Nellimarla
-
జనసేన ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన గెలుపు నాదే
-
చైతన్యం వెల్లివిరిసిన నెల్లిమర్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు. యువత బైక్‌లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి. పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు. విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్‌ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్నాథ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్‌గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. -
భోగాపురంలో బట్టబయలైన అక్రమాలు.. ‘మిరాకిల్’ భూ కబ్జాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కానున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూముల ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. అలాంటి చోట నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు మాధవి భర్త లోకం ప్రసాద్ 14.22 ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కారు హయాంలో ఆక్రమించారు. అవన్నీ ఇటు చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16), విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన భూమికి ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం అక్కడ ఎకరా విలువ రూ.2 కోట్లకు పైమాటే! ఆక్రమించి.. ప్రహరీ కట్టేసి భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలను లోకం ప్రసాద్ ఏర్పాటు చేశారు. కాలేజీ హాస్టళ్లు, కెఫేటేరియా, సాఫ్ట్వేర్ సంస్థ భవనాలు, ఉద్యోగుల వసతి కోసం సమీపంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలి బాటలన్నీ కలిపేసి రోడ్డు నిర్మించారు. కొన్ని కల్వర్టులను సొంతంగా కట్టుకుని భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. కన్నెత్తి చూడని టీడీపీ సర్కారు.. ముంజేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 293/1లో ఎకరా, 293/5లో 60 సెంట్లు, 296లో అర ఎకరా, 337లో 0.61 సెంట్లు, 343లో 3.52 ఎకరాలు, 342లో 5.02 ఎకరాలు, 391లో 1.52 ఎకరాలు, 392లో 1.16 ఎకరాలు, సర్వే నంబరు 393లో 29 సెంట్ల మేర ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ పక్కనే కొంగవానిపాలెం గ్రామ రెవెన్యూ పరిధి 98/2పీ సర్వే నంబరులో 40 సెంట్ల బంజరు భూమి కూడా ‘మిరాకిల్’ ఆక్రమణలోనే ఉంది. ఈ వ్యవహారం అంతా గత టీడీపీ పాలనలో దఫాదఫాలుగా జరిగింది. గత పాలకులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల ఆ భూముల చుట్టూ మిరాకిల్ యజమానులు ప్రహరీ నిర్మించి పెద్ద గేట్లు అమర్చడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. పక్కాగా సర్వే నిర్వహించడంతో మిరాకిల్ ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డీ పట్టా భూములనూ వదల్లేదు.. మిరాకిల్ యజమానుల గుప్పిట్లో డీ పట్టా భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కంచేరు, ముంజేరు, కొంగవానిపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 8.52 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిజమేనంటూనే.. ఆక్రమణలు నిజమేనని లోపాయికారీగా అంగీకరించిన మిరాకిల్ యాజమాన్యం ప్రభుత్వ భూమి చేజారిపోకుండా ఎత్తుగడలు వేస్తోంది. మిరాకిల్ ఉద్యోగులను, స్థానిక జనసేన కార్యకర్తలను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. ప్రభుత్వ భూముల్లో తమ సంస్థ భవనాలేవీ నిర్మించనప్పుడు ఎలా స్వాధీనం చేసుకుంటారని అడ్డగోలుగా వాదిస్తున్నారు. గెడ్డలు కప్పేసి తయారు చేసిన మైదానం యువత క్రికెట్ ఆడుకోవడానికి ఉపయోగపడుతోందంటూ రెవెన్యూ అధికారులతో వాదనకు దిగుతున్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం.. ముంజేరు, కొంగవానిపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి సర్వేతో పాటు డ్రోన్ సర్వే చేశాం. పక్కాగా ఆక్రమణలను గుర్తించాం. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. స్వాధీనం చేసుకోవడానికి పోలీసు శాఖ సాయం కోరాం. అవన్నీ కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. – కోరాడ శ్రీనివాసరావు, తహసీల్దారు, భోగాపురం, విజయనగరం జిల్లా -
Nellimarla: రామకోనేరుకు మహర్దశ
నెల్లిమర్ల రూరల్ (విజయనగరం జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి ఆలయం పక్కనున్న రామకోనేరుకు మహర్దశ కలగనుంది. కోనేరు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా కోనేరును బాగుచేసేందుకు రూ.1.50 కోట్ల వ్యయంతో దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఉపాధిహామీ సిబ్బంది రామకోనేరుకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. జలవనరుల శాఖ అధికారులు కోనేరుకు కొలతలు వేసి అభివృద్ధి పనులపై అంచనాలు రూపొందించే పనిలో నిమఘ్నమయ్యారు. 12 ఎకరాల్లో రామకోనేరు రామకోనేరు 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రామక్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందుగా కోనేరులో పుణ్య స్నానమాచరించిన తరువాత సీతారామస్వామిని, ఉమా సదాశివుడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం రామకోనేరులో రెండు పుష్కర ఘాట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల కోనేరుల అభివృద్ధిలో భాగంగా ఆ శాఖ అధికారులు తాజాగా అమృత సరోవర్ పథకం కింద రామతీర్థం కోనేరును ఎంపిక చేశారు. పనులు పూర్తయితే రామక్షేత్రానికి మరింతి శోభ సాక్షాత్కరించనుంది. కోనేరు అభివృద్ధి ఇలా... రామకోనేరులోకి నీరు వచ్చి పోయేందుకు ఇన్లెట్, ఔట్లెట్ నిర్మాణాలు పూర్తి చేస్తారు. కోనేరు చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్టం చేయనున్నారు. కోనేరులో పూడికతీత పనులు, చుట్టూ రాతి కట్ట నిర్మాణాలు, పడమర వైపు సువిశాలంగా పుష్కర ఘాట్ నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద అదనపు షెడ్ల నిర్మాణం, మూడు అడుగుల ఎత్తులో గట్టు, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు పూర్తిచేస్తారు. వీటితో పాటూ 100 మీటర్ల పోడవు, 5 మీటర్ల వెడల్పుతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కోనేరు అభివృద్ధి పనులకు సుమారు రూ.3 కోట్లు అవసరమవుతాయని దేవస్థాన ఈఓ ప్రసాదరావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు కొలతలు రామతీర్థం దేవస్థానాన్ని ఇరిగేషన్ జేఈ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులకు ఈఓ ప్రసాదరావుతో కలిసి కోనేరు చుట్టూ కొలతలు వేశారు. పుష్కరిణి గట్టుతో పాటు ఇన్లెట్, ఔట్లెట్ చానళ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులకు సంబంధించి పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన తెలిపారు. (క్లిక్: రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా) -
అశోక్ గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. -
అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. కాగా, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. -
దళిత యువకుడిపై దాడి
-
యువకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి, విజయనగరం : నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు శంకు ఆపన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. అప్పన్న పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. టీడీపీ నేత, గ్రామపెద్ద పంచాది సూర్యనారాయణ వారి అనుచరులతో కలిసి అప్పన్న బైక్ తాళం , సెల్ ఫోన్ తీసుకొని అతనిపై దాడికి పాల్పడ్డారు. కాగా అప్పన్న ఆర్టీఏ యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే గ్రామంలో జరిగిన భూ ఆక్రమణలపై అప్పన్న రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు తనపై దాడి చేసినట్లు శంకు అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అయ్యో పాపం.. కుక్కలు, పందులకు బలైన చిన్నారి..!!
విజయనగరం, నెల్లిమర్ల : ఏ తల్లి కన్నబిడ్డో... నడిరోడ్డుపై కుక్కలు, పందులకు ఆహారంగా మారిపోయింది. ఆడపిల్లని భారంగా భావించారో... పరువు పేరుతో నిర్దాక్షిణ్యంగా విసిరేశారో... నెల్లిమర్ల యాతవీధిలో ఓ పసికందు విగతజీవిగా పడి ఉంది. ఓ వైపు దట్టంగా కురుస్తున్న మంచు... మరోవైపు చలిగాలులకు కన్ను కూడా తెరవని ఆ చిన్నారి ఏడుపు సమీప కుటుంబాల చెవిన శుక్రవారం వేకువఝామున పడింది. తలుపుతెరుచుకుని వచ్చి చూస్తే ఆ శిశువును చీల్చేస్తున్న పందులు కనిపించాయి. వెంటనే ఆ పందులను తరిమి చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రాణాలు వదిలిన ఆ చిన్నారిని వారే శ్మశానంలో పూడ్చిపెట్టారు. నెల్లిమర్ల పట్టణంలోని శ్రీనివాసా థియేటర్ ఎదురుగా యాతవీధిలో ఖాళీగా నున్న ప్రదేశంలో ఆ పసికందును ఎవరో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు విసిరేసినట్టు తాను చూశానని ఓ బాలుడు చెబుతున్నాడు. కనీసం బొడ్డు కూడా కోయకుండా తీవ్రమైన చలిలో పడేశారు. అక్కడే సంచరిస్తున్న పందులు, కుక్కలు చిన్నారిని చీల్చుకు తిన్నాయి. సంఘటన చూసిన స్థానికులు చలించిపోయారు. -
276వ రోజు ప్రజాసంకల్పయాత్ర నెల్లిమర్ల విజనగరం జిల్లా
-
బోడికొండకు ప్రేమజంటల తాకిడి
నెల్లిమర్ల రూరల్ విజయనగరం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీరామస్వామివారి క్షేత్రానికి సమీపంలోని బోడికొండపై ప్రేమజంటల సందడి పెరగడంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సీతారామ చంద్ర ప్రభువులు వారు కొండపై సంచరించారని భక్తులు విశ్వసిస్తారు. పాండవులు నడయాడిన నేలగా, బౌద్ధుల ఆవాసమైన ప్రాంతమైన బోడికొండపై ఇటీవలి కాలం నుంచి ప్రేమజంటల తాకిడి పెరిగింది. సీతమ్మవారి పురిటి మంచం, భీముని గుహ, మెట్ల మార్గం, కోదండరామస్వామి ఆలయం సమీపంలో పదుల సంఖ్యలో రోజూ జంటలు వస్తూ తమ చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి ప్రేమ జంటల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తమ్ముడి కోసం అస్సాం నుంచి ఆంధ్రాకి..
నెల్లిమర్ల విజయనగరం : ఊరు కాని ఊరు. భాష తెలియని ప్రాంతం. ఆచారాలు.. సంప్రదాయాలు.. అన్నీ భిన్నమైన ప్రాంతం. తోడబుట్టిన వాడి కోసం ఓ అక్క అన్వేషించింది. రాష్ట్రాలు దాటి తరలి వచ్చింది. సోదరుడి ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరైంది. తమ్ముడు కనిపిస్తే చెప్పండని ఫొటోలు చూపించింది. గుండెల్ని పిండేసే ఈ దృశ్యానికి నెల్లిమర్ల పోలీసు స్టేషన్ వేదికైంది.అసోం రాష్ట్రానికి చెందిన పూర్ణ సింగ్లామా అనే వ్యక్తి అసోం-గౌహతి రైలులో ప్రయాణిస్తుండగా జూన్ నెల 15న నెల్లిమర్ల-చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో మార్గ మధ్యంలో తప్పిపోయాడు. మూడు రోజుల తరువాత నెల్లిమర్లలో కొండపేట గ్రామానికి చెందిన నడిపేన లోకేష్ అనే యువకుడికి తారసపడ్డాడు. ఆయన మొబైల్‌ను అడిగి అసోంలోని తన అక్క లబ్బాకు ఫోన్ చేశాడు. అప్పటికే తప్పిపోయిన తమ్ముడి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఈ ఫోన్ కాల్ కొంత ఊరటనిచ్చింది. తమ్ముడు క్షేమంగానే ఉన్నాడని.. ఇక ఇంటికి వచ్చేస్తాడని భావించారు. తమ్ముడి ఆచూకీ కోసం తరచూ ఫోన్ చేస్తుండటంతో విసుగు చెందిన లోకేష్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. రోజులు గడుస్తున్నా తమ్ముడి ఆచూకీ తెలియకపోవడం.. లోకేష్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఫోన్ నంబర్ లొకేషన్ ఆధారంగా బుధవారం నెల్లిమర్లకు వచ్చారు. నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫోన్ చేసిన యువకుడిని పిలిపించారు. కొండపేటకు చెందిన లోకేష్ మాట్లాడుతూ ఒక వ్యక్తి తన మొబైల్ అడిగి ఫోన్ చేశాడని.. తరువాత వెళ్లిపోయాడని.. అంతకుమించి వివరాలు తెలియవని సమాధానమిచ్చాడు. దీంతో పూర్ణ సింగ్లామా అక్క, ఇతర కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. రైల్వే జీఆర్పీని సంప్రదించమని నెల్లిమర్ల ఎస్ఐ ఉపేంద్రరావు సూచించారు. చేసేది లేక పూర్ణ సింగ్లామా అక్క లబ్బా వెంట తెచ్చుకున్న తమ్ముడి ఫొటోను పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారికి చూపిస్తూ ఆచూకీ తెలిస్తే తెలపండని తమ భాషలో ప్రాధేయపడింది. కంటతడి పెడుతూ నెల్లిమర్ల పట్టణం మొత్తం తిరిగి గోడలకు తన తమ్ముడి ముఖ చిత్రాలను స్వయంగా అంటించింది. ఆచూకీ తెలిస్తే 9957971910 నంబర్‌కు తెలియజేయాలని కోరింది. తమ్ముడి ఆచూకీ కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన అక్క ఆరాటాన్ని చూసిన వారంతా చలించిపోయారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా నెల్లిమర్ల గురుకులం
నెల్లిమర్ల: పట్టణంలోని మిమ్స్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న జూనియర్ కళాశాలను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా గుర్తించినట్లు ఆ విద్యాసంస్థల అకడమిక్ గైడెన్స్ అధికారి ఎస్ఎస్ఎన్.రాజు తెలిపారు. పట్టణంలోని బీసీ బా లికలు, మత్స్యకార బాలుర పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే విడుదల చేశామన్నారు. వచ్చేనెల 1నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ తరగతులతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి సింహాచలంలో బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలను ప్రారంభించినట్లు ఎస్ఎస్ఎన్ రాజు తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు ఆ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే 12 కళాశాలలతో పాటు జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించామన్నారు. అన్ని పాఠశాలల్లో ఈ నెల 15న 5వ తరగతి విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ గురుకులాలతో కలిసి అకడమిక్ మీట్ కార్యక్రమాన్ని వచ్చేనెలలో నిర్వహిస్తామని రాజు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్ రఘునాధ్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ రామినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నెల్లిమర్లలో ‘బయోపార్క్’
చుట్టూ పచ్చదనం పరచుకునే వనాలు... గుబురుగా పెరిగే చెట్లు... ప్రకృతి సిద్ధమైన సౌందర్యం... ఆహ్లాదాన్ని పంచే వాతావరణం... రకరకాల పక్షుల కిలకిలారావాలు... అందులోనే విహారానికి అనువైన ఏర్పాట్లు... పర్వతారోహకులను ప్రోత్సహించే సౌకర్యాలు... ఇవన్నీ ఒకే చోట ఉంటే అది ఇలలో వెలసిన స్వర్గం అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి ప్రాంతాన్నే జిల్లాలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు నెల్లిమర్ల ప్రాంతాన్ని అటవీశాఖాధికారులు ఎంపిక చేశారు. ఇదే పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతానికి ఓ గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నెల్లిమర్ల : పచ్చనైన వనం మధ్యన పిల్ల లకు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అడవి మధ్యలో ఆటలాడుకునేందుకు పార్కులు, కొండలెక్కేందుకు ట్రెక్కింగ్, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల పరిధిలోని సారిపల్లి సెంట్రల్ నర్సరీలో బయోపార్క్ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం అటవీశాఖ అధికారులు 10హెక్టార్లు కే టాయించారు. అంతేగాకుండా ఆ పార్కులో వివిధ పనులు చేపట్టేందు కు మొదటి విడతగా ప్రభుత్వం తాజాగా రూ కోటి కేటాయించింది. నగరవనం స్థానే బయోపార్కు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ నగరవనాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచించిన సంగతి తెలిసిందే. అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో నగరాలకు సమీపంలో ఎక్కువ విస్థీర్ణంలో మొక్కలను పెంచాలన్నది దాని లక్ష్యం. అంతేగాకుండా అదే నగరవనంలో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అవసరమయ్యే పార్క్‌లు, ట్రాక్‌లు ఏర్పాటుచేయాలని పేర్కొంది. విజయనగరంలో మాత్రం ఇంతవరకు నగరవనం ఏర్పాటుకాలేదు. దాని స్థానంలో ‘బయోపార్క్’ ఏర్పాటుచేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. సారిపల్లి సెంట్రల్ నర్సరీలో ఏర్పాట్లు జిల్లాకు తాజాగా వచ్చిన ఆ శాఖ పీసీసీఎఫ్(రాష్ట్ర ప్రధాన అటవీశాఖ అధికారి) ఈ మేరకు బయోపార్క్ వెంటనే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు విజయనగరం–నెల్లిమర్ల ప్రధాన రహదారినుంచి సారిపల్లి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న ‘సారిపల్లి సెంట్రల్ నర్సరీ’లో బయో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో వనాల ప్రాధాన్యాన్ని వివరించేందుకు ‘వనవిజ్ఞాన కేంద్రం’ నెలకొల్పుతున్నారు. ఈ కేంద్రంలో వివిధరకాల మొక్కలు, వాటి ప్రాధాన్యతను వివరిస్తారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్, ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేస్తారు. సమీపంలోనున్న కొండను ఎక్కేందుకు ట్రెక్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. అంతేగాకుండా వివిధరకాల ఔషధ మొక్కలతో రాశివనం, నక్షత్రవనం తదితరాలను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే అటవీ ఉత్పత్తులతో కూడిన క్యాంటీన్, ప్రదర్శనలు ఉంటాయి. ఇప్పటికే సారిపల్లి సెంట్రల్ నర్సరీలో బయోపార్క్ పనులు ప్రారంభమయ్యాయి. క్యాంటీన్, వన ఉత్పత్తుల ప్రదర్శనలకు సంబంధించిన భవనాల నిర్మాణం పూర్తయ్యింది. నక్షత్రవనం, రాశివనాల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. చురుగ్గా బయోపార్కు పనులు వనాల ప్రాముఖ్యాన్ని వివరించేందుకు, వనాల్లో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు బయోపార్క్ ఏర్పాటు చేస్తున్నాం. సారిపల్లి సెంట్రల్ నర్సరీలో 10 హెక్టార్లలో పార్క్ ఏర్పాటవుతోంది. ఆ పార్క్‌లో వనవిజ్ఞాన కేంద్రం, చిల్డ్రన్స్ పా ర్క్, యోగాకేంద్రం, ట్రెక్కింగ్ తదితరాలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి విడతగా మంజూరైన రూ కోటితో ఆ పనులు ప్రస్థుతం చురుగ్గా జరుగుతున్నాయి. – గంపా లక్ష్మణ్, డీఎఫ్ఓ, విజయనగరం -
11 ఇళ్లు దగ్ధం: రూ.6 లక్షల నష్టం
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక థామస్‌పేట కాలనీలో అగ్నిప్రమాదం జరిగి 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంతో 11 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
నెల్లిమర్ల : మండలానికి చెందిన గ్రామరెవెన్యూ అధికారి(వీఆర్వో) ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టాదారు పాస్‌పుస్తకం కోసం రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాక్షాత్తూ రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో నెల్లిమర్ల పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి అందించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన లెంక అప్పలరాజు.. తన పెద్దమ్మ లెంక నారాయణమ్మ ఇచ్చిన 99 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం సుమారు ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏవో కారణాలు చూపించి గ్రామరెవెన్యూ అధికారి తిరస్కరించాడు. అనంతరం అప్పలరాజు మరో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో పాస్‌పుస్తకం మంజూరు చేసేందుకు రైతు అప్పలరాజును వీఆర్వో మజ్జి యేసు రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రైతు అప్పలరాజు ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. వారి సూచనల మేరకు తహసీల్దారు కార్యాలయంలోనే సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి ఆధ్వర్యంలో సీఐలు లక్ష్మోజీ, రమేష్ తదితరులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో యేసుపై కేసు నమోదు చేశారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
గరికిపేట (నెల్లిమర్ల రూరల్): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గరికిపేటలో శని వారం చోటుచేసుకుంది. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతివాడ లక్ష్మి (35) పచ్చగడ్డి కోసేందుకు సమీపంలో గల వ్యవసాయ భూమిలోకి వెళ్లిం ది. అరుుతే సంబంధిత భూ యజమాని వెలుతురు కోసం పొలానికి విద్యుత్ బల్బు ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ విషయం గమనించని లక్ష్మి గడ్డికోస్తూ పొరపాటున కిందనున్న వైరును తాకింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందిం ది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉపేంద్ర సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
ఈ పాపం ఎవరిది..?
ఏడాదిగా నిలిచిన రిజిస్ట్రేషన్లు దేవాదాయశాఖ అధికారుల నిర్వాకంతో ఇక్కట్లు ఎన్ఓసీ కోసం ఎదురుచూస్తున్న విక్రయదారులు నెల్లిమర్ల: దేవాదాయ శాఖ అధికారులు చేసిన నిర్వాకంతో నెల్లిమర్ల పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఏడాది కాలంగా పట్టణంలోని పలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, షాపుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పట్టణంలోని ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న ఆస్తుల క్రయవిక్రయాలన్నీ ఆగిపోయాయి. ఇంత జరుగుతున్న ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్న పట్టణవాసులు.. నెల్లిమర్ల పట్టణంలోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారికి ఎగువనున్న సర్వేనంబరు 104 సబ్‌డివిజన్ 1లోని స్థలాలన్నీ జిరాయితీనే. ఈ సర్వేనంబరులో సుమారు 14 ఎకరాల స్థలముంది. స్థానికులు దశాబ్దాల తరబడి ఇక్కడ పక్కా ఇళ్ళు, షాపులు నిర్మించుకుని ఉంటున్నారు. కానీ ఏడాది కాలంగా ఈ ప్రాంతంలోని ఆస్తుల క్రయ విక్రయాలు ఆగిపోయాయి. దీనికి కారణం కేవలం దేవాదాయ శాఖ అధికారులు చేసిన తప్పిదమేనని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈప్రాంతంలోని భూమంతా దేవాదాయ శాఖదేనని, వాటిని రిజిస్ట్రేషన్ చెయ్యోద్దని ఆ శాఖాధికారులు గతంలో నెల్లిమర్ల సబ్ రిజిస్టార్కు వినతి ఇచ్చారు. దీంతో అప్పటినుంచి ఆ సర్వే నంబరులోని స్థలాలను రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వాస్తవానికి మండలంలోని గొర్లిపేట గ్రామానికి చెందిన సర్వే నంబరు 104లోని సబ్‌డివిజన్ 1లోని భూమి రామతీర్థం దేవస్థానానికి చెందిది. కానీ అప్పట్లో గొర్లిపేట వీఆర్వో పొరపాటున సర్వే నంబరును రిజిస్టార్ కార్యాలయానికి అందించినట్లు సమాచారం. దీంతో అప్పటినుంచి ఇక్కడున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రోడ్డుకు ఎగువన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆర్వోబి వరకు ఉన్న స్థలాల్లో ఒక్కటి కూడా క్రయవిక్రయాలు జరుపుకోలేదు. దేవాదాయశాఖకు చెందిన భూముల సర్వే నంబర్ల జాబితా నుంచి ఈ ప్రాంతాన్ని తొలగించాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు కల్పించుకుని నెల్లిమర్ల పట్టణంలోని సర్వేనంబరు 104 సబ్ డివిజన్ 1లోని భూములను దేవాదాయశాఖ భూముల జాబితానుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
నెల్లిమర్ల రూరల్ : భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళి తే... విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలో గల కొం డపేట గ్రామానికి చెందిన లక్ష్మి(25)కి నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అలుగోలు జగన్నాథంతో ఎని మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం తాగవద్దని ఎంతచెప్పినా వినకపోవడంతో లక్ష్మి ఈనెల 20న భర్త ఇంట్లో ఉంటుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచింది. పరారీలో భర్త ఘటన జరిగిన దగ్గర నుంచి భర్త జగన్నాథం పరారీలోనే ఉన్నాడు. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తమ కుమార్తె మృతికి భర్తే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిత్యం మద్యం సేవించి గొడవలకు దిగేవాడని, కుటుంబ పోషణను కూడా పట్టించుకునేవాడు కాదని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేశామని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఇప్పటికే మృతిరాలి వద్ద నుంచి మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం కూడా తీసుకున్నాయని చెప్పారు. జగన్నాథం విశాఖపట్నంలో ఉన్నట్లు తెలిసిందని, రెండు రోజుల్లో పట్టుకొని పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు. -
నెల్లిమర్లకు ఎన్నికలు?
ఏప్రిల్‌లోనే జరిగే అవకాశం నెల్లిమర్ల, జరజాపుపేటల్లో జోరందుకున్న ఊహాగానాలు ఎన్నికలను అడ్డుకోవాలని జరజాపుపేట వాసుల ప్రచారం నెల్లిమర్ల : నగరపంచాయతీకి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయా? దీనిపై మున్సిపాలిటీ అధికారులకు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయా? ప్రస్తుతం నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో జరుగుతున్న చర్చ ఇదే. మున్సిపాలిటీ అధికారులు కూడా ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగరపంచాయతీనుంచి తమ ప్రాంతాన్ని తప్పించాలని, లేదంటే ఎన్నికలను అడ్డుకోవాలని జరజాపుపేట ప్రజలు పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాద్వారా ప్రచారం చేస్తున్నారు. 2013 నుంచి గ్రేడ్-3 మునిసిపాలిటీగా... నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలను కలిపి నగరపంచాయతీ(గ్రేడ్-3 మున్సిపాలిటీ)గా 2013 మార్చిలో అప్పటి ప్రభుత్వం స్థాయి పెంచింది. తమకు నగరపంచాయతీ వద్దని, తిరిగి గ్రామపంచాయతీలుగా మార్చాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు అప్పటినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రధానంగా జరజాపుపేటవాసులు ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి తిరిగి గ్రామపంచాయతీగా మార్చాలని విన్నవించారు. గతంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం కాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు నగరపంచాయతీ ఏర్పాటై మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా ఎలాగైనా ఏప్రిల్‌లో నెల్లిమర్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం సమగ్ర సమాచారం పంపించాలని మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలతో పాటే నెల్లిమర్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. ఇదే విషయమై నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఉపాధికి నిబంధనాలా?
నెల్లిమర్ల: ఉపాధిహామీ పథకంలో వందరోజుల నిబంధన కూలీలకు గుదిబండగా మారింది. ఒకే జాబ్‌కార్డులో ఉండే వేతనదారులంతా కలిసి ఆర్థిక సంవత్సరంలో వంద పనిదినాలు పూర్తిచేయడంతో వారికి అధికారులు పనులు నిలిపేశారు. ఈ విధంగా మండలంలోని 472 కుటుంబాలకు చెందిన సుమారు 1200మంది పనిలేక ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండునెలల పాటు పనిలేకపోతే ఎలా బతకాలని వాపోతున్నారు. మండలంలోని 26పంచాయతీల్లో మొత్తం 8వేల జాబ్‌కార్డులున్నాయి. వీరికి సంబంధించి 15వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్నారు. గత ఏప్రిల్ నెలనుంచి ఇప్పటివరకు 472 జాబ్‌కార్డులకు చెందిన కూలీలు వందరోజుల పని పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే ఆర్థిక సంవత్సరంలో వందరోజులు పని పూర్తిచేసుకున్నవారికి మరి పని కల్పించకూడదు. అందువల్ల వీరిని సోమవారంనుంచి పనులకు రానివ్వకుండా ఉపాధిహామీ అధికారులు నిలిపివేశారు. వారంతా లబోదిబోమంటున్నారు. వాస్తవానికి ఒక్కో జాబ్‌కార్డులో ముగ్గురేసి, నలుగురేసి కూలీలు ఉన్నారు. దీనివల్ల ఒక్కొక్కరు నెలరోజులు చేసినా వందరోజులు పూర్తయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలలుండగా ఇకపై తమకు ఉపాధి ఎలా అన్నదే ప్రశ్న. వేరే పనులకు వెళ్దామన్నా ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా లేవని వాపోతున్నారు. -
నిరుద్యోగులూ.. తస్మాత్ జాగ్రత్త
నెల్లిమర్ల: నెల్లిమర్లకు చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నిర్వహించిన టెస్ట్‌లో అర్హత సాధించాడు. శారీరక సామర్థ్య పరీక్షలో కూడా పాసయ్యాడు. అదే అభ్యర్థి గతంలోనూ పలుమార్లు టెస్ట్, శారీరకసామర్థ్య పరీక్షల్లో పాసైనా ఉద్యోగం రాలేదు. దీంతో ఈ సారి కూడా ఉద్యోగం వస్తుందో..రాదోననే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం ఓ దళారి(బ్రోకర్)కి తెలిసింది. ఇంకేం ఆ అభ్యర్థి తల్లిదండ్రులను కలిశాడు. తనకు రైల్వే మంత్రి తెలుసునని..రూ 3 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికాడు. దీంతో సందిగ్ధంలో ఉన్న సదరు అభ్యర్థి తల్లిదండ్రులు రూ. 2 లక్షలకు ఆ దళారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్న మొత్తాన్ని సదరు బ్రోకరుకు ఇచ్చేశారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మెరిట్‌పై ఆ అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. అయితే తానే ఉద్యోగం వేయించానని రూ. 2లక్షలు చల్లగా జేబులో వేసుకున్నాడు సదరు బ్రోకర్. ప్రస్తుతం నెల్లిమర్ల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతోంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగుల బలహీనతను బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. బాగా ప్రయత్నించి..ఒకట్రెండుసార్లు త్రుటిలో ఉద్యోగాలు తప్పిపోయిన అభ్యర్థులనే ఎంచుకుంటారు. తమకు సాక్షాత్తూ మంత్రులు, పెద్దస్థాయి అధికారులు తెలుసునని నమ్మబలుకుతారు. తమ ఫోన్లలో తమకు కావాల్సిన వారి నంబర్లనే మంత్రులు గాను, పెద్దస్థాయి అధికారులగాను నోట్ చేసుకుంటారు. అభ్యర్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచే ఆ నంబరుకు డయల్ చేసి లౌడ్స్పీకర్లో మాట్లాడి అందరినీ నమ్మిస్తారు. ఉద్యోగాలు వేయిస్తామని నమ్మబలికి బేరం కుదర్చుకుంటారు. అభ్యర్థి తన సామర్థ్యం మీద ఉద్యోగం సంపాదిస్తే తానేచెబుతూ మొత్తం సొమ్ము కాజేస్తాడు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే సంవత్సరాల తరబడి తిప్పి కొంత సొమ్ము ఖర్చు చెప్పి అతి కొద్ది మొత్తం తిరిగిస్తారు. దీన్నిబట్టి అభ్యర్థికి ఉద్యోగం వచ్చినా, రాకపోరుునా బ్రోకర్ల పంట పండుతుంది. ఎక్కువగా బ్యాంకు, రైల్వే పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థుల నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే మున్సిపాలిటీల్లోనూ ఉద్యోగాలు వేయిస్తామని ఇటీవల చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్క నెల్లిమర్ల మండల పరిసర ప్రాంతాల నుంచే సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రోకర్ల నుంచి అభ్యర్థులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. దళారులనునమ్మి మోసపోవద్దు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థులెవ్వరూ దళారులను నమ్మవద్దు. ప్రస్తుతం కేవలం సామర్థ్యం మీదే ఉద్యోగాలు వస్తున్నాయి. దళారుల విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో నిఘా సారిస్తున్నాం. ఎవరికి ఉద్యోగాలు వచ్చినా పోలీస్ విచారణ ఉంటుంది కాబట్టి బ్రోకర్ల విషయం బయటపడుతుంది. అభ్యర్థులు దళారులకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఉద్యోగాలిస్తాం అని వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. -రవికుమార్, విజయనగరం రూరల్ సీఐ -
నెల్లిమర్లలో నాలుగు పూరిళ్లు దగ్ధం
విజయనగరం : ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఆత్మారామం అగ్రహారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో నిద్రిస్తున్న వారంతా బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న మరో పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు వెల్లడించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లిమర్లలో విజృంభిస్తున్నడయేరియా
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతిలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే నెల్లిమర్ల, జరగాపుపేటకు చెందిన సుమారు 200 మంది డయేరియా బారిన పడగా.. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. -
ఆ దుప్పిని వండుకు తినేశారు!
నెల్లిమర్ల: సుమారు 15 రోజుల క్రితం నెల్లిమర్ల పట్టణంలోకి ప్రవేశించిన దుప్పి ఏమైంది? అటవీశాఖ అధికారులే దానిని చంపి మాంసంతో విందు చేసుకున్నారా? లేదంటే తమ ఉన్నతాధికారులకు గాని, ప్రజాప్రతినిధులకు గాని కానుకగా ఇచ్చి స్వామిభక్తిని చాటుకున్నారా?... స్థానికుల ఆరోపణలు, అటవీశాఖ అధికారుల పొంతన లేని సమాధానాలను బట్టి దుప్పిని వారే చంపి వండుకు తినేశారని స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే.. నెల్లిమర్ల పట్టణానికి సమీపంలో ఉన్న కొండపైనుంచి సుమారు 15 రోజుల క్రితం 60 కిలోల బరువున్న ఓ దుప్పి జనారణ్యంలోకి ప్రవేశించింది. ముందుగా రామతీర్ధం జంక్షన్ పాఠశాలలోకి ప్రవేశించి అనంతరం రోడ్డు మీద పరుగులు పెట్టిన దుప్పిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ బీట్ అధికారి కేవిఎన్ రాజు ఆ దుప్పిని ఓ ఆటోలో పూల్‌బాగ్‌లో ఉన్న అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ దుప్పికి ప్రథమ చికిత్స అందించినట్లు విలేకరులకు సమాచారమందించారు. తర్వాత విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలకు అప్పగించినట్లు ఒకసారి, గంట్యాడ మండలంలోని పెదమజ్జిపాలెంను ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌కు తరలించినట్లు మరోసారి, అడవిలోకి తరలిస్తుండగా మరణించిందని మరోసారి చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. దుప్పిని అటవీశాఖ అధికారులే చంపేసి దాని మాంసంతో విందు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. స్వామిభక్తిని చాటుకునేందుకు బడా ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు మరికొంతమంది చెప్పారు. దీనిపై రేంజర్ లక్ష్మీనరసింహంను వివరణ కోరగా నెల్లిమర్లనుంచి తీసుకొచ్చిన దుప్పిని అడవిలోకి తరలిస్తుండగా అదే రోజు చనిపోయిందన్నారు. ఆధారాలు చూపించమని కోరగా వేరే ఉద్యోగి దగ్గర ఉన్నాయని నీళ్లు నమిలారు. కాగా వన్యప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ అధికారులే ఇలా చేస్తే ఎలాగని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే దారుణానికి పాల్పడిందెవరో తేలుతుందని చెబుతున్నారు.