సందేశంతో... | veta kodavali movie shooting Started | Sakshi
Sakshi News home page

సందేశంతో...

Published Wed, Jan 7 2015 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

సందేశంతో...

సందేశంతో...

 హిమజ, గిడ్డేష్, గంట మ్రోగిన రవితేజ ముఖ్య పాత్రల్లో స్వీయ దర్శకత్వంలో బాబ్జీ నిర్మిస్తున్న చిత్రం ‘వేట కొడవళ్ళు’. బుధ వారం ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు నరేశ్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ నటి జయసుధ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం బాబ్జీ మాట్లాడుతూ -‘‘ఆలనా పాలనా లేక కొంతమంది అనాథ పిల్లలు వ్యతిరేక శక్తులతో చేరి, వేటకొడవళ్లుగా మారుతున్నారు. ఈ అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, సందేశాత్మక చిత్రంగా తీసుకున్నాను’’ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయని చిత్ర సంగీత దర్శకుడు గజ్వేల్ వేణు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హనుమంతరావు యస్, సహనిర్మాత: ఎన్.పి. సుబ్బారాయుడు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement