సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘటనలు ‘ప్రభుత్వ ప్రాయోజిత హింస’గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీజేపీ విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. శనివారం శాసనమండలిలో ‘రాష్ట్రంలో గిరిజన సంక్షేమం– పోడుపట్టాల పంపిణీ’పై లఘుచర్చలో కవిత మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య గొడవ పెట్టి ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని ఆరోపించారు.
అన్ని జాతులు బాగుపడాలని తెలంగాణ కోరుకుంటుంటే.... విభజించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలో కనిపిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పూర్తిగా గిరిజన హక్కులను హరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో అమలు చేసిన వాటిని కేంద్రం అనుకరిస్తోందని కవిత వ్యాఖ్యానించారు. గిరిజనులకు కేటాయించిన నిధులను వంద శాతం వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను రూపొందిస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment