సంతోషి జిల్లాకే గర్వకారణం | Indian Weightlifter Santoshi Matsa Wins Bronze | Sakshi
Sakshi News home page

సంతోషి జిల్లాకే గర్వకారణం

Published Sun, Jul 27 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

సంతోషి జిల్లాకే గర్వకారణం

సంతోషి జిల్లాకే గర్వకారణం

 నెల్లిమర్ల : కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధిం చిన సంతోషి జిల్లాకే గర్వకారణమని.. అటువంటి బిడ్డను కన్న మీరు ధన్యులని... సంతోషి తల్లిదండ్రులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అభినందించారు. సంతోషి తల్లిదండ్రులను అభినందించేందుకు మంత్రి శనివారం కొండవెలగాడ విచ్చేశారు. ఈ సందర్భంగా సంతోషి తల్లిదండ్రులు రాముల మ్మ, రామారావు తమ బిడ్డ సాధించిన విజయూలను వివరించారు. జాతీయ,
 
 అంతర్జాతీయ స్థా యి క్రీడల్లో వచ్చిన పతకాలను, ధ్రువీకరణ పత్రాలను చూపించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ 2005 నుంచి సంతోషి వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించడం అభినందించదగ్గ విషయమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థారుులో పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. సంతోషి ప్రతిభ అంతా తల్లిదండ్రులకే దక్కుతుందన్నారు. సంతోషి ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వివిధ స్థారుులో నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనేం దుకు అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వం తరఫున అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
 
 అనంతరం గ్రామంలో వెయిట్‌లిఫ్టర్లు సాధన చేసే వ్యాయూమ శాలను మంత్రి సందర్శించారు. సంతోషికి శిక్షణ ఇస్తున్న కోచ్ చల్లా రాముతో మాట్లాడారు. శిక్షణలో ఎదురయ్యే సమస్యలను కోచ్ మంత్రికి వివరించారు. సాధన చేసేందుకు వ్యాయూమశాల కూడా గ్రామంలో లేదన్నారు. క్రీడా పరికరాలు కూడా తామే సొంత డబ్బుతో కొనుగోలు చేస్తున్నామని పలువురు క్రీడాకారు లు మంత్రి వద్ద వాపోయూరు. స్పందించిన మంత్రి మల్టీజిమ్‌ను, వ్యాయూమశాలకు అవసరమయ్యే భవనాన్ని మంజూరు చేస్తానని హామీనిచ్చారు. మంత్రి వెంట అధికారులు కృష్ణమోహన్, రవీంద్రకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు ఉన్నారు.
 
 సంతోషికి పెనుమత్స అభినందనలు
 నెల్లిమర్ల: కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన సంతోషిని తమ పార్టీ తరఫున అభినందిస్తున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు చెప్పారు. విలేకరులతో శనివారం మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఇప్పటికే పలు పతకాలు సాధించిన సంతోషి మరోసారి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి సత్తా చాటిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కోచ్ చల్లా రాము, తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కూడా అభినందించారు.
 
 అభినందనల వెల్లువ
 విజయనగరం మున్సిపాలిటీ : స్కాట్లాండ్‌లోని  గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో దేశం నుంచి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన  తెలుగు తేజం మత్స సంతోషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో 53 కిలోల విభాగంలో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలు, స్నాచ్ లో 83 కేజీలు బరువులు ఎత్తి కాంస్య పతకం దక్కించుకు న్న విషయం విదితమే. సంతోషి సాధించిన ఘనత ద్వారా జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటాయని పలు క్రీడాసంఘాలు అభినందనలు వ్యక్తం చేస్తున్నాయి. సంతోషికి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు,  వల్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు వల్లూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన సాధూరావు, కార్యదర్శి అట్టాడ లక్ష్మున్నాయుడుతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతి నిధులు, క్రీడాభిమానులు ఉన్నారు.
 
 వ్యాయూమశాల పూర్తికి నిధులిస్తాం..
 నెల్లిమర్ల : వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లయిన కొండ వెలగాడలో నిర్మాణంలో ఉన్న వ్యాయామశాలను పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హామీనిచ్చారు. కామన్వెల్త్ క్రీడల్లో గ్రామానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం సాధించిన సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం సత్కరించారు. కొండవెలగాడలోని సంతోషి స్వగృహానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొండవెలగాడలోని వ్యాయామశాల నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో సంతోషి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీలక్ష్మి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, యడ్ల రమణమూర్తి, ఆదిరాజు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement