దెయ్యం హ్యాక్‌ చేస్తే..! | HBD (Hacked By Devil) Movie Press Meet | Sakshi
Sakshi News home page

దెయ్యం హ్యాక్‌ చేస్తే..!

Published Mon, Nov 20 2017 12:23 AM | Last Updated on Mon, Nov 20 2017 12:23 AM

HBD (Hacked By Devil) Movie Press Meet  - Sakshi

మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హెచ్‌.బి.డి.’ (హ్యాక్డ్‌ బై డెవిల్‌). కృష్ణ కార్తీక్‌ దర్శకత్వంలో వై.ఉదయ్‌ భాస్కర్‌ నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఉదయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘పక్కా థ్రిల్లర్‌ మూవీ ఇది. చిన్న నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తే సినీ పరిశ్రమ ఎంతో చిన్నదైపోతుంది. చిన్న చిత్రాలను అందరూ ఎంకరేజ్‌ చేయాలి.

ఈ నెల 25న మా బ్యానర్‌లో మరో కొత్త సినిమా ప్రారంభమవుతుంది’’ అన్నారు. ‘‘మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన కథతో చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్‌.బి.డి. తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. నా రెండో సినిమా కూడా ఈ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు కృష్ణకార్తీక్‌. సంగీత దర్శకుడు మహి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వినయ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement