INCIDENTS
-
జమ్ములో ఉగ్ర ఘటనలు.. విద్యాసంస్థల మూసివేత
జమ్ములో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా ఆర్మీ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ నుండి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు. 27వ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆన్లైన్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు బోధన జరగనుంది.జూన్ 9న జమ్ము డివిజన్లోని రియాసీలో శివఖోడి నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత మరిన్ని ఉగ్ర దాడులు చోటుచేసుకున్నాయి. గత బుధవారం జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. అదే సమయంలో ఒక సైనికుడు గాయపడ్డాడు.అంతకుముందు జూలై 24న జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని బట్ సెక్టార్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వీరమరణం పొందారు. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర ఘటనలను గుర్తించామన్నారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం తేదని, మన భద్రతా దళాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్కసారిగా..
అల్లూరి సీతారామరాజు: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో నడి సంద్రంలో పెనుప్రమాదం తప్పింది. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ టూరిజం నిర్వహిస్తున్న స్పీడ్ బోటులో 8 మంది పర్యాటకులు గురువారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. అదే సమయంలో ఓ ప్రైవేటు బోటులో ఐదుగురు షికారుకు వెళ్లారు. ఈ క్రమంలో అతి వేగంగా వస్తున్న ప్రైవేటు స్పీడ్ బోటు ఏపీ టీడీసీ స్పీడ్ బోటును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రైవేటు బోటు పూర్తిగా టూరిజం బోటు క్రిందకు చొచ్చుకుని పోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు పర్యాటకులు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. అయితే వీరు లైఫ్ జాకెట్ల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి చదవండి: ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..! -
బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. జర జాగ్రత్త! ఇదివరకే..
నిర్మల్: మరో మూడు రోజుల్లో బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారు. బాసరకు వచ్చే భక్తులంతా సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు. అయితే గోదావరి తీరం.. ప్రమాదభరితంగా మారింది. భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోతుంది. ఈయేడు భారీ వర్షాలతో గోదావరి ప్రస్తుతం నిండుగా ప్రవహిస్తోంది. వరదలకు కొట్టుకువచ్చిన నల్లమట్టి స్నాన ఘట్టాలపై పేరుకుపోయింది. దీంతో స్నానాలు చేసే భక్తులు జారి నదిలో డుతున్నారు. ఒకపక్క గోదావరిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోపక్క అధికారుల నిర్లక్ష్యంతో పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు మృత్యువాతపడుతున్నారు. ఇదివరకే ఇలా.. ► 'అక్టోబర్ 1న నిజామాబాద్‌లోని పాములబస్తీకి చెందిన సంతోష్(18) స్నేహితులతో కలిసి బాసరకు వచ్చాడు. గోదావరి నదిలో స్నానాల కోసం దిగి మృతిచెందాడు.' ► 'అక్టోబర్ 6న నిజామాబాద్‌లోని గాజులపేట్‌కు చెందిన దుబ్బాక ఒడ్డయ్య(35) కూతురు పుట్టు వెంట్రుకలు తీసేందుకు బాసరకు వచ్చాడు. ఆనవాయితీ ప్రకారం గోదావరి నదిలో తెప్పను వదిలేందుకు దిగాడు. నీటిలోనే మునిగి మృతిచెందాడు.' ► 'ఈనెల మొదటి వారంలోనే ఇద్దరు భక్తులు నదిలో ముగిని చనిపోయారు. గోదావరి నది వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదు.' 15 నుంచి ఉత్సవాలు.. ఈనెల 15 నుంచి 23 వరకు బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల నేపథ్యంలోనైనా స్నానఘట్టాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. స్నానఘట్టాల నిర్మాణ సమయంలో లోపాల కారణంగా కాలుజారితే లోపలికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బాసర గోదావరి నదిలో ప్రస్తుతం ఐదు అడుగుల లోతు నీటి వద్ద కంచెలాంటిది ఏర్పాటు చేయాలి. ప్రమాదవశాత్తు స్నానాలు చేసే సమయంలో భక్తులు జారిపడ్డా ఐదు అడుగుల కంచె వద్దే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఆలయ అధికారులకు తెలిసినా చర్యలు చేపట్టడంలేదు. యువకులు ఆందోళన చేసినా.. బాసర యువకులు గతంలో ఆందోళన చేసినా స్నానఘట్టాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. గోదావరి తీర ప్రాంతంలో స్నానఘట్టాల వద్దే ఈప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నీళ్లు చూస్తే ప్రతి ఒక్కరికీ అందులోదిగి స్నానం చేయాలన్న ఆతృత ఉంటుంది. ఇక స్నేహితులతో కలిసి వచ్చేవారు నది నీటిలో గంటలతరబడి స్నానాలు చేస్తుంటారు. కొత్తగా వచ్చే ఈ యువకులు ఆనందంలో నీటి లోతును అంచనా వేయలేక లోపలికి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. బాసర ఆలయ అధికారులకు యువకులు గతంలో వినతిపత్రాలు ఇచ్చారు. జరుగుతున్న సంఘటనలపై బాసర పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలోనైనా భక్తులకు ఇబ్బంది కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని యువకులు కోరుతున్నారు. -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
మణిపూర్ ఘటనలు ‘ప్రభుత్వ ప్రాయోజిత హింస’
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘటనలు ‘ప్రభుత్వ ప్రాయోజిత హింస’గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీజేపీ విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. శనివారం శాసనమండలిలో ‘రాష్ట్రంలో గిరిజన సంక్షేమం– పోడుపట్టాల పంపిణీ’పై లఘుచర్చలో కవిత మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య గొడవ పెట్టి ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని ఆరోపించారు. అన్ని జాతులు బాగుపడాలని తెలంగాణ కోరుకుంటుంటే.... విభజించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలో కనిపిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పూర్తిగా గిరిజన హక్కులను హరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో అమలు చేసిన వాటిని కేంద్రం అనుకరిస్తోందని కవిత వ్యాఖ్యానించారు. గిరిజనులకు కేటాయించిన నిధులను వంద శాతం వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను రూపొందిస్తోందని తెలిపారు. -
పవన్ నోరు ఇప్పటం లేదు
-
టీ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రియాంక గాంధీ ఫైర్
-
సామ్రాజ్య భారతి: 1942,1943/1947 ఘట్టాలు
ఘట్టాలు: క్విట్ ఇండియా తీర్మానం. బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ నిర్ణయం. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొత్త జంట ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ అరెస్ట్. బెంగాల్ దుర్భిక్షం, పోర్ట్ ఆఫ్ కలకత్తాపై జపాన్ దాడి చట్టాలు కాఫీ మార్కెట్ ఎక్స్పాన్షన్ యాక్ట్ రెసిప్రొసిటీ యాక్ట్, వార్ ఇంజ్యురీస్ (కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్) యాక్ట్ జననాలు: అమితాబ్ బచన్ : బాలీవుడ్ నటుడు (అలహాబాద్); ఆశా పరేఖ్ : బాలీవుడ్ నటి (బొంబాయి); అమరీందర్ సింగ్ : రాజకీయనేత (పాటియాలా); రాజేశ్ ఖన్నా : బాలీవుడ్ నటుడు (అమృత్సర్); జతేంద్ర : బాలీవుడ్ నటుడు (అమృత్సర్); కె.రాఘవేంద్రరావు : సినీ దర్శకులు (మద్రాస్ ప్రెసిడెన్సీ); జైపాల్‌రెడ్డి : రాజకీయ నేత (తెలంగాణ); సురవరం సుధాకరరెడ్డి : కమ్యూనిస్టు నేత (మహబూబ్ నగర్); సాక్షి రంగారావు : క్యారెక్టర్ యాక్టర్ (కలవకూరు); సారథి : హాస్య నటుడు (పెనుకొండ). మాధవన్ నాయర్ : ఇస్రో సైంటిస్ట్ (తమిళనాడు); ఇళయరాజా : సంగీత దర్శకులు (పన్నైపురం); కృష్ణ : స్టార్ యాక్టర్ (బుర్రిపాలెం); మనోరమ : రంగస్థల, సినీ నటి (మన్నార్గుడి); టి.సుబ్బరామిరెడ్డి : రాజకీయనేత (నెల్లూరు). (చదవండి: సామ్రాజ్య భారతి 1940,1941/1947) -
సామ్రాజ్య భారతి 1940,1941/1947
ఘటనలు: లాహోర్ సమావేశంలో ఆలిండియా ముస్లిం లీగ్ ‘పాకిస్థాన్ తీర్మానం’. ప్రత్యేక పాకిస్థాన్ కోసం తొలిసారి జిన్నా డిమాండ్. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు ఇండియా మద్దతు ఉపసంహరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపుపై దేశవ్యాప్త సత్యాగ్రహాలు. వారిలో అరెస్ట్ అయిన తొలి సత్యాగ్రహి వినోభా భావే. విశాఖపట్నంలో సింధియా షిప్‌యార్డ్ (నేటి హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్) కు బాబూ రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన. చట్టాలు: డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్, ఢిల్లీ రిస్ట్రిక్షన్ ఆఫ్ యూజస్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్, బేరర్ ‘లా’ స్ యాక్ట్ జననాలు: మురళీమోహన్ : నటుడు (చాటపర్రు); రాజేంద్ర కె. పచౌరి : ఆర్థికవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త (నైనిటాల్); అంజాద్ ఖాన్ : నటుడు, దర్శకుడు (బాంబే); శరద్ పవార్ : రాజకీయనేత (బారామతి, మహారాష్ట్ర); ఎ.కె.ఏంటోనీ : రాజకీయనేత (కేరళ); కె.జె.జేసుదాస్ : గాయకులు (కొచ్చి); కృష్ణంరాజు : నటుడు (మొగల్తూరు); వీరప్ప మొయిలీ : రాజకీయనేత (కర్ణాటక); నజ్మా హెప్తుల్లా : రాజకీయనేత (భోపాల్); గోవింద్ నిహలానీ : సినీ దర్శకులు (పాకిస్థాన్); జి.ఎం.సి. బాలయోగి : రాజకీయనేత (తూ.గో.); యామిని కృష్ణమూర్తి : నృత్యకారిణి (మదనపల్లి); వరవరరావు : (వరంగల్); జగ్మోహన్ దాల్మియా : క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ (కలకత్తా). మణిశంకర్ అయ్యర్ : రాజకీయనేత (లాహోర్); భారతీరాజా : తమిళ దర్శకులు (మదురై); మన్సూర్ అలీఖాన్ పటౌడీ : క్రికెటర్ (భోపాల్); అరుణ్‌శౌరీ : జర్నలిస్ట్, రాజకీయనేత (జలంధర్); ఆదూర్ గోపాలకృష్ణన్ : సినీ దర్శకులు (కేరళ); వై.వేణుగోపాల్ రెడ్డి : ఆర్థికవేత్త (కడప); ఆస్కార్ ఫెర్నాండెజ్ : రాజకీయనేత (ఉడుపి). (చదవండి: చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్ బూర్కి వైట్) -
సామ్రాజ్య భారతి: 1938,1939/1947
ఘట్టాలు: రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం. ఇండియాలో రాజకీయ ప్రతిష్ఠంభన. భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాస్ చంద్రబోస్ రాజీనామా. బ్రిటిష్ అరాచక పాలనకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న గాంధీజీ. చట్టాలు: గుడ్ కాండక్ట్ ప్రిజనర్స్ ప్రొబేషనల్ రిలీజ్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్; మనోవర్స్, ఫీల్డ్ ఫైరింగ్ అండ్ ఆర్టిలరీ ప్రాక్టీస్ యాక్ట్, కట్చీ మెమాన్స్ యాక్ట్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, పోర్చుగీస్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, కమర్షియల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ యాక్ట్, డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజస్ యాక్ట్. జననాలు: బి.సరోజాదేవి : నటి (బెంగళూరు); శశి కపూర్ : నటుడు (కలకత్తా); షీలా దీక్షిత్ : రాజకీయనేత (కపుర్తాలా); గిరీష్ కర్నాడ్ : నటుడు (మహారాష్ట్ర); రాహుల్ బజాజ్ : బిజినెస్‌మేన్ (కలకత్తా); సంజీవ్ కుమార్ : నటుడు (సూరత్); ఎస్.జానకి : సి.నే.గాయని (రేపల్లె); హరిప్రసాద్ చౌరాసియా : వేణుగాన విద్వాసులు (అలహాబాద్); గిరిజ : నటి (కంకిపాడు); ఆర్.డి.బర్మన్ : సంగీత దర్శకుడు (కలకత్తా); ములాయం సింగ్ యాదవ్ : రాజకీయనేత (ఉత్తరప్రదేశ్); ఎల్.ఆర్. ఈశ్వరి : సినీ గాయని (మద్రాసు); గొల్లపూడి మారుతీరావు : నటుడు (విజయనగరం). (చదవండి: జమ్మూకశ్మీర్) -
సామ్రాజ్య భారతి: 1936,1937/1947
ఘట్టాలు: ‘టెంపుల్ ఎంట్రీ ప్రొక్లమేషన్’తో హిందూ ఆలయ ప్రవేశానికి ‘అట్టడుగు వర్ణాలు’ అని పిలవబడేవారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన ట్రావెన్కూర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ. కేరళ యూనివర్సిటీ ఏర్పాటు. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్థాపన. చట్టాలు: పేమెంట్ ఆఫ్ వేజస్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్. అగ్రికల్చరల్ ప్రొడ్యూజ్ (గ్రేడింగ్ అండ్ మార్కింగ్) యాక్ట్, ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ఆర్య మ్యారేజ్ వాలిడేషన్ యాక్ట్ వైజయంతిమాల : తమిళనటి, భరతనాట్య ప్రవీణ (మద్రాసు); నూతన్ : బాలీవుడ్ నటి (బాంబే); జుబిన్ మెహ్తా : పాశ్చాత్య శాస్త్రీయ సంగీత నిర్వాహకులు (బాంబే); డి.రామానాయుడు : సినీ నిర్మాత (కారంచేడు); వేటూరి : సినీ గేయ రచయిత (పెదకళ్లేపల్లి); చిట్టిబాబు : సంగీతజ్ఞులు, కర్ణాటక సంగీత వైణికులు (కాకినాడ); విజయబాపినీడు : సినీ రచయిత, దర్శకులు (చాటపర్రు). రామచంద్ర గాంధీ : తత్వవేత్త, గాంధీజీ మనవడు (మద్రాసు); అనితా దేశాయ్ : నవలా రచయిత్రి, (ముస్సోరి); రతన్‌టాటా : పారిశ్రామికవేత్త (బాంబే); శోభన్‌బాబు : సినీ నటులు (నందిగామ); లక్ష్మీకాంత్ శాంతారామ్ : లక్ష్మీకాంత్, ప్యారేలాల్ ద్వయంలో ఒకరు. బాలీవుడ్ సంగీత దర్శకులు (బాంబే); రావుగోపాలరావు : సినీ నటుడు (కాకినాడ). (చదవండి: శతమానం భారతి: కొత్త పార్లమెంట్ ) -
సామ్రాజ్య భారతి:1934,1935/1947 ఘట్టాలు
ఘట్టాలు శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసిన గాంధీజీ. భారత కమ్యూనిస్టు పార్టీపై బ్రిటిష్ ప్రభుత్వ నిషేధం. చట్టాలు: వారానికి 65 గంటల పని చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, సుగర్కేన్ యాక్ట్, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్, పెట్రోలియం యాక్ట్, డాక్ లేబరరర్స్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ –1935 జననాలు: మహేంద్ర కపూర్ : సి.నే. గాయకులు (అమృత్సర్); విజయ్ ఆనంద్ : సినీ దర్శక, నిర్మాత (గురదాస్‌పూర్); కాన్షీరామ్ : బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకులు (రూప్‌నగర్); రస్కిన్ బాండ్ : బాలల రచయిత (హిమాచల్‌ప్రదేశ్); ప్రతిభా పాటిల్ : భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి (మహారాష్ట్ర); చో రామస్వామి : ‘తుగ్లక్’ పత్రిక సంపాదకులు (చెన్నై); శ్యామ్ బెనెగల్ : సినీ దర్శకులు (సికింద్రాబాద్); రాజశ్రీ : సినీ గేయ రచయిత, డైలాగ్ రైటర్ (విజయనగరం). జయేంద్ర సరస్వతి : ఆథ్యాత్మిక గురువు (తమిళనాడు); ప్రేమ్ చోప్రా : బాలీవుడ్ నటుడు (లాహోర్); సలీమ్ ఖాన్ : బాలీవుడ్ నటుడు (ఇండోర్); ప్రణబ్ ముఖర్జీ : భారత 13వ రాష్ట్రపతి (ప.బెం.); సావిత్రి : సీనియర్ నటి (చిర్రావూరు); పి.సుశీల : గాయని (విజయనగరం); కైకాల సత్యనారాయణ : నటులు (కౌతారం); రాజసులోచన : నటి, శాస్త్రీయ నృత్యకారిణి (విజయవాడ); డాక్టర్ ప్రభాకరరెడ్డి : నటులు (తుంగతుర్తి); తెన్నేటి హేమలత : రచయిత్రి (విజయవాడ); సి.ఎస్.రావ్ : సినీ రచయిత (ద్రాక్షారామం) (చదవండి: చైతన్య భారతి: ఇరోమ్ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!) -
సామ్రాజ్య భారతి: 1930,1931/1947
ఘట్టాలు: జనవరి 26 ను ‘పూర్ణ స్వరాజ్య దినం’గా ప్రకటించిన భారత జాతీయ కాంగ్రెస్. భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్‌కు నోబెల్ బహుమతి. మార్చి 12న మొదలై ఏప్రిల్ 6న ముగిసిన గాంధీజీ దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం). లండన్‌లో తొలి రౌండ్ టేబుల్ సమావేశం భారతదేశ రాజధానిగా ఢిల్లీ. బ్రిటిష్ పోలీసులతో హోరాహోరీ ఎన్కౌంటర్లో చంద్రశేఖర ఆజాద్ మృతి. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీసిన బ్రిటిషర్లు. చట్టాలు: సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, హిందూ గెయిన్స్ ఆఫ్ లర్నింగ్ యాక్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఇండియన్ టోల్స్ (అమెండ్మెంట్) యాక్ట్, ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ టెక్సెస్ యాక్ట్. చట్టాలు: కె.విశ్వనాథ్ : సినీ దర్శకులు (రేపల్లె); కె.బాలచందర్ : తమిళ సినీ దర్శకులు (నన్నీలం); పి.బి.శ్రీనివాస్ : సినీ నేపథ్య గాయకులు (కాకినాడ); మధురాంతకం రాజారాం : కథా రచయిత (తిరుపతి); పిఠాపురం నాగేశ్వరరావు : సినీ నేపథ్య గాయకులు (పిఠాపురం) నిరుపారాయ్ : సినీ నటి (గుజరాత్); షమ్మీ కపూర్ : బాలీవుడ్ నటుడు (బాంబే); రొమిల్లా థాపర్ : చరిత్రకారిణి (లక్నో); సింగీతం శ్రీనివాసరావు : సినీ దర్శకులు (ఉదయగిరి); సి.నారాయణరెడ్డి : కవి (తెలంగాణ); ముళ్లపూడి వెంకట రమణ : రచయిత (ధవళేశ్వరం); అవసరాల రామకృష్ణారావు : కథా రచయిత (తుని) (చదవండి: శతమానం భారతి: పరిరక్షణ) -
సామ్రాజ్య భారతి 1928,1929/1947
ఘట్టాలు: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బి.సి.సి.ఐ) ఏర్పాటు. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన ఇండియా. న్యూఢిల్లీ అసెంబ్లీ ఛాంబర్లోకి బాంబులు విసిరిన బతుకేశ్వర్ దత్, భగత్‌సింగ్. ఇండియాకు మదర్ థెరిస్సా ఆగమనం. బాంబే ఫ్లయింగ్ క్లబ్‌ను స్థాపించిన జె.ఆర్.డి.టాటా. చట్టాలు: ది హిందు ఇన్హెరిటెన్స్ (రిమూవల్ ఆఫ్ డిస్ఎబిలిటీస్) యాక్ట్, ది చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్. జననాలు: వీరమాచినేని విమలాదేవి : కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు, ఏలూరు ఎంపీ (విశాఖపట్నం); గిరీశ్ చంద్ర సక్సేనా : రాజకీయ నేత, (ఆగ్రా); శివాజీ గణేశన్ : తమిళ నటులు (సురైకోటై్ట); జగ్గయ్య: నటుడు, లోక్‌సభ ఎంపీ (తెనాలి); ఎం.ఎస్.విశ్వనాథన్ : సంగీత దర్శకులు (మద్రాసు ప్రెసిడెన్సీ); జె.వి.సోమయాజులు : నటులు (శ్రీకాకుళం); త్రిపుర (రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు) : కథా రచయిత (విశాఖపట్నం); రావు బాలసరస్వతి : గాయని (హైదరాబాద్) నర్గీస్ : నటి (కలకత్తా); సురయా : నటి (పాకిస్థాన్); కిశోర్ కుమార్ : సినీ నేపథ్య గాయకులు (మధ్యప్రదేశ్); సోమనాథ్ చటర్జీ : కమ్యూనిస్టు యోధులు (అస్సాం); యశ్ జోహార్ : సినీ నిర్మాత (అమృత్సర్); లతా మంగేష్కర్ : సినీ నేపథ్య గాయని (ఇండోర్); మిఖాసింగ్ : ట్రాక్ అండ్ ఫీల్డ్ స్ప్రింటర్ (పాకిస్థాన్); సునీల్ దత్ : సినీ దిగ్గజం, రాజకీయనేత (పంజాబ్); అనంత పాయ్ : కామిక్ క్రియేటర్ (కర్ణాటక); జి.వెంకటస్వామి : రాజకీయనేత (హైదరాబాద్); సిహెచ్. హనుమంతరావు : ఆర్థికవేత్త, రచయిత (కరీంనగర్) -
సామ్రాజ్య భారతి: 1926,1927/1947 ఘట్టాలు
ఘట్టాలు: బాంబేలో ‘బెస్ట్’ బస్సులు ప్రారంభం. (బాంబే ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్). పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమ బాధ్యతల్ని ‘మదర్’ కు (మీరా ఆల్ఫాన్సా) అప్పగించి ఆ విధుల నుంచి శ్రీ అరబిందో విరమణ. భారత స్వయం పాలన కోసం సైమన్ కమిషన్ ఏర్పాటు. న్యూఢిల్లీలో కౌన్సిల్ హౌస్ ప్రారంభం. డెహ్రాడూన్‌లో తీవ్ర మతకలహాలు. సిలోన్కు గాంధీజీ మొదటి, చివరి పర్యటన. చట్టాలు: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు. (అదే నేటి యు.పి.ఎస్.సి.), ట్రేడ్ యూనియన్స్ యాక్ట్, గుడ్ కాండక్ట్ ప్రిజనర్స్ ప్రొబేషనల్ రిలీజ్ యాక్ట్, ఇండియన్ బార్ కౌన్సిల్స్ యాక్ట్, కాటన్ ఇండస్ట్రీ (స్టాటిస్టిక్స్) యాక్ట్. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, లైట్ హౌస్ యాక్ట్. జననాలు: ఓపీ నయ్యర్ : సినీ సంగీత దర్శకులు (లాహోర్); రాజ్ కుమార్ : బాలీవుడ్ నటుడు (పాకిస్థాన్); బాల్ థాకరే : రాజకీయనేత, ‘శివసేన’ వ్యవస్థాపకులు (పుణె); మహాశ్వేతాదేవి : బెంగాలీ రచయిత్రి (ఢాకా); రామకృష్ణ హెగ్డే : రాజకీయనేత (కర్ణాటక); జి.వరలక్ష్మి : రంగస్థల, సినీ నటి (ఒంగోలు). బలివాడ కాంతారావు : నవలా రచయిత (మడపాం); లాల్‌కృష్ణ అద్వానీ : రాజకీయవేత్త, భారత డిప్యూటీ ప్రధాని (కరాచీ); సుందర్‌లాల్ బహుగుణ : పర్యావరణ పరిరక్షణ కార్యకర్త (ఉత్తరాఖండ్); అంజలీదేవి : నటి (పెద్దాపురం); నయనతార సెహగల్ : ఆంగ్ల భాషా రచయిత్రి (అలహాబాద్); నేదునూరి కృష్ణమూర్తి : కర్ణాటక సంగీత విద్వాంసులు (పిఠాపురం); నండూరి రామ్మోహన్రావు : పాత్రికేయులు (విస్సన్నపేట). (చదవండి: జైహింద్ స్పెషల్: వీళ్లంతటివాడు పుల్లరి హనుమంతుడు) -
సామ్రాజ్య భారతి: 1922,1923/1947
ఘట్టాలు చౌరీచౌరా (గోరఖ్‌పుర్) లో హింసాత్మక ఘటనలు. సహాయ నిరాకరణోద్యమ విరమణకు గాంధీజీ పిలుపు. ఉద్యమ నాయకుల అసంతృప్తి. ‘రాజద్రోహం’ నేరారోపణపై ముంబైలో గాంధీజీ అరెస్టు. ఆరేళ్ల జైలు శిక్ష. రెండేళ్లకే విడుదల. స్వరాజ్య పార్టీ అవతరణ. వ్యవస్థాపకులు సి.ఆర్.దాస్, మోతీలాల్ నెహ్రూ. చట్టాలు: (1923) వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, ఆఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్, ఇండియన్ బాయిలర్స్ యాక్ట్, కంటోన్మెంట్స్ (హౌస్–అకామడేషన్) యాక్ట్, ఇండియన్స్ నేవల్ ఆర్మమెంట్ యాక్ట్, ఇండియన్ మర్చంట్ షిప్పింగ్ యాక్ట్, కాటన్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్. జననాలు: హృషికేష్ ముఖర్జీ : సినీ దర్శకులు (కలకత్తా); అల్లు రామలింగయ్య : హాస్య నటులు (పాలకొల్లు); దిలీప్ కుమార్ : బాలీవుడ్ నటుడు (పెషావర్); ఘంటసాల : గాయకులు, సంగీత దర్శకులు (కృష్ణా జిల్లా); యలవర్తి నాయుడమ్మ : కెమికల్ ఇంజినీర్ (గుంటూరు జిల్లా); ఎస్.రాజేశ్వరరావు : సంగీత దర్శకులు (సాలూరు మండలం); ధర్మభిక్షం : కమ్యూనిస్టు యోధులు (సూర్యాపేట); కుందుర్తి ఆంజనేయులు : కవి (గుంటూరు). మృణాల్ సేన్ : సినీ దర్శకులు (బెంగాల్ ప్రెసిడెన్సీ); ఎన్టీ రామారావు : సినీ నటులు, రాజకీయ నాయకులు (నిమ్మకూరు); దేవ్ ఆనంద్ : సినీ నటులు (పంజాబ్); ముఖేష్ : సినీ నేపథ్య గాయకులు (ఢిల్లీ); కాంతారావు : నటులు (కోదాడ). -
సామ్రాజ్య భారతి: 1920,1921/1947 ఘట్టాలు
ఘట్టాలు: సహాయ నిరాకరణోద్యమానికి గాంధీజీ పిలుపు. విశ్వ భారతి యూనివర్సిటీ స్థాపన. మహిళలకు కూడా ఓటు హక్కు ఉంటుందని మద్రాసు ప్రావిన్సు ప్రకటన. చట్టాలు: ముంబైలో అడుగుపెట్టిన వేల్స్ ప్రిన్స్ (తర్వాతి కాలంలో ఎనిమిదవ ఎడ్వర్డ్ కింగ్) కు ఖాళీ వీధుల స్వాగతం! ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్, పాస్‌పోర్ట్ (ఎంట్రీ ఇన్ టు ఇండియా) యాక్ట్, ఐడెంటికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్, ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్, చారిటబుల్ అండ్ రెలిజియస్ ట్రస్ట్స్ యాక్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాక్ట్. పర్మినెంట్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ ప్రిన్సెస్; కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెయింటెనెన్స్ ఆర్డర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్. జననాలు రవిశంకర్ : సితార్ విద్వాంసులు (బెనారస్); సతీశ్ ధావన్ : ఏరో స్పేస్ ఇంజనీర్ (శ్రీనగర్); బి.విఠలాచార్య : సినీ దర్శకులు (ఉడిపి); బాలాంత్రపు రజనీకాంత రావు : వాగ్గేయకారులు, స్వరకర్త (నిడదవోలు); డి.వి.నరసరాజు : రంగస్థల, సినీ నటులు, దర్శకులు, రచయిత (గుంటూరు); సత్యజిత్ రే : సినీ దర్శకులు (కలకత్తా); దేవరకొండ బాలగంగాధర తిలక్ : కవి (తణుకు); ఆర్.కె.లక్ష్మణ్ : కార్టూనిస్టు (మైసూరు); ఆత్రేయ : సినీ కవి (మంగళంపాడు). (చదవండి: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు!) -
సామ్రాజ్య భారతి: 1918,1919/1947 ఘట్టాలు
1918 స్పానిష్ ఫ్లూ. ఇండియాలో మూడేళ్ల పాటు ప్రబలింది. దేశంలో కోటీ 70 లక్షల మంది మరణించారు. ఖేడా సత్యాహగ్రహం. గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతులకు మద్దతుగా గాంధీజీ ఈ సత్యాగ్రహాన్ని చేపట్టారు. జలియన్‌వాలా బాగ్ మారణకాండ (1919) రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు గాంధీజీ పిలుపు ‘జమైత్ ఉలేమా–ఇ–హింద్’ స్థాపించిన ముస్లిం పండితులు. చట్టాలు: యుషూరియస్ లోన్స్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, రౌలత్ చట్టం అమలు ప్రారంభం, పాయిజన్స్ యాక్ట్. జననాలు: శంకర్ దయాళ్ శర్మ : భారతదేశ 9వ రాష్ట్రపతి (భోపాల్); ఎస్.వి.రంగారావు : సినీ నటులు, దర్శకులు (రాజమండ్రి); కె.కరుణాకరన్ : రాజకీయవేత్త, కేరళ సీఎం; బాల సరస్వతి : నృత్యకారిణి, భరతనాట్యం (మద్రాసు); కె.వి. మహదేవన్ : సంగీత దర్శకులు (తమిళనాడు). ఇ.కె.నయనార్: కమ్యూనిస్టు యోధులు, కేరళ ముఖ్యమంత్రి; ఖైఫీ అజ్మీ: కవి (ఉత్తరప్రదేశ్); విక్రమ్ సారాభాయ్ : భౌతిక శాస్త్రవేత్త (గుజరాత్); మన్నా డే : సినీ నేపథ్య గాయకులు (కలకత్తా); గాయత్రీదేవి : జైపూర్ మహారాణి (లండన్); నౌషద్ : సంగీత దర్శకులు (లక్నో); డి.కె.పట్టమ్మాళ్ : కర్ణాటక సంగీత విద్వాంసురాలు (తమిళనాడు); భండారి రామ్ : సైనికుడు, విక్టోరియా క్రాస్ గ్రహీత (హిమాచల్ ప్రదేశ్). (చదవండి: చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ) -
సామ్రాజ్య భారతి: 1903/19047 ఘట్టాలు! చట్టాలు
ఘట్టాలు: బ్రిటిష్ ఇండియా చక్రవర్తిగా ఏడవ ఎడ్వర్డ్ బ్రిటిష్ ఆఫీసర్‌ను భుజాలపై మోసుకెళుతున్న కొండప్రాంత భారతీయ మహిళ (1903 నాటి ఫొటో) చట్టాలు వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ యాక్ట్, విక్టోరియా మెమోరియల్ యాక్ట్ జననాలు: కమలాదేవి చటోపాధ్యాయ్ : స్వా.స.యో., సంఘ సంస్కర్త (కర్ణాటక); ఎస్.ఎల్. కిర్లోస్కర్ : ప్రముఖ వ్యాపారవేత్త (సోలాపూర్); జైపాల్ సింగ్ ముండా : రాజకీయనేత, రచయిత, క్రీడాకారుడు (జార్ఖండ్); శివరామ్ చక్రవర్తి : బెంగాలీ హాస్య రచయిత (కలకత్తా); ప్రమతేశ్ బారువా : సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ (అస్సాం); నిడదవోలు వెంకట్రావు : తెలుగు రచయిత, రిసెర్చ్ స్కాలర్ (విజయనగరం); కె.సుకుమారన్ : ‘కేరళ కౌముది’ ఎడిటర్ (మయనాడ్); టి.ఎస్. అవినాశలింగం చెట్టియార్ : స్వా.స.యో., న్యాయ కోవిదులు (తమిళనాడు); ముకత్ బెహారి లాల్ భార్గవ : స్వా.స.యో., రాజకీయవేత్త (జైపూర్) (చదవండి: మహోజ్వల భారతి: భారతజాతి మిత్రుడు బెంజిమన్) -
సామ్రాజ్య భారతి: 1880/1947
ఘట్టాలు: నైనిటాల్లో ఏకధాటిగా 68 గంటల వ్యవధిలో కుండపోతగా కురిసిన 36 సెంటీమీటర్ల వర్షపాతం 151 మందిని బలిగొంది. కొండ చరియలు విరిగి పడటంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. జననాలు: రాజశేఖర్ బసు : రచయిత, కెమిస్ట్, నిఘంటు నిపుణులు (బెంగాల్); మున్షీ ప్రేమ్‌చంద్ : స్వాతంత్య్ర ఉద్యమకారుడు; హిందూ, ఉర్దూ భాషల్లో రచయిత (బెనారస్); అబ్దుల్ ముహసిన్ ముహమ్మద్ సజ్జద్ : పండితులు, స్వాతంత్య్ర సమర యోధులు, ‘ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ’ వ్యవస్థాపకులు (బిహార్ ప్రావిన్స్); బరీంద్రకుమార్ ఘోష్ : స్వాతంత్య్ర సమర తిరుగుబాటు వీరుడు, జర్నలిస్ట్ (కలకత్తా); బళ్లారి రాఘవ : తెలుగు నాటక రంగ ప్రముఖులు, ప్రసిద్ధ న్యాయవాది (అనంతపురం జిల్లా); సుఖ్లాల్ సంఘ్వీ : జైన్ పండితులు, తత్వవేత్త (గుజరాత్); అమరేంద్ర చటర్జీ : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (పశ్చిమ బెంగాల్). చట్టాలు: రెలిజియస్ సొసైటీస్ యాక్ట్, కాజీస్ యాక్ట్, ఈస్టిండియా లోన్ (ఈస్టిండియన్ రైల్వే డిబెంచర్స్) యాక్ట్, ఇండియా స్టాక్ (పవర్స్ ఆఫ్ అటార్నీ) యాక్ట్. (చదవండి: సామ్రాజ్య భారతి 1879/1947) -
ఆడుకున్న తండ్రి భుజాల మీదే శవంగా..
భోపాల్: మన దేశంలో వైద్యం.. సగటు మనిషికి ఇంకా అందనంత దూరంలోనే ఉంది. ఒకవైపు జనాలకు సరిపడా వైద్య సిబ్బంది లేనేలేరు. మరోవైపు.. నిత్యం ఏదో ఒక ఘటన వైద్య సౌకర్యాల, సదుపాయాల డొల్లతనాన్ని బయటపడుతూనే ఉంది. అలాంటిదే వైరల్ అవుతున్న ఈ ఘటన. మధ్యప్రదేశ్ ఛతార్పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. నాలుగేళ్ల పసికందు శవాన్ని భుజాన వేసుకుని కాలినడకన చేరుకున్నాడు ఓ తండ్రి. దారిలో ఉన్న ఓ ఊరి ప్రజలు కొందరు తీసిన ఈ వీడియో వైరల్ కావడంతో వైద్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ చిన్నారి కుటుంబం పౌడీ గ్రామానికి చెందింది. సోమవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తొలుత ఆమె కుటుంబం బుక్స్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఆపై పరిస్థితి విషమించడంతో మంగళవారం దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అదేరోజు ఆ చిన్నారి కన్నుమూసింది. బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా.. ఆస్పత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించలేదు. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా.. ఓ బస్సులో బుక్స్‌వాహాకు చేసుకున్నాడు ఆ బిడ్డ తండ్రి. అక్కడ బిడ్డ తండ్రి, నగర్ పంచాయితీ వాళ్లను ఏదైనా వాహనం సమకూర్చమని అడిగాడు. కానీ, అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో డబ్బుల్లేక.. అక్కడి నుంచి కాలినడకనే బిడ్డ శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లాడు ఆ తండ్రి. చివరికి.. ఓ ఊరి ప్రజలు ఆ ఘటనను వీడియో తీయడంతో పాటు ఆ బిడ్డ తండ్రికి సాయం చేశారు. A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp — Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022 ఇదిలా ఉంటే.. సాగర్ జిల్లా గధాకోటలో ఓ వ్యక్తి చనిపోతే ఆంబులెన్స్‌కు నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. గత్యంతరం లేక తోపుడుబండి మీద సోదరుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మరో ఘటనలో భగవాన్‌పుర దగ్గర గర్భిణికి సకాలంలో ఆంబులెన్స్ అందకపోవడంతో కన్నుమూసింది. ఈ మూడు ఘటనలు వరుసగా వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది. అయితే దామోహ్ ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. ఆంబులెన్స్ కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్తున్నారు. గధాకోట ఘటనపై మెడికల్ ఆఫీసర్ సుయాష్‌స్పందిస్తూ.. పోస్ట్ మార్టం అయ్యేదాకా ఎదురు చూడమంటే.. వినిపించుకోకుండా మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు. భగవాన్‌పుర ఘటనపై మాత్రం దర్యాప్తునకు ఆదేశించినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. -
క్రైంసీన్ టేప్ ఆమె పరువును కాపాడింది!
పరిశీలన.. గ్రాహ్య శక్తి రెండేళ్ల పాపను రక్షించాయి.. పేపర్ నాప్కిన్స్, క్రైమ్‌సీన్ టేప్ పాతికేళ్ల అమ్మాయి పరువును కాపాడాయి.. పాలిథిన్ కవర్లు, కార్టన్స్.. ఇరవైఏళ్ల పిల్లను ప్రాణాలతో నిలబెట్టాయి.. నాలుగు గోడల మధ్య బందీ అయినప్పుడు ఆలోచనను మించిన ఆధారం ఉండదు! కామన్‌సెన్స్‌కు సరితూగే ఆయుధం దొరకదు! ఆ ముగ్గురూ ఉపయోగించింది అదే! ఆ సంఘటనలు నిరూపించిన సత్యమూ అదే! సినిమా కథలే.. జీవితానికి పనికొచ్చే పాఠాలు!! హండ్రెడ్‌కు డయల్ చేయాల్సింది.. ఏమైనా సరే జనం ఉన్నవైపు వెళ్లాల్సింది. తొమ్మిదిగంటల రాత్రి రోడ్డు మీద నిలబడ్డా.. టోల్‌ప్లాజాలో ఉన్నా చూసేవాళ్లు ఏమనుకుంటారు? రోజూ వచ్చేపోయే రూటే. అయినా పరిసరాలను ఎప్పుడూ గమనించింది లేదు. అందుకే పంక్చర్, మెకానిక్ షాపులు ఎక్కడుంటాయో.. ఏ వేళ వరకూ తెరిచి ఉంటాయో తెలియలేదు. కనీసం తెలిసినట్టు నటించే స్మార్ట్నెస్నూ ప్రదర్శించలేదు. తెగువ చూపించాల్సిన టైమ్ భయంతో భర్తీ అయింది. మనుగడ వాంఛ ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా చేస్తుంది.. ప్రాణాలతో నిలబెడుతుంది. చదువుల ఫ్యాక్టరీల్లోంచి మార్కుల అచ్చులుగా బయటకు వచ్చిన అమ్మాయిల్లో ఈ సర్వైవల్ ఇన్స్టింక్టే కొరవడిందని ‘దిశ’ సంఘటన రుజువు చేసింది. ఉండాల్సిన అవసరం ఎంత ఉందో ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు.. పిహూ (హిందీ), ‘ఆడై’ (తమిళ సినిమా.. తెలుగులో ‘ఆమె’గా డబ్ అయింది), ‘హెలెన్’ (మలయాళం) చూపించాయి. పిహూ... రెండేళ్ల పిల్ల పిహు. ఇంకా అమ్మ పాలు విడవని కూన. పిహూ రెండో పుట్టినరోజు రాత్రి అమ్మ, నాన్న పోట్లాడుకుంటారు. మరుసటి రోజు వేకువ జామునే మీటింగ్ ఉందని తండ్రి ఊరెళ్లిపోతాడు. మనస్తాపంతో ఉన్న తల్లి.. నిద్రమాత్రలు మింగుతుంది. ఉదయం నిద్రలేచిన పిహూ.. పక్కనే అచేతనంగా ఉన్న ‘అమ్మ’ను నిద్రలేపుతూంటుంది.. ‘టాయ్‌లెట్‌కి’ తీసుకెళ్లమని. ఎంతకీ కళ్లు తెరవని అమ్మను దాటుకుంటూ తనే బాత్రూమ్లోకి వెళ్తుంది. వచ్చి మళ్లీ అమ్మ పక్కనే పడుకుంటుంది. కాసేపాగి మళ్లీ తల్లిని తడుతుంది.. ఆకలేస్తోంది పాలిమ్మని. స్పందించని అమ్మ వైపు తిరిగి తానే పాలు తాగాలని ప్రయత్నిస్తుంది. బిగుసుకుపోయిన తల్లి శరీరం కదలక పోయేసరికి.. విసిగిపోయిన ఆ పిల్ల.. వంటింట్లోకి వెళ్లి.. స్టూలును గ్యాస్గట్టు దగ్గరకు లాక్కొని దాని మీద ఎక్కి స్టవ్ ఆన్ చేస్తుంది. బ్రెడ్ కాల్చుకోవాలని ట్రై చేసి చేయి కాల్చుకుంటుంది. ఏడుస్తూ తిరిగి బెడ్రూమ్లోకి వస్తుంది. తండ్రి ఊరు వెళ్లేముందు బట్టలు ఇస్త్రీ చేసుకోవాలని ఐరన్ బాక్స్ ఆన్ చేస్తాడు. కరెంట్ పోవడంతో స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలేసి.. ఫ్లయిట్ టైమ్ అవుతోందని వెళ్లిపోతాడు. కరెంట్ వచ్చి ఇస్త్రీ పెట్టె వేడుక్కుతుంటూంటుంది. ఆ స్విచ్ బోర్డ్‌కే ఉన్న ఇంకో ప్లగ్‌లో సెల్ ఫోన్ చార్జింగ్ అవుతూంటుంది. వంటింట్లో స్టవ్ వెలుగుతూంటుంది. ఈ లోపు ఆ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ టేబుల్ దగ్గరకు వెళ్తుంది ఫోన్ తీసుకుందామని పిహూ. కాని ఆ టేబుల్ ఈ అమ్మాయికి అందదు. వైర్ పట్టుకొని లాగేసరికి పక్కనే నిలువుగా పెట్టి ఉన్న ఐరన్ బాక్స్ టేబుల్ మీద పడిపోయి కాలుతూంటుంది. బెడ్రూమ్ దగ్గరున్న ఫినాయిల్ క్యాన్‌లో ఫినాయిల్ తెల్లగా కనిపించేసరికి పాలు అనుకొని తన బాటిల్లో పోసుకుంటూంటే మొత్తం ఒలికిపోయి ప్రమాదం తప్పుతుంది పిహూకి. ఇలా ఓ 24 గంటలు ఒక రెండేళ్ల పాప ఆ ఇంట్లో ఎలా గడిపింది.. ఆ వయసుకు తగ్గ స్పృహతో ప్రమాదాల బారినుంచి ఎలా బయటపడింది అన్నదే ఈ సినిమా. 2014లో ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా తీశారు. ఆమె.. తమిళంలో ‘ఆడై’ పేరుతో వచ్చింది. ‘ఆడై’ అంటే ‘దుస్తులు’ అని అర్థం. కథానాయిక కామిని టీవీ యాంకర్. ప్రేక్షకులను బకరా చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటుంది. అలా ఒకరోజు సివిల్స్ మెయిన్స్ పరీక్షకు హాజరవబోతున్న ఓ పేదింటి అమ్మాయినీ బకరా చేస్తుంది. దాంతో ఆ రోజు ఆమె ఆ పరీక్ష రాయలేకపోతుంది. ఆ బాధను, అవమానాన్ని మనసులో పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. తర్వాత కామిని బర్త్‌డే వస్తుంది. ఆ రాత్రి తన సహోద్యోగులతో తమ ఆఫీస్ పాత బిల్డింగ్‌లో పార్టీ చేసుకొని మత్తులో ఒళ్లు తెలియకుండా బాత్రూమ్లో పడిపోతుంది కామిని. మెలకువ వచ్చేసరికి నగ్నంగా ఉంటుంది. బాత్రూమ్లోంచి బయటకు రాగానే సెక్యూరిటీ వాళ్ల అలికిడి వినిపించడంతో నగ్నంగా ఉన్న తన శరీరం వాళ్ల కంటపడకుండా టేబుల్ కింద దాక్కుంటుంది. ఆ పాత బిల్డింగ్‌కి తాళం వేసే ముందు అన్ని అంతస్తులు చెక్ చేసుకుంటూ కామిని ఉన్న అంతస్తుకీ వస్తారు సెక్యూరిటీ వాళ్లు. ఎవరూ లేరని నిర్థారించుకొని తాళం వేసి వెళ్లిపోతారు. బ్యాటరీ చివరి దశలో ఉన్న సెల్‌ఫోన్ తప్ప ఇంకే ఆధారం ఉండదు కామినీకి. ఆ రాత్రి ఏం జరిగిందో.. తన ఒంటి మీద బట్టలు ఎలా మాయమయ్యాయో.. తన కొలీగ్స్ ఎక్కడికి వెళ్లారో.. అంతుచిక్కకపోగా భయమూ మొదలవుతుంది ఆమెకు. బాత్రూమ్లో ఉన్న పేపర్ నాప్కిన్స్ రోల్, క్రైమ్‌సీన్ టేప్‌తో ఒళ్లంతా చుట్టుకుంటుంది. ఫోన్ డెడ్ అవకముందే తన తల్లికి, ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి తను ఉన్న పరిస్థితి చెప్పాలనుకుంటుంది. సిగ్నల్స్ లేక ఫోన్ పోదు. ఈలోపు ఆకలి మొదలవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసుకునేలోపు ఫోన్ డెడ్ అవుతుంది. ఆ విచిత్రమైన స్థితి నుంచి బయటపడ్డానికి 24 గంటలు పోరాడుతుంది. తన కామెన్సెన్స్ను ఉపయోగించి దుస్తులు తెప్పించుకొని, సురక్షితంగా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంది కామిని. ఇంతకీ ఆమెకు అలాంటి దుస్థితి కల్పించింది ఎవరో కాదు కామిని వల్ల సివిల్స్ మెయిన్స్ రాయలేకపోయిన అమ్మాయే. హెలెన్.. మలయాళం సినిమా. కథానాయిక పేరు హెలెన్. అనారోగ్యంతో ఆమె తల్లి చనిపోతుంది. ఆ బాధలో ఉంటాడు తండ్రి. నర్సింగ్ కోర్స్ పూర్తయి కెనడాలో నర్స్ ఉద్యోగం సంపాదించుకునేందుకు కావల్సిన ట్రైనింగ్ తీసుకుంటూంటుంది. పార్ట్‌టైమ్‌గా ఒక మాల్లోని ‘మెక్ డొనాల్డ్స్’లో పనిచేస్తూంటుంది. అజహర్ అని హెలెన్‌కు బాయ్‌ఫ్రెండూ ఉంటాడు. ఒకసారి రాత్రి హెలెన్‌ను ఇంటిదగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూండగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్తాడు అజహర్. దీంతో ఆమె ప్రేమ వ్యవహారం తండ్రికి తెలుస్తుంది. మనసు నొచ్చుకొని హెలెన్‌తో మాట్లాడ్డం మానేస్తాడు. తండ్రిని బాధపెట్టానన్న పశ్చాత్తాపంతో అజహర్‌కి దూరంగా ఉంటుంది హెలెన్. ఈలోపు ఆమెకు కెనడాలో ఉద్యోగం ఖాయం అవుతుంది. వెళ్లేలోపు తండ్రిని క్షమాపణ అడగాలని విశ్వయత్నం చేస్తుంది హెలెన్. కాని తండ్రి మనసు మారదు. ఒక రోజు మాల్ నుంచే తండ్రికి ఫోన్ చేస్తూంటుంది సారీ చెప్పాలని. తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో ఇంటికి వెళ్లాలనిపించక రాత్రి పదకొండున్నర దాకా మాల్లోనే ఉంటుంది. చివరకు పంచ్ చేసి బయలుదేరబోతూంటే కొలీగ్స్ వచ్చి.. ఆహార పదార్థాలు ఇస్తూ ఫ్రీజర్ (గది లాంటిది)లో పెట్టమని చెప్పి బయటకు వెళ్లిపోతారు. పర్స్, సెల్‌ఫోన్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి.. ఆ ఆహారపదార్థాలను తీసుకొని ఫ్రీజర్‌లోకి వెళ్తుంది హెలెన్. అప్పుడే అటువైపు వచ్చిన మేనేజర్ .. ఫ్రీజర్ గదికి తాళంలేకపోవడం చూసి.. తాళం వేసి రెస్టారెంట్ క్లోజ్ చేసి ఇంటిదారి పడ్తాడు. ఫ్రీజర్‌లో బందీ అయిపోతుంది హెలెన్. రాత్రి పదకొండున్నర నుంచి తెల్లవారి అయిదు గంటల వరకు మైనస్ పదిహేడు డిగ్రీల సెంటిగ్రేడ్ చలిలో తనను తాను కాపాడుకోవడానికి అక్కడున్న ప్రతి చిన్న వస్తువునూ ఉపయోగించుకుంటుంది. చివరకు ఫోన్ కాల్ సిగ్నల్స్, వాచ్‌మన్ సమాచారంతో ఆ అమ్మాయిని బయటకు తెస్తారు. మిస్సింగ్ కేసుల్లో అయినవాళ్లు, పోలీసులు ఏఏ కోణాల్లో విచారణ జరపాలో కూడా స్పష్టంగా చూపిస్తుందీ సినిమా. ఏతావాతా.. ఈ మూడు చిత్రాలు ఇచ్చే సందేశం ఒక్కటే. కష్టాల్లో కామన్సెన్స్ను మించిన ఆయుధం ఉండదు అని. స్వేచ్ఛతోపాటు పరిసరాలపట్ల స్పృహ, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, ఆపదల నుంచి గట్టెక్కే తెగువ.. ఆత్మరక్షణాయుధాలు. మార్కులు, ర్యాంకులకన్నా ముఖ్యమైనవి. జీవిత దశను మార్చే దిశలు! -
అనుమానాస్పదం
పుకార్లతో ఊరు అట్టుడుకుంతోంది. పోంచెర్ల టౌన్‌కి నాలుగు కోసుల దూరంలో ఉన్న పల్లెటూరు అది. పేరు చోరదిబ్బ. ఆ పేరు ఎందుకు వచ్చిందోగాని, ఊరికి మూడు వైపులా కుచ్చులబోడు, పలుకుబోడు, కొండలమ్మ చట్టు పేర్లతో ఉన్న గుట్టలు, మరొక వైపు చెరువు, చెరువుకు దగ్గర్లోనే శ్మశానం.పన్నెండువందలకు పైగా గడప. దాదాపు నాలుగు వేల ఓటర్లు ఉన్నా, ఎన్నికలప్పుడు మాత్రమే కనపడతారు నాయకులు. అన్ని ఊర్ల మాదిరిగానే ముసలీ ముతకా, చదువు సరిగా ఒంటబట్టని వారు తప్ప ఇతరులంతా బతుకుతెరువు కోసం దూరాలకు పోతే మిగిలిన వారు మాత్రమే ఉంటున్న ఊరు.ఈ మధ్య వరుసగా జరుగుతున్న సంఘటనలతో ఊరి జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి అయితే చాలు– శ్మశానంలో తెల్లని ఆకారాల సంచారం, మేకలు, కోళ్లు పదుల కొద్దీ మాయం కావడం, వాటి నెత్తురు శ్మశానంలో ఉండటం, ఒక రాత్రివేళ బహిర్భూమికి వెళ్లిన నర్సప్పని ఆ తెల్లని ఆకారాలే తినడానికి ప్రయత్నించడం, చివరికి చెయ్యి విరిగి బతుకు జీవుడా అని బయటపడటం, పూడ్చిన శవం తెల్లారే సరికి బయట పడి ఉండటం. దాదాపు ప్రతిరోజూ శ్మశానంలో పెద్దగా మంటలతో నెగళ్లు..వరుస సంఘటనలు జరుగుతున్నా, వాటి గురించి మాట్లాడుకోవడానికి ఊర్లో ఎవరికీ ధైర్యం చాలడం లేదు. కాలేజీలో చదువుతున్న శౌమిక్, మొహం మాడ్చుకుని ఉన్నాడు. ఎప్పుడూ వదలకుండా చూసే టీవీ నచ్చడం లేదు. పుస్తకాల వైపు చూడబుద్ధి కావడంలేదు. నిజం చెప్పాలంటే ఈ సెలవుల కోసం అతడు ఏడాదంతా ఎదురు చూస్తుంటాడు. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండలూ గుట్టలూ చెరువూ అంటే శౌమిక్‌కి భలే సరదా.కాని ఈసారి ఆ ఊరు రావద్దని, పరిస్థితులు బాగాలేవని ఆ ఊరి నుంచి కబురు. తల్లిదండ్రులు అనుమతి లేకుండా వెళ్లడానికి ఇష్టపడడు. ఊరికి వెళ్లడానికి శౌమిక్ మంకు రెండోరోజు కూడా సాగింది. మొత్తానికి వాళ్ల అమ్మ చెప్పిన వెయ్యి జాగ్రత్తలకు తల ఊపి, ఎట్టకేలకు ఊరికొచ్చాడు.రాత్రి అయింది. ఊరు చడీ చప్పుడూ లేకుండా ఊపిరి బిగపట్టుకుని నిద్రపోతోంది. శ్మశానానికి దగ్గరగా ఉండే వీధుల్లో అయితే ఉత్తరం దిక్కులో ఉండే కిటికీలు ఎప్పుడో భయంతో బిగుసుకుపోయాయి.ఈ పరిస్థితి శౌమిక్‌కు నచ్చడం లేదు. సెలవులు సరదాగా గడుపుదామని వస్తే, ఇక్కడ వింత వింత విషయాలు తెలుస్తున్నాయి. దీని వెనుక ఏదో ఉంది. దాని సంగతి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.చిన్నగా వాళ్ల తాతయ్య దగ్గర చేరి, ‘ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు.వంటగదిలోకి వాళ్ల అమ్మమ్మ ‘ఆ పనీ అయ్యింది. అవతలి బజారులో ఉన్న వెంకటి మామ స్టేషన్‌కి కూడా వెళ్లాడు. కాని ఏమైందో ఏమో, ఆ తర్వాతి రోజే వాళ్లింటి పక్కనే ఉన్న గడ్డివాము తగలబడిపోయింది. ఆ మర్నాడు, ఇంట్లో ఉన్న మేకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకో ఇద్దరు ముగ్గురికీ అలాగే జరిగింది. అది మొదలు మళ్లీ ఎవరూ అలాంటి ఆలోచన కూడా చేయలేకపోయారు.’‘నువ్వు మాత్రం చీకటిపడితే బయటకు వెళ్లొద్దు’ తాతయ్య దాదాపు వార్నింగ్ ఇచ్చాడు.శౌమిక్ అయోమయంగా చూస్తుండిపోయాడు. కాని అతనికి ఒక నమ్మకం. కారణం లేకుండా ఏ పనీ జరగదు. ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.రోజంతా అందరి ఇళ్లకూ వెళ్లడం, కబుర్లాడుతూ సమాచారం సేకరించడం చేయసాగాడు శౌమిక్. సేకరించిన వివరాలన్నీ క్రమ పద్ధతిలో కాగితం మీద రాసుకున్నాడు.ఊరికి ఈ ఆరు నెలల్లో కొత్తగా వచ్చిన వాళ్లు, ఇప్పటి వరకు వేరే చోట ఉండి ఊరికి వచ్చిన వాళ్ల వివరాలు... ఈ సంఘటనలు ఫలానా రోజు నుంచి జరుగుతున్నాయని చెప్పలేం గాని, ఆరు నెలల లోపే.. నర్సప్పను మినహా మరెవరినీ గాయపరచిన దాఖలాల్లేవు. శ్మశానంలో రెండు తెల్లని ఆకారాలు మాత్రం చాలామందికి కనిపించాయి. శ్మశానంలో మంటలు మాత్రం దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి.ఇంత జరుగుతున్నా ఎవరూ పోలీసులకు గాని, మీడియాకు గాని ఉప్పందించలేదు. అలా చేద్దామని చూసిన ఇద్దరి ముగ్గురి కళ్లాల్లో అగ్నిప్రమాదాలు, ఇళ్లలోని పశువుల మరణంలాంటివి జరిగి ఆర్థికంగా నష్టపోయారు. ఊళ్లో కొంత మంది ఈ మధ్య కాలంలోనే కాస్త స్థితిపరులుగా మారినట్లు కనిపిస్తోంది. వాళ్ల ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు వంటి వస్తువులు కనిపిస్తున్నాయి.ఇంకా ఎక్కడో లింక్ మిస్సయినట్లే అనిపిస్తోంది శౌమిక్‌కి. తన వయసు వారిని కూడగట్టుకుని గుట్టల వైపు, చెలక పొలాల వైపు ఇదివరకటి మాదిరిగానే పగలల్లా తిరగసాగాడు. అప్పుడు వచ్చింది అనుమానం.ఒకరోజు ఇంటికి రాగానే చేతిలో ఉన్నవి చూపించి– వాళ్ల తాతతో మాట్లాడాడు. తర్వాత బోటనీ లెక్చరర్‌కు ఫోన్ చేసి, చాలాసేపు మాట్లాడాడు.మరుసటి రోజే శౌమిక్, మరికొంతమంది క్రికెట్ బ్యాటు, బంతి తీసుకుని శ్మశానం వైపు వెళ్లారు. చెరువుకు దగ్గర్లో ఉన్న మైదానంలో ఆడుకున్నారు. చెరువుకు కొద్ది దూరంలో చిన్నపాటి డ్రమ్ములు కనిపించాయి శౌమిక్‌కు. తనతో ఉన్నవారిని అవేమిటని అడిగితే, ‘ఏమో, చేప పిల్లలను తెచ్చి చెరువులో పోసినప్పటివి అయి ఉంటాయి’ అని అన్నారు.అతనికి అనుమానం బలపడింది. పరిసరాలన్నీ నెమ్మదిగా పరిశీలిస్తూ శ్మశానంలోకి నడిచాడు.ఇంతలో అటుగా వస్తున్న ఒకతను ‘ఎవర్రా! ఏం కావాలి?’ కరకుగా అడిగాడు.‘రమణన్నా! మా దోస్తేలే’ అంటూ ఆడుతున్న పిల్లల్లో నుంచి అరిచారెవరో.‘అవునా! ఏంపేరు? ఎవరింటికి వచ్చావు?’ అడిగాడు.సమాధానం చెబుతూ, అతని వాలకం గమనిస్తూ వెనుదిరిగాడు.ఇంటికి వస్తూనే అమ్మమ్మను రమణ గురించి అడిగాడు.బొంబాయిలో ఉంటున్న రమణ ఏడాది కిందటే ఊరికి తిరిగొచ్చాడు. ఒక్కడే ఉంటాడు. కొన్నేళ్ల కిందట దొంగతనం చేసినందుకు రమణ కులం వాళ్లను ఊరి వాళ్లు వెలివేశారు. అప్పడు వెళ్లిపోయిన తర్వాత రమణ ఒక్కడే ఊరికి వచ్చాడు. తల్లీదండ్రీ చనిపోయారని, తన కులంలో మిగిలిన వాళ్ల సంగతి తెలియదని చెప్పాడు. వచ్చినప్పటి నుంచి ఊర్లో అందరితో మంచిగా ఉంటూ గ్రామస్తులతో కలిసిపోయాడు. శ్మశానం వైపు వచ్చే వాళ్లకు అక్కడ జరిగే సంగతులు చెప్పి, జాగ్రత్తలు చెబుతూ ఉంటాడని చెప్పింది అమ్మమ్మ. ఆ రోజు కూడా శౌమిక్ లెక్చరర్తోను, మరెవరితోనో చాలాసేపు మాట్లాడాడు.శౌమిక్ వచ్చి చాలా రోజులైంది. మరో నాలుగు రోజుల్లో సెలవులైపోతాయి. ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. పక్కింటి నుంచి అమ్మమ్మ ఇంట్లోకి వస్తూనే ‘ఏమయ్యోవ్! పోలీసులు వచ్చి వెంకటిని ఇంకొంతమందిని పట్టుకుపోయారటగా’ అంది.‘అవునా! ఎవరెవరిని పట్టుకున్నారు?’శౌమిక్ ఊపిరి బిగపట్టి వింటున్నాడు.‘వెంకటి, బొంబాయి రమణ, నర్సింహ..’ అంటూ లిస్టు చెప్పింది.రెండో రోజు ఉదయం పది గంటలవుతోంది. బయటి నుంచి కేకలు వినపడ్డాయి. ‘వీరాస్వామిగారూ! మిమ్మల్ని పోలీసులు రమ్మంటున్నారు. పంచాయతీ ఆఫీసు దగ్గరకు త్వరగా రండి. ఇంకా కొంతమందిని పిల్చుకు రావాలి’ గ్రామ పంచాయతీ బంట్రోతు కేకేశాడు.‘పోలీసులా? వాళ్లకు నాతో ఏం పని?’ కంగారు గొంతుతో అంటూ చెప్పులేసుకుని బయల్దేరాడు. తాతయ్యతో కలసి శౌమిక్ కూడా బయల్దేరాడు.దాదాపు ఊరు ఊరంతా పంచాయతీ ఆఫీసు దగ్గర చేరింది. సర్పంచితో పాటు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. శౌమిక్ను చూస్తూనే ఎస్సై పిలుస్తూ, ‘మీరే కదా శౌమిక్’ అనగానే తలూపాడు. పిలిచి పక్కన కూర్చోమని సైగ చేశాడు.ఎస్సై లేచి నిలబడి గొంతు సవరించుకున్నాడు. అంతా నిశ్శబ్దం అయింది.‘గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా పోలీసులకు తెలియజేయడం మీ బాధ్యత. ప్రతిచోటా, ప్రతిక్షణం పోలీసులు ఉండలేరు. ప్రతి పౌరుడూ పోలీసులాంటి వాడే. ఊరికి కొత్తగా, అనుమానాస్పదంగా ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయడం మీ బాధ్యత. మా డిపార్ట్మెంట్లోనూ మీ గ్రామ పోలీసులాంటి అవినీతిపరులు ఉండే అవకాశం ఉంది. వారి స్పందన సరిగా లేనప్పుడు పై అధికారులకు ఆ విషయం తెలియజేయాలి. అలాగే, ఇంకొకరు ఫిర్యాదు చేయకుండా చేసేందుకు అతి తెలివి ప్రదర్శించి, వారి గడ్డివాములను వారే తగలబెట్టుకుని, వారి పశువులను వారే చంపుకొని నేరస్తులకు సాయపడ్డ వెంకటిలాంటి వాళ్లూ మీ మధ్యలోనే ఉంటారు’ ఎస్సై రుమాలుతో ముఖం తుడుచుకుంటూ కొనసాగించాడు.‘శౌమిక్ చూపిన చొరవ వల్ల ఒక నేర వ్యవస్థ పట్టుబడింది. ఈ విషయాలు శౌమిక్ చెబితేనే బాగుంటుంది’ అంటూ శౌమిక్ వైపు చూశాడు ఎస్సై.శౌమిక్ లేచాడు. ‘నేను ఇక్కడికి వచ్చే ముందే అమ్మమ్మ తాతయ్య వాళ్ల నుంచి కొంత సమాచారం తెలిసింది. అందుకే నేను ఇక్కడికి రావడానికి మా అమ్మవాళ్లు ముందు ఒప్పుకోలేదు. అయినా పట్టుపట్టి ఇక్కడకు వచ్చాక జరుగుతున్న, జరిగిన సంఘటనలు తెలుసుకున్నాక, వీటి వెనుక ఏదో అనుమానాస్పద నేపథ్యం ఉందనిపించింది. సమాచారం సేకరించడం మొదలుపెట్టా. ఈ ఆరు నెలల్లో ఊరికి కొత్తగా వచ్చిన వారెవరని ఆరా తీస్తే, సస్పెక్ట్ రమణ అనిపించింది. ఏడాది కిందట ఒకటి రెండు సార్లు ఊరికి వచ్చి వెళ్లాడు. ఆ రమణకు, పుల్లయ్య కూతురు మంగతో సావాసం కలిసింది. రోజూ రాత్రి శ్మశానం కనబడే తెల్లని ఆకారాలు వాళ్లే’‘మంగా’ అంతా ఉలిక్కిపడ్డారు.‘శ్మశానానికి దగ్గర్లోనే ఉన్న పుల్లయ్య కూతురు మంగ, పెళ్లయిన కొద్దికాలానికే భర్తను కోల్పోయి ఇంటికి చేరింది. నెలకోసారైనా హిస్టీరియాతో బాధపడే మంగకు ఈ మధ్య కాలంలో హిస్టీరియా రాలేదు’ అందరికీ మంగ విషయాలు గుర్తుకొచ్చాయి. జనం మధ్యలోనే ఉన్న పుల్లయ్య తెల్లమొహం వేసి నిలుచున్నాడు.ఎస్సై మధ్యలో అందుకుని, ‘నర్సప్పను చంపబోయిందీ, గాయపరచిందీ వీరే. ఎవరూ అటువైపు రాకుండా ఉండేందుకే అలా చేశారు. నర్సప్ప తప్పించుకున్నాడు గాని, లేకపోతే అతన్ని చంపేవాళ్లు. ఆ భయం కొనసాగించడానికి ఇళ్లల్లో కోళ్లు, మేకలు ఎత్తుకెళ్లి చంపి తినేవాళ్లు. రమణ మిత్రులు రోజూ రావడం, రాత్రిపూట వీలైనంత వరకు పని చేయడం, తెల్లారక ముందే వెళ్లిపోవడం చేసేవాళ్లు. వాళ్లని కూడా పట్టుకున్నాం’ ‘మరి శ్మశానంలో వాళ్లకేం పని?’ ఎవరో సందేహం వెలిబుచ్చారు.‘గంజాయి నుంచి మార్ఫిన్ వంటి మత్తు పదార్థాలు తయారు చేస్తారు. గంజాయిని వేడి నీటిలో ఉడికిస్తారు. అదే మీరు శ్మశానంలో చూసిన మంటలు. వేడి నీటికి సున్నపు పొడి కలిపితే మార్ఫిన్ తప్ప మిగిలిన పదార్థం గట్టి పడుతుంది. ఆ తర్వాత మిగిలిన ద్రావణానికి అమోనియం క్లోరైడ్ కలిపితే మార్ఫిన్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియకు పెద్ద డ్రమ్ముల్లాంటివి కావాలి. అవే మీరు చెరువు దగ్గర చూసిన డ్రమ్ములు. నీరు అధికంగా కావాలి కాబట్టి చెరువుకు దగ్గర్లోని శ్మశానాన్ని ఎంచుకున్నారు. వంద కిలోల గంజాయి నుంచి పది కిలోల మార్ఫిన్ దొరుకుతుంది’ వివరించాడు శౌమిక్.‘మరి శవం సంగతో?’ మరొకరు అన్నారు.‘మీరు చీకటి పడుతుందన్న భయంతో సరిగా పూడ్చకపోవడం వల్ల బహుశ నక్కలు మట్టిని తోడి శవాన్ని బయటకు ఈడ్చుకొచ్చి ఉంటాయి. కాకపోతే అది నేరస్తులకు అడ్వాంటేజీ అయ్యింది.’ అన్నాడు ఎస్సై.ఎప్పటికప్పుడు తనకు సూచనలు ఇస్తూ సహకరించిన తన లెక్చరర్‌కు, పోలీసు వారికి శౌమిక్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘మీలాంటి బాధ్యతగా ఉండే యువకులుంటే మాకు పెద్దగా పనేమీ ఉండదు’ అంటూ అతడి భుజం తట్టాడు ఎస్సై. -
అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న రాక్షస పాలనను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట గురువారం ధర్నాలు జరిగాయి. ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలబడ్డ వారిపై కేసులు పెట్టడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు పెట్టకుండా ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌పై కేసు నమోదు చేయ డం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను తరలించడం అన్యాయమని, డాక్టర్లు సైతం ఇదే విషయం చెప్పినా.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనన్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లం గోళ్ల శ్రీలక్ష్మి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, నగర శాఖ అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నాలు జరిగాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. పెంటపాడులోనూ ధర్నా జరిగింది. ఆకివీడులో ఉండి నియోజకవర్గ కన్వీనర్ పాతపాటి సర్రాజు ధర్నాలో పాల్గొన్నారు. కొవ్వూరులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో పార్టీ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలవరం నియోజకరవర్గంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు నేతృత్వంలో పలుచోట్ల ధర్నాలు జరిగాయి. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు నేతృత్వంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గోపాలపురం వైఎస్సార్ జంక్షన్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు ప్రధాన కూడలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి, పెనుమంట్రలో ధర్నా చేశారు. ఉంగుటూరులో మోటార్ సైకిల్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు పాల్గొన్నారు. -
కబళించిన మృత్యువు
విద్యుదాఘాతానికి యువకుడి బలి కైకరం(ఉంగుటూరు): మృత్యువు శుక్రవారం ముగ్గురిని కబళించింది. కైకరంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కైకరంలోని ఓ ఇంటికి కూలి పనికి వెళ్లిన చింతాడ నూకరాజు(31) విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో బంధువులు నూకరాజుకు స్థానిక పీఎంపీ వైద్యశాల వద్ద ప్రాథమిక చికిత్స చేయించి, అక్కడి నుంచి నారాయణపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించటంతో తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నూకరాజు మృతి చెందాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ.. మొగల్తూరు : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన శుక్రవారం మొగల్తూరులో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్ ఎదురుగా నివాసం ఉంటున్న బండి సత్తెమ్మ(65) తన ఇంటి ముందు శుక్రవారం వేకువ జామున కళ్లాపు చల్లుతుండగా, వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను ఢీకొని కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మరణించింది. దీనిపై పోలీసు కేసు పెట్టడం ఇష్టం లేక కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధ్రువ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ ముందు వందలాదిమంది ప్రేక్షకులు ఉన్నా.. ఎవరూ ప్రమాదాన్ని గమనించకపోవడం విశేషం. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టి.. భీమవరం టౌ¯ŒS : స్థానిక ప్రకాశంచౌక్ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఒక ఆక్వా కంపెనీకి చెందిన వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ కోరగా సమాచారం ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్నారు.