సామ్రాజ్య భారతి: 1918,1919/1947 ఘట్టాలు | Azadi Ka Amrit Mahotsav Historical Incidents And Situations | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి: 1918,1919/1947 ఘట్టాలు

Published Mon, Aug 1 2022 6:17 PM | Last Updated on Mon, Aug 1 2022 6:20 PM

Azadi Ka Amrit Mahotsav Historical Incidents And Situations - Sakshi

జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ (1919)

  • 1918 స్పానిష్‌ ఫ్లూ. ఇండియాలో మూడేళ్ల పాటు ప్రబలింది. దేశంలో కోటీ 70 లక్షల మంది మరణించారు.
  •  ఖేడా సత్యాహగ్రహం. గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతులకు మద్దతుగా గాంధీజీ ఈ సత్యాగ్రహాన్ని చేపట్టారు.
  •  జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ (1919) రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు గాంధీజీ పిలుపు ‘జమైత్‌ ఉలేమా–ఇ–హింద్‌’ స్థాపించిన ముస్లిం పండితులు.

చట్టాలు:
యుషూరియస్‌ లోన్స్‌ యాక్ట్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1919, రౌలత్‌ చట్టం అమలు ప్రారంభం, పాయిజన్స్‌ యాక్ట్‌.

జననాలు:
శంకర్‌ దయాళ్‌ శర్మ : భారతదేశ 9వ రాష్ట్రపతి (భోపాల్‌); ఎస్‌.వి.రంగారావు : సినీ నటులు, దర్శకులు (రాజమండ్రి); కె.కరుణాకరన్‌ : రాజకీయవేత్త, కేరళ సీఎం; బాల సరస్వతి : నృత్యకారిణి, భరతనాట్యం (మద్రాసు); కె.వి. మహదేవన్‌ : సంగీత దర్శకులు (తమిళనాడు). ఇ.కె.నయనార్‌: కమ్యూనిస్టు యోధులు, కేరళ ముఖ్యమంత్రి; ఖైఫీ అజ్మీ: కవి (ఉత్తరప్రదేశ్‌); విక్రమ్‌ సారాభాయ్‌ : భౌతిక శాస్త్రవేత్త (గుజరాత్‌); మన్నా డే : సినీ నేపథ్య గాయకులు (కలకత్తా); గాయత్రీదేవి : జైపూర్‌ మహారాణి (లండన్‌); నౌషద్‌ : సంగీత దర్శకులు (లక్నో); డి.కె.పట్టమ్మాళ్‌ : కర్ణాటక సంగీత విద్వాంసురాలు (తమిళనాడు); భండారి రామ్‌ : సైనికుడు, విక్టోరియా క్రాస్‌ గ్రహీత (హిమాచల్‌ ప్రదేశ్‌). 

(చదవండి: చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement