
సాక్షి, విజయనగరం: జిల్లాకు నాలుగు సంజీవని బస్సులు కేటాయించారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా జిల్లా అంతటా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కరోనా అనుమానితులు ఉన్నవారు వెంటనే హెల్ప్ లైన్‌కి కాల్ చేయాలని సూచించారు. (ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ)
జిల్లాలో నేటి నుంచి వైద్య చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సను అందజేస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా ద్వారా చికిత్స పొందిన వారికి ప్రత్యేక భృతి అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 52535 శాంపిల్స్ సేకరించామని, వీరిలో 50156 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. జిల్లాలో మొత్తం 1073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 425 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. నేటి నుంచి జిల్లాలోని పట్టణాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (‘ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు’)
Comments
Please login to add a commentAdd a comment