Santoshi
-
భారమైన జీవనాన్ని పరుగులు తీయిస్తోంది
జీవితం ప్రతి దశలోనూ ఒక అడ్డంకిని సృష్టిస్తుంది. ఆ అడ్డంకిని ఎదుర్కొనే విధానంలోనే విజయమో, అపజయమో ప్రాప్తిస్తుంది. విజయాన్ని సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది మూడు పదుల వయసున్న సంతోషి దేవ్ జీవన పోరాటం. హర్యానా వాసి సంతోషి దేవ్ ఒడిశాలోని కొయిడా మైనింగ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే వోల్వో ట్రక్కు నడుపుతోంది. ఈ రంగంలో పురుషులదే ప్రధాన పాత్ర. మరి సంతోషి మైనింగ్‌లో ట్రక్కు డ్రైవర్‌గా ఎలా నియమితురాలైంది?! ముందు ఆమె జీవనం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. మలుపు తిప్పిన గృహహింస...పదహారేళ్ల వయసులో సంతోషి దేవ్‌ని ఒడిశాలోని హడిబంగా పంచాయతీ, బాదముని గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. నిత్యం వరకట్న వేధింపులు, గృహహింసతో బాధాకరంగా రోజులు గడిచేవి. కన్నీటితోనే తన పరిస్థితులను తట్టుకుంటూ కొన్నాళ్లు గడిపింది. అందుకు కారణం తల్లిదండ్రులకు తొమ్మిదిమంది సంతానంలో తను ఆరవ బిడ్డ. ఎంతటి కష్టాన్నైనా సహనంతో సర్దుకుపొమ్మని పుట్టింటి నుంచి సలహాలు. కొన్నాళ్లు భరించినా, కఠినమైన ఆ పరిస్థితులకు తల వంచడానికి నిరాకరించి, పోరాడాలనే నిర్ణయించుకుంది. తిరిగి పుట్టింటికి వచ్చింది. కానీ, అక్కున చేర్చుకోవాల్సిన కన్నవారి నుంచి అవమానాల్ని ఎదుర్కొంది. అధైర్యపడకుండా, తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలనుకుంది. స్కూల్ వయసులోనే డ్రాపౌట్ స్టూడెంట్. తెలిసినవారి ద్వారా స్పిన్నింగ్ మిల్లులో పని చేయడానికి జీవనోపాధి కోసం తమిళనాడుకు వలస వచ్చింది.కుదిపేసిన పరిస్థితుల నుంచి...భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందింది. 2021లో క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్్సపోర్ట్ (సిఆర్యుటి) నిర్వహిస్తున్న సిటీ బస్ సర్వీస్ అయిన ‘మో’ బస్‌కు డ్రైవర్‌గా నియమితురాలైంది. ఒడిశాలో ఒంటరి మహిళా బస్సు డ్రైవర్‌గా మహిళా సాధికారతని చాటింది. అయితే ఆశ్చర్యకరంగా, ఆమె విజయగాథ అక్కడి నుంచి తొలగింపుతో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ‘తొలి మహిళా బస్సు డ్రైవర్ కావడంతో స్థానిక మీడియా నన్ను హైలైట్ చేసింది. ఒక నెల తరువాత, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా తప్పు ఏమిటో అర్థం కాలేదు. కానీ, మళ్ళీ జీవితం నన్ను పరీక్షించిందని అర్ధమైంది. దీంతో బతకడానికి మళ్లీ ఆటో రిక్షా డ్రైవింగ్‌కు వచ్చేశాను’ అని తన జీవిత ప్రస్థానాన్ని వివరించింది సంతోషి. ఆరు నెలల క్రితం ఓ మైనింగ్ కంపెనీ సంతోషి పట్టుదల, ధైర్యాన్ని గుర్తించింది. వోల్వో ట్రక్కును నడపడానికి ఆఫర్ చేసింది. ‘ఏ కల కూడా సాధించలేనంత పెద్దది కాదు. ఆరు నెలల నుంచి నెలకు రూ.22,000 జీతం పొందుతున్నాను’ అని గర్వంగా చెబుతోంది ఈ పోరాట యోధురాలు. జీవనోపాధిని వెతుక్కుంటూ...‘‘మా అత్తింటిని విడిచిపెట్టిన నాటికే గర్భవతిని. కొన్ని రోజులకు తమిళనాడులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడే 2012లో కూతురు పుట్టింది. మూడేళ్లు నా తోటి వారి సాయం తీసుకుంటూ, కూతురిని పెంచాను. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతి పైసా పొదుపు చేశాను. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చెన్నైలో ఆటో రిక్షా నడుపుతున్న ఓ మహిళను చూశాను. ‘ఆమెలా డ్రైవింగ్ చేయలేనా?‘ అని ఆలోచించాను. నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తం, చిన్న రుణంతో ఆటో రిక్షా కొనుక్కుని ఒడిశాలోని కియోంజర్కి వచ్చేశాను. నా కూతురుకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆమెను హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చేర్పించాను. ఒడిశాలోని అనేక మంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నాను’ అని వివరించే సంతోషి ఆశయాలు అక్కడితో ఆగలేదు. -
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు. -
Santoshi Shetty: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్ బ్లాగరా అన్నారు
పెద్దపెద్ద భవనాలు నిర్మించి మంచి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది! అనుకోకుండా ఫ్యాషన్‌పై దృష్టిమళ్లడంతో ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో ఫ్యాషన్ స్టార్‌గా ఎదిగి లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది సోషల్ స్టార్ సంతోషి శెట్టి. ‘ద స్టైల్ ఎడ్జ్’ పేరిట ఫ్యాషన్ బ్లాగ్‌ను నడుపుతూ.. ఇండియాలోనే మోస్ట్ పవర్‌పుల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది సంతోషి. ముంబైలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సంతోషి చిన్నప్పటి నుంచి చురుకైనది. స్కూలు, కాలేజీల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేది. ఒకపక్క ఫుట్‌బాల్ ఆడుతూనే మరోపక్క ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలనుకునేది. ట్రెండ్‌కు తగ్గట్టు ఉండేందుకు ప్రయత్నించేది. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చదివేందుకు కాలేజీలో చేరినప్పటికి.. ఫ్యాషన్‌పై తనకున్న ఇష్టాన్ని వదులుకోలేదు. క్యాంపస్‌లో అందరికన్నా భిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో ప్రత్యేకంగా కనిపించేది. నాన్న ఫోన్లో అకౌంట్ క్రియేట్ చేసి.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో సంతోషి తక్కువ ధరలో దొరికే వాటితోనే ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు ప్రయత్నించేది. డిగ్రీ చదివేటప్పుడు తన స్నేహితులంతా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గురించి మాట్లాడుతుంటే సంతోషి దగ్గర బేసిక్ నోకియా ఫోన్ మాత్రమే ఉంది. దీంతో నాన్న ఫోనును తీసుకుని అకౌంట్ క్రియేట్ చేసి దానిలో తన డైలీ అప్డేట్స్ ను పోస్టు చేసేది. ఒకపక్క డిగ్రీ చదువుతూనే.. తన ఫ్యాషన్ కు సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తుండేది. ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి చదువులో కాస్త వెనకపడ్డప్పటికీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరిగింది. దీంతో తనని నెటిజన్లు గుర్తిస్తున్నారని తెలిసి సొంత యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది సంతోషి. డిగ్రీ పూర్తిచేసేందుకు కష్టపడుతూనే.. తన సొంత వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్, యూట్యూబ్‌లలో కొత్తకొత్త ఫ్యాషన్ కంటెంట్‌ను పోస్టు చేస్తుండేది. ఫాలోవర్స్ పెరగడంతో డిగ్రీ అవగానే ‘ద స్టైల్ఎడ్జ్’ ఫ్యాషన్ బ్లాగ్‌ను ప్రారంభించి ఫ్యాషన్‌నే కెరీర్‌గా మలుచుకుంది. తన ఫ్యాషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. 2016లో కాస్మోపాలిటన్ బ్లాగర్‌గానూ, ఎలే బ్లాగర్ ఆఫ్ ది ఇయర్‌గాను నిలిచింది. 2017 లో పల్లాడియం స్పాట్లైట్ ఫ్యాషన్ బ్లాగర్గాను పేరుతెచ్చుకుంది. సోషల్ మీడియా స్టార్‌గా అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ..ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్లలో దాదాపు పదిలక్షలమంది ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది 27 ఏళ్ల సంతోషి. నల్లగా ఉంది ఫ్యాషన్ బ్లాగరా..? ‘‘నేను ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియో లు పోస్టు చేసినప్పుడు ప్రశంసల పరిమళాలతోపాటూ విమర్శల ముళ్లూ నన్ను గుచ్చాయి. నా వీడియోలు చూసిన కొందరు ఇంత నల్లగా ఉన్న అమ్మాయి ఫ్యాషన్ బ్లాగర్ ఎలా అయ్యింది? అనే కామెంట్స్, మరికొందరు ఆమె ఫోటోలో ఉన్నదానికంటే నల్లగా ఉంది అని అంటుంటే మనస్సు చివుక్కుమనేది. అయినప్పటికీ నా మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా రోజూ కాలేజీకి వెళ్లి కష్టపడి చదవడం, అక్కడ ఇచ్చిన ఎసైన్మెంట్స్ శ్రద్దగా పూర్తిచేసేదాన్ని. కొత్తకొత్త కంటెంట్‌తో ఇన్‌స్టాలో వీడియోలు పోస్టు చేసేదాన్ని. ఆ ధైర్యమే ఈరోజు నన్ను మ్యాగజీన్ల కవర్‌పేజీపై నా ఫోటో వచ్చేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్‌షోలకు హాజరవుతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించవచ్చు’’ అని చెబుతున్న సంతోషి శెట్టి ఫ్యాషన్ స్టార్. చదవండి: ఏదీ సులభంగా రాదు: జోయా అగర్వాల్ -
డిప్యూటీ కలెక్టర్ శిక్షణకు సంతోషి
సాక్షి, హైదరాబాద్ : చైనాతో ఘర్షణలో మృతి చెందిన సంతోష్‌బాబు సతీమణి బికుమల్ల సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర పాటు శాఖాపరమైన శిక్షణ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా ఏదేనీ జిల్లాలో క్షేత్రస్థాయి పాలనా వ్యవహారాల్లో శిక్షణకు పంపనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంసీహెచ్‌ఆర్‌సీలో జరిగే శిక్షణకు హాజరుకావాలని శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆలోచింపజేసే లైఫ్ స్టైల్
నెహ్రు విజయ్, రోజా, నిఖిల్, సంతోషి ముఖ్య తారలుగా సి.ఎల్. సతీష్ మార్క్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైఫ్ స్టైల్’. కలకొండ నర్సింహ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నాయకుడు మందాడి జగన్నాథం ట్రైలర్‌ను విడుల చేశారు. రచయిత గోరెటి వెంకన్న పాటలు విడుదల చేయగా, సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఆడియోను విడుదల చేశారు. కలకొండ నర్సింహ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరుకు 4జి నెట్వర్క్కి అలవాటుపడి చదువులు, ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాలను మా చిత్రంలో సందేశాత్మకంగా చూపించాం’’ అన్నారు. సి.ఎల్.సతీష్ మార్క్ మాట్లాడుతూ– ‘‘అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది. ప్రస్తుత సమస్యలు, నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఉన్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్ .జె -
సోషియో ఫాంటసీ
అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ‘‘సోషియో ఫాంటసీగా తెరకెక్కిన చిత్రమిది. క్రౌడ్ ఫండింగ్‌తో రెండేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన చిత్రమిది. ప్రేక్షకులు మా కష్టాన్ని అర్థం చేసుకొని సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు రవికిశోర్. ‘‘యూనిట్ అంతా కొత్తవారే. వాళ్ల ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది. క«థ, కథనాల పరంగా ఈ చిత్రాన్ని ది బెస్ట్‌గా రవికిశోర్ తెరకెక్కించాడు’’ అన్నారు తనికెళ్ల. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.ఎన్. -
తెల్లారితే పెళ్లి.. వధువు అదృశ్యం
బంజారాహిల్స్: మరికాసేపట్లో... పెళ్లి జరుగనుండగా పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఫిలింనగర్ సమీపంలోని హకీంపేట్‌కు చెందిన సంతోషి(19) వివాహం సికింద్రాబాద్‌కు చెందిన జైపాల్‌తో నిశ్చయమైంది. గురువారం ఉదయం జుమ్మరాత్బజార్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం వధువు, వరుడి ఇళ్లల్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బుధవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్లిన సంతోషి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరి స్వప్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తవాళ్ల ప్యాషన్ చూస్తుంటే ముచ్చటేసింది
‘‘ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయం సాధిస్తున్నప్పటికీ మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. వాళ్లందరూ తప్పకుండా విజయం సాధిస్తారు. ‘అంతర్వేదమ్’ చిత్రంలో నటించినవారు, యూనిట్ మెంబర్స్ అందరూ కొత్తవారే. సినిమా పట్ల వారి ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’’ అని రచయిత–నటుడు తనికెళ్ల భరణి అన్నారు. అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జె.యస్. నిథిత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. రవికిషోర్ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ల భరణిగారు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇప్పటి వరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. చిత్రకథానాయకుడు అమర్, రైటర్ ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు రాంప్రసాద్, ‘రైజింగ్’ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సహ నిర్మాత: ఎస్.ఎన్. -
ఆత్మ పయనమెటు?
అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతేర్వేదమ్’. రవికిశోర్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘మనిషి చనిపోయినప్పుడు.. నిద్రపోయినప్పుడు.. కోమాలో ఉన్నప్పుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది? మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయిన వారిని, మనకి తెలియనివారిని కలిసి వస్తుందా? దీనినే మనం కల అనుకుంటున్నామా?.. ఇలాంటి విషయాలన్నీ రాసి ఉన్న తాళపత్ర గ్రంథం పేరే ‘అంతేర్వేదం’. ఆ తాళపత్ర గ్రంథం ఆధారంగా తీసిన చిత్రమే ‘అంతేర్వేదమ్’. త్వరలో ట్రైలర్, ఆడియో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సంగీతం: జె.యస్. నిథిత్. -
సంతోషి, శిరీషలకు స్వర్ణాలు
మంగళూరు: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు మత్స సంతోషి (మహిళల 53 కేజీలు), కె.శిరీష (మహిళల 58 కేజీలు), కోరాడ రమణ (పురుషుల 56 కేజీలు), రాగాల వెంకట రాహుల్ (పురుషుల 85 కేజీలు) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు మహిళల 63 కేజీల విభాగంలో జి.లలిత, పురుషుల 77 కేజీల విభాగంలో ఎం.రామకృష్ణ రజతాలు సాధించారు. మహిళల 69 కేజీల విభాగంలో ఎస్కే అలీమా బేగం నాలుగు పతకాలు గెలిచింది. క్లీన్ అండ్ జర్క్, ఇంటర్ స్టేట్ అంశాల్లో రజతాలు, జర్క్, టోటల్లలో కాంస్యాలు దక్కించుకుంది. -
సంతోషికి రజతం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మత్స్య సంతోషి సత్తా చాటింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె రజత పతకాన్ని సాధించింది. మంగళవారం జరిగిన సీనియర్ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో సంతోషి ఓవరాల్‌గా 194కేజీల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 86కేజీల లిఫ్ట్ చేసిన సంతోషి క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్లో 108 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన సంజిత చాను ఓవరాల్‌గా 195 కేజీల బరువునెత్తి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు సీనియర్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలవడంతో పాటు స్నాచ్ విభాగంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె ఫైనల్లో ఓవరాల్‌గా 189 కేజీల బరువునెత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తాజాగా స్నాచ్ విభాగంలో 85 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న రికార్డు (84 కేజీలు)ను తిరగ రాసింది. ఈ విజయాలతో మీరాబాయి, సంజిత వచ్చే ఏడాది ఇదే వేదికపై జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు. -
అశ్రునయనాలతో సంతోషి అంత్యక్రియలు
► కడసారి చూపుకోసం తరలిన విద్యార్థి లోకం ► హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ►విద్యార్థి సంఘాల ఆందోళన సిద్దిపేటఅర్బన్: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంతోషి అంత్యక్రియలు గురువారం సహచర విద్యార్థులు, గ్రామస్తులు, బంధువుల అశ్రునయనాల మధ్య కొండపాక మండలం సిరిసినగండ్లలో జరిగాయి. కడసారి చూపు కోసం విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. డిగ్రీ కళాశాల విద్యార్థులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు సంతోషి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి, పౌరహక్కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందించారు. అదే విధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సంతోషి మృతికి సంతాపంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించి ర్యాలీగా ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రి వద్ద విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గురువారం ఏరియా ఆస్పత్రిలో పోలీసుల సమక్షంలో సంతోషి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని విద్యార్థులు కొండపాక మండలం సిరిసినగండ్లకు తరలించారు. తమతోటి విద్యార్థిని మృతిని జీర్ణించుకోలేక విద్యార్థులు పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియలకు వందలాది మంది తరలివచ్చారు. అధికారులకు వినతి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని సంతోషిపై జరిగిన అత్యాచారం, హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు భరత్, సాయి, లింగం, లక్ష్మణ్ తదితరులు జిల్లా ఆస్పత్రి వద్ద నిరసన ప్రదర్శన చేశారు. నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐ నందీశ్వర్‌కు, ఆర్డీఓ ముత్యంరెడ్డిలకు వినతిపత్రాన్ని అందించారు. పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు రాగుల భూపతి గురువారం ఏసీపీకి వినతి పత్రం అందించారు. విద్యార్థిని మృతికి కారణమైన గుమ్మన్నగారి రవిశంకరశర్మ, పద్మావతి, వారి కుమారుడు కృష్ణచంద్ర, శరత్చంద్రలను నిందితులుగా చేర్చి అత్యాచారం, హత్య, నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంరక్షణ పేరుతో విద్యార్థిని పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ పని మనిషిలా ఉపయోగించుకున్న ఆ కుటుంబంపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంతోషిని మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు పోలీసు శాఖను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, బీడీఎస్ఎఫ్, తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రతినిధులు అనిల్‌రెడ్డి, అశోక్, సత్తయ్య, మన్నె కుమార్, శ్రీకాంత్, ఆనంద్ పాల్గొన్నారు. -
దెయ్యాలున్నాయి జాగ్రత్త!
‘‘ఈ సృష్టిలో దేవుళ్లు ఉన్నది నిజమైతే.. దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం’ అనే అంశంతో ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్‌బిడి) తెరకెక్కించాం. హారర్ – థ్రిల్లర్‌లా సాగుతుందీ చిత్రం’’ అన్నారు దర్శకుడు కృష్ణకార్తీక్. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్. వై ఈ చిత్రం నిర్మించారు. మహిమదన్ యం.యం. సంగీతం అందించిన పాటల సీడీలను మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘కృష్ణకార్తీక్ పక్కా ప్లానింగ్ వల్ల సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి’’ అని నిర్మాత తెలిపారు. మహిమదన్, నిర్మాత లయన్ సాయివెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ గౌడ్. వై. -
దెయ్యం హ్యాక్ చేస్తే?
సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను హ్యాక్ చేయడం కామన్.. కానీ, దెయ్యాలు హ్యాక్ చేస్తే? ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ వై. నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత రామసత్యనారాయణ రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టెక్నికల్ విభాగంలో పని చేసిన నన్ను, నా కథను నమ్మి ఉదయ్‌భాస్కర్ నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు నిర్మిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జనవరి 1న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ఉదయ్‌భాస్కర్ చెప్పారు.. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమేరా: కన్నాకోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్‌గౌడ్ .వై -
సొంతగడ్డపై గౌరవం ఇదేనా?
విజయనగరం మున్సిపాలిటీ : క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు ఆ స్థాయిలో గౌరవం దక్కడం లేదు. కనీస సదుపాయాలు లేకున్నా క్రీడారంగాన్నే నమ్ముకుని రాణిస్తున్న వారికి ప్రోత్సాహం కరువవుతోంది. ఇందుకు కామన్వెల్త్ గేమ్స్‌లో విజేతగా నిలిచిన మత్స సంతోషికి జిల్లా యంత్రాంగం నిర్వహించిన సన్మాన కార్యక్రమమే తార్కాణంగా నిలుస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 183 కిలోల బరువు ఎత్తి ప్రపంచస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పిన సంతోషికి జిల్లా యంత్రాం గం ఆధ్వర్యంలో బుధవారం సన్మానం నిర్వహించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు, క్రీడాభిమానులు, క్రీడాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే సంతోషి సన్మాన కార్యక్రమానికి వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన క్రీడా సంఘాలకు చెందిన ప్రతినిధులు కానీ.. క్రీడాకారులు కానీ ఏ ఒక్క రూ హాజరుకాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమానికి జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, కొద్ది మంది వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు, ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. ఈ విషయంలో మిగిలిన క్రీడా సంఘాల ప్రతినిధులు ఎందుకు దూరంగా ఉన్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి సంతోషి రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో తొలి కామన్వెల్త్ పతకాన్ని అందించింది. ఇంతటి ఘనత సాధించిన మట్టిలో మాణిక్యం పట్ల క్రీడా సంఘాలు చిన్నచూపు చూస్తున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. కేవలం తమ విభాగానికి చెందిన క్రీడాకారులు రాణించినప్పుడే చంకలు గుద్దుకుని సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సరికాదని, అంతర్జాతీయ స్థాయిలో ఏ క్రీడాకారుడు రాణించినా అన్ని క్రీడా సంఘాలు సుముచిత రీతిలో అభినందించాలని సర్వత్రా భావిస్తున్నారు. ప్రోత్సాహకంపై విమర్శల వెల్లువ నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి అంతర్జాతీయ పతకం అందించిన మత్స సంతోషికి ప్రభుత్వం తరఫున ప్రకటించిన నగదు ప్రోత్సాహకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస సదుపాయాల కల్పన విషయంలో అటు అధికార యంత్రాం గం, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ సంతోషి స్వయంకృషితో ఎదిగింది. అటువంటి క్రీడాకారిణికి కేవలం రూ7.5 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం తరఫున అందజేయనున్నట్లు జేసీ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇదే పోటీల్లో బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షలు చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన మిగిలిన రాష్ట్రాల క్రీడాకారులకు భారీ మొత్తం లో ప్రోత్సాహకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కరెంట్ ఉండదు... వర్షం ఆగదు!
షెడ్డులోనే సాధన ప్రతికూల పరిస్థితుల్లోనూ సంతోషికి పతకాలు సాక్షి, విజయనగరం: ఒక పొలంలో చిన్న షెడ్డు... వర్షం పడితే నిలుచునే అవకాశం లేకుండా కారిపోతుంది. దీనికి తోడు దోమల బెడద... కరెంట్ కూడా ఉండదు. ఇదీ కామన్వెల్త్ క్రీడల్లో రజతపతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి ప్రాక్టీస్ చేస్తున్న వాతావరణం. విజయనగరం జిల్లాలోని కొండవెలగాడలో ఇలాంటి ప్రతికూలతను ఎదుర్కొంటూ కూడా ఆమె అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ గ్రామంలో సంతోషితో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ లిఫ్టర్లు కూడా సాధన చేస్తున్నారు. ‘మాకు కనీస వసతులు కూడా లేవు. మా కోచ్ రాము సార్ పొలంలోనే షెడ్ వేసి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. లిఫ్టింగ్ సెట్లు కూడా సరైనవి లేవు. ఇతర వ్యాయామ పరికరాల గురించి అసలు ఆలోచించనేలేము’ అని సంతోషి చెప్పింది. నాలుగేళ్లుగా ఫలితాలు 2005లో సాధన మొదలు పెట్టాక జూనియర్ స్థాయినుంచి సీనియర్ వరకు సంతోషి ఇప్పటి వరకు 13 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొంది. అయితే 2010 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన అనంతరమే ఆమెకు గుర్తింపు దక్కింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది. ‘ముందుగా కాంస్యంతోనే సంతృప్తి చెందాను. అయితే మొదటి స్థానంలో నిలిచిన అమ్మాయి డోపింగ్‌లో పట్టుబడటంతో నాకు రజతం దక్కడంతో సంతోషం రెట్టింపైంది’ అని ఆమె చెప్పింది. ఆర్థిక సమస్యలు ఉన్నా... సంతోషిది పేదరిక నేపథ్యం. చాలీచాలని సంపాదన ఉన్నా ఆమె తల్లిదండ్రులు ఆటల వైపు ప్రోత్సహించారు. ఇప్పుడు వారి నమ్మకాన్ని ఈ అమ్మాయి నిలబెట్టింది. ‘కుటుంబ సభ్యులతో పాటు కోచ్ రాము అండగా నిలిచారు. మరికొంత మంది దాతలు నాకు సహకారం అందించారు. ఆర్థిక ఇబ్బందుల భారం నాపై పడకుండా ప్రోత్సహించడం వల్లే ఈ రోజు కామన్వెల్త్లో పతకం నెగ్గగలిగాను’ అని సంతోషి భావోద్వేగంతో అంది. భవిష్యత్తుపై ఆశ తాజాగా కామన్వెల్త్ విజయం సంతోషిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో జరిగే ఆసియా క్రీడలతో పాటు ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఒలింపిక్స్‌లో పతకమే నా లక్ష్యం. అయితే అది సులువు కాదు. దానికి కఠోర శ్రమతో పాటు ఫిట్నెస్వంటివి కూడా కీలకం. ప్రాక్టీస్‌కు అంతర్జాతీయ స్థాయి పరికరాలు అవసరం. అయితే అన్ని అడ్డంకులను అధిగమించాలని పట్టుదలగా ఉన్నా’ అని ఆమె పేర్కొంది. ప్రభుత్వం సహకరిస్తుందా..? నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ పతకం సాధించినా ఇప్పటిదాకా ప్రభుత్వం సంతోషిని పట్టించుకోలేదు. ‘తొమ్మిదేళ్ల క్రితమే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు గెలిచాను. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. వేర్వేరు కార్యక్రమాల్లో నాకు ఇది చేస్తాం, అది చేస్తాం అనడమే గానీ నాయకులు, అధికారులు ఎప్పుడూ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడైనా నాకు సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాను’ అని ఈ విజయనగరం అమ్మాయి చెబుతోంది. కామన్వెల్త్ విజయం అనంతరం ఇటీవలే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ. 7.5 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. దీంతో పాటు ఆమె సాధనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే సంతోషికి ఒలింపిక్ పతకం కూడా అసాధ్యం కాబోదు. -
సంతోషికి రూ. 7.5 లక్షలు
ఏపీ ప్రభుత్వ నజరానా విజయనగరంలో ఘన స్వాగతం సాక్షి, విజయనగరం: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ మత్స్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించనుంది. సంతోషికి రూ. 7.50 లక్షల బహుమతి ఇస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. రామారావు ప్రకటించారు. ఈ నెల 8, 9 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ మొత్తం అందిస్తారు. దీంతో పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటి పట్టా కూడా ఇవ్వనున్నట్లు జేసీ వెల్లడించారు. గ్లాస్గోనుంచి తిరిగి వచ్చిన సంతోషికి బుధవారం విజయనగరంలో ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెను సన్మానించారు. పేదరిక నేపథ్యంనుంచి వచ్చినా...పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంతోషి ఘనతను అంతా ప్రశంసించారు. ‘త్వరలో జరిగే సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నాను. ఆ తర్వాత ఒలింపిక్స్‌లోనూ పతకం నెగ్గడమే నా లక్ష్యం. అందుకు ప్రభుత్వంతో పాటు అందరి సహకారం కావాలి’ అని ఈ సందర్భంగా సంతోషి వ్యాఖ్యానించింది. -
నేడు జిల్లాకు ‘సంతోషి’
విజయనగరం మున్సిపాలిటీ/లీగల్: అంతర్జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటి చెప్పి రజత పతకం దక్కించుకున్న వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి బుధవారం జిల్లాకు రానుంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన సంతోషి 53 కిలోల విభాగంలో మొత్తం 183 కిలోల బరువులు ఎత్తి కాంస్య పతకం దక్కించుకోగా బంగారు పతకం దక్కించుకున్న క్రీడాకారిణి డోపింగ్ పరీక్షలో పట్టుబడడంతో అనూహ్యంగా సంతోషికి రజతం పతకం సొంతమైంది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన ఈ క్రీడాకారిణి బుధవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తరఫున ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ముదావత్ ఎం.నాయక్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం విజయనగరం చేరుకునే సంతోషిని స్థానిక ఎత్తుబ్రిడ్జి నుంచి కోట జంక్షన్ సమీపంలో గల క్షత్రియ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకురానున్నారు. అనంతరం కల్యాణ మండపం ఆవరణలో జిల్లా యంత్రాంగం తర ఫున సముచిత రీతిలో సత్కరించనున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ ఎం.ఎం. నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారని, అదేవిధంగా జిల్లాలోని అన్ని క్రీడాసంఘాలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సంతోషికి అభినందనల వెల్లువ
విజయనగరం మున్సిపాలిటీ/నెల్లిమర్ల రూరల్: స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్యపతకం దక్కించుకున్న నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషిని అదృష్టం తలుపుతట్టి వరిస్తోంది. ఇన్నాళ్లూ కష్టించిన ఆమెను అదృష్టదేవత పలకరిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆమెకు రజతం పతకం దక్కింది. ఇదే విభాగంలో స్వర్ణం దక్కించుకున్న క్రీడాకారిణి డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోవడంతో ఆమెకు దక్కిన పతకాన్ని రద్దుచేశారు. దీంతో రజతం దక్కించుకున్న క్రీడాకారిణికి నిర్వాహకులు స్వర్ణం ప్రకటించడంతో కాంస్యం దక్కించుకున్న సంతోషి రజతపతకం కైవసం చేసుకున్న ట్లయింది. ఈ మేరకు జిల్లాలో మరోసారి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన.అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు సంతోషికి అభినందనలు తెలిపారు. గ్లాస్గో నుంచి హైదరాబాద్ వస్తున్న సంతోషికి స్వాగతం పలికేందుకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ హైదరాబాద్ బయలుదేరారు. మత్స సంతోషి కామన్వెల్త్ గేమ్స్‌లో అనూహ్య పరిస్థితుల్లో రెండవ స్థానానికి వెళ్లి రజత పతకం సాధించినట్లు తెలియడంతో ఆమె తల్లిదండ్రులు, కోచ్ చల్లా రాము, సహచరు లు, వివిధ రాజకీయ పార్టీలకు చెం దిన నాయకులు, వివిధ సంఘాలు, అభిమానులు, కొండవెలగాడ గ్రామస్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సం తోషి ప్రతిభను కొనియాడుతున్నారు. -
సంతోషికి రజతం అవకాశం!
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలిచిన తెలుగు తేజం మత్స సంతోషి (53 కేజీలు)కి రజత పతకం దక్కే అవకాశాలున్నాయి. స్వర్ణం సాధించిన నైజీరియన్ లిఫ్టర్ చికా అమలాహా డోపింగ్‌లో విఫలం కావడం ఏపీ అమ్మాయికి కలిసిరానుంది. అలాగే ఈ విభాగంలో భారత్ పతకాల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. నాలుగో స్థానంలో నిలిచిన స్వాతి సింగ్‌కు కాంస్యం లభించొచ్చు. పోటీల సందర్భంగా అమలాహా ఇచ్చిన ఎ-శాంపిల్ పాజిటివ్‌గా తేలింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షలో నిర్ధారణ కావడంతో ఆమెను గేమ్స్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే బి-శాంపిల్‌లో కూడా పాజిటివ్‌గా తేలితే అమలాహా నుంచి పతకాన్ని వెనక్కి తీసుకుంటామని గేమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ హూపర్ తెలిపారు. రూ. 5 లక్షల నజరానా మత్స సంతోషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలు నజరానా ప్రకటించింది. -
సంతోషి జిల్లాకే గర్వకారణం
నెల్లిమర్ల : కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధిం చిన సంతోషి జిల్లాకే గర్వకారణమని.. అటువంటి బిడ్డను కన్న మీరు ధన్యులని... సంతోషి తల్లిదండ్రులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అభినందించారు. సంతోషి తల్లిదండ్రులను అభినందించేందుకు మంత్రి శనివారం కొండవెలగాడ విచ్చేశారు. ఈ సందర్భంగా సంతోషి తల్లిదండ్రులు రాముల మ్మ, రామారావు తమ బిడ్డ సాధించిన విజయూలను వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థా యి క్రీడల్లో వచ్చిన పతకాలను, ధ్రువీకరణ పత్రాలను చూపించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ 2005 నుంచి సంతోషి వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించడం అభినందించదగ్గ విషయమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థారుులో పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. సంతోషి ప్రతిభ అంతా తల్లిదండ్రులకే దక్కుతుందన్నారు. సంతోషి ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వివిధ స్థారుులో నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనేం దుకు అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వం తరఫున అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం గ్రామంలో వెయిట్‌లిఫ్టర్లు సాధన చేసే వ్యాయూమ శాలను మంత్రి సందర్శించారు. సంతోషికి శిక్షణ ఇస్తున్న కోచ్ చల్లా రాముతో మాట్లాడారు. శిక్షణలో ఎదురయ్యే సమస్యలను కోచ్ మంత్రికి వివరించారు. సాధన చేసేందుకు వ్యాయూమశాల కూడా గ్రామంలో లేదన్నారు. క్రీడా పరికరాలు కూడా తామే సొంత డబ్బుతో కొనుగోలు చేస్తున్నామని పలువురు క్రీడాకారు లు మంత్రి వద్ద వాపోయూరు. స్పందించిన మంత్రి మల్టీజిమ్‌ను, వ్యాయూమశాలకు అవసరమయ్యే భవనాన్ని మంజూరు చేస్తానని హామీనిచ్చారు. మంత్రి వెంట అధికారులు కృష్ణమోహన్, రవీంద్రకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు ఉన్నారు. సంతోషికి పెనుమత్స అభినందనలు నెల్లిమర్ల: కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన సంతోషిని తమ పార్టీ తరఫున అభినందిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు చెప్పారు. విలేకరులతో శనివారం మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఇప్పటికే పలు పతకాలు సాధించిన సంతోషి మరోసారి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి సత్తా చాటిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కోచ్ చల్లా రాము, తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కూడా అభినందించారు. అభినందనల వెల్లువ విజయనగరం మున్సిపాలిటీ : స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశం నుంచి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన తెలుగు తేజం మత్స సంతోషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో 53 కిలోల విభాగంలో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలు, స్నాచ్ లో 83 కేజీలు బరువులు ఎత్తి కాంస్య పతకం దక్కించుకు న్న విషయం విదితమే. సంతోషి సాధించిన ఘనత ద్వారా జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటాయని పలు క్రీడాసంఘాలు అభినందనలు వ్యక్తం చేస్తున్నాయి. సంతోషికి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు, వల్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు వల్లూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన సాధూరావు, కార్యదర్శి అట్టాడ లక్ష్మున్నాయుడుతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతి నిధులు, క్రీడాభిమానులు ఉన్నారు. వ్యాయూమశాల పూర్తికి నిధులిస్తాం.. నెల్లిమర్ల : వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లయిన కొండ వెలగాడలో నిర్మాణంలో ఉన్న వ్యాయామశాలను పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హామీనిచ్చారు. కామన్వెల్త్ క్రీడల్లో గ్రామానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం సాధించిన సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం సత్కరించారు. కొండవెలగాడలోని సంతోషి స్వగృహానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొండవెలగాడలోని వ్యాయామశాల నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో సంతోషి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీలక్ష్మి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, యడ్ల రమణమూర్తి, ఆదిరాజు పాల్గొన్నారు. -
కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సంతోషి
న్యూఢిల్లీ: తెలుగు తేజం, భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి.. కామన్వెల్త్ , ఆసియా క్రీడల్లో పాల్గొనే జాతీయ జట్టుకు ఎంపికైంది. శుక్రవారం పురుషులు, మహిళల జట్లను ప్రకటించిన భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సెలక్షన్ కమిటీ రెండు ఈవెంట్లకూ సంతోషిని ఎంపిక చేసింది. భారత్ తరఫున ఏడుగురు మహిళా వెయిట్ లిఫ్టర్లు బరిలోకి దిగుతున్న ఈ పోటీల్లో సంతోషి 53 కేజీల కేటగిరిలో పాల్గొననుంది. ఎనిమిది మంది గల పురుషుల జట్టుకు కె.రవికుమార్ సారథ్యం వహించనున్నాడు. ఇక యువ క్రీడాకారుడు రాగాల వెంకట రాహుల్ యూత్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. చైనాలోని నంజింగ్‌లో ఆగస్టు 16 నుంచి 28 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.