రుషికొండ బీచ్‌లో ఢీకొట్టిన రెండు స్పీడ్ బోట్లు
అల్లూరి సీతారామరాజు: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో నడి సంద్రంలో పెనుప్రమాదం తప్పింది. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ టూరిజం నిర్వహిస్తున్న స్పీడ్ బోటులో 8 మంది పర్యాటకులు గురువారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. అదే సమయంలో ఓ ప్రైవేటు బోటులో ఐదుగురు షికారుకు వెళ్లారు.
ఈ క్రమంలో అతి వేగంగా వస్తున్న ప్రైవేటు స్పీడ్ బోటు ఏపీ టీడీసీ స్పీడ్ బోటును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రైవేటు బోటు పూర్తిగా టూరిజం బోటు క్రిందకు చొచ్చుకుని పోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు పర్యాటకులు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. అయితే వీరు లైఫ్ జాకెట్ల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి చదవండి: ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..!
Comments
Please login to add a commentAdd a comment