కుటుంబ కలహాలతో ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులతో వచ్చిన గొడవల కారణంగా ఏడేళ్ల కొడుకుతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... నారాయణపట్టణం గ్రామానికి చెందిన దన్నాల బోజి(30) ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కుటుంబంలో తరచూ వస్తున్న గొడవలతో కలత చెందిన బోజి తన ఏడేళ్ల కొడుకుతో కలిసి గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం శుక్రవారం తెల్లవారు జామున నారాయణపట్టణం రైల్వే గేట్ వద్ద పట్టాలపై కొడుకుతో పాటు తల పెట్టి బోజి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన తల, మొండెం వేరుకాగా, బాలుడి మృతదేహం పట్టాలపై పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి, ఆత్యహత్య కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Published Fri, Feb 13 2015 11:42 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement