కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సంతోషి | Commonwealth Games, Asian Games Santoshi | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సంతోషి

Published Sat, Jun 7 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

Commonwealth Games, Asian Games Santoshi

న్యూఢిల్లీ: తెలుగు తేజం, భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి.. కామన్వెల్త్ , ఆసియా క్రీడల్లో పాల్గొనే జాతీయ జట్టుకు ఎంపికైంది. శుక్రవారం పురుషులు, మహిళల జట్లను ప్రకటించిన భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సెలక్షన్ కమిటీ రెండు ఈవెంట్లకూ  సంతోషిని ఎంపిక చేసింది.
 
 భారత్ తరఫున ఏడుగురు మహిళా వెయిట్ లిఫ్టర్లు బరిలోకి దిగుతున్న ఈ పోటీల్లో సంతోషి 53 కేజీల కేటగిరిలో పాల్గొననుంది. ఎనిమిది మంది గల పురుషుల జట్టుకు కె.రవికుమార్ సారథ్యం వహించనున్నాడు. ఇక యువ క్రీడాకారుడు రాగాల వెంకట రాహుల్ యూత్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. చైనాలోని నంజింగ్‌లో ఆగస్టు 16 నుంచి 28 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement