vijayanagaram distirict
-
సచివాలయ ఉద్యోగుల్ని అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే అదితి
సాక్షి,విజయనగరం జిల్లా: వార్డు సచివాలయ ఉద్యోగులకు ఘోర అవమానం జరిగింది. మున్సిపల్ కమీషనర్ తమని అవమానించారని ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం రాత్రి 9 గంటలకు సచివాలయ ఉద్యోగులు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు నివాసానికి వెళ్లారు.అయితే సచివాలయ ఉద్యోగులు వస్తున్నారనే సమాచారంతో ఎమ్మెల్యే పూసపాటి అదితి ఇంటి గేట్లు తెరవ వద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో సిబ్బంది ఇంటి గేట్లను మూసి వేశారు.మున్సిపల్ కమీషనర్ తమని అవమానించారని, ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే అదితి నివాసానికి వచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఏం చేసేది లేక గేటు బయటే పడిగాపులు కాశారు. తమకు కష్టం వచ్చిందని ఎమ్మెల్యే వద్దకు వెళితే, గేటు బయటే ఉంచడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విజయనగరం జిల్లా వాసుల్ని వెంటాడుతున్న పులి భయం
-
ఆ ఊరే ఓ సైన్యం.. ఉగ్గిపాలతో పాటు ధైర్యాన్ని నూరి పోస్తూ..
ముగడ(బాడంగి)/విజయనగరం: ఆ గ్రామ తల్లులు తమ పిల్లలకు ఉగ్గిపాలతో పాటు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. దానినే ఊపిరిగా మారుస్తున్నారు. వీరులుగా తీర్చిదిద్దుతున్నారు. క్రమశిక్షణ అలవాటు చేస్తూ భరతమాత సేవకు సిద్ధం చేస్తున్నారు. యుక్తవయసు రాగానే సరిహద్దులో సేవలందించేందుకు పంపిస్తున్నారు. అందుకే.. ఆ ఊరే ఓ సైన్యంగా మారింది. ధైర్యసాహసాలతో శుత్రుదేశ సైనికుల్లో వణుకుపుట్టించే మిలటరీ వీరులకు పుట్టినిల్లుగా మారిన ముగడ గ్రామంపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. చదవండి: బాజాభజంత్రీలతో పెళ్లి బృందం.. ఒక్కసారిగా షాక్.. కాడెద్దులు పరుగో పరుగు.. ముగడ.. ఈ గ్రామం పేరుచెబితే ఠక్కున గుర్తొచ్చేది సైనికులే. గ్రామంలో సుమారు 983 కుటుంబాలు నివసిస్తుండగా.. 200 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, బీఎస్ఎఫ్ దళాల్లో పనిచేస్తున్నారు. నాలుగువేల మంది జనాభా ఉన్న గ్రామంలో రెండువేల మందివరకు విద్యావంతులు ఉన్నారు. గ్రామ యువత క్రమశిక్షణకు మారుపేరు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి గ్రామానికి చెందిన యువకులు సైన్యంలో సేవలందిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సహం... తల్లులు ధైర్యాన్ని నింపుతూ పిల్లలను పెంచుతుంటే... తండ్రులు దేశ సేవలో తరలించేలా ప్రోత్సహిస్తున్నారు. త్రివిధ దళాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే శారీరక దారుఢ్యం పెంచుకునేలా తర్ఫీదునిస్తున్నారు. రక్షణ దళాల్లో చేరేందుకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. చైతన్యం నింపుతున్నారు. వివిధ కేడర్లలో గ్రామ యువత.. గ్రామానికి చెందిన దాదాపు 63 మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. మరికొందరు కల్నల్, లెఫ్ట్‌నెంట్ కల్నల్, సేబేదార్ వంటి కేడర్లలో పనిచేస్తున్నారు. స్వర్గీయ చప్ప సూర్యనారాయణ (వైద్యాధికారి)గా పనిచేయగా, స్వర్గీయ కోటస్వామినాయుడు, తెంటు స్వామినాయుడు కల్నల్‌గా సేవలందించారు. ప్రస్తుతం యమాల శ్రీనివాసరావు రాజస్థాన్ కోటిలో సుబేదార్‌గా పనిచేస్తుండగా, చొక్కాపు విజయ్‌కుమార్ అస్సాంలో కెఫ్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మత్సరాము మద్రాస్ ఇంజినీరింగ్ సర్వీస్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. వైమానికాదళంలో వివిధ క్యాడర్లలో పనిచేసి రిటైర్ అయినవారిలో మత్స మురళీధరరావు, మత్సరాము ఉన్నారు. మత్సరాము కొడుకు వైమానిక దళంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. విజ్ఞానం పంచే గ్రంథాలయం... ముగడలో సైనికులు స్వయంగా ఓ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో దినపత్రికలతో పాటు గ్రామ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయమే ఉద్యోగాల సాధనకు బాసటగా నిలుస్తోంది. విజ్ఞానం పంచుతోంది. ఊరిలోనూ సేవలు... దేశానికే కాదు.. తమ గ్రామానికి సైనికులు సేవలందిస్తున్నారు. వివిధ పర్వదినాల్లో గ్రామానికి చేరకుని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. సొంత డబ్బులతో రోడ్లు బాగుచేస్తున్నారు. మొక్కులు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. అందుకే...గ్రామం ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుతారు. దేశభక్తిని ప్రదర్శిస్తారు. ఆయనే స్ఫూర్తి.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మిలటరీలో చేరేందుకు యువకులు భయపడేవారు. అప్పట్లో గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు యామల స్వామినాయుడు మిలటరీలో చేరేలా యువతను ప్రోత్సహించారు. సొంత బావమరిది కోట స్వామినాయుడు మిలటరీలో చేరేలా శిక్షణ ఇచ్చారు. ఆయన కల్నల్ స్థాయికి ఎదిగి గ్రామ యువతకు మార్గదర్శకంగా నిలిచారు. సైన్యంలో చేరేలా యువతకు స్ఫూర్తిమంత్రం బోధించారు. అప్పటి నుంచి గ్రామ యువత దేశ సేవకు పునరంకితమవుతూనే ఉంది. గర్వంగా ఉంది ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది. వివిధ క్యాడర్లలో పనిచేశాను. ప్రస్తుతం రాజస్తాన్‌లోని కోటలో సుబేదార్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా.. చదువులో ప్రోత్సహించారు. వారిచ్చిన నైతిక మద్దతుతోనే సైన్యంలో చేరాను. – యామల శ్రీనివాసరావు, ముగడ వైమానిక దళంలో పనిచేయడం నా అదృష్టం దేశరక్షణలో భాగంగా త్రివిధ దళాల్లో ఒకటైన వైమానికదళంలో ఫిట్టర్‌గా, వర్క్డ్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాను. కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన వెంటనే ఎయిర్‌ఫోర్స్‌కు సెలక్టయ్యాను. నా తండ్రి మత్ససూర్యనారాయణ మద్రాస్‌లో డాక్టర్ కోర్స్ చదివారు. ఆయన ప్రోత్సాహంతోనే వైమానిక దళంలో చేరాను. దేశానికి సేవచేసే భాగ్యం కలగడం నా అదృష్టం. – మత్స మురళీధరరావు, విశ్రాంత ఎయిఫోర్స్ అధికారి, ముగడ -
Andhra Pradesh: రాష్ట్రంలోనే తొలి రాక్ పార్క్..
విజయనగరం: విజయనగర వాసులకు విజ్ఞానం.. ఆహ్లాదాన్ని పంచేందుకు రాక్‌గార్డెన్ ముస్తాబైంది. దీనిని సందర్శించేవారికి ఔషధ విజ్ఞానం అందేలా వందలాది ఔషధ మొక్కలను నాటారు. ఆహ్లాదాన్ని పంచేలా అందమైన పూలవనాలను పెంచుతున్నారు. పెద్దపెద్ద రాళ్లను గుట్టలుగా పేర్చి పార్క్‌ను సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆటపరికరాలను అమర్చారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట జంక్షన్ వద్ద రూ.2.20 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన మహరాణి అప్పలకొండమాంబ రాక్ గార్డెన్ వచ్చేఏడాది జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాక్ గార్డెన్ ఆవరణలో వివిద జాతుల మొక్కలు రాష్ట్రంలోనే తొలి రాక్ పార్క్.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధిచేసిన రాక్ గార్డెన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పార్కు ఉండగా.. ఆంధ్రాలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. అమృత్ పథకం నిధులతో ఈ పార్కును నిర్మించారు. విభిన్న జాతుల మొక్కలు.. నగరంలోని ఐదున్నర ఎకరాల సువిశాల స్థలంలో అభివృద్ధి చేసిన రాక్‌గార్డెన్ అరుదైన ఔషధ మొక్కలతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు సిద్ధమైంది. గార్డెన్ ఆవరణలో దేశ, విదేశాలకు చెందిన 118 రకాల జాతుల మొక్కలను నాటారు. వీటన్నింటినీ హైదరాబాద్ నుంచి తెప్పించారు. విద్యార్థులకు ఉపయుక్తం రాక్ గార్డెన్ విద్యార్థులకు ఉపయుక్తం. గార్డెన్లో వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు బొటానికల్ మొక్కలు ఉన్నాయి. సైన్స్ విద్యార్థులు ప్రత్యక్షంగా మొక్కలను పరిశీలించేందుకు అవకాశం కలుగుతుంది. వాటి శాస్త్రీయ నామాలను పార్క్ నిర్వహణ సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలి బొటానికల్ గార్డెన్ విజయనగరంలో రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రజలు సందర్శించి విజ్ఞానం పెంచుకోవాలి. – కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే, విజయనగరం -
విజయ కాగడాకు ఘన స్వాగతం..
సాక్షి,విజయనగరం రూరల్: విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ వేడుకలు శనివారం అట్టహాసంగా సాగాయి. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 16 నుంచి విజయ్ వర్ష్ వేడుకలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోకి ప్రవేశించిన విజయ కాగడా (విక్టరీ టార్చ్)కు కోరుకొండ సైనిక్ స్కూల్ వద్ద కలెక్టర్ ఎ.సూర్యకుమారి, స్కూల్ ప్రిన్సిపాల్, కల్నల్ అరుణ్ ఎం.కులకర్ణి, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. తూర్పు నావికాదళ అధికారులు కాగడాను ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణ్ ఎం.కులకర్ణి మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల సేవలు వెలకట్టలేనివన్నారు. నాటి కథనరంగంలో విరోచితంగా పోరాడి విజయాన్ని సాధించిపెట్టిన సైనికులు, అమరవీరుల సేవలు ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. అప్పటి యుద్ధంలో అమరులైన అమరవీరుల గ్రామాలను పునీతంచేస్తూ తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 16 నాటికి విజయ కాగడా ఢిల్లీకి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం యుద్ధ వీరులు, వీరనారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సైనిక్ స్కూల్ పరిపాలనాధికారి అమిత్ బాలేరావు, తూర్పు నావికాదళ అధికారులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, పాఠశాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. చదవండి: Taliban-India: భారత్ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం! -
ఆదర్శమంటే ఆయనే: సర్కారు కాలేజీలో పీవో కుమారుడు
సీతానగరం (పార్వతీపురం): ఒకరికి ఏదైనా సలహా ఇచ్చేముందు మనమూ దాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉండాలనే మాటను అక్షరాల పాటిస్తున్నారు పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్. తన పిల్లలను ప్రభుత్వ బడి, కళాశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల పార్వతీపురం కేపీఎం మున్సిపల్ హైస్కూల్లో పదోతరగతి పూర్తిచేసిన కుమారుడు త్రివిక్రమ్‌ను గురువారం సీతానగరం మండలం జోగంపేటలో ఉన్న గిరిజన ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా తీర్చిదిద్దిందని, ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నారని, అందుకే గిరిజన కళాశాలలో తన కుమారుడిని చేర్పించానని ఆయన విలేకరులకు తెలిపారు. అనంతరం అక్కడి విద్యార్థులకు బ్యాగ్‌లు, మెటీరియల్, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా? -
ఆ భూములు ఏమయ్యాయి?: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
సాక్షి, విజయనగరం: గజపతుల భూములు కాపాడుకోవడానికే మాన్సాన్ ట్రస్ట్ అంటూ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్ట్‌కు 14 వేల ఎకరాలుంటే.. 8,200 ఎకరాలే చూపిస్తున్నారని.. మిగిలిన ఆ భూములు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మెడికల్ కాలేజ్‌కు వంద ఎకరాలు ఇస్తామని చెప్పారని.. ఆ భూములను రూ.100 కోట్లకు అమ్ముకున్నారని ఎంపీ బెల్లాన దుయ్యబట్టారు. ‘‘విజయనగరం రాజులు సంపాదించిన ఆస్తులు మొత్తం ఆ కాలంలో ప్రజలు కట్టిన కప్పం నుంచి సంపాదించినవే. రాజుల కష్టార్జితం కాదు. ఎన్నో దేవాలయాలకు ధర్మకర్తగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి ఒక్క దేవాలయాన్నయినా అభివృద్ధి చేసారా’’ అని బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు -
దారుణం: మూడేళ్ల చిన్నారి గొంతు కోసిన మేనమామ
సాక్షి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ గొంతు కోసి హత్య చేశాడు. గత అర్ధరాత్రి మూడేళ్ల చిన్నారి కిల్లక భవ్యశ్రీ నిద్రిస్తున్న సమయంలో మేనమామ వినోద్ కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. మతి స్థిమితం సరిగా లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు వినోద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి.. -
8 నెలల నిండు గర్భిణి.. అయితేనేం కరోనా కట్టడికి కదిలింది
సాక్షి,జియ్యమ్మవలస( విజయనగరం): చిత్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నది జియ్యమ్మవలస మండలంలోని రావాడ–రామభద్రపురం పీహెచ్సీలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న అన్నపూర్ణ. ఆమె ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. అయితేనేం... కరోనా కట్టడికి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కరోనా విధులకు వెళ్లొద్దని వైద్యులు వారిస్తున్నా.. తన పని తాను చేసుకుపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ రోగులతో పాటు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ ఆమెను ప్రశ్నించిన వారికి.. రోగులకు సేవలందించడంలోనే సంతృప్తి ఉంటుందని చిరునవ్వుతో సమాధానస్తున్నారు. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు అండగా ఉండటంతో సేవలు సాఫీగా అందించగలుగుతున్నట్టు చెప్పారు. ( చదవండి: కరోనాను జయించిన నవజాత శిశువు ) -
ఏడేళ్ల వసపిట్ట... శ్లోకాల పుట్ట
జామి: సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయే పిల్లలున్న ఈ సమాజంలో ఓ ఏడేళ్ల చిన్నారి రామాయణ ,మహాభారతం గ్రంథాల్లో, భగవద్గీతలో పట్టుసాధించడమే కాకుండా, యోగ విద్యలో చక్కని ప్రతిభ కనబరుస్తోంది. వివరాల్లోకి వెళితే...జామి మండలం విజినిగిరి గ్రామానికి చెందిన కొవ్వాడ శ్రీను, అరుణ దంపతులకు చెందిన ఏడేళ్ల కుమార్తె గౌరి. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఆ బాలిక తండ్రి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు, తల్లి అరుణ ప్రైవేట్ పాఠశాలలో యోగా అధ్యాపకురాలిగా పని చేయడమే కాకుండా వారిద్దరూ ఉచితంగా యోగాపై శిక్షణ ఇస్తుంటారు. వారిది మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతన ఉన్న కుటుంబం కావడంతో చిన్నారి అరుణకు కూడా భక్తిభావం వైపు దృష్టి మళ్లింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యోగాసనాలు, రామాయణ, మహా భారత గ్రంథాలపై మక్కువతోపాటు, భగవద్గీత శ్లోకాలు 700 వరకూ అలవోకగా గుక్క తిప్పకుండా పఠిస్తోంది. మూడో సంవత్సరం నుంచే ఈ శ్లోకాలు పఠిస్తుందేండేదని, కరోనా సమయంలో గత ఏడాదిగా మరిన్ని శ్లోకాలు కంఠతా చేసి మరింత పట్టు సాధించడమే కాకుండా... పలు ఆసనాలను సునాయాశంగా వేస్తుందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ చిచ్చర పిడుగు ప్రతిభను గుర్తించి పలు న్యూస్ చానల్స్ ప్రసారం చేశాయి. చదవండి: భర్తను భయపెట్టాలని.. ప్రాణం పోగొట్టుకుంది అవినీతి ఖాకీ ‘సెల్ఫీ బాణం’ -
కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది..
విజయనగరం క్రైమ్/సాక్షి, అమరావతి: కాళ్లూ, చేతులూ బంధించి ముళ్ల పొదల్లో ఉన్న ఓ విద్యార్థినిని రక్షించిన కేసులో పోలీసులు అసలు విషయం రాబట్టారు. తనకు తానే కాళ్లూ, చేతులు చున్నీతో కట్టేసుకుని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆ విద్యార్థిని నటించిందని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల పోలీసు స్టేషన్‌కి సమీపంలో ఇటీవల జరిగిన ఈ ఘటనను పోలీసులు సీరియస్ తీసుకుని విచారించారు. మొదట ఏమీ తెలియదని చెప్పిన ఆ విద్యార్థిని.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టింది. బాబాయి ఇంటికి వెళ్తానని గత నెల 27న హాస్టల్లో అనుమతి తీసుకుని స్నేహితుడితో బయటకు వెళ్లింది. అదే సమయంలో తన గురించి హాస్టల్లో అన్న వాకబు చేసినట్లుగా తెలుసుకుని కట్టుకథకు తెరతీసింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కి గుర్ల దాటిన తర్వాత దిగింది. అక్కడే రోడ్డుపక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకు తనకుతానే బంధించుకుంది. ఈ విషయం సీసీ ఫుటేజ్‌ల ద్వారా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. వాస్తవాలు తెలుసుకో లోకేశ్ గుర్ల విద్యారి్థని ఘటనపై నిజాలు తెలుసుకోకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల చేసిన ట్వీట్‌పై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థిని సమాచారం అందిన వెంటనే స్పందించి విచారణ పోలీసులు చేపట్టారు. అయినా లోకేశ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. చదవండి: భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో.. అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. -
ఎందుకిలా చేశావు తల్లీ...
లక్కవరపుకోట(విజయనగరం జిల్లా): తల్లి దివ్యాంగురాలు... తండ్రి అమాయకుడు. ఇద్దరికీ అక్షరమ్ముక్క రాకపోయినా... పెళ్లైన 14ఏళ్లకు పుట్టిన చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చదువులో రాణిస్తూండటంతో ఎంతో మురిసిపోయారు. ఒక్కగానొక్క కూతురు తమదగ్గర లేకుండా హాస్టల్లో ఉండి చదువుతుకుంటున్నా... తట్టుకున్నారు. ఏమైందో ఏమోగానీ... ఆ చదువుల తల్లి పాఠశాల ఆవరణలోనే బలవన్మరణానికి పాల్పడింది. అందరినీ వి షాదంలోకి నెట్టేసింది. ఎంతో చురుకుదనం... తోటి విద్యార్థులతో కలుపుగోరుతనం... అన్నింటా ఆమే ముందుండే తత్వం. అందుకే అందరి తలలో నాలుకగా మెలిగింది. ఆమె ఉన్నట్టుండి కన్నుమూయడం అక్కడివారందరినీ కలచివేసింది. మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన గనివాడ శివ, రామాయమ్మ దంపతుల కుమార్తె గనివాడ ఎర్నమ్మ(16) లక్కవరపుకోట ఆదర్శపాఠశాలలో ఇంటర్ ఫస్టియర్(బైపీసీ) చదువుతోంది. ఈ నెల 16వ తేదీన ఆమెకు ఆరోగ్యం బాగోలేక తమ స్వగ్రామం వెళ్లింది. ఆమె తండ్రి ఎస్.కోట ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. కొద్దిగా ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో తన తండ్రి శివతో కలిసి హాస్టల్‌కు వచ్చింది. ఇన్నాళ్లు ఎందుకు రాలేదని హాస్టల్ వార్డెన్ కె.ముత్యమమ్మ ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదనీ, ఇంకా నీర్సంగా వున్నందున మధ్యాహ్నం తరగతికి వెళ్తానని చెప్పి మొదటి అంతస్తులోగల హాస్టల్ గదికి వెళ్లిపోయింది. తండ్రి శివ తమ స్వగ్రామం వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో గదిలో గల చున్నీని ఫ్యాన్‌తో ఉరివేసుకుంది. మధ్యాహ్నం భోజనంకోసం కంచాలు తెచ్చుకునేందుకు తోటిపిల్లలు గదిలోకి వెళ్లేసరికి ఫ్యాన్‌కు ఎర్నమ్మ వేలాడుతూ వార్డెన్‌కు సమాచారం అందించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కె.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి శివ హాస్టల్‌కు చేరుకున్నారు. ఆయన నుంచి ఫిర్యాదు స్వీకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అన్నింటికీ తండ్రే... పెళ్లైన 14ఏళ్లకు లేకలేక కలిగిన ఆ అమ్మాయి అంటే తల్లిదండ్రులకు వల్లమాలిన ప్రేమ. ఆమెకు ఏ కష్టం వచ్చినా తండ్రే అన్నీ చూసుకునేవాడు. జీవితంలో స్థిరపడి తమకు ఆసరాగా నిలుస్తుందనుకుని ఎన్నో కలలు కన్నారు. వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఏం జరిగిందో కూడా తెలుసు కోలేని ఆ అమాయక తండ్రిని చూసి అంతా కంటతడిపెట్టారు. ఎర్నమ్మ చదువులో ఎంతో చురుగ్గా వుండేదని భోధనా సిబ్బంది తెలిపారు. విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ ఆర్.నాగేశ్వరరావు,.డిప్యూటీ విద్యాశాఖ అధికారి కె.బ్రహ్మాజీ, మండల విద్యాశాఖాధికారి సీహెచ్.కూర్మారావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రిన్సిపాల్ కె.ధర్మకుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: దారుణం: అమ్మానాన్నలే అమ్మేశారు.. బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! -
పచ్చనేతల కొత్త ఎత్తుగడ!
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న సామెత జిల్లా టీడీపీ నాయకులకు అచ్చంగా సరిపోతుంది. ప్రజాబలం కోల్పోయి... అన్ని ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారికి ఏం చేయాలో తెలియక ఫలితాలపై వక్రభాష్యం చెబుతున్నారు. అంతటితో ఆగకుండా... జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సరికొత్త ఎత్తుగడలు మొదలుపెట్టారు. జనంలో తమకు ఏ మాత్రం ఆదరణ లేదని తెలిసినా, తప్పుడు ప్రచారంతో సానుభూతి కోసం తహతహలాడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేసుకోవడంలో ఆరితేరిన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్నారేమో... ఇక్కడ ఏకంగా వారే రంగంలోకి దిగి నాటకాలకు తెరతీశారు. స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 955 స్థానాలకు 759 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. టీడీపీ కేవలం 149 సీట్లకే పరిమితమైంది. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సొంత గ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్సీపీ మద్దతుదారు అలమంద సుధమ్మ 647 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు మూకుమ్మడిగా కురుపాంలో తాడంగి గౌరిని టీడీపీ తరపున మద్దతిచ్చి ఎన్నికల్లో నిలిపారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పా ర్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు మద్దతుతో పోటీలో నిలిచిన గార్ల సుజాత 92 ఓట్లతో విజయం సాధించారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత గ్రామం చినమేరంగిలోనూ భంగపాటు తప్పలేదు. అక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారు అల్లు రవణమ్మ 119 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని సొంత ఊరైన చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు మంగళగిరి సుధారాణి విజయం సాధించారు. పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో టీడీపీ మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడి మనుమడు తారకరామానాయుడిపై వైఎస్సార్సీపీ మద్దతుదారైన పతివాడ వరలక్ష్మి గెలుపొందారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సొంతగ్రామమైన కృష్ణపల్లి పంచాయతీలో గందరగోళం సృష్టించినా ఎమ్మెల్యే అలజంగి జోగారావు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీచేసిన బోనురామినాయుడు 174 ఓట్లతో విజయం సాధించారు. గంట్యాడలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికీ భంగపాటు తప్పలేదు. అక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. కత్తులు దూసి... కుట్రలు చేసి... ఓటమిని తట్టుకోలేక పలు చోట్ల ఉద్రిక్తతలు సృష్టించేందుకు టీడీపీ మద్దతుదారులు యత్నించారు. అడ్డాపుశిల పంచాయతీలో ఓటమిని జీరి్ణంచుకోలేక అరకు ఎంపీ గొట్టేటి మాధవి బంధువైన ఎం.పాల నాయుడుపై మాజీ సర్పంచ్ బంటు దాసు మారణాయుధంతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. పూసపాటిరేగ మండలం చౌడవాడ పోలింగ్ స్టేషన్లో కుర్చీలు పగులగొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆందోళనలు, వాగ్వివాదాల నేపథ్యంలో కొన్ని చోట్ల రీ కౌంటింగ్ జరిగింది. ఆ సమయంలోనూ వైఎస్సార్సీపీకే విజయం వరించింది. కొత్తవలసలో నయా నాటకం కొత్తవలస మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోవాలని పోలింగ్ బూత్ వద్ద హడావుడి చేసి ఉద్రిక్తలు సృష్టించారు. రీ కౌంటింగ్‌కు అవకాశం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తన అనుచరులతో కలిసి గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అధికారులను అడ్డుపెట్టుకుని తమ గెలుపును దక్కకుండా చేశారంటూ గొంతు చించుకున్నారు. కానీ జనం పట్టించుకోలేదు. ఇక చేసేదిలేక ఆత్మహత్యాయత్నం అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సానుభూతి సాధించాలనే కుతంత్రంతో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని ఉసిగొలిపి నాటకం ఆడించారు. అదీ బెడిసి కొట్టింది. చివరికి ఆత్మహత్యానేరంపై ఆమెపైనా, టీడీపీ నేతలపైనా కేసు నమోదైంది. తాము తీసుకున్న గోతి లో తామే పడ్డామని ఇప్పుడు వారు తలలుపట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న జిల్లాలోని మిగతా టీడీపీ అభ్యర్ధులు మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీపై పునరాలోచనలో పడ్డారు. పోటీ చేసి ఉన్న పరువును, డబ్బును అనవసరంగా పోగొట్టుకోవడం ఎందుకనే నిర్ణయానికి ఇప్పటికే వచ్చి కొందరు నామినేషన్ల ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. మరి కొందరు ‘బంగ్లా’ పెద్దల బలవంతంపై బరిలో నిలిచినప్పటికీ నామ మాత్రంగానే నడుచుకోవాలని భావిస్తున్నారు. చదవండి: ‘కేశినేని నాని.. పెద్ద గజదొంగ’ పాపాల పుట్టలు పగులుతున్నాయ్ -
తప్పయింది క్షమించమ్మా...
బొబ్బిలి: అనారోగ్యంతో నాటు వైద్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మృతి చెందిన వృద్ధుడి మృత దేహాన్ని ఆర్టీసీ సిబ్బంది ఈ నెల 22న బస్సు నుంచి కిందికి దించేయడంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సంఘటనపై పత్రికల్లో వచ్చిన వార్త చూపి ఆర్టీసీ అధికారులపై సీరియస్ అయ్యారు. బస్సుల్లో ప్రయాణించే వారిపై సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలన్నారు. చేసిన తప్పును తెలుసుకుని విజయనగరం, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్లు సాలూ రు బంగారమ్మ కాలనీలో దాసరి పైడయ్య ఇంటికి బుధవారం వెళ్లి అతని భార్య పోలమ్మను పరామర్శించారు. జరిగిన సంఘటనకు తాము పశ్చాత్తాప పడుతున్నామనీ, క్షమించమని ఆమెను కోరారు. చదవండి: ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు.. పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు -
రామతీర్థానికి సీతారామలక్ష్మణ విగ్రహాలు
సాక్షి, విజయనగరం: రామతీర్థంలో ప్రతిష్టించడానికి సీతారామలక్ష్మణ విగ్రహాలు సిద్ధమయ్యాయి. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో మూడు విగ్రహాలు రామతీర్థానికి తరలించారు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచలంపైనున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గల సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని గత నెల 28 వ తేదీ అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేసిన విషయం విదితమే. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్) అయితే ఆ విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో విగ్రహాలు తయారు చేయించారు. దేవాదాయశాఖ విజ్ఞప్తి మేరకు విగ్రహాలను 10 రోజుల్లో టీటీడీ తయారు చేయించింది. రాముడు విగ్రహం రెండున్నర అడుగులు, సీతా, లక్ష్మణ విగ్రహాలు రెండు అడుగులు చెక్కారు. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల నమూనాతోనే విగ్రహాల తయారీ జరిగింది. చదవండి: రామతీర్థంలో కొలువుకు సీతారాములు సిద్ధం -
వెలుగుల మాటున వసూళ్లు!
పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు 2017లో అప్పటి ప్రభుత్వం ఐలెట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీపాలు ఏర్పాటు చేయించింది. 2021 వరకు దీపాల నిర్వహణ బాధ్యతను సంస్థే చూడాలి. కానీ ఈ నిబంధనను పక్కనపెట్టి పంచాయతీల నుంచి నిర్వహణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరమ్మతుల పేరిట నిధులు కొల్లగొడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం రూరల్: పంచాయతీల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 2015లో ఎల్ఈడీ ప్రాజెక్టు ప్రారంభం కాగా 2017లో విజయనగరం ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎల్ఈడీ దీపాల కొనుగోళ్లు, నిర్వహణను గంట్యాడ మండలం కరకవలసకు చెందిన ఐలైట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఒక్కో ఎల్ఈడీ విద్యుత్ దీపం కొనుగోలుకు ప్రభుత్వం రూ.999లుగా ధర నిర్ణయించింది. ఎల్ఈడీ కొనుగోలుకు ఎంపీ లాడ్స్ నుంచి 70 శాతం వాటా, గ్రామ పంచాయతీల నిధుల నుంచి 30 శాతం వాటాను ఐలైట్ ఇండియా సంస్థకు చెల్లించింది. జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 463 గ్రామ పంచాయతీల్లో ఎంపీల్యాడ్స్ నుంచి 55,974 ఎల్ఈడీ బల్బులు కొనుగోలు చేసి పంచాయతీల్లో అమర్చింది. విద్యుత్ బల్బుల ఏర్పాటు, ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2021 వరకు విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యత అంతా సంస్థదే. ప్రకృతి వైపరీత్యాల పేరిట డబ్బుల వసూలు.. విద్యుత్ దీపాల నిర్వహణ ఒప్పందం నాలుగేళ్లు. కానీ ఆ సంస్థ ప్రకృతి వైపరీత్యాలను కారణంగా చూపి బల్బులు పూర్తి గా పాడయ్యాయని చెప్పి ఒక్కోదానికి గ్రామ పంచాయతీల నుంచి రూ. 300 చొప్పున వసూలు చేస్తున్నట్లు అధికారు లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మండలంలో ఒక నెలలో 40 బల్బులు పాడయ్యాయి. వాటిని బాగుచేసేందుకు ఆ సంస్థకు అప్పగిస్తే అందులో 20 వరకు పూర్తిగా పాడైపోయాయని, ఒక్కో దానికి రూ.300లు చెల్లించాలని సంస్థ నిర్వాహకులు డిమాండ్ చేసినట్టు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పాడైపోయిన 20 బల్బులకు డబ్బులు చెల్లించకపోతే మిగిలినవాటిని మరమ్మతు చేయడం లేదని పంచాయతీల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగులు పడినా, చెట్టు కొమ్మలు విరిగిపడి ఎల్ఈడీ విద్యుత్ దీపాలు పాడైపోతే వాటికి వారంటీ ఇవ్వలేమని, బిల్లులు చెల్లించాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. వాస్తవంగా పాడైపోయిన దీపాలను నిర్వాహకులకు అప్పగించిన 72 గంటల్లో మరమ్మతులు చేపట్టి అందించాల్సి ఉన్నా వారు స్పందించడంలేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతు న్నారు. నాటి టీడీపీ పెద్దల సహకారంతో ఈ కాంట్రాక్టును రూ. 5.50 కోట్లకు దక్కించుకున్న సంస్థ ఇప్పుడు మరమ్మతుల పేరిట అదనంగా వసూలు చేయ డం పంచాయతీలకు భారమేనని పేర్కొంటున్నారు. దీనిపై ఓ ఎంపీడీఓ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో హడావుడిగా సమావేశం ఏర్పాటు చేసి ఐలైట్ సంస్థ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసు జారీచేశాం ఎల్ఈడీ విద్యుత్ దీపాలు పాడైపోతే 72 గంటల్లో వాటికి మరమ్మతు చేయాల్సి ఉన్నా సంస్థ నిర్వాహ కులు సకాలంలో వాటిని అందించలేదని మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శుల నుంచి వస్తు న్న ఫిర్యాదుల ఆధారంగా షోకాజ్ నోటీసు జారీ చేశాం. ఇటీవల ఈ విషయంపై అధికారులు, ఐలైట్ సంస్థ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. సంస్థ నిర్వాహకులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పూర్తిగా పాడైపోయిన బల్బులకు వారంటీ లేదని చెప్పారు. వారంటీ లేనివాటికి మరమ్మతులు చేపట్టలేమని చెప్పారు. – కె.సునీల్ రాజ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి కరోనాయే కారణం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏడు నెలలుగా పాడైపోయిన ఎల్ఈడీ దీపాలు బాగుచేయ డంలో ఆలస్యమైంది. మా దగ్గరకు వచ్చిన 455 బల్బులకు 276 బల్బులు బాగుచేశాం. కేవలం 179 విద్యుత్ దీపాలను మరమ్మతు చేపట్టడంలో ఆలస్యమైంది. వారంటీలో లేని విద్యుత్ దీపాలు పూర్తిగా చెడిపోతే కొత్తవి కావాలని అధికారులు అడిగితే వాటిని విక్ర యిస్తున్నాం. మరమ్మతుల పేరిట అదనపు వసూలు చేయడం లేదు. – కళ్యాణ్, ఐలైట్ సంస్థ ,నిర్వాహకుడు -
ఘోర ప్రమాదం.. డీజిల్ కోసం
సాక్షి, విజయనగరం: ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌కు ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టడంతో, ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పి.కోనవలస దుర్గ గుడి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక బోల్తా పడిన ట్యాంకర్ నుంచి భారీ స్థాయిలో డీజిల్ లీకవడంతో, దాని కోసం స్థానికులు బారులు తీరడం గమనార్హం. -
మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!
ఆర్థిక కష్టాలు ఉండవు.. అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్టనీయదు.. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా.. ఆ ఒక్కరిలో తెలియని వేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు.. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం.. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం... పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం.. ఇలాంటి మానసిక సమస్యలతో జిల్లాలో వేలాది మంది సతమతమవుతున్నారు. వైద్యులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అలాంటి వారందరికీ మానసిక ఆరోగ్యం ప్రాప్తించాలని ఆకాంక్షిద్దాం. విజయనగరం ఫోర్ట్: ‘ఎంత డబ్బు ఉన్నా ఒంటికి సుఖం లేకపోతే ఎందుకు’ అన్నది పెద్దల మాట. చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరి సంఖ్య జిల్లాలో పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 15 నుంచి 20 శాతం మందికే వైద్యం ఇప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో కేవలం 15 నుంచి 20 శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన రాహిత్యం, చిన్న చూపు, అపోహలు, పేదరిక తదితర కారణాలు వారిని ఆస్పత్రికి రాకుండా నిలువరిస్తున్నాయి. మానసిక సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అందుబాటులో ఉన్న వైద్యసేవలు పొందడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోవిడ్–19 వ్యాప్తి జనంను భయపెడుతోంది. ఆరోగ్య సమస్యలు సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ప్రాణం తీస్తున్న కరోనా భయం.. ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్–19తో పోరాడుతోంది. భౌతిక దూరం, వ్యాధి చికిత్స, వ్యాక్సిన్ పట్ల అనిశ్చితి, ఆర్థిక చిక్కులు తదితర అంశాలు ప్రజల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల మంది వేర్వేరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంతకు 20 రెట్లు మంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఏటా ప్రతి 10 మంది పిల్లలలో ఒకరు, ప్రతి నలుగురు పెద్దలలో ఒకరు కొత్తగా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఓ అంచనా. జిల్లాలో ఏడాదికి 20 వేల మంది... జిల్లాలో ఏడాదికి 20 వేల నుంచి 24 వేలు మంది వరకు మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరిలో అనేకమంది వివిధ రకాల మానసిక సమస్యలు భారిన పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోయి కొంతమంది, కుటుంబ కలహాలవల్ల కొందరు, అనారోగ్య సమస్యల వల్ల కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఒక మనిషి సాధారణ భావోద్వేగాలు, అనుభూతులు పొందుతూ అవసరమైనప్పుడు నియంత్రించుకుంటూ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగి జీవితం గడుపుతుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. మంచి ఆరోగ్యం, సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగ, తమకు తాము సమయం కేటాయించుకోవడం, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్య ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిస్తే సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు. చికిత్సతో విముక్తి మానసిక సమస్యలు ఎదుర్కొనేవారి సంఖ్య ఇటీవల కాలంలో జిల్లాలో పెరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వస్తున్నారు. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. లేదంటే నిద్రలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కడు ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వ్యాయామం, యోగ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలి. – డాక్టర్ జాగరపు రమేష్, మానసిక వైద్య నిపుణుడు -
మహిళలకు మరో ‘రత్నం’
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలు పథకాల్లో మరో రత్నం మహిళలకు అందనుంది. బ్యాంకు రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి ఈ నెల 11న ‘వైఎస్సార్ ఆసరా’ కింద నగదు జమకానుంది. దీనికోసం అర్హుల జాబితా సిద్ధమైంది. జిల్లాలోని మహిళలకు నాలుగు విడతల్లో రూ.928.65 కోట్ల లబ్ధి చేకూరనుంది. సాలూరు: మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి అనువైన సంస్కరణలు చేపడుతున్నారు. రిజర్వేషన్లలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ చేయూతతో 45 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల ఖాతాలకు నేరుగా రూ.18,750 చొప్పున జమచేశారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తాలను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద చెల్లింపులకు ప్రణాళిక రూపొందించారు. తొలివిడత లబ్ధిని అందజేసేందుకు ఏర్పా ట్లు పూర్తిచేశారు. జిల్లా మహిళలకు రూ.928.65 కోట్ల లబ్ధి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోని 34 మండలాల్లో సుమారు 36,759 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 5,04,906 మంది సభ్యులు ఉన్నారు. వీరు 2019 ఏప్రిల్ 11 నాటికి సుమారు 928.65 కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఈ నగదును నాలుగు విడతల్లో ప్రభు త్వం చెల్లించనుంది. వైఎస్సార్ ఆసరా పేరుతో అప్పు నిల్వల సొమ్ములో తొలివిడత నగదు ఈ నెల 11న నేరుగా వారి సంఘం పొదుపు ఖాతాలో జమచేయనున్నారు. హామీల అమలులో పెద్దకొడుకు... మాట తప్పని నాయకుడు జగన్మోహన్రెడ్డి డ్వాక్రా మ హిళల కష్టాలను తన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రలో నేరు గా చూశారు. వారి వినతులను ఆలకించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు విడతల్లో బ్యాంకు రుణా లు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే మహిళలకు అండగా నిలిచేలా నవరత్న పథకాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ ను చేర్చారు. ఓ సోదరుడిలా, ఓ పెద్దకొడుకుగా వ్యవహరి స్తూ మహిళలకు జగనన్న ఉన్నాడనే భరోసా కలి్పంచారు. మహిళలకు ఆర్థిక అండ మహిళలకు ఓ పెద్దకొడుకుగా, సోదరుడిగా సీఎం జగన్మోహన్రెడ్డి నిలుస్తున్నా రు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదు. వైఎస్సార్ చేయూత, తాజాగా వైఎస్సార్ ఆసరాతో ఆదుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీచేస్తామని చెప్పి మహిళలను మోసం చేసింది. అందుకే అశేష మహిళాలోకం 2019 ఎన్నికల్లో టీడీపీకి బుద్ధిచెప్పి వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టింది. – పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ ఈ నెల 11న పథకం అమలు.. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఈ నెల 11న తొలివిడత డ్వాక్రా రుణాల నగదు చెల్లించనున్నారు. నాలుగు విడతల్లో మహిళల ఖాతాలకు ప్రభుత్వం జమచేయనుంది. వాటిని మహిళలు సద్వినియో గం చేసుకోవాలి. – సావిత్రి, వెలుగు ఏపీడీ సీఎం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలస్తున్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేసింది. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుంచి వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీకి సిద్ధమయ్యారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా మరోసారి రుజువు చేసుకున్నారు. – రెడ్డి పద్మావతి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు -
ఆన్లైన్ మోసం.. పోలీసులకే టోకరా..
విజయనగరం క్రైమ్: సైబర్ నేరగాళ్లు పోలీసుశాఖనూ వదిలి పెట్టడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని సెల్కే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన మెసెజ్‌లకు కనీసం వారికి ఫోన్ చేయకుండా ఏం ఇబ్బందుల్లో ఉన్నాడో అనుకుంటూ కేవలం చాటింగ్ మాత్రమే చేస్తూ డబ్బులు పంపించేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చివరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వారిని కూడా వదల్లేదు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆపదంటే ఆదుకునే మనసున్న వాళ్లు చాలామంది ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్తరకం పంథా మొదలెట్టేశారు. ఫేస్బుక్లో పోలీసులు, లాయర్లు, వైద్యుల పేర్లతో కొత్తగా పేజీలు సృష్టించడం.. అందులో ఉన్న వారికి ఫ్రెండ్స్ రిక్వెస్టులు పెట్టడం.. వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారికి మెసెంజర్ ద్వారా అత్యవసరమంటూ రెండు, మూడు వేల రూపాయల సాయం చేయమనడం జరుగుతోంది. దీంతో చాలా మంది ఏదో అవసరం ఉంటుందులే అనుకుని పేటీమ్, ఫోన్‌పే ద్వారా పంపించేస్తున్నారు. ఈ కోవలోనే చాలా మంది పోలీస్ అధికారులు కూడా బలయ్యారు. రూ. లక్షల్లో సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. తాజాగా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై హరి పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా ప్రారంభించారు. అతని మిత్రులందరినీ నకిలీ ఖాతాలో యాడ్ చేసుకుని వారితో మెసెంజర్ ద్వారా చాట్ చేశారు. అర్జెంట్ అవరం ఉందని.. గంటలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించడంతో చాలా మంది ఫోన్‌పే, పేటీఎంల ద్వారా పంపించారు. అయితే ఫోన్ పేలో పేరు సరిగా లేకపోవడంతో ఒకరికి అనుమానం వచ్చి ఎస్సై హరికే నేరుగా ఫోన్ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించి, ఆ ఖాతాను బ్లాక్ చేయించారు. ఎవ్వరూ డబ్బులు వేయవద్దని వాట్సాప్ ద్వారా మిత్రులందరికీ మెసెజ్‌లు పెట్టారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
కిలోమీటర్లు కాలినడక.. ‘డోలీ’ ప్రయాణమే దిక్కు
రాళ్లల్లో..ముళ్ల దారుల్లో అడవి బిడ్డలు అవస్థలు పడుతున్నారు. పురుటి నొప్పులు వస్తే నిండు గర్భిణిని డోలి కట్టి కొండలు, గుట్టలపై కాలినడకన మోసుకుపోవడం తప్ప వేరే మార్గం లేక నరకం చూస్తున్నారు. నిధులున్నా.. ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, నిబంధనల బంధనాల వల్ల నేటికి దారులు ఏర్పడలేదు. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి దూరమవుతున్నారు. వారి పిల్లలు, యువత చదువు కోవడానికి వెళ్లలేక నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. దీంతో గిరిజనులు తమను తామే బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రహదారులు లేని గ్రామాలకు తామే చందాలు వేసుకుని రోడ్లు వేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రోడ్డు వేసిన తర్వాతే ఓటు అడగడానికి మీ ఊరు వస్తామని టీడీపీ హయాంలో సాలూరు మాజీ ఎమ్మెల్యే బంజ్‌దేవ్ అప్పట్లో కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలకు మాటిచ్చారు. 15 రోజుల్లోనే రోడ్డు ప్రారంభిస్తామన్నారు. రోడ్డు పనుల కోసం తుప్పలు కొట్టిస్తున్నట్లు చెప్పి సమావేశానికి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళితే చెప్పులతో కొట్టారని పోలీసు కేసు పెడతానంటూ గిరిజనులను బెదిరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా అనేకసార్లు మోసపోయిన 125 గిరిజన కుటుంబాలు కలిసి..ఉన్న బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు పోగుచేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గిరిజనులను అభినందిస్తూ, త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. అయితే ఇది ఆ ఒక్క ఊరి సమస్య మాత్రమే కాదు. ఇలాంటి ఎన్నో పల్లెలకు అడవిలో రహదారులు లేవు. సాలూరు మండలంలో కొదమ పంచాయితీలో కొదమ, చినచోర, ఎం.చింతలవలస, అడ్డుగుడ, కోనంగివలస, చింతామల, లొద్ద, బందపాయి, చిలకమెండంగి, సిరివర, కోయిమల, కానుపాక, గుంజేరి, పట్టుచెన్నేరు పంచాయితీ శిఖపరువు, పగులుచెన్నేరు పంచాయితీ ఎగువమెండంగి, గంజాయిభద్ర పంచాయతీ పనికిలోవ, రణసింగి, సిమ్మగెడ్డ, ఎగువపనికి, డెన్సరాయి పంచాయితీలో డెన్సరాయి, జిల్లేడువలస, సంపంగిపాడు పంచాయతీలని ఎగువరూడి, దిగువరూడి, సుల్లారి, సంపంగిపాడు, పువ్వలవలస, జిల్లేడువలస పంచాయతీలో నారింజపాడు, బెల్లపాకలు, బొడ్డపాడు తదితర గిరిశిఖర గ్రామాలకు నేటికీ సరైన రహదారి లేక అక్కడి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గిరిశిఖర, అటవీ, మైదాన ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. గిరిశిఖర గ్రామాల్లో సవర, కోదులు, జాతాపు తెగలకు చెందిన గిరిజనులున్నారు. అడవుల్లో జాతాపు, గదబ, సవర, కొండదొర తెగల వారున్నారు. మైదాన ప్రాంతాల్లో ఎరుకులు, లంబాడిలు (సుబాగి/నాయికిలు), యానాదు, గదబ తెగలు ఉన్నాయి. వీరంతా రహదారులు లేక కష్టపడుతున్నారు. గిరిశిఖర గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు చెలమలు, ఊటనీరు తాగుతున్నారు. పూరిళ్లు, రేకుల ఇళ్లలోనే నివసిస్తున్నారు. వివాదం ఊబిలో కోటియా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ ఈ రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న 34 గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 15 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలోనూ, ఒడిశాలోనూ ఓటు వేస్తున్నారు. 1936లో ఒడిశా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవేనని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు. వైఎస్ హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో కొటియా పల్లెల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. దండిగాం నుంచి కొఠియాకు తారు రోడ్డు మంజూరు చేయించారు. ఎగువశెంబి వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, తదితర కారణాల వలన రోడ్డు ఫార్మేషన్ జరిగినా నిర్మాణం పూర్తికాలేదు. రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాంత గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొటియా గ్రామాలను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కొటియా గ్రూప్ గ్రామాల్లో ఏ రోడ్డు నిర్మాణం చేపట్టినా రిజర్వ్‌ఫారెస్ట్ నిబంధనలు అడ్డుపడుతున్నాయి. ఇదే ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే మాత్రం అటవీశాఖ అభ్యంతరం తెలపకపోవడాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు తప్పుబడుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో తాము ఏదీ ఆపడం లేదని జిల్లా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సీఎం దృష్టి సారించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాత మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిశిఖర గర్భిణులకు సాలూరులోని వైటీసీలో ఏర్పాటు చేసిన గిరిశిఖర గర్భిణుల వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతోంది. 2019 అక్టోబర్ 31న సాలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌హరిచందన్ దృష్టికి మా ప్రాంత సమస్యలను, కొటియా వివాదాలను తీసుకువెళ్లాం. ఇక్కడి సమస్యలపై నటుడు సోనూసూద్ స్పందించి మా ప్రాంతానికి వస్తాననడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం అటవీ చట్టాలతో అడ్డుపడకుంటే మా ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. –పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే చట్టప్రకారమే నడుచుకుంటున్నాం గిరిజన గ్రామాలకు రహదారులు వేయకుండా అటవీశాఖ అడ్డుకుంటోందనే ఆరోపణలు సరికాదు. నేను ఈ జిల్లాకు వచ్చి రెండు నెలలైంది. ఈ కొద్ది సమయంలోనే పెండింగ్ ఫైళ్లు అన్నీ క్లియర్ చేశాం. ప్రస్తుతం ఏ ఒక్క ఫైలు కూడా మా స్థాయిలో పెండింగ్ లేదు. ప్రాంతీయ కార్యాలయానికి, రాష్ట్ర అధికారులకు, కేంద్రానికి పంపించినవి కొన్ని అక్కడ పెండింగ్ ఉంటే ఉండవచ్చు. గిరిజనులకు మంచి చేయాలనే మాకూ ఉంటుంది. కానీ అటవీ చట్టానికి లోబడే మేము పనిచేయాలి.ఎక్కడైనా మా వల్ల అభివృద్ధి ఆగిందని మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా విచారణ జరుపుతాం. –సచిన్ గుప్తా, అటవీశాఖ జిల్లా అధికారి -
కరోనాతో ఎంపీ నిధులకు బ్రేక్
రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కేంద్ర ప్రభుత్వ సాయం ఉంటేనే మరింత మంచి ఫలితాలు వస్తాయి. చన్నీళ్లకు వేడినీళ్లు తోడన్నట్లు కేంద్రం నిధులు ఇచ్చినపుడే అభివృద్ధి వేగంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొన్ని రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈప్రభావం జిల్లా అభివృద్ధిపైనా పడుతోంది. విజయనగరం గంటస్తంభం: పట్టణ, గ్రామాలాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక పథకాలు అమలు చేస్తుంటాయి. ఇందులో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో అనేక పథకాలు కేంద్రం అమలు చేస్తోంది. అయితే వీటిలో కొన్నింటిని కేంద్రం నిలుపుదల చేయడం సమస్యగా మారింది. ఆగిన ఎస్డీపీ.. ఎంపీ లాడ్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా జిల్లాలో కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేక అభివృద్ధి పథకం, పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్) ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని విభజన బిల్లులో పొందుపరిచారు. ఇందులో భాగంగా ఏడాదికి ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈమేరకు 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు వరుసుగా మూడేళ్లపాటు నిధులు మంజూరు చేసింది. ఒక్కో ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున రూ.150 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50 కోట్లు విడుదల చేసినా వెంటనే వెనుక్కి తీసుకుంది. ఈనిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోగా 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నిధుల ఊసెత్తలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఆ పథకం ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం కావాలని ఈ నిధులను ఆపేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఈఏడాది నుంచి ఎంపీ లాడ్స్ కూడా ఆగిపోయాయి. ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో ఈఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా ఎంపీ లాడ్స్ నిధులు విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఒక్కో ఎంపీకి రెండేళ్లులో రూ.10 కోట్లు నిధులు రావు. దీంతో వారు కేటాయించే పరిస్థితి ఉండదు. అభివృద్ధిపై ప్రభావం ఈరెండు పథకాలు ఆగడంతో జిల్లా అభివృద్ధిపై ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎస్డీపీ నిధులు ఏడాదికి రూ.50 కోట్లు ఇవ్వడం వల్ల సాగునీటి వనరులు అభివృద్ధి, రోడ్లు, కాలువులు, తాగునీటి పథకాల నిర్మాణం, విద్య, వైద్యం తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వీలుంది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో సుమారు రూ.200 కోట్లు విలవైన పనులు జరిగాయి. దీంతో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఈ సమయంలో ఎస్డీపీ పథకం ఉంటే ప్రయోజనం ఉండేది. కనీసం ఎంపీలాడ్స్ ఉన్నా ఎంతోకొంత అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆస్కారం ఉండేది. గతేడాది ఒక్కో ఎంపీకి రూ.5 కోట్లు ఇవ్వడం వల్ల విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రూ.3.93 కోట్లుతో 75 పనులు మంజూరు చేశారు. అలాగే అరుకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి తన రూ.5 కోట్లు నుంచి జిల్లాలో పలు పనులకు సుమారు రూ.1.5 కోట్లు ఇచ్చారు. ఎస్.కోట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ.5 లక్షలు ఇచ్చారు. వీటితో అనేక పనులు చేపట్టడం జరిగింది. రెండేళ్లుపాటు వారికి నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు జరిగేందుకు కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. కరోనాతో ఎంపీ నిధులు ఆగాయి ఈవిషయం జిల్లా ప్రణాళిక శాఖ అధికారి విజయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఎంపీ లాడ్స్ కరోనా నేపథ్యంలో రెండేళ్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్డీపీ నిధులు 2018–19 నుంచి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతుంది. వస్తే అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి. -
ఆ ఇద్దరూ ద్రోహులే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం వెనుకబడిన జిల్లాగా మిగిలిపోవడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజే కారణమని ఎంపీ విజయసాయిరెడ్డి ఏకిపడేశారు. వీరిద్దరూ జిల్లాను విస్మరించారని, వెనుకబడిన వర్గాలను అణచివేశారని సోషల్ మీడియా వేదికగా దుమ్ముదులిపేశారు. ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పోస్టుల్లో అంశాలివి... ♦విజయనగరం అనగానే విద్యలనగ రం, సాంస్కృతిక కూడలి, సంగీత సెంటర్ ఇలా గత వైభవం కళ్లముందు మెదులుతుంది. సువర్ణముఖి, చంపావతి, గోస్తనీ, నాగావళి, వేగావతి, గోముఖి లాంటి నదీనదాలు ప్రవహిస్తున్న ప్రశాంతమైన జిల్లాను – గజపతి రాజుల్లో ఒక వర్గాన్ని, మాన్సాస్ ట్రస్ట్‌ను ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో భ్రష్టుపట్టించారు. మెజార్టీ వర్గాలైన కాపు, వైశ్య, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా... వీలైనంతగా అణగదొక్కారు. ♦జిల్లా ప్రజలు చైతన్యవంతులవ్వడంతో ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది. విశాఖతో సమానంగా విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. ♦విశాఖలో పరిపాలనా రాజధాని వస్తే అక్కడికి కూతవేటు దూరంలోనున్న విజయనగరం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. కానీ వైజాగ్ పాలనా రాజధాని వద్దంటూ చంద్రబాబు సంతకాల సేకరణ చేయిస్తున్నారంటే జిల్లాపై ఆయన ఎంతగా పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజధాని ఏర్పాటైతే విశాఖ – విజయనగరం మధ్య అభివృద్ధి పరుగులు పెడుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ మెట్రోరైలు వరకు అన్నీ విజయగరానికి వచ్చి... జిల్లా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. ♦విజయనగరంలోని మహారాజా విద్యాసంస్థలు బ్రిటిష్ వారి కాలంలోనే ఒక వెలుగువెలిగాయి. కానీ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతి రాజు చేతిలోకి వెళ్లగానే దాన్ని భ్రష్టుపట్టించారు. అశోక్‌ను అడ్డం పెట్టుకుని మాన్సాస్ ట్రస్ట్‌ను చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏటీఎంలా వాడుకున్నారు. ♦విజయనగరం జనాభాలో దాదాపు 20 శాతం తూర్పుకాపులుంటే వారిని రాజకీయంగా అణగదొక్కడానికి శతవిధాలా కష్టపడ్డారు. చివరకు తన కుమార్తె అతిది పోటీచేస్తాననగానే సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను ఇంటికి పంపించేశారు. ♦పంచనదులున్నా చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క సాగునీటి, ప్రాజెక్టు కట్టిన పాపానపోలేదు. వైఎస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. మాట్లాడితే పోలవరం నేనే కడుతున్నా... హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు విజయనగరంలోని నదులపై ఒక చిన్న ఆనకట్టనైనా కట్టలేకపోయాడు. తోటపల్లి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించి 90 శాతం పూర్తిచేస్తే ఉన్న పదిశాతాన్ని సైతం పూర్తిచేయలేక చేతులెత్తేశారు. ♦జిల్లావాసులకు ఉపాధికల్పిస్తున్న జూట్, ఫెర్రోఅల్లాయీస్ ఇండస్ట్రీలు మూతపడేలా చేశారు. అశోక్ గజపతి ఇంటిపక్కనే ఉన్న ఈస్ట్ కోస్ట్, అరుణ జ్యూట్ మిల్లులు మూతపడ్డా – వందలమంది ఉద్యోగాలు పోయినా అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వాటిని తెరిపించేందుకు ప్రయత్నిస్తోంది. ♦ఒక జిల్లా నుంచి జాతీయ నేతగా ఎవరైనా ఎదిగారంటే ఆ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి. కానీ విజయనగరానికి అన్నీ తానేనని చెప్పుకునే అశోక్ విజయనగర సామ్రాజ్య ఆస్తులను ఏటీఎంలా వినియోగించుకోవడంలో చంద్రబాబుకు సహకరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చే రాజధానిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ♦ఆనంద గజపతిరాజు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంతవరకూ విజయనగరం ఒక వెలుగువెలిగింది. ఆ తర్వాత అశోక్ విజయనగర వైభవాన్ని మసకబార్చారు. విద్య– వైద్యం నుంచి ఉపాధి కల్పనవరకు అన్ని రంగాల్లోనూ భ్రష్టుపట్టించారు. ♦సొంత అన్న కుమార్తె సంచయిత మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు చేపడితే... ఆమెను, ఆమె చెల్లెలు ఊర్మిళ ను అశోక్ కించపరుస్తూ మాట్లాడారు. మహిళలవిషయంలో వివక్షచూపేలా చంద్రబాబు ప్రకటనలిచ్చారు. ♦వైఎస్సార్ హయాంలోనూ, జగన్ అధికారం చేపట్టాక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విజయనగరంలో రాజ్యాధికారం వచ్చినట్లయ్యింది. విజయనగరంలో అశోక్ గజపతిరాజు కుటుంబం, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, కురుపాం కిశోర్ చంద్రదేవ్, చినమేరంగి రాజు శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రాజయినా, పేదయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ – అభివృద్ధికి పాటుపడితేనే భవిష్యత్తు. లేకుంటే అడ్రస్ గల్లంతే, -
ఒక్క క్లిక్ చాలు..
విజయనగరం: కరోనా మహమ్మారి కాలు బయట పెట్టనీయడంలేదు. కాలక్షేపానికి మొబైల్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కానీ పుస్తక ప్రియులు గ్రంథాలయాలకు వెళ్లలేక ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారు. అంతేనా... పోటీపరీక్షలకోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు... పాఠశాలలకు వెళ్లలేని విద్యార్థులు... వీరందరిదీ ఇదే సమస్య. వీరికోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెబ్సైట్, మొబైల్ యాప్‌ను రూపొందించింది. అందులో కావలసినన్ని పుస్తకాలను నిక్షిప్తం చేసింది. ఇంకెందుకాలస్యం... వాటినెలా వినియోగించుకోవచ్చో చూద్దాం. మానవ వనరుల మంత్రిత్వశాఖ(ఎంహెచ్ఆర్డీ), జాతీయ గ్రంథాలయ సంస్థ ప్రత్యేకంగా ఎన్డీఎల్ ఇండియా (జాతీయ డిజిటల్ గ్రంథాలయ భారతదేశం) వెబ్సైట్, మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఇందులో పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం పుస్తకాలను కొనకుండా, గ్రంథాలయాలకు వెళ్లకుండానే ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇదెంతో ఉపయోగకరం. 4 కోట్లకు పైగా పుస్తకాలు డిజిటల్ గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు దర్శనమిస్తాయి. తెలుగు సహా.. 12కు పైగా భాషల్లో నాలుగు కోట్లకు పైగా రకరకాల పుస్తకాలు పొందుపరిచారు. ఎందరో ప్రముఖుల కు సంబంధించిన 3 లక్షల వరకు మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాలతోపాటు పోటీ పరీక్షల పుస్తకాలు, యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, సమాధాన పుస్త కాలు, కంప్యూటర్ సైన్స్, బీఎడ్, డీఎడ్, ఛాత్రోపాధ్యాయుల శిక్షణ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధన సంస్థలు, ప్రభుత్వరంగ పుస్తకాలతోపాటు సాహిత్య పుస్తకాలను ఇందులో చూడొచ్చు. ఆర్టికల్స్, వీడియో, ఆడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఎన్డీఎల్ ఇండియా మొబైల్‌యాప్‌లో... ఎన్డీఎల్ ఇండియా ద్వారా డిజిటల్ పుస్తకాలను చదువుకోవడం చాలా సులభం. గూగుల్‌లో ఎన్డీఎల్ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి వెబ్ పేజీని ప్రారంభించాలి. అందులో ఈ–మెయిల్ ఐడీ సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తాము చదువుతున్న విశ్వవిద్యాలయం, అవసరమైన పుస్తకాల జాబితాను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నమోదుకు ఇచ్చిన మెయిల్‌కు గ్రంథాలయం లింక్ వస్తుంది. అందులో క్లిక్ చేసి లాగిన్, పాస్వర్డ్ ఎంటర్ చేసి, అంతర్జాలంలోకి వెళ్లొచ్చు. తర్వాత అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఎన్డీఎల్ ఇండియా అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇందులో వెబ్సైట్ మాదిరిగా కాకపోయినా, కొంచెం వేరుగా ఉంటుంది. అయినా అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఐఐటీ, జేఈఈ, గేట్ వంటి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా ఐచ్ఛికాలను ఏర్పాటు చేశారు. -
ఏఓబీలో కలకలం..
మక్కువ: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్ధంతో ఏజెన్సీ అదురుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజులుగా యుద్ధ వాతవరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబీకి సరిహద్దు గ్రామాలైన ఎర్రసామతవలస, దుగ్గేరు, మూలవలస, బాగుజోల, చిలకమెండంగి, మెండంగి, గుంటబద్ర, తదితర గ్రామాల్లో బుధవారం ముమ్మర కూంబింగ్ చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పళ్లు వినిపించాయి. వారంరోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట ఒడిశా రాష్ట్రం మల్కనగిరి, విశాఖ ఏజెన్సీ పెదబయలు మండల అటవీ ప్రాంతాలలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకొని ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. అలాగే మంగళవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు మంగళవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాకాబందీ నిర్వహించారు. సంస్మరణ వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా గతంలో మక్కువ మండలంలో పలుమార్లు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అతికించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మక్కువ మండలం ఏఓబీ సరిహద్దులో ఉన్నందున మావోయిస్టులు ఎదో ఒక రూపంలో వారి ఉనికిని చాటుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సంఘటనల్లో కొన్ని.. 2011 మే 15న మక్కువ మండలం ఎర్రసామంతవలస, దుగ్గేరు గ్రామాలలో ఏఓబీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. గ్రీన్‌హంట్‌ను తిప్పికొట్టాలని అప్పట్లో బ్యానర్లు కట్టి కలకలం రేపారు. అదే ఏడాది జూలై 28న ఎర్రసామంతవలసలో మరో బ్యానర్ కట్టి వారి ఉనికిని మరోమారు చాటుకునే ప్రయత్నం చేశారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అప్పట్లో మావోయిస్టులు (సీపీఐ)పేరిట బ్యానర్‌ను కట్టి మన్యంలో కలకలం సృష్టించారు. 2011 ఏప్రిల్ 24న చెక్కవలస రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2012 ఫిబ్రవరి 17న దుగ్గేరులోని రామమందిరం వద్ద శ్రీకాకుళం–కొరాపుట్ డివిజనల్ కమిటీ పేరుతో గోడపత్రికను అతికించారు. అలాగే ఎర్రసామంతవలసలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను కాల్చి వేశారు. అలాగే పనసబద్ర గ్రామంలో కరువుదాడి జరిగిన సంఘటనలున్నాయి. ఏవోబీకి మక్కువ మండలం అతిసమీపంలో ఉన్నందున మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేయడం.. పోలీసులు పట్టు సాధించేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారుతోంది. -
కరోనా భయం.. కొరవడిన మానవత్వం
తెర్లాం: కరోనా మహమ్మారి మానవత్వాన్ని తుంచే స్తోంది. మనుషులను కఠిన పాషాణులుగా మార్చేస్తోంది. ఏ కారణంగా మృతి చెందినా... ఆయనకు కరోనా ఉందేమోనన్న భయంతో దగ్గరకు వెళ్లేందుకు కూడా వెనుకంజ వేసేలా చేస్తోంది. ఇలాంటి సంఘటనే తె ర్లాంలో శుక్రవారం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కరోనా ఉందేమోనన్న భయంతో అంత్యక్రియలు జరిపించేందుకు కూడా బంధువులు ముందుకు రాలేదు. తుదకు ఎస్ఐ జోక్యం చేసుకుని ఆటోలో మృతదేహాన్ని తరలించి, తానే స్వయంగా దగ్గరుండి ఖననం చేయించారు. వివరాలిలాఉన్నాయి. తెర్లాం గ్రామానికి చెందిన వడ్డాది నూకరాజు(తాతా లు) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. విషయం బంధువులకు తెలియజేసినప్పటికీ అంత్యక్రియలు జరిపించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కన్నకుమారుడు దివ్యాంగుడు కావడంతో నిస్సహాయంగా ఉండిపోయాడు. శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ సహకరించలేదు. కరోనా పాజిటివ్ ఉందేమోనన్న భయంతో ఎవ్వరూ దగ్గరకు చేరలేదు. ఈ విషయాన్ని ఆయన సామాజిక వర్గానికే చెందిన కందుల శ్రీనివాసరావు ఎస్సై నవీన్ పడాల్‌కు ఫోన్లో తెలియజేశారు. ఆయన వెంటనే మృతుని ఇంటికి వచ్చి మరణించిన నూకరాజుకు కరోనా వైరస్ లేదని, అంత్య క్రియ లు జరిపించేందుకు ముందుకు రావాలని బంధువులకు నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఇక చేసేది లేక ఎస్ఐ మానవత్వంతో ఆలోచించి తానే ఆ మృతదేహా న్ని ఖననం చేసేందుకు పూనుకున్నారు. గ్రా మానికి దగ్గరలో ఉన్న చెరువులో జేసీబీతో గొయ్యిని తీయించారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి ఖననం చేశారు. అనారోగ్యంతోనే మృతి చెందాడు తెర్లాంకు చెందిన వడ్డాది నూకరాజు(తాతాలు) అనారోగ్యంతోనే మృతి చెందాడు. అతనికి కరోనా లక్షణాలు లేవు. వృద్ధాప్యంలో ఉండడంతో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మృతునికి కరోనా లేదు. కేవలం పుకార్లతోనే మృతునికి అంత్యక్రియలు జరిపించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని తెలిసింది. ఇది చాలా బాధాకరం. – డాక్టర్ రెడ్డి రవికుమార్, వైద్యాధికారి, తెర్లాం పీహెచ్సీ -
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి జరిమానా
పూసపాటిరేగ: నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కుమారుడు తమ్మునాయుడు అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తుండగా సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పూసపాటిరేగలోని సర్వే నంబరు 82–1, 2లో అనుమతి లేకుండా లేఅవుట్‌కు గ్రావెల్ తరలించడంతో ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడటంతో జరిమానా విధించారు. రెల్లివలసలో సర్వే నంబరు 17లో గల నడుపూరు రమేష్‌కు చెందిన వ్యసాయభూమి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా 350 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తరలించడంతో జరిమానా విధించినట్లు విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. పూసపాటిరేగలోని లేఅవుట్లో ఉన్న రెండు ట్రాక్టర్లు, జేసీబీ, రోడ్డురోలర్ మొత్తం నాలుగు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అసిస్టెంట్ జియాలజిస్టు రవికుమార్, రాయల్టీ ఇన్స్పెక్టర్లు ఎం.సురేష్‌కుమార్, రాంబాబు, సత్యమూర్తి, సర్వేయర్ తులసి, వీఆర్ఓలు అప్పలనాయుడు, దురగాసి రామకృష్ణ పాల్గొన్నారు. -
ఇసుక మరింత చౌకగా..
శృంగవరపుకోట: ఇసుక కొరత రానీయకూడదన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకుంటోంది. అన్ని వర్గాల అవసరాలకూ ఇసుక ఉచితంగా అందివ్వాలన్న నిర్ణయంతో ఎంతోమందికి మేలు కలగనుంది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి ఈ నెల 13న ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం నుంచి ఇది అమలులోకి రానుంది. భారీగా తగ్గనున్న ధరలు జిల్లాలో 80 ఇసుక రీచ్‌లు ఉండగా ఇవన్నీ 1 నుంచి 3 స్ట్రీమ్స్‌గానే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం 34 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక లభిస్తోంది. ఇప్పటి వరకూ టాక్టర్తో ఇసుక తరలించాలంటే ప్రభుత్వానికి రూ.1300లు చలానా కట్టాల్సి వచ్చేది. టైరు బండ్లు మాదిరిగా ట్రాక్టర్లతో ఇసుక రవాణాకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేదని తాజా ఉత్తర్వుల్లో తేల్చడంతో భారీగా ధర తగ్గనుంది. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1300లు, లోడింగ్ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1000 నుంచి 1500లు మొత్తం రూ3500 నుంచి 4000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇకపై చలానా ధర తగ్గడంతో వినియోగదారునికి వెసులుబాటు కలగనుంది. తాజా మార్గదర్శకాలు -వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్–1లో ఇసుక కోసం దరఖాస్తు చేయాలి. ∙24 గంటల్లో అర్జీని పరిశీలించి అనెక్సర్–2లో పర్మిట్‌ను సమయం, తేదీలతో ఇస్తారు. ఇసుకను రీచ్ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు. -ఇసుక రవాణా సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలి. -గ్రామకార్యదర్శి ఇసుక పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలి. 1నుంచి 3స్ట్రీమ్స్‌లో ఇసుక లభ్యత లేకుంటే జిల్లా కలెక్టర్ 4, 5 స్ట్రీమ్స్ నుంచి ఇసుక తెప్పించి స్టాక్‌యార్డుల ద్వారా సరఫరా చేస్తారు. లోడింగ్ చార్జీల భారం తగ్గాలి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న పలు రీచ్‌లలో ట్రాక్టర్ లోడింగ్‌కు రూ. 800 నుంచి 1000లు వసూ లు చేస్తున్నారు. గతంలో లోడింగ్ చార్జీలు రూ.400లే ఉండేది. క్రమంగా ఇసుకకు డిమాండ్ పెరగటంతో లోడింగ్ చార్జీలు కూడా పెంచేశారు. దీని భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకా రం లోడింగ్‌కు టన్నుకు రూ.90లు చొప్పున ట్రాక్టర్ (4.5టన్నులు)కు రూ.405లు తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా లోడింగ్ చార్జీలపై నియంత్రణ లేక పోవటంతో ఇసుక ధర తగ్గటం లేదు. ఇదే తీరుగా వినియోగదారుల అవసరాలను ట్రాక్టర్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల అవసరాలు తీర్చటం కోసం ఆదాయాన్ని వదులుకున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1300లు భారం తగ్గింది. సామాన్యులకు అందుబాటు.. ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం. తాజా ఉత్తర్వుల ప్రకారం ట్రాక్టర్లను రూ.1300లు చలానా నుంచి మినహాయించారు. జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న 34రీచ్‌ల నుంచి ఎక్కడైనా నిబంధనలకు లోబడి ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. శుక్రవారం నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ట్రాక్టర్ లోడింగ్‌కు రూ.405లు తీసుకోవాలి. అధిక వసూళ్లపై జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదిస్తాం. – కర్రా ప్రవీణ్‌కుమార్, జిల్లా ఇసుక సహాయ అధికారి -
ఉరకలు వేస్తున్న ‘ఉపాధి’
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 106 రోజులు... ఈ కొద్దికాలంలోనే గ్రామీణ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద వేతనదారులు ఆర్జించిన మొత్తం ఎంతో తెలుసా? రూ.416.72 కోట్లు.! కరోనా మహమ్మారి విజృంభణతో అన్ని రంగాల్లో పనులు కోల్పోతున్న విపత్తు సమయంలో ఇది ఎంతో చెప్పలేనంత ఊరట! రోజూ ‘ఉపాధి’ పనికి వెళితే.. సగటున రూ.236.70 చొప్పున దక్కిందంటే అంతకన్నా చెప్పేదేముంది? లాక్డౌన్ సమయంలో చేతి నిండా పని దొరకడం వారి జీవనానికి ఇబ్బంది లేకుండాపోయింది. జిల్లాలో ఉన్న వేతనదారులతో పాటు లాక్డౌన్ ప్రభావంతో ఎక్కడెక్కడి నుంచో స్వస్థలాలకు తిరిగివచ్చిన వారికీ ‘ఉపాధి’ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు పొందిన కుటుంబాల సంఖ్య 3,18,773 ఉండేది. లాక్డౌన్ ప్రభావం వల్ల వివిధ రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు చేరిన వారిలో ఎవరు కోరినా వెంటనే జాబ్‌కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కొత్త జాబ్‌కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో జిల్లాలో జాబ్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 3,65,648కు చేరింది. జిల్లా చరిత్రలో ఇదొక రికార్డు. మరో విశేషమేమిటంటే ఈ మూడున్నర నెలల కాలంలోనే వంద రోజుల పని దినాలను 22,078 కుటుంబాలు పూర్తి చేసేయడం విశేషం. మొత్తంమీద ‘ఉపాధి’ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య జిల్లాలో 6,10,098 మందికి చేరింది. ఇప్పటి వరకు ఇంతపెద్ద సంఖ్యలో గతంలో ఎప్పుడూ ఉపాధి పనులకు వచ్చిందే లేదు. మూడున్నర నెలల గణాంకాల ప్రకారం చూస్తే 1.76 కోట్ల పనిదినాలను కల్పించారు. ఒక్కో కుటుంబానికి సగటున 48.15 రోజుల పాటు పని దొరికింది. నెమ్మదిగా ప్రారంభమైనా... మార్చి 25 నుంచి లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి రావడంతో ‘ఉపాధి’పనులు నిలిచిపోయాయి. ఏప్రిల్ మూడో వారం వరకూ అదే పరిస్థితి. తర్వాత ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఏప్రిల్ ఆఖరు వారంలో పనులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ భయంతో ఎక్కువ మంది పనులకు దూరంగానే ఉంటూ వచ్చారు. డ్వామా అధికారులు అవగాహన కల్పించడం, పని ప్రదేశాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయడం, మరో వైపు ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మాస్కులు ఉచితంగా అందించడంతో వేతనదారుల్లో కాస్త ధైర్యం కలిగింది. దీంతో మే ప్రారంభం నుంచి నెమ్మదిగా మొదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో వేతనదారులు పనులకు హాజరుకావడం ప్రారంభమైంది. మే ఒకటో తేదీన కేవలం 68 వేల మందే పనులకు రాగా.. అది జూన్ ఒకటో తేదీకి 5.10 లక్షలకు చేరింది. జిల్లా చరిత్రలో ఇదొక రికార్డు. జూలైలో 30 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. సులభంగా పనుల గుర్తింపు.. ఎన్ఆర్ఈజీఎస్ కింద అనేక అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉన్నా.. గతంలో వాటిని తక్కువగానే గుర్తించేవారు. ఏవో కొన్ని రకాల పనులే చేపట్టేవారు. ఇప్పుడా విధానం మారింది. తక్షణ ప్రజోపయోగ పనులను గుర్తించడమే గాకుండా వెనువెంటనే చేపట్టేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మార్గం సుగమమైంది. ప్రజలకు వారి గడప వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థకు అంకురార్పణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ఎన్ఆర్ఈజీఎస్ను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే పనులు గుర్తిస్తున్నారు. వేతనాలు కూడా ఒకటీ రెండు వారాల్లోనే చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.416.72 కోట్లను వేతనదారులకు కూలి రూపేణా చెల్లించారు. ఒక్కొక్కరికీ రోజుకు సగటున రూ.236.70 చొప్పున కూలి గిట్టుబాటు కావడం మరో విశేషం. మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.21.88 కోట్లను ఖర్చు చేశారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.444.52 కోట్లు వ్యయం అయ్యింది. కోరిన అందరికీ పని కల్పిస్తాం ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి అదనంగా నాలుగు కోట్ల పని దినాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కోరిన అందరికీ పని కల్పిస్తాం. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జాబ్‌కార్డులు కోరిన వెంటనే ఇస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటించేలా పనులకు మార్కింగ్ చేయిస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వేతనదారులు కూడా కొన్ని స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం బాగోకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నాం. – ఇ.సందీప్, ప్రాజెక్టు అధికారి, డ్వామా ఉపాధి పనులే ఆదుకున్నాయి లాక్డౌన్ వేళ పరిశ్రమలు మూత పడటంతో ఉపాధి పనులు ఆదుకున్నాయి. నేను రాజమండ్రిలో ఓ దారాల కంపెనీలో పనిచేసేవాడిని. లాక్‌డౌన్‌తో దాన్ని మూసే శారు. సొంతూరు వచ్చేశాను. కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వడంతో మాకు ఉపాధి మార్గం కనిపించింది. రోజూ పనులకు వెళ్లి భార్యాపిల్లలను పోషించుకుంటున్నాను. – గనిశెట్టి రమణ, తాడపాల, మాకవరపాలెం మండలం ప్రభుత్వం ‘ఉపాధి’తో ఆదుకుంది నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. లాక్డౌన్ విధించిన తొలి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. మా నాన్న ఉపాధి పనికి వెళ్లేవారు. ఆ వచ్చే డబ్బుతోనే కుటుంబం గడిచేది. ముఖ్యమంత్రి ఆదేశాలతో నాకు కూడా ఉపా«ధి కలిగింది. నాన్నకు ఆసరా ఉండాలనే తలంపుతో నేనూ జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నాను. నెల రోజులుగా పనికి వెళుతున్నాను. ప్రభుత్వం ఉపాధి పనులను కల్పించి పేదలను ఎంతో ఆదుకుంది. – కన్నూరు శ్రీను, యండపల్లి, కోటవురట్ల మండలం -
విజయనగరం జిల్లాలో ‘స్వచ్ఛంద లాక్డౌన్’
సాక్షి, విజయనగరం: జిల్లాకు నాలుగు సంజీవని బస్సులు కేటాయించారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా జిల్లా అంతటా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కరోనా అనుమానితులు ఉన్నవారు వెంటనే హెల్ప్ లైన్‌కి కాల్ చేయాలని సూచించారు. (ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ) జిల్లాలో నేటి నుంచి వైద్య చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సను అందజేస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా ద్వారా చికిత్స పొందిన వారికి ప్రత్యేక భృతి అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 52535 శాంపిల్స్ సేకరించామని, వీరిలో 50156 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. జిల్లాలో మొత్తం 1073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 425 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. నేటి నుంచి జిల్లాలోని పట్టణాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (‘ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు’) -
లెక్కల్లో గోరంత...తవ్వకాల్లో కొండంత...
జిల్లాలో ఏ చెరువులో గ్రావెల్ కనిపించినా అక్రమార్కులు వదిలిపెట్టడం లేదు. అనుమతులు అక్కర్లేకుండానే ఇష్టానుసారం తవ్వేసి ఎంచక్కా కాసులు కూడేసుకుంటున్నారు. వీరికి రియల్టర్లు... కాంట్రాక్టర్లు... సహకారం అందిస్తుండటంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. పోనీ అధికారులు ఏమైనా అడ్డుకుంటున్నారా.. అంటే అదీ లేదు. వారు కూడా ‘మామ్మూలు’గానే వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఇటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోతోంది సరికదా... ప్రభుత్వ ఆస్తులకు తీరని నష్టం వాటిల్లుతోంది. బొబ్బిలి: జిల్లాలో 10,436 చెరువులున్నాయి. ఇందులో దాదాపు 35 శాతానికి పైగా చెరువుల్లోఅడ్డు అదుపు లేకుండా తవ్వేస్తున్నారు. వీరి తవ్వకాల వల్ల చెరువుల మదుములు పాడైపోతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వల్ల మదుములు లోతై కొద్దిపాటి నీరు కూడా పక్కనున్న పొలాలకు వెళ్లట్లేదు. తద్వారా రైతుల భూములు బీళ్లవుతున్నాయి. మరో పక్క వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కడమే వీరి పనిగా ఉంది. జిల్లాలోని మైన్స్ అండ్ మినరల్స్ ఆరుకు పైగా ఉండగా అందులో చాలా మట్టుకు వృద్ధి లేదు. మరో పక్క గ్రావెల్ మాత్రం ఏకంగా పెరిగిపోయింది. 2018–19 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఏకంగా 159 శా తం తవ్వకాలు పెరిగిపోయాయి. ఇది కేవలం కాంట్రాక్టర్లు చేపడుతున్న వివిధ పనులు, రియల్ ఎస్టేట్ల కోసం మా త్రమే! 2018–19లో 47,726 టన్నుల గ్రావెల్‌ను తవి్వతే ఈ ఏడాది ఏకంగా 1,23,704 టన్నుల గ్రావెల్‌ను తవ్వేశారు. కొద్దిపాటికే అనుమతి... ‘ఓ పది లోడ్లు మాత్రమే వేసుకుంటాం సార్’ అని అధికారులతో ఎంచక్కా మాట్లాడి అనుమతులు తెచ్చుకునే రియల్ట ర్లు, కాంట్రాక్టర్లు ఆ తరువాత వారి విశ్వరూపం చూపెడుతున్నారు. ఏకంగా రాత్రీ పగలూ తవ్వకాలు జరుపుతునే ఉంటారు. దీంతో చెరువులు, వాగులు, వంకలూ రూపును కో ల్పోతున్నాయి. చాలా చోట్ల విపరీతమయిన లోతును తవ్వేసి వదిలేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిండిపోయి అంచనా దొరకక పలువురు చిన్నారులు, యువత అందులో పడి మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో గతంలో పలు చోట్ల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రహదారులు కూడా ధ్వంసం వివిధ రకాల కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రక్లర్లు తమకు కేటా యించిన పనులను చేస్తూ వాహనాలను జోరుగా నడపడం వల్ల గ్రావెల్, ఇసుక వంటివి రోడ్లపైనే పడుతున్నాయి. ఫలితంగా రోడ్లు బురదమయం కావడం లేదా ఇసుకతో నిండిపోవడం జరుగుతోంది. దీనిపై ప్రయాణించే వాహన చోదకులు అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజలు నడవడానికి కూడా వీలుకాని స్థితిలో ఉన్నాయి. బాడంగి మండలం డొంకినవలసలోని వేర్ హౌసింగ్ గోదాము నుంచి అటు రైల్వే స్టేషన్‌కు ఇటు అంతర్రాష్ట్ర రహదారికి అనుసంధానమైన పక్కా తారు రోడ్డు. కానీ చూడటానికి గ్రావెల్ రహదారిలా కనిపిస్తోంది. కారణం... ఇక్కడ గోదాముల నిర్మాణానికి సమీపంలోని అంబటి బందలో పొక్లెయినర్‌తో తవ్వకా లు జరిపిన గ్రావెల్‌ను ఈ రహదారి మీదుగా తరలిస్తున్నారు. ముందు ఓ పక్కనున్న చాకలి బందలో తవ్వి ఇప్పుడు అవతలి వైపున్న అంబటి బంద నుంచి తవ్వేస్తున్నారు. అందువల్ల ఈ రహదారి దుస్థితి ఇలా తయారైంది. చర్యలు తీసుకుంటాం ఏయే ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు అనధికారికంగా జరుపుతున్నారో కనుక్కుని చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. గనుల శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాం. – పూర్ణచంద్ర రావు, ఉప సంచాలకుడు, గనుల శాఖ -
మారుతున్న పల్లె రూపురేఖలు
మన పల్లె ప్రగతి బాట పయనిస్తోంది. కోట్లాది రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులతో గ్రామాలు అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు చేకూరుతున్నాయి. మరోవైపు ఎప్పటిలాగే రోడ్లు, కాలువల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉపాధి హామీ కన్వర్జెన్సీ పనులతో గ్రామాల రూపురేఖలు శరవేగంగా మారిపోతు న్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. ఒకవైపు పాలనా వ్యవస్థలో మార్పులు, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన భారీగా జరుగుతోంది. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పాలనా వ్యవస్థ ప్రజల ముంగిటకే అందుబాటులోకి వచ్చింది. చాలాచోట్ల రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రజారోగ్యమే పర మావధిగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నా యి. ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ దశలవారీగా సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సహాయంతో ఈ భవనాల నిర్మాణం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతోంది. పనుల్లో పురోగతి జిల్లాకు రూ.243.82కోట్లతో 663 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించాల్సి ఉండగా 436 భవనాల నిర్మా ణం ప్రారంభమయ్యింది. రూ.130.36కోట్లతో 567 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా తొలివిడతలో 384 భవనాల నిర్మాణాన్ని చేపడుతుండగా, వీటి లో ఇప్పటికే 68 భవనాల పనులు ప్రారంభమయ్యా యి. 585 వెల్నెస్ సెంటర్ల నిర్మాణానికి రూ.74కోట్లు మంజూరుకాగా 41 సెంటర్ల నిర్మాణం కొనసాగుతోంది. జిల్లాకు ఇదివరకే 702 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు కాగా, వీటిలో 687 కేంద్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకోసం రూ.32.89కోట్లు మంజూరవ్వగా రూ.32.70కోట్లు నిర్మాణ సామగ్రికి, రూ.19.96లక్షలు వేతనదారులకు కేటాయించారు. మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా 1145 పాఠశాలలకు రూ.70.54కోట్లతో ప్రహరీలు మంజూరు చేయగా, వీటిలో 634 పనులు వివిధ దశల్లో ఉన్నా యి. మరోవైపు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కూడా జోరందుకుంది. గ్రామాలకు వెళ్లే లింకురోడ్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఉపాధిహామీ భాగస్వామ్యంతో చేపట్టారు. ముఖ్యంగా ఈ ఏడాది గిరిజన ప్రాంతంపై దృష్టిసారించి రహదారి సౌకర్యాన్ని కలి్పస్తున్నారు. గ్రామాల్లో డ్రైనేజీ నిర్మాణాన్ని కూడా మరోవైపు చేపడుతున్నారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనుల్లో భా గంగా జిల్లా వ్యాప్తంగా 17,904 సిమ్మెంటు కాంక్రీట్ రోడ్లు మంజూరు చేశారు. వీటి అంచనా విలువ సుమారుగా రూ.673.37కోట్లు కాగా, ఇప్పటివరకు 13,394 పనులు మొదలు పెట్టారు. అలాగే 81.46 కోట్లతో 117 బీటీ రోడ్లను మంజూరు చేయగా, ఈ పనులన్నీ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రూ.156.17కోట్ల తో 548 డబ్ల్యూబీఎం రోడ్లను మంజూరు చేయగా, వీటిలో 234 రహదారుల నిర్మాణం ప్రారంభమయ్యింది. ఆగస్టు నాటికి అన్నీ పూర్తి గ్రామ పరిపాలనకు కేంద్రస్థానమైన గ్రామ సచివాలయానికి తగిన వసతులతో, అవసరమైన విస్తీర్ణంతో భవనాలను నిర్మిస్తున్నాం. చాలాచోట్ల వీటిని ఆనుకునే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడక్కడా కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలకు స్థలం కొరత కారణంగా ఇంకా ప్రారంభం కానప్పటికీ, వీటన్నిటినీ ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న కతనిశ్చయంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లాకలెక్టర్ -
బొబ్బిలిలో కరోనా కలకలం
బొబ్బిలి: మున్సిపాలిటీలో కరోనా కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఒక్క సారిగా కేసు లు పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతు న్నారు. మొన్న చిన దేవాంగుల వీధి, నిన్న నెయ్యిల వీధిలో కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందగా అధికారులు పరీక్షలు నిర్వహించారు. శనివారం రాత్రి నెయ్యిల వీధి లోని ప్రజలకు శాంపిల్స్ తీశారు. అక్కడ నలుగురికి, దావా లవీధిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలడంతో వారిని నెల్లిమ ర్లలోని మిమ్స్‌కు చికిత్స కోసం తరలించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా బ యటి నుంచి వచ్చిన వారు అటూ ఇటూ సంచరిస్తుండటంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని భావిస్తున్నారు. అలాగే గ్రోత్‌సెంటర్ క్వారంటైన్ కేంద్రం నుంచి ముగ్గురు పాజిటివ్ వ్యక్తులను ఆదివారం మిమ్స్‌కు తరలించారు. వీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు. వీరు క్వారంటైన్లో ఉండగానే జిల్లాలోకి ప్రవేశించే ముందు తీసిన శాంపిల్స్ ద్వారా ఇప్పుడు పాజిటివ్ నమోదు అయింది. అందరికీ కామన్ బాత్రూం గ్రోత్‌సెంటర్ క్వారంటైన్లో కామన్ బాత్ రూం ఉంచారని అక్కడ క్వారంటైన్ పొందుతున్న ఆర్మీ జవాను గొట్టాపు మురళీధర్, గంట సురేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన 12 మందిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందనీ, అందరికీ మరుగుదొడ్లు, స్నానపు గదులు ఒక్కటేననీ, ఒకేచోట భోజనాలు పెడుతున్నారని, దీనివల్ల తమకు ఆందోళనగా ఉందని వాపోయారు. కొండవెలగాడలో ఇద్దరికి పాజిటివ్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పీహెచ్సీ వైద్యాధికారి ప్రశాంత్ రాజ్ ఆదివారం తెలిపారు. ఢిల్లీలో ఆర్మీ జవానుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ నెల 18న కొండవెలగాడకు వచ్చారని ఆ రోజే ఇద్దరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించామన్నారు. ట్రూనాట్ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని వెంటనే వారిని మిమ్స్ కోవిడ్ ఆస్పత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడతామన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై గ్రామాన్ని బ్లీచింగ్ మిశ్రమంతో శుభ్రం చేశారు. వైద్య, ఆరోగ్య, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. ఎవరికైనా అనుమానం వస్తే పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రా వాలని కోరారు. ఎస్సై అశోక్ కుమార్, ఆర్ఐ నరేష్ కుమార్ గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కలి్పంచారు. -
అమ్మ బతకాలని..
అమ్మ చేతి ముద్దలు తినాల్సిన ప్రాయం.. ఆ ఇద్దరు పిల్లలది. ఇప్పుడు అమ్మకి అన్నీ తామే అయ్యారు. చావుకు దగ్గరవుతున్న ఆమెను బతికించుకునేందుకు వారు పడుతున్న ఆరాటం చూసిన వారి గుండె తరుక్కుపోతోంది. తమ చదువును కూడా పక్కన పెట్టి తల్లి సేవకు అంకితమైన ఆ పిల్లలు దాతలు స్పందించాలని ప్రాధేయపడుతున్నారు. కొత్తవలస (శృంగవరపుకోట): ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన ఆలపాటి వెంకట సుబ్బారావు పొట్టకూటికి విశాఖపట్నం వలస వచ్చి ఊరూరా తిరుగుతూ అగరొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అరకుకు చెందిన వెంకటపద్మను 2004లో వివాహం చేసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసలో స్థిరపడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2018లో వెంకటపద్మ రెండు కిడ్నీలు పాడైపోవటంతో సుబ్బారావు తనకున్న దాంట్లో మూడేళ్లుగా వైద్యం చేయిస్తూ అప్పుల పాలైపోయాడు. వ్యాపారం నడవక.. వయసు మీరటంతో పూట గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఆమెకు మెరుగైన వైద్యం చేయించలేక సతమతమవుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఇచ్చే రూ.10 వేల పింఛన్ ప్రస్తు తం వారిని ఆదుకుంటున్నా.. మందులకో సం దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. బడికి దూరమైన పిల్లలు తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో ఆమెకు సేవలందించేందుకు వారికి ఉన్న ఇద్దరు పిల్లలు మూడేళ్లుగా బడికి దూరమయ్యారు. పరిస్థితి తెలుసుకున్న జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులను ఒప్పించి పెద్ద కొడుకు భరత్‌కుమార్‌కు పుస్తకాలు కొనిచ్చి చదివిస్తుండగా ప్రస్తుతం 9 తరగతికి వచ్చాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఇచ్చే కూర, రసంతో కాలం గడుపుతున్నారు. చిన్నకొడుకు వంశీ మాత్రం మూడోతరగతితో చదువు మానేసి తల్లి ఆలనా పాలనా చూస్తున్నాడు. నా పిల్లలు ఏమవుతారో.. నా రెండు కిడ్నీలు పోయాయి. నెలకు 12 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. చదువుకొని ఆడుకోéల్సిన నా ఇద్దరు పిల్లల్లో ఒకరు స్కూల్ మానేసి నాకు సేవలు అందిస్తున్నాడు. పెద్దకొడుకు ఇంటిపనులు చేస్తున్నాడు. నాపిల్లలు ఏమవుతారో తెలియడం లేదు. – ఆలపాటి వెంకట పద్మ వంట చేసి స్కూల్కెళ్తా.. ఉపాధ్యాయులు ఇచ్చిన ధైర్యంతో పాఠశాలకు వెళుతున్నాను. మా అమ్మ పరిస్థితి చూసి కొంత ఆర్థిక సాయం చేశారు. స్కూల్‌కు వెళ్లేముందు బొగ్గుల కుంపటిపై అన్నం వండి తమ్ముడికి అప్పగించి వెళ్తున్నా.. – భరత్‌కుమార్, పెద్ద కుమారుడు అందుకే బడికెళ్లడం మానేశా.. అమ్మకు రెండు కిడ్నీలు పోవటంతో ఏం చేయాలో తెలియడం లేదు. తలచుకుంటేనే ఏడుపు వస్తోంది. అమ్మకి సేవలు చేసేందుకు మాకు ఎవరూ లేరు. అందుకే నేను బడికి వెళ్లటం మానేశాను. – వంశీ, చిన్న కుమారుడు నైతిక విలువలున్న కుటుంబం కన్నతల్లికి రెండు కిడ్నీలు పాడవటంతో చూసుకోవడానికి రెండో కొడుకు పాఠశాలకు రావటం మానేశాడు. విషయం తెలుసుకుని తోటి ఉపాధ్యాయులంతా కొంత మొత్తం వేసుకుని కుటుంబానికి సాయం చేశాం. నైతిక విలువలున్న కుటుంబం వారిది. – కృష్ణవేణి, విశ్రాంత ఉపాధ్యాయిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ స్పందించే దాతలు 90529 81811 ఫోన్‌నంబర్‌కు ఫోన్ చేసి సాయం అందించాలని ఆ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. -
శభాష్ పోలీస్
-
పల్లెకు పైసలొచ్చాయ్...!
విజయనగరం: రెండేళ్లుగా నిధుల కొరతతో సతమతమవుతున్న పంచాయతీలపై కేంద్ర ప్రభు త్వం కరుణ చూపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిబంధనలను పక్కనపెట్టి 14వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. దీనిద్వారా పల్లెలు పారిశుద్ధ్య, తాగునీటి సమస్యల నుంచి గట్టెక్కేందుకు అవకాశం లభించింది. జిల్లాలో 919 గ్రామ పంచాయతీలకు రూ. 46,46,65,800లు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం వీటిని పల్లె ఖాతాలకు జమ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరగాల్సిన గ్రామ పంచాయతీల ఎన్నికలు అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహించకపోవడంతో నిధులు విడుదల కాకుండా పోయాయి. అప్పటి నుంచి కేవలం సాధారణ నిధులతోనే పల్లెలు నెట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణుకుతున్న కష్టకాలంలో నిధులు అందుబాటులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాడు సగం నిధులే...: పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం 2018 ఆగస్టుతో పూర్తయింది. అప్పటినుంచి ఎన్నికలు లేకుండా పంచాయతీలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సగం మాత్రమే వచ్చాయి. పాలకవర్గాలు లేకపోవడంతో మిగతా నిధులు మంజూరు చేయలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించిన నిధులు నిలిచిపోయాయి. ఇటీవల స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆఖరి నిమిషంలో కరోనా వల్ల అవీ వాయిదా పడ్డాయి. దీనివల్ల 14 ఆర్థిక సంఘం నిధులు మరి రావని ఆందోళన చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విషపు కోరలు చాస్తుండడంతో గ్రామాల్లో నిధుల సమస్య తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఎన్నిక లు నిర్వహించకపోయినా బకాయిలు విడుదల చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 46.46 కోట్లు జిల్లాకు మంజూరు చేశారు. జనాభా ప్రాతిపదికన సర్దుబాటు: జిల్లాకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు సర్దుబాటు చేస్తున్నారు. తలసరి రూ.242 చొప్పున పంచాయతీలో ఎంతమంది జనాభా ఉంటే అంత మొత్తం ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను కొత్త పంచాయతీలకు కూడా జనాభా ప్రాతిపదికన సర్దుబాటు చేయాల్సి ఉంది. నిబంధనలకు లోబడే వినియోగం: నిధులు అందుబాటులో ఉన్నాయని ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా అవసరాలకు దామాషా ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. మంజూరైన రూ. 46.46 కోట్లలో రూ. 4.09 కోట్లు సమగ్ర రక్షిత నీటి పథకాల నిర్వహణకు, మరో రూ.1.60 కోట్లు బోరువావుల నిర్వహణకు జిల్లా పరిషత్‌కు మళ్లించనున్నారు. మిగిలిన రూ. 40.76 కోట్లు పంచాయతీల ఖాతాల్లోకి జమ చేసేందుకు జిల్లా పంచాయతీ ఖాతాల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. -
సరిహద్దులో శత్రువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎక్కడో చైనాలో వచ్చిందిలే మనవరకూ రాదనుకుంటున్నాం. పక్కదేశాలకు పాకిందంటే మనకు పర్లేదులే అనుకున్నాం. మన దేశంలోకే, పొరుగు రాష్ట్రానికి కూడా వచ్చేసిందనగానే... మన దగ్గరకు రాలేదనుకున్నాం. కానీ చూస్తుండగానే అతి తక్కువ సమయంలోనే మన జిల్లా పక్కకే వచ్చేసింది కరోనా మహమ్మారి. పక్కనే ఉన్న విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో కొత్తగా కేసు వెలుగు చూసింది. మనం అత్యంత జాగ్రత్తగా లేకపోతే కరోనా వైరస్ మన వరకూ రావడానికి ఎంతో సమయం పట్టదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జిల్లాలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పలు చర్యలు చేపడుతున్నారు. (కరోనా యాప్ రాబోతుంది) యంత్రాంగం అప్రమత్తం జిల్లాలో కోవిడ్–19 నివారణలో భాగంగా అమ లు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె, ఉపిరి తిత్తుల వ్యాధులు వంటి దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారి సమాచారం సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. (భయం గుప్పిట్లో వెంకటాపురం) ఈ వ్యాధులతో బాధపడుతున్న వారి ఇంటికే అవసరమైన మందులను జిల్లా డ్రగ్ స్టోర్ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సంపూర్ణ పోషకాహార పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలను గుర్తించి వారికి అవసరమైన పోషకాహారాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తల ద్వారా వారి ఇంటికే రేషన్ సరుకులు అందజేస్తున్నారు. ఈ నెల 29 నుంచి రేషన్ సరుకులను తెల్ల రేషన్ కార్డుదారులకు ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వలంటీర్ల ద్వారా ఇంటికే అందించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. కూరగాయలకు కొరత లేకుండా... పట్టణాలు, గ్రామాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయల లభ్యతను పరిశీలించి రానున్న రోజుల్లో వాటి సరఫరాలో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి జిల్లా యంత్రాంగానికి తెలియజేసేలా క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎక్కడా నిత్యావసర సరుకులు, కూరగాయలకు కొరత లేకుండా ప్రయత్నిస్తున్నారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ శాఖల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే పంప్ మెకానిక్‌లు, బోర్ మెకానిక్‌లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు, లైన్మన్లకు అవసరమైన గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కరోనా నివారణ చర్యల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి సంబంధిత రెవిన్యూ డివిజన్ అధికారులు, జిల్లా రెవిన్యూ అధికారి ద్వారా అవసరమైన మేరకు పాస్‌లు జారీ చేయనున్నారు. రోగగ్రస్తుల సమాచార సేకరణ పూర్తి జ్వరాలు, ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి జరుపుతున్న సమాచార సేకరణ శుక్రవారం సాయంత్రానికి దాదాపుగా పూర్తయ్యింది. జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపు, వారు ఎన్ని రోజుల క్రితం చేరుకున్నదీ, ఎప్పటి నుంచి ఇంటి వద్ద క్వారంటైన్లో ఉన్నదీ తదితర వివరాలను గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్ఎంలు సేకరించి అధికారులకు అందజేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మన జిల్లాకు వచ్చే వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటి వరకు 437 మంది విదేశాల నుంచి జిల్లాకు చేరినట్టు గుర్తించారు. వారంతా ఎన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారో సంబంధిత సమాచారం సేకరిస్తున్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అవసరమైన పరికరాలు సదుపాయాలూ ఉన్నదీ లేనిదీ పరిశీలించి చెక్ లిస్టు మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తున్న జనం నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు రోడ్లపైకి వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. రెండు రోజులతో పోల్చుకుంటే ఈ విషయంలో శుక్రవారం ప్రజల్లో చైతన్యం పెరిగింది. విచ్చలవిడిగా సంచరించకుండా అన్ని చోట్ల మీటరు నుంచి రెండుమీటర్ల దూరం పాటిస్తున్నారు. చివరికి మెడికల్ దుకాణాల వద్ద సైతం ప్రజలు స్వీయ నియంత్రణ పాటించటం గమనార్హం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు జిల్లాలోని అన్ని పంచాయతీలు, పట్టణాల్లో కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. వీధుల్లోని కాలువల్లో వ్యాధినిరోధక మందులను స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల పల్లెవాసులు, పట్టణవాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
విజయనగరంలో లాక్డౌన్..
-
నిలువునా ముంచిన ‘కరోనా’
కరోనా వైరస్ కోళ్ల పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసింది. మొక్కజొన్న రైతులను నిలువునా ముంచేసింది. కోళ్లకు ప్రధాన మేత అయిన మొక్క జొన్న వినియోగం అమాంతం తగ్గింది. ఫలితం.. మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మొన్నటివరకు రూ.2,200 పలికిన క్వింటా ఇప్పుడు రూ.1300కు పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్‌గా మారి పంటను దోచుకుంటుండడంతో శ్రమకు తగిన ఫలితం దక్కడంలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. చీపురుపల్లి రూరల్/సాలూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మొక్క జొన్న రైతులనూ విడిచిపెట్టలేదు.చీడపీడలు, ఈదురుగాలులకు పంట నేలకొరగడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఇప్పుడు ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో మొక్కొజన్న రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న ఉత్తత్తిలో అధిక శాతం (సుమారు 90 శాతం) కోళ్ల పరిశ్రమకు వెళ్తుంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రస్తుతం చికెన్ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫౌల్ట్రీ యజమానులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో పరిశ్రమను నిలిపివేస్తున్నారు. ఫలితం.. కోళ్లకు మేతగా వినియోగించే మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ ప్రభావం రైతులపై పడింది. (కరెంటుకు ‘కరోనా’ షాక్!) ఒక్కసారిగా ధరలు పతనం... జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 18వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గత ఖరీఫ్‌లో క్వింటా మొక్కజొన్నలు బస్తా రూ.2,400 నుంచి రూ.2,200 ధర పలికేది. దీంతో సాగు విస్తీర్ణం పెంచారు. పంట చేతికొచ్చేవేళ... దేశంలో కరోనా వైరస్ ప్రభావం కనిపించడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.1300లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో బస్తాపైన సుమారుగా రూ.900లు నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. దీనిని అదునుగా తీసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల పంటను నిలువునా దోచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. (కోవిడ్-19: వారికి సోకదు) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వినతి... మొక్కజొన్న పంటను కొనుగోలుకు ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం మొక్కజొన్నపంటకు క్వింటా రూ.1760 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఆ సమయంలో పంట తక్కువగా ఉండడం, మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో రైతులు వ్యాపారులకు అమ్మకాలు జరిపారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు వ్యాపారులు పంటకు ధరలను అమాంతం తగ్గించేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
హోంగార్డులకు స్థలయోగం
ఇన్నాళ్లకు వారి వెతలు తీరాయి. వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వారి గురించి పట్టించుకునే పాలకులు లభించారు. అచ్చంగా పోలీసు విధులే నిర్వర్తిస్తున్నా ఎలాంటి సౌకర్యాలకు నోచుకోక... అరకొర వేతనాలే లభిస్తున్నా కష్టాలకు వెరవక... ఇబ్బందులు ఎదురవుతున్నా... వాటిని మునిపంటినే దాచుకుని విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వారికీ స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేనా... వాటిపై ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం పూల్‌బాగ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఎన్నో సేవలు అందిస్తున్న హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. అందుకోసం ఇటీవల జీఓ 77ను విడుదల చేసింది. దీని ప్రకారం హోంగార్డుల సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. ఇప్పటికే ఈ జీఓ ప్రకారం జిల్లాకేంద్రంలోని విజయనగరం నియోజకవర్గం పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. ఇంకా మండలాల వారీగా ఆయా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. చాలా మండలాల్లో తహసీల్దార్లు దీనిపై దృష్టి సారించకపోవటంపై ఆయా మండలాల పరిధిలోగల హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి న్యాయం చేసేందుకు ముందుకు వస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చిన అవకాశాలు చేతికి అందకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. తహసీల్దార్లకు ఆదేశాలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం కలక్టర్ హరిజవహర్‌లాల్, గృహ నిర్మాణశాఖాధికారులకు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. కొన్ని చోట్ల అసలు ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా హోంగార్డులకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరితో పాటు పట్టాలు అందజేయనున్నారు. వీరికి ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన స్కీం ద్వారా గృహ నిర్మాణానికి రూ.1.50లక్షలు అందజేయనున్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా పలు సందర్భాల్లో హోంగార్డుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలను విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి హోంగార్డులకు కూడా ఇళ్ల స్థలాల పంపిణీ, ఆ తరువాత ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసేందుకు జీఓ నంబర్.77ను విడుదల చేశారు. సీఎంకు రుణపడి ఉంటాం... హోంగార్డుల సమస్యలపై చాలా సార్లు చాలా ముఖ్యమంత్రులకు వినతులు అందజేశాం. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మా సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు, మాకు గూడు కలి్పంచేందుకు ఇప్పుడు జీఓ నెం.77 విడుదల చేశారు. హోంగార్డులందరికీ గృహనిర్మాణంకోసం, ఇళ్ల స్థలాలు అందజేస్తున్నారు. ఆయన సేవలు మరువలేనివి. – పడగల బంగార్రాజు, జిల్లా అధ్యక్షుడు, హోంగార్డులసంక్షేమ సంఘం. విజయనగరం. బీమా పెంచారు. గతంలో కంటే ఇప్పుడు బీమా మొత్తం చాలా ఎక్కువ పెంచారు. హోంగార్డులు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.30లక్షలు బీమా సదుపాయం కల్పించారు. దీనివల్ల కొంత భరోసా లభించింది. హోంగార్డుల విషయంలో ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. – ఎస్.గోపాల్, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యుడు, పార్వతీపురం. జీతాలు పెంచారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హోంగార్డుల జీతాలు పెంచారు. వాటితో పాటు బీమా పెంచారు. ఇప్పుడు నివాసం కోసం ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – ఎస్.రవి, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యులు,విజయనగరం. -
అభివృద్ధిలో ‘స్థానిక’ పాలనే కీలకం
పార్వతీపురం: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక పాలన కీలకం. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిధులు చక్కగా సది్వనియోగం అయితే... ప్రత్యామ్నాయంగా రాష్ట్రం, దేశం అభివృద్ధిచెందుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధి సూచిక అన్న నినాదం అందరికీ తెలిసిందే. గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావల్సిందేనని అందరూ అంగీకరించాల్సిన విషయం. స్థానిక సంస్థల ఏర్పాటుతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసంఘం నిధులు విడుదలై గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 5వేల కోట్లవరకు వెనక్కి పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి గత 18నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడమే కారణం. నిధులు సద్వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలో నిలిచేవారిలో కొందరికి విధులు, అధికారాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం సహజమే. ఓటర్లు కూడా తాము ఎన్నుకున్న నాయకుడు నెరవేర్చాల్సిన బాధ్యత, ప్రాధాన్యాలు తెలుసుకోవాలి. ఎంపీటీసీలు ఏంచేయాలి... విధులు, అధికారాలు.. జెడ్పీటీసీలు పరిస్థితి తదితర అంశాలను తెలుసుకుందాం. జెడ్పీటీసీల ఆవశ్యకత ఇలా... జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ చట్టం పక్కాగా అమలై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే జిల్లా పరిషత్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిందే. జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. ఏ తీర్మాణాలు ఆమోదించాలన్నా మెజార్టీ సభ్యులు తప్పనిసరి. ఆమోదించే కార్యక్రమాలు సక్రమంగా నిర్వíర్తించే బాధ్యత సభ్యులపై ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకెళ్లాలి. మండల పరిధిలో జిల్లా ప్రాదేశిక సభ్యులను ఆయా మండల ప్రజలు నేరుగా ఓటుహక్కుతో ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలోని ఎన్నికకాబడిన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. జెడ్పీటీసీలు మండలంలోని ప్రజల్ని సమన్వయపరచి అభివృద్ధి, పాలనలో భాగస్వామ్యులవుతారు. జిల్లాపరిషత్ నిర్వహణలో లోపాలు, అలసత్వం, నిధుల దుర్వినియోగంపై జెడ్పీ చైర్మన్, సీఈఓల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 15 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి జెడ్పీ పరిపాలనపై సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సీఈఓ ప్రతీ మూడు నెలలకు ఒకమారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక నివేదికపై చర్చిస్తారు. అన్ని ప్రభుత్వ, జెడ్పీ అధికారిక ఉత్సవాలకు, కార్యక్రమాలకు జెడ్పీటీసీలను తప్పనిసరిగా అహ్వానించాలి. నియోజకవర్గ ఆర్థిక సలహా కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జెడ్పీ పాఠశాలల స్థితిగతుల మెరుగుకు సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందించవచ్చు. నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎంపీటీసీల అధికారాలు.. విధులు ఎంపీటీసీలు మండల పరిషత్‌లో ఓటు హక్కును వినియోగించుకుని మండలాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీలకు సంబంధిత ప్రాదేశిక సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపీపీ పదవి పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీటీసీలు అధ్యక్షుడ్ని, ఉపాధ్యాక్షుడిని ఎన్నుకునే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో మండలాభివృద్ధిలో ఎంపీటీసీలే కీలకం అవుతారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు తొలిమూడు సమావేశాలలోపు ప్రమాణ స్వీకారం చేయాలి. లేనిపక్షంలో వారి సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో పాటు వరుస మూడు సమావేశాలకు గైర్హాజరైన సభ్యత్వం పోతుంది. ఆయా పరిధి గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ శాశ్వత అహ్వానితుడవుతారు. పాలకవర్గంలో మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. పంచాయతీ అభివృద్ధిపై సూచనలు, సలహాల మేరకు పరిమితమవుతాడే తప్ప నిర్ణయాధికారం మాత్రం ఉండదు. వారి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల విద్యాప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల దురి్వనియోగం అయితే ప్రశ్నించే అధికారం ఉంటుంది. -
ఏం సాధించారని వస్తున్నారు బాబూ...
అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ... ఎన్నెన్నో శుష్క వాగ్దానాలు చేశారు. ఏవీ నెరవేర్చకుండానే కాలం గడిపేశారు. వెనుకబడిన జిల్లాను ఏమాత్రం పట్టించుకోలేదు. అభివృద్ధికి చేపట్టిన చర్యలూ లేవు. ఆ పరిస్థితులపై విసిగెత్తిన జనం గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు విశాఖకు రాజధాని ద్వారా జిల్లా అభివృద్ధి సాధిస్తుందనుకుంటే... దానినీ అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారు. తగుదునమ్మా... అని ఇప్పుడు జిల్లాకు వస్తున్న ఆయన తీరును జిల్లావాసులు ఎండగడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ నిలదీస్తున్నారు. సాక్షి ప్రతినిధి విజయనగరం: చంద్రబాబు నాయుడు. ఈ పేరు చెబితేనే జిల్లావాసులు ఊగిపోతున్నారు. ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని చేసిన కుట్రల్లో తాము ఎంతగా కష్టపడిందీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమను పీడించిన నియంతృత్వ పోకడల్ని మరిచిపోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఈ గాయాలకు మందు రాసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ గాయం తాలూకు మచ్చలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మానిపోతున్నాయి. జిల్లా ప్రజలకు భవిష్యత్తు మీద ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మరోసారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు మళ్లీ జిల్లాకు వస్తున్నారు. పేరుకే చైతన్యయాత్ర... ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది జనవరి మొదటివారంలోనే రావాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఇప్పటికైనా రాకపోతే ప్రజలు పూర్తిగా మర్చిపోతారని భయపడి జిల్లా పర్యటనకు వస్తున్నారు. శృంగవరపు కోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయన పాలనలో ఒరిగింది శూన్యం ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు చేపట్టిన ఈ పర్యటనపై జిల్లా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. విజయనగరం జిల్లా ఎప్పటి నుంచో వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. ఇక్కడి నుంచి వేలాదిమంది ప్రజలు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. జిల్లా ప్రజల మంచికోసం చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయలేదు. భోగాపురం విమానాశ్రయానికి టెండర్లు ఆయన హయాంలో ఖరారు చేయలేకపోయారు. జిల్లా ప్రజల చిరకాల కోరికైన మెడికల్ కళాశాలను స్థాపించలేకపోయారు. జూట్ మిల్లులు, పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోలేదు. పైపెచ్చు జన్మభూమి కమిటీలతో సామాన్య ప్రజలను నానా రకాలుగా హింసించారు. స్వపార్టీ వారికే సంక్షేమ పథకాలు ఇచ్చుకున్నారు. ఇలా అనేక విధాలుగా ప్రజలను బాధపెట్టారు. ఇన్నాళ్లకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి జనం బాగుకోరే ముఖ్యమంత్రి వచ్చారు. ఉత్తరాంధ్రకు మంచి చేయాలని భావించి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవాలని, ఏమాత్రం జిల్లా ప్రజలకు మంచి జరగనివ్వకూడదని పర్యటనల పేరుతో జన వంచనకు సిద్ధమై వస్తున్నారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన చంద్రబాబు పర్యటనను జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే, విజయనగరం జిల్లాకు వెనుకబాటుతనం పోవాలంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలని, విశాఖలో పరిపాలన రాజధాని రావాలని కోరుకుంటున్నారు. కానీ దానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఎందుకు పర్యటిస్తున్నారు? విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుకు ససేమిరా అంటున్న విపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు కోల్పోయారు. ఏ మొహం పెట్టుకొని ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విజయనగరం వేదికగా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమరి్ధంచాలి. టీడీపీ నాయకులు ఆ మేరకు తమ నేతకు దిశ నిర్దేశంచేయాలి. కె.కూర్మినాయుడు,న్యాయవాది,పార్వతీపురం ఆయన అధికారంలో చేసిందేమిటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ మేలూ చేయలేదు. అప్పుడు లేని ప్రజాచైతన్య యాత్రలు ఇప్పుడు ఎవర్ని మోసగించడానికి చేపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబునాయుడు స్వార్ధంతో దానిని అడ్డుకుంటున్నారు. ఇదేనా ఆయనకు జిల్లాపై ఉన్న ప్రేమ? – కె.వి.కె.రెడ్డి, కాంట్రాక్టర్, పార్వతీపురం అభివృద్ధిని అడ్డుకుని ఇప్పుడు చైతన్యయాత్రలా? రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడి తే వాటిని అడ్డుకుని... ఇప్పుడు చైతన్యయాత్రలంటూ ఎలా వస్తున్నారు? జిల్లా అభివృద్ధికి ఆయన పాటుపడుతుంటే అసె ంబ్లీలో అడ్డుకుని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు. – ఇండుపూరు గున్నేష్, వ్యాపారివేత్త, పార్వతీపురం బాబును నమ్మే రోజులు పోయాయి... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే రోజులు ఎప్పుడో పోయా యి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఆయన హయాంలో జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టలేదు. ఏదైనా కార్యక్రమం చేపడితే ఓ అర్ధం ఉండాలి. ఈ యాత్ర ఇప్పుడెందుకు చేస్తున్నారో సొంత పార్టీ నేతలకే తెలియడంలేదు. జిల్లావాసులకు న్యాయం చేయలేని బాబుకు ఈ జిల్లాలో పర్యటించే హక్కు కోల్పోయారు. – పెనుమత్స సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అధికారంలో ఉన్నపుడు ఏంచేశారు? రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు విజయనగరం జిల్లా అంటే గుర్తు లేదు. ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర అంటూ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ప్రజా చైతన్య యాత్ర పేరుతో అభివృద్ధిని అడ్డుకొనేందుకు వస్తున్నందుకు ప్రజలే బుద్ధి చెబుతారు. – బిడ్డిక అన్నాజీరావు, గిరిజన సంఘం నాయకుడు, నీలకంఠాపురం ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిందేమిటి ఉత్తరాంధ్రకు ఇన్నాళ్లూ వెనుకబాటుకు గురిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ రాజధానిని అడ్డుకుంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజాచైతన్యయాత్ర చేస్తున్నారు? జిల్లాకు న్యాయం చేయలేని ఆయన ఇక్కడకు వచ్చే అర్హత కోల్పోయారు. – చుక్క ఈశ్వర అప్పారావు, పీఆర్టీయూ నేత, కొత్తవలస -
వసతి దీవెన
-
అలాగే వదిలేస్తారా...
విజయనగరం గంటస్తంభం: రెవెన్యూ రికార్డుల్లో అనేక లోపాలున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. వాటిని సరిదిద్దేందుకు భూ(ల్యాండు) రికార్డులు స్వచ్ఛీకరణ(ఫ్యూరిఫికేషన్) చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో అన్ని గ్రామాల్లో రికార్డులు ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి రికార్డుల ప్యూరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి ఈ నెలాఖరు వరకు అన్ని గ్రామాల్లో ఆర్ఎస్ఆర్ రికార్డుతో వెబ్‌ల్యాండు రికార్డు సరి చూశారు. డిసెంబర్ 1న తొలివిడత గ్రామాల్లో గ్రామసభ నిర్వహించారు. డిసెంబర్ 2 నుంచి 2020 జనవరి 31వ తేదీ వరకు తొలివిడత గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వినతిపత్రాలు తీసుకుని, వాటిని పరిష్కరించి రికార్డు సరి చేయాలి. రెండో విడత మార్చి నెలాఖరు నాటికి, మూడో విడత మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలి. కానీ మొదటి విడత గ్రామసభలు వరకు అంతా సక్రమంగా జరిగినా తర్వాత కార్యక్రమం కాస్తా మరుగున పడిందనే చెప్పాలి. అప్డేట్ కాని రికార్డులు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా రెవెన్యూ రికార్డులు సరిదిద్దాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మాన్యువల్ రికార్డులతోపాటు వెబ్‌ల్యాండు రికార్డులు సరి చేయడంపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరు ప్రధాన సమస్యలపై దృష్టిసారించి రికార్డులు సరి చేయాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ కార్యక్రమం సత్ఫాలితాలిస్తుందన్న నమ్మకం కలగట్లేదు. మొత్తం సబ్ డివిజన్లలో ఉన్నతాధికారులు తయారు చేసిన ఫార్మాట్లో జిల్లాలో అధికారులు 18,46,406 అప్లోడ్ చేశారు. కానీ 9,75,078.34 ఎకరాలు మాత్రమే అప్లోడ్ చేశారు. మిగతా విస్తీర్ణం గురించి క్లారిటీ లేదు. అసలు ఇందులో మొదటి విడత గ్రామాల్లో ఎన్ని సబ్డివిజన్లు, విస్తీర్ణం ఉంది... అందులో ఎన్ని, ఎంత అప్లోడ్ చేశారన్నది తెలియడం లేదు. తహసీల్దార్లు భూమి రికార్డుల స్వచ్చీకరణ డేటా అప్లోడ్ కూడా చేయడం లేదు. అయినా రాష్ట్రంలో మనమే ముందంజలో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. అధికారుల మీన మేషాలు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూమి రికార్డులు స్వచ్చీకరణ కార్యక్రమం చేపట్టినా అధికారులు మాత్రం నిర్లిప్తంగానే ఉన్నారు. గ్రామాల్లో వీఆర్వోలు భూమి రికార్డులు స్వచ్చీకరణ గ్రామసభలు సక్రమంగా పెట్టలేదు. తొలివిడత గ్రామాల్లో రైతుల నుంచి ఎన్ని వినతులు వచ్చాయన్న విషయం చెప్పలేకపోతుండడం ఇందుకు నిదర్శనం. నవశకం సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీ, ఓటర్ల జాబితా సవరణ సాకుగా మొన్నటివరకూ చెప్పిన అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రెవెన్యూసంఘం నాయకుల ద్వారా రెవెన్యూ మంత్రిని కోరారు. ఎక్కువ సమయం ఇచ్చినందున వాయిదా కుదరదని మంత్రి చెప్పినా వీరి తీరు మారలేదు. నవశకం సర్వే పూర్తయినా, ఇళ్ల పట్టాలు పంపిణీ పనిభారం కొంత తగ్గినా రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మొత్తమ్మీద ఈ కార్యక్రమాన్ని ప్రహసనంగానే కొనసాగిస్తున్నారు. వీరి తీరువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కార్యక్రమం కొనసాగుతోంది భూమి రికార్డుల ఫ్యూరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తొలివిడత గ్రామసభలు జరిగాయి. అందులో గుర్తించిన సమస్యలు తహసీల్దార్లు పరిష్కరిస్తున్నారు. అయినా అందుకు సంబంధించి డేటా మాకైతే పంపడం లేదు. అందువల్లే స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఇకపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతాం. – బాలాత్రిపుర సుందరి, ఎస్డీసీ, కేఆర్ఆర్సీ, విజయనగరం -
ఆరోగ్య భాగ్యం
బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. కొత్త మార్గ దర్శకాలతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా 7,14.389 కుటుంబాలకు విడతల వారీగా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 28లోగా ఈ పంపిణీ పూర్తి చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం గత ప్రభుత్వ హయాంలోనూ ఉన్నప్పటికీనిధుల విడుదలలో కొర్రీలు వేసేది. వందల కోట్ల రూపాయలను పెండింగ్‌లో పెట్టి రోగుల సహనానికి పరీక్ష పెట్టేది. కొన్ని వ్యాధులను జాబితా నుంచి తొలగించింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేదలకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అదనంగా వెయ్యి వ్యాధులకు వైద్యం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఉన్న వారికి గతంలోలా కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే వైద్యం కాకుండా దాదాపు అన్ని రకాల వ్యాధులూ ఉచితంగా నయం చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది గతంలో 1059 రకాల వ్యాధులకు మాత్రమే పరిమితమయిన ఈ పథకాన్ని ఇప్పుడు 2059 రకాల వ్యాధులు, రోగాలకు వర్తింపజేస్తున్నారు. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల వరకూ అయ్యే శస్త్రచికిత్సను ఉచితంగా చేస్తారు. మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రూ.10లక్షల వరకూ అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఈ చెల్లింపులు రూ.3లక్షల వరకూ ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు చెల్లించకపోవడంతో రోగ గ్రస్తులు ఆస్పత్రుల మెట్లు ఎక్కి దిగడం తప్ప మరే విధమైన ప్రయోజనం పొందలేదు. ఇప్పుడు రూ. 5 లక్షల వరకూ ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. కోలుకునేవరకూ ఆర్థిక సాయం.. రోగులకు ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేయడంతో పాటు వారు డిశ్చార్జి అయిన తరువాత కోలుకునే వరకూ విశ్రాంతి సమయంలో అయ్యే ఖర్చులను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగికి డాక్టర్ సూచించే అవసరమయిన విశ్రాంతి దినాలను బట్టి రోజుకు రూ.250లు లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలను రాష్ట్ర ప్రభుత్వం రోగి అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది. అర్హతకు వెసులు బాటు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించేందుకు కుటుంబానికి 12 ఎకరాల సాగు భూమి లేదా 35 ఎకరాలలోపు పంట భూములు, బీడు భూములు కలపి ఉన్నా అర్హత పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే కారున్నా ఈ పథకం వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.5 లక్షలున్నా, 3వేల చదరపు అడుగుల స్థలానికి మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను కడుతున్నా అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ఆపరేషన్లూ ఇక ఉచితం గతంలో ప్యాకేజీలు ఉండేవి. ఎక్కువ మొత్తం ఖర్చయ్యే వాటికే వర్తించేవి. ఇప్పుడు వెయ్యి రూపాయల దగ్గర నుంచీ ఉచితంగా చేస్తారు. కోలుకునేందుకు కూడా డబ్బులు ఇస్తారు. – ఎస్.వి.రమణ కుమారి, డీఎంహెచ్ఓ ఆరోగ్యశ్రీ లేక మా అమ్మ చనిపోయింది మా అమ్మ రమణమ్మకు క్యాన్సర్ సోకడంతో వివిధ ఆస్పత్రులకు తిప్పాం. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని గతేడాది వైజాగ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. పథకం వర్తించాలంటే వేచి చూడాలని అక్కడి వైద్యులు చెప్పారు. సెల్‌కు మెసేజ్ వస్తుందనీ, ఆ తరువాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఈ లోగా రూ.లక్ష వరకూ ఖర్చు చేయించారు. రెండున్నర నెలల పాటు ఆస్పత్రిలో మెసేజ్ కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. చివరకు నా తల్లి చనిపోయింది. – లెంక అప్పారావు, ఇట్లామామిడిపల్లి, రామభద్రపురం మండలం -
సచివాలయాలకు అమ్మఒడి జాబితాలు
విజయనగరం అర్బన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకం చివరి అంకానికి చేరింది. అర్హులు, అనర్హులు, అభ్యంతరాల జాబితాలు సిద్ధమయ్యాయి. మరోసారి పరిశీలనకు సచివాలయాలకు చేరాయి. సాధికార సర్వే అనుసంధానంలో జరిగిన తప్పిదాలను నిరూపించే ధ్రువపత్రాలను రెండురోజుల్లోక్షేత్రస్థాయిలోని సచివాలయాలకు అందజేసి పథకం లబ్ధి పొందాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. తొలిజాబితా అర్హులు 3.1 లక్షల మంది.. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘అమ్మ ఒడి’ పథకం తొలి జాబితాలో జిల్లా నుంచి 3,17,294 మంది విద్యార్థులు, వారి తల్లులను అర్హులుగా ప్రకటించారు. జిల్లాలోని పథకం కోసం ఒకటి నుంచి 10వ తరగతి పాఠశాల, రెండు సంవత్సరాల ఇంటరీ్మడియట్ విద్యార్థులు 3,70,565 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటి నుంచి క్షేత్రస్థాయి సచివాలయాలకు వెళ్లిన మూడు జాబితాలను పంపారు. అన్ని అర్హతలను నిర్ధారించుకొని అనుమతి పొందిన తల్లులు 3,17,294 మంది ఉన్నారు. మరోసారి విచారణ చేయాల్సిన జాబితాలో 21,886 మంది ఉండగా, సాధికార సర్వే అనుసంధానంతో సరిచేసిన కారణంగా అర్హతను కోల్పోయిన వారు 31,385 మంది విద్యార్థులు ఉన్నారు. సవరించాల్సినవి అర్బన్ ప్రాంతాల్లోనే అధికం సాధికార సర్వే అనుసంధానంతో అనర్హులుగా మిగిలిన సంఖ్యలో అధికులు జిల్లాలోని పట్టణ ప్రాంతీయులే ఉన్నారు. సాధికార సర్వే అనుసంధానంతో అనర్హులుగా చూపిన జాబితాలో అత్యధికంగా జిల్లాలోని విజయనగరం అర్బన్ ప్రాంతంలో 9,051 మంది ఉండగా అత్యల్పంగా నెల్లిమర్ల నగర పంచాయతీలో 287 మంది ఉన్నారు. రీ ఎంక్వైరీ జాబితాలో కూడా విజయనగరం అర్బన్‌లో అధికంగా 3,892 మంది ఉండగా అత్యల్పంగా నెల్లిమర్ల నగర పంచాయతీలో 134 మంది ఉన్నారు. విజయనగరం అర్బన్‌లో నమోదు చేసిన విద్యార్థుల తల్లులు 41,600 ఉండగా వారిలో 28,657 మంది మాత్రమే తొలి విడత అర్హులయ్యారు. అలాగే, జిల్లాలోని 34 మండలాల్లో అత్యధికంగా 13,478 మందిలో తొలి జాబితాల్లో 12,242 మంది అర్హులై పూసపాటిరేగ మండలం మొదటి స్థానంలో ఉంది. తరువాత వరుసలో ఎస్.కోట మండలం 11,245 మంది నమోదులో 9,578 మంది అర్హులయ్యారు. రెండురోజుల్లో సవరించుకోవచ్చు జిల్లాలోని ‘అమ్మ ఒడి’ తొలి జాబితా విడుదలైంది. అర్హులెవరూ నష్టపోరాదనే ఉద్దేశంతో మూడు విభాగాలుగా జాబితాను విడుదల చేశాం. అర్హుత పొందిన జాబితాతో పాటు రీ ఎంక్వైరీ జేయాల్సిన జాబితా ప్రకటించాం. సాధికార సర్వే అనుసంధానంలో ఇబ్బందుల వల్ల అనర్హులుగా ప్రకటించిన మరో జాబితా కూడా విడుదల చేశాం. అనర్హతగా నమోదయన అంశాలపై తాజాగా ఎలాంటి ధ్రువపత్రాలున్నా క్షేత్రస్థాయిలో సవరించే అవకాశం ఉంది. రెండురోజుల్లో సవరించిన, రీ ఎంక్వైరీ చేసిన జాబితాను ఉన్నతాధికారులకు పంపాలి. – జి.నాగమణి, డీఈఓ -
తండ్రి ప్రవర్తనపై విసుగు చెంది..
బొండపల్లి: తండ్రి ప్రవర్తనకు విసుగు చెందిన ఓ చిన్నారి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని అయ్యన్న అగ్రహారం గ్రామానికి చెందిన చుక్క పైడిరాజు, గౌరమ్మలకు ఒక్కగానొక్క కుతురు బంగారమ్మ. ఈమె గజపతినగరం ఆదిత్యా కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని తండ్రి పైడిరాజు ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. శబరిమాల యాత్ర ముగించుకుని గురువారమే గ్రామానికి చేరుకున్నాడు. అయితే యాత్ర నుంచి వచ్చినప్పటి నుంచి మద్యం తాగుతూ ఇంటికి రావడం మానేశాడు. అయ్యప్పమాల వేసినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బంగారమ్మ శుక్రవారం వేకువజామున ఇంటిలో ఉన్న దూలానికి ఉరేసుకుని మృతి చెందింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై డి. సాయికృష్ణ సిబ్బందితో సహా గ్రామానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
నకిలీల ఆటకట్టు..
సాలూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లో నకిలీ మావోయిస్టులు, నకిలీ పోలీసులు హల్చల్ చేస్తున్నారు. వర్తకులను లక్ష్యంగా చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులమని, మావోయిస్టులమని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వేల నుంచి లక్షల రుపాయల వరకు ఈ డిమాండ్లు ఉంటున్నాయి. దీంతో ఈ నకిలీలలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాకచక్యంగా దర్యాప్తు నిర్వహిస్తూ నకిలీలను పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే నకిలీ పోలీసులను పట్టుకున్న విషయం మరువకముందే తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. జరిగిన సంఘటనలు.. ►ఈ ఏడాది జూన్ 11న పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద మక్కువ మండలంనకు చెందిన నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ►ముగ్గురు నకిలీ పోలీసులు సాలూరు మండలంనకు చెందిన ఓ వర్తకుడి నుంచి 27 వేల రుపాయల నగదు కాజేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురులో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకుని ఈ నెల 12న వారిని బొబ్బిలి కోర్టులో ప్రవేశపెట్టగా 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ►పాచిపెంట మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులను తాజాగా పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం.. నకిలీ పోలీసులు, నకిలీ మావోయిస్టుల హల్చల్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి నకిలీలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల సాలూరు పట్టణంలో నకిలీ పోలీసులను పట్టుకోగా... తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పట్టుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడినా చర్యలు తప్పవు. – సింహాద్రినాయుడు, సీఐ, సాలూరు -
ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి
చీపురుపల్లి రూరల్: ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాంఛ తీర్చుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి మాయమాటల్లో పడి ఆ యువతి మోసపోయింది. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు వీరద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొని శారీరక వాంఛ తీర్చాలంటూ ఆ యువతిని భయపెట్టాడు. వారి ప్రేమ వ్యవహారాన్ని గ్రామంలో చెప్పి బయట పెడతానని చెప్పి బెదిరించాడు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిస్తే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనని భయపడిన ఆ యువతి ఆ యువకుడికి కూడా లొంగిపోయింది. ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ యువతిలో శారీరక మార్పులు రావటంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువతిని ఏమయ్యిందని ఇంట్లో నిలదీశారు. విషయం తెలుసుకొని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్బవతి అయిందని తేలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో గ్రామ పెద్దలకు తెలియజేసింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ అవినీతి చేపలు
కొత్తవలస: కూరగాయల ధరలు పెరిగాయి.. లంచం ఇచ్చుకోలేను.. బిల్లులు చెల్లించాలంటూ ప్రాథేయపడినా వియ్యంపేట ఐసీడీఎస్ సీడీపీఓ మణమ్మ, సూపరింటెండెంట్ వేణుగోపాల్‌లు కనికరించలేదు. లంచం ఇవ్వాల్సిందేనని, లేదంటే ఒప్పందం రద్దుచేస్తామని బెదిరించారు. విధిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు వలపన్ని రూ.85వేలు లంచం డబ్బులతో ఇద్దరు ఉద్యోగులను కొత్తవలస గిరిజాల రోడ్డులోని ఐసీడీఎస్ కార్యాలయంలోనే సోమవారం పట్టుకున్నారు. విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... వియ్యంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొత్తవలస, ఎల్.కోట, వేపాడ మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు, ఆకు కూరలు, వంట దినుసుల సరఫరా కాంట్రాక్టును విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపాలెంకు చెందిన ఆడారి సురేష్ కుదుర్చుకున్నాడు. 2018 మార్చి నుంచి ఎస్.కోట మండలంలోని భవానీనగర్‌లోని దుకాణం నుంచి సరఫరా చేస్తున్నాడు. ఇతనికి ఈ ఏడాది ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో సరఫరా చేసిన సరుకులకు గాను రూ.4,66,163 బిల్లు మంజూరైంది. ఈ ఏడాది నవంబర్‌కు సంబంధించి కొత్త ప్రభుత్వం మెనూ రేటు ఒక్కొక్కరికి 60 పైసలు పెంచింది. దీంతో అదనంగా నిధులు మంజూరయ్యాయి. పెరిగిన రేటు ప్రకారం బిల్లు చెల్లించేందుకు రూ.89 వేలు లంచం ఇవ్వాలని సీడీపీఓ మణమ్మ, సూపరిండెంట్ వేణుగోపాల్‌లు సురేష్‌ను డిమాండు చేశారు. కూరగాయల ధరలతో పాటు ఉల్లి ధరలు కూడా పెరగటంతో లంచం ఇచ్చుకోలేనని సురేష్ బేరసారాలాడినా ఫలితం లేకపోయింది. దీంతో రూ.85 వేలు లంచం ఇస్తానని ఒప్పుకుని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు విజయనగరం ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎస్సైలు సతీష్, మహేష్ తదితరులు వలపన్నారు. సురేష్‌కు లంచం డబ్బులు ఇచ్చి కార్యాలయానికి పంపించారు. యథావిధిగా ఒప్పందం కుదుర్చుకున్న డబ్బులు తీసుకు వచ్చానని సీడీపీఓతో సురేష్ చెప్పాడు. ఆమె సూపరింటెండెంట్‌ను పిలిచి డబ్బులు తీసుకోమని చెప్పడంతో సూపరిండెంట్ తన బెంచి డ్రాయర్లో లంచం డబ్బు పెట్టాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు టేబుల్లో పెట్టిన నగదును స్వాదీనం చేసుకున్నారు. రసాయనిక పరీక్షలు నిర్వహించి సీడీపీఓ, సూపరింటెండెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. సీడీపీఓ మణమ్మ కొద్ది కాలం కిందట పిఠాపురం నుంచి బదిలీపై కొత్తవలసకు వచ్చారు. దాడుల పరంపర.. కొత్తవలసలో గతంలో సబ్ ట్రెజరరీ అధికారి, కొత్తవలస పోలీసు స్టేషన్లో పనిచేసిన ఇద్దరు ఎస్సైలు, కొత్తవలస, ఎల్.కోట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన వీఆర్వోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాంట్రాక్టు రద్దుచేస్తామని బెదిరించారు.. వియ్యంపేట ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు, వంటదినులు 2018 నుంచి పంపిణీ చేస్తున్నాను. ఈ ఏడాది ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బిల్లు రూ.4,66,163 వచ్చింది. దీనికి తోడు నవంబర్ నెలలో ఒక్కొక్కరికి మెనూపై రూ. 60 పైసలను ప్రభుత్వం పెంచింది. నవంబర్ నెలకు రావాల్సిన రూ.1,89,000లకు రూ.89,000 లంచం ఇవ్వాలని సీడీపీఓ డిమాండ్ చేశారు. లేదంటే కాంట్రాక్టు రద్దు చేసి ఇతరులకు ఇస్తామని బెదిరించారు. రూ. 85 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. – ఆడారి సురేష్, కూరగాయల కాంట్రాక్టర్ -
సాక్షి ఎఫెక్ట్: అవినీతి అధికారిపై వేటు
సాక్షిప్రతినిధి విజయనగరం: రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అక్రమాలు నిరంతరం సాగవు. ఎవరూ చూడటం లేదనీ... ఏమైనా చేసేయొచ్చనీ... సొంత నిర్ణయాలు తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. అవినీతిని ఏమాత్రం సహించబోమని అధికారంలోకి వచ్చిన వెంటనే స్పష్టంచేసిన సీఎం అందుకోసం ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్ కూడా పెట్టారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. పట్టుబడిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.వి.వి.ఎస్.చౌదరిపై సస్పెన్షన్ వేటు వేశారు. విజయనగరం రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అధికారిగా, విశాఖపట్నం మైన్స్ అండ్ జియాలజీ ఇన్చార్జ్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న చౌదరిని విధుల నుంచి తప్పిస్తూ జీఓ నెం.344ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఊరుదాటి వెళ్లకూడదంటూ ఆదేశించింది. డీడీకీ అదనపు బాధ్యతలు రీజనల్ విజిలెన్స్ స్కాడ్ ఇన్చార్జ్ బాధ్యతలను విజయనగరం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.పూర్ణచంద్రరావుకు అప్పగించింది. గనుల శాఖ అధికారులు కొందరు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత నెల 20వ తేదీన ‘అక్రమార్కులకు అండ’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఆ కథనంపై వెంటనే స్పందించిన గనులశాఖ మంత్రి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా పేషీ అధికారులను ఆదేశించారు. వారు అన్ని వివరాలను సేకరించి చౌదరి, మరికొందరు అధికారుల చిట్టాలను సేకరించి మంత్రికి అందజేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కొందరు వ్యక్తులు, కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక పరి్మట్లను చౌదరి ఇచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. మరికొందరు అవినీతి అధికారులపైనా చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. -
చెప్పేటందుకే నీతులు..
వారు మాత్రం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తారట... ఎదుటివారికి మాత్రం దానిని అందనివ్వరట... అందుకే సర్కారు బడుల్లో ఆ మీడియం వద్దంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. నిరుపేదలకు ఆ మీడియం దూరం చేయాలన్నదే వారి లక్ష్యం. అందుకే తెలుగుపై తమకే వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు... సర్కారు దానిని కనుమరుగు చేసేస్తున్నట్టు తెగ బాధపడిపోతున్నారు. ఇదీ తెలుగుదేశం నేతల తీరు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో దానిపై లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తన ఇద్దరు కుమార్తెలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విద్యావతీదేవిలను ఇంగ్లిష్ మీడియంలోనే హైదరాబాద్‌లోని విద్యారణ్య ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. అదితి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అశోక్ కూ డా ఇంగ్లిష్ మీడియంలోనే గ్యాలియర్‌లో చదివారు. తెలుగు పలకడానికి కూడా వీరు ఇబ్బంది పడుతుంటారు. సాక్షి, ప్రతినిధి విజయనగరం: ప్రతి ఒక్కరికీ తమ పిల్లలపై బోలెడు ఆశలుంటాయి. వారు ఉన్నతంగా ఎదగాలనీ... తమకు ఆసరాగా నిలవాలనీ... జీవితంలో ఏ మాత్రం వారు కష్టపడకూడదని ఆకాంక్షిస్తారు. దీనికి నిరుపేదలేమీ మినహాయింపు లేదు. ముఖ్యంగా వారిలోనే ఎక్కువ ఉబలాటం ఉంటుంది. అందుకోసమే తమ పిల్లలను కాన్వెంట్లలో, కార్పొరేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించి చదివించడానికి అప్పులు చేస్తూ కష్టపడుతున్నారు. ఇంకా నిరుపేదలైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. అలా చదివిన వారు ఆంగ్లం విషయంలో కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడలేకపోతున్నారు. మల్టీ నేషన్ కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్లినపుడు, పోటీ పరీక్షలకు హాజరైనప్పుడు ఇంగ్లిష్తో ఇబ్బంది పడుతున్నారు. వారి కష్టాన్ని చూసి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్య మం తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దీని కి మతాన్ని ముడిపెట్టి ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారికి మరో పార్టీ నాయకులు వంతపాడుతున్నారు. అసలు వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ఆరా తీస్తే జిల్లాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారనే విషయం బయటపడింది. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూళ్లలో టీడీపీ నేతల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల పిల్లలది ఇంగ్లిష్ మీడియమే టీడీపీ మాజీ రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు తన కుమారుడు విశాలకృష్ణ రంగారావు, కుమార్తె కృతీ గోపాల్‌ను విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. సుజయ్ కూడా తెలుగు మీడియంలో చదవలేదు. టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తన కుమార్తె ప్రణతిని, కుమారుడు పృథీ్వని సాలూరులోని లయన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. టీడీపీ సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్‌దేవ్ కుమారుడు బ్రీజేష్‌కుమార్ కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కుమార్తె దీక్షిత, కుమారుడు వంశీ విజయనగరంలోని సెంట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లోనే చదివారు. శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కవల కుమార్తెలు అని్వతానాయుడు, అమితానాయుడు కొత్తవలసలోని జిందాల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. ప్రస్తుతం విశాఖలో చైతన్య కళాశాలలో చదువుతున్నారు. మీసాల గీత కుమారుడు కిరీటి విజయనగరం భాష్యం స్కూల్లో, కుమార్తె సువర్ణ బొబ్బిలి అభ్యుదయ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని తన కుమారుడు కిమిడి నాగార్జునను శ్రీకాకుళంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విద్యాభ్యాసం చేయించారు. వీరి పోరాటం ఎవరికోసం? తమ పిల్లలను ఎంచక్కా ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని, మాతృ భాషను మంట గలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు వీరి పోరాటం ఎవరికోసమన్న చర్చకూ దారితీస్తోంది. తమ పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని ఎంబీబీఎస్, పీజీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులకు పంపిస్తూ... సామాన్యుల పిల్లలు చదువుకునే పాఠశాలల్లో మాత్రం ఇంకా తెలుగు మీ డియంనే కొనసాగించాలని కోరుకోవడం ఏమి టన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తోంది. -
కలుషిత ఆహార కలకలం
పార్వతీపురం టౌన్: పాడైన ఆహారం తిన్న 45మంది విద్యారి్థనులు రాత్రికి రాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. పార్వతీపురం మండలం కవిటిభద్ర కేజీబీవీ వసతిగృహంలో మంగళవారం మధ్యాహ్నం వండి వడ్డించగా మిగిలిన కూరలు, పెరుగు రాత్రి వేళ కూడా విద్యారి్థనులకు బలవంతంగా వడ్డించడంతో గత్యంతరం లేక వాటిని తిన్న వారంతా అనారోగ్యం పాలయ్యారు. మొత్తం 165మంది విద్యారి్థనుల్లో 45మందికి విరేచనాలు, వాంతులు ఒక్కసారిగా ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న ఏఎన్ఎం ప్రాథమిక చికిత్స అందించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పూర్తి చికిత్సకోసం తరలించారు. అనారోగ్యం పాలైనవారిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులున్నారు. వెంటనే పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పి.వరలక్ష్మి, సిబ్బంది హుటాహుటిన వారిని రాత్రికి రాత్రి ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్సను ఇప్పించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్–2 ఆర్.కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి బుధవారం ఉదయం ఏరియా ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేశారు. విద్యారి్థనుల ఆరోగ్యంపరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎస్ఐ వీరబాబు, తహసీల్దార్ శివన్నారాయణ, ఎంఈఓ కృష్ణమూర్తి, ఎంపీడీఓ కె. కృష్ణారావు తదితర అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వద్దన్నా వడ్డించడం వల్లే... మధ్యాహ్నం వడ్డించగా మిగిలి పోయిన పెరుగు వేసుకునేందుకు పిల్లలు అంగీకరించలేదు. కానీ ఊరికే వృథా అవుతుందన్న కారణంతో సిబ్బంది బలవంతంగా వారిచే తినిపించారు. అదే వారి కొంప ముంచింది. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వాగ్దేవి ఆధ్వర్యంలో వైద్యబృందం తక్షణ వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. కోలుకున్న 30మంది విద్యారి్థనులకు అల్పాహారం ఇచ్చి హాస్టల్‌కు తిరిగి పంపించారు. మిగిలిన వారికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించి మెరుగుపడేంతవరకు ఆస్పత్రిలో ఉంచారు. వారిలో ముగ్గురు కోలుకొనేందుకు రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. అధికారుల ఆరా... విద్యారి్థనుల అస్వస్థత విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి, జాయింట్ కలెక్టర్–2 ఆర్. కూర్మనాథ్ బుధవారమే పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఫుడ్‌పాయిజినింగ్ కారణాలపై సిబ్బందిని నిలదీశారు. ఇకపై ఇలాంటి పరిణామాలు ఎదురైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. రాష్ట్ర బాలబాలికల హక్కుల కమిషన్ మెంబర్ పి.వి.వి.ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యారి్థనులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీకి వెళ్లి పరిసరాల శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపట్ల పాఠశాల సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను ఆరా తీశారు. ఏమైపోతుందోనని భయపడ్డాం.. రాత్రి భోజనం చేసిన తరువాత కొంత సేపటికి వసతిగృహంలో చాలా మంది అమ్మాయిలకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయని ఏఎన్ఎంకు చెప్పాం. ఆమె మాత్రలు ఇచ్చినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో భయపడ్డాం. ఎస్ఓ మేడమ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను ఇప్పించారు. భోజనంలో నాణ్యత లేకపోవడంవల్లే ఇలా అయింది. – ఎస్.శరణ్య, విద్యార్థిని పాడైన ఆహారం వల్లే... రాత్రి భోజనంలో మధ్యాహ్నం మిగిలిన కూరలు, పెరుగు ఇచ్చారు. వాటిని తిన్న తరువాతనే వాంతలు, విరేచనాలు మొదలయ్యాయి. దాదాపు అందరిదీ అదే పరిస్థితి కావడంతో విషయం తెలుసుకుని ఎస్ఓ మేడమ్, ఏఎన్ఎం మమ్మల్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారు. – ఎస్.శకుంతల, విద్యార్థిని పుల్లని పదార్ధాలు ఇవ్వవద్దు.. పులిసిన, చెడిపోయిన పదార్ధాలు విద్యార్థులకు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆటలాడుకోవదు. అదృష్ట వశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాం. పూర్తిస్థాయి విచారణ చేపట్టి... పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తాం. ప్రస్తుతానికి విద్యారి్థనుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. – జి.నాగమణి, డీఈఓ -
నిరుపేదలకు వెసులుబాటు
బొబ్బిలి: నిరుపేదలకు గ్యాస్ బండలు విడిపించుకోవడంలో ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికి వెసులు బాటు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ కంపెనీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో గిరిజన, గిరిశిఖర ప్రాంతాలకే కేటాయించిన 5 కిలోల సిలిండర్లను ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెస్తున్నాయి. జిల్లాలోని ఆయా ఏజెన్సీల ద్వారా పేదలు పొందిన గ్యాస్ కనెక్షన్లకు ఈ సిలిండర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం జిల్లాలోని నిరుపేదలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చారు గానీ... విడిపించుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యలను గుర్తించి వారికి అందుబాటులో ఉండే ధరల్లో సరఫరాచేయాలని భావిస్తున్నారు.ఇప్పటికే ఇటువంటి జాబితాలను ఆయా గ్యాస్ ఏజెన్సీలకు పంపించారు. ఆ జాబితాల్లో కొన్ని పేర్లు ఉండగా మరికొన్ని పేర్లను గుర్తించి వెంటనే గ్యాస్ కనెక్షన్లకు 5 కిలోల సిలిండర్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకునే... జిల్లా వ్యాప్తంగా 26 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా దీపం, సీఎస్ఆర్, ఉజ్వల, సాధారణ గ్యాస్ కనెక్షన్లు 5,50,000 ఉన్నాయి. అందులో ఎస్టీలు, ఎస్సీలు పొందిన కనెక్షన్లు అధికంగా ఉన్నప్పటికీ సిలిండర్ ధర రూ.703లు ఉండటంతో పేదలు విడిపించుకోలేకపోతున్నారు. ఇందుకోసం వారికి రెండేసి సిలిండర్లను ఇచ్చి గ్యాస్ కొనుగోలుకు వీలుగా రూ.253లకు 5కిలోల గ్యాస్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద వారికే ఈ సిలిండర్లు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినప్పటికీ పెద్ద మొత్తం వెచ్చించి గా>్యస్ విడిపించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈజీ గ్యాస్ కార్డులు.. గతంలో పుస్తకాలతో గ్యాస్ విడిపించుకునే వారు. ఇప్పుడు కొంత కాలంగా ఈజీ గ్యాస్ స్మార్ట్ కార్డులను పరిచయం చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని నిరుపేదలకు కూడా ఈ ఈజీ గ్యాస్ కార్డులు, 5 కిలోల సిలిండర్లతో వినియోగం పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. 5 కిలోల సిలిండర్లకు ప్రాధాన్యత: ఇప్పటికే ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించిన ప్రభుత్వం ఇప్పుడు విడిపించుకోలేని పేదలను గుర్తించి వారికి 5 కిలోల గ్యాస్ సిలెండర్లను అందించాలని ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం తామే అటువంటి వారిని గుర్తించి చిన్న సిలిండర్లను అందించే చర్యలు ప్రారంభించాం. ప్రతీ ఒక్కరూ తమ ఫోన్ నంబర్‌ను గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్‌కు అందించాలి. దీనివల్ల వారికి అప్డేట్స్ ఇవ్వడం సులువవుతుంది. – జలగం ప్రసాదరావు, వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ -
పాతికేళ్ల కష్టానికి చెల్లు!
ఎప్పటికైనా న్యాయం జరగకపోతుందా... తమ గోడు వినే నాథుడు రాకపోతాడా... తమ బతుకులు బాగుపడే రోజు రాకపోతుందా... అని పాతికేళ్లుగా ఎదురు చూసిన వారికి సరైన న్యాయమే జరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి ప్రయత్నం ఫలించింది. ముఖ్యమంత్రి జగనన్న మనసు కరిగింది. పది రెట్లు వేతనం పెంచుతూ నిర్ణయం వెలువడటంతో ఆ చిరుద్యోగుల మోములో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ కేవలం నాలుగు వందల వేతనానికి పనిచేస్తున్న గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనం నాలుగు వేలకు పెరగడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి. విజయనగరం: నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో నెలకు కేవలం 400 రూపాయలతో ఎవరూ పని చేయరు. కానీ వారు చేశారు. అది కూడా ఒకటి రెండు నెలలో, సంవత్సరాలో కాదు, ఏకంగా పాతికేళ్లుగా చేస్తూనే ఉన్నారు. ఎంతమందికి చెప్పుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇక మా బతుకులింతే అని వారు ఆవేదన చెందుతున్న తరుణంలోనే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వారి దీనస్థితిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో వారి పాతికేళ్ల కష్టానికి తెరపడింది. రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి కోసం ఐఎఫ్ఏడీ ఆధ్వర్యంలో 1995లో చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం నియమించింది. గిరిజన ఆవాసాలలో స్థానికంగా ఉండే గిరిజన మహిళలనే సామాజిక ఆరోగ్య కార్యకర్తలుగా నియమించారు. ఆశా వర్కర్ల తరహాలోనే గిరిజన ఆవాసాల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య స్థితిగతులను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆరోగ్య పథకాలను అమలు చేయడం, ప్రత్యేకించి పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన సర్వేలు చేయడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రతలపై అవగాహన కలిగించడం లాంటి పనులన్నింటినీ వారు చేస్తున్నారు. వారి ఎంపికలో విద్యార్హతలు, స్థానికతలకు సంబంధించిన రెండు తేడాలు మినహా, ఆశ వర్కర్లు చేసే పనులే వీరూ చేస్తున్నారు. కొండ కోనల్లో పని చేసే గిరిజనులు కావడం, వారి సమస్యలపై అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో సుమారు రెండున్నర దశాబ్దాలుగా వారి బతుకులు మెరుగుపడలేదు. 1995లో వారిని ఆరోగ్య కార్యకర్తలుగా నియమించినప్పుడు రూ.300లు గౌరవ వేతనం ఇచ్చేవారు. తరువాత కేవలం వంద మాత్రమే పెంచారు. నెలకు రూ.400లతో బతకడం అసాధ్యం. కనిపించిన ప్రతి నాయకుడికీ తమ కష్టాన్ని చెప్పుకున్నా... వారి బతుకులు మారలేదు. కదిలించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఒక గిరిజనబిడ్డగా గతంలో కూడా గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యురాలు కావడంతో అప్పటి ప్రభుత్వం ఈమె విన్నపాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే వై,ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రి కావడం వారికి కలిసొచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఆశ వర్కర్ల వేతనాలను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తరుణంలో గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల పరిస్థితిని పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రికి వివరించారు. వారి వేతనాలను కూడా పెంచాలంటూ సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించడంతో అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. నవంబర్ 27న జరిగిన కేబినెట్ సమావేశంలో వీరి వేతనాలను రూ.400ల నుంచి రూ.4000లకు పెంచారు. డిసెంబర్ నుంచే పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఇంతవరకూ ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని, తమ సేవలను వినియోగించుకోవడమే మినహా ఏ ప్రభుత్వమూ తమను ఆదుకోలేదని అయితే ప్రస్తుత ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తమ వేతనాన్ని పది రెట్లు పెంచడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికీ, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ధన్యవాదాలు చెబుతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్రం మొత్తం మీద 7 ఐటీడీఏల పరిధిలో 2651 మంది గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు పని చేస్తుండగా వీరిలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 498 మంది, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1184 మంది, పాడేరు ఐటీడీఏ పరిధిలో 752 మంది, చింతూరు ఐటీడీఏ పరిధిలో 40 మంది, కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 163 మంది పని చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆశవర్కర్లకు సంబంధించిన వేతనాలను రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. అదే సమయంలో గిరిజన ఐటీడీఏ ప్రాంతాల్లో ఆశ వర్కర్ల తరహాలోనే పని చేస్తున్న వీరి వేతనాలు మాత్రం పెంచలేదు. దీనిపై వారు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. -
పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
సొంత ఇల్లు ఉండాలని... అందులో హాయిగా జీవించాలనీ... తరతరాలకూ అది తమకు స్థిరాస్తిగా నిలవాలనీ ప్రతి ఒక్కరి ఆశ. అందులో ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. కానీ నిరుపేదల ఆశలు తీరేదెలా? ఇల్లు కట్టేంత స్థోమత వారికెక్కడిదీ? వీటన్నింటికీ సమాధానమే పీఎం ఆవాస్‌యోజనా. పట్టణ ప్రాంత పేదలకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం ద్వారా అర్హులైనవారికి ఇళ్లు మంజూరు కానున్నాయి. ఇందుకోసం జిల్లాకు 30,760 యూనిట్లు కేటాయించారు. త్వరలో వీటి పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. విజయనగరం: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహాలు మంజూరు చేసింది. విజయనగరం జిల్లాలో వీఎంఆర్డీఏ, బుడా పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు, మున్సిపాలిటీలకు 30,760 ఇళ్లు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వీఎంఆర్డీఏ పరిధిలో 13,950, బుడా పరిధిలో 12384 ఇళ్లతో పాటు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలకు 4426 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న నెల్లిమర్ల మండలానికి 7101 గృహాలు, చీపురుపల్లి మండలానికి 3415 గృహాలు, ఎస్‌కోట మండలానికి 3434 గృహాలు మంజూరయ్యాయి. అదేవిధంగా స్థానిక సంస్థలైన బొబ్బిలి మున్సిపాలిటీకి 453, సాలూరు మున్సిపాలిటీకి 267, పార్వతీపురం మున్సిపాలిటీకి 3706 గృహాలు మంజూరు చేశారు. బుడా పరిధిలోని కురుపాం మండలానికి 431, సాలూరు మండలానికి 4095, పార్వతీపురం మండలానికి 1071, సీతానగరం మండలానికి 1271, బొబ్బిలి మండలానికి 4191, దత్తిరాజేరు మండలానికి 1325 గృహాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. సొంత ఇల్లు నిర్మించుకోవటానికి పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. చాలీచాలనీ అద్దె గదుల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గృహాలు మంజూరు చేయడంతో పేదల సొంతింటి కల నెరవేరనుంది. నిర్మాణ వ్యయం పెరిగింది. దీన్ని దష్టిలో ఉంచుకుని యూనిట్ విలువలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు గృహాలకు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలు రాయితీ ఇస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రానున్నారు. స్థలం ఉన్న వారికి తొలుత ఇళ్లు మంజూరు చేస్తారు. ప్రభుత్వం ఉగాది నాటికి పేదలకు ఖాళీ స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. స్థలాలు అందితే మరింత మందికి గృహయోగం కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్ గృహ నిర్మాణ పథకంలో కేటాయించిన గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయి. పట్టణాల్లో ఇంటికి రూ.3.5లక్షలుగా నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్రం రూ.లక్ష రాయితీ ఇస్తారు. బ్యాంకు రుణం రూ.75వేలు వస్తోంది. లబ్ధిదారు తన వాటాగా రూ.25వేలు భరించాల్సి ఉంటుంది. పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో కేటాయించిన గృహాలకు ఒక్కో దానికి రూ.2లక్షలు యూనిట్ ధర నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు ఇస్తుంది. వలంటీర్ల సర్వేద్వారా లబ్ధిదారుల ఎంపిక.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, వైఎస్సార్ అర్బన్ పథకంలో మంజూరైన గృహాలకు అర్హులైనవారిని వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఎంపిక చేస్తారు. వారు నిర్వహించిన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. వీరిలో పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారని సమాచారం. 30,760 ఇళ్లు మంజూరు.. పీఎం ఆవాస్ యోజన పథకంలో జిల్లాకు 30,760 ఇళ్లు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు కేటాయిస్తాయి. రాష్టంలో వైఎస్సార్ గృహ నిర్మాణ పథకంలో నిధులు మంజూరు చేస్తారు. పట్టణాలు, గ్రామాల్లో వలంటీర్లు చేసిన సర్వే ఆధారంగా పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దీనికి కుటుంబ సభ్యుల అందరి ఆధార్ వివరాలు సేకరించేందుకు ప్రత్యేక ప్రొఫార్మా సిద్ధం చేస్తున్నాం. – ఎస్.వి.రమణ, పీడీ, హౌసింగ్ -
తమిళనాడులో బస్సు ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కంచి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వరరావు(25)గా గుర్తించారు. -
ముందే వచ్చిన దీపావళి..
ఎట్టకేలకు వారి కష్టాలు తీరనున్నాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. వారి శ్రమ ఫలించింది. నమ్మకమైన నాయకుడి చలువతో వారి డబ్బు తిరిగి సొంతం కానుంది. రూ. పదివేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు చెల్లించేనిమిత్తం నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ కుటుంబాల్లో నిజమైన దీపావళి వచ్చినట్టయింది. విజయనగరం పూల్‌బాగ్: అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్నికల ముందు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.36,97,96,900లు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న రూ.10వేలు లోపు డిపాజిట్టు కలిగిన 57,941 మందికి పంపిణీ చేయనున్నారు. రూ.20వేల వరకూ డిపాజిట్ చేసినవారికి రావాల్సిన మొత్తం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించి అందులో తొలి విడతగా శుక్రవారం రూ.264.99 కోట్లు విడుదల చేశారు. దీనిపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మోసపోయిన తమను దేవుడిలా జగన్ ఆదుకున్నారని వారంతా సంబరపడుతున్నారు. నాటి ప్రభుత్వ నిర్వాకంతో దాచుకున్న డబ్బులు రావనే భయంలో జిల్లా వ్యాప్తంగా 16 మంది బాధితులు చనిపోయారు. ఐదేళ్లపాటు బాధితులు ఎన్నో పోరాటాలు చేశారు. అప్పటినుంచీ వీరికి వైఎస్సార్సీపీ బాసటగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 1,08,470 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు సుమారుగా రూ.765 కోట్లు డిపాజిట్ చేశారు. అందులో రూ.10వేలు లోపు డిపాజిట్ ఉన్న ఖాతాలకు తొలివిడతగా చెల్లిస్తామని చెప్పడం ద్వారా 57,941 మందికి లబ్ధి చేకూరనుంది. చీపురుపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతలో రూ.260 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎంతో రుణపడి ఉంటామని అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు తెలిపారు. అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు చెల్లించేలా సీఎం నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడతలో చెల్లించేలా నిధులు విడుదల చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ఐదేళ్లు అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేశారు తప్ప న్యాయం చేయలేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, మల్లెంపూడి శ్రీను, అప్పికొండ ఆదిబాబు, బి.టి.ఆర్ యాదవ్, కుప్పిలి సురేష్, మహంతి రవి, సతివాడ అప్పారావు, కింతలి మధు తదితరులు పాల్గొన్నారు. ఫలించిన పోరాటం.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేలా తొలివిడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.265 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాట పలితమే ఇది. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మిగిలిన బాధితులందరికీ సత్వరమే చెల్లించేలా చూడాలి. – పి కామేశ్వరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ,ఉత్తరాంధ్ర గౌరవాధ్యక్షుడు. ఆనందంగా ఉంది.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టే రూ.10వేల లోపు డిపాజిట్‌దారులందరికీ జిల్లా కలక్టర్ ద్వారా పంపిణీ చేయటానికి ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయం. డబ్బులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి, మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్, అండ్ ఏజెంట్స్ అసోసియేషన్, బాధితుల బాసట కమిటీ తరఫున ధన్యవాదాలు. ప్రతి బాధితుడికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. – మజ్జి సూరప్పడు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం. కనీసం స్పందించని గత ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశాం. అయినా గత టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. అప్పటికే చాలా మంది బాధితులు చనిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముదావహం. – మజ్జి బంగార్రాజు, అగ్రిగోల్డ్ ఏజెంట్, డెంకాడ మండలం, విజయనగరం. -
విజయనగరం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ విజయనగరం పట్టణాధ్యక్షుడు, జిల్లా కేంద్రాస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.ఎస్. ప్రసాద్ టీడీపీకి గుడ్‌బై చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేతలు జిల్లాకి చేసిందేమీ లేదు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు గత ముప్పై ఐదేళ్లుగా అనేక పదవులు అనుభవించిని స్థానిక సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహిస్తూ జిల్లా ప్రజలకు ఏం చేయక పోవడం దేరదృష్టకరమన్నారు. జిల్లాలో రాజకీయంగా మరొకరికి ఎదగడానికి అవకాశాల్లేకుండా చేసి, పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. మొత్తం తన రాజకీయ జీవితంలో తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేక పోయారన్నారు. (చదవండి : వలసలు షురూ..) -
ఒక్కరితో కష్టమే..!
సాక్షి, చీపురుపల్లి రూరల్: జిల్లాలోని పలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన సమస్యగా మారింది. అత్యవసర వేళ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా... కాస్త ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు చదువుకు దూరంకావాల్సిన పరిస్థితి. జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 378, ప్రాథమికోన్నత పాఠశాలలు 213, ప్రాథమిక పాఠశాలలు 2,160 ఉన్నాయి. వీటిలో సుమారు 275 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. వీటిలో బోధన సమస్యలు షరామామూలయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క చీపురుపల్లి మండలంలోనే 12 పాఠశాలలు, నియోజకవర్గంలో 25 పాఠశాలలు ఏకోపాధ్యాయుడితోనే నడుస్తుండడం గమనార్హం. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు, ఉపాధ్యాయుడికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకడమిక్ ఇన్స్ట్రక్టర్ను నియమించారు. ఏకోపాధ్యాయుడికి సహాయంగా ఈ బోధకులతో బోధన అందించి విద్యార్థులకు న్యాయం చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ నియామకాలను నిలిపివేసింది. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోతే కొన్ని సమయాల్లో విద్యార్థులు విద్యా భోదనకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇవీ సమస్యలు.. ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి 18 సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులను ఒక ఉపాధ్యాయుడే బోధన చేస్తూ మిగతా పనులను కూడా చూసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయుడికి నెలకోమారు సమావేశం ఉంటుంది. వృత్యంతర శిక్షణకు హాజరుకావాలి. ఈ లెక్కన ఏడాదికి 11 సమావేశాలు ఉంటాయి. దీంతో పాటుగా స్కూల్ కాంప్లెక్సు సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలుకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆడిట్ వర్కులు, ఆన్లైన్ సేవలు సమయాల్లో సెలవులు తీసుకోవాలి. వీటితో పాటుగా ఉపాధ్యాయుడి అవసరాల నిమిత్తం తమ సెలవులను తీసుకుంటారు. ఇలాంటి సమయాల్లో ఏకోపాధ్యా పాఠశాలలు మూసే యాల్సి పరిస్థితి ఉండడమో.. లేదంటే సమీప దూరంలో ఉన్న వేరే పాఠశాల ఉపాధ్యాయుడిని మండల విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు వేరొకరిని వేయడమో చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎంత వరకు అందుతుందన్నది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అ ధికారుల వద్ద ప్రస్తావించగా... ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవమేనని, అయితే... అత్యవసరంగా ఉపాధ్యాయుడు సెలవుపెట్టినప్పుడు సమీప పాఠశాల నుంచి వేరొక్క ఉపాధ్యాయుడుని సర్దుబాటు చేస్తున్నామన్నారు. విద్యాబోధనకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు. -
రైతన్నల్లో ‘వర్షా’తిరేకం
సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాపై వరుణుడు కరుణచూపాడు. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపించాడు. దీంతో చెరువుల్లో నీరు చేరింది. వరి సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరి నాట్లు కాస్త ఆలస్యమైనా.. వెద పద్ధతిలో సాగుచేసిన వరి చేను ఆశాజనకంగా ఉండడం, వర్షానికి పొలాల్లో నీరు చేరడంతో రైతులు సంబరపడుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో పంటలకు ఇబ్బంది ఉం డదని, అక్టోబర్‌లో వరుణుడు కరుణిస్తే పంట చేతికి అందుతుందని రైతులు ఆశపడుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధి కారులు ప్రకటించినట్టే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లాలోని సగానికిపైగా మండలాల్లో వర్షించింది. గుర్ల మండలంలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్లు, మక్కువలో 4.1 సెంటీమీటర్లు, నెల్లిమర్లలో 3.8, వేపాడ, పూసపాటిరేగ, సీతానగరంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఒకటి, రెండు సెంటీమీటర్ల వర్షం పడిం ది. దీంతో జిల్లాలో సగటున 2.1 సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. ఇదిలాఉండగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో వర్షాలు అంతగా కురవకపోయినా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తులు నిర్వహణశాఖ అధికారులు జిల్లా అధికారులు వెల్లడించారు. రైతుల్లో హర్షం.. వర్షాలతో పొలాల్లో నీరు చేరింది. పంటలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషపడుతున్నారు. కలుపుతీత, ఎరువువేయడంలో బిజీ అయ్యారు. వర్షాలకు జలాశయాలు, చెరువులు నిండితే పంట చేతికొస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ కొంత నిరాశజనకంగా ప్రారంభమైంది. ఆలస్యంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆగష్టు వరకు సరైన వర్షాలు లేవు. అయితే, సెప్టెంబర్ నెల రైతులకు కలిసొచ్చింది. ఇప్పటికే కురవాల్సి వర్షాలు కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. దీంతో ఈ నెలారంభం నాటికి వేసిన వరి, ఇతర పంటలు సాగుకు భరోసా లభించగా వరినాట్లు వేయని ప్రాంతాల్లో రైతులు వేసుకున్నారు. వరికి ప్రస్తుతం నీరు అవసరమైన సమయంలో వర్షాలు పడుతుండడంతో ఆనందపడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత వర్షాలు పడితే ఈఏడాది గంటెక్కినట్లేనని చెబుతున్నారు. ఆనందంగా ఉంది.. వర్షాలు కురుస్తుండడం, పొలాల్లో నీరు చేరడంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలు చేతికందవు అనుకున్నాం. గతేడాది మాదిరిగా కరువు తప్పదనుకున్నాం. ఆలస్యంగానైనా వర్షాలు అనుకూలించాయి. రెండురోజులపాటు కురిసిన భారీ వర్షాలతో ధీమా కలిగింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – పి.గోపి, పిడిశీల, గజపతినగరం మండలం -
ప్రసవ వేదన
సాక్షి, సాలూరు: గిరిశిఖర గ్రామాల గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. కాన్పుకు ముందే ఆస్పత్రుల్లో చేరాలన్న వైద్యుల సూచనను పట్టించుకోకపోవడం కష్టాలకు గురిచేస్తోంది. అత్యవసర వేళ నరకయాతన పడుతున్నారు. దీనికి పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ ఈతమానువలస గ్రామానికి చెందిన లావుడుజన్ని కస్తూరీ ప్రసవ వేదనే నిలువెత్తు సాక్ష్యం. కస్తూరీకి బుధవారం అర్ధరాత్రి పురుటినొప్పులు వచ్చాయి. రోడ్డు సదుపాయం ఉండడంతో 108కు ఫోన్ చేశారు. అయితే, గ్రామానికి వెళ్లే మార్గంలో మసాలాగెడ్డపై వంతెన లేకపోవడం, వర్షాలకు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. డోలీ సహాయంతో గెడ్డ సమీపం వరకు గర్భిణిని తీసుకొచ్చారు. గెడ్డ దాటే అవకాశం లేక అక్కడ గురువారం ఉద యం వరకు నిరీక్షించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు పాచిపెంట వీరంనాయుడు గర్భిణీని తరలించే ఏర్పాట్లు చేశారు. మంచానికి తాళ్లు కట్టి డోలీగా మార్చారు. అందులో కస్తూరిని పడుకోబెట్టి అతికష్టం మీద వాగును దాటించారు. ప్రైవేటు వాహనంలో ఆమెను పాచిపెంట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి సాలూరు సీహెచ్‌సీకు, తరువాత విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. గురువారం సాయంత్రం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గర్భిణి ప్రసవ కష్టాలను పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారి లక్ష్మివద్ద ప్రస్తావించగా కేసు పార్వతీపురానికి చెందినదిగా పేర్కొన్నారు. ఆమెను జీఎల్ పురం వైటీసీలోని గిరిశిఖర గర్భిణుల వసతి గహంలో చేర్పించాల్సి ఉందన్నారు. ఆమె ఈతమానువలస గ్రామానికి 10 రోజులు క్రితమే వచ్చిందని, హైరిస్క్ కేసుగా గుర్తించి రిఫర్ చేసినా వినిపిం చుకోలేదన్నారు. -
ప్రియురాలి బంధువుల వేధింపులు తాళలేక...
సాక్షి, విజయనగరం: ప్రియురాలి బంధువులు, పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం పార్వతీపురం మండలం వెంకటరాయుడు పేటలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరాయుడు పేటకు చెందిన మంత్రపుడి సురేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటంతో వారు అతడి కక్ష గట్టారు. ప్రియురాలి బంధువులు.. పోలీసులతో కుమ్మక్కై సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన సురేష్ ఆత్మహత్య యత్నించాడు. -
లారీలకు బ్రేక్‌లు
లారీ పరిశ్రమకు అటు విజయవాడ తరువాతి స్థానం సాలూరుదే. పట్టణంలో అడుగడుగునా లారీలు... వాటిపై ఆధారపడిన ఎన్నో గ్యారేజీలు... మరిన్ని మెకానిక్ షెడ్లు... మనకు దర్శనమిస్తాయి. అంటే ఈ పరిశ్రమ ఎంతోమందికి భుక్తి కలిగిస్తోందన్నమాట. ఇప్పటికే పెరిగిన డీజిల్‌ధరలు... జీఎస్టీలు... పెరిగిపోతున్న ముడిసరకుల ధరలతో పరిశ్రమ కాస్తా కుంటుపడింది. ఒకప్పుడు దర్జాగా బతికిన యజమానులు కాస్తా నష్టాలతో కష్టాలపాలయ్యారు. అయినా ఇంకా కొందరు దానిపైనే ఆధారపడి కాలం నెట్టుకొస్తున్నారు. తద్వారా కొందరు బడుగులకు జీవన భృతి కలుగుతోంది. కానీ తాజాగా వచ్చిన కొత్త వాహన చట్టం ఆ పరిశ్రమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. భారీ జరిమానాలతో నడపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు ప్రాంతం లారీలకు ప్రసిద్ధి.. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వందలాది లారీలు సరుకు రవాణా చేస్తుంటాయి. వేలాది మంది ఇక్కడి లారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మోటారు వెహికల్ చట్టంలోని నిబంధనల పుణ్యమాని నష్టాలు చవిచూస్తున్నారు. దీనికి నిరసనగా గురువారం దేశ వ్యాప్తం గా జరుగుతున్న లారీల బంద్‌లో పాలు పంచుకుం టున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ తరు వాత లారీలు అధికంగా సాలూరులోనే ఉన్నాయి. ఇక్కడ సుమారు 2500 లారీలుండగా వీటిలో సుమా రు 1500 లారీలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకే గాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరుకులను నిత్యం రవాణా చేస్తున్నాయి. ఈ లారీలను నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు ఒక్క సాలూరు పట్టణంలోనే సుమా రు 10 వేలకుపైగా ఉన్నారు. దీనిపైనే ఆ కుటుంబా లు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరితో పాటు గ్రీజ్బాయ్లు, మెకానిక్‌లు తదితర మొత్తం 15 వేలకు పైగా కుటుంబాలు సైతం వీటి ఆధారంగానే జీవిస్తున్నాయి. ఇక్కడి లారీలనే ఇతర రాష్ట్రాల్లో అవసరాలకు కాంట్రాక్టర్లు, వినియోగదారులు తీసుకువెళుతుంటారు. ఈ లారీల ద్వారా బొగ్గు, బాయిల్డ్ రైస్, ఇనుము, మట్టి రవాణా అధికంగా ఉంటుంది. విశాఖపట్నంలోని గన్నవరం పోర్టు నుండి బొగ్గు రవాణా అధికంగా జరుగుతుంది. ఒక లారీ ఒక రోజు ఆగితే సుమారు రూ.6 వేల వరకు నష్టం ఉంటుందని లారీ యజమానులు చెబుతున్నారు. ఒక రోజు లారీ లు బంద్‌లోకి వెళితే సాలూరు పట్టణంలో అన్ని లారీలకు కలిపి సుమారు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లుతుందంటున్నారు. వేధిస్తున్న కొత్త నిబంధనలు... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మోటారు వెహికల్ చట్టం వల్ల అధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని లారీ యజమానులు ఆందోళన బాట పట్టారు. ఈ లారీలు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా కొత్త చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తుండటంతో లారీ యజమానులకు రానూపోనూ కిరాయి డబ్బులు ట్రాఫిక్ జరిమానాలకే సరిపోవడం లేదు. బీమా ప్రీమియం, జీఎస్టీలు వంటివి యజమానులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయనేది వారి వాదన. మోటారు వాహన చట్టంలో సవరణలు చేసి లారీలపై జరిమానాలు తగ్గించాలని, జీఎస్టీ మినహాయించాలనేది వారి ప్రధాన డిమాండ్. దానికోసం ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఫలితంగా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లే లారీలన్నీ సాలూరులోనే నిలిచిపోనున్నాయి. బుధవారమే కొన్ని లారీలు నిలిచిపోయాయి. సాలూరు శివారులో రోడ్డు పక్కన, పట్టణ లారీ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో భారీగా లారీలు నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు పడుతున్నాం. లారీలు నడపడం కష్టం గా మారింది. ట్రాఫిక్ చట్టాల పేరుతో భారీగా జ రిమానాలు వేస్తున్నారు. ఇలా అయితే మరీ నష్టాల్లో కూరుకుపోతాం. ఇంతకుముందు రూ.500 లోపు జరిమానాలు ఉండగా ఇప్పుడు రూ.2500 కు తక్కువ కాకుండా ఫైన్లు వేస్తున్నారు. – అక్కేన అప్పారావు, లారీ యజమాని, సాలూరు లారీ పరిశ్రమకు సడలింపునివ్వాలి.. కేంద్ర ప్రభుత్వం లారీ పరి శ్రమలకు కొన్ని సడలింపులివ్వాలి. లారీ లపై జరిమానాలు విధింపు తగ్గించాలి. జీఎస్టీ మినహాయింపులు ప్రకటించాలి. లేక పోతే అంతంత మాత్రంగా సాగుతున్న ఈ పరిశ్రమ మరింత కునారిల్లక తప్పదు. – కర్రి మహేష్, సాలూరు లారీ ఓనర్ల సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ, లారీ యజమాని -
పరాన్నజీవులు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొందరు జనం మీద పడి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ఫలానా అధికారి తనకు బాగా తెలుసునని, మాతో వస్తే మీ పని సులభంగా జరిగిపోతుందని జనాన్ని నమ్మిస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి వారి నుంచి సొమ్ములు గుంజుతున్నారు.. ఇంకొందరు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై పడుతున్నారు.. నిబంధనల పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది హల్ చేస్తూ ప్రజలకు, ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాల పేరుజెప్పి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, జనాన్ని మాయచేస్తున్నారు. కొందరిని ’స్పందన’ సాక్షిగా కలెక్టర్ హరిజవహర్‌లాల్ హెచ్చరించారు. నిజానికి కొన్ని ప్రభుత్వ విభాగాలనే అలాంటి వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారంటే అతిశయోక్తికాదు. విజయనగరం జిల్లా అంటేనే మంచి తనంతో కూడిన అమాయకత్వం కలిగిన ప్రజలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి చేతనైన సాయం, అవసరమైన సేవ చేస్తున్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. జిల్లా సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ, ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ఆయా సంఘాలు, సంస్థల ప్రతినిధులు, సభ్యులు తమవంతు కృషిచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారికి భిన్నంగా అలాంటి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీ ల ముసుగులో మరికొందరు ధనార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ పదవి లేకపోయిన, కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు రాకపోయినా, ప్రజాప్రతినిధిగా ఏ పదవీ చేపట్టకపోయినా పార్టీ రాష్ట్ర పదవులు అనుభవిస్తూ అమరావతి నుంచి విజయనగరం వరకూ తనకు అందరితోనూ పరిచయాలున్నాయని చెప్పుకుంటున్న ఓ నాయకుడున్నారు. జిల్లా అధికారులు నిత్యం ఎక్కడికి వెళుతుంటారు?, ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉంటారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను తెలుసుకోవడమే అతని పని. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తాడనేగా మీ అనుమానం. అధికారుల కదలికలపై అవగాహన వచ్చిన తర్వాత వారికి అతను ఫోన్ చేస్తాడు. కలవాలని చెబుతాడు. కలిసిన తర్వాత ఆ అధికారి గురించి అతను తెలుసుకున్నదానిని వివరిస్తాడు. వ్యక్తి విషయాలను బయటపెడతానని బెదిరిస్తాడు. మంచి అంశాన్ని కూడా చెడుగా ప్రచారం చేస్తానని బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. అతని చర్యలకు భయపడిపోయిన అధికారి అతనికి లొంగిపోతున్నాడు. ఆ తర్వాత అతను ఆడించినట్లుగా ఆడటం తప్ప ఆ అధికారికి మరో మార్గం ఉండదు. వారి నుంచి సమాచారం తెలుసుకుని రేపు వారు మంజూరు చేయబోయే ప్రాజెక్టులు, రుణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులను ఈ నాయకుడు ముందురోజే అధికారి వద్దకు తీసుకువెళ్లి పని జరిపించాల్సిందిగా వినతిపత్రం ఇస్తారు. మర్నాడు ఆ పని జరగగానే తన వల్లనే ఆ పని జరిగిందని చెప్పి లబ్ధిదారుల నుంచి సొమ్ములు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కలెక్టర్ ఇటీవల పసిగట్టారు. అతని దుర్భుద్ధిని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు.మరో వ్యక్తి ఉన్నాడు.. అతనూ ఒక పార్టీ నేతనని, ఒక సామాజిక వర్గానికి ప్రతినిధినని చెప్పుకుంటున్నాడు. కానీ ఇంతవరకూ ఎన్నికల్లో ఏనాడూ గెలిచింది లేదు. అయినా, నిత్యం ఏదోఒక పనిజెప్పి జిల్లా అధికారుల వద్దకు వెళుతుంటాడు. సమస్యలతో ఉన్న ప్రజలను వెంటబెట్టుకుని అధికారులకు వినతిపత్రం ఇస్తుంటాడు. ఆ సమస్య పరిష్కారం అయితే తనగొప్పతనమేనని చెప్పి తానూ ఆర్థిక లబ్ధి పొందుతుంటాడు. ఈ మధ్య ఒకడుగు ముందుకువేసి వివాదాల్లో ఉన్న భూ సమస్యలను అధికారులచేత పరిష్కారం చేయించేస్తానంటూ మొదలుపెట్టాడు. అతను అనుకున్నది జరిగితే సరే లేదంటే బయటకు వచ్చి ‘ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాదు. అధికారులు పనిచేయడం లేదు’.. అంటూ ప్రచారం చేస్తుంటాడు. తద్వారా అధికారులను నైతికంగా కుంగదీసి పనులు జరిపించుకోవాలనేది అతని ఎత్తుగడ. అయితే, ఈ ప్రయత్నాలను కూడా కలెక్టర్ పసిగట్టారు. నలుగురి ముందు అతని దుర్భుద్ధిని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. వీరిద్దరూ కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. సమాచారహక్కు చట్టం, మానవహక్కులు, విద్యార్థి, మహిళా సంఘాల పేరుతో అధికారులు, ప్రజలను దోచుకుతినడమే పనిగాపెట్టుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలైతే ఇలాంటి వారిపట్ల తీవ్ర వేదనకు గురవుతున్నాయి. సెలవుల్లో తరగతులు పెడుతున్నారనో, కంప్యూటర్ ల్యాబ్‌లు లేవనో, ఆట స్థలాలు లేవనో విద్యా సంస్థలను నిలదీస్తుంటారు. ఆ సౌకర్యాలను రప్పించడం కోసమైతే పర్లేదు. కానీ కాదు. అలా నిర్వాహకులను బెదిరించి ఎంతో కొంత డబ్బు తీసుకుని సైలెంట్‌గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ సౌకర్యాల ఊసెత్తరు. ఎవరైనా తమకు అనుకూలంగా లేకపోతే ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడిగా చేసేస్తుంటారు. ఈ గోలంతా ఎందుకని నిర్వాహకులు వారితే సయోధ్య కుదుర్చుంటున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లపైనా పడుతున్నారు. నిజానికి వీరంతా నిజాయితీగా పోరాటం చేస్తే హాస్టళ్లు ఎప్పుడో బాగుపడేవి. కానీ కేవలం ఆ శాఖ అధికారులు, వార్డెన్లను భయపెట్టి అందినకాడికి సొమ్ముచేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇష్టంలేకపోయినా కొందరు విద్యార్థులు వీరివెంట తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల్లో పాలుపంచుకుని చిక్కుల్లో పడుతున్నారు. ఉపేక్షించం.. కొందరు వ్యక్తులు జిల్లా అధికారులను, ప్రజలను వేధిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను కూడా స్వయంగా చూశాను. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. అవినీతి రహిత పాలన అందించాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అధికార యంత్రాంగమంతా సీఎం ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తాం. కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిలర్లకు భయపడాల్సిన పనిలేదు. ప్రజలు ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మా వద్దకు నేరుగా వచ్చి ‘స్పందన’ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
రాజకీయ హత్య..!
సాక్షి, సాలూరు: ప్రశాంతమైన సాలూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని సమయాల్లోనూ సోదర భావంతో గడిపిన పల్లెల్లో రాజకీయ హత్యలకు పాల్పడడం కలకలం రేగుతోంది. పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త గండిపల్లి తవుడు (49) ఆదివారం రాత్రి హత్యకు గురైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తవుడు వైఎస్సార్ సీపీ తరఫున చురుగ్గా పాల్గొనడం, టీడీపీ ఓటమి పాలవ్వడంతో గ్రామానికి చెంది న టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి, గ్రామస్తుడు, స్థానిక వైఎస్సార్ సీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరి అయిన తవుడు ఆదివారం సాయంత్రం ఆవులను కట్టిన తరువాత గ్రామంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. నిమజ్జనం తర్వాత తవుడు ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం స్థానిక శివాలయం సమీపంలో విగత జీవిగా దర్శనమిచ్చాడు. మృతుడి కుడిచేయి విరిగి ఉండడం, మెడ నులిపేయడంతో వాపురావడంతో హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలి సులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఎస్ఐ గంగరాజు, సీఐ సింహాద్రినాయుడులు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని తెలిపి శవపంచనామాకు సహకరించాలని కోరారు. నిందితులును పట్టుకునేంత వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించమని మృతుడి కుటుంబీకులు, స్థానిక నాయకులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు విజ యనగరం నుంచి క్లూస్ టీం, శ్రీకాకుళం నుంచి డాగ్‌స్క్వాడ్‌లు తెప్పించారు. ఓఎస్డీ రామ్మోహనరావు, ఏఎస్పీ సుమిత్‌గర్గ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నట్టు సమాచారం. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ .. సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోలబాబ్జి, పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మధుసూదనరావు, నాయకులు పెద్దిబాబు తదితరులు చేరుకున్నారు. బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ఇది రాజకీయ హత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవాలి... ఈ ఘటనపై ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఫోన్లైన్లో మాట్లాడుతూ ఇది రాజకీయ హత్యగానే అనుమానిస్తున్నామని, ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టాలని ఫోన్లో కలెక్టర్, ఎస్పీలను కోరారు. మృతుడి కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
అభ్యంతరాలపై చర్యలేవీ?
సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని పలు శాఖల్లో ఆడిట్ అభ్యంతరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. అధికారులు ఇష్తానుసారం ఖర్చు చేయడం... వాటిపై జమాఖర్చుల శాఖ అభ్యంతరం చెప్పడం పరిపాటిగా మారిం ది. వీటికి సరైన లెక్కలు చూపించడం లేదు సరికదా... వెచ్చించిన నిధులు వెనక్కు చెల్లించకపోవడంతో ప్రభుత్వ నిధులు వృధా అవుతున్నాయి. జిల్లాలో కొన్నేళ్లలో చేసిన ఆడిట్ ద్వారా కోట్లాది రూపాయల ఖర్చుపై భారీ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక సంస్థలకు సంబం ధించి ఆడిట్‌ను జిల్లా ఆడిట్‌శాఖ అధికారులు ఏటా చేపడుతుంటారు. ఈ సందర్భం గా అధికారులు కొన్ని రకాల ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటికి సరైన లెక్కలు చూపించాల్సిన బాధ్యత సంబంధి త అధికారులపై ఉంటుంది. అలా కానప్పు డు ఖర్చు చేసిన మొత్తాన్ని సంబంధిత అధికారి తిరిగి చెల్లించాలి. లేకుంటే వారి వేతనం, ఇతర ఖాతాల నుంచి రికవరీ చే యాలి. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు చూ స్తే జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం రూ.307.80కోట్లకు సంబంధించి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికవరీపై కానరాని శ్రద్ధ.. అడిట్ అధికారులు సాధారణంగా 19రకాల ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. ఇందులో అకౌంట్ అంకెల్లో తేడా, అధిక నిధుల వినియోగం, నిధుల పక్కదారి, నిధులు ఖర్చు చేయకపోవడం, అనవసర ఖ ర్చు, అడ్వాన్సుల పెండింగ్ సర్దుబాటు, నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం, అధిక చెల్లింపులు, నిరుపయోగ ఖర్చు ఇలా అనేక రకాల అంశాలపై ఆడిట్లో చూస్తారు. సక్రమంగా లేని అంశాలపై అభ్యంతరాన్ని సంబంధిత అధికారికి పంపిస్తారు. వాటిపై ఆ అధికారి వివరణ ఇచ్చుకుని, సరైన లెక్కలు చూపాలి. లేకుంటే బాధ్యత వహించి వాపసు చేయాలి. కానీ ఈ విషయంలో అధికారులు ఎక్కువమంది సరైన లెక్కలు చూపడం లేదు. అప్పట్లో ఉన్న అధికారులు బదిలీ కావడమో... రిటైర్ కావడమో... అయితే ఇక రికవరీకి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు వీటిపై లెక్కలు తేలిస్తే ప్రభుత్వ నిధులు వృధా అయ్యే అవకాశం ఉండదు. ఈ విధంగా వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో సుమారు రూ.20కోట్ల వరకు ఉంటుంది. వీటిని రికవరీ చేయక పోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతోంది. జిల్లా కలెక్టర్ వంటివారు సైతం వీటిని పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. మూడు నెలలకోసారి సమీక్ష.. ఆడిట్ చేసి ఖర్చులో లోపాలుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయడం మా విధి. ఇలా ప్రతి ఏడాది చేస్తున్నాం. వాటిని పరిష్కరించుకో వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. అందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తాం. ఆ రోజు సరైన లెక్కలు చూపించిన వాటిని తీసేస్తాం. ఇంకా పరిష్కరించుకోనప్పుడు సర్‌ఛార్జి నోటీసులు ఇచ్చి రికవరీకి ఆదేశిస్తాం. ఆ సమాచారం మా శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తాం. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళుతుంది. ఉన్నతస్థాయి నుంచి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలొస్తాయి. – ఆర్.మల్లికాంబ, జిల్లా ఆడిట్ అధికారి -
మహిళా దొంగల హల్చల్
సాక్షి, విజయనగరం క్రైం: వారికి ఆడ, మగ అనే తేడా ఉండదు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఒకరిద్దరు, పిల్లలతో సంచరిస్తుంటారు. లగేజ్ పట్టుకుని ఆటో ఎక్కే వారిపై కన్నేస్తారు. వారితో పాటూ అందరూ ఒకేసారి ఆటో ఎక్కేస్తారు. పక్కన బ్యాగ్‌లతో కూర్చున్న వారి దృష్టి ఒకరు మరలిస్తారు. మరో వైపు నుంచి చక్కగా తమ పని కానిచ్చేస్తారు. దొరికిన కాడికి దోచుకుంటారు. తమ పని పూర్తవగానే ఆటో దిగి తలో వైపు వెళ్లి, వేరే ఆటోలెక్కి పరారవుతుంటారు. ఇటువంటి సంఘటనలు పట్టణంలో జోరుగా జరుగుతున్నాయి. ఆడవాళ్లయితే ఒకరు మాటల్లో పెడతారు. మరోకరు పని కానిచ్చేస్తారు. అదే మగవారైతే కిక్కిరిసినట్లు కూర్చొవడం, చూపు మరల్చడం వంటివి చేస్తూ దొంగతనాలకు పాల్పడతారు. ఏమాత్రం పొరపాటున కానీ దొరికిపోతే చంటిపిల్లల ఏడుపులతో కాళ్లపై పడిపోతారు. దీంతో మన డబ్బులు మనకు ఉన్నాయి కదా... అని విడిచిపెట్టేసే ఘటనలు లేకపోలేదు. ఎవరు వీరు... ఒడిశాలోని బరంపురంలో అసకా గ్రామం నుంచి బతుకు తెరువు కోసం జిల్లాలకు వచ్చిన ఎర్రగొల్లలు వీళ్లు. పూర్వం పిక్ పాకెటింగ్, దొంగతనాలు చేసేవారు. క్రమేపీ వాటిని పక్కన పెట్టి, కొత్తగా ఆటోలో ప్రయాణిస్తూ ప్రయాణికుల బ్యాగ్‌లు చాకచక్యంతో చించేస్తు, వారి నుంచి పర్సులు, వస్తువులను కాజేస్తుంటారు. వీరు కుటుంబాలతో సహా జిల్లాల్లో మకాం వేస్తారు. పోలీసులు విస్త్రత తనిఖీలు చేసి సుమారు 50 మంది కుటుంబాలను గుర్తించారు. వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ అందించారు. జైలుకు వెళ్లినా వీరి తమ చేతులకు పని చెప్పడం మాత్రం మానడం లేదు. విజయనగరం జిల్లాలో కొత్తవలస 202 కాలనీ, ఎల్కోటలో రంగారాయపురం, గజపతినగరంలో పిట్టాడ, బగ్గాం, ఆగూరు, కొత్తవలస బోర్డర్, కె.కోటపాడు మండలం, గొట్లాం వద్ద, పార్వతీపురం, జియ్యమవలస మండలం, తురకనాయుడువలస తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి భర్తలు పగటి పూట పిట్టలు, పక్షుల వేటకు వెళ్తుంటారు. రాత్రివేళల్లో దొంగతనాలు చేస్తుంటారు. పల్లెటూర్లలో వ్యవసాయ పనులు చేసే వారిని గుర్తించి, మూకుమ్మడిగా వారి వద్దకు వెళ్లి రోల్డ్ గోల్డ్ నగకు చిన్న గ్రాము బంగారం ముక్క చివరన అతికించి, వారికిచ్చి తమకు కష్టాలున్నాయని, అందుకే తమ దగ్గర ఉన్న నగను అమ్ముకుంటామని, నమ్మబలుకుతారు. వారు టెస్టింగ్‌కి పంపించినప్పుడు ముందుగా ఉంచిన గ్రాము బంగారం ముక్క కాడను వారికిస్తారు. నిజమేననుకుని వారు తక్కువగా వస్తుందని చెప్పి లక్ష విలువ చేస్తే రూ.30 నుంచి రూ.50వేల వరకూ ఇచ్చేస్తారు. తర్వాత అది గిల్టుదని తెలుసుకుని లబోదిబోమంటారు. వీరిని ఎర్రగొల్లలని, ‘తెలగపాములు’ని అభివర్ణిస్తారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అక్కచెల్లెల్లు, అత్తా కోడళ్లు ఉంటారు. -ఇటీవల కోట వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఓ మహిళ పెళ్లి నగలను పర్సులో పెట్టుకుని ఆటో ఎక్కింది. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు ఆటో ఎక్కారు. కోటవద్ద ఆమె దిగిపోయింది. దిగిన తర్వాత బ్యాగ్‌ను సర్దుకున్నప్పుడు నగలు పర్సును చూడగా ఓపెన్ అయి బ్లేడ్‌తో కోసినట్లు ఉంది. అందులో నగలు లేవు. దీంతో లబోదిబోమంటూ టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. -తాజాగా శ్రీకాకుళం జిల్లా సెవెన్ రోడ్డు జంక్షన్‌కి చెందిన కె.లలిత ఉల్లివీధిలో ఫంక్షన్‌కి వచ్చారు. ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం ఉదయం 9 గంటలకు ఆటో ఎక్కింది. ఎల్లమ్మ తల్లి గుడి వద్ద ఆటోలో మరో ఇద్దరు మహిళలు ఎక్కారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకుందామని ఆమె మూడులాంతర్లు వద్ద దిగిపోయారు. అమ్మవారికి పూజా సామగ్రి కొందామని బ్యాగ్ చూడగా, కవర్ చించేసి, లోపల ఉన్న పర్సును పట్టుకుపోయినట్లు గుర్తించింది. వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. తన బ్యాగ్‌లో పెట్టిన పర్స్‌లో రూ.3,600 నగదు, కళ్లద్దాలు, కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. -
సిండి‘కేట్లు’
ఇక్కడా వారు రంగప్రవేశం చేశారు. ఎప్పటి మాదిరిగానే రింగయ్యారు. మద్యం దుకాణాల అద్దెలపేరుతో చక్రం తిప్పారు. కొందరు అధికారులను ప్రసన్నం చేసుకున్నారు. ఇష్టానుసారం అద్దెలు పెంచేసి ఆమోదింపజేసుకున్నారు. ఓ వైపు సర్కారు ఒక లక్ష్యంతో ఆదాయమార్గమైన మద్యాన్ని దశలవారీగా నిషేధించాలని చూస్తుంటే... ప్రభుత్వ ఖజానాకు మరింతగా కన్నం పెట్టాలని చూస్తున్నారు. జిల్లాలో సాగిన ఈ సిండికేట్ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో బాధ్యులైన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహిళల బతుకులను బాగుచేయాలని, మద్యం రక్కసి నుంచి కుటుంబాలను చక్కదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గమైనప్పటికీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇందులో తొలివిడతలో ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేపడుతోంది. దీని కోసం జిల్లాలో అవసరమైన 168 దుకాణాలను అద్దెకు తీసుకునేందుకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. అయితే ఇక్కడే మద్యం సిండికేట్లు చక్రం తిప్పారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి షాపుల అద్దెలు పెంచేశారు. ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల చెంతకు చేరింది. దీంతో విషయం బయటపడుతుందనే భయంతో ఆ శాఖలోని కొందరు అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. అక్టోబర్ 1 నుంచి జిల్లాలో నూతన ఎక్సైజ్ విధానం అమలు చేసేందుకు టెండర్ల ఖరారు ప్రక్రియకు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి గత నెల 23న నిర్వహించారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్న్లలోని 13 ఎక్సైజ్స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న 210 దుకాణాలను 80 శాతానికి కుదిస్తూ జిల్లాలో 168 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాంగణాలను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు 312 టెండర్లు, ఫర్నిచర్ లేని మద్యం దుకాణాల్లో ఫర్నిచర్ సరఫరాకు 33 టెండర్లు, మద్యం దుకాణాలకు సరుకు రవాణా చేసేందుకు 43 టెండర్లు వచ్చాయి. సిండికేట్ల టెండరింగ్.. ఈ టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 210 షాపులకు తొలివిడత 20 శాతం షాపులను తగ్గిస్తూ 168 షాపులకు టెండర్లు పిలిచారు. ఇందులో సింగిల్ టెండర్లకు ప్రాధాన్యమిచ్చారు. జిల్లాలోని సింగిల్ షాపుల యజమానులు కూడా టెండర్లు దాఖలు చేశారు. ఈ షాపుల్లో తక్కువ అద్దెకు, తక్కువగా విక్రయించే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఎక్కువ అద్దెకు ప్రతిపాదించిన టెండర్లను ఖరారు చేశారు. చక్రం తిప్పిన మద్యం మాఫియా.. జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో టీడీపీకి చెందిన మద్యం మాఫియా చక్రం తిప్పింది. ఇక్కడ షాపులను టెండర్లు వేసిన సమయంలో ఇతరులను రానీయకుండా ఓ మద్యం వ్యాపా రి తన అనుచరులు, కుటుంబ సభ్యుల పేరునే అధికంగా అద్దెల ధరలు పెంచుకుంటూ టెండ ర్లు దాఖలు చేశారు. ఈ సమయంలో స్థానిక అధికారులతో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించుకున్నారు. ఇలా ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులకు దాదాపు 20కి పైగా షాపులు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ అద్దెకిస్తామన్నా... ప్రభుత్వం కోరిన నూతన మద్యం పాలసీ ప్రకారం అద్దెల ప్రాతిపదికన షాపులు, ఫర్నిచర్, కంప్యూటర్, ఫ్రిజ్, సీసీ కెమెరాల వంటి అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లున్న బాడంగి మండలం డొంకినవలస(ఆర్ఎస్)లోని ఓ మద్యం వ్యాపా రి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.12,000కు టెండరు దాఖలు చేశారు. అయితే ఇదే మండలంలోని మల్లంపేటలోని (టీడీపీ ప్రభుత్వ హ యాంలో తరలించేసిన) మద్యం దుకాణానికి అధికంగా నెలకు రూ.32,000కు పైగా టీడీపీ నాయకుడు వేసిన టెండర్‌ను ఎక్సైజ్ అధికారులు ఖరారు చేసినట్టు ఆ వ్యాపారి ఆరోపిస్తున్నా రు. మల్లంపేటలోని మద్యం దుకాణం (గెజిట్ నెంబర్169) జీకేఆర్ పురానికి చెందినది. దీనిని టీడీపీ మాజీ మంత్రి ఆర్వి సుజయ కృష్ణ రంగా రావు పైరవీలతో, ఇతర టీడీపీ నాయకుల ప్రో ద్బ లంతో మల్లంపేటకు గతంలో తరలించారు. గతంలో ఆ షాపు నుంచే అధికంగా బెల్ట్ షాపులను ప్రోత్సహించేవారని చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో అధికంగా సింగిల్ టెండర్లు: జిల్లాలోని బొబ్బిలి, తెర్లాం ఎక్సైజ్ సర్కిళ్ల ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపుల అద్దె టెండర్లకు అధికంగా సింగిల్ టెండర్లు నమోదయ్యేందుకు ఎక్సైజ్ అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముద్రపడిన ఓ మద్యం దుకాణాల నాయకుడు జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 22 మద్యం దుకాణాలను సింగిల్ టెండర్ల ద్వారా షాపులను చేజిక్కించుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో కంటే పల్లెల్లో అద్దెలు తక్కువగా ఉండాలి. కానీ మద్యం దుకాణాల అద్దెల్లో మాత్రం రివర్స్ జరిగింది. అర్బన్ ప్రాంతాల్లో లేని అద్దెలను గ్రామీణ ప్రాంతాల్లో వేసుకుని టెండర్లు చేజిక్కించుకున్నారు. మల్లంపేట, తెర్లాం, బాడంగి, బొబ్బిలి రూరల్ ప్రాంతాల్లోని షాపుల అద్దెలు మున్సి పాలిటీల్లోని షాపుల అద్దెలతో సమానంగా ఉన్నాయి. ఇవే మద్యం దుకాణాలు గ్రామీణ ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు వేల రూపాయలకు (ఫర్నిచర్‌తో సహా) లభిస్తున్నా అటు అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. ఉన్నతాధికారులకు చేరిన ఫిర్యాదులు: అద్దెల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ వీటిని సవరించి ఇతరులకు న్యా యం చేయాలని డీపీసీ చైర్మన్ అయిన జాయిం ట్ కలెక్టర్, ఎక్సైజ్ డీసీలతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు కొందరు వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. షాపులకు సంబంధించి పలువురు వ్యాపారులు ఎక్సైజ్ అధికారుల చుట్టూ తిరుగుతుండటంతో వారు ఏమీ చెప్పలేకపోతున్నా రు. ఇటీవల తెర్లాం తదితర సీఐలతో పాటు ఎక్సైజ్ డీసీ సైతం సెలవులోకి వెళ్లిపోయారు. కమిటీదే నిర్ణయం.. మద్యం దుకాణాల అద్దెలపై జిల్లాలో జేసీ, డీసీ తదితరులతో కూడిన కమిటీ అంతా కలసి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయంలో నాకు స్పష్టత లేదు. షాపుల అద్దెల విషయంలో ఉన్నతాధికారులదే నిర్ణయం. – సుధీర్, డిపో మేనేజర్, బెవరేజెస్ కార్పొరేషన్, నెల్లిమర్ల ఫిర్యాదు చేశాం.. ఎక్సైజ్ శాఖ అధికారులు కొందరు బడా మద్యం వ్యాపారులకు సహకరిం చారు. అధిక అద్దెలున్న షాపులను ఎంపిక చేసి ఖజానాకు గండి కొడుతున్నారు. అధిక అద్దెల వల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు నెలకు కోటిన్నర పైనే ఖజానాకు భారం కానుంది. అలాగే ఎక్కువగా బెల్ట్‌షాపులకు నడిపించే ప్రాంతాల్లోనే ఎక్కువ షాపులను ఎంపిక చేస్తున్నారు. దీనిపై జేసీ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. – బార్నాల మహేశ్వరరావు, మద్యం వ్యాపారి, బొబ్బిలి -
అన్నా..‘వంద’నం!
రాష్ట్రంలో ఇప్పుడు జనం కోరుకున్న పాలన సాగుతోంది. ఒకప్పటి స్వర్ణయుగాన్ని తలపిస్తోంది. ఒకప్పుడు కొందరికే పరిమితమైన సంక్షేమం ఇప్పుడు అందరికీ అందివస్తోంది. మాటతప్పని నేత అధికార పీఠంపై ఉండటంతో మడమ తిప్పకుండా హామీలు అమలవుతున్నాయి. కేవలం వంద రోజుల్లోనే ఊహించని సంక్షేమం సొంతమయింది. జిల్లాలోనూ అభివృద్ధి పరుగులు తీస్తోంది. విద్య, వైద్యంపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి జిల్లాలోని పాచిపెంట మండలంలో గిరిజన వర్సిటీ... కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజ్, విజయనగరానికి మెడికల్ కాలేజ్, పార్వతీపురానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కేటాయించారు. సాక్షి ప్రతినిధి విజయనగరం: ప్రజలిచ్చిన పదవిని బాధ్యతగా భావించారు. పాలనకు కొత్త భాష్యం చెబుతున్నారు. సంచలన నిర్ణయాలతో ప్రజలందరి మన్ననలు చూరగొంటున్నారు. ఇదీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి సాధించిన ప్రగతి. శుక్రవారం నాటికి ఆయన పదవీకాలం వందరోజులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ కొద్దికాలంలోనే జిల్లాను ప్రగతిపథంలో నడిపించారు. గడచిన దశాబ్దాల కాలంలో ఏ పాలకులూ చేయలేనన్ని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించారు. గిరిజన విశ్వవిద్యాలయం, మెడికల్ కళాశాల, గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రివంటివి కార్యరూపం దాలుస్తున్నాయి. ఆర్టీసీ విలీనం, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, ఆరోగ్య మిత్రలు, పారిశుద్ధ్యకార్మికులు, ఆశ వర్కర్ల వేతనాల పెంపు నిర్ణయాలతో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. గ్రామ, వార్డు వలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే చేరే ఏర్పాటు చేశారు. బెల్టు షాపులను పూర్తిగా రద్దుచేసి ఎన్నో కుటుం బాలను నిలబెట్టారు. ఇసుక కొరతను తీర్చేం దుకు, మాఫియా ఆగడాలను అరికట్టేందుకు కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చారు. గిరిసీమల్లో విద్యాలయాలు.. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ అందుబాటులోకి రాలేదు. గిరిజనుల తలరాతలు, జీవన ప్రమాణాలు మార్చే ఈ విశ్వవిద్యాలయాన్ని గిరిజన ప్రాంతంలో కాకుండా విశాఖపట్నానికి దగ్గరగా ఉండే కొత్తవలస మండలం రెల్ల వద్ద ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భూ సేకరణ చేసి సరిపెట్టింది. కానీ ఈ యూనివర్సిటీ వల్ల గిరిజనులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో పాచిపెంట మండలంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించి ఆమేరకు అమలు చేస్తున్నారు. పెదకంచేరు వద్ద అధికారులు స్థలం గుర్తిస్తుండగా మరోవైపు గిరిజన యూనివర్సిటీ తరగతులను ఈ ఏడాది నుంచి విజయనగరం పీజీ సెంటర్లో ప్రారంభించారు. అడవి బిడ్డలకు ఉన్నత విద్య.. గిరిజన ప్రాంతంలో ఇంజినీరింగు విద్య కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి తాజాగా కురుపాంలో ప్రభుత్వ గిరిజన ఇంజినీరింగు కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు విద్యపరంగా వెనుకబడి ఉన్న ఈప్రాంతంలో ఇంజినీరింగు కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. ఇక గిరిజన ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న పార్వతీపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో సరైన వైద్య సేవలు లేక మెరుగైన వైద్యం కోసం విజయనగరం, విశాఖపట్నం వంటి దూరæ ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. నెరవేరుతున్న విజయనగరం కల.. విజయనగరంలో ప్రభుత్వ మెడకల్ కాలేజీ ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. ఆ కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఓట్లు దండుకునేందుకు అనేక శంకుస్థాపనలు చేసి ఉత్తుత్తి జీఓలు జారీ చేసింది. కానీ ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల కలను సార్ధకం చేసేలా మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తూ ఆ కలను సాకారం చేస్తోంది. ఉత్తుత్తి మాటలతో సరిపెట్టకుండా తొలి బడ్జెట్లోనే రూ.66కోట్లు కేటాయించి పనులు ప్రారంభానికి నాంది పలికింది. అడవిలో కాంతి కిరణాలు.. జిల్లాలో ఎస్టీ, ఎస్టీ జనాభా ప్రాంతం ఎక్కువ. రెండు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్ కాగా, ఒకటి ఎస్సీ రిజర్వ్‌గా ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకు గానే చూశాయి. కానీ జగన్ మాత్రమే వారి కష్టాలను చూశారు. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని సీఎం కాగానే నెరవేర్చారు. 200 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగాన్ని ఉచితం చేశారు. దీనివల్ల జిల్లాలో సుమారు 70వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. వారి ఇళ్ళల్లో వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. మహిళకు మకుటం.. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలను స్వయంగా చూసి, విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే మహిళా పక్షపాతిగా పేరుతెచ్చుకున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో పిల్లలను పాఠశాలకు, జూనియర్ కళాశాలకు పంపే తల్లులకు ఏటా రూ.15వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం త్వరలోనే అమలులోకి రానుంది. అంగన్వాడీ కార్యకర్తలకు, మధ్యాహ్నభోజన నిర్వాహకులకు, ఆశ వర్కర్లకు జీతాలు అనూహ్యంగా పెంచారు. అంతే గాకుండా 45 ఏళ్లు నిండిన బడుగు, బలహీన వర్గాల మహిళకు రూ.75వేలు దశలవారీగా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా తొలి సంతకంతోనే పింఛన్లను పెంచారు. ఒంటరి మహిళలకు అన్నగా ఆలోచించి ఆర్ధిక భరోసానిచ్చారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఉగాది రోజు ఇల్లులేని ప్రతి మహిళ పేరున ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి మరీ అందించేందుకు జిల్లాలో స్థలాలను అన్వేషిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ మహిళకే సగభాగం ఇస్తామని ప్రకటించారు. జిల్లాకు చెందిన గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవినిచ్చి, ఉప ముఖ్యమంత్రి హోదానిచ్చి సముచిత స్థానం కల్పించారు. అంతేకాకుండా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి దానికి ఆమెను చైర్మన్‌గా నియమించారు. అరకు ఎంపీగా కూడా మరో గిరిజన మహిళ గొడ్డేటి మాధవిని గెలిపించి గౌరవించారు. చేసి చూపించడం జగనన్న నైజం.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించని మైలు రాయిని అందుకున్నారు. మాటలు కాకుండా చేతల్లో చూపించడం ఆయన నైజం. బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిం చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇన్నాళ్లూ మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి పెద్దపీట వేస్తూ మహిళలకు నామినేటెడ్ పదవులలలో 50 శాతం రిజర్వేషను కల్పించిన ఘనత మాత్రం జగనన్న సొంతం. మద్యపాన నిషే« దం, కౌలు రైతులకు ప్రత్యేక చట్టం, ఆర్టీసీ విలీనం, గిరిజనులకు వైద్యకళాశాల, గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం, ఐటీడీఏల పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేనన్ని పనుల్ని చేసి చూపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. – పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం మాట తప్పని నాయకుడు జగన్.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. ఆయన మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. 100 రోజుల పాలనలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారు. నవరత్నాలలో ఇంతవరకు 90 శాతం హామీలు నెరవేర్చారు. – శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేశంలోనే జగన్‌ది ఆదర్శవంతమైన పాలన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పరిపాలన భారతదేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తోంది. ఆయన బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లోనే చేపట్టిన సంస్కరణలు చూసి దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు వైపు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్లు దోపిడీ, అరాచకాన్ని అరికడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయిలో తీర్చి దిద్దనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా 5 లక్షల ఉద్యోగాల భర్తీ చారిత్రాత్మకం. – బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యుడు -
మంచం పట్టిన బూరాడపేట
విష జ్వరాలు పెదబూరాడపేట, చినబూరాడపేట గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. సుమారు మూడు వారాలుగా ఇదే పరిస్థితి ఆయా గ్రామాల్లో నెలకొంది. గ్రామస్తులు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలా జ్వరాలు ప్రబలడానికి ఆయా గ్రామాల్లో తాగునీరే కారణమని వైద్యులు చెబుతున్నారు. సాక్షి, నెల్లిమర్ల రూరల్: విష జ్వరాలతో పెద బూరాడపేట, చిన బూరాడపేట వాసులు మంచం పట్టారు. వర్షాకాలం, తాగునీటి కాలుష్యం వెరసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రెండు గ్రామాల్లోను ప్రజలు జ్వరం, దగ్గు, విరేచనాలతో పాటు, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకాధికారుల జాడ కాన రావడం లేదు. గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు. జ్వర పీడితులు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. రెండు గ్రామాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు మంచం పట్టి ఉన్నారు. దీంతో స్థానికులు బిక్కుబిక్కు మంటున్నారు .గడిచిన ఇరవై రోజుల నుంచి ప్రధానంగా కీళ్ల నొప్పులు, కాలు వాపుల సమస్యలతో బాధ పడుతున్నారు. రెండు గ్రామాల్లోనూ సుమారు 70మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో మంగళవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు స్వచ్ఛంధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు తనిఖీలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. గ్రామంలో పలువురు యువకులు వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో కొండవెలగాడ పీహెచ్సీ సిబ్బంది వెంటనే గ్రామాన్ని సందర్శించి జ్వర పీడితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటితోనే.. కలుషిత నీటిని తాగడం వలనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ట్యాంక్ నుంచి తాగునీటి సదుపాయం ఉన్నప్పటికీ ప్రజలు ఆ నీటిని వినియోగించడం లేదు. సమీపంలో పంట పొలాల్లో ఉన్న బావి నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. ఆ నీరు పూర్తిగా కలుషితమని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో తాగునీటి పైపులైన్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో మురుగు నీటి కాలువల నుంచి తాగునీటి పైపు లైన్లను ఏర్పాటు చేయడంతో ఆ నీరు కూడా కలుషితంగా మారింది. వైద్యాధికారి ఏమన్నారంటే... ఈ సమస్యపై స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి ప్రశాంత్ రాజ్‌ను వివరణ కోరగా గ్రామంలో ఇప్పటికే సర్వే చేశామని గడిచిన 15 రోజుల నుంచి తరుచూ వైద్య తనిఖీలను చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ట్యాంక్ నుంచి వాటర్ సరఫరా అవుతున్నప్పటికీ ప్రజలు కలుషిత బావి నీటిని వినియోగిస్తున్నారన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి రోజు వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. -
వృద్ధురాలి హత్య..!
సాక్షి, సాలూరు రూరల్: బంగారం కోసం వృద్ధురాలి ని హతమార్చిన సంఘటన ఆదివారం తెల్లవా రుఝామున సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దాసరివీధిలో గెంబలి శకుంతల (68) ఒంటరిగా నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు విశాఖలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మరో కుమారు డు త్రినాథరావు సాలూరులోనే ఓ టైర్ల దుకా ణంలో పనిచేస్తున్నాడు. త్రినాథరావు సాలూరులో వేరేగా ఉంటుండడంతో శకుంతల ఒంటరి గా నివశిస్తోంది. ఇదిలా ఉంటే త్రినాథరావు కుమారుడు తేజవిజయ్ (17) ఆదివారం కావడంతో నాన్నమ్మను చూసేందుకు తెల్లవారు 6 గంటలకు ఇంటికెళ్లి తలుపుకొట్టాడు. నాన్న మ్మ స్పందించకపోవడంతో తలుపు తీసుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉంది. వెం టనే విజయ్ తండ్రికి ఫోన్ చేయగా.. త్రినాథరావు హుటాహుటిన ఇంటికి చేరుకుని వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ గౌతమీశాలి సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. బంగారం కోసమేనా..? బంగారం కోసమే దుండగులు వృద్ధురాలిని హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఒంటి మీద ఉండాల్సిన 8 తులాల ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ, హత్య, తదితర కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. అలాగే సమీపంలో ఉండే సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామన్నారు. వివరాల సేకరణలో క్లూస్‌టీమ్.. హంతకుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు క్లూస్ టీమ్ సభ్యులతో పాటు జాగిలాన్ని రంగంలోకి దించారు. జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి మెయిన్ రోడ్డు వరకు వెళ్లి ఆగిం ది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో సీఐ సింహాద్రినాయుడు, పట్టణ ఎస్సై శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఇక శుద్ధ జలధార
అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే... శుద్ధమైన నీటిని సేవించాలి. సంక్షేమ పథకాలతోనే సంతృప్తి చెందని సర్కారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ... వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో ప్రజలకు దశలవారీగా శుభ్రమైన నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతలో జిల్లాలో అమలు చేయనున్న పథకం కోసం జిల్లా అధికారులు రూ. 2600 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నేడో రేపో దానిని మంత్రులకు అందించి ఆమోదింపజేయనున్నారు. జిల్లాలోని తాగునీటి పథకాల సంఖ్య: 1989 ఇందులో సోలార్ పథకాలు : 160 మల్టీ విలేజ్ స్కీంలు : 34 సాక్షి, బొబ్బిలి: ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని ఇంటింటికీ అందించేందుకు నిర్ణయించింది. రెండో దశలో ఈ పథకం మన జిల్లాలో అమలు పరచనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని వర్తింపజేసి తాగునీటి సమస్యను నూరు శాతం పరిష్కరించే చర్యలు తీసుకోనున్నారు. జిల్లాకు పూర్తి స్థాయి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో దీనికి జలధార అనే నామకరణం చేశారు. జిల్లాలోని 34 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మండలాల్లో ఉన్న పథకాలను కూడా వినియోగిస్తారు. ఆయా పథకాలకు శుద్ధి చేసిన జలాన్ని సరఫరా చేసి ఆ నీటిని గ్రామాల్లోని ప్రజలకు ఇంటింటికీ అందజేస్తారు. ఇందుకో సం అన్ని గ్రామాల్లో అదనపు పైప్లైన్లు నిర్మించనున్నారు. రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్.. జిల్లాలో పథకం అమలుకు సంబంధించి గ్రామీ ణ నీటి సరఫరా విభాగం అధికారులు రూ. 2,600 కోట్లతో ప్రణాళికలు, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఈ నిధులతో వాటర్ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్‌ట్యాంకులు, తాగునీటి పైప్‌లు నిర్మిస్తారు. తద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తారు. విజయవాడ తరహాలో సాగునీటి ప్రాజెక్టుల్లోని మిగులు జలా లు వృధాగా పోకుండా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే ప్రణాళికే వాటర్‌గ్రిడ్. ఈ జలాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల సహాయంతో శుద్ధ జలాలుగా మారుస్తారు. ఇందుకోసం జిల్లాలోని తోటపల్లి, తాటిపూడి రిజర్వాయర్ల నీటిని తాగునీటి అవసరాలకోసం మారుస్తారు. దీనివల్ల మిగులు జలాలు వృధాగా నదుల్లోకి విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే నిత్యం బోర్లతో భూగర్భ జలాలను తోడేస్తూండటంవల్ల తలెత్తే పర్యావరణ ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చనేది ముఖ్యమంత్రి భావన. మనిషికి వందలీటర్ల నీరు పట్టణాల్లో ఓ వ్యక్తికి రోజుకు135 లీటర్ల నీరు అవసరం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 105 లీటర్ల నీరు అవసరమనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల్లో ఒకటి. వీటి ని అనుసరించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా సగటున ఓ వ్యక్తికి వంద లీటర్ల తాగునీరు ఇవ్వాలని జిల్లా అధి కారులు నిర్ణయించారు. తాగునీరు, వాడుక నీరు అన్న తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ వా టర్‌గ్రిడ్‌ను అమలు పరచాలని నిర్ణయించారు. దీనిపై సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవా ణి, ఇన్‌ఛార్జి మంత్రులకు అధి కారులు అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు వెంటనే ప్రారంభిస్తారు. మనిషికి వంద లీటర్ల నీరు.. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రతీ ఇంటిలోని ఒక్కో వ్యక్తికీ వందలీటర్ల చొప్పున నీటిని అందిస్తాం. ఇందుకోసం రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశాం. త్వరలో ప్రభుత్వ పెద్దలకు అందజేస్తాం. – పప్పు రవి, ఎస్ఈ ఇన్చార్జి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, విజయనగరం -
పక్కాగా...అందరికీ ఇళ్లు!
కూడు... గూడు... గుడ్డ... ఇవీ మానవుని కనీస అవసరాలు. ఇప్పటికీ సొంత గూడులేని కుటుంబాలెన్నో ఉన్నాయి. ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా అలాంటివారిని స్వయంగా చూసిన ప్రజానేత జగన్మోహన్రెడ్డి తన పాలనలో వాటి పరిష్కారానికే తొలిప్రాధాన్యమిచ్చారు. అన్ని రంగాలవారినీ ఆదుకునేందుకు నవరత్నాలను తెచ్చారు. రాబోయే ఐదేళ్లలో సొంత స్థలం... ఇల్లు లేని పేదవారుండకూడదన్న సత్సంకల్పంతో ఈ ఉగాదినుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన స్థలాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 44వేల మంది అర్హులను గుర్తించిన అధికారులు... 653 ఎకరాల భూమినీ గుర్తించారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇల్లులేని ప్రతి పేదవాడికీ ఉగాది నాటికి గృహయోగం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా అధికారులు అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరుకు అందిన 2 లక్షల 60 వేల దరఖాస్తుల్లో 44 వేల మందిని అర్హులుగా గుర్తించారు. జిల్లాలో ప్రస్తుతం 653.45 ఎకరాల భూమి పంపిణీకి అందుబాటులో ఉంది. ఒక్కో లబ్ధిదారునికి గ్రామాల్లో 72 గజాలు, పట్టణాల్లో 60 గజాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉన్న, ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకోవడం ద్వారా భూ పంపిణీకి అవసరమైన భూముని సేకరించే పనిలో పడ్డారు. 43వేల మందికి భూమి సిద్ధం.. జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి 646.98 ఎకరాలు ఉంది. చిన్న చిన్న తగాదాలతో మరో 6.47 ఎకరాలు ఉంది. దీనిలో పట్టణ ప్రాంతంలో ఉన్న భూమి 48.54 ఎకరాలు కాగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నది 604.86 ఎకరాలు. 40,602 మందికి గ్రామీణ ప్రాంతంలోనూ, 3262 మందికి పట్టణ ప్రాంతంలోనూ కలిపి దాదాపు 43వేల మందికి పంపిణీ చేయడానికి ఈ భూమి సరిపోతుంది. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులకు ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని పంచిపెట్టవచ్చు. అయితే జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కనీసం లక్ష మంది లబ్ధిదారులు ఉగాది నాటికి తేలవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయోనని క్షేత్రస్థాయిలో వెదుకుతున్నారు. స్థలాల కోసం వెదుకులాట.. జిల్లాలో 34 మండలాలు, 1543 రెవిన్యూ గ్రామాలుండగా 620 గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 923 గ్రామాల్లో భూములు గుర్తిస్తున్నారు. ఐదు పురపాలక సంఘాల్లో రెండింటిలోనే ప్రభుత్వ భూమి దొరుకుతోంది. మిగిలిన వాటిలో వెదుకుతున్నారు. ఈ పనిని జిల్లా వ్యాప్తంగా గ్రామ వలంటీర్ల సహాయంతో అధికారులు చేస్తున్నారు. జిల్లాలో విధుల్లో చేరిన 11,985 మందిలో 11,176 మందికి భూముల గుర్తింపు సర్వేపై శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో ప్రజాసాధికార సర్వే, ఇంటింటి సర్వేలు నిర్వహించి నియోజకవర్గాల వారీగా ఎన్ని ఇళ్లు అవసరమవుతాయనే లెక్కలు అధికారుల వద్ద ఉన్నాయి. వీటి ప్రకారం... చీపురుపల్లిలో 18,390, గజపతినగరంలో 18,607, నెల్లిమర్లలో 26,337, శృంగవరపుకోటలో 21,564, విజయనగరంలో 33,590, బొబ్బిలిలో 25,140, పార్వతీపురం 15,290, సాలూరులో 23,153, కురుపాంలో 19,975 చొప్పున మొత్తం 2,02,046 ఇళ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదీ ఇళ్ల నిర్మాణ ప్రగతి.. 2016–17 నుంచి 2019–20 సంవత్సరాల మధ్య జిల్లాలో గృహనిర్మాణాల ప్రగతిని ఒకసారి పరిశీలిస్తే... గ్రామీణ గృహనిర్మాణ పథకం ద్వారా జిల్లాకు 58788 కేటాయించారు. వీటిలో 31,988 రద్దు చేయడానికి ప్రతిపాదించారు. 26,800 గృహాలు చేపట్టి, 22,451 గృహాలు పూర్తి చేశారు. ఇంకా 4349 గృహాలు పూర్తికాలేదు. వీటిలో 3297 గృహాలు పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. పీఎంఎవై–గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా 6935 గృహాలు మంజూరైతే 3,747 పూర్తిచేశారు. 3188 మిగిలాయి. వీటిలో 1926 ఇళ్లు నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. పీఎంఎవై–ఆర్బన్ గృహనిర్మాణ పథకం ద్వారా 39,866 ఇళ్లు మంజూరుకాగా 3,985 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 35,881లో ప్రారంభానికి నోచుకోనివి 14,961 ఉన్నాయి. ఇక ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం(పట్టణ) ద్వారా ఫేజ్–1, ఫేజ్–2లో విజయనగరం, నెల్లిమర్ల, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో 11,837 ఇళ్లు మంజూరైతే 9,744 ఇళ్లు నిర్మాణం చేపట్టి 4624 ఇళ్లు పూర్తి చేశారు. ఈ లెక్కలను బట్టి గత ప్రభుత్వ హయాంలో పేదలెవరికీ కనీసం గూడు కూడా దొరకలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి తమ ప్రభుత్వ హయాంలో తలెత్తకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామవలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థలను పటిష్టంగా తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పడ్డ మంత్రుల కమిటీతో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా అధికారులు భూములను గుర్తించే పని చేపడుతున్నారు. -
కోరలు చాస్తున్న డెంగీ..!
సాక్షి, విజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి కోరలు చాస్తోంది. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ జ్వరాల వ్యాప్తి కూడా అధికంగానే ఉంది. అయితే మలేరియా వ్యాధి వ్యాప్తి మాత్రం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా మలేరియా వ్యాధి అధికంగా వ్యాప్తి చెందే గిరిజన ప్రాంతంలో వ్యాప్తి తగ్గడం గమనార్హం. మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన ముందుస్తు చర్యలు వల్ల ఈఏడాది మలేరియా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. సీజనల్ వ్యాధులు వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంత ప్రజలు మలేరియా బారిన పడి మృత్యువాత పడేవారు. అయితే డెంగీ రోగుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు నమోదైన రోగుల వివరాలు.. వ్యాధిపేరు రోగుల సంఖ్య జ్వరాలు 2,30,527 మలేరియా 60 డెంగీ 97 టైపాయిడ్ 820 డయేరియా 17,382 స్వైన్‌ఫ్లూ 20 కిటకిటలాడుతున్న ఆస్పత్రులు.. డెంగీ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ నాటికి 2లక్షల 30 వేలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ఆస్పత్రుల్లో రెండు లక్షల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. దోమల నివారణ మందు పిచికారీ.. గిరిజన ప్రాంతంలో ముందుస్తుగానే ఈ ఏడాది దోమల నివారణ మందు పిచికారీ చేశారు. అదేవిధంగా డెంగీ వ్యాప్తి ప్రాంతాల్లో 8 వారాల పాటు మలాథియాన్ పిచికారీ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన డెంగీ రోగులకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వదలని డెంగీ జ్వరాలు.. మెంటాడ: మండలంలోని వానిజ, గుర్ల, తమ్మిరాజుపేట గ్రామాల్లో డెంగీ జ్వరాలు ప్రబలాయి. చల్లపేట గ్రామానికి చెందిన సిరిపురపు అప్పలకొండ (40) డెంగీ లక్షణాలతో జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పలకొండ తన భర్తతో కలిసి రాజమండ్రి పనుల కోసం వలస వెళ్లి ఇటీవల గ్రామానికి వచ్చింది. మొదట జ్వరం రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 24న చికిత్స పొందింది. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆమెను గజపతినగం తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి డెంగీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో చల్లపేట వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రజారోగ్యానికి పెద్దపీట
సాక్షి, బొబ్బిలి: ప్రజా సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, అవనీతి రహిత పాలన దిశగా సాగుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలందించాలని నిర్ణయించింది. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు నియోజకవర్గానికి రెండు ఆస్పత్రులను ఆధునిక హంగులతో ఆదర్శవంతగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లో మోడల్ ఆస్పత్రుల రూపకల్పనకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ కోవలోనే జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 18 పీహెచ్‌సీలకు భవనాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చేందుకు ఏపీహెచ్‌ఎంఐడీసీకి జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు పంపించింది. నియోజకవర్గానికి రెండు... రాష్ట్ర ప్రభుత్వం మొదట నియోజకవర్గానికి ఒక ఆస్పత్రిని అన్ని హంగులూ, సౌకర్యాలు కల్పిం చాలని నిర్ణయించింది. అయితే, ఉన్నతాధికారులతో సంప్రదించిన సీఎం నాయకత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం నియోజకవర్గానికి రెండు ఆస్పత్రులను ఎంపిక చేసి అక్కడి సౌకర్యాలను మెరుగు పర్చి మోడల్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని భావించింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి బృందం ఇటీవలే పర్యటించి ఆస్పత్రులను గుర్తించింది. ఆరు ఆస్పత్రులకు కొత్త భవనాలు.. ఎంపిక చేసిన ఆస్పత్రులకు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఆరు పీహెచ్‌సీలను పూర్తిగా కొత్త భవనాలతో మార్పు చేయనున్నారు. అందులో తోణాం, మామిడి పల్లి, శం బర, మక్కువ, కొత్తవలస, చల్లపేట పీహెచ్‌సీలు ఉన్నాయి.ఈ భవనాలు పాత బడిపోవడంతో పా టు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని వీటిని పూర్తి కొత్త భవనాలతో రూపొందించనున్నారు. సకల సౌకర్యాలు.. మోడల్ ఆస్పత్రుల్లో తాగునీటితో పాటు ఫర్నిచర్, అధునాతన పరికరాలు, పరీక్షా పరికరాలు, ల్యాబ్‌లు, ప్రహరీలు, మందుల ప్రతిపాదనలు వంటి అన్ని సౌకర్యాలనూ కల్పించనున్నారు. జిల్లాలోని మొత్తం 62 పీహెచ్‌సీలను పరిశీలించిన అధికారుల బృందం 18 పీహెచ్‌సీలను గుర్తించి మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్.. ముందుగా నియోజకవర్గానికో స్పెషల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించింది. వీరు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, జ్వరాలపై పరిశీలనలు, ఏఏ ప్రాంతాల్లో ఏఏ రోగులున్నారు... ఎంత వరకు నివారిస్తున్నారన్న వివరాలను జిల్లా వైద్యాధికారికి నివేదిస్తారు. డిసెంబర్ నుంచి పనుల ప్రారంభం.. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో రెండేసి మోడల్ ఆస్పత్రుల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా 18 పీహెచ్‌సీలను గుర్తించాం. అందులో ఆరు ఆ స్పత్రులకు కొత్త భవనాలు కూడా ప్రతిపాదించాం. డిసెంబర్ నాటికి పనుల ప్రారంభించే అవకాశం ఉంది. – డాక్టర్ కె.విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, విజయనగరం -
ఆ దందా సాగదిక...
మద్యం వ్యాపారంలో ప్రైవేటు వ్యాపారుల దందాకు ఇక చరమ గీతం పాడనున్నారు. నిరుపేదలను నిలువునా మోసగించే చర్యలు ఇక సాగనివ్వరు. లూజు విక్రయాల పేరుతో దగా చేసే విధానానికి ఇక చెల్లు చెప్పనున్నారు. కల్తీ మద్యంతో అనారోగ్యం కొనితెచ్చుకోనక్కర లేదు. ప్రభుత్వమే ఇక మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున విక్రయాలన్నీ ఇక పారదర్శకమే. సాక్షి, విజయనగరం రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్యనిషేధం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మరో కీలకమైన అడుగు పడబో తోంది. తొలుత బెల్టుషాపులు నిరోధించి...కొంతవరకు పల్లెల్లో ప్రశాంతవాతావరణం నెలకొల్పారు. ఇప్పుడు మద్యం దుకాణాలు పూర్తిగా ప్రభుత్వపరంగానే నిర్వహించడంతో లూజు విక్రయాలు... కల్తీ మ ద్యానికి చెల్లు చెప్పనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 210 మద్యం దుకా ణాలు ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. వ్యాపారులు మద్యం దుకాణాలకు టెండర్లు వేసిలాటరీ పద్ధతిలో దుకాణాలను దక్కించుకుని నిర్వహించారు. ప్రభుత్వం ఏడాది కాలానికి నిర్దేశించిన ఫీజును చెల్లించి వ్యాపారం కొనసాగించారు. దీనివల్ల మద్యం దుకాణాల్లో లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగేది. నిబంధనలు ఖాతరు చేయకుండా మద్యం దుకాణాల్లోనే లూజ్ విక్రయాలు చేసేవారు. దీంతో మద్యం విక్రయాల్లో కల్తీ జరిగి మందుబాబుల జేబులకు చిల్లు పడటమే కాకుండా మద్యం ప్రియుల ఆరోగ్యంపైనా ప్రభావం పడేది. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతులు ఉండటంతో ఆ సమయం వరకు అధికారికంగా మద్యం విక్రయాలు సాగించిన వ్యాపారులు రాత్రి 10 గంటల అనంతరం మద్యం దుకాణాల వెనుకనుంచి వారి సిబ్బందితో అనధికార విక్రయాలు సాగించేవారు. ఇక విడి విక్రయాలు బంద్.. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఇక విడి విక్రయాలకు ఆస్కారం ఉం డదు. దీనివల్ల కల్తీ జరిగే అవకాశమే ఉండదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అలాగే మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అనధికార విక్రయాలకు ఆస్కారం ఉండదు. దీంతో మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉండటం, దశలవారీ మద్య నిషేధానికి బాటలు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కల్తీకి ఆస్కారం ఉండదు.. నూతన మద్యం విధానంలో విడి విక్రయాలకు ఆస్కారం లేనందు న మద్యంకల్తీ జరిగే అవకాశం ఉండదు. అలాగే జిల్లాలో ఉన్న 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కే పరిమితం చేశాం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిబ్బందిని నియమించడంతో వారు నిర్ణీత వేళల్లోనే పని చేస్తారు కాబట్టి అనధికార విక్రయాలు జరపడానికి వీలుపడదు. – వై.బి.భాస్కరరావు, అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్, విజయనగరం -
మాయమవుతున్న మాంగనీస్
జిల్లాలోని నాణ్యమైన మాంగనీసు మాయమవుతోంది. అనుమతుల్లే కుండానే ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. అక్రమార్కుల జేబుల్లోకి నగదురూపంలో చేరిపోతోంది. ఇటీవల అనుమతుల్లేకుండా తరలిస్తున్న నాలుగు లారీల మాంగనీసు పట్టుబడడంతో గనుల అక్రమతవ్వకం బహిర్గతమైంది. మంగనీసు కొండలు తరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకచోట తవ్వకానికి అనుమతి తీసుకొని మరోచోట అనధికారికంగా, అధికంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇటీవల దొంగ పర్మిట్లతో రవాణా చేస్తున్న 120 టన్నుల మాంగనీస్ పట్టుబడింది. నాలుగు లారీల్లో తరలిస్తున్న మాంగనీస్ ఖనిజం ఎక్కడ నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. జిల్లాలో ఇదే విధంగా మరికొన్ని చోట్ల కూడా గనుల అక్రమ రవాణా, తవ్వకాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరందుకోంది. నిల్వల్లో ప్రథమం.. రాష్ట్రంలో ఎక్కడా లేని నాణ్యమైన మాంగనీసు విజయనగరం కొండల్లో 14 మిలియన్ టన్నులు ఉంది. 40 వేల ఏళ్ల కిందట ఏర్పడిన మాంగనీస్ భూ ఉపరితలానికి 22 మీటర్ల లోతులో ఇక్కడ లభిస్తోంది. దీంతో విజయనగరం మాంగనీసు గనులకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని గరివిడి, మెరకముడిదాం, చీపురుపల్లి, పూసపాటి రేగ, సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి మండలాలతో పాటు జిల్లాలోని పార్వతీపురంలో కూడా మాంగనీస్ గనులున్నాయి. ఈ గనుల నుంచి ఏటా సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మాంగనీస్ నిల్వలను తరలిస్తున్నట్టు అంచనా. అయితే, అధికారులు మాత్రం లక్షా 50వేల టన్నులు మాత్రమే వెళ్తోందని లెక్కగడుతున్నారు. అంటే ఒకే పర్మిట్‌తో రెండు మూడు లారీలు వెళ్తుండడంతో పాటు తనిఖీలు జరుగకుండా వెళ్తున్నవి అధికంగా ఉంటున్నాయి. లైసెన్స్‌లు రద్దుచేసినా ఆగని తవ్వకాలు.. బొబ్బిలి మండలం మెట్టవలస పంచాయతీ బోడిమెట్ట కొండ 182 సర్వే నంబర్లో గతంలో ఏడుగురికి లైసెన్సులుండేవి. పరిశ్రమలు ఉన్న గ్రోత్ సెంటర్‌ను ఆనుకునే బోడి మెట్టకొండ ఉంది. ఇక్కడ 34.37 ఎకరాలు (13.915హెక్టార్లు) విస్తీర్ణంలో సంవత్సరానికి రూ.50వేల చొప్పున లైసెన్సులను ఏడుగురు వ్యక్తులకు ఉండేవి. అయితే, ఇందులో లైసెన్సుదారులు వారికి కేటాయించిన పరిధి దాటి తవ్వకాలు చేపట్టడం, నిబంధనలు అతిక్రమించడంతో సుమారు ఐదుగురి లైసెన్సులు రద్దుచేశారు. అయినప్పటికీ వారు ఇంకా అదే ప్రదేశంలో అక్రమ తవ్వకాలు చేపడుతుండడం గమనార్హం. చీపురుపల్లి నియోజకవర్గంలో మాంగనీస్ గనులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా జరుగుతుంటుంది. అయితే, ఇటీవల అక్కడి పెద్దపెద్ద మైనింగ్ కంపెనీలు మై నింగ్‌ను నిలిపివేశాయి. దీంతో మైనింగ్ ఎక్కడా జరగడం లేదనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యం గా ఈ నెల 23న ఎస్కే సర్వాగీ అండ్‌కో ప్రైవేట్ లిమి టెడ్ పేరుతో రూ.12 లక్షల విలువైన 240 టన్నుల మాంగనీస్‌ను ఆరు లారీల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి చీపురుపల్లి మండలంలో సర్వాగి మైనింగ్‌ను మూసేశారు. అక్కడ తవ్వకాలు జరగడం లేదు. మరలాంటప్పుడు ఆ కంపెనీ పేరుతో ఆరు లారీల మాంగనీస్ ఎక్కడి నుంచి తవ్వి తీసుకువస్తున్నారనేది మిస్టరీగా మారింది. విజిలెన్స్ కేసులుంటే బంధువులకు లైసెన్సులు.. గనుల అక్రమ తవ్వకాలపై అధికారులు అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో బోడిమెట్ట కొండ ప్రాంతంలో ఉన్న లైసెన్సుదారులు అధికంగా తవ్వకాలు, పరిధిని మించి క్వారీ మెటల్ సేకరణ చేస్తుండడంతో మైనింగ్ విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసింది. కొంత మెటల్‌ను సీజ్ చేసింది. లైసెన్సులను రద్దు చేసింది. అదే లైసెన్స్‌దారులు వారి బంధువుల పేరున మళ్లీ లైసెన్సులు తెప్పించుకుని మళ్లీ క్వారీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. లైసెన్సులు..సబ్ లైసెన్సులు: లైసెన్స్ తీసుకున్న గనుల నిర్వహకులు తవ్వకాలకు సబ్ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. గనులుండే కొండప్రాంతాన్ని భాగాలుగా చేసి సబ్ లైసెన్సులకు ఇస్తున్నారు. నెలకు కొంత మొత్తాన్ని లైసెన్సు దారులకు ముట్టజెప్పేందుకు ఒప్పందాలు చేసుకుని గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు. వీరి విషయం అధికారులకు తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గడిచిన గనుల ప్రమాదాల్లో అమాయక కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 398, 447 చట్టాలకు తూట్లు : క్వారీలు, చెరువులు, ఇసుక రేవుల్లోని వనరులను విక్రయించుకుంటూ వ్యాపారం చేసుకునే వారు మైన్స్ అండ్ మినరల్స్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ చట్టాలను బేఖాతరు చేస్తూ ఇసుక అక్రమ తవ్వకాలు, నిల్వల దందా సాగుతూనే ఉంది. అధికారులు «గుర్తించిన ఇసుక రిచ్‌లను మాత్రమే వినియోగించక పోవడం, అధికారికంగా నిర్ణయించిన ధరలను అమలు పరచకపోవడం, అక్రమ రవాణాపై ఉన్న నిబంధనలు, ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా ఇసుక, గ్రావెల్ వంటివి అవసరమైన వారు మైన్స్ అండ్ మినరల్స్లోని యాక్ట్ 379, 447 ప్రకారం మండల తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐలతో కూడిన అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఎవరూ పాటించడం లేదు. చర్యలు తీసుకుంటాం: లైసెన్సులు ఉన్నవారే గనుల తవ్వకాలు జరపాలి. పరిధి దాటి జరుపకూడదు. బొబ్బిలి లోని మెట్టవలస క్వారీల్లో లైసెన్సులున్న వారు తవ్వకాలు జరపలేదని ఇటీవల చేపట్టిన పరిశీలన అనంతరం మా సిబ్బంది తెలిపారు. ఓ సారి పరిశీలిస్తాం. చీపురుపల్లిలో పట్టుబడిన మాంగనీస్ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై విచారణ జరుపుతున్నాం. – డాక్టర్ ఎస్వీ రమణారావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, విజయనగరం నిబంధనలు ఉల్లంఘించిన ‘సర్వాగీ’ చీపురుపల్లి: ఎస్.కె.సర్వాగీ మైనింగ్ పరి శ్రమ నిబంధనలు ఉల్లంఘించింది. అనుమతులు లేకుండా మాంగనీస్ తవ్వకాలు జరిపి వేరే ప్రాంతాలకు చెందిన పర్మిట్లతో అక్రమ రవాణాకు పాల్పడింది. ఇది కచ్ఛితంగా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని జిల్లా భూగర్భ గనులశాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ పురుషోత్తమనాయుడు అన్నారు. మండలంలోని పెదనడిపల్లి రెవెన్యూ పరిధిలో ఎస్.కె.సర్వాగీ మైనింగ్ తవ్వకాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ నెల 23న రాత్రి చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి మైనిం గ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు మాంగనీసు లారీలను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ లారీల సమాచారాన్ని ఈ నెల 24న జిల్లా భూగర్భ గనులశాఖకు చేరవేశారు. దీంతో రాయల్టీ ఇన్స్పెక్టర్ పురుషోత్తమనాయుడు సర్వాగీ పరిశ్రమలో మైనింగ్ తవ్వకాలు, అనుమతులు, హద్దులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టుబడిన ఆరు మాంగనీసు లోడు లారీల్లో రెండింటికే అనుమతులు ఉన్నాయన్నారు. మిగిలిన నాలుగు లోడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మెరకముడిదాం మండలంలోని కొత్తకర్ర మైనింగ్ పర్మిట్లు చూపించి, చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి, ఇటకర్లపల్లి మైనింగ్‌లు నుంచి నాలుగు లారీల్లో మాంగనీరు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. చీపురుపల్లి మండలంలో సర్వాగీ పరిశ్రమకు చెందిన మైనింగ్లలో తవ్వకాలు జరగడం లేదని, అయినప్పటికీ మెరకముడిదాం మండలంలోని కొత్తకర్ర మైనింగ్ పర్మిట్లు పెట్టి మాంగనీసు రవాణా చేయడం నేరమన్నారు. దీనికి జిల్లా అధికారులు అపరాధ రుసుము విధిస్తారని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
డ్వాక్రా మహిళలకు శుభవార్త
హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ కోసం కసరత్తు మొదలైంది. ఇప్పటికే రుణాల వివరాలు అప్లోడ్ చేయడంలో సిబ్బంది తలమునకలవుతోంది. రుణమాఫీపై సంఘాల సభ్యులకు వెలుగు ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్లలో మాఫీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమచేసేలా చర్యలు చేపడుతున్నారు. సాక్షి, వేపాడ (శృంగవరపుకోట): మహిళా సంఘాల సభ్యులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ అసరా పేరుతో మహిళా సంఘాల రుణాల మాఫీ అమలుకు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ అధికా రుల ఆదేశాలతో మండల స్థాయిలో వెలుగు సిబ్బంది అర్హులైన సంఘాలు, సభ్యుల పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి అప్లోడ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లోని 35,922 మహిళా సంఘాల్లో 3,95,142 మంది సభ్యులను వైఎస్సార్ ఆసరా పథకానికి అర్హులుగా గుర్తించారు. దీనిద్వారా సుమారు రూ. 897 కోట్లు మహిళా సంఘ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగానే... వైఎస్సార్ ఆసరా పథకంలో మహిళాసంఘాల సభ్యులకు 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఎంత బకాయి ఉన్నారో దానిని మాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అర్హులను గుర్తించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించటంతో క్షేత్ర స్థాయిలో అధికారులు ఆ వివరాలు సేకరిస్తున్నారు. రుణ వివరాలను సెర్ప్ యాప్‌లో వెలుగు సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు విడతల్లో సభ్యుల ఖాతాలకు జమచేయనున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది... గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మహిళలను మోసం చేసింది. గత ఎన్నికల్లో రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రచారం చేసి గద్దెనెక్కాక ఆ హామీని విస్మరించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 85శాతం అప్లోడ్ పూర్తి చేసాం... జిల్లాలో వైఎస్సార్ ఆసరా పథకంలో అర్హులైన సం ఘాల సభ్యులకు సంబం ధించి ఖాతానంబర్, ఆధార్‌తో 85 శాతం అప్లోడ్ చేశాం. పలు మండలాల్లో సభ్యుల ఆధార్ అనుసంధానం, సాధికార సర్వే సాంకేతిక లోపంలో మిగిలివున్నాయి. వాటిని 10 రోజుల్లో అప్లోడ్ చేయాలని సూచించాం. జిల్లాలో 35,922 సంఘాలు ఆసరా పథకంలో అర్హత పొందాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నేరుగా సభ్యుల ఖాతాలో జమచేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – జి.శాంతి, డీఆర్డీఏ పీడీ. విజయనగరం ఆనందంగా వుంది.. జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు దిశగా గణాంకాలు వేయటంతో మా సంఘానికి సుమారు రూ. 5 లక్షలు రుణమాఫీ కానుంది. మా సంఘ సభ్యులంతా ఇప్పటికే ఆధార్, బ్యాంకు ఖాతానంబర్లు అప్లోడ్ చేయించుకున్నాం. – బొట్ట పార్వతి, చిన్నమ్మలు మహిళాసంఘం, వేపాడ మహిళలకు ఆసరా వర్తిస్తోంది... గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హా మీ సీఎమ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిలబెట్టుకునేం దుకు సన్నాహాలు చేయటం సంతోషంగా ఉంది. – బోజంకి మాధవి, శ్రీవేంకటేశ్వర మహిళాసంఘం, వేపాడ రూ. 4.50లక్షలు రుణమాఫీ అవుతోంది... సీఎం జగన్మోహన్రెడ్డి హామీ అమలు చేయటంవల్ల మా సంఘానికి రూ. 4.50లక్షలు రుణమాఫీ వర్తిస్తోంది. మా సంఘంలో 15 మంది సభ్యులకు లబ్ధి కలగనుంది. మహిళలకు మరింత ఆసరా కల్పించిన జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు – ద్వారపూడి మంగ, శ్రీసాయి సంఘం, బొద్దాం -
గృహయోగం
ప్రజాసంకల్పయాత్ర సాక్షిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి కష్టాలు స్వయంగా చూశారు. వారందరికీ ‘నేనున్నాను’ అంటూ భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలతో వారి జీవితాలను మార్చేయాలని సంకల్పించారు. అదే తమ మేనిఫెస్టో అని ప్రకటించారు. నిత్యం వాటిని గుర్తు చేసేలా ఆయన క్యాంప్ కార్యాలయంలో గోడలపై పెయింట్ చేయించారు. త్వరితగతిన వాటిని అమలు చేయాలని సంకల్పించారు. అందులో ముఖ్యమైన అంశం అందరికీ ఇళ్లు పథకం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సొంత ఇల్లు, ఇంటిస్థలం లేనివారు ఉండకూడదన్న లక్ష్యంతో వచ్చే ఉగాది నాటికి తొలివిడతగా ఇంటిస్థలాలు, ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా 2020 ఉగాది నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించింది. దీనికి సంబంధించిన అర్హులను ఎంపిక చేసే బాధ్యత వలంటీర్లకు అప్పగించింది. వారు సోమవారం నుంచి సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో ఈ నెల 30వరకు ఈ సర్వే చేపడతారు. గ్రామాల్లో కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆర్ఐల పర్యవేక్షణలో సర్వే చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని 919 గ్రామ పంచాయతీల్లో గ్రామ పర్యవేక్షణాధికారులను నియమించారు. సేకరించాల్సిన వివరాలు.. లబ్ధిదారుని వ్యక్తిగత వివరాలైన ఆధార్, కులం, వృత్తి, వయసు, సెల్ నంబరు వంటి ప్రాథమిక సమాచారంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్నదా... ఉంటే కార్డు సంఖ్య, రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు ఉందా లేక ఇంటి స్థలం ఉందా, గతంలో ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన ఇల్లు, లేదా ఇంటి స్థలం కలిగి ఉన్నారా అన్నవి నమోదు చేస్తారు. 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నట్టయినా... రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు ఉన్నా నివేశన స్థలానికి అనర్హులు. ఈ వివరాల నమోదు అనంతరం ఆయన అర్హుడా కాదా అన్నది నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిస్తారు. వలంటీర్ల కీలక బాధ్యతలు.. వలంటీర్లుగా ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ఇంటి స్థలం లేని వారు, స్థలం ఉండి ఇల్లు కట్టుకోనివారి వివరాలు నమోదు చేస్తారు. ప్రతి యాభై కుటుంబాల సంక్షేమ బాధ్యత, ప్రభుత్వ పథకాల పంపిణీ వీరిద్వారానే సాగుతుంది. వీరి పని తీరును పట్టణాల్లో కమిషనర్లు, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల అమలు ప్రక్రియ వలంటీర్ల వ్యవస్థ ద్వారానే చేపట్టనుంది. కుటుంబ సర్వే నివేదికను 30వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి అందేలా చర్యలు తీసుకుంటారు. నవరత్నాలలో భాగంగా 25 లక్షల ఇళ్లు ఇవ్వడమే ఈ సర్వే లక్ష్యం. లబ్ధిదారుల ఎంపికకు వార్డు వలంటీర్ల సర్వే ప్రాతిపదిక కానుంది. నివేశన స్థలానికి అర్హుడు అవునో కాదో వలంటీర్లే నిర్థారిస్తారు. సర్వేలో ఇంకేం వివరాలు సేకరిస్తారంటే.. -యజమాని వివరాలు, కుటుంబంలోని సభ్యు ల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారాన్ని అందించాలి. -గృహనిర్మాణం కింద సొంత ఇల్లు ఉందా. ఉం టే ఎవరి పేరున ఉంది. ఇంటికి తాగునీటి వసతి, మరుగుదొడ్డి ఉంటే వివరాలు, విద్యుత్ కనెక్షన్, నెలవారీ బిల్లు వివరాలు, వంట కట్టెలపొయ్యితోనా.. గ్యాస్‌తోనా అనే వివరాలు సేకరిస్తారు. -ఇంటి పరిసరాలు పరిశుభ్రత గురించి ఫార్మెట్లో వివరాలను పొందుపరచాలి. పరిశుభ్రత గు రించి తగిన సమాచారాన్ని వలంటీర్లు సేకరించాలి. -వ్యవసాయ కుటుంబం అయితే ఎంత భూమి ఉంది. బ్యాంకు రుణం. కౌలు రైతు అయితే ఆ వివరాలు. వ్యవసాయ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు. రైతు తీసుకున్న అప్పుల వివరాలు ఇందులో పొందుపరచాలి. -పశుపోషణ వివరాలుంటే ఏ తరహా పశువులు ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తా రు. వీటి ద్వారా ఆదాయం పొందుతుంటే వాటి వివరాలు. పశుపోషణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో నమోదు చేస్తారు. -ఆరోగ్యం అంశంలో పిల్లల ఆరోగ్యం వివరాలను నమోదు చేస్తారు. వారికి అందుతున్న పౌష్టికాహారాన్ని ఏ విధంగా పొందుతున్నారో సేకరిస్తారు. -విద్యకు సంబంధించి 6–15 ఏళ్ల వయస్సు ఉన్న వారు అభ్యసిస్తున్న విద్య వివరాలు. ఆ పై వయస్సున్న వారు చదువుతుంటే ఎక్కడ.. ఎలా చదువుతున్నారో వివరాలను నమోదు చేస్తారు. ప్రభుత్వ లబ్ధి పొందుతుంటే వాటి వివరాలను నమోదు చేయాలి. -స్వయం సహాయ బృందాల మహిళలు కుటుంబంలో ఉంటే వారి వివరాలు, తీసుకున్న రుణం, ఇతర వివరాలను నమోదు చేస్తారు. పొదుపు సంఘాల సభ్యుల పని తీరును ఈ సర్వేలో నమోదు చేస్తారు. -ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధి పొందుతుంటే పింఛన్, రేషన్, ఇతర పథకాల ద్వారా లబ్ధి వివరాలను సర్వేలో నమోదు చేస్తారు. కుటుంబ సంక్షేమంలో ఇతరత్రా ఎలాంటి సమస్య గుర్తించినా వాటిని ప్రత్యేకంగా సర్వేలో నమోదు చేస్తారు. మీ ఇంటి వద్దకే వాలంటీర్లు.. వార్డు వలంటీర్లు ఈ నెల 26వ తేదీ నుంచి 30 వరకు వారికి నిర్దేశించిన గృహాలకు వస్తారు. నివాస స్థలాలు/గృహాల అర్జీలు వారికి ఇవ్వాలి. దీనికోసం స్పందన కార్యక్రమానికి రానక్కర లేదు. వలంటీర్లకు ఇళ్ల అర్జీలను ఇస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు దాఖలైన అర్జీలను వలంటీర్లు పరిశీలిస్తారు. ఇళ్ల అర్జీలు కూడా స్వీకరించి, మొత్తం వివరాలను అధికారులకు నివేదిస్తారు. – ఎస్.సచ్చిదానంద వర్మ, కమిషనర్, నగరపాలక సంస్థ, విజయనగరం