
విజయనగరం : భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సముద్రం ముందుకు వచ్చింది. సముద్ర తీరంలో నీరు ముందుకు రావడంతో రోడ్డు కోతకు గురైంది. ఎన్నడూ లేనిది సముద్రం ముందుకు వచ్చి రోడ్డు కోతకు గురికావడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసుకున్న నివాసాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు, మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు. సునామీలాంటి ఉపద్రవం ఏమైనా ముంచుకొస్తుందేమోనని అనుమానంతో బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఈ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు.


