
రికార్డింగ్ డ్యాన్స్ ఆపాడని..
రికార్డింగ్ డ్యాన్స్, పేకాట నిర్వహణను అడ్డుకున్నందుకు ఓ కానిస్టేబుల్‌పై దాడి జరిగింది.
విజయనగరం : రికార్డింగ్ డ్యాన్స్, పేకాట నిర్వహణను అడ్డుకున్నందుకు ఓ కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. విజయనగరం జిల్లా జామి మండలంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని వెంకటరాజపాలెం గ్రామంలో జరిగే నందీశ్వర స్వామి జాతర సందర్భంగా స్థానికులు రికార్డింగ్ డ్యాన్స్ ను ఏర్పాటు చేశారు.
విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ పి.రాజులు.. డ్యాన్స్ ప్రోగ్రాంను, పేకాడుతున్న వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన కొందరు స్థానికులు హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. రాజులు అందించిన సమాచారం మేరకు పోలీసు బలగాలతో సీఐ అక్కడికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
(జామి)