sea area
-
నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్కసారిగా..
అల్లూరి సీతారామరాజు: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో నడి సంద్రంలో పెనుప్రమాదం తప్పింది. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ టూరిజం నిర్వహిస్తున్న స్పీడ్ బోటులో 8 మంది పర్యాటకులు గురువారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. అదే సమయంలో ఓ ప్రైవేటు బోటులో ఐదుగురు షికారుకు వెళ్లారు. ఈ క్రమంలో అతి వేగంగా వస్తున్న ప్రైవేటు స్పీడ్ బోటు ఏపీ టీడీసీ స్పీడ్ బోటును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రైవేటు బోటు పూర్తిగా టూరిజం బోటు క్రిందకు చొచ్చుకుని పోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు పర్యాటకులు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. అయితే వీరు లైఫ్ జాకెట్ల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి చదవండి: ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..! -
ప్రాణాల మీద ఆశ.. నడి సంద్రంలో 12 గంటల పాటు మృత్యు పోరాటం
పిఠాపురం: ప్రాణాల మీద ఆశ అతడిలో మనోధైర్యాన్ని తట్టి లేపింది. ఎలాగైనా బతకాలనే పట్టుదల నడి సంద్రాన్ని ఎదురీదేలా చేసింది. 12 గంటల పాటు సముద్రంలో ఆ మత్స్యకారుడు చేసిన సాహసమే అతడి ప్రాణాలను రక్షించింది. ఈ సంఘటన కాకినాడ సమీపంలో నడి సంద్రంలో జరిగింది. దీనికి సంబంధించి తోటి మత్స్యకారులు తెలిపిన వివరాలివీ.. కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పలువురు కాకినాడ శివారు రేపూరుకు చెందిన గేదెల అప్పారావుతో కలిసి బోటుపై మంగళవారం రాత్రి సముద్రంలో వేటకు వెళ్లారు. కాకినాడ తీరానికి సుదూర సముద్రంలో రాత్రి 8 గంటలకు చేపల కోసం సముద్రంలో వల వేసి బోటులో అందరూ పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అందరూ లేచి చూసేసరికి అప్పారావు కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని ఉప్పాడ, అంతర్వేదిలో తోటి మత్స్యకారులకు చెప్పగా వారు మరో బోటుపై వెళ్లి అప్పారావు కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఇంతలో అంతర్వేది తీరం నుంచి చిన్న తెప్పపై చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు నడి సంద్రంలో ఓ వ్యక్తి తేలియాడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని తమ తెప్పలోకి ఎక్కించుకోగా కొన్ని క్షణాల్లోన్నే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మత్స్యకారుల సపర్యలు.. దీంతో తోటి మత్స్యకారులు అతడి గుండెలపై బలంగా గుద్ది తాగిన నీటిని కక్కించి సపర్యలు చేయడంతో అతడిలో కదలికలు వచ్చాయి. వెంటనే అతడిని అంతర్వేది వద్ద ఒడ్డుకు చేర్చి 108లో రాజోలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని అప్పారావుగా గుర్తించారు. కాగా, చేపల కోసం వల వేసి అందరూ పడుకున్నాక తాను బహిర్భూమికి వెళ్లానని, ఇంతలో బోటు కదలడంతో ప్రమాదావశాత్తు సముద్రంలో పడిపోయానని అప్పారావు చెప్పాడు. 12 గంటల పోరాటం.. ఎంతసేపు ఈత కొట్టినా బోటు కనిపించకపోవడం..సముద్ర ఒడి ఎక్కువగా ఉండటంతో అలా ఈదుకుంటూ వచ్చానని తెలిపాడు. ఓపిక ఉన్నంత వరకు ఈదుకుంటూ తీరం వైపు వెళుతున్న తనకు ఎండ ఎక్కడంతో ఓపిక తగ్గిపోయిందని.. దీంతో మునిగిపోకుండా తానున్న స్థలంలోనే పైకి తేలి ఉండే విధంగా ప్రయత్నం చేశానని చెప్పాడు. 12 గంటల శ్రమ అనంతరం చివరకు తనకు దూరంగా ఒక తెప్ప కనిపించడంతో చేతులు పైకి ఊపుతూ రక్షించమని అడిగానని..ఆ తెప్పలో ఉన్నవారు తనని కాపాడారని అప్పారావు చెప్పాడు. ఇది కూడా చదవండి: 'ఫ్యామిలీ డాక్టర్' పథకంతో మంచి ఫలితాలు.. ఆరేళ్లు దాటాక కూడా ప్రత్యేక శ్రద్ద -
20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువ. రెండు అడుగుల వెడల్పు.. 50 కిలోల వరకూ బరువు పెరిగే ఈ తాబేలు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరానికి వస్తాయి. దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆడా.. మగా నిర్ధారించేది ఉష్ణోగ్రతలే ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 30 నుంచి 32 డిగ్రీల మధ్య పుట్టిన తాబేలు ఆడ తాబేలు అవుతుంది. అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టే పిల్లలు మగ తాబేళ్లు అవుతాయి. సృష్టిలో ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫలదీకరణ కోసం వస్తుంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇసుకలో 30 నుంచి 45 సెం.మీ. లోతున కుండాకారంలో గొయ్యి తీసి.. 60 నుంచి 120 వరకూ గుడ్లు పెడతాయి. గొయ్యి తీసేదగ్గర నుంచి గుడ్లు పెట్టడానికి 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ గుడ్లు 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలు బయటకొస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు.. చేపల సంతానం వృద్ధి చెందేందుకు తాబేలు ఎంతగానో దోహదపడుతుంది. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేలు తినడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటుంది. అవి నీటిలో పైకి, కిందకు రావడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా పర్యావరణానికి తాబేలు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు పెడుతున్న తాబేలు, నాగాయలంక మండలం ఐలాండ్ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేలుని రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒకటి, నిజాంపట్నం, సూర్యలంక వద్ద రెండు హేచరీలను ఏర్పాటు చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిధిలో 12,624 గుడ్లను సేకరించినట్టు అధికారులు చెప్పారు. తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే వలలు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై మత్స్యశాఖ అధికారులతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కంటే గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. – కేవీఎస్ రాఘవరావు, ఫారెస్ట్ అధికారి, అవనిగడ్డ రేంజ్ -
సముద్రంలో చదరంగం.. 60 అడుగుల లోతుకు డైవ్ చేసి
కొరుక్కుపేట: చెన్నైలో 44వ చెస్ ఒలంపియాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్ ఆడారు. అరవింద్ తరుణ్ శ్రీ అనే టెంపుల్ అడ్వెంచర్స్ డైవింగ్ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఆదివారం ఈ ఘనత సాధించారు. స్థానిక నీలంకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్ చేశారు. పావు గంటకు ఓ గేమ్ చొప్పున రెండు గంటల పాటు చెస్ ఆడారు. ఇందుకోసం ప్రత్యేకమైన చెస్ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాలకోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట. -
షార్క్‌తో ఓవరాక్షన్.. చావు తప్పి కన్ను లొట్టబోవడమంటే ఇదే!
ప్రకృతిలో కొన్ని జీవరాశులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచింది. ఓవరాక్షన్‌కు పోయి ఎక్స్‌ట్రాలు చేస్తే ప్రాణాలు పోవచ్చు లేకపోతే గాయాలైనా కావచ్చు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, సముద్రంలోని ఓ పడవలో ఒక ఫ్యామిలీ పర్యటిస్తోంది. ఈ క్రమంలో సముద్రంలో ఓ చిన్న సొరచేప(షార్క్)ను నీటిలో వదిలే క్రమంలో అతను ఓవర్‌గా బిహేవ్ చేశాడు. చేపను గట్టిగా నీటిలో అటు ఇటు తిప్పాడు. దీంతో, తిక్కరేగిన సోర చేపకు.. కోపం వచ్చి అతడిని నోటితో గాయపరిచింది. అతడి చేతిని షార్క్ కొరికే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అతడి వేలుకు తీవ్రగాయమైంది. చేతి నుంచి రక్తం కారడం వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్చేస్తున్నారు. ఓ నెటిజన్.. అతడు మరోసారి ఈ తప్పు చేయడు అని కామెంట్ చేశాడు. we would’ve had shark steaks the same night 😅 pic.twitter.com/GDKZCCUgTC — SourPatchB🪬 (@ButtahCuupB) July 20, 2022 -
నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?
భూమి ఉపరితలంపై 70 శాతం ఆవరించి ఉన్నవి సముద్రాలే. పైకి సింపుల్‌గా కనిపిస్తున్నా.. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితులు, అసలు సూర్యరశ్మి సోకని నిండు చీకట్లో బతికే జీవులు.. వంటి విచిత్రాలెన్నో. అంతేకాదు సముద్రాల్లో పరిశోధనలతో గ్రహాంతర జీవం (ఏలియన్ల) గుట్టునూ తేల్చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద సముద్రాలేమిటి, ఏలియన్ల గుట్టు ఏమిటి అన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. మనకు తెలిసింది కొంచెమే! మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా.. అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినా.. ఇప్పటివరకు సముద్రాల్లో జీవం, అడుగున పరిస్థితుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. భూమ్మీద ఉన్న మొత్తం సముద్ర భాగంలో 80 శాతం మేర ఏముందో, ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఏమిటో అన్నది ఇప్పటివరకు తెలియకపోవడం గమనార్హం. మన సముద్రాల అడుగున భూమి కంటే.. చంద్రుడి ఉపరితలం, అంగారకుడి నేల గురించి మనకు ఎక్కువ తెలుసని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. ఏలియన్లకు లింకేంటి? అసలు గ్రహాంతర జీవం గురించిన ఆనవాళ్లు సముద్రాల్లో ఉండవచ్చని ఎప్పటి నుంచో వాదనలున్నాయి. ఎందుకంటే భూమిపై 70 శాతానికిపైగా సముద్రాలు, మరో 10 శాతం మేర అంటార్కిటికా, ఆర్కిటిక్ వంటి మంచుతో మునిగి ఉన్న ప్రాంతాలే ఉన్నాయి. ఏలియన్లు గానీ, గ్రహాంతర జీవ పదార్థాలుగానీ భూమ్మీదికి వస్తే.. సముద్రాల్లో పడే అవకాశాలే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు భూమ్మీద జీవానికి మూలం గ్రహశకలాలు, తోక చుక్కల నుంచి వచ్చిన సేంద్రియ పదార్థాలే కారణమనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ‘ర్యుగు’ అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్) నుంచి తెచ్చిన మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా.. అవే పదార్థాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలకూ చేరే అవకాశాలూ ఎక్కువే. అంటే.. వాటిలోనూ ఎక్కడో జీవం అభివృద్ధి చెంది ఉండొచ్చని అంచనా. ఇక సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న పలు ఉపగ్రహాల (ఆ గ్రహాలకు చందమామలు)లో ఉండే వాతావరణాన్ని పోలిన పరిస్థితులు.. భూమ్మీద సముద్రాల అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అత్యంత చల్లగా, తీవ్ర ఒత్తిడి (ప్రెషర్)తో కూడిన ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయని తేల్చారు. ఈ లెక్కన సదరు ఉపగ్రహాల్లో కూడా జీవం మనగలదని.. మన సముద్రాల అడుగున పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే.. గ్రహాంతర జీవుల గుట్టు కనుగొనడం సులువని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హడల్ జోన్.. గురుడి ఉపగ్రహం ‘యురోపా’లా.. గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఒకటైన యురోపాపై.. దట్టమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అచ్చంగా.. మన భూమ్మీది సముద్రాల అడుగున ‘హడల్ జోన్’ను పోలి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ జీవంపై పరిశోధనలు చేస్తే.. యురోపాపై జీవం ఉండే అవకాశాలు, ఉంటే ఎలా ఉండొచ్చన్న వివరాలు తెలుస్తాయని వారు చెప్తున్నారు. సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే హడల్ జోన్లో జీవం మనుగడ కష్టం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి. ప్రయోగాలు మొదలెట్టిన నాసా.. సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితులపై నాసా ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయనుంది. చంద్రుడిపైకి నాసా ‘వైపర్’ మంచు, దాని అడుగున నీటిలో (సబ్ సీ) ప్రయాణిస్తూ, పరిశోధన చేయగల రోవర్ ‘వైపర్’ను నాసా వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు, నీటి జాడ గుట్టును ‘వైపర్’ తేల్చనుంది. దీని పనితీరును భూమిపై సముద్రాల్లో పరిశీలిస్తున్నారు. ఆ నీటి అడుగున చిత్రాలెన్నో.. ► సౌర కాంతి సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలదు. తర్వాత ఒక కిలోమీటర్ వరకు స్వల్పంగా ఉంటుంది. అంటే మసక చీకటిలా ఉంటుంది. అంతకన్నా లోతున అంతా చిమ్మ చీకటే ఉంటుంది. ► గత ఏడాది అమెరికా తీరానికి సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో అత్యంత అరుదైన భారీ ‘ఫాంటమ్ జెల్లీఫిష్’ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో అవి జీవిస్తుంటాయని తేల్చారు. ►నాలుగైదు కిలోమీటర్ల లోతులో సముద్రపు నేలపై ‘హైడ్రో థర్మల్ వెంట్స్ (వేడి నీరు, పొగను వెలువరించే బిలాలు)’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నుంచి వెలువడే వేడి, సేంద్రియ రసాయనాల ఆధారంగా.. అంత లోతులో కూడా కొన్నిరకాల జీవులు బతుకుతున్నట్టు తేల్చారు. ► మంచుతో కప్పిఉన్న ఉపగ్రహాల్లోనూ ఇలాంటి ‘హైడ్రో థర్మల్ వెంట్స్’ ఉంటే.. జీవానికి అవకాశాలు ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. -
‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. తుపాను కారణంగా ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు అన్నారు. ఆ రథం మయన్మార్ దేశానిది.. సముద్ర తీరానికి చేరిన స్వర్ణరథం మయన్మార్ దేశానికి చెందినదిగా గుర్తించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బుధవారం తహసీల్దార్ చలమయ్య, భావనపాడు మెరైన్ సీఐ దేవుళ్లు, నౌపడ ఎస్ఐ ఐ.సాయికుమార్ తీరానికి చేరిన రథాన్ని పరిశీలించారు. రథంపై ఉన్న భాషను గూగుల్‌లో శోధించగా మయన్మార్ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్‌దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదని మెరైన్ సీఐ చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Global Warming: నరక కూపం.. బతుకులు ‘పిట్ట’ల్లా రాలిపోవడమే!
ప్రకృతి ఎంత అందమైనదో.. తేడాలొస్తే అంతే వికృతమైంది కూడా. ముప్పు ఏ రూపంలో ముంచుకొచ్చినా.. కనుచూపు మేర జీవరాశిని వదలకుండా మింగేస్తుంటుంది. అలా గ్లోబల్ వార్మింగ్ అనే ముప్పు.. చాప కింద నీరులా విస్తరించేసింది ఇప్పటికే. అందుకు ప్రత్యక్ష సాక్క్ష్యం.. సముద్రపక్షుల జనాభా ఊహించని రేంజ్లో తగ్గిపోవడం. సముద్ర తీరాన్ని ఆవాసంగా చేసుకున్న పక్షులకు.. ఆ తీరమే ఇప్పుడు నరక కూపంగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, ఆహార కొరత, భయానక వాతావరణ మార్పులు.. సముద్ర పక్షుల జనాభాను గణనీయంగా పడగొట్టేస్తోంది. వీటికి తోడు పక్షుల్లో సంతానోత్పిత్తి సామర్థ్యం తగ్గిపోతుండడం కలవరపెడుతోంది. ఫసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవులు, బ్రిటిష్ ఐలెస్, మైన్ కోస్ట్ వెంట పక్షులు రాలిపోతున్నాయి. గుడ్లు పొదిగిన పక్షులు.. పిల్లల ఆకలి తీర్చలేక, మరోవైపు ఆకలికి తట్టుకోలేక అక్కడి నుంచి తరలిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో పిల్ల పక్షుల ప్రాణాలు పోతున్నాయి. గూడు కట్టడంలో ఇబ్బంది కామన్ ముర్రే, కాస్సిన్స్ అవుక్లెట్ జాతి పక్షుల జనాభా దారుణంగా పడిపోయింది. ఆహారం దొరక్కపోవడం, సముద్ర మట్టం పెరగడం, వానలు, తరచూ వచ్చే తుపాన్లు.. ఇలాంటి కారణాలు వాటి జనాభాను తగ్గించేస్తున్నాయని ప్రకటించింది వైల్డ్‌లైఫ్ సర్వీస్ సంస్థ. ►20 శతాబ్దం మధ్య నుంచి 70 శాతం సీబర్డ్ పాపులేషన్ తగ్గిపోయిందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. ►అయితే ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మాగెల్లనిక్ పెంగ్విన్ మనుగడ కొనసాగిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. ►1991 నుంచి సౌతాఫ్రికా తీరం వెంట మూడొంతుల సముద్రపక్షులు తగ్గిపోతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ►చేపల సంఖ్య తగ్గిపోతుండడం కూడా పక్షుల సామూహిక మరణాలకు ఓ కారణం. ►2010లో పశ్చిమ తీరం వెంట కామన్ ముర్రేస్ గుట్టలు కొట్టుకురావడం చూసిందే. ►మైన్ తీరం వెంబడి ఉండే ఐకానిక్ సీబర్డ్, అట్లాంటిక్ ఫఫ్ఫిన్లు.. సంతానొత్పత్తి తగ్గడం, ఆహార కొరతతో నరకం అనుభవిస్తున్నాయి. ►అలస్కా, చుగాచ్ నేషనల్ ఫారెస్ట్ దగ్గర్లోని బీచ్ దగ్గరికి 8 వేల పక్షులు విగత జీవులుగా కొట్టుకు వచ్చాయి. ►ఉత్తర సముద్రం వెంట వేల మైళ్ల దూరంలో ప్రతికూల వాతావరణం పక్షుల జనాభా తగ్గిపోవడానికి కారణం అవుతోంది. ►సముద్రం, ఆ వాతావరణ స్వచ్ఛతను తెలియజేసే సముద్ర పక్షులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. -
మనింట్లో కక్కినా బాగుండు అనిపిస్తుంది!
బ్యాంకాక్: ఇదేమిటి? బూజుపట్టిన చపాతీ పిండా లేక ఇంకేదైనా అని ఆలోచిస్తూ.. బుర్రకు శ్రమ పెట్టకండి.. ఇది వేల్ వాంతి.. అనగా.. తిమింగలం కక్కు.. చీయాక్ అని అనమాకండి.. విషయం మొత్తం విన్నాక.. అదేదో మనింట్లోనే కక్కినా బాగుండు అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దీని ధర రూ.2.09 కోట్లు మాత్రమే!! ఈ మధ్యే థాయ్‌లాండ్‌లోని సమీలా బీచ్ వద్ద ఓ మత్స్యకారుడికి దొరికింది. ఇసుకలో తెల్లటి ముద్దలాగ కనిపిస్తే.. ఏదో రాయి అనుకున్నాడట. దగ్గరకు వెళ్లి చూస్తే.. ఇదేదో పనికొచ్చేదానిలాగ ఉంది అనుకుని.. ఇంటికి తీసుకెళ్లాడట. ఊర్లోని పెద్దోళ్లకు చూపిస్తే.. అసలు విషయం చెప్పారు. ఇది స్పెర్మ్ వేల్ వాంతి (అంబర్‌గ్రీస్).. సాధారణంగా నీళ్లపై తేలియాడుతూ కనిపిస్తాయి లేదా తీరానికి కొట్టుకొస్తాయి. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు కొడుతుంది కానీ.. ఓసారి గట్టిపడ్డాక సువాసన వెదజల్లుతుంది. అందుకే దీనికి పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో తెగ క్రేజ్. దానికి తగ్గట్టుగానే ధర కూడానూ. తిమింగలం జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం నుంచి వెలువడ్డ స్రావం నుంచి ఇది తయారవుతుందట. గతంలో ఇంతకన్నా పెద్దది రూ.22 కోట్లకు అమ్ముడుపోయిందట. -
కనుమరుగవుతున్న లంక భూములు
సాక్షి, ఆత్రేయపురం(తూర్పుగోదావరి) : మండలంలో పలు గ్రామాల్లో విలువైన లంక భూములు నదీపాతానికి గురవుతున్నాయి. తద్వారా ఏటిగట్లు పటిష్టతకు విఘాతం ఏర్పడుతుందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో బొబ్బర్లంక వద్ద గౌతమీ కుడిగట్టు, వశిష్టా ఎడమగట్టు ప్రాంతంలో లంక భూములు కోతకు గురవుతున్నాయి. అలాగే తాడిపూడి, వసంతవాడ, పులిదిండి, రాజవరం గ్రామాల్లో సైతం లంక భూములు అండలు జారి కనుమరుగవుతున్నాయి. ఈ భూముల్లో ఎందరో పేద రైతులు అరటి తదితర పంటలను పండించుకుని జీవనోపాధి పొందుతున్నారు. వెంటనే లంక భూములు కోతకు గురి కాకుండా గ్రోయిన్లు నిర్మించి పట్టిష్టతకు చర్యలు చేపట్టాలని ఈప్రాంత రైతులు కోరుతున్నారు. అలాగే గతంలో ఏటిగట్ల ఆధునికీకరణ పనుల్లో భాగంగా మండలంలో పేరవరం, వద్దిపర్రు, ఆత్రేయపురం, మెర్లపాలెం తదితర ప్రాంతాల్లో పనులు చేపట్టకపోవడంతో గట్లు బలహీనంగా ఉన్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గట్లపై గతంలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలించుకోవడానికి రోడ్లు అనువుగా ఉండేవి. కానీ ఇటీవల ఆధునికీకరణ పనుల అనంతరం ఏటిగట్లపై కనీసం నడవడానికి సైతం అనుకూలంగా లేవు. సుమారు 12 ఏళ్లుగా వరదలకు లంక భూములు నదీ కోతకు గురి కావడంతో విద్యుత్ మోటార్లతో పాటు కొబ్బరిచెట్లు నదికోతకు గురై నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మండలంలో సుమారు 300 ఎకరాల లంక భూములు నదీపాతానికి గురైనట్టు సమాచారం. అనేకసార్లు వరసగా వచ్చిన వరదలతో ఆత్రేయపురం మండంలో పలు గ్రామాల్లో లంక భూములు కోతకు గురై పంట పొలాలు గోదావరిలో కలిసిపోయాని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సారవంతమైన, ఉద్యాన పంటలు పండే భూముల్ని నదీపాతానికి గురికాకుండా ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతకు గురైన చోట గ్రోయిన్లు ఏర్పాటు చేసి ఏటిగట్లకు గ్రావెల్‌రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ముందుకు వచ్చిన సముద్రం
విజయనగరం : భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సముద్రం ముందుకు వచ్చింది. సముద్ర తీరంలో నీరు ముందుకు రావడంతో రోడ్డు కోతకు గురైంది. ఎన్నడూ లేనిది సముద్రం ముందుకు వచ్చి రోడ్డు కోతకు గురికావడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసుకున్న నివాసాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు, మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు. సునామీలాంటి ఉపద్రవం ఏమైనా ముంచుకొస్తుందేమోనని అనుమానంతో బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఈ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. -
దశాబ్దాల దగా
సాక్షి, కడప: రాయలసీమలో సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే తక్కువ. వర్షాలు ఎక్కువగా ఉండి, భూగర్భజలాలు అధికంగా లభిస్తున్న సముద్రతీర ప్రాంతాలైన తూర్పుగోదావరి జిల్లాలో 75 శాతం, నెల్లూరులో 77శాతం, పశ్చిమగోదావరిలో 64 శాతం, గుంటూరులో 58 శాతం, కృష్ణాజిల్లాలో 64 శాతం సేద్యపునీటి వసతులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 14 శాతం, మహబూబ్‌నగర్‌లో 24 శాతం, చిత్తూరు, నల్గొండలో 41 శాతం, వైఎస్సార్‌జిల్లాలో 28 శాతం, కర్నూలు జిల్లాలో 20 శాతం మాత్రమే నీటి వసతులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సాగునీటి కేటాయింపుల్లో ‘సీమ’కు ప్రాధాన్యత కల్పించాల్సిన ప్రభుత్వాలు కృష్ణాజలాల పంపిణీలో కొన్నేళ్లుగా అసమానతలు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, నల్గొండ, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కంభం, మార్కాపురం ప్రాంతాలు కరువుపీడిత ప్రాంతాలు. ఇందులో 60శాతం కరువు ప్రాంతాలు ‘సీమ’లోనే ఉన్నాయనేది స్పష్టమవుతోంది. కరువుపీడిత ప్రాంతానికి అన్యాయం: రాష్ట్రానికి కృష్ణాజలాల్లో 811 టీఎంసీలు, గోదావరిలో 1495 టీఎంసీలను గుల్హతీ, బచావత్ కమిషన్లు కేటాయించాయి. ఇవికాక ఇతర 28 నదుల ద్వారా 98 టీఎంసీలు లభిస్తున్నాయి. అంటే 2,404 టీఎంసీల జలాలు రాష్ట్రానికి దక్కుతున్నాయి. ఇందులో కృష్ణా ట్రిబ్యునల్‌లోని 811 టీఎంసీలలో రాయలసీమకు కేవలం 122.70 టీఎంసీలను కేటాయించారు. తెలంగాణకు 266.86, ఆంధ్రకు 377.44 టీఎంసీలు కేటాయించారు. కరువు ప్రాంతాలకు సామాజిక న్యాయం, వెనుకబాటుతనం ఆధారంగా నీటి కేటాయింపులు జరగలేదనేది ఈ లెక్కలను బట్టే తెలుస్తుంది. ఈ కేటాయింపులను పెంచాలని దశాబ్దాలుగా ‘సీమ’వాసులు పోరాటం చేస్తున్నారు. అయినా పాలకులు కరుణించలేదు. ‘సీమ’లో 98.95 లక్షల ఎకరాల సాగుకు అనువైన భూమి ఉంటే 15.08 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. వైఎస్ చేపట్టిన జలయజ్ఞం పూర్తయితే 17.36 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగులోకి వస్తుంది. ఈ కేటాయింపులపై హామీ ఎవరిస్తారో! రాయలసీమతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు సాగునీటి కేటాయింపులపై కొన్నేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదు. మద్రాసు తాగునీటికి 15 టీఎంసీలు, తెలుగుగంగకు 29 టీఎంసీలు, శ్రీశైలం కుడికాల్వకు 19 టీఎంసీలు, గాలేరునగరికి 38 టీఎంసీలు, పీఏబీఆర్ కు 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా కేటాయించాలని మూడుదశాబ్దాలు పైబడి ఉద్యమిస్తున్నారు. అలాగే శ్రీశైలం వెనుకభాగం నుంచి హంద్రీనీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీల నికరజలాలు కేటాయించాలని కోరారు. తద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరులో 6.205 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అలాగే వెలిగొండకు 32.5 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం ఎడమకాలువకు 30 టీఎంసీలు కేటాయించాలని, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 75వేల క్యూసెక్కులకు పెంచాలని కొన్నేళ్లుగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంవీ రమణారెడ్డి, మైసూరారెడ్డి పోరాడారు. అలాగే కేసీ కెనాల్‌ను 600 క్యూసెక్కుల ప్రవాహంతో ఆధునికీకరించాలని కోరుతున్నారు. మిగులుజలాలపై ఆధారపడి నిర్మితమవుతున్న గాలేరు-నగరి, హంద్రీనీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ వెడల్పు నిర్మాణాల ప్రాజెక్టులను ఎవరు పూర్తి చేయాలి? వాటి నికరజలాలకు భరోసా ఎవరిస్తారు? అనే ప్రశ్న సీమవాసులలో మెదులుతోంది. మొదటగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, నికర జలాల కేటాయించి ఆపై విభజన అంశం గురించి మాట్లాడాలని సీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై స్పష్టత లేకుండా విభజన జరిగితే కృష్ణాపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అంతరాష్ట్ర ప్రాజెక్టులవుతాయి. అప్పుడు కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండదు. ఇదే జరిగితే సీమలో సాగునీటి ఆధారిత ఆయకట్టుతో పాటు మిగులుజలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీటికష్టాలు తప్పవు. అసమాన కేటాయింపులు ఇవిగో.. రాష్ట్రంలో అసమాన నీటికేటాయింపులు స్పష్టంగా కనపడుతున్నాయి. నాగార్జునసాగర్, కృష్ణాబ్యారేజ్ దిగువన కేటాయించిన జలాలకు మించి వినియోగం జరుగుతోంది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కేటాయింపులకు మించి జలవినియోగం జరుగుతోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నివేదిక ప్రకారం నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు బచావత్ కేటాయింపులు 261 టీఎంసీలు. అయితే 371 టీఎంసీలను వాడుతున్నారు. అంటే 110 టీఎంసీలను అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే కృష్ణాబ్యారేజ్ దిగువన ఖరీఫ్, రబీ పంటలకు 181 టీఎంసీలు కేటాయిస్తే 234 టీఎంసీలు వినియోగిస్తున్నారు. అంటే బచావత్ కేటాయింపుల కంటే 163 టీఎంసీలను అధికంగా వినియోగిస్తున్నారు. 20 ఏళ్లుగా ఇది జరుగుతోందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు తుంగభద్ర ద్వారా కేటాయించిన 32.50 టీఎంసీల జలాల వినియోగాన్ని సగటున 27.30 టీఎంసీలకు కుదించిన అంశాన్ని సైతం ఇంజనీర్లు తమ నివేదికలో బహిర్గతం చేశారు. అయినా అసమానత ఆగలేదు.