
సాక్షి, గన్నవరం : కామన్వెల్త్ కీడ్రల్లో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌కు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అతడినికి బుధవారం ఉదయం ఏపీ క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ ఉపాధ్యక్షుడు బంగార్రాజు, రాహుల్ కుటుంబీకులు ఘనంగా స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురానికి చెందిన రాహుల్ 85 కిలోల విభాగంలో పసిడి పతకం నెగ్గిన విషయం తెలిసిందే.