
నెల్లిమర్లలో ఫ్యాన్ గాలి జోరు
నెల్లిమర్ల, న్యూస్‌లైన్: నియోజకవర్గంలో నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. సవరించిన జాబితాతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 1,89, 988. వీరిలో ఒక్క నెల్లిమర్ల నగర పంచాయతీలోనే పదో వంతు ఓటర్లు ఉన్నారు. నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ మరింత బలంగా ఉంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే స్థానికుల అభీష్టానికి అనుగుణంగా నెల్లిమర్ల, జర జాపుపేట గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్పు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో స్థాని కులు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని పార్టీ అభ్యర్థి పెనుమత్స సురేష్‌బాబు ప్రకటించడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.
నెల్లిమర్ల మండలంలో పార్టీకి మె జార్టీ తెప్పించేందుకు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన ఏఎంసీ చైర్మన్ అంబళ్ళ శ్రీరాములనాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, తదితరులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో వైఎస్సార్ సీపీకి స్ప ష్టమైన ఆధిక్యం వస్తుందన్నది రాజకీయ వర్గాల అంచనా. ముఖ్యంగా భోగాపురం మండలంలో గతంలో పీఆ ర్‌పీ తరఫున పోటీ చేసిన కందుల రఘుబాబు, మాజీ ఎంపీ కొ మ్మూరు అప్పలస్వామి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆ మండలంలో ఇప్పటికే పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ లభించే అవకాశం ఉంది.
ఈ మండలంలో టీడీపీ మూడో స్థానానికే పరిమితమైంది. అంతేకాకుండా వైఎస్సా ర్ సీపీ అభ్యర్థి డాక్టర్ పెనుమత్స సురేష్‌బా బు ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లా రాజకీయాల్లో తన తండ్రికి ఉన్న మంచిపేరుతో నాలుగు మండలాల్లో నూ,నగర పంచాయతీలోనూ ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటించి అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలకు చెందిన కార్యకర్తలు, నేతలను తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు. రెండు నెలల్లో పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లోని చాలా పంచాయతీలను పార్టీలోకి తీసుకురాగలిగారు.
ఒక టీడీపీ విషయూనికి వస్తే..నగర పంచాయతీ విషయంలో ఇప్పటికీ ఆ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నగర పం చాయతీ వాసులు ఆ పార్టీని నమ్మడం లేదు. దీంతో ఆ పార్టీ చెందిన నాయకులు పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడుకు పట్టున్న గ్రామాల్లో కూడా వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి నారాయణస్వామి నాయుడు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్డ కొండ అప్పలనాయుడు పరిస్థితి ఆయన కంటే దారుణంగా ఉంది.