దెయ్యం హ్యాక్‌ చేస్తే? | Hacked by Devil movie teaser released | Sakshi
Sakshi News home page

దెయ్యం హ్యాక్‌ చేస్తే?

Published Fri, Dec 23 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

దెయ్యం హ్యాక్‌ చేస్తే?

దెయ్యం హ్యాక్‌ చేస్తే?

సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లను హ్యాక్‌ చేయడం కామన్‌.. కానీ, దెయ్యాలు హ్యాక్‌ చేస్తే?  ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాక్‌డ్‌ బై డెవిల్‌’. మేఘన, సంతోషి, సల్మాన్‌ ముఖ్య పాత్రల్లో కృష్ణకార్తీక్‌ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌ వై. నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత రామసత్యనారాయణ రిలీజ్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టెక్నికల్‌ విభాగంలో పని చేసిన నన్ను, నా కథను నమ్మి ఉదయ్‌భాస్కర్‌ నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు’’ అన్నారు.

‘‘ఈ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు నిర్మిస్తాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. జనవరి 1న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ఉదయ్‌భాస్కర్‌ చెప్పారు.. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్‌ యం.యం, కెమేరా: కన్నాకోటి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌గౌడ్‌ .వై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement