weight lifter
-
జాతీయ స్థాయిలో సత్తా చాటిన సినీ నటి ప్రగతి
టాలీవుడ్లో యంగ్ హీరోలకు తల్లి పాత్రలో ఎవరు సెట్ అవుతారు అని అడిగితే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రగతి. ఇండస్ట్రీలో మొదట హీరోయిన్‌గానే ఆమె జర్నీ ప్రారంభమైంది. హీరోయిన్గా భారీగా అవకాశాలు వస్తున్నప్పుడు సినిమాలకు కొన్నేళ్ల పాటు బ్రేక్ ఇచ్చారు ప్రగతి. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరో, హీరోయిన్లకు తల్లి, వదిన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ప్రగతి ట్రెండింగ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు చూసిన యంగ్‌స్టర్స్ ఆశ్చర్యపోతున్నారు. (ఇదీ చదవండి: చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడు..మన్సూర్ సంచలన వాఖ్యలు!) ప్రస్తుతం 48 ఏళ్ల వయసుకు రీచ్ అయిపోయిన ప్రగతి జిమ్‌లో సుమారు 80 కేజీల బరువును కూడా సునాయసంగా ఎత్తి పక్కనపడేస్తుంది. సినిమాలో చాలా సాఫ్ట్‌గా కనిపించే ప్రగతి రియల్ లైఫ్‌లో ఇంత హార్డ్ కోర్ వెయిట్ లిఫ్టర్‌గా చూసి ఆడియన్స్ కూడా అవాక్కయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరిగింది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో సినీ నటి ప్రగతి కూడా పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రొఫెషనల్‌గా ట్రైన్ అయిన వారు బరిలో ఉన్నారు. అయినప్పటికీ ప్రగతి ఏ మాత్రం తగ్గకుండా వారికి గట్టిపోటీని ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంస్య పతకం సాధించి తన సత్తా ఎంటో అందరికీ చాటి చెప్పారు. బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలు జరిగాయి. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఛాంపియన్ అంటూ ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
సిక్కోల్ సింగం..కరణం మల్లేశ్వరి గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం
కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో సిక్కోలుకు ఓ మైలురాయి చూపించారు. మళ్లీ ఆ గమ్యాన్ని అందుకోగల వారి కోసం ఎదురు చూస్తుంటే.. అందరికీ కనిపించిన ఆశా కిరణం పూజారి శైలజ. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ప్రతిభావంతురాలి ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఫామ్ కోల్పోవడం, డోపింగ్ ఆరోపణలు ఎదుర్కోవడం, నిషేధం పూర్తయ్యాక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆమె సాధించిన విజయాలు మరుగున పడిపోయాయి. ఎట్టకేలకు ఆమెకు వైఎస్ జగన్ సర్కారు న్యాయం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగుర వేసిన శైలజకు శాప్‌లో కోచ్‌గా ఉద్యోగం ఇచ్చింది. శ్రీకాకుళం న్యూకాలనీ: పదేళ్ల కిందటి వరకు పూజారి శైలజ అంటే ఓ పాపులర్ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్‌లో కాంస్య పత కం సాధించిన కరణం మల్లేశ్వరికి సరితూగే క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్, జూనియర్ ఏషియన్ గేమ్స్ వంటి పోటీల్లో బంగారు పతకాలతో మోత మోగించారు. ఆ తర్వా త ఎందుకో ఆటలో ఆమె వెనుకబడిపోయారు. దీనికి తోడు అనూహ్యంగా డోపింగ్ ఆరోపణలతో జీవితం తల్లకిందులైపోయింది. శైలజపై ఉన్న బ్యాన్ (నిõÙధం) ఎత్తేసినా ఆమె పరిస్థితి మాత్రం మారలేదు. అంతకుముందు ఉన్న గుర్తింపు మొత్తం తుడి చిపెట్టుకుపోయింది. గత ప్రభుత్వ పెద్దల ముందు కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కరుణించలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెకు న్యాయం చేశారు. శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌గా నియమించారు. దీంతో తన నిరీక్షణ ఫలించిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెత్తిపై డోపింగ్ బరువు.. 2006 కామన్ వెల్త్ అనంతరం క్రీడాకారులకు జరిపిన డోపింగ్ పరీక్షల్లో పూజారి శైలజ పాజిటివ్ అని తేలడంలో ఆమె ఆట తలకిందులైంది. అయితే తా ను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె ఫెడరేషన్ ముందు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. జీవితకాలంలో నిషేధం విధించారు. వాస్తవానికి గేమ్‌లో జీవితకాల నిషేధమంటే ఏడేళ్లే. ఆ తర్వాత ఆట ప్రారంభిద్దామని శైలజ భావించినా కుటుంబ నేపథ్యం, చిన్నపిల్లల పోషణ, ఆర్థిక కష్టాల వల్ల ఈ బరువును ఎత్తలేకపోయారు. చిన్నప్పుడే తండ్రి మృతి చెందడం, వివాహం తర్వాత తల్లి చనిపోవడం, అనంతరం కోవిడ్‌తో భర్త దూరం కావడంతో ఒంట రిగా పిల్లలతో కాలం గడుపుతున్న శైలజకు ఇన్నాళ్లకు సరైన న్యాయం జరిగింది. గత ప్రభుత్వాల పె ద్దలు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కలిసినా ప్ర యోజనం లేకపోయిందని శైలజ ఇప్పటికే పలు మార్లు వాపోయారు. ఆమె నిరీక్షణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెరదించారు. శాప్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. విశాఖపట్నంలోని డీఎస్‌ఏలో గ్రేడ్–3 కోచ్ పోస్టులో నియమించారు. వంజంగి నుంచి కామన్వెల్త్కు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వంజంగి గ్రామానికి చెందిన పూజారి సీతారాం, అమ్మాజమ్మ దంపతులకు జని్మంచింది పూజారి శైలజ. 1996లో వెయిట్‌లిఫ్టింగ్ గేమ్ మొదలుపెట్టిన శైలజ జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి ఇండోర్ స్టేడియంలో ఓనమాలు నేర్చుకున్నారు. అలాగే ఊసవానిపేట వ్యా యామ శాలలో శిక్షణ పొందారు. ఏలూరు సాయ్ అకాడమీలో శిక్షణ పొందారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. పోటీల్లో దిగితే బంగారు పతకాన్ని ముద్దాడే శైలజ ప్రతిభను గుర్తించిన నాటి వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ, అసోసియేషన్ ప్రతినిధులు మరింత ఉన్నతంగా శిక్షణను అందించడం మొదలుపెట్టారు. - 1996–97లలో మధురైలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. - 1998లో హైదరాబాద్‌లో జరిగిన ఇండిపెండెంట్ గోల్డ్ కప్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించారు. - అదే ఏడాది కోల్‌కతాలో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. - అదే ఏడాది బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. - 1999లో కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన సదరన్ స్టేట్ గేమ్స్‌లో పసిడి పతకాన్ని సాధించారు. - 2000లో మైసూరులో జరిగిన దక్షిణ భారత క్రీడా పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించారు. - 2002లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో మూడు బంగారు పతకాలను సాధించారు. - 2005లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. - 2006 వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 బంగారు, ఒక రజత పతకం, జాతీయస్థాయిలో 26 బంగారు పతకాలు గెలిచారు. తర్వాత అనేక రాజకీయాల నడుమ ఒలింపిక్స్‌లో పాల్గొనే బర్త్ ను కోల్పోయారు. అయితే ఒలింపిక్స్ రికార్డుల ను జాతీయస్థాయిలోనే బద్దలుగొట్టి ‘ఇండియన్ స్ట్రాంగెస్ట్ ఉమెన్‘గా శైలజ పేరు సంపాదించారు. జగనన్నను కలిశాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న సీఎం జగనన్నను కలిశాను. నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగంలో నియమించి, కోచ్‌గా అవకాశం కల్పించారు. విశాఖపట్నం డీఎస్‌ఏలో గ్రేడ్–3 కోచ్ పోస్టును కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. జగనన్నకు రుణపడి ఉంటాను. దశాబ్దంన్నర పాటు నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. – పూజారి శైలజ, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్, శ్రీకాకుళం -
రియల్ ‘బాహుబలి’.. కటౌట్ చూసి నమ్మేయాల్సిందే!
కటౌట్ చూసి కొన్ని నమ్మేయాల్సిందే. ఈ ఫొటోలో కన్పిస్తున్న బలశాలి నిజంగానే ‘బాహుబలి’. బరువులు ఎత్తడంలో మనోడిని మించినోడు లేడంటే నమ్మాల్సిందే. ఇతగాడి పేరు చీక్ అహ్మద్ అల్ హసన్ అలియాస్ ఐరన్ బిబీ. ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా పేరు పొందాడీ బాడీ బిల్డర్. ఏదో అషామాషీగా కాదు వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి అత్యంత బలశాలిగా నిరూపించుకున్నాడు. జెయింట్స్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఏకంగా 229 కేజీల బరువును ఎత్తి ‘ఔరా’ అనిపించాడు. అయితే ఇక్కడితో ఐరన్ బిబీ ఆగడం లేదు. మున్ముందు 300 కేజీల బరువు ఎత్తేందుకు రెట్టించిన ఉత్సాహంతో శ్రమిస్తున్నాడు. బుర్కినా ఫసో దేశానికి చెందిన ఐరన్ బిబీ పుట్టుకతోనే బాహుబలి. పుట్టినప్పుడే దాదాపు 5 కిలోల బరువు ఉన్నాడట. 1992లో అమ్మ కడుపు నుంచి భూమి మీదకు వచ్చాడు. చిన్నతనం నుంచే ‘ఫ్యాట్ బాయ్’గా పెరిగిన ఐరన్ బిబీ.. స్పింటర్ కావాలని అనుకున్నాడట. స్కూల్లో తాను పరిగెత్తేటప్పుడు తోటి విద్యార్థులు నవ్వేవారని, తనను హేళన చేసేవారని ఐరన్ బిబీ వెల్లడించాడు. (చదవండి: కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!) ‘ఆ సమయంలో నన్ను నేను అసహ్యించుకునే వాడిని. మా క్లాస్‌లో నేనే చిన్నవాడిని అయినా అందరికంటే నాలుగేళ్లు పెద్దోడిలా కనిపించే వాడిని. మా అన్నయ్యల కంటే కూడా పెద్దోడిలా అనిపించేవాడిని. అన్నివైపుల నుంచి అవహేళనలు ఎదుర్కొంటూ ఒక దశలో నిరాశలో కూరుకుపోయాను. అయితే అథ్లెట్ కావాలన్నా నా కలను మాత్రం వదులుకోలేదు. 17 ఏళ్ల వయసులో 2009లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లడంతో నా జీవితం మలుపు తిరిగింద’ని ఐరన్ బిబీ చెప్పాడు. 2013లో మొదటిసారిగా పవర్ లిప్టింగ్ పోటీల్లోకి దిగిన ఐరన్ బిబీ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా ఖ్యాతికెక్కాడు. తన సోదరులు ముద్దుగా ‘బిబీ’ అని పిలిచేవారని.. పవర్ లిప్టింగ్లో సత్తా చాటడంతో ఐరన్ బిబీగా పాపులర్ అయినట్టు ఈ ‘బాహుబలి’ వెల్లడించాడు. ఇంతకీ బుర్కినా ఫసో దేశం ఎక్కడుందనే కదా మీ డౌటు. పశ్చిమ ఆఫ్రికాలో ఉంది ఈ దేశం. (చదవండి: వామ్మో! ఒక్క ద్రాక్ష పండు రూ.33 వేలంట..) -
మహా బలశాలి మొబ్బన్న కన్నుమూత
నందికొట్కూరు: కర్నూలు జిల్లాకు చెందిన మహా బలశాలి సజ్జల మొబ్బన్న (72) అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని నాగటూరు ఆయన స్వగ్రామం. మొబ్బన్న బరువులు ఎత్తడంలో తనకు తానే సాటి. సంద, గుండు, ఇరుసు ఎత్తడంలో మొనగాడని పేరుంది. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు తొలుత గ్రామాల్లో జరిగే తిరుణాళ్లలో ప్రదర్శనలిచ్చేవారు. భారీ బరువులను అలవోకగా ఎత్తి అందర్నీ ఆశ్చర్య పరిచేవారు. పేద కుటుంబంలో పుట్టిన మొబ్బన్న జీవనాధారం వ్యవసా యం. తనకున్న రెండెకరాల పొలాన్ని ఎద్దులు లేకుండా ఆయనే దుక్కి దున్నేవారని గ్రామస్తులు చెబుతారు. బరువులు ఎత్తడంలో ఆయన అసా మాన్య ప్రతిభను గుర్తించిన గ్రామస్తులు ప్రోత్సహించడమే కాకుండా ఆయన ఆహారానికయ్యే ఖర్చును సైతం గ్రామస్తులే పెట్టుకుని పోషించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా మొబ్బన్నకు తిరుగుండేది కాదు. ఏకంగా 360 కిలోల గుండు ఎత్తి రికార్డు సృష్టించారు. ఐదు పదుల వయస్సు వచ్చే వరకు మొబ్బన్న అనేక పోటీల్లో పాల్గొన్నారు. ఆవిధంగా ఇప్పటివరకు 960 వెండి పతకాలు, 60 బంగారు పతకాలు సాధించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వారెవ్వా ! అలంకృత... ఇదే వరల్డ్ రికార్డ్
-
వారెవ్వా ! అలంకృత... ఇదే వరల్డ్ రికార్డ్
సాక్షి, వెబ్‌డెస్క్: సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్‌కి ఏకైక పతకాన్ని అందించిన ఘనత కరణం మల్లేశ్వరీ సొంతం. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు మీరాచాను ఈ ఫీట్ సాధించింది. ఇప్పుడు వాళ్లకీ వారసురాలు మన భాగ్యనగరంలో రెడీ అవుతోంది. బుడిబుడి అడుగులు వేసే వయసులోనే భారీ బరువులు సునాయాసంగా లేపుతోంది. పాలబుగ్గల వయసులోనే వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. వరల్డ్ రికార్డ్ హైదరాబాద్ నగరానికి చెందిన సందీప్, సాయి స్నిగ్ధబసు దంపతుల ముద్దు బిడ్డ సాయి అలంకృత కేవలం 20 నెలల వయసులోనే సంచలనాలు సృష్టిస్తోంది. తోటి పిల్లలెవరికీ సాధ్యం కాని రీతిలో బరువులను ఎత్తుతోంది. పాపలోని టాలెంట్‌ని గమనించిన తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెలోని ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. దీంతో అతి చిన్న వయసులో ఎక్కువ బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకుంది. ఏడాది వయస్సులోనే ఏడాది వయస్స ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న టూ లీటర్స్ వాటర్ బాటిల్‌ని సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచింది. అప్పటి నుంచి పాపలోని స్పెషల్ ట్యాలెంట్‌ని తల్లిదండ్రులు గమనిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో 4.2 కేజీల బరువు ఉన్న వాటర్ మిలాన్‌ని పదిహేడు నెలల వయస్సులో ఎత్తింది, ఇప్పుడు 20 నెలల వయస్సులో 5 కేజీల బరువును ఎత్తడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. 6 కేజీలు ఎత్తగలదు - సందీప్ (తండ్రి) బరువులు ఎత్తడంలో పాపకు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి, ఆమెకు స్పెషల్ డైట్ అందిస్తున్నాం. పాపకు ఇప్పుడు 20 నెలలు, ఈ వయసు పిల్లలు కేజీ వరకు బరువులే అతి కష్టంగా ఎత్తగలరు. ఇప్పటి వరకు 4 ఏళ్ల బాబు 3 కేజీలు ఎత్తడమే వరల్డ్ రికార్డ్. అలంకృత ఇప్పుడు 6 కేజీల వరకు బరువును ఎత్తగలుగుతోంది. మేము 5 కేజీల బరువు ఎత్తిన వీడియోనే రికార్డు పరిశీలనకు పంపించాం. సంతోషంగా ఉంది - సాయి స్నిగ్ధబసు (తల్లి) ఏడాది వయసులో పాపలోని స్పెషల్ టాలెంట్‌ని గుర్తించి గమనిస్తూ వచ్చాం. ఈ రోజు మా పాప టాలెంట్‌ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించడంతో సంతోషంగా ఉంది. స్పెషల్ టాలెంట్ ఉన్న పిల్లలను ప్రోత్సహించాలి. -
నాడు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్.. నేడు కూలీ
భువనేశ్వర్ : తాను బరువులెత్తి దేశం పరువు పెంచాడు ఆ ఆదివాసీ యువకుడు. ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు సాగి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలనుకున్నాడు. అయితే బంగారు పళ్లానికైనా గోడ చేర్పు ఉండాలన్న సామెతలా తయారైంది ఓ అంతర్జాతీయ క్రీడాకారుడి పరిస్థితి. ఆ క్రీడాకారుడు ఎంతటి ప్రతిభ సాధించినప్పటికీ ప్రోత్సాహం లభించక మరుగున పడిపోతున్నాడు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన క్రీడాకారుడికి ప్రభుత్వ ప్రోత్సాహం, ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతం రోజుకూలీగా మారి జీవనం సాగిస్తున్నాడు. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి తెలరి గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు అరుణ శాంత దేశం తరఫున అంతర్జాతీయ పోటీలలో మూడు సార్లు పాల్గొని రెండు గోల్డ్‌మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడు. అంతే కాకుండా రాష్ట్ర, జాతీయ అనేక పతకాలు గెలుపొంది ఖ్యాతి గడించాడు. దేశం కోసం ఆడి గౌరవం తెచ్చిపెట్టిన అరుణ శాంత నేడు రోజు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఒలంపిక్స్‌లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్న అరుణశాంతకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఒలంపిక్స్ ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా నేడు భుజాన గొడ్డలి వేసుకుని కూలి పనికి వెళ్తున్నాడు. కూలి దొరికిన రోజున కుటుంబం ఆకలి తీరుతుంది. లేనప్పుడు అర్ధాకలితో ఉండాల్సిందే. అరుణ శాంత ఉమ్మరకోట్‌లో 7 వ తరగతి వరకు చదివి అనంతరం బరంపురం స్పోర్ట్స్ స్కూల్లో చేరి వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందాడు. ప్రభుత్వం గుర్తిస్తే మరిన్ని విజయాలు శిక్షణ అనంతరం రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు. 2012లో మయన్మార్‌లో జరిగిన ఏషియన్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించాడు. అదే ఏడాది జరిగిన ఆసియా దేశాల కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం గెలిచి సత్తా చాటాడు. అలాగే జాతీయ స్థాయిలో ఢిల్లీ, బెంగళూరు, మహారాష్ట్రలలో జరిగిన పోటీలలో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు. బహుళ ఆదివాసీ ప్రాంతంలో పుట్టి వెయిట్ లిఫ్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అరుణ శాంతకు ఇప్పటికైనా ప్రభుత్వం చేయూత అందిస్తే మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలడనడంలో సందేహం లేదు. ఒలంపిక్స్‌లో విజయం లక్ష్యం ఒలంపిక్స్ పోటీలలో ఆడి దేశానికి పేరు తేవాలని ఉంది. అయితే అందుకు అవకాశాలు కనిపించడం లేదు. నన్ను ప్రభుత్వం గుర్తించక పోవడం విచారకరం. వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆశక్తి వల్ల ఎక్కువగా చదువుకోలేకపోయాను. ప్రభుత్వం తగిన సహాయం అందిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఉంది. –అరుణ శాంత, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు -
సంజితకు ‘అర్జున’ ఖాయం
న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు న్యాయం జరుగనుంది. ఇటీవలే ఆమెను నిర్దోషిగా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ప్రకటించగా... డోపింగ్ ఆరోపణల కారణంగా తనకు ఇన్నాళ్లూ దూరమైన అర్జున అవార్డు ఆమె చెంత చేరనుంది. 2018 ఏడాదికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 2018 ఏడాదికి సంజిత ‘అర్జున’ను పొందనుందని ఆయన వెల్లడించారు. 2018 మే నెలలో డోపింగ్ ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆగస్టులో సంజిత దాఖలు చేసిన ఫిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు... అవార్డు నామినీల కేటగిరీలో సంజిత దరఖాస్తును పరిశీలించాలని అవార్డుల కమిటీని కోరింది. తమ తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో భద్రపరచాలని సూచించిన హైకోర్టు ఆమె నిర్దోషిగా బయటపడినపుడు దాన్ని బయటపెట్టాలని పేర్కొంది. -
స్వర్ణం నెగ్గిన మీరాబాయి చాను
దోహ: భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఖతర్ ఇంటర్నేషనల్ కప్‌లో సత్తా చాటింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో బరిలో దిగిన ఆమె 194 (83+111) కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. మొదట స్నాచ్‌లో 83 కేజీలు ఎత్తిన మీరా... క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలను ఎత్తింది. అనైస్ మిచెల్ (ఫ్రాన్స్–172 కేజీలు), మనోన్ లోరెంజ్ (165 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్లో మీరాబాయి ఎత్తిన 201 కేజీల ప్రదర్శన అత్యుత్తమం కాగా... ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ సిల్వర్ లెవల్ ఈవెంట్ అయిన ఈ టోరీ్నలో గెలుపుతో సాధించిన పాయింట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో మీరాబాయికి కీలకం కానున్నాయి. -
ఐదుగురు లిఫ్టర్లు డోపీలు
సాక్షి, భువనేశ్వర్: భారత వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోయారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న ఐదుగురు డోపీల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్, ఒడిశాకు చెందిన కత్తుల రవికుమార్ ఉన్నాడు. 2010లో బంగారం నెగ్గిన రవి... 2014లో రజతం గెలిచాడు. అతనితో పాటు జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో వీరంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. స్టార్ లిఫ్టర్ రవి ‘ఒస్టారిన్’ అనే ఉత్ప్రేరకం తీసుకున్నాడు. ఇది కండరాల శక్తిని పెంచేది. విశాఖపట్నంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అతనికి నిర్వహించిన పరీక్షల్లో దొరికిపోవడం జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ వర్గాల్ని కలవరపరిచింది. అయితే ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది. -
మీరాబాయి చానుకు స్వర్ణం
న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఘనమైన ప్రదర్శన నమోదు చేసింది. థాయిలాండ్‌లో జరిగిన ఈజీఏటీ కప్‌లో ఆమె 49 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. మాజీ ప్రపంచ చాంపియన్ కూడా అయిన చాను వెన్ను నొప్పితో గత ఏడాదిలో దాదాపు ఆరు నెలలు ఆటకు దూరమైంది. తాజా ఈవెంట్లో ఆమె స్నాచ్‌లో 82 కేజీలు, క్లీన్ అండ్లో జర్క్‌లో 110 కేజీలు కలిపి మొత్తం 192 కిలోల బరువెత్తింది. ఈజీఏటీ కప్‌ను ద్వితీయ శ్రేణి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీగా వ్యవహరిస్తారు. ఇక్కడ సాధించే పాయింట్లను వరల్డ్ ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఫలితంగా 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ విజయం చానుకు ఎంతో మేలు చేస్తుంది. -
చీరాలలో సందడి చేసిన వెయిట్ లిఫ్టర్ రాహుల్
-
వెయిట్ లిఫ్టర్ రాహుల్‌కు ఘనస్వాగతం
సాక్షి, గన్నవరం : కామన్వెల్త్ కీడ్రల్లో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌కు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అతడినికి బుధవారం ఉదయం ఏపీ క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ ఉపాధ్యక్షుడు బంగార్రాజు, రాహుల్ కుటుంబీకులు ఘనంగా స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురానికి చెందిన రాహుల్ 85 కిలోల విభాగంలో పసిడి పతకం నెగ్గిన విషయం తెలిసిందే. -
కరెంట్ ఉండదు... వర్షం ఆగదు!
షెడ్డులోనే సాధన ప్రతికూల పరిస్థితుల్లోనూ సంతోషికి పతకాలు సాక్షి, విజయనగరం: ఒక పొలంలో చిన్న షెడ్డు... వర్షం పడితే నిలుచునే అవకాశం లేకుండా కారిపోతుంది. దీనికి తోడు దోమల బెడద... కరెంట్ కూడా ఉండదు. ఇదీ కామన్వెల్త్ క్రీడల్లో రజతపతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి ప్రాక్టీస్ చేస్తున్న వాతావరణం. విజయనగరం జిల్లాలోని కొండవెలగాడలో ఇలాంటి ప్రతికూలతను ఎదుర్కొంటూ కూడా ఆమె అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ గ్రామంలో సంతోషితో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ లిఫ్టర్లు కూడా సాధన చేస్తున్నారు. ‘మాకు కనీస వసతులు కూడా లేవు. మా కోచ్ రాము సార్ పొలంలోనే షెడ్ వేసి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. లిఫ్టింగ్ సెట్లు కూడా సరైనవి లేవు. ఇతర వ్యాయామ పరికరాల గురించి అసలు ఆలోచించనేలేము’ అని సంతోషి చెప్పింది. నాలుగేళ్లుగా ఫలితాలు 2005లో సాధన మొదలు పెట్టాక జూనియర్ స్థాయినుంచి సీనియర్ వరకు సంతోషి ఇప్పటి వరకు 13 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొంది. అయితే 2010 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన అనంతరమే ఆమెకు గుర్తింపు దక్కింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది. ‘ముందుగా కాంస్యంతోనే సంతృప్తి చెందాను. అయితే మొదటి స్థానంలో నిలిచిన అమ్మాయి డోపింగ్‌లో పట్టుబడటంతో నాకు రజతం దక్కడంతో సంతోషం రెట్టింపైంది’ అని ఆమె చెప్పింది. ఆర్థిక సమస్యలు ఉన్నా... సంతోషిది పేదరిక నేపథ్యం. చాలీచాలని సంపాదన ఉన్నా ఆమె తల్లిదండ్రులు ఆటల వైపు ప్రోత్సహించారు. ఇప్పుడు వారి నమ్మకాన్ని ఈ అమ్మాయి నిలబెట్టింది. ‘కుటుంబ సభ్యులతో పాటు కోచ్ రాము అండగా నిలిచారు. మరికొంత మంది దాతలు నాకు సహకారం అందించారు. ఆర్థిక ఇబ్బందుల భారం నాపై పడకుండా ప్రోత్సహించడం వల్లే ఈ రోజు కామన్వెల్త్లో పతకం నెగ్గగలిగాను’ అని సంతోషి భావోద్వేగంతో అంది. భవిష్యత్తుపై ఆశ తాజాగా కామన్వెల్త్ విజయం సంతోషిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో జరిగే ఆసియా క్రీడలతో పాటు ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఒలింపిక్స్‌లో పతకమే నా లక్ష్యం. అయితే అది సులువు కాదు. దానికి కఠోర శ్రమతో పాటు ఫిట్నెస్వంటివి కూడా కీలకం. ప్రాక్టీస్‌కు అంతర్జాతీయ స్థాయి పరికరాలు అవసరం. అయితే అన్ని అడ్డంకులను అధిగమించాలని పట్టుదలగా ఉన్నా’ అని ఆమె పేర్కొంది. ప్రభుత్వం సహకరిస్తుందా..? నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ పతకం సాధించినా ఇప్పటిదాకా ప్రభుత్వం సంతోషిని పట్టించుకోలేదు. ‘తొమ్మిదేళ్ల క్రితమే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు గెలిచాను. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. వేర్వేరు కార్యక్రమాల్లో నాకు ఇది చేస్తాం, అది చేస్తాం అనడమే గానీ నాయకులు, అధికారులు ఎప్పుడూ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడైనా నాకు సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాను’ అని ఈ విజయనగరం అమ్మాయి చెబుతోంది. కామన్వెల్త్ విజయం అనంతరం ఇటీవలే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ. 7.5 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. దీంతో పాటు ఆమె సాధనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే సంతోషికి ఒలింపిక్ పతకం కూడా అసాధ్యం కాబోదు. -
సంతోషికి రూ. 7.5 లక్షలు
ఏపీ ప్రభుత్వ నజరానా విజయనగరంలో ఘన స్వాగతం సాక్షి, విజయనగరం: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ మత్స్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించనుంది. సంతోషికి రూ. 7.50 లక్షల బహుమతి ఇస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. రామారావు ప్రకటించారు. ఈ నెల 8, 9 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ మొత్తం అందిస్తారు. దీంతో పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటి పట్టా కూడా ఇవ్వనున్నట్లు జేసీ వెల్లడించారు. గ్లాస్గోనుంచి తిరిగి వచ్చిన సంతోషికి బుధవారం విజయనగరంలో ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెను సన్మానించారు. పేదరిక నేపథ్యంనుంచి వచ్చినా...పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంతోషి ఘనతను అంతా ప్రశంసించారు. ‘త్వరలో జరిగే సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నాను. ఆ తర్వాత ఒలింపిక్స్‌లోనూ పతకం నెగ్గడమే నా లక్ష్యం. అందుకు ప్రభుత్వంతో పాటు అందరి సహకారం కావాలి’ అని ఈ సందర్భంగా సంతోషి వ్యాఖ్యానించింది. -
కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సంతోషి
న్యూఢిల్లీ: తెలుగు తేజం, భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి.. కామన్వెల్త్ , ఆసియా క్రీడల్లో పాల్గొనే జాతీయ జట్టుకు ఎంపికైంది. శుక్రవారం పురుషులు, మహిళల జట్లను ప్రకటించిన భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సెలక్షన్ కమిటీ రెండు ఈవెంట్లకూ సంతోషిని ఎంపిక చేసింది. భారత్ తరఫున ఏడుగురు మహిళా వెయిట్ లిఫ్టర్లు బరిలోకి దిగుతున్న ఈ పోటీల్లో సంతోషి 53 కేజీల కేటగిరిలో పాల్గొననుంది. ఎనిమిది మంది గల పురుషుల జట్టుకు కె.రవికుమార్ సారథ్యం వహించనున్నాడు. ఇక యువ క్రీడాకారుడు రాగాల వెంకట రాహుల్ యూత్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. చైనాలోని నంజింగ్‌లో ఆగస్టు 16 నుంచి 28 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. -
డోపీలు @ 500
న్యూఢిల్లీ: భారత్‌లో డోపింగ్‌కు పాల్పడుతున్న క్రీడాకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ఈ సంఖ్య 500కు చేరడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఉన్నట్టు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) పేర్కొంది. ఈ రెండు క్రీడాంశాల తర్వాత కబడ్డీ (58), బాడీబిల్డింగ్ (51), పవర్‌లిఫ్టింగ్ (42), రెజ్లింగ్ (41), బాక్సింగ్ (36), జూడో (9)లలో డోపీలు ఉన్నారు. 2009 జనవరి నుంచి జూలై 2013 వరకు 500 మంది అథ్లెట్లు యాంటీ డోపింగ్ నిబంధనలను అతిక్రమించగా వీరిలో 423 మందిపై డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ తగిన చర్యలు తీసుకుంది. ఆర్టీఐ చట్టం కింద నాడా ఈ విషయాలను వెల్లడించింది. డోపింగ్ మోసాలకు పాల్పడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. జూలై వరకు 52 మంది అథ్లెట్స్ సస్పెన్షన్‌తో భారత్ టాప్‌లో ఉన్నప్పటికీ వీరిలో తొమ్మిది మందిపై నిషేధం ఎత్తివేయడంతో రెండో స్థానంలో ఉంది.