సామ్రాజ్య భారతి 1940,1941/1947 | Azadi Ka Amrit Mahotsav Incidents Law And Birth | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి 1940,1941/1947

Published Fri, Aug 12 2022 6:41 PM | Last Updated on Fri, Aug 12 2022 6:41 PM

Azadi Ka Amrit Mahotsav Incidents Law And Birth - Sakshi

ఘటనలు:

  • లాహోర్‌ సమావేశంలో ఆలిండియా ముస్లిం లీగ్‌ ‘పాకిస్థాన్‌ తీర్మానం’. ప్రత్యేక పాకిస్థాన్‌ కోసం తొలిసారి జిన్నా డిమాండ్‌.
  • రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు ఇండియా మద్దతు ఉపసంహరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపుపై దేశవ్యాప్త సత్యాగ్రహాలు. వారిలో అరెస్ట్‌ అయిన తొలి సత్యాగ్రహి వినోభా భావే.
  • విశాఖపట్నంలో సింధియా షిప్‌యార్డ్‌ (నేటి హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌) కు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ శంకుస్థాపన. 

చట్టాలు:
డ్రగ్స్‌ అండ్‌ కాస్మటిక్స్‌ యాక్ట్, ఢిల్లీ రిస్ట్రిక్షన్‌ ఆఫ్‌ యూజస్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యాక్ట్, బేరర్‌ ‘లా’ స్‌ యాక్ట్‌ 

జననాలు:
మురళీమోహన్‌ : నటుడు (చాటపర్రు); రాజేంద్ర కె. పచౌరి : ఆర్థికవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త (నైనిటాల్‌); అంజాద్‌ ఖాన్‌ : నటుడు, దర్శకుడు (బాంబే); శరద్‌ పవార్‌ : రాజకీయనేత (బారామతి, మహారాష్ట్ర); ఎ.కె.ఏంటోనీ : రాజకీయనేత (కేరళ); కె.జె.జేసుదాస్‌ : గాయకులు (కొచ్చి); కృష్ణంరాజు : నటుడు (మొగల్తూరు); వీరప్ప మొయిలీ : రాజకీయనేత (కర్ణాటక); నజ్మా హెప్తుల్లా : రాజకీయనేత (భోపాల్‌); గోవింద్‌ నిహలానీ : సినీ దర్శకులు (పాకిస్థాన్‌); జి.ఎం.సి. బాలయోగి : రాజకీయనేత (తూ.గో.); యామిని కృష్ణమూర్తి : నృత్యకారిణి (మదనపల్లి); వరవరరావు : (వరంగల్‌); జగ్‌మోహన్‌ దాల్మియా : క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ (కలకత్తా).
మణిశంకర్‌ అయ్యర్‌ : రాజకీయనేత (లాహోర్‌); భారతీరాజా : తమిళ దర్శకులు (మదురై); మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ : క్రికెటర్‌ (భోపాల్‌);
అరుణ్‌శౌరీ : జర్నలిస్ట్, రాజకీయనేత (జలంధర్‌); ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ : సినీ దర్శకులు (కేరళ); వై.వేణుగోపాల్‌ రెడ్డి : ఆర్థికవేత్త (కడప); ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ : రాజకీయనేత (ఉడుపి).  

(చదవండి: చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్‌ బూర్కి వైట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement