Himaja
-
కాంబోడియాలోని అతిపెద్ద దేవాలయంలో నటి హిమజ (ఫొటోలు)
-
దెయ్యం హ్యాక్ చేస్తే..!
మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హెచ్.బి.డి.’ (హ్యాక్డ్ బై డెవిల్). కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో వై.ఉదయ్ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘పక్కా థ్రిల్లర్ మూవీ ఇది. చిన్న నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తే సినీ పరిశ్రమ ఎంతో చిన్నదైపోతుంది. చిన్న చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈ నెల 25న మా బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమవుతుంది’’ అన్నారు. ‘‘మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన కథతో చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్.బి.డి. తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. నా రెండో సినిమా కూడా ఈ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు కృష్ణకార్తీక్. సంగీత దర్శకుడు మహి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
సందేశంతో...
హిమజ, గిడ్డేష్, గంట మ్రోగిన రవితేజ ముఖ్య పాత్రల్లో స్వీయ దర్శకత్వంలో బాబ్జీ నిర్మిస్తున్న చిత్రం ‘వేట కొడవళ్ళు’. బుధ వారం ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు నరేశ్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ నటి జయసుధ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం బాబ్జీ మాట్లాడుతూ -‘‘ఆలనా పాలనా లేక కొంతమంది అనాథ పిల్లలు వ్యతిరేక శక్తులతో చేరి, వేటకొడవళ్లుగా మారుతున్నారు. ఈ అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, సందేశాత్మక చిత్రంగా తీసుకున్నాను’’ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయని చిత్ర సంగీత దర్శకుడు గజ్వేల్ వేణు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హనుమంతరావు యస్, సహనిర్మాత: ఎన్.పి. సుబ్బారాయుడు. -
నావన్నీ కోతి పనులే..
హిమజ, యాంకర్, నటి విజయవాడలో అమ్మమ్మ వాళ్లింట్లో పుట్టాను. చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే పెరిగాను. అన్నయ్య మాత్రం అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగాడు. నాన్న ఆర్టీసీలో మేనేజర్. అమ్మ హౌస్‌వైఫ్. నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి. హాలీడేస్‌లో అన్నయ్య హైదరాబాద్ రాగానే ఎంతో ఎగ్జైట్ అయ్యేదాన్ని. ఒకసారి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు సడన్‌గా కనిపించకుండా పోయాను. అప్పుడంతా నా కోసం ఊరంతా వెతికారు. ఒకచోట టెంట్ వేసి ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడి వరకు వెతుక్కుంటూ వస్తే, అక్కడ దొరికాను. విషయమేమిటంటే, నేను పెద్ద ఫుడీని. ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ వాలిపోయేదాన్ని. చదువు విషయానికొస్తే, లాస్ట్ బెంచర్స్ వరస్ట్ బ్యాచ్‌కి లీడర్ని. క్లాస్రూమ్ లో అందరి బాక్సుల్లోని లంచ్ కొంచెం కొంచెం తినేసేదాన్ని. స్పోర్ట్స్‌లో కబడ్డీ, టెన్నికాయ్ చాలా ఇంటరెస్ట్. చిన్నప్పుడు.. ఆదిత్య 369లో లాగా ఒక టైమ్ మెషిన్ తయారు చేసేయాలని అనుకునేదాన్ని. అయితే, నావన్నీ కోతి పనులే కదా! మా ఇంటి చుట్టుపక్కల ఎవరి పెళ్లి బారాత్ జరిగినా, తీన్మార్ బ్యాండు వినిపిస్తే చాలు, వెంటనే డ్యాన్స్ చేయడానికి వెళ్లిపోయేదాన్ని. ఇంట్లో చెప్పకుండా ఆడిషన్‌కి వెళ్లా.. ఎంబీఏ వరకు చదివి అమీర్‌పేటలోని మైత్రీవనంలో జావా, ఒరాకిల్ వంటి కోర్సులన్నీ చేశా. నాకు నటనంటేనే ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా..ఓసారి మయూరి ఆఫీసుకి వెళ్లి ఆడిషన్ ఇచ్చి వచ్చాను. రెండు రోజుల్లోనే ఫోన్ కాల్.. ‘భార్యామణి’ సీరియల్లో హీరోయిన్గా సెలక్ట్ అయ్యానని.. అలా స్వయంవరం సీరియల్లో, టీవీ షోస్‌లో అవకాశాలు వచ్చాయి. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్లో లీడ్ రోల్ చేస్తూ, ‘ద బెస్ట్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయుర్-2014’గా ఎంపికయ్యాను. తాటాకు టపాకాయలు కాల్చేదాన్ని.. మేం హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎల్బీ నగర్లో ఉండేవాళ్లం. దీపావళికి తాటాకు టపాకాయలు బాగా కాల్చేదాన్ని. ఇప్పుడు నన్ను చూసుకుని మా పేరెంట్స్ ఎంతో గర్వపడుతున్నారు. సంప్రదాయంగా ఉండటానికే ఇష్టపడతాను. సాయిబాబాను అనుక్షణం నమ్ముతాను. నా డ్రెసెస్ నేనే డిజైన్ చేసుకుంటాను. ఇక హైదరాబాద్ సిటీ అంటే, నాకు నా తండ్రి అంత భరోసా. యాక్టింగ్‌కి, కెరీర్‌కి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ అని భావిస్తాను. - చల్లపల్లి శిరీష