Hacked by Devil
-
రిజల్ట్ కోసం వెయిటింగ్
మేఘన, సంతోషి, సల్మాన్ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్‌బిడి). ఉదయ్‌భాస్కర్. వై నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కృష్ణకార్తీక్ మాట్లాడుతూ– ‘‘హెచ్‌బిడి’ నా మొదటి సినిమా. చాలా ఉద్వేగంతో ఉన్నా. పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కృష్ణకార్తీక్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆయనకి ఇది తొలి చిత్రమైనా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు నిర్మాత ఉదయ్‌భాస్కర్. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు టి.రామ సత్యనారాయణ, రాజ్ కందుకూరి, సాయి వెంకట్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గౌడ్ వై. -
దెయ్యం హ్యాక్ చేస్తే..!
మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హెచ్.బి.డి.’ (హ్యాక్డ్ బై డెవిల్). కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో వై.ఉదయ్ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘పక్కా థ్రిల్లర్ మూవీ ఇది. చిన్న నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తే సినీ పరిశ్రమ ఎంతో చిన్నదైపోతుంది. చిన్న చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈ నెల 25న మా బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమవుతుంది’’ అన్నారు. ‘‘మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన కథతో చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్.బి.డి. తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. నా రెండో సినిమా కూడా ఈ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు కృష్ణకార్తీక్. సంగీత దర్శకుడు మహి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
దెయ్యం హ్యాక్ చేస్తే?
సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను హ్యాక్ చేయడం కామన్.. కానీ, దెయ్యాలు హ్యాక్ చేస్తే? ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ వై. నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత రామసత్యనారాయణ రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టెక్నికల్ విభాగంలో పని చేసిన నన్ను, నా కథను నమ్మి ఉదయ్‌భాస్కర్ నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు నిర్మిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జనవరి 1న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ఉదయ్‌భాస్కర్ చెప్పారు.. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమేరా: కన్నాకోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్‌గౌడ్ .వై