గన్నవరం: వాణిజ్య రాజధాని ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమాన సంస్థ శుక్రవారం నుంచి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ సర్వీస్ రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.
ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూరప్, ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ముంబై–విజయవాడ మధ్య ఎయిరిండియా సర్వీస్ నడుస్తుండగా, ఇప్పుడు ఇండిగో రాకతో మరో సర్వీస్ అందుబాటులోకొచ్చినట్లయిందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 14 నుంచి న్యూఢిల్లీ–విజయవాడ సర్వీస్
సెప్టెంబర్ 14వ తేదీ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి విజయవాడకు విమాన సర్వీస్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌బస్ ఎ320 విమానం రోజూ ఉదయం 8.10 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరి 10.40కి విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 11.10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి న్యూఢిల్లీ చేరుకుంటుంది.
ఇప్పటికే ఈ మార్గంలో ఎయిరిండియా రెండు విమాన సర్వీస్‌లను నడుపుతోంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండిగో సంస్థ ఢిల్లీ–విజయవాడ మధ్య సర్వీస్ నడిపేందుకు ముందుకొచ్చినట్టు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment