అదే వయొలినిస్టు షో కోసం 100 డాలర్లు పెట్టి టికెట్ కొనడానికి జనం విరగబడ్డారు. ఆ వయొలినిస్టు ఇప్పటికే తన వయొలిన్ వాదనతో మూడున్నర మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అతడే సుప్రసిద్ధ అమెరికన్ వయొలిస్ట్ జాషువా బెల్. మనలో చాలా మందిమి ప్రత్యేక సందర్భాలలోనే కళకు, సౌందర్యానికి, ఆనందానికి, వినోదానికి సమయం ఇవ్వాలనుకుంటాం. కాని రోజువారి బిజీ జీవితంలో కేవలం ఉపాధికే సమయాన్ని వెచ్చించాలనుకుంటాం. కళ్ల ముందు అంత గొప్ప వయొలిన్ వాదన కూడా ఆ బిజీలో వెలవెలబోతుంటే ఎన్ని చిన్ని చిన్ని బతుకు చిత్రాలు సుందర జీవన సౌందర్యాలు మిస్ అయిపోతున్నామో కదా అని ఈ ‘సోషల్ ఎక్స్పెరిమెంట్’ రుజువు చేసింది. అందుకే సమయాన్ని బతుకు వెతుకులాటకే ఖర్చు చేయకండి... నడుమ చిన్ని చిన్న ఆనందాలని ఆస్వాదించండి. జాషువా బెల్ చెప్పినా, కోవిడ్ సమయాలు చెప్పినా సారం అదే. గత సీజన్లో లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా మంది ఆకాశాన్ని తేరిపార చూడగలిగారు సమయం చిక్కి. ఇళ్లల్లోనే ఉండటం వల్ల సాయంత్రాలు డాబా ఎక్కినప్పుడు శిరస్సు మీద పరుచుకున్న ఆ నీలిమ అంత అందంగా ఉంటుందా... ఎలా మిస్ అయ్యాం అనుకున్నవారు ఉన్నారు. బాల్కనీలోని మొక్కల్లో ఒక రక్తమందారం రెక్కలు విచ్చుకుని ఉంటుంది. అది ఏదో సంభాషిస్తూ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటే విష్ చేస్తూ ఉంటుంది. కాని ఆగి చూసే సమయం ఎక్కడ? లాక్డౌన్ వస్తే తప్ప సాధ్యం కాలేదు. అపార్ట్మెంట్ గేట్ ముందు వీధికుక్క నెల క్రితం కన్న పిల్లలు ఆడుకుంటుంటాయి. ఈ లోకం మీద విశ్వాసంతో మమ్మల్ని ఎవరో ఒకరు చూసుకుంటారులే అని అటూ ఇటూ గునగున నడుస్తూ ఉంటాయి. పిల్లలు కనిపిస్తే తోకలు ఊపుతాయి. వాటి దైవికమైన మూగ సౌందర్యాన్ని దర్శించామా. రోజువారి పరుగులో దర్శించేందుకు కన్నులు తెరుస్తున్నామా? మన ఇంటి పనిమనిషికి ఒక పదేళ్లు కూతురు ఉన్నట్టు మనకు తెలియదు. మాసిన గౌన్ వేసుకున్న ఆ పాప ఎప్పుడైనా వచ్చినా సిగ్గుకొద్దీ తల్లి కొంగు వదలదు. ‘ఇలా రా’ అని ఆ పాప చేతుల్లో కొత్త డ్రస్సు ఒకటి పెట్టి ఆ పిల్ల తెల్లటి కన్నుల్లో మెరిసే సంతోషాన్ని చూస్తున్నామా? కొత్తది ఇవ్వలేకపోయినా మన పిల్లవాడు గత సంవత్సరం వాడి పక్కన పెట్టిన స్కూల్ బ్యాగ్‌ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇచ్చామా? చినుకుల జడి. చిన్న చిన్న బిందువులు జలధి. బుజ్జి బుజ్జి సంతోషాలు... జీవితం. ఈ జీవితానికి అర్థం ఏమిటి అని చాలామంది అంటుంటారు. అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... కవి చెప్పలేదా? పశువులకు కూడా తెలుసు పాటకు మోర ఎత్తాలని. మంచి సంగీతం వినడానికి కూడా సమయం లేదా? బైక్ మీద రోడ్‌పై వెళుతుంటే అంధుల బృందం మైక్ సెట్ పెట్టుకుని పాడుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆగి ఒక పాటైనా విని ‘బాగా పాడారు’ అని చెప్పి పది రూపాయలు ఇస్తే ఈ చీకటి కళ్లల్లో వచ్చే సంబరం మనకు సంతృప్తి ఇవ్వదూ? సెల్‌ఫోన్ పక్కన పడేసి పక్కింటి మూడేళ్ల బుజ్జిగాణ్ణి తెచ్చుకుని వాడికి చిన్నప్పుడు విన్న నానమ్మ పాటో అమ్మమ్మ పాటో వినిపిస్తే వాడు లేత గులాబీరంగు పెదాలతో బోసిగా నవ్వి కళ్లు మిటకరిస్తూ చూస్తే... బదులు పాడితే మన అకౌంట్లో గుర్తు తెలియని అకౌంట్ నుంచి కోటి రూపాయలు పడిన దానితో సమానం. ఆ వేళ కొత్తిమీర పచ్చడి మనకు మనమే చేసుకున్నా... ఆ రాత్రి వంట మానేసి ఫుడ్ బజార్లో వేడి వేడి ఇడ్లీలు విసురు గాలిలో ఊదుకుంటూ తిన్నా ఆ ఆనందాన్ని కొలిచే కొలమానం లేదు. అప్పుడప్పుడు తీరిగ్గా కూచుని పాత ఆల్బమ్ తిరగేసినా, స్కూల్ నాటి ఫ్రెండ్‌ని ఫేస్బుక్లో పట్టుకుని పలకరించినా నింపిన టబ్‌లో పిల్లల కోసం బొమ్మ స్టీమర్ తిప్పినా చిట్టి పొట్టి చిరుతిళ్లు తినిపించినట్టే జీవితానికి. కొంపలు మునిగేదేమి లేదు... నిత్య పరుగులు లేకపోయినా మనం బతగ్గలం అని కరోనా పదే పదే మనకు చెబుతోంది. కాని మనమే వినడం లేదు. అది మ్యుటేషన్లు మార్చుకుంటోంది. మనం మన ధోరణి మార్చుకోవడం లేదు. ‘స్లో’ అనేది ఇటీవలి జీవన విధానం. ‘స్లో’గా ఉంటూ కూడా సంతోషంగా ఉండొచ్చేమో చూడండి. ఈ రెండు మూడు నెలలు గుంపుల్లో ఉండకుండా ఉరుకులు పరుగులు ఎత్తకుండా అనవసర ప్రయాణాలు చేయకుండా జీవితం ప్రసాదించి చిరు ఆనందాల ప్రసాదాన్ని ఆరగించండి. జయం. -
2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన తెలుగుదేశం పార్టీకి 2021 పరాభవ నామ సంవత్సరంగా మిగిలింది. సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన ఆ పార్టీ ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలతో పాతాళంలో కూరుకుపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఘోరమైన ఛీత్కారాలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో ఎన్నికల్ని బహిష్కరించడం దగ్గర నుంచి తమకు ఓటు వేయలేదనే అక్కసుతో ప్రజలనే నిందించడం, శాపనార్థాలు పెట్టడం ఈ ఏడాది ఆ పార్టీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏ దశలోను పోటీపడలేక బురద జల్లడమే పనిగా పెట్టుకున్నా ప్రజల నుంచి ఎటువంటి సానుకూలత టీడీపీకి రాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: వంగవీటి రాధాకు ప్రభుత్వ భద్రత స్థానిక ఎన్నికల ఫలితాలతో కుంగుబాటు ఈ ఏడాది స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడాన్ని బట్టి ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న స్థానం ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా టీడీపీ చతికిలపడడం చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. జనవరిలో పార్టీ గుర్తులేకుండా జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో తమకు 35 శాతానికి పైగా పంచాయతీలు వచ్చినట్లు చంద్రబాబు అదేపనిగా బుకాయించి ప్రజల తీర్పును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం పంచాయతీలు కూడా దక్కలేదు. కానీ, పార్టీ గుర్తుల్లేకుండా జరిగిన ఎన్నికలు కావడంతో ఆ ఎన్నికల్ని వివాదం చేసి తమ ఓటమిని కప్పిపుచ్చుకోవాలని చూశారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీల్లో టీడీపీ 14 మాత్రమే గెలవడంతో చంద్రబాబు బుకాయింపు గాలి బుడగలా పేలిపోయింది. 30 ఏళ్లు చంద్రబాబుకు అండగా నిలిచిన కుప్పం ప్రజలు తొలిసారి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో టీడీపీకి శరాఘాతంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాతాళానికి.. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక మున్సిపాల్టీని ఆ పార్టీ గెలుచుకోగలిగింది. 11 మున్సిపాల్టీల్లో అసలు టీడీపీ అడుగే పెట్టలేకపోయింది. ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణను మున్సిపల్ ఎన్నికల ఓటమి స్పష్టంచేసింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలోను చిత్తుగా ఓడిపోయింది. ఇక పోటీ ఇవ్వలేక పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. ఆ తర్వాత బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలోను అభ్యర్థిని ప్రకటించి తర్వాత తప్పుకున్నారు. మలి విడత జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీచేసినా ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇందులో ఏకంగా కుప్పం మున్సిపాల్టీనే చంద్రబాబు చేజార్చుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు సాధారణ ఎన్నికల కంటే ఇంకా దిగజారినట్లు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఓటములతో నేతల అసహన పర్వం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రజలపైనే విరుచుకుపడుతూ తమ అసహనాన్ని పదేపదే బహిర్గతం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సిగ్గులేదని, ఎవరికి ఓటేయాలో కూడా తెలీదంటూ చంద్రబాబు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. రాజకీయంగా కునారిల్లిన దశలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పట్టాభిరామ్ తదితర నేతలు సీఎం వైఎస్ జగన్, మంత్రులను పరుష పదజాలంతో రాయలేని భాషలో దూషించి ప్రజల దృష్టిలో ఇంకా చులకనయ్యారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. సీఎంను బోషడీకే అంటూ టీడీపీ నాయకుడు పట్టాభి దూషించడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించగా.. తదనంతరం ప్రజల్లో టీడీపీపై ఆగ్రహం పెల్లుబికింది. పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై బురద జల్లడమే పనిగా ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా అభూత కల్పనలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నారనే అభిప్రాయం నెలకొంది. అన్ని రకాలుగా కుంగిపోయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పరిమితమయ్యారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా ఆందోళనలు, నిరసనల్లో ఆ పార్టీ కేడర్ పాల్గొనే పరిస్థితి లేకుండాపోయింది. రాజకీయ పతనంలో 2021 సంవత్సరం టీడీపీకి కొత్త కోణాన్ని పరిచయం చేసింది. -
బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం నిశితంగా సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి రెండు ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని అధికారులు వివరించారు.(చదవండి: దత్తపీఠంలో అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్) జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలని.. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దీని కోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్‌ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: Eid Milad-un-Nabi: 19న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం -
బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలన్నారు. బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్నారు. చదవండి: లక్ష్యంలోగా సర్వేను పూర్తి చేయాలి: సీఎం జగన్ కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాలమేరకు బొగ్గును తెప్పించుకోవాలని సీఎం సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: AP: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం లేదు: హేమ చంద్రారెడ్డి -
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
-
కరోనా పరిస్థితులపై టీఎస్ హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వైద్యారోగ్య, విద్య, శిశు సంక్షేమ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీసు, జైళ్ల శాఖలు.. హైకోర్టుకు నివేదికలు సమర్పించాయి. డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని డీహెచ్ శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని.. మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నామని కోర్టుకు డీహెచ్ తెలిపారు. 6,127 ఖైదీలకు ఒకడోసు, 732 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిపినట్లు జైళ్ల శాఖ కోర్టుకు తెలిపింది. మరో 1,244 మంది ఖైదీలకు వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు. ‘‘జూన్ 20 నుంచి ఈనెల 5 వరకు 87,890 కేసులు నమోదు చేసి, రూ.52 కోట్ల జరిమానా విధించామని’’ కోర్టుకు డీజీపీ వివరించారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నామని శిశు సంక్షేమ శాఖ కోర్టుకు తెలిపింది. ఆన్లైన్ బోధన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన.. కోర్టుకు సమర్పించారు. విద్యా సంస్థల్లో ఆన్లైన్ తరగతులే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టామని హైకోర్టుకు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. -
15 రోజుల్లో పెళ్లి.. ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ
ఇజ్రా చిట్టెంపల్లి.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఓ చిన్న గ్రామం. 300 కుటుంబాలు ఉన్న గ్రామంలో అందరూ గిరిజనులే. అందరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. అలాంటి పల్లె దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఉదయాన్నే దూసుకొచ్చిన మృత్యుశకటం ఐదు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఐదుగురివి పేద కుటుంబాలే. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతోపాటు సమీప బంధువులు, దాయాదులు. మృతులు జాటోత్ సోనాబాయి, నితిన్, జాటోత్ శేనిబాయి, జాటోత్ రేణుకాబాయి దాయాది కుటుంబాలకు చెందినవారు కాగా, రమావత్ సంధ్య వీరికి సమీప బంధువు. – మోమిన్‌పేట 15 రోజుల్లో పెళ్లి.. చిట్టెంపల్లికి చెందిన కమల్, శవంత దంపతులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకూతురు సంధ్య వికారాబాద్ కొత్తగడి సమీపంలో ఉన్న సమీకృత హాస్టల్లో ఉంటూ నలంద కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. పదో తరగతి టాపర్ అయిన సంధ్య కరాటే కూడా నేర్చుకుంది. కరోనా కారణంగా కళాశాలకు సెలవు ఉండటంతో ఇంటి వద్దే ఉంటూ కుటుంబానికి ఆసరాగా రోజూ కూలిపనులకు వెళ్తోంది. కమల్ సోదరి కుమారుడితో జనవరి 10న సంధ్య వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం ఆమెతో వికారాబాద్‌లో పూజలు చేయించాలనుకున్నారు. పెళ్లి బట్టలు కొనడంతోపాటు పత్రికలు రాసుకునేందుకు సిద్ధ మయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కూలిపనులకు బయలుదేరి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. చదవండి: (మృత్యుశకటం!) తిరిగిరాని లోకాలకు చదువులతల్లి.. కమల్, జీనిబాయిల రెండో కుమార్తె సోనీబాయి(16)కి చదువుల తల్లిగా గ్రామంలో పేరుంది. ప్రస్తుతం ఆమె వికారాబాద్ కొత్తగడి సమీకృత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ఉండటంతో ఇంటివద్దే ఉంటూ కూలిపనులకు వెళ్తోంది. ఈ క్రమంలోనే శనివారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. సోనిబాయి అక్క స్వప్నకు మాటలు రావు. త మ్ముడు చిన్నవాడు. దీంతో సోనిబాయిని బాగా చదివించి ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులు భావిం చారు. కానీ రోడ్డు ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. కూలిపనులకు వద్దన్నా వెళ్లి.. చిట్టెంపల్లికి చెందిన శేనిబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లిళ్లు అయిపోయాయి. భర్త బాబు వ్యవసాయ కూలీ. శేనిబాయి పెద్దకుమారుడు వినోద్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా డబ్బులు పంపిస్తానని, కూలిపనులకు వెళ్లొద్దని తల్లిని నిత్యం వారించేవాడు. అయినా ఆమె వినిపించుకునేది కాదు. 10 రోజుల క్రితం కూడా తల్లితో మాట్లాడిన వినోద్.. కూలికి వెళ్లవద్దని నచ్చజెప్పాడు. కొడుకు వారిస్తున్నా వినకుండా శనివారం పనులకు బయలుదేరి, ప్రాణాలు కోల్పోయింది. పిల్లలను వదిలి.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేణుకాబాయికి ఐదేళ్ల కూతురు సింధు, మూడేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నారు. భర్త వినోద్ వ్యవసాయ కూలీ. రేణుకాబాయి రోజు మాదిరిగానే పనులకు బయలుదేరి వెళ్లి ప్రమాదంలో అసువులు బాసింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి ఆలనాపాలనకు దూరమయ్యారు. నానమ్మ దశదినకర్మ మరుసటిరోజే.. నానమ్మ దశ దినకర్మ మరుసటిరోజే మనవడు మృతిచెందడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. చిట్టెంపల్లికి చెందిన మోతీలాల్, మంగీబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారిలో జాటోత్ నితిన్(16) చిన్నవాడు. నితిన్ రంగారెడ్డి జిల్లా యాచారంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా ఇంటివద్దే ఉంటూ కూలి పనులకు వెళ్తున్నాడు. ఇటీవల నానమ్మ మంకీబాయి మృతి చెందటంతో పది రోజులుగా పనులకు వెళ్లడంలేదు. శుక్రవారం దశదినకర్మ ముగియటంతో శనివారం ఉదయం పత్తి తీసేందుకు బయలుదేరి విగతజీవుడయ్యాడు. ఆటో డ్రైవర్ హరి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావించిన నితిన్ తండ్రి మోతీలాల్.. అతడి ఇంటి పైకప్పు కూల్చివేశాడు. -
అన్ని స్థితులూ ఆ దైవం కల్పించినవే
జీవితం విభిన్న స్థితుల సంగమం. సుఖ దుఃఖ సమ్మేళనం. సంతోషం– బాధ, ఆనందం– విచారం, తీపీ– చేదూ; శీతలం– ఉష్ణం; సంతృప్తీ– అసంతృప్తీ; శాంతి–అశాంతీ ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం. అందుకని ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాశానిస్పృహలకు లోను కాకూడదు. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి. ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగిపోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే అది తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు. ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసంతో ఉండాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:‘మానవులారా! నా ప్రసన్నత కోసం, నేను ప్రసాదించే పుణ్యాన్ని పొందే సంకల్పంతో, దుఃఖ సమయం ఆసన్నమైనప్పుడు సహనం వహించినట్లయితే, నేను స్వర్గం కన్నా తక్కువైన దాన్ని, స్వర్గం తప్ప మరిదేన్నీ మీకు ప్రసాదించడానికి ఇష్టపడను.’ప్రతి వ్యవహారంలో, ప్రతిస్థితిలోనూ వారికి శుభాలే శుభాలు. వారికి శాంతి, సుఖ సంతోషాలు ప్రాప్తమైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇది వారి పాలిట శుభాలపంట. ఒకవేళ వారికి దుఃఖ విచారాలు కలిగితే, ఇదీ దైవ నిర్ణయమేనని భావిస్తూ సహనం వహిస్తారు. ఈ సహనం వహించడం కూడా వారి పాలిట శుభాల పంటే అవుతుంది. ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటి ద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ప్రాప్తమైనప్పుడు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే సహనం వహించాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. -
బీమిలి నియోజకవర్గంలో టీడీపీ కోటకు బీటలు!
సాక్షి, తగరపువలస: భీమిలి... రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని అసెంబ్లీ నియోజకవర్గం. మొదటి నుంచి రాజవంశీయులను పార్టీలకతీతంగా అసెంబ్లీకి పంపించిన ఘనత సొంతం చేసుకున్న ప్రాంతం. 1980 దశకంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగా మారిన నియోజకవర్గం. మధ్యలో కాంగ్రెస్, పీఆర్పీ అభ్యర్థులు విజయం సాధించినా 2014 ఎన్నికల్లో మరలా ఈ నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. ఈ ఐదేళ్లలో ఆ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు.. గత ఎన్నికల్లో ఇచ్ని హామీలు ఒక్కటి కూడా నెరవేర్చక పోవడంతో నియోజకవర్గంలో టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమిలి నియోజకవర్గంలో సుమారు 12 రోజుల పాటు జరిపిన పాదయాత్ర ఈ ప్రాంత ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించింది. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది. పడిపోయిన టీడీపీ గ్రాఫ్ 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు స్థానికులకు అందుబాటులో లేరు. నెలకోసారి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి తన ప్రతినిధులతో నడిపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆర్.ఎస్.డి.పి.అప్పలనరసింహరాజు వంటి సీనియర్లకు కూడా సరైన గుర్తింపు లభించలేదు. అంతే కాకుండా బి.ఫామ్ పొందిన గంటా శ్రీనివాసరావు తొలుత ఆర్.ఎస్.డి.పి.అప్పలనరసింహరాజు ఇంటికి వెళ్లి తనను ఆశీర్వదిస్తే చిట్టివలస జూట్‌మిల్లు సమస్య, తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్, పాండ్రంగి గోస్తనీనదిపై వంతెన, పద్మనాభస్వామి కొండకు ఘాట్‌రోడ్డు వంటి దీర్ఘకాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. పరుచూరి భాస్కరరావు హయాంలో భూ కుంభకోణాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగింత, ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలలో అవినీతి, హుద్‌హుద్ సమయంలో మంత్రి ఇంటి నుంచి బయటకు రాకపోవడం అన్నీ కలిపి ఇక్కడ టీడీపీ గ్రాఫ్‌ను పడేశాయి. అభ్యర్థికోసం టీడీపీ వెతుకులాట ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు భీమిలిలో సర్వే చేయించినప్పుడు ఇక్కడ టీడీపీకి నూకలు చెల్లిపోయినట్టు గుర్తించారు. దీనికితోడు ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్సీపీలోకి జారిపోతుండటంతో మైండ్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రులు నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు పేర్లతో పాటు తాజాగా అశోక్‌గజపతిరాజు కుమార్తె అతిది పేరు తెరమీదకు తేవడం ఆ పార్టీ దీనస్థితికి అద్దం పడుతోంది. కాంగ్రెస్ డీలా భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడ్డారు.రాష్ట్ర విభజన దెబ్బ నుంచి ఆ పార్టీ నాయకులు కోలుకోలేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. జనసేన పరిస్థితి కూడా అంతే. ముత్తంశెట్టి రాకతో మరింత జోష్ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో భీమిలి సమన్వయకర్తగా ఉన్న అక్కరమాని విజయనిర్మల పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇటీవల మారిన సమీకరణాల కారణంగా భీమిలి ప్రజలతో గతంలో పరిచయాలు ఉన్న అవంతి విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీకి, లోక్‌సభకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరడంతో ఆయనను భీమిలి సమన్వయకర్తగా నియమించారు. ఆయన రాకతో భీమిలిలో వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరినట్టయింది. టీడీపీ కాంగ్రెస్‌లకు చెందిన వారేకాకుండా, తటస్థులు కూడా వైఎస్సార్సీపీకి దగ్గరవుతున్నారు. దీంతో చంద్రబాబు మదిలో కలవరం మొదలయి భీమిలిలో ముత్తంశెట్టిని ఢీ కొట్టే శక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ భీమిలిలో వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకలాంటిదని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. -
నెమ్మదస్తుడు
‘నీ అసలు రంగు ఇవ్వాళ తెలిసింది. అభమూ శుభమూ తెలియని ఆడపిల్లను మోసం చేస్తావా? ఈ సంతానానికి బాధ్యత ఎవరు వహించాలి?’ అని దూషించడం మొదలుపెట్టారు. పాతకాలంలో ఒక ఊరిలో ఒకాయన ఉండేవాడు. నెమ్మదస్తుడు. భార్యాపిల్లలు లేరు. ఆయనంటే ఊరి జనానికి ఏదో తెలియని గౌరవం ఉండేది.ఒకరోజు పొద్దున్నే ఆయన ఇంటికి ఇరుగు పొరుగు హడావుడిగా వెళ్లారు. గుంపులోని ఒక యువతి చేతిలో రోజుల శిశువు ఉన్నాడు. వాళ్లు తలుపు దబదబా బాదారు. ఆయన ఏమైందో అర్థం కాక తలుపు తీసి, బయటికి వచ్చాడు. ‘నీ అసలు రంగు ఇవ్వాళ తెలిసింది. అభమూ శుభమూ తెలియని ఆడపిల్లను మోసం చేస్తావా? ఈ సంతానానికి బాధ్యత ఎవరు వహించాలి?’ అని దూషించడం మొదలుపెట్టారు. ఆయనేమీ మాట్లాడలేదు. ‘ఈ పాపకు తండ్రివి నువ్వే’ అని శిశువును గడపలో పడుకోబెట్టారు.పరిస్థితిని గ్రహించుకున్నట్టుగా, ‘అలాగా’ అని మాత్రం అనగలిగాడాయన. ఆ రోజు నుంచీ పాపను ఆయనే పెంచడం మొదలుపెట్టాడు. ఏడాది గడిచింది. అప్పటికి నిజం బయటపడింది. ఆ యువతి ఊళ్లోని ఒకతణ్ని ప్రేమించింది. కానీ ఇంట్లో చెప్పే ధైర్యం లేదు. ఏడాది తర్వాత ప్రేమికులిద్దరిలోనూ తెగింపు వచ్చి, జరిగింది వెల్లడించారు. మళ్లీ తెల్లారి ఇరుగు పొరుగు ఆయన దగ్గరికి వెళ్లారు. నెమ్మదిగా తలుపు తట్టారు. ఆయన బయటికి వచ్చాడు. ‘అయ్యో, మా వల్ల పొరపాటు జరిగింది. మీ వ్యక్తిత్వం గ్రహించలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. పాపను మేము తీసుకెళ్లిపోతాం’ అన్నారు.మళ్లీ పరిస్థితిని గ్రహించినట్టుగా, ‘అలాగా’ అని మాత్రం అన్నాడాయన. -
అడుగడుగునా భంగపాటే!
- ఎంపీ తోటకు చేదు అనుభవాలు - సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే సహాయ నిరాకరణ - బుట్టదాఖలవుతున్న ఆయన సిఫారసులు - నివ్వెరపోతున్న అనుచరులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా రాజకీయాల్లో అదృష్టవంతులెవరైనా ఉన్నారా అంటేæ అది కాకినాడ ఎంపీ తోట నరసింహం అని చెబుతారు. 15 ఏళ్ల క్రితం వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక.. అంచెలంచెలుగా పదవుల నిచ్చెన మెట్లు ఎక్కేశారు. డీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పదవులు పొందిన ఆయన ఇప్పుడు కాకినాడ ఎంపీగా ఉన్నారు. నరసింహం రాజకీయ వైభవమంతా ఆయన సోదరుడు, అప్పటి డీసీసీ అధ్యక్షుడు తోట వెంకటాచలం మరణానంతరం ఆయన వారసత్వంగా వచ్చినవే. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడి గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు అల్లుడిగా, ఆయన ఆశీస్సులతో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీ అయిన విషయం తెలిసిందే. ఇంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తోట.. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ప్రస్తుతం సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. పలు నియోజకవర్గాల్లో అయితే ఎంపీ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. అన్నవరం దేవస్థానం పాలక మండలి ఎంపిక వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఆయన సిఫారసు బుట్టదాఖలు అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం పాలకవర్గాన్ని ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ తనకు అత్యంత సన్నిహితుడు, బంధువు అయిన కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన తోట అయ్యన్న పేరును తోట నాలుగైదు నెలల కిందట సిఫారసు చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. మరోపక్క వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికై, టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. జగ్గంపేటకు చెందిన కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) పేరును సిఫారసు చేశారు. దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సిఫారసు చేసినవారికి పదవి ఇవ్వలేదనే వివాదానికి, ఎంపీ తోట అనుచరుడికి కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం తోడై.. చివరకు పాలకవర్గం ఏర్పాటు కోసం అప్పట్లో విడుదల చేసిన జీఓను రద్దు చేశారు. అయితే, తాజాగా నియమించిన పాలకవర్గంలో కూడా ఎంపీ తోట సిఫారసుకు గడ్డిపోచంత విలువ కూడా ఇవ్వలేదు. ఎంపీ ప్రతిపాదించిన అయ్యన్నను కాదని, ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించిన కొండబాబుకు ప్రాతినిధ్యం కల్పించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్నవరం దేవస్థానం పాలకవర్గంలో కూడా తన సిఫారసుకు విలువ లేకుండా చేయడంతో.. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ డుమ్మా కొట్టారు. ఎంపీ సిఫారసు చేసినవారిని దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇదే తోట గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గానికి చెందిన కరుటూరి శ్రీనివాస్‌ను పాలకవర్గ సభ్యుడిగా నియమించుకోగలిగారు. ఎంపీ ముద్రగడ పద్మనాభం హయాంలో కూడా అన్నవరం దేవస్థానం పాలకవర్గంలో ఆయన సిఫారసు మేరకు సభ్యుడిని నియమించారు. కానీ, తోట సిఫారసును మాత్రం తుంగలో తొక్కేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన నరసింహానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన వర్గీయులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం పాలకవర్గంలో సభ్యత్వం మాట దేవుడెరుగు.. ఎంపీ వర్గమని అంటేనే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమను అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సొంత నియోజకవర్గంలోనూ అదే తంతు సొంత నియోజకవర్గం జగ్గంపేటలో కూడా ఎంపీ వర్గాన్ని ఎమ్మెల్యే నెహ్రూ వర్గీయులు దూరం పెడుతున్నారు. ఎమ్మెల్యే వర్గం తమను కనీసం పార్టీ నేతలుగా కూడా చూడటం లేదని జగ్గంపేటలో తోట ముఖ్య అనుచరుడైన బండారు రాజా వంటి నేతలు చాలా గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో నామినేషన్ పద్ధతిలో నీరు - చెట్టు పథకం కింద చేపడుతున్న అంతర్గత రహదారులు, ఉపాధి హామీ పథకం లింకేజితో ఇచ్చిన గ్రామీణ రహదారులు, పుంత రోడ్లు, చెరువు అభివృద్ధి పనులను ఏకపక్షంగా వారే ఎగురేసుకు పోతున్నారని అంటున్నారు. ఇంకా పలుచోట్ల.. - పిఠాపురం నియోజకవర్గంలో కూడా తోటకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అక్కడి ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గం ఎంపీ తోట వర్గాన్ని పూర్తిగా దూరం చేసేసింది. అధికారిక, పార్టీ కార్యక్రమాలు వేటికీ కూడా ఎంపీ వర్గ నేతలను ఆహ్వానించడం లేదు. ఎంపీతో సఖ్యతగా ఉండటమే మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు చేసిన పాపమన్నట్టు.. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైస్ చైర్మన్ పిల్లి చిన్నాను ప్రోత్సహిస్తున్నారని ఎంపీ తోట వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకు వెనుక ఉండి పని చేసిన కాపు సామాజికవర్గ నేతలు కొందరు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) డైరెక్టర్ పదవి ఆశించారు. అందులో మెజార్టీ నేతలు తోట వెంట ఉన్నారని పక్కన పెట్టేశారని అంటున్నారు. ఆ మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల అమలులో.. చివరకు పింఛన్లలో కూడా ఎంపీ వర్గాన్ని వివక్షకు గురి చేస్తున్నారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు కాపు రుణాల మంజూరులో కూడా అదే సామాజికవర్గానికి చెందిన చైర్మన్ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే వర్మ వర్గం ఏకపక్షంగా చేసుకుపోతోంది. ఈ వ్యవహారాన్ని పలువురు ఆ సామాజికవర్గ ముఖ్య నేతల వద్దకు తీసుకువెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. - ఎంపీ తోట స్వగ్రామం జగ్గంపేట నియోజకవర్గమే అయినా నివాసం ఉంటున్నది మాత్రం కాకినాడ నగరంలోనే. అందునా కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి, మేయర్ స్థానం జనరల్ మహిళ అయితే ఎంపీ తోట భార్య, కిర్లంపూడి సర్పంచ్ వాణి పోటీ చేస్తారనే ప్రచారం పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో సిటీలో ఎమ్మెల్యే కొండబాబు వర్గం తోట వర్గీయులతో దూరం పాటిస్తోంది. సిటీలో చౌకధరల దుకాణాల కేటాయింపులో ఎంపీ సిఫారసు చేసినవారిని ఎమ్మెల్యే పక్కన పెట్టేశారన్న ప్రచారం ఉంది. అలాగే, ఎంపీతో సఖ్యతగా ఉంటున్నారన్న కారణంతో నున్న దొరబాబును టీడీపీ నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు పార్టీలో బలంగా ఉన్నాయి. - ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురంతోపాటు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సైతం ఎంపీ వర్గానికి ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. -
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
► ఇదీ అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పరిస్థితి ► మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగేనా? ► పీఐబీ అనుమతులు మంజూరుకు వెనుకంజ ► అయినా భూసేకరణకు సిద్ధమైన జిల్లా అధికారులు అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. నిబంధన మేరకు అన్నీ అడ్డంకులు ఎదురవుతుండటంతో చివరకు ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ) ప్రశ్నల పరంపర ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ప్రాజెక్టు పట్టాలెక్కేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిబంధనలను సరళతరం చేస్తే మెట్రో రైలు అమరావతిలో పరుగులెత్తడం పెద్దకష్టం కాదని రాష్ట్ర అధికారులు చెప్పుకొస్తున్నారు. సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేయడం లేదు. రూ.6,847 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం చొప్పున మిగిలిన 60 శాతం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) భరిస్తుంది. కేంద్రం తన వాటా నిధులు ఇచ్చే విషయంలోనూ, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసే అంశంలోనూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ) పలు సందేహాలను లేవనెత్తుతోంది. ఇటీవల ఢిల్లీలో పీఐబీ అధికారులు సమావేశమై ఏఎంఆర్‌సీ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, రాబడిపై చర్చించి, ప్రాజెñక్టుకు నిధులు ఖర్చు చేసే విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మెట్రో రైలును తొలుత ఆరు కార్లలో (బోగీలు) నడపాలని ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పుడు ఏఎంఆర్‌సీ అధికారులు దీన్ని మూడు కార్లకు కుదించారు. విజయవాడకు మెట్రో అవసరమా ? విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు అవసరమా? అనే అంశం పీఐబీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మెట్రో ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటరŠన్స్ (ఎఫ్‌ఐఆర్‌ఆర్) 8 శాతం కంటే ఎక్కువ ఉంటేనే మెట్రో ప్రాజెక్టు లాభదాయకమని, అందువల్ల వాటికి నిధులు మంజూరు చేయవచ్చని అధికారులు నిర్ణయిస్తారు. అయితే విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 3 శాతంకంటే ఎఫ్‌ఐఆర్‌ఆర్ ఎక్కువగా లేదు. అందువల్ల ఈ ప్రాజెక్టు మంజూరు చేయడం వల్ల లాభం ఉండబోదని పీఐబీ అధికారులు అంచనాలు వేస్తున్నారు. 20 లక్షల జనాభా దాటిన నగరాలకు మాత్రమే మెట్రో ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు అంచనా. అయితే విజయవాడ నగర జనాభా కేవలం 10.50 లక్షలు మాత్రమే. చుట్టుపక్కల గ్రామాల జనాభా అంతా కలుపుకున్నా మరో రెండు మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఉండరు. అందువల్ల మెట్రోను పూర్తిస్థాయిలో ఉపయోగించకపోవచ్చని భావిస్తున్నారు. బిజీ వేళల్లో కనీసం (పీక్ డైరెక్షన్ ట్రాఫిక్–పీహెచ్‌పీడీటీ) మెట్రోలో కనీసం 20 వేల మంది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే విజయవాడలోని బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులోని రెండు కారిడార్లలోనూ కలిపి 13 వేల మంది కంటే ఎక్కువ మంది ప్రయాణించరని అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. అందువల్ల మెట్రో ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రూ.100 కోట్లు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేటాయించారు. మరో వైపు భూసేకరణ ఒక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు మంజూరు అవుతాయో లేదో తెలియదు కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ఏఎంఆర్‌సీ అధికారులు, కృష్ణా జిల్లా యంత్రాంగం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభం కావడంలో జాప్యం కావడంతో రూ.7,212 కోట్లు ఖర్చు అవుతుందని మెట్రో అధికారులు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ కోసం రూ.300 కోట్లు మంజూరు చేయడంతో పాటు తనవాటా నిధులుగా రూ.1,800 కోట్లు అప్పుగా బ్యాంకుల నుంచి తీసుకునేందుకు జీవో జారీ చేసింది. ఇక ఏఎంఆర్‌సీ అధికారులు ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన ఏఎఫ్‌డీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి సుమారు రూ.3,600 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే కేంద్ర వాటా గురించి నిర్ధిష్టంగా తెలియడం లేదు. అనుమతులు రాకుండానే.. కేంద్రం నిధులు, అనుమతులు రాకుండానే ఈ పాజెక్టుకు అవసరమైన 76 ఎకరాల భూమి సేకరించేందుకు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో భూ యజమానుల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా విజయవాడకు సమీపంలోని నిడమానూరు గ్రామంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రూ.50 ఎకరాలు సేకరించాలనే నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే తమ వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, మెట్రో ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రారంభించి, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. -
‘బాబు’కు ఇంధ్రభవనం పేదలకు ‘చంద్ర’గ్రహణం
- మూడేళ్లుగా ఇళ్ల కోసం లక్ష దరఖాస్తులు - ఇందులో 60 వేలు ఆన్లైన్లో - విమర్శలు వెల్లువెత్తగా జిల్లాకు 23 వేల ఇళ్లు మంజూరు - మొదలు పెట్టిన ఇళ్లకు అరకొర చెల్లింపులు - వై.ఎస్.హయాంలో ప్రతి ఏటా ఇళ్ల మంజూరే - తరువాత వచ్చిన సీఎంల హయాంలో మంజైరైన వాటికీ గతి లేదు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు సొంత ఇంటి కల ఒక కలగానే మిగిలిపోయింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎడాపెడా హామీలు గుప్పించేసిన చంద్రబాబు ఎన్నికలయ్యాక గాలికొదిలేశారు. సీఎం గద్దెనెక్కి మూడేళ్ల కాలంలో ముచ్చటగా మూడు ఇళ్లు కూడా నిర్మించిన దాఖలాలు జిల్లాలో లేవు. సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు వేలాది మంది దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. పేదల గోడు మాట దేవుడెరుగు సీఎం మాత్రం ఇంద్రభవనం లాంటి భవంతిలో ఇటీవలనే గృహ ప్రవేశం కూడా చేశారు. ఎదురు చూపులు ... ఎండమావులు సొంత ఇల్లు నిర్మించుకోవాలని మూడేళ్లుగా జిల్లాలో సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకుని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇది అధికారికంగా గృహనిర్మాణ సంస్థకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రమే. ఈ లక్ష దరఖాస్తుల్లో సుమారు 60 వేల దరఖాస్తులను గృహనిర్మాణ సంస్థ ఆన్లైన్లో నమోదు చేసింది. గ్రామాల్లో పర్యటనలకు వెళుతున్న సందర్భంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారి నుంచి నిరసన ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు మొత్తుకోగా ప్రభుత్వం ఆరు నెలలు క్రితం జిల్లాకు 23 వేల 348 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 17 వేల 390 ఇళ్ల నిర్మాణాలను గత అక్టోబరు నెలలో లబ్థిదారులు ప్రారంభించారు. నెల రోజుల తరువాత నవంబరు నెలలో ఇళ్లు మొదలుపెట్టిన వారికి మాత్రం మొదటి విడత ఆన్లైన్లో అరకొర చెల్లింపులతో సరిపెట్టేశారు. మొదటి విడతగా ఒక్కో ఇంటికి 50 నుంచి 100 బస్తాలు సిమెంట్, రూ.6000లు నగదు చెల్లించారు. అంటే ఇళ్లు మొదలుపెట్టాక మొక్కుబడిగా ఒక నెల బిల్లులంటూ ఆర్భాటం చేసి ఆ తరువాత లబ్థిదారులను గాలికొదిలేశారు. 2016 డిసెంబర్ నుంచి నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఆ రకంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 3.40 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా డిసెంబరు నెల నుంచి ఇంతవరకు అంటే ఐదు నెలలుగా ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న లబ్థిదారులకు చంద్రబాబు సర్కార్ చిల్లిగవ్వ విడుదల చేసిన దాఖలాలు లేవు. గడచిన మూడేళ్లుగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టకుండా ఆర్భాటపు ప్రచారాల్లో ప్రభుత్వం మునిగితేలుతుందన్న విమర్శలున్నా దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా నేతలు పట్టించుకోవడం లేదు. ఆ రోజులే వేరు... చంద్రబాబు సర్కార్ మూడేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించని పరిస్థితి ఇలా ఉంటే మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 నుంచి ప్రతి ఏటా దరఖాస్తు చేసుకొన్న ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు మంజూరు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం జిల్లాకు ప్రతి ఏటా 60 వేలకు పైనే ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. మంజూరు చేయడమే కాకుండా ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వచ్చారు. వై.ఎస్. హఠాన్మరణం తరువాత కిరణ్ కుమార్‌రెడ్డి, రోశయ్య సీఎంలుగా ఉండగా నిర్మించిన సుమారు 18 వేల ఇళ్లు ఇప్పటికీ పలు దశల్లో నిలిచిపోయి మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. ఈ ఇళ్ల లబ్థిదారులకు సుమారు రూ.12 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు గద్దెనెక్కాక ఈ బకాయిల ఊసే ఎత్తడం లేదు. సరికదా కొత్తగా మంజూరుచేసి నిర్మాణం చేపట్టిన ఇళ్లకు కూడా పైసలు ఇవ్వడం లేదు. ఫలితంగా లబ్థిదారులు లబోదిబోమంటున్నారు. ఇళ్లు మంజూరయ్యాయి నిర్మాణాలు చేపట్టాలని హడావిడి చేశారు. తీరా ఇళ్లు మొదలుపెట్టాక బిల్లులు విడుదల చేయకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక లబ్థిదారుల పరిస్థితి అయోమయంగా తయారైంది. -
చెరువులో పడి చిన్నారుల మృతితో రేజర్లలో విషాదచాయలు
మిషన్ కాకతీయ పనులతో ప్రమాదం చెరువు మొదట్లోనే 15 నుంచి 20 అడుగుల లోతు.. రేజర్ల (సత్తుపల్లి రూరల్) : ఆ పిల్లలు దసరా సెలవుల్లో హాయిగా గడుపుదామని ఇంటికి వచ్చారు. ఆడుకుంటూ చెరువువైపు వెళ్లిన గేదెను తోలుకొద్దామని వెళ్లారు. అంతలోనే పెను ప్రమాదం. చెరువులో 15 అడుగుల గొయ్యి ఉందని తెలియని చిన్నారులు అందులో మునిగి చనిపోయారు. ప్రమాదంలో సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన నక్కా ఏసు, కృష్ణవేణి దంపతుల కుమార్తె దివ్య (9), కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన గాదె సత్యవతి, మహేశ్వరరావు కుమారుడు అంజి (12) ఉన్నారు. ‘ఒక్కసారి లేచి మాట్లాడండ్రా’ అంటూ చిన్నారుల తల్లిదండ్రులు విలపించడంతో అక్కడి వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సెలవులకు పోలవరంలోనే ఉన్నా ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. గొయ్యి ఉండటం వలే.. జీలుగుమిల్లి చెరువులో గతేడాది మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మట్టిని ఎక్కడబడితే అక్కడ లోతుగా తవ్వడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు పనుల్లో చుట్టూ కందకం ఏర్పాటుచేసి గట్టు వేయాల్సి ఉండగా ప్రమాదం జరిగిన ప్రదేశం (చెరువు మొదటి భాగం)లో సుమారు 15 అడుగుల లోతులో గోతులు తీశారు. చెరువు మొదటి భాగంలో అడుగు నుంచి 2 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. అలాంటిది చెరువు మొదట్లోనే 15 నుంచి 20 అడుగుల లోతు గోతులు తీసి మట్టి తరలించుకుపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. చెరువు మొదట్లోనే అంతలోతు గొయ్యి తీసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లి సీఐ పి.రాజేంద్రప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాసాలమర్రిలో ఉద్రిక్తత
– బాధితులకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన – ఫర్నిచర్ ధ్వంసం, బియ్యం పారబోత – విషమంగానే లావణ్య, స్రవంతి ఆరోగ్య పరిస్థితి తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. భర్త దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లావణ్య, ఆమె కూతురుకు న్యాయం చేయాలని ఆదివారం బంధువులు ఆందోళనకు దిగారు. ముందుగా రామచంద్రం ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడవేశారు. బియ్యాన్ని రోడ్డుపై పారబోశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నిందితుడు రామచంద్రం అతడి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వాసాలమర్రి నుంచి కొండాపూర్ రోడ్డు మధ్యలో బైఠాయించారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకుని ఎస్ఐ మసియెుద్దీన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. -
అధికార‘పంచాయితీ’
–టీడీపీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న జిల్లా కీలక ఉన్నతాధికారి –పార్టీ పంచాయతీలకు వేదికైన కార్యాలయం –అసమ్మతి నేతలకు బుజ్జగింపూ అక్కడే –సర్వత్రా విమర్శల పాలవుతున్న తీరు ప్రజా సేవ చేయాల్సిన ఉన్నతాధికారి అధికారపార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. రాజకీయపరంగా పాలకపక్షానికి తమ వంతు సాయమందిస్తున్నారు. ఆఖరుకు పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో చర్చించుకుంటున్నారు. అధికార టీడీపీ చేతుల్లో పావులుగా మారిన తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాసేవకు అంకితమవుతామని ప్రమాణం చేసి వచ్చి అధికారపక్ష సేవలో తరించడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, చిత్తూరు: రాజకీయాలకు అతీతంగా పని చేస్తూ..ప్రజల మన్ననలు పొందాల్సిన అధికారులు అధికారంలో ఉండేపార్టీలకు కొమ్ము కాస్తున్నారు. తుదకు అధికార పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తినా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికారులు చక్కబెడుతున్నారు. అధికార పెద్దలకు నివేదికలు పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బుజ్జగింపుల పర్వం కేవలం మండలస్థాయిలో అనుకుంటే పొరబడినట్లే. జిల్లా పాలనలో కీలక భూమిక వహించే ఉన్నత స్థాయి అధికారి నేతృత్వాన జరగడం విశేషం. ఇవికో మచ్చుకు కొన్ని – కుప్పం పంచాయితీలో ఇటీవల టీడీపీలో కొందరు వార్డు సభ్యులు రాజీనామా చేసి సంక్షోభం సృష్టించారు. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. వీరిని బుజ్జగించి దారికి తెచ్చే బాధ్యతను జిల్లా కీలక ఉన్నతాధికారి భుజాన వేసుకున్నారు. ఈ పంచాయతీని సమర్ధంగా నిర్వహించి వారిలో అసమ్మతిని చల్లార్చారు. పంచాయతీ అభివృద్ధి నామమాత్రంగా ఉందంటూ గోడు చెప్పుకొందామని కార్యాలయానికి వచ్చిన వార్డు సభ్యులకు సదరు అధికారి క్లాసు పీకారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చొద్దంటూ సలహా ఇచ్చారు. – జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ,అటవీ శాఖ మంత్రి బోజ్జల, హౌసింగ్ చైర్మన్ వర్ల రామయ్యలు ఏకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను నేరుగా జిల్లా కీలక ఉన్నతాధికారి కార్యాలయానికి తీసుకొచ్చారు. మంతనాలు జరిపారు. టీడీపీ నాయకులకు అధికారులు అనుగుణంగా నడచుకోవాలని హుకుం జారీ చేశారు. ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరగాలని అనధికార ఆదేశాలు జారీ చేశారు. ఈ తతంగం ఆ పాలనాధికారి సమక్షంలోనే జరగడం గమనార్హం. – మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు ఎమ్మెల్సీ అయిన వెంటనే మంత్రి బొజ్జల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్ తదితరులు రాజకీయ సమావేశం సదరు కీలక ఉన్నత అధికారి చాంబరులోనే నిర్వహించారు. ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటైన సమావేశం అనుకుంటే పొరపాటు. నీరు–చెట్టు, ఇతర నామినేషన్ పనులను టీడీపీ కార్యకర్తలకే ఇవ్వాలని అ ఉన్నతాధికారికి చెప్పారు. వారి ఆదేశాల ప్రకారం చాలా వరకు పనులు అధికార పార్టీ కార్యకర్తలకే పనులు కేటాయిస్తున్నారు. – కొన్ని రోజుల క్రితం చిత్తూరు మేయర్ కుర్చీపై టీడీపీ నాయకులతో అర్ధరాత్రివరకు సమావేశం నిర్వహించారు. టీడీపీలో ఉన్న రెండు వర్గాలను పిలిపించుకొని అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. కుమ్ములాడుకుంటుంటే పార్టీ పరువు పోతుందని సదరు ఉన్నతాధికారి స్వయంగా వ్యాఖ్యానించారని సమాచారం. -
ఏదీ.. ఆ భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలనారంగ చరిత్రలో ఆయనది చెరగని సంతకం. ఆయన సాగించిన అభివృద్ధి.. ప్రజాసంక్షేమ ప్రస్థానం మరువలేని జ్ఞాపకం. ఆ మహానేత మరణించి ఏడేళ్లు గడచినా.. జిల్లా ప్రజలు ఆయనకు గుండెల్లో గుడికట్టి నేటికీ పూజిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా మన జిల్లాపై ఎనలేని మమకారం చూపించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రైతన్నకు భరోసా ఉంటుందని నమ్మారు. దాని కోసం ఆయన తపించారు. జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. డెల్టాను ఆధునికీకరించడం ద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ఆకాంక్షించారు. దానికోసం ఆగమేఘాలపై పనులు ప్రారంభించారు. వైఎస్ మరణంతో ఆ పనులు మూలనపడ్డాయి. తర్వాత పాలకులు డెల్టా ఆధునికీకరణపై దృష్టి పెట్టలేదు. కనీసం నిర్వహణ పనులు కూడా సక్రమంగా జరగకపోవడం డెల్టా రైతులకు శాపంగా మారింది. ఈ ఏడాది గోదావరిలో నీరున్నా డెల్టాలో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. రైతు బాంధవుడిగా.. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంత రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతు రుణాలు మాఫీ చేసిన రైతు బాంధవుడిగా అన్నదాతలంతా ఆయనను నేటికీ కొలుస్తూనే ఉన్నారు. ఆయన మరణానంతరం రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు దఫాల్లో ఇచ్చిన సొమ్ము వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి ఉండగా, రైతులకు కొత్తగా రుణాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ౖÐð ఎస్ ఏ వర్గం ప్రజలనూ విస్మరించలేదు. ఆరోగ్యశ్రీ పథకంతో వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించారు. వైద్యం అందక పేద, మధ్య తరగతికి చెం దిన ఏ ఒక్కరూ మృత్యువాత పడకూడదనే సంకల్పంతో అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చారు. వైఎస్ మృతి చెందాక ఆ పథకాన్ని పాల కులు నిర్వీర్యం చేశారు. పథకం పేరు మార్చి అందులో సగానికి పైగా వ్యాధులను తొలగించడంతో ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది. గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు, ఉచితంగా మందులు అందించే 104 పథకం మూలనపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించారు. జిల్లాలో వేలాది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చింది. దీంతె పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. వైఎస్‌హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరుగులు తీశాయి. నిత్య సమీక్షలతో సంక్షేమ ప్రగతిని సామాన్యులకు అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. పింఛన్లు, అభయహస్తం, పావలా వడ్డీ పథకం ఏదైనా ప్రస్తుతం నిధుల లేమితో చతికిలపడింది. వీటిలో కొన్నింటికి పేరు మార్చగా, మిగిలిన వాటిని నిధుల లేమి వెంటాడుతోంది. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వైఎస్ వెలుగు నింపితే.. ఇప్పటి ప్రభుత్వం రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను డిఫాల్టర్లుగా మార్చిం ది. జీవితంలో ఎప్పుడూ వారికి రుణాలందకుండా చేసింది. చంద్రబాబుకు ఓటు వేసిన పాపానికి డ్వాక్రా మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. -
మల్లన్నసాగర్ పరిస్థితి సృష్టించవద్దు
రౌండ్ టేబుల్ సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి న్యూశాయంపేట : జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం చేపట్టే ప్రభుత్వ భూసేరణను మల్లన్నసాగర్ పరిస్థితి మాదిరిగా చేయెుద్దని, అలా చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదరుర్కోవలసి వస్తుం దని ఎఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్తి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భూసేకరణ–నిర్వాసితుల సమస్య అనే అంశం పై పెద్దారపు రమేష్ అధ్యక్షతన హన్మకొండలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జీఓ 123 ప్రకారం నిర్బంధంగా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల భూసేకరణకు పూనుకొందని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేలా 2013 చట్టాన్ని అమలు చేయాలని డి మాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరించి భూసేకరణ చేస్తే రైతులు చేసే ఉ ద్యమాలకు అండగా వుంటామన్నారు. సీపీఐ జి ల్లా కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ భూసేకరణ జీఓలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ రియల్టర్లకు, పెట్టుబడిదార్లకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. వివిధ పార్టీల నాయకులు ఎన్.రెడ్డి, హాంసారెడ్డి, రాజయ్య, కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, ఈవి.శ్రీనివాస, రంగయ్య,చుక్కయ్య, రత్నమాల, దుబ్బ శ్రీనివాస సమ్మిరెడ్డి, కట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరిస్థితులు ఊహించే ఆత్మహత్య?
♦ ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం ఘటన ♦ సత్యనారాయణ కుటుంబం చాలాకాలంగా బంధువులకు దూరం ♦ మృతదేహాన్ని ఎటు తీసుకెళ్లాలో తెలియక అయోమయం ♦ ఆ సంఘర్షణతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం ఘట్కేసర్: మృతదేహన్ని సొంతూరుకు తీసుకెళ్తే ఎదరయ్యే వ్యతిరేకతకు భయపడే నలుగురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని మృతుల సమీప బంధువులు ఆదివారం తెలిపారు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అనారోగ్యంతో మృతి చెందగా భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ అంకుశాపూర్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యనారాయణ ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ డీఈగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. తల్లిదండ్రులు లద్నూరులోనే నివాసం ఉంటున్నారు. ఆరోగ్యం దెబ్బతినడంతో సత్యనారాయణను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా భువనగిరిలో మృతిచెందాడు. అయితే మృతదేహన్ని ఎక్కడికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలనే సమస్య కుటుంబసభ్యులకు ఎదురైంది. హన్మకొండలో అద్దె ఇంట్లో కర్మకాండలకు ఇంటివారు అనుమతించారు. మీరాకు తల్లిగారింటితోనూ సత్సంబంధాలు లేవు. చాలాకాలంగా సత్యనారాయణకు తల్లిదండ్రులకు రాకపోకలు లేవు. ఇన్నేళ్ల తరువాత మృతదేహాన్ని తీసుకెళ్తే ఇప్పుడు గుర్తొచ్చామా అంటారు. ఈ వ్యతిరేకతకు భయపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు. ధైర్యం చెప్పేవాళ్లం.. సత్యనారాయణకు ఇద్దరు సోదరులు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు. మీరాతో పాటు మరో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారి భర్తలు, పిల్లలు ఉన్నారు. వారిలో ఎవరికైన మృతి చెందిన సమాచారం అందించవచ్చు. వారు అలా చేయలేదు. సమాచారం ఇచ్చి ఉంటే తాము ధైర్యం చెప్పేవారమని బంధువులు అంటున్నారు. కుమిలిపోయి, మానసిక సంఘర్షణతో చావే పరిష్కారమని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహాలు కాకపోవడం కూడా ఆందోళనకు కారణమై ఉంటుందన్నారు. డీఈగా రెండు సంవత్సరాలే.. సత్యనారాయణ హౌసింగ్ బోర్డులో ఏఈగా వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పనిచేసి సస్పెండ్‌కు గురయ్యారు. చాలకాలం విరామం తరువాత డీఈగా ప్రమోషన్‌పై ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లారు. మద్యానికి బానిసై ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదు. అక్కడ రెండేళ్లే పనిచేసి మృతిచెందారు. కొత్తకారు సంబరం నాలుగు రోజులే.. కొత్తకారు తీసుకొని గత నెల 26న రిజిస్టర్ చేయించారు. నాలుగురోజులే అందులో తిరిగారు. మృతుని కుమారుడు శివరామకృష్ణ డ్రైవింగ్ చేసేవాడు. 29న తండ్రి మృతితో వారు సైతం రైల్వేట్రాక్‌పై తలలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. చివరిసారి నల్లగొండ జిల్లాలో భువనగిరిలోని హోటల్లో భోజనం చేస్తే , ఘట్కేసర్ మండలం అంకుశాపూర్‌లో తుదిశ్వాస వదిలారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు.. గతంలో మండలంలోని కొండాపూర్‌కు బతుకుదెరువు నిమిత్తం ఓ రాజస్థానీ కుటుంబం వచ్చింది. రూ.10లక్షలకు గ్రామస్తుడొకరు టోకరా ఇవ్వడంతో కుటుంబం మొత్తం రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడింది. అంతకు ముందు మైసమ్మగుట్టకు చెందిన కూలీ ఒకరు కూలీపనులు చేస్తూ జీవనం సాగించేవాడు. రూ.50వేలు అప్పు కావడంతో కుటుంబం మొత్తం ఇలాగే బలవన్మరణానికి పాల్పడింది. దానికంటే ముందు నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన ఓ యువతి తన చిన్నారి కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. -
నివురుగప్పిన నిప్పు!
దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు వ్యూహరచనలో పోలీసులు, మావోయిస్టులు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ నాలుగు రాష్ట్రాలను అనుకుని ఉన్న దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దండకారణ్య సరిహద్దు ప్రాంతాన్ని తమ షెల్టర్‌జోన్‌గా వినియోగించుకుంటూ, తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టులు.. నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే సరిహద్దులో మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వారోత్సవాలను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు, మావోయిస్టు చర్యలను నియంత్రించేందుకు పోలీసులు వారివారి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. వారోత్సవాల వేళ మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. – చింతూరు చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి, పేగ రహదారిలో మావోయిస్టులు ఇటీవల మందుపాతరలు అమర్చడం కలకలం రేపింది. కూంబింగ్ కోసం వచ్చే జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు నాలుగు సార్లు మందుపాతర్లను అమర్చారు. వీటిని ముందుగానే పసిగట్టిన పోలీసులు అప్రమత్తమై వాటిని నిర్వీర్యం చేయగా, రెండు మందుపాతరలు వాటంతటవే పేలిపోయాయి. దీంతో పోలీసులకు భారీనష్టం తప్పింది. ఇదే క్రమంలో వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ సరిహద్దుల్లోని తెలంగాణలో భద్రాచలం–చర్ల రహదారిపై మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. దీనికితోడు ఆంధ్రా సరిహద్దు సమీపంలో గంగరాజుపాడు వద్ద ఆంధ్రా–ఛత్తీస్‌గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈ నెల 21న చింతూరు మండలానికి చెందిన ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వినూత్న వ్యూహాల్లో మావోయిస్టులు దండకారణ్య పరిధిలో ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టులు కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్నారు. వారోత్సవాల సమయంలో దండకారణ్య ప్రాంతంలోని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి, రిక్రూట్మెంట్ చేపట్టడం ద్వారా కేడర్‌ను పెంచుకునే అవకాశాలు ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు ముమ్మరంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఎన్కౌంటర్లో లభ్యమైన డైరీ ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయి. శిక్షణలో భాగంగా గగనతల దాడులను ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిసింది. సైన్యంలో ఇచ్చే శిక్షణ మాదిరిగానే నిలింగ్, స్టాండింగ్, ప్రోన్ పొజీషన్లతో పాటు ఎల్ఎంజీ ద్వారా హెలికాఫ్టర్లపై దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు గగనతల దాడుల నుంచి క్యాంపులను కాపాడుకునేందుకు అండర్‌గ్రౌండ్ సొరంగాలు, అండర్‌గ్రౌండ్ నివాసాలు, కొండల నడుమ సొరంగాలు, గుహలు నిర్మించుకోవాలని అగ్రనేతలు సూచించినట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. తిప్పికొట్టేందుకు పోలీసుల వ్యూహం వారోత్సవాల సమయంలో మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడవచ్చని అనుమానిస్తున్న నాలుగు రాష్ట్రాల పోలీసులు.. వీటిని తిప్పికొట్టే వ్యూహంలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి, కూంబింగ్ ము మ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సంయు క్తంగా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీన ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ల పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరోవైపు కూంబింగ్ నిర్వహించే పోలీసులను లక్ష్యంగా చేసుకుని, సరిహద్దుల్లో మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానంతో డాగ్‌స్కా్వడ్, మెటల్ డిటెక్టర్లతో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వనాల్ని వీడండి.. జనాల్లో కలవండి.. చింతూరు: ‘అడవుల్లో అన్నలారా! లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవండి’ అని మావోయిస్టులకు హితవు పలుకుతూ చింతూరు పోలీసులు బుధవారం జరిగిన వారాంతపు సంతలో ర్యాలీ నిర్వహించారు. ‘ఆయుధాలు వద్దు.. ఏబీసీడీలు ముద్దు, బాణాలు వీడండి.. జనంలో కలవండి, ఆయుధాలు వద్దు.. అభివృద్ధి ముద్దు, అడవిలో అన్నలారా! లొంగిపోయి ప్రశాంత జీవితాలు గడపండి!’ అంటూ నినాదాలు చేశారు. నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్ పాల్గొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ప్రియురాలితో కలిసి భర్తే హత్య చేశాడని పుట్టింటి వారి ఆరోపణ ఆమె ఒంటిపై పలు రక్తపు గాయాలు పోలీసుల అదుపులో నిందితులు సీతానగరం : మండలంలోని బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావుపేటలో బొడ్డు దుర్గ (28) అనే వివాహిత అత్తవారింట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఒంటిపై రక్తపు గాయాలున్నాయి. దుర్గను భర్త బొడ్డు నరేష్, అతడి ప్రియురాలు మేరీ కలిపి హత్య చేశారని దుర్గ పుట్టింటి వారు ఆరోపించారు. కాగా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన నరేష్ కూలి పనులు చేస్తుంటాడు. కొన్నేళ్ల క్రితం అతడు పనుల కోసం కపిలేశ్వరపురం వెళ్లగా, అక్కడ పరిచయమైన దుర్గను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నరేష్ ఎస్సీ కాగా, దుర్గ బీసీ. బొబ్బిల్లంకలో నివాసం ఉంటున్న ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె మహిమాన్విత, అయిదేళ్ల కుమారుడు మణిదీప్ ఉన్నారు. న రేష్ ఇదే గ్రామానికి చెందిన మేరీ అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, వారిద్దరూ కలిసి దుర్గను హత్య చేశాడని కపిలేశ్వరపురం నుంచి వచ్చిన దుర్గ తల్లి మాతా వెంకయమ్మ, పెదనాన్న కొడుకులు లోవరాజు, శ్రావణకుమార్లు తెలిపారు. రెండు నెలల క్రితం దుర్గ చేతిని ఆమె భర్త నరేష్ విరగ్గొట్టగా, సిమెంట్ కట్టు కట్టించుకుందని చెప్పారు. సోమవారం రాత్రి నరేష్, తన ప్రియురాలు మేరీతో కలిసి దుర్గను వారి ఇంట్లోనే హత్య చేసి Ðð ళ్లిపోయి, ఉరిపోసుకున్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. స్థానికుల కథనం.. నరేష్ కొంతకాలంగా మేరీతో వివాహేతర సంబంధం సాగిస్తున నేపథ్యంలో నరేష్, దుర్గ దంపతులు తరచూ గొడవపడేవారిని బొబ్బిల్లంక వాసులు తెలిపారు. సోమవారం రాత్రి భర్త తన ప్రియరాలి ఇంటివద్ద ఉండటంతో దుర్గ వెళ్లి వేసి తలుపులు కొడుతూ భర్త నరేష్‌ను బయటకు రావాలని పిలిచిందని చెప్పారు. నరేష్ బయటకు రాకపోవడంతో ఆమె తిరిగి తన ఇంటికి వెళ్లిపోయిందని చెప్పారు. రాత్రి 11.30 గంటల సమయంలో ప్రియురాలితో కలిసి నరేష్ తన ఇంటికి వచ్చి భార్యను హత్య చేసి, ఇంటి వెనుక ఉన్న ద్వారం నుంచి తిరిగి ప్రియురాలి ఇంటికి Ðð ళ్లిపోయాడని స్థానికులు వివరించారు. మృతురాలి కుమారుడు మణిదీప్ కేకలు వేయడంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చానని మృతురాలి మావయ్య సోమయ్య తెలిపాడు. మృతురాలు దుర్గ మెడపై చేతిగోళ్ల గాయాలున్నాయి. గొంతుకలో గుచ్చుకున్న గాయాల నుంచి రక్తం బయటకు వచ్చి ఆమె ధరించిన నైటీ తడిసిపోయి ఉంది. ముక్కు నుంచి రక్తం కారింది. నోటి నుంచి నురగా బయటకు వచ్చింది. ఆమె మెడపై ఉరి వేసుకున్న ఆన వాళ్లు మాత్రం లేవు. నరేష్, అతడి ప్రియురాలు మేరీలను సీతానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. -
వరదల్లో లక్షల మంది
గువాహటి: ఎడతెరిపి లేకుండా ఉత్తరాదిన కురుస్తున్న వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలు అసోంను ముంచెత్తుతున్నాయి. దాదాపు 1.75లక్షల మంది ప్రజలు ఈ వరదల భారిన పడ్డారు. మొత్తం ఆరు జిల్లాల్లో ఈ వరద ప్రవాహం ఉందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం లఖీంపూర్, గోలఘాట్, మోరిగావ్, జోరట్, ధెమాజి, బిస్వాంత్ జిల్లాల్లోని 244 గ్రామాలు వరద ముంపులో పడ్డాయని చెప్పారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థితిని దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అధికారులు పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటుచేసి సేవలు అందిస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, రైళ్ళ పునరుద్ధరణ
ఎట్టకేలకు జాట్ల ఆందోళన ముగిసింది. హరియాణాలో వాతావరణం చల్లబడింది. రిజర్వేషన్లకోసం జాట్లు చేపట్టిన ఆందోళనలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్బంధం తొలగింది. నాలుగు రోజులపాటు నిర్బంధంలో ఉన్న ఢిల్లీ అంబాలా నేషనల్ హైవే ను మంగళవారం సాయంత్రంనుంచీ తెరిచారు. నిరసనకారులు ఆందోళన విరమించడంతో రైలు రోడ్డు మార్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ కు అంతరాయం తొలగినట్లు అధికారులు వెల్లడించారు. అంబాల ఢిల్లీ మార్గాల్లో రైల్వే ట్రాక్ ల తనిఖీలు, మరమ్మత్తులు నిర్వహించామని రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ అంబాల ఛండీగర్ మార్గాల్లో రైలు సర్వీసులను బుధవారం సాయంత్రంనుంచీ యధావిధిగా పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆందోళనలో దెబ్బతిన్న ట్రాక్ లపై అడ్డంకులు తొలగించి, మరమ్మత్తులు నిర్వహించామని చెప్పారు. ఢిల్లీనుంచి మొదలయ్యే అన్ని మార్గాల్లో భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టామని రైల్వే అధికారులు చెప్తున్నారు. హిసార్ నుంచి ఢిల్లీ సహా భివాని, రెవారి, జైపూర్, సదుల్ పూర్, గంగానగర్లకు రైళ్ళను పునరుద్ధరిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే హిసార్ నుంచి చండీగర్, ఢిల్లీ, రోటాక్ లకు బస్ సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు హర్యానా రోడ్ వేస్ హిసార్ జనరల్ మేనేజర్ రామ్ కుమార్ తెలిపారు. బుధవారం నుంచి హరియాణాలో పూర్తిశాతం కర్ఫ్యూ ను ఎత్తివేశారు. రోటాక్ నరంలో పరిస్థితి ప్రశాతంగా మారింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా మంగళవారం సాయంత్రం రోటాక్ లో పర్యటించి స్థానికుల సమస్యలను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు, షాప్ కీపర్లకు జరిగిన భారీ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై నగరంలో నివాసాలపై ఎక్కడైనా నల్లజెండాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలంటూ ఫిబ్రవరి 14న హరియాణాలో మొదలైన జాట్ల ఆందోళన తీవ్ర స్థాయికి చేరి సుమారు 200 మందిదాకా గాయపడగా... 19 మంది ప్రాణాలను కూడ పోగొట్టుకున్నారు. ఆందోళనలపై స్పందించిన కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ.. లిఖిత పూర్వక హామీని కోరుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. చివరికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటికి నాయకత్వం వహిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం హరియాణా ముఖ్యమంత్రి ఖత్తర్ సహా ఇద్దరు హౌస్ సభ్యులను పిలిపించి చర్చలు జరిపిన అనంతరం హరియాణాలో పూర్తిశాతం అల్లర్లు చల్లబడి, వాతావరణం సాధారణ స్థాయికి చేరింది. -
పాటియాల కోర్టుకు సుప్రీంకోర్టు లాయర్ల టీం!
న్యూఢిల్లీ: పాటియాలా హౌస్ కోర్టులో జేఎన్‌యూ విద్యార్థులపై నమోదైన దేశద్రోహం కేసు విచారణ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణను పరిశీలనకు ఆరుగురు సీనియర్ సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పాటియాల హౌజ్ కోర్టులో కేసు విచారణకు అనువైన పరిస్థితులు లేవని, విచారణ జరుగుతున్న కోర్టు రూం బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో విచారణకు హాజరైన వారిలో భయాందోళన నెలకొన్నదని సీనియర్ కౌన్సిల్ ఇంద్రా జైసింగ్ కోర్టుకు తెలిపారు. విచారణ ప్రాంగణంలో ఓ జర్నలిస్టుపై చేయి చేసుకున్న విషయం మీడియాలో ప్రసారమైన విషయాన్ని మరో సీనియర్ కౌన్సిల్ ప్రశాంత్ భూషణ్ కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించడానికి సీనియర్ లాయర్ల బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. ఈ బృందంలో కపిల్ సిబాల్, రాజీవ్ దావన్, దుశ్యంత్ దేవ్, అజిత్ సిన్హా, ఏజీఎన్ రావు, హరిన్ రావల్ ఉన్నారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే విచారణ జరిగే ప్రదేశాన్ని మార్చనున్నట్లు కోర్టు తెలిపింది. -
కేజీ చదువే పునాది
మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని గౌరవిస్తేనే వాళ్లు వింటారు. భాష ఎదుటివారిని నొప్పించకూడదు. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయు ల ప్రవర్తనతో వస్తుంది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే పిల్లల్లో రావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత దీర్ఘాలోచ నలు చేసి, చర్చలు జరిపి విద్యా పాలసీని ప్రకటిం చడం జరిగింది. ఆ పాలసీని పకడ్బందీగా అమలుపర్చడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీలో పాల్గొనే అవకాశం నాకు దొరి కింది. ఈ రకమైన ఎడ్యుకేషన్ పాలసీ.. కేజీ టూ పీజీ అన్న విధానం విద్యారంగంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ లేదు. ఇది అందరూ ఆహ్వానించాల్సింది. కేజీ విద్య పేరుతో ప్రైవేటు సంస్థలు భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఇక నుంచి కేజీ విద్యను చేపట్టబో తుందని ప్రకటించడంతో విద్యారంగ కార్యకర్తగా నేను ఎంతో సంతోషపడ్డాను. ఈనాడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేకాదు అది సమాజం బాధ్యత అని గుర్తించినందులకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వాన్ని అభినందించాల్సిందే. సాంకేతికరంగంలో వచ్చిన మార్పుల వల్ల సమష్టి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 నుంచి 6 సంవత్సరాల మధ్యన శిశువులో ఏర్పడిన మానసిక, శారీరక మార్పులను ఆధారం చేసుకుని సుస్థిరమైన సమాజ నిర్మాణానికి విద్యారంగం ప్రాధాన్యతలను నిర్ణయించడంలో కేజీ చదువు పాత్ర ఎంతో ఉంది. విదేశాలలో ఇందుకు సంబంధించి ఏ విధమై నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలు సుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటీవల అమెరికా వెళ్లాను. చాలా మంది విద్యావేత్తలతో కలిసి మాట్లాడాను. ముఖ్యంగా చికాగో నగరంలో ఒక సంస్థ ఏర్ప డింది. ఇందుకోసం ఏకంగా ‘అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఏ సస్టైనబుల్ సొసైటీ’ అనేది ఏర్పడింది. ఆ సంస్థ నిర్వాహకులతో మాట్లాడాను. వారి పనితీరును నిశితంగా పరిశీలించాను. సాంకేతికమైన మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగానే విద్యారంగంలో తీవ్రమైన కదలికలు రావటం జరిగింది. దీంతో అందరికీ చదువు అనే భావన కూడా కలిగింది. చదువు వల్ల ఆధిక్యత వస్తున్నది కాబట్టి ఆ చదువును అందరికీ అందిం చగలిగితే కొన్ని వర్గాల్లో విముక్తి కలుగుతుంది. మొత్తం సమాజ పరివర్తన జరుగుతుంది. సామాజిక పరిణామాల నుంచి చదువును విడదీయలేరు. 21వ శతాబ్దంలో సమాచార రంగంలో వచ్చిన మార్పులు చిన్నవి కావు. దీనివల్ల ఉద్యోగభృతి అవకాశాలు పెరగటమే గాకుండా ఆర్థిక వ్యవస్థకు విద్య ఒక ప్రధాన అంగంగా మారింది. ఈనాడు అక్షరం కన్నా భావన చాలా ప్రధానం. ఆ ఆలోచ నలు బాల్యంలో ఉత్పత్తి అయ్యేది ఇంద్రియాల చైతన్యం వలననే. శిశువు దేహంలో ప్రధానమైన మార్పు ఇంద్రి యాల వల్లనే ఏర్పడుతూ వచ్చింది. శిశువు తనంత తానుగా ఆలోచించడు. ఇంద్రియాల ప్రేరణే శిశువు ఆలోచనలకు మూలం. దానినే ‘బుద్ధి’ అంటారు. ఇంద్రియాలు ఈ బుద్ధికి పునాది. 3 నుంచి 6 ఏళ్ల మధ్యన ఇంద్రియాలకిచ్చే శిక్షణే బిడ్డల ఆలోచనలకు పునాది. అదే అనంతర జీవితంలో కూడా శిశువు అవగాహనపై ప్రభావం వేస్తూ ఉంటుంది. ఆలోచనా విధానాన్ని నియమబద్ధంగా ఉంచా లన్నా, సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్చాలన్నా, వ్యక్తిగత అవసరాలకు మార్చా లన్నా శిశువుకు ఈ దశే చాలా ప్రధానం. ఈ దశలో విద్యార్థిని ఎంత జాగ్రత్తగా, బాధ్యతా యుతంగా మనం తీర్చిదిద్దగలిగితే అదే స్థాయిలో ఉత్తమమైన పౌరుడుగా ఉత్తమ పౌరురాలుగా వారు రూపొందుతారు. కానీ శిశువులో ఏ అవగాహన కలిగించదలు చుకున్నా తల్లికి ఉండే లక్షణాలు ఆ ఉపాధ్యాయు నికి ఉంటేనే ఆ లక్ష్యసాధన జరుగుతుంది. ఆర్థిక రంగంలో వచ్చిన మార్పుల వలన శిశువుపై నేటి కాలంలో ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అది జరగకపోతే శిశువు పెరిగాక పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. తల్లీ తండ్రీ చేయవలసిన పనిని సమాజమే చేయవలసిన బాధ్యత ఏర్పడింది. కాబట్టి ఒక పౌర సమాజం కోసమై వ్యవస్థ ఏర్పడింది. ఇది కొందరికే కాదు అందరికీ అన్నది ‘అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఎ సస్టైనబుల్ సొసైటీ’ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అయితే ఈ పని మాత్రం ఆచరణలో అంత సులభమైనది కాదు. తల్లి మాదిరిగా శిశువుతో సాన్నిహిత్యం పెంచుకునే వ్యక్తి ఒక ఎడ్యుకేటర్ కావాలి. కుటుంబంలో తల్లి చేసే పని పవిత్రమై నది. శిశువుకు శారీరక అవసరాలుంటాయి. ఎదిగే పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఇవ్వటం జరగాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ప్రేమను కూడా కలిపి తినిపిస్తే అది పిల్లలకు శక్తినిస్తుంది. శిశువు ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వటానికి వన రులు కూడా ఎంతో అవసరం. శిశువు రంగులను గుర్తించటం, రంగులలో తేడాలను గుర్తించటం. అవసరం ఉపాధ్యాయుడు పిల్లల భాషలో మాట్లాడాలి. ఉపాధ్యాయుని దగ్గరకు శిశువు తల్లి దగ్గరకు వచ్చినట్లుగా పరుగెత్తుకు రావాలి. ఇందుకు ఎలాంటి భాష కావాలో ఆలోచించాలి. ఆ శిశువు కల్చర్ తెలియాలి. అమెరికాలో ఉన్న ఆఫ్రో అమెరికన్ శిశువు లకు శిక్షణనిచ్చేందుకు అక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సామాజిక సుస్థిరత కోసం ఆ శోధనలు జరుగుతున్నాయి. కేజీ చదువు వెనుక ఇంత పెద్ద పరిశ్రమ ఉన్నది. మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని గౌరవిస్తేనే వాళ్లు వింటారు. భాష ఎదుటివారిని నొప్పించకూడదు. ఆప్యా యంగా ఆదరించే విధంగా ఉండాలి. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయుల ప్రవర్తనతో వస్తుంది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే పిల్లల్లో అవగాహన రావాలి. కేజీ స్కూలుకు అక్షరం కాదు పౌర సమాజ నిర్మాణానికి కావాల్సిన పునాది. అమెరికాలో ఆ కేజీ స్కూల్‌కు పోతే నేనూ చంటి బిడ్డనయ్యాను. (వ్యాసకర్త: చుక్కారామయ్య ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
ఆ బడుల్లోనే మీ పిల్లలూ..
మీ డ్రైవర్, మీ పని మనిషి పిల్లలు చదువుతున్న పాఠశాలకే మీ పిల్లలను కూడా పంపవలసిందని అధికారులకు హైకోర్టు చెప్పింది. కాబట్టి ప్రభుత్వ బడుల్లోని పిల్లల ఇబ్బందులను, కష్టాలను ఎలా తగ్గించాలి అని ఆలోచించండి. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజా నా నుంచి వేతనాలు తీసుకునే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ పిల్లల ను ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలల్లో మాత్రమే చేర్పించాలం టూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అది గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. నిత్యం తాము యథావిధిగా వండి వార్చే పిండివంటనే విధాన నిర్ణేతలు, వాటిని అమలు చేసేవారు రుచి చూడాలని ఉన్నత న్యాయస్థానం కోరుకుంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాదరక్షలను ధరించండి, అవి ఎంత ఇరుగ్గా ఉన్నాయో చూడండి. అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయ మూర్తి సుధీర్ అగర్వాల్ ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉన్నతాధికారులు తాము స్వయంగా నిర్దేశించిన కార్య క్రమాలలో ఎవరి జోక్యాన్ని ఇష్టపడరు. ఇతరులు బాధితు లుగా ఉంటున్నంత కాలం.. తాము చేస్తూ వచ్చినదంతా ఉత్తమమైనదేనని వీరి ప్రగాఢ విశ్వాసం. కోర్టు ఆదేశాలకు భిన్నంగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. ఇలా పోగుపడిన నిధితో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుప ర్చవచ్చు. చెడు వ్యవస్థను ఇన్నాళ్లుగా అందిస్తూ వచ్చిన వారిని దాని దుష్ఫలితాలను తాము కూడా అనుభవించడం తప్పనిసరి చేసే సమానత్వ పాఠశాలలకు స్వాగతం పలక వలసిందే కానీ, హైకోర్టు ఆదేశం వివిధ వర్గాల పిల్లలను పరస్పరం మిళితం చేయవచ్చన్న దృష్టికోణానికి అంతగా ప్రాధాన్యత లేకపోవచ్చు. ప్రజాతంత్ర రిపబ్లిక్లో ఉంటు న్నప్పటికీ, మనది ఆర్ధిక, కుల, ఉప కుల ఆలోచనలతో వేరుపడిపోయిన సమాజం. పైగా దీన్ని ప్రభుత్వాలు, రాజకీయ నేతలూ వివిధ మార్గాల్లో పెంచి పోషిస్తూ వస్తు న్నాయి. అయితే అపసవ్య ధోరణితో నడుస్తున్న పాఠశాల వ్యవస్థ కారణంగా శాశ్వతంగా నష్టపోతున్న నిరుపేదలపై పడుతున్న ఒత్తిడి, వారెదుర్కొంటున్న అణచివేతే ఇంకా ఘోరమైనది. సమాజం దీన్ని ఇంకెంతకాలమో భరించాలనుకో వట్లేదు. ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనబ డుతున్నాయి. కేరళలోని మల్లపురంలో 11వ తరగతి విద్యార్థి 17 ఏళ్ల షహల్ కె. తను చదువుకుంటున్న పాఠశా లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా కోరుతూ 3 రోజుల నిరాహారదీక్షకు పూనుకున్నాడు. దీంతో జిల్లా కలెక్టర్ దిగొచ్చి హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి ఇతర ఉదాహరణలు కూడా వార్తలకెక్కుతున్నాయి. నది దాటి పాఠశాలకు వెళ్లేందుకు తమ తలలపై యూనిఫాంను పెట్టుకుని ఈదులాడుతూ వెళుతున్న పిల్లలు, తమ నాప్కి న్లను మార్చుకోవడానికి తగిన గోప్యత లేమితో పాఠశా లకు వె ళ్లడం మానేస్తున్న యుక్తవయస్సులోకి వచ్చిన బాలికలు.. వంటివి వీటిలో కొన్ని. మన దేశంలో పేదలు తమ స్థితిగతులను మెరుగు పర్చుకోవాలనీ, తమ జీవన అవకాశాలను పెంచుకోవా లనీ కోరుకుంటున్నట్లు ఇలాంటి సందర్భాలు తెలుపుతు న్నాయి కానీ వ్యవస్థ వారిని రెండో తరగతి పౌరులుగా చూస్తోంది. మానవాభివృద్ధి సాధన స్థాయిలను నిర్ణయిం చే మూడు ప్రధాన అంశాలలో విద్య లేదా విజ్ఞానం ఒకటి. ఆరోగ్యం, ఆదాయం అనేవి ఇతర రెండు అంశాలు. భారత్‌లో మానవాభివృద్ధి సూచిక ఎంత పేలవంగా ఉం టోందో దీన్ని బట్టి తెలుస్తుంది. సరికొత్త ధోరణిలో వ్యవస్థ పనిచేయాలని, ఫలితాలను అందించాలని కోర డం ద్వారా ప్రజల స్థితిగతులను మెరుగుపర్చవలసిందిగా మనం పట్టు బిగిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఇది పత్రికల్లో పతాక శీర్షిక అయ్యేలా మలుస్తుంది. తమ శ్రేయస్సుకు హామీ లభించినంత కాలం పేదలను సర్వనాశనం చేసే విధానాలను అమలు చేసుకుంటూపోవడానికి వెనుకాడని ఉన్నత వర్గాల ఆలోచనా సరళిపైనే దాడి చేస్తున్నట్లుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు కనిపిస్తోంది. ఉన్నత వర్గాల వైఖరి ఇలా లేనట్లయితే, గోధుమ, బియ్యం బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయే రేషన్ షాపులు మీకు ఉండేవి కావు. ఉపాధి హామీ పథకం కింది రోజు కూలీ మొత్తాన్ని ఇవ్వడంలో జాప్యం చేయటం లేదా దాన్ని పూర్తిగా మింగేయడమో కూడా జరిగేది కాదు. ఇది నిజంగానే ఒక పశుప్రాయమైన, మతిహీనమైన వ్యవస్థ. దీన్ని తుత్తునియలు చేయడానికి న్యాయమూర్తి ఒక మార్గా న్ని కనుగొన్నారు. ఈ ఉన్నతవర్గమే ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలను ఏర్పర్చడం, నిర్వహించడం తలనొప్పి వ్యవహారమన్న భావనకు వచ్చేసింది. వీటి ప్రమాణాలను కొనసాగించవలసి వస్తుందని కాదు.. పాఠశాలల ఇన్స్పెక్టరే ఉపద్రవమట. ఈ దేశాన్ని లాభాలు పోగు చేసుకునే విద్యా సంస్థలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ వంటి వాటితో కూడిన కొత్త వర్గంతో వీరు నింపేశారు. రాజకీయనేతలే ఎక్కువగా ప్రైవేట్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పర్చారు. పలు విశ్వవిద్యాలయాలే వీరి స్వాధీనంలో ఉన్నాయి. అంగట్లో సబ్బు లేదా శీతల పానీ యాలను అమ్ముతున్నట్లుగా వీటిని టెలివిజన్ యాడ్లతో ప్రోత్సహిస్తున్నారు. ఉన్నత వర్గాలు చేజిక్కించుకున్న ఈ సౌకర్యానికి మంగళం పలకాలని, సగటు మనిషితో కలసి ఉండ మని ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ విద్యను అందించే విద్యా హక్కుకు ఆడంబ రంగా చట్ట రూపం ఇవ్వడంలో ఉన్న సాపేక్షిక వెసులు బాటును కూడా మన ముందు ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ దాన్ని అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క టంటే ఒక్క శ్రేష్టమైన సందర్భం కూడా మనం చూడ లేదు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల ప్రతిఘటన, వాటిని కొన సాగించడంలో ప్రదర్శించే ఉపేక్ష సర్వసాధారణమై పోయాయి. పేదలు, సంప న్నులు ఎప్పటికీ ఒక వరలో ఇమడలేరు. అది అంతటి ప్రమాదమన్నమాట. గణాంకాల్లో ఒక భాగంగా మా త్రమే పేదలకు గుర్తింపు ఉన్నట్లు కనిపిస్తోంది. వారు మనుషులు కాదన్నమాట. ఒక సేవను మీకు అందిస్తామంటూ వాగ్దానం చేయ డం వంటి శాసనాల తయారీ ద్వారానే తమది సుపరి పాలన అనిపించుకోదని అర్థం చేసుకోవలసి ఉంది. సరైన విధంగా గుర్తించిన లక్షిత వర్గాలకు సేవలందించే సమ ర్థత ద్వారానే దాన్ని లెక్కించాలి. మనదగ్గర లేనిదల్లా ఇదే. ఉద్దేశించిన ఫలితాలతో పనిలేకుండా, పెట్టిన వ్యయం తోనే ఉద్దేశాలను నిర్ణయిస్తున్నారు. ఇన్నాళ్ల అస్తవ్యస్త పాలన ఫలితమే పేదలు. మీ డ్రైవర్, మీ పని మనిషి పిల్లలు చదువుతున్న పాఠశాలకే మీ పిల్లలను కూడా పంపవలసిందని ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు చెప్పింది. కాబట్టి వారి చెప్పులను మీరు ధరించండి, ఇబ్బందులను, కష్టాలను ఎలా తగ్గించాలి అని ఆలోచించండి. (వ్యాసకర్త: మహేశ్ విజా పుర్కార్, సీనియర్ పాత్రికేయులు) -
అక్షరంతోనే 'పునాది'
తెలంగాణ స్వరాష్ట్రాన్ని సా ధించుకుని ఏడాది గడిచిపో యింది. అరవయ్యేళ్ల పోరా టంతో సాధించుకున్న స్వరా ష్ట్రంలో ఎక్కడివక్కడ సర్దుకో వడంలోనే ఈ ఏడాది కాలం గడిచిపోయింది. ఇక మనకు నచ్చినట్లుగా మన ఇంటిని తీర్చిదిద్దుకునే పని మొదలె ట్టాల్సి ఉంది. ఇలా తీర్చిదిద్దుకోవడంలో పుస్తకం పాత్ర కీలకం. తెలంగాణ పాటకు, ఆటకు, పోరాటానికి అక్షర రూపం ఇచ్చి తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో అక్షరం పోషించిన పాత్ర అనిర్వచనీయం. కవులు కవిత్వంతో, ఉద్యమకారులు రచనలతో ప్రజ లకు అక్షరాయుధాలను అందించారు. తెలంగాణ పున ర్నిర్మాణంలోనూ ఇలాంటి మహత్తర పాత్రను అక్షరం పోషించాలి. తెలంగాణ సాయుధ పోరాటం, ఆంధ్ర మహాస భలు, గోలకొండ పత్రిక.. ఇలా ఎన్నెన్నో మైలురాళ్ల తర్వాత అంతిమంగా స్వరాష్ట్రం వచ్చింది. దీన్ని అభి వృద్ధి చేసుకోవలసిన బాధ్యత ఏ ఒక్కరిపైనో లేదు. ప్రభుత్వం ఒక్కటి మాత్రమే ఈ పని చేయలేదు. ప్రభు త్వం తాను చేయగలిగిన పనులు తాను చేస్తూంటే, మరోవైపున తెలంగాణ సమాజం తాను చేయగలిగిన పనులు తాను చేయాలి. తెలంగాణ పోరాట సమయం లో సొంత జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టినట్లే, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ కనీసం ఓ పదేళ్లపాటు ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. కానీ వలసపాలనలోని విద్యావిధానం దుష్ఫలితా ల కారణంగా తెలంగాణలో ప్రస్తుతం తల్లి కడుపులో ఉన్నప్పుడే అడ్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. గుర్రాన్ని గంతలు కట్టి నడిపినట్లు పిల్లలను చిన్నప్ప టినుంచే ఎంట్రన్స్‌ల బాటలో నడిపిస్తున్నారు. చదు వంతా నిత్యం పరీక్షల చుట్టే తిరుగుతోంది. ఫ్యాక్టరీలు గా మారిన విద్యాసంస్థల్లో విషయం అర్థం చేయించ కుండా బట్టీ పెట్టిస్తున్నారు. పిల్లలకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. పల్లీలు ఎక్కడ కాస్తాయో తెలీదు. చెట్లెక్కడం రాదు. పల్లె తెలియదు. మట్టివాసన తెలియదు. ఈ పరిస్థితి మారాలి. ముఖ్యంగా బట్టీ చదువులను వదిలించుకోవాలి.బట్టీ పట్టి పరీక్షలు పాస్ అయినవారు సమాజాన్ని మార్చలేరు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న వారిని అందించేందుకు మనం కృషి చేయాలి. ప్రధానంగా తెలంగాణ భావజాలాన్ని సర్వవ్యాప్తం చేయాలి. తెలంగాణ భావజాలం: తెలంగాణ భావజాలం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అది యావత్ తెలంగాణ ప్రజానీ కం సొత్తు. ఈ నేలపై పుట్టిన ప్రతీఒక్క పార్టీ, ప్రతీ ఒక్క ప్రజాసంఘం, ప్రతీ ఒక్క సామాజిక సంఘం తెలంగా ణ భావజాలాన్ని ఉపయోగించుకునే వీలుంది. ఈ క్రమంలో వాటికి తోడుండేది అక్షరమే. ఆ అక్షరా లను తెలంగాణ నుడికారంతో, మమకారంతో మేళవిం చడమే మనమిప్పుడు చేయాల్సిన పని. తెలంగాణ పున ర్నిర్మాణం అంటే ఆయా రంగాల్లో కంటికి కనిపించే అభి వృద్ధి మాత్రమే కాదు. అంతకు మించిన స్థాయిలో కం టికి కనిపించకుండా ఉండే భావజాల వ్యాప్తి కూడా. తెలంగాణలో జరిగే ప్రతిపనిలో ఇది కానరావాలి. పాఠ్య పుస్తకాలు, పాఠ్యేతర పుస్తకాల విషయంలోనూ తెలం గాణ ఆత్మ దర్శనమివ్వాలి. పుస్తకం తెరిస్తే తెలంగాణ ఆత్మ సంభాషిస్తున్నట్లు ఉండాలి. అక్షరాలను తెలంగాణ భావజాలం ఆవహించడం అంటే మితిమీరిన జాతీయ వాద ప్రచారం కాదు. ఇప్పటివరకు పరాయీకరణ చెం దిన వివిధ అంశాలను తెలంగాణ మయం చేయడమే. పరాయీకరణం: అరవై ఏళ్ల పరాయి పాలనలో మన భాష పరాయీకరణ చెందింది. మన రాజకీయం, సంస్కృతి సమస్తమూ పరాయీకరణకు గురయ్యాయి. ఇప్పటికీ ఇది తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు కృషి చేస్తూనే ఉంది. ఈ ఆధిపత్యాన్ని ఎదిరించాలంటే బహు ముఖ దాడి తప్పదు. అది అక్షరాలతోనే సాధ్యం. పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే కేజీ నుంచి పీజీ దాకా ఈ 60 ఏళ్ల పరాయిపాలనలో కొనసాగిందంతా రెండున్నర జిల్లాల భాషనే. దాన్ని పదిజిల్లాల తెలంగాణ భాషగా మార్పు చేసుకోవాల్సిన అవసరముంది. పరాయి పాల కులు మన చరిత్రను వెలుగులోకి రానీయకపోవడమే కాకుండా మనం మాట్లాడుకునే భాషను కూడా యాస గా మాత్రమే పరిమితం చేశారు. దాన్ని ఇప్పుడు ఒక సంపూర్ణ సర్వస్వతంత్ర భాషగా తీర్చిదిద్దుకోవాలి. తెగిన పేగుబంధం: తెలంగాణలో ఒక మూడుత రాల చరిత్రను చూస్తే తాత తెలంగాణ భాష మాట్లాడే వాడు. ఇతరులు తెలంగాణ భాషలో మాట్లాడితే అర్థం చేసుకోగలిగాడు. తండ్రి కాలానికి వస్తే తాను స్వయం గా తెలంగాణ భాష మాట్లాడలేనప్పటికీ, ఇతరులు మాట్లాడితే అర్థం చేసుకోగలిగాడు. మనవడి కాలానికి వస్తే తాను తెలంగాణ భాష మాట్లాడలేడు. అర్థం చేసు కోలేడు. మూడు తరాల చరిత్రలో తెలంగాణలో ఇలాం టి కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. పురిటి గడ్డతో పేగుబంధం తెగిపోతోంది. సొంతతల్లిపై మమ కారం లేని వారు అన్నింటా విలువలకు తిలోదకాలు ఇస్తుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకూడదనుకుంటే, మనబిడ్డలను ఈ నేలతల్లి బిడ్డలుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. అందుకు పాఠ్యపుస్తకాలు వేదికలు కావాలి. భాష, సామాన్యశాస్త్రం సాంఘికశాస్త్రం, గణి తం ఇలా బోధించే అంశం ఏైదైనా సరే అందులో తెలంగాణతనం ఉట్టిపడాలి. ఆంగ్ల, తెలుగు మాధ్య మాలు రెండింట్లోనూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి లాంటి వాటి గురించి వివరించాలి. ఇదంతా కూడా తెలంగాణ ఆత్మ తనను తాను పునర్నిర్మించుకోవడమే. పుస్తకాలకు పట్టం: ఈ సుదీర్ఘ ప్రక్రియ విజయవం తం కావాలంటే పాఠ్యపుస్తకాలు మాత్రమే కాకుండా ఇంకా చదువదగ్గ పుస్తకాలను అనుబంధంగా జాబితా రూపంలో ఇచ్చి వాటిని విద్యార్థుల చేత చదివించాలి. స్కూల్లో ప్రస్తుతం పుస్తకం చదవలేని పరిస్థితులున్నా యి. పుస్తక ప్రదర్శనలు ప్రోత్సహించాలి. వాటిలో మన పుస్తకాలకు పట్టం కట్టాలి. మన భాషలో రచనలు రావా లి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటకం వంటి అం శాలపై పాపులర్ రచనలను పెద్ద ఎత్తున తీసుకురా వాలి. తెలంగాణ పునర్నిర్మాణం లక్ష్యంగా ఒక మహో జ్వల రచన, పఠన ఉద్యమాన్ని నిర్మించాలి. పుస్తకాలు చదివే అలవాటుకు బాల్యంలోనే బీజం వేయకుంటే ఎన్నిరకాలుగా కృషి చేసినా ఫలితం రాదు. తెలంగాణ తెచ్చుకున్నాం. దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో ముందుతరం వాళ్లకు ఈ పుస్తక పఠనం ద్వారానే తెలి యజేయగలం. దీన్ని సామాజిక బాధ్యతగా తీసు కోవాలి. (వ్యాసకర్త: ఎం వేదకుమార్ చైర్మన్, తెలంగాణ రిసోర్స్ సెంటర్) మొబైల్: 9848044713 -
అమ్మో.. ఒకటో తారీఖు!
(న్యూస్‌లైన్, శ్రీకాకుళం ఫీచర్స్, కలెక్టరేట్) :ప్రభుత్వోద్యోగులకు ఈ నెల జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండటం, ఖజానా శాఖ ఉద్యోగులెవరూ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ‘సెప్టెంబర్ ఒకటో తారీఖు’ ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడానికి సిద్ధమైపోతోంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోలు గత 13 రోజులుగా సమ్మెలో ఉన్న విషయం విదితమే. గెజిటెడ్, జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం నుంచి సమ్మె చేస్తున్నారు. గురువారం వరకు విధులు నిర్వహిం చిన వీరికి కూడా జీతా లు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొం టామని ఎన్జీఓలు ప్రకటించి మరీ సమ్మెకు దిగారు. ఈ స్ఫూర్తిని ప్రదర్శించడంలో కొందరు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తొలుత వెనుకంజ వేశారు. ఇప్పటికీ కొంతమంది టీచర్లు సమ్మెకు దూరం గా ఉన్నారు. వీరంతాజీతాలపై ఆశలు పెట్టుకున్నారనేది కాదనలేని సత్యం. సెప్టెంబర్ రెండోవారంలో వచ్చే వినాయక చవితి పండుగకు ఆర్థిక విఘ్నాలు తప్పకపోవచ్చని ఓ నాలుగో తరగతి ఉద్యోగి ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో దాదాపు 23 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 13 సబ్ ట్రెజరీల ద్వారా వీరికి జీతభత్యాల పంపిణీ జరుగుతూ ఉంటుంది. సబ్ ట్రెజరీల్లోని నాన్ గెజిటెడ్ అధికారులంతా సమ్మెలోనే ఉన్నారు. వీరితోపాటు సబ్ ట్రెజరీ అధికారులు(ఎస్టీవోలు), సహాయ ట్రెజరీ అధికారులు(ఏటీవోలు) కూడా విధులకు హాజరు కావడం లేదు. వీరంతా సమ్మెలో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. ‘మేం రోజూ కార్యాలయాలకు వెళుతున్నాం. తాళాలు వేసి ఉండటంతో హాజరుపట్టీలో సంతకాలు పెట్టే అవకాశం ఉండటం లేదు. అందుకే సమ్మెలో ఉన్నామో, లేదో చెప్పలేం’ అని ఓ సహాయ ట్రెజరీ అధికారి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ‘సిబ్బంది విధుల్లో లేకపోవడంతో ఈ నెల జీతాలు ఇవ్వలేం’ అని ఆయన అన్నారు. పోలీసులకు ఊరట.. శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసు సిబ్బందికి మాత్రమే ఈ నెల జీతాలు అందనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై ఖజానాశాఖ డిప్యూటీ డెరైక్టర్ సదానందరావు ‘న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ సమ్మెలో ఉండటంతో ఈ నెల జీతభత్యాలు అందే పరిస్థితి లేదని వెల్లడించారు. పోలీసు శాఖకు మాత్రం మినహాయింపు ఉండవచ్చని, వాళ్లకు జీతాలు అందే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు. ఉద్యమం ఆగదు.. ఈ నెల జీతభత్యాలు అందకపోయినా, ఉద్యమం ఆగదని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. ఏజేసీతోపాటు అన్నిశాఖల జిల్లా అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.