gannavaram airport
-
గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
-
గన్నవరం ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు
-
గన్నవరం విమానాశ్రయానికి త్వరలో సీఐఎస్ఎఫ్ భద్రత
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయం భద్రతను త్వరలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది. ఈ మేరకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమోదించిన నిర్ణయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా ఖరారు చేసింది. దీనిని కేంద్ర విమానయాన శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం భద్రతపట్ల సందేహాలకు తెరపడనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవ గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరుగుతుండటంతో దేశంలోని ఇతర విమానాశ్రయాలతో సమాన స్థాయిలో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఐఎస్ఎఫ్ బలగాలు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ భద్రత విధులు నిర్వర్తిస్తాయి.బంగారం, ఇతర స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటాయి. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ భద్రత కోరింది. ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అంగీకరించింది. ఈ ఏడాది జూలై 2 నుంచి విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. అడ్డుకున్న కూటమి ప్రభుత్వం కాగా, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విమానాశ్రయం భద్రత రాష్ట్ర పోలీసు పరిధిలోని ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్పీఎఫ్) చేతుల్లోనే ఉండాలని భావించింది. దాంతో జూలై 2న గన్నవరం విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్’కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత ఇలా..ప్రస్తుతం ఎస్పీఎఫ్కు చెందిన 250 మంది గన్నవరం విమానాశ్రయం భద్రత విధుల్లో ఉన్నారు. అయితే, వారిలో 70 మంది మాత్రమే ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్‌వే భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తే ఏకంగా 350 మందిని కేటాయిస్తారు. వారిలో 150 మందిని ప్రత్యేకంగా ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్ వే భద్రతకు నియోగిస్తారు. తద్వారా భద్రత మరింత పటిష్టమవుతుంది.బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన కేంద్రం ఇటీవల విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గన్నవరం విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఏఏఐ అప్రమత్తమైంది. గతంలో ఆమోదించినట్టుగా గన్నవరం విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని నిర్ణయిస్తూ కేంద్ర విమానయాన, హోం శాఖలకు ప్రతిపాదనలు పంపింది. దీంతో జూలై 2న విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కారణాలను కేంద్ర హోం శాఖ వాకబు చేసింది. సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. కాగా, వచ్చే జనవరిలోనే గన్నవరం విమానాశ్రయ భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్టు తెలిసింది. -
విశాఖ, గన్నవరంలో పొగ మంచు.. గాల్లోనే విమానాల చక్కర్లు!
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఈ క్రమంలో పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తడంతో తాజాగా ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురైనట్టు సమాచారం. ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌కు దారి మళ్లించినట్టు తెలుస్తోంది.మరోవైపు.. విశాఖ ఎయిర్‌పోర్టులో కూడా పొగ మంచు అలుముకుంది. పొగ మంచు కారణంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు అధికారులు. బెంగళూరు నుంచి విశాఖ రావాల్సిన రెండు ఇండిగో విమానాలను హైదరాబాద్‌కు డైవర్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం భువనేశ్వర్‌కు దారి మళ్లించారు.దారి మళ్లించిన విమానాల వివరాలు..- 6E 581/881 VOMM - VTZ - VOMM (Chennai - Vizag - Chennai) ETA 0615 (1145 IST)- 6E 7064/7063 VOTP -VTZ - VOTP (Tirupati - Vizag - Tirupati) ETA 0840 (1410 IST)- 6E 917/6089 VOMM - VTZ- VOMM (Chennai - Vizag - Chennai) ETA1140 (1710 IST) are cancelled for the day -
గన్నవరం విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద బుల్లెట్లు స్వాధీనం
-
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
కృష్ణా, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న #YSJagan ❤️ pic.twitter.com/KWbgee1C3I— MBYSJTrends ™ (@MBYSJTrends) September 10, 2024టీడీపీ కూటమి ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టై గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో జగన్ ములాఖత్ కానున్నారు. ఆపై టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ క్రోసూరు వైఎస్సార్సీపీ నేత ఈద సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు. ఇదీ చదవండి: పల్నాడుతో మళ్లీ రెచ్చిపోయిన పచ్చ మూక -
నేటి నుంచి ముంబై–విజయవాడకు ఇండిగో సర్వీస్
గన్నవరం: వాణిజ్య రాజధాని ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమాన సంస్థ శుక్రవారం నుంచి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ సర్వీస్ రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూరప్, ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ముంబై–విజయవాడ మధ్య ఎయిరిండియా సర్వీస్ నడుస్తుండగా, ఇప్పుడు ఇండిగో రాకతో మరో సర్వీస్ అందుబాటులోకొచ్చినట్లయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 14 నుంచి న్యూఢిల్లీ–విజయవాడ సర్వీస్సెప్టెంబర్ 14వ తేదీ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి విజయవాడకు విమాన సర్వీస్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌బస్ ఎ320 విమానం రోజూ ఉదయం 8.10 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరి 10.40కి విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 11.10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఎయిరిండియా రెండు విమాన సర్వీస్‌లను నడుపుతోంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండిగో సంస్థ ఢిల్లీ–విజయవాడ మధ్య సర్వీస్ నడిపేందుకు ముందుకొచ్చినట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. -
వెల్లంపల్లి నిరసన.. తోకముడిచిన పోలీసులు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్‌ను వారిని కలవనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కార్లలో ఉన్న కార్యకర్తలను సైతం దించివేయించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టు ప్రధాన గేటు వద్ద వెల్లంపల్లి భైఠాయించారు. వెల్లంపల్లి నిరసనతో దిగివచ్చిన పోలీసులు.. ఆయన కారుని ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతించారు. పోలీసుల తీరుపై వైస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు బెంగళూరు నుంచి కొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న @ysjagan గారు. స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు,… pic.twitter.com/1UnrdPCeMB— YSR Congress Party (@YSRCParty) August 6, 2024 -
గన్నవరంలో జగన్ కు ఘన స్వాగతం
-
గన్నవరం చేరుకున్న జగన్.. భారీగా పోటెత్తిన జనం (ఫొటోలు)
-
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్
-
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్రజినీకాంత్ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే -
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
ఎన్టీఆర్, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారని ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని మోదీ రేపు ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక.. తిరిగి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. రేపు ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉండడంతో..ఆ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొననున్నారు. ఒడిషాలో దాదాపు పాతికేళ్లకు అధికారం చేతులు మారగా.. బీజేపీ ఫస్ట్ టైం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. వీఐపీల రాక.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నేటి నుంచే ప్రముఖులు నగరానికి రానున్నారు. ఏర్పాట్లు పూర్తిచంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం మొత్తం 14 ఎకరాల్లో సభా ప్రాంగణం రూపొందించారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక ఉండగా, 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంది. వీవీఐపీ లు,వీఐపీ లతో పాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల్ని ఆ గ్యాలరీలకు ఇంఛార్జిలుగా నియమించారు. దాదాపు 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతప్రధాని మోదీ సహా ఇతర వీవీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సుమారు 7 వేల మందిని నియమించింది రాష్ట్ర పోలీస్ శాఖ. అన్ని మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ చెన్నై - కోల్ కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించనున్నారు.ఇదీ చదవండి: Modi 3.0: కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే -
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం
-
సీఎం జగన్‌కు ఘన స్వాగతం.. ముగిసిన విదేశీ పర్యటన(ఫొటోలు)
-
సీఎం జగన్ కి వైఎస్సార్సీపీ నేతల ఘన స్వాగతం
-
హజ్‌యాత్రకు బయలుదేరిన చివరి విమానం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులతో చివరి విమానం బుధవారం బయలుదేరింది. గత రెండు రోజులుగా ఇక్కడి నుంచి 644 మంది హజ్ యాత్రకు వెళ్లగా, మూడవ విమానంలో 48 మంది యాత్రికులు వెళ్లారు. తొలుత వీరందరూ ఉదయం 7.10 గంటలకు ఎయిర్పోర్ట్ సమీపంలోని ఈద్గా జామా మసీదు వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో అంతర్జాతీయ టెర్మినల్‌కు చేరుకున్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ తర్వాత స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు యాత్రికులు బయలుదేరి వెళ్లారు. వీరికి విమానాశ్రయంలో హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, కమిటీ సభ్యులు గౌస్ పీర్, పలువురు అధికారులు వీడ్కోలు పలికారు. రాష్ట్ర హజ్ కమిటీ కృతజ్ఞతలు హజ్–2024 యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. దుర్గాపురంలో ఈద్గా జామా మసీదు ఆవరణలో క్యాంప్ వద్ద సాయంత్రం హజ్‌యాత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ..రాష్ట్ర హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయడం వల్లే హజ్ యాత్ర విజయవంతంగా ప్రారంభమైందన్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం హర్షవర్ధన్‌ను హజ్ కమిటీ సభ్యులు సత్కరించారు. హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదిర్, సభ్యులు అలీంబాషా, గౌస్ పీర్, మస్తాన్‌వలీ, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి, డీఎస్పీలు వెంకటరత్నం, గుప్తా, జయసూర్య, సెంట్రల్ హజ్ కమిటీ సభ్యులు బిలాల్ అన్సారి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్–2024 యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2,580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం 8 : 45 గంటలకు విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ (గన్నవరం విమానాశ్రయం) నుంచి తొలి విమానం బయలు దేరనుంది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంపు నుంచి ఉదయం 4 గంటలకే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు వద్ద మదర్సాలోని హజ్ వసతి క్యాంపులో ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసులను కూడా నియమించారు.మదర్సా (హజ్ క్యాంపు) నుంచి హాజీలను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఏసీ బస్సు సౌకర్యం కలి్పంచింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి (సీఈవో) ఎల్.అబ్దుల్ ఖాదర్ ‘సాక్షి’కి తెలిపారు. వరుసగా రెండో ఏడాది హజ్ యాత్ర కోసం ఈ ఏడాది కోటా కింద 2,902 మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇవ్వగా రాష్ట్రం నుంచి 2,580 మంది నమోదు చేసుకున్నారు. విజయవాడ నుంచి ఎంబార్గేషన్ పాయింట్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అనుమతి సాధించింది. దీంతో వరుసగా రెండో ఏడాది విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి హాజ్ యాత్ర ప్రారంభం కానుంది.విజయవాడ నుంచి 728 మంది ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు విమానాల్లో ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్ నుంచి 1,118 మంది, బెంగళూరు నుంచి 725 మంది, చెన్నై ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 9 మంది బయలుదేరనున్నారు. మక్కా, మదీనాలో యాత్రికుల కోసం ప్రతి 200 మందికి ఒక ఖాదీమ్–ఉల్–హుజ్జాజ్(స్వచ్చంద సేవకులు)ను నియమించారు. ట్రోల్ ఫ్రీ నెంబర్.. హజ్ యాత్రికులు జూలై 1 నుంచి 21వతేదీ లోపు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటారు. ఒక్కో హాజీకి సుమారు 40 రోజుల పర్యటనకు మాత్రమే అనుమతి ఉంటుంది. హ్యాండ్ బ్యాగేజి కింద 8 కిలోలు, చెక్ ఇన్ లగేజీ కింద 20 కేజీల బరువున్న రెండు బ్యాగులను అనుమతిస్తారు. విజయవాడ హజ్ క్యాంపు వద్ద ఎస్బీఐ తాత్కాలిక కేంద్రంలో ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు ఫారిన్ ఎక్సే్చంజీ అందిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఒక్కొక్కరికి ఐదు లీటర్ల జామ్ జామ్ వాటర్ (పవిత్ర జలం) క్యాన్లను అందిస్తారు. యాత్రకు సంబంధించి అదనపు సమాచారం కోసం 1800 4257873 ట్రోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించవచ్చు. -
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్ ప్లాన్ చేయగా, తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటిస్ ఇచ్చిన శనివారం పంపించారు.తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్ళూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. లోకేష్‌ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు.లోకేష్ గురించి షాకింగ్ నిజాలు..గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్టయిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ప్రముఖ వైద్య నిపుణులు వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి. తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేయడం.. కోర్టు చేత చివాట్లు తినడం.. టీడీపీ సానుభూతిపరుడైన ఇతగాడి చరిత్ర.. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై ఆధారాలు లేకుండా వేసిన తప్పుడు కేసులను వాషింగ్టన్ డీసీ కోర్టు కొట్టివేయడంతో పాటు లోకేష్‌కు ఫైన్ కూడా వేసిందని వాసుదేవారెడ్డి తెలిపారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం కారణంగా గతంలో న్యూయార్క్, వర్జీనియా వంటి కొన్ని రాష్ట్రాలు.. లోకేష్ మెడికల్ లైసెన్స్ కూడా రద్దు చేశాయి.. లోకేష్ గురించి షాక్ అయ్యే నిజాలను పూర్తి వీడియోలో చూడొచ్చు. -
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు. -
గన్నవరం: దట్టమైన పొగ మంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక, దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, గన్నవరంలో ల్యాండ్ అవాల్సిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ మంచు కారణంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానాల్లు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఇక, ఉదయం తొమ్మిది గంటల సమయం దాటిన తర్వాత పొగ మంచు వీడిపోవడంతో 10 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం, ఇండిగో విమానాలు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
విజయవాడ: పొగమంచు ఎఫెక్ట్.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 8 రౌండ్లు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. విమానాశ్రయంలో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దీంతో 50కి పైగా విమానాలపై ఎఫెక్ట్ పడింది. రైళ్లు , విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన మంగళవారం జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఏటీఆర్ 72–600 విమానం హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుంది. రన్ వేపై దిగేందుకు దగ్గరగా వచ్చిన సమయంలో పైలెట్లు ఒక్కసారిగా విమానాన్ని తిరిగి గాల్లోకి లేపడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఐదు నిమిషాల వ్యవధిలో విమానాన్ని తిరిగి సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే రన్‌వేపై ల్యాండింగ్ అయ్యే ప్రాంతం కంటే ముందుకు విమానం రావడంతో పైలెట్లు భద్రత ప్రమాణాల్లో భాగంగా వెంటనే టేకాఫ్ తీసుకున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విమానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఇది చదవండి: ఢిల్లీ: 12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి -
విజయవాడ: రన్ వే పైకి వచ్చి మళ్లీ గాల్లోకి లేచిన విమానం
-
గన్నవరం ఏయిర్పోర్టు నిర్వాసితుల సమస్యకు పరిష్కారం
-
గన్నవరంలో విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఇదే..
గన్నవరం: పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. చత్తీస్గడ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులను పొగమంచు కమ్మెసింది. దీంతో పలు విమానాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించికపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:05 గంటలకు రియాద్ నుంచి రావలసిన విమానం, ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుండి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది అయ్యప్ప భక్తుల ఆందోళన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం 9:40కి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం పొగ మంచు కారణంగా 11 గంటలకు వెళ్లనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. 11 గంటలు దాటిన విమానాన్ని కొచ్చికి వెళ్లేందుకు సుముఖత చూపకపోవడంతో ఎయిర్‌పోర్టులో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. రాత్రి 10:40కి భక్తులకు దర్శనం ఉండడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్
-
లండన్‌కు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంగ్లండ్ రాజధాని లండన్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ పర్యటనకు వెళుతున్న సీఎం జగన్ దంపతులు తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు (ఫొటోలు)
-
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయిన బిశ్వభూషణ్.. మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్‌గా కొనసాగారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కాగా, హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకమని బిశ్వభూషణ్ ప్రశంసించారు. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురమన్నారు. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారని గవర్నర్ అన్నారు. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్.. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో నూతన గవర్నర్‌కు సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఎల్లుండి ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్ధుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన -
సీఎం జగన్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఏం చెప్పారంటే?
సాక్షి, విజయవాడ: సాంకేతిక కారణాలతోనే సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం వెనుదిరిగిందని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీ కాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘‘ప్రతి విమానం బయల్దేరే సమయంలో పూర్తి చెకింగ్ చేస్తాం. చెకింగ్ తర్వాతే విమానం టేకాఫ్ అవుతుంది. చిన్న సాంకేతిక కారణం ఉన్నా ఫ్లైట్‌ను వెనక్కి తీసుకొచ్చేస్తారు. సీఎం విమానం విషయంలోనూ అదే జరిగింది. ప్రయాణీకుల భద్రతే పైలట్ ముఖ్య ఉద్ధేశం. సాంకేతిక లోపం అనేది ఏ టైం లోనైనా రావొచ్చు.. ఏ విమానానికైనా రావొచ్చు’’ అని లక్ష్మీ కాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. చదవండి: ‘పట్టు’కుంటే బంగారమే!.. ఏడాదికి రూ.లక్షల ఆదాయం -
సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, విజయవాడ: ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాత్రికే ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లనున్నారు. చదవండి: తోడేళ్లంతా ఒక్కటయ్యాయి.. సింహం సింగిల్‌గానే నడుస్తోంది -
వినియోగంలోకి విస్తరించిన అప్రాన్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో సుమారు రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన అప్రాన్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి ప్రారంభించారు. ఈ అప్రాన్‌లోకి తొలిసారిగా పార్కింగ్ చేసిన హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి ఎయిర్పోర్ట్ అగ్నిమాపక శాఖ వాటర్ క్యానన్ సెల్యూట్ పలికింది. విస్తరించిన కొత్త అప్రాన్‌లో ఆరు ఎయిర్‌బస్ ఎ321 విమానాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. అంతే కాకుండా కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నుంచి ఆరు ఏరో బ్రిడ్జిల ద్వారా నూతన అప్రాన్‌ను అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఏరో బ్రిడ్జిల ద్వారా నేరుగా విమానాల్లోకి రాకపోకలు సాగించవచ్చు. భవిష్యత్ అవసరాల నిమిత్తం విస్తరించిన భారీ అప్రాన్‌ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడం విమానాశ్రయ చరిత్రలో మరో మైలురాయి అని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి బస్ సర్వీస్‌లు... అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ నుంచి విజయవాడ మీదుగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరు వరకు ఆర్టీసీ బస్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు గాను ఈ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం వేళ ఈ బస్ సర్వీస్ నడపనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఈ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
పొగమంచుతో విమానాలకు ల్యాండింగ్ కష్టాలు
విమానాశ్రయం (గన్నవరం): దట్టమైన పొగమంచు రన్‌వే ప్రాంతాన్ని పూర్తిగా కప్పి వేయడంతో గన్నవరం విమానాశ్రయంలో గురువారం విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 7.35 గంటలకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై దిగేందుకు విజిబిలిటీ లేకపోవడంతో 40 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఉదయం 8.15 గంటలకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఒకసారి రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికి విజిబిలిటీ లేకపోవడంతో టేకాఫ్ తీసుకున్నారు. మరో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పొగమంచు ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్లిన ఇండిగో విమానం కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకి ఉదయం 10 గంటలు దాటిన తరువాత చేరుకుంది. ఫాస్టాగ్ సేవలు ప్రారంభం గన్నవరం విమానాశ్రయంలోని టోల్గేట్లో ఫాస్టాగ్ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయాల్లో టోల్గేట్ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చారు. టోల్గేట్ వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న విమానాశ్రయ ఇన్చార్జ్ డైరెక్టర్ పీవీ రామారావు ఈ సేవలను ప్రారంభించారు. -
మరికాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు రాష్ట్రపతి ముర్ము
-
విజయవాడ నుంచి హజ్ యాత్రకు అనుమతించాలి
సాక్షి, అమరావతి: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు అనుమతించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2023లో హజ్‌యాత్రకు వెళ్లేవారిని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపేందుకు వీలుగా పాయింట్‌ను ప్రకటించాలని కోరారు. హజ్ యాత్రకు నెల ముందుగా ఏపీ హజ్ కమిటీ నుంచి ఒక అధికారిక బృందం మక్కా, మదీనా నగరాలకు వెళ్లి అక్కడి వసతిగృహాల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేలా సౌదీ ప్రభుత్వ అనుమతిని ఇప్పించాలని కోరారు. ఏపీ హజ్ కమిటీ సభ్యులు ఇషాక్ బాషా, రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి అబ్దుల్ ఖాదిర్ పాల్గొన్నారు. -
ఫేక్ పోస్టులపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి : ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఒక ఉన్నతాధికారిపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన కొల్లు అంకబాబును గురువారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతూ ఓ మహిళ విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తుండగా, కేంద్ర డీఆర్ఐ అధికారులు ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో గుర్తించారు. దీనితో ఏమాత్రం సంబంధంలేని ఒక ఉన్నతాధికారికి ఈ ఉదంతాన్ని ఆపాదిస్తూ కొల్లు అంకబాబు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టులు పెట్టిన అంకబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో విమానాలకు పక్షుల బెడద
కృష్ణా (గన్నవరం): అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో డంప్ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో పక్షుల వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలను పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు విమానాశ్రయ పరిసరాల్లో ఆక్రమ చెత్త డంపింగ్ నివారణపై సమావేశాలు నిర్వహించి హడావుడి చేస్తున్న అధికారులు ఆచరణలో మాత్రం విస్మరిస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతిసమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలు, చెత్తా చెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి. రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది. ఇంకా రాజీవ్‌నగర్ కాలనీ, బుద్ధవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం మరీ అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడ హోటళ్లలోని వ్యర్థాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీనితో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. గుణపాఠం నేర్వని అధికారులు గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ విమానాలను ఏడుసార్లకు పైగా పక్షులు ఢీకొన్నాయి. తరచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్కొస్తా, జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు రూ.కోట్లలో నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్ యథావిధిగా కొనసాగుతోంది. దీనితో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తాచెదారం డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ఏటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్ధవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు రిక్షాలు, డస్ట్బిన్లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహకారం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీలకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. -
ఏకరీతిన హరిత నగరాల ప్రధాన రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జగనన్న హరిత నగరాల కింద తొలి విడతలో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో ప్రథాన రోడ్లను ఒకేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం విజయవాడ విమానాశ్రయ రోడ్డును నమూనాగా తీసుకోనున్నారు. ఈ మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. ఈ రహదారిపై ఎలాంటి మొక్కలు నాటుతారో మిగతా నగరాల్లోనూ ఒక ప్రధాన మార్గాన్ని అలాగే తయారు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ విభాగాలు నిర్ణయించాయి. నగర, పట్టణాల్లోని ప్రధాన మీడియన్స్‌లో అభివృద్ధి చేసే ఈ ప్లాంటేషన్ ద్వారా మొత్తం 1.50 లక్షల చ.మీ మేర పచ్చదనం అదనంగా అందుబాటులోకి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే గన్నవరం విమానాశ్రయం రోడ్డును అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ రోడ్డు విజయవాడ రామవరప్పాడు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 13.82 కిలోమీటర్లు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు కొంత కాలం పాటు కృత్రిమ అందాలు, రంగుల వెలుగుల్లో కనిపించింది. ఇకపై సహజమైన పూల మొక్కలు, పచ్చని చెట్లతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో పురపాలక, పట్టణాభివృద్ధి విభాగంపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఈ రోడ్డును రూ.5.02 కోట్లతో ప్రకృతి అందాన్నిచ్చే మొక్కలతో నింపేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి దాకా జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈ రోడ్డును తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చి, ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్‌కు అప్పగించారు. -
గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ కు ఘన స్వాగతం
-
ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: తల్లిదండ్రులు
-
గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న నలుగురు ఏపీ విద్యార్థులు
-
కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
-
కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెల్లవారుజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగుళూరు నుండి 52 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టింది. రన్ వేపై అధిక వర్షం పడడంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు ఏటీసీ అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో సుమారు 50 నిమిషాలు పాటు గాల్లో 10 సార్లు చక్కర్లు కొట్టింది. 50 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో పైలెట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీనితో విమానంలో 52 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అదే విమానంలో గన్నవరం విమానాశ్రయం నుండి 57 మంది ప్రయాణికులు బెంగుళూరు వెళ్లేందుకు లాంజ్‌లో పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ విమానం ఉదయం 7.35కి గన్నవరం వచ్చి తిరిగి 8 గంటలకు బెంగుళూరు వెళ్లనుంది. చదవండి: (గులాబ్ తుపాన్ ప్రభావం: పలు రైళ్లు రద్దు) -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా ఆగిపోయిన విమానం
కృష్ణాజిల్లా: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో ఆ విమానం నిలిచిపోయింది. విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 177 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం రన్‌వేపైనే నిలుచుని ఉంది. ప్రయాణికులను తిరిగి లాంజ్‌లోకి తరలించారు. సాంకేతిక లోపాన్ని అధికారులు సరిచేస్తున్నారు. రాత్రి 8 గంటలకు ప్రయాణికులను ఢిల్లీ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
విజయవాడ: నేటి నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి ఒమన్ దేశ రాజధాని మస్కట్‌కు ఎయిర్ ఇండియా సంస్థ మంగళవారం నుంచి విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. వారానికి ఒక సర్వీస్ మాత్రమే నడుస్తుంది. ఈ విమాన సర్వీస్ ద్వారా ఇక్కడి నుంచి మస్కట్‌కు కేవలం 3.30 గంటలలోనే చేరుకోవచ్చు. 182 మంది ప్రయాణికుల సామార్ధ్యం కలిగిన ఎయిర్‌బస్ ఎ–321 విమానం ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్ట్‌గా మస్కట్‌కు బయలుదేరి వెళ్తుంది. మస్కట్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ఇవీ చదవండి: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! ‘రోడ్డు’ మ్యాప్ రెడీ -
సిమ్లా పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్
విమానాశ్రయం (గన్నవరం): సీఎం వైఎస్ జగన్ గురువారం సిమ్లా పర్యటనకు వెళ్లారు. తొలుత తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆయన ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు.విమానాశ్రయంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ హర్షవర్థన్‌రాజు, పలువు రు అధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు. చదవండి: Jagananna Vidya Kanuka:..రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’ -
రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిడ్ టీకా వ్యాక్సిన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిడ్ టీకా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పుణె నుంచి కోవిడ్ వ్యాక్సిన్లు గన్నవరం చేరుకోగా, వీటిని గన్నవరంలోని కోవిడ్ టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించనున్నారు. అనంతరం వైద్యశాఖ ఆదేశాలతో మేరకు జిల్లాలకు టీకా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. -
ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. గన్నవరం నుంచి ఏపీలోని 13 జిల్లాలకు టీకాలను వైద్యాధికారులు సరఫరా చేయనున్నారు. -
గాల్లో చక్కర్లకు ఇక చెక్!
సాక్షి, అమరావతి బ్యూరో: మేఘాలు ఆవరించినా, పొగమంచు కమ్ముకున్నా విమానాల ల్యాండింగ్‌కు సమస్య తలెత్తుతుంది. రన్‌వే పైకి దిగాలంటే రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే అలాంటి వాతావరణ పరిస్థితులేర్పడినప్పుడు పైలెట్లు విమానాలను రన్‌వే పైకి దించకుండా కాసేపు గాల్లోనే చక్కర్లు కొడుతుంటారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో అలజడి, ఆందోళన నెలకొంటుంది. కొంతసేపటికి మేఘాలు/పొగమంచు క్లియర్ అయ్యాక రన్‌వేపై ల్యాండ్ అవడానికి విమానాశ్రయ అధికారులు అనుమతులిస్తారు. లేదంటే ఆ విమానాన్ని వెనక్కి పంపిస్తారు. శీతాకాలం, వానాకాలాల్లో ఇలాంటి పరిస్థితులు సహజంగా ఏర్పడుతుంటాయి. మన విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రంలోనూ తరచూ పొగమంచు కమ్ముకోవడం, మబ్బులు ఆవరించడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్ అప్రోచ్ సిస్టం మాత్రమే ఉంది. దీనివల్ల రన్‌వేపై ల్యాండ్ అయ్యే విమానాల పైలట్లకు రన్‌వేపై పరిస్థితి కనిపించక (విజిబిలిటీ లేక) సతమతమవుతున్నారు. రూ. 2 కోట్లతో.. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో కొత్తగా కేటగిరి–1 (కేట్–1) అప్రోచ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇటీవలే ఇందుకు అవసరమైన పనులను ప్రారంభించారు. ఈ విద్యుత్ లైట్లను రన్‌వేకి ఇరువైపులా రన్‌వే దాటాక దాదాపు 900 మీటర్ల వరకు (బుద్ధవరం–దావాజీగూడెం వైపు) ఏర్పాటు చేస్తారు. కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టం మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే 300–400 మీటర్ల వరకు విజిబిలిటీని పెంచుతుంది. లైటింగ్ బ్రైట్‌గా కనిపిస్తుంది. దీంతో పైలెట్ దూరం నుంచే రన్‌వేను అంచనా వేయడానికి వీలవుతుంది. వెయ్యి మీటర్ల లోపు విజిబిలిటీ పడిపోతే పైలట్లు ల్యాండింగ్‌కు సాహసం చేయరు. ఇకపై ఇలా వెయ్యి మీటర్లలోపు విజిబిలిటీ తగ్గినా అప్రోచ్ లైటింగ్ సిస్టం వల్ల రన్‌వే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పూర్ విజిబిలిటీలోనూ విమానాలు ల్యాండ్ అవుతాయన్న మాట! రాష్ట్రంలోనే మొదటిది.. భారత నావికాదళం ఆధీనంలో ఉన్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో మినహా రాష్ట్రంలో మరే ఎయిర్పోర్టుల్లోనూ ఇప్పటివరకు కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టం ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్రంలో ఈ సిస్టం అందుబాటులోకి రానున్న తొలి ఎయిర్‌పోర్టు ఇదే కావడం విశేషం!! విజిబిలిటీ సమస్య ఉండదు వర్షాకాలంలో మేఘాలు ఆవరించినప్పుడు, శీతాకాలంలో పొగమంచు ఏర్పడినప్పుడు విజిబిలిటీ సరిగా లేక ఈ విమానాశ్రయంలో విమానాలు ల్యాండ్ అవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్ అప్రోచ్ లైటింగ్ సిస్టం ఉంది. విజిబిలిటీ సమస్యను అధిగమించడానికి కొత్తగా కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే విజిబిలిటీ సమస్యకు చాలా వరకు పరిష్కారం లభించినట్టవుతుంది. మరో మూడు నెలల్లో ఈ సిస్టం అందుబాటులోకి వస్తుంది. – గిరి మధుసూదనరావు, డైరెక్టర్, విజయవాడ విమానాశ్రయం -
నేడు గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రారంభం
విమానాశ్రయం (గన్నవరం): కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాల రాకపోకల కోసం కొత్తగా విస్తరించిన రన్‌వే గురువారం నుంచి వినియోగంలోకి రానుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 2017 జనవరి 12న ట్రాన్సిట్ టెర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు తొలిదశ రన్‌వే విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.100 కోట్లతో ప్రస్తుతమున్న 2,286 మీటర్ల రన్‌వేను.. 45 మీటర్ల వెడల్పు, 1,074 మీ. పొడవున విస్తరించారు. దీంతో రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరుకుంది. తద్వారా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా గన్నవరం ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. తర్వాతి స్థానంలో 3,048 మీ. పొడవుతో విశాఖ ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరంలోని కొత్త రన్ వేపై బోయింగ్ బీ747, బీ777, బీ787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించవచ్చు. రన్‌వే విస్తరణతో పాటు ఐసొలేషన్ బే, ట్యాక్సీ వే, లింక్ ట్యాక్సీ ట్రాక్, రెండు వైపుల రన్‌వే ఎండ్ సేఫ్టీ ఏరియా, లైటింగ్, బౌండరీ వాల్ పనులను ఎయిర్పోర్ట్ అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ రన్‌వే విస్తరణ పనులు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. కానీ పలు సెక్యూరిటీ కారణాల వల్ల డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. ఈ నెల 15 నుంచి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
Vijayawada Airport: 15న నూతన రన్‌వే ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించిన రన్‌వే ను ఈనెల 15న ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. బుధవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనరావు జిల్లా కలెక్టర్‌ను కలిసి విమానాశ్రయ విస్తరణ పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 700 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీకి జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లై ఓవర్‌కు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జీఎం మహ్మద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. చదవండి: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు -
ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు రాక
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు 9 లక్షల డోసులు గురువారం చేరాయి. గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లు తరలించారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని రిలాక్స్ అవ్వొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలన్నారు. కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్‌పై సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించిన సంగతి విదితమే. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇస్తోంది. కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతోంది. జూన్ 20 తర్వాత సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోంది. మే 15న 25.56 శాతానికి పైగా పాజిటివిటీ ఉంటే.. ప్రస్తుతం 5.97 శాతం ఉంది. చదవండి: తగ్గిందని అలసత్వం వద్దు రైతుల పట్ల ప్రతిపక్షానిది కపట ప్రేమ: సజ్జల -
గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, కృష్ణా జిల్లా: ఇండిగో విమానంలో ఓ మహిళ అస్వస్థతకు గురవడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్ చేశారు. బెంగుళూరు నుండి బాగ్ డోగ్ర వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయం నుండి అంబులెన్స్ సాయంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చదవండి: కరోనా కట్టడి చర్యలపై దుష్ఫ్రచారం.. ఏపీ సర్కార్ సీరియస్ రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..! -
గన్నవరం ఎయిర్‌పోర్టులో కోవిడ్ ఆంక్షలు కఠినతరం
విమానాశ్రయం (గన్నవరం): కరోనా నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం నుంచి ఆంక్షలను కఠినతరం చేశారు. విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతిని నిలిపివేశారు. ప్రయాణికులతో పాటు కారు డ్రైవర్‌ను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేస్తున్నారు. టెర్మినల్ భవనం వద్ద కూడా ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నారు. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే క్వారంటైన్ సెంటర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. చదవండి: Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవీ.. -
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న లక్ష కోవిషీల్డ్ టీకాలు
-
సీఎం జగన్ లేఖకు 24గంటల్లో కేంద్రం స్పందన
గన్నవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను గన్నవరం విమానాశ్రయానికి తరలించింది. సోమవారం రాత్రికి గన్నవరం విమానాశ్రయానికి 4 లక్షల 40 వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ చేరుకున్నాయి. లేఖ రాసిన 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ పంపడంతో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికే రెండు లక్షల కోవాగ్జిన్ వ్యాక్సినేషన్లు రానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నాలుగు లక్షల నలభై వేల కోవిషిల్డ్ వ్యాక్సిన్లు అన్ని జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వ్యాక్సిన్లను ప్రతి జిల్లాకు పంపించి, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వివరించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్స్, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని, కరోనా వ్యాప్తి నివారణకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: వామ్మో రెండు లక్షల కేసులు -
గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ విమానాలు
-
గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
-
భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు వీలులేక బెంగుళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగుళూరు నుంచి సుమారు 50మంది ప్రయాణికులతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం సుమారు అరగంట పాటు 8 సార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి వచ్చిన మరో ఇండిగో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టాయి. దాదాపు 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో పాట్నాకి దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! -
7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దాంతో గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇక శనివారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాలిలో చక్కర్లు కొట్టింది. 7 సార్లు చక్కర్లు కొట్టిన అనంతరం దిగేందుకు వీలులేక హైదరాబాద్ వెనుదిరిగింది. -
గన్నవరం చేరుకున్న ‘కోవిషీల్డ్’
సాక్షి, విజయవాడ : తొలిదశ కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కోవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. 40 బాక్సుల్లో 4,96,680 వ్యాక్సిన్ డోస్‌లు రాష్ట్రానికి చేరుకున్నాయి. పుణె నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను ఎయిర్పోర్ట్ కార్గో నుంచి ప్రత్యేక వాహనాల్లో.. గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాల పర్యవేక్షణలో పటిష్ట భద్రత మధ్య వ్యాక్సిన్ నిల్వ చేయనున్నారు. రేపు అన్ని జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ తరలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, వైద్యారోగ్యశాఖ జేడీ శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈనెల 16 నుంచి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా.. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. (చదవండి: 1.30 లక్షల డోసులు.. తొలి రోజు 3 వేల మందికి) -
వ్యాక్సిన్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్లు ఎట్టకేలకు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకు న్నాయి. పుణే నుంచి స్పైస్ జెట్ కార్గో విమానం మంగళవారం ఉదయం 11.30 గంటలకు శంషాబాద్ జీఎంఆర్ కార్గో టెర్మి నల్కు చేరుకుంది. ఈ విమానంలో ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు రాష్ట్రానికి వచ్చాయి. విమానాశ్రయం నుంచి ప్రత్యేక భద్రత నడుమ కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు చేరుకోగానే అధికారులు ఘనస్వాగతం పలికారు. మొత్తం 31 ప్రత్యేక ఇన్సులేటెడ్ పెట్టెల్లో 3.64 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయి. మొదటి పెట్టెను ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు అందు కున్నారు. వాటిని దించగానే సర్వమత ప్రార్థనలు జరిగాయి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కొందరు అధికారులు కరోనా వ్యాక్సిన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వైరస్ అంతం ప్రారంభమైం దన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్టేట్ వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్లను నిల్వ ఉంచారు. రీజినల్ కేంద్రాలకు తరలింపు ప్రారంభం... స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ నుంచి టీకాలను 10 పూర్వ జిల్లాల్లో ఉన్న రీజినల్ కేంద్రాలకు మంగళవారం రాత్రి నుంచే తరలించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి టీకా కేంద్రాలకు 14వ తేదీ సాయంత్రానికి చేరుస్తారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే టీకా కేంద్రాలకు 15 లక్షల సిరంజీలను తరలించారు. అలాగే సైడ్ ఎఫెక్టŠస్ వస్తే తక్షణమే వైద్యం చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్లను జిల్లాలకు పంపించారు. ఇదిలావుండగా, స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు 20 వేల కోవాగ్జిన్ టీకాలు కూడా చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. వాటిని కూడా కొన్ని జిల్లాలకు పంపుతామని తెలిపారు. మంగళవారం సాయంత్రానికి తేలిన లెక్క ప్రకారం.. రాష్ట్రంలో తొలి విడత 3.30 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు. ఎవరు ఏ రోజు టీకాకు రావాలో టైం స్లాట్‌తో సహా వారి మొబైల్ ఫోన్లకు ఒక రోజు ముందు మెసేజ్‌లు పంపిస్తారు. ఈ నెల 16న 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని, ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున 13,900 మందికి వేయాలని తొలుత నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. తొలి రోజున ప్రతీ కేంద్రంలో 30 మందికే టీకాలు వేయాలని మంగళవారం నిర్ణయించింది. 17న ఆదివారం సెలవు. ఇక 18 నుంచి నిత్యం టీకా కార్యక్రమాన్ని ఒకేసారి అన్ని కేంద్రాల్లో కాకుండా, రోజుకు కేంద్రాలను పెంచుకుంటూ పోతూ 20 నుంచి పూర్తిస్థాయిలో వేసుకుంటూ పోవాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. 10 మంది వచ్చాకే టీకా... వాయిల్స్లలో టీకా డోసులు ఉంటాయి. కోవిషీల్డ్ కంపెనీ టీకాలు ఒక్కో వాయిల్స్ల్లో 10 డోసులు ఉంటాయి. వాటిని 6 నెలల వరకు భద్రపరచవచ్చు. అయితే వాయిల్స్‌ను తెరిచిన 4 గంటల్లోపే 10 మందికి టీకాలు వేయాలి. తర్వాత అవి కాలంచెల్లిపోతాయి. అందువల్ల వ్యాక్సిన్‌కు ఒకేసారి 10 మంది ఇచ్చేలా ప్రణాళిక ఉంటుంది. ఇక కోవాగ్జిన్ టీకా పరిస్థితి అయితే ఒక వాయిల్లో 20 డోసులు ఉంటాయి. అంటే ఒక వాయిల్‌ను తెరిస్తే 20 మందికి ఒకేసారి వేయాలి. తక్కువ వేశాక నాలుగు గంటలోపు మిగిలినవి వేయకుంటే అవి కాలం చెల్లిపోతాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి వృథాను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు 10 శాతం అదనంగా టీకాలను సరఫరా చేస్తాయి. అలాగే రాష్ట్రానికి వ్యాక్సిన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఈటలకు తొలి టీకాపై తర్జనభర్జన... ఈ నెల 16న తొలి టీకా గాంధీ ఆసుపత్రిలో తొలి టీకా తానే వేసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించగా, ఆ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ప్రజాప్రతినిధులు టీకాలు వేసుకోవడానికి క్యూ కట్టవద్దని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో మంత్రికి తొలి టీకాపై అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. ఈటల వేయించుకుంటే ఇంకొందరు ప్రజాప్రతినిధులు కూడా అలాగే వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈటల అయోమయంలో పడ్డారు. తొలి టీకా వేసుకోకుంటేనే మంచిదని, లేకుంటే విమర్శలు వస్తాయని మంత్రితో అన్నట్లు తెలిసింది. పైగా కోవిన్ యాప్‌లో నమోదైన వారికే టీకాలు వేయాలి. ఈటల పేరు అందులో నమోదు కాలేదు. నిబంధనల ప్రకారం కూడా వేసుకోవడం సరైంది కాదని అంటున్నారు. ఇదిలావుంటే తొలి రోజు టీకా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అన్న విషయంపైనా స్పష్టత రాలేదు. వైద్య సిబ్బందిలో ధైర్యం నింపేలా ఎక్కడో ఒకచోట పాల్గొనాలని వైద్య, ఆరోగ్యశాఖ సీఎంకు విన్నవించినట్లు సమాచారం. సజావుగా జరిపించండి.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సజావుగా జరిపించడంలో భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులను మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సర్పంచి మొదలు మంత్రుల వరకు అందరికీ లేఖలు రాశారు. ‘కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు చేదోడువాదోడుగా ఉన్నందుకు మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం తరుఫున హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈనెల 16 నుంచి వ్యాక్సిన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నాం. జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ అందించడానికి మీరు ఈ కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతున్నా. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగి, తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా మారాలనే మన సీఎం ఆకాంక్షను నెరవేర్చాలని అభ్యర్థిస్తున్నా’అని కోరారు. తొలిరోజు కొందరికే వ్యాక్సిన్: సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నందున తొలిరోజు కొద్దిమంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రాలకు అనుమతించాలని, ఆ అనుభవాల మేరకు ప్రణాళిక చేసుకొని మరుసటి రోజు నుంచి లబ్ధిదారులను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్ నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వైద్యారోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గుర్తించి కలెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. టీకా కేంద్రాల్లో నిర్దేశిత ఆపరేషన్స్ గైడ్‌లైన్స్ మేరకు వసతులు కల్పించాలని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరికైనా రియాక్షన్ వస్తే తక్షణమే వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లను రిజర్వులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. గుర్తించిన లబ్ధిదారులను కేంద్రాలకు చేర్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. -
ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..
అమరావతి: కరోనా వైరస్‌కు విరుగుడు వచ్చేస్తోంది. అత్యవసర అనుమతి పొందిన సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. పూణె నుంచి కోవిషీల్డ్ టీకాలు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. మొత్తం 4.7 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 19 వాహనాలలో రేపు (జనవరి 13) అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్ డెలవివరీ వాహనాలలో ఏర్పాట్లు చేశారు. గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద వాక్ ఇన్ కూలర్స్.. ఒకటి 40 క్యూబిక్ మీటర్లు.. రెండోది 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న వాటిని సిద్ధం చేశారు. వ్యాక్సిన్ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. రాష్ట్రస్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి వ్యక్తులకు ప్రవేశం నిషేధం. 8 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. టీకాల పంపిణీలో భాగంగా తొలి దశలో 3.87లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి కరోనా వారియర్స్‌కు టీకాల పంపిణీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. -
గన్నవరంలో అదృశ్యం.. కడపలో ప్రత్యక్షం
సాక్షి, కృష్ణా: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమె భర్తకు అప్పగించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అతడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దుర్గను గుర్తించి ఆమె భర్త వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ.. ‘ఈ నెల 16న కువైట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాను. అయితే ఇండియాకి వచ్చే ముందు ఫోన్లో నాభర్త సత్యనారాయణతో గొడవ జరిగింది. ఇంటికి వెళ్లేందుకు భయపడి కడపలో ఉన్న నా చెల్లి వద్దకు వెళ్ళాను. పోలీసులు సాయంతో కడప నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చాను. నాకు,నా భర్తకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు’ అని తెలిపింది. (చదవండి: శ్రుతి కోసం అన్వేషణ) -
మిస్టరీగా మహిళ మిస్సింగ్..
సాక్షి, కృష్ణా జిల్లా: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అదృశ్యంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ ఫిర్యాదుతో గన్నవరంలో పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత దుర్గ ఈ నెల 16న దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంది. టెర్మినల్ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌పరిశీలించగా, లాంజ్‌లో లగేజీతో ఉన్న దుర్గను పోలీసులు గుర్తించారు. టెర్మినల్ నుంచి బయటకొచ్చిన తర్వాత దుర్గ అదృశ్యమైంది. ఓ వ్యక్తిపై ఆమె భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. (చదవండి: ఎంత పని చేశావు తల్లీ?!) -
భారీగా బంగారం పట్టివేత..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా బంగారం పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి ఎటువంటి పత్రాలు లేని 1,865 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.95,11,500 ఉంటుందని కస్టమ్స్ అదనపు కమిషనర్ నాగేంద్రరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, బంగారం ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. -
కొత్త రన్‌వేపై ఇక రయ్.. రయ్!
సాక్షి, అమరావతి: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ట్రయల్ రన్‌కు సిద్ధమవుతోంది. రూ.125 కోట్ల వ్యయంతో 1,074 మీటర్ల మేర రన్‌వే నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే 2,286 మీటర్ల పొడవున్న పాత రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటున్నాయి. విమానాశ్రయానికి పెరుగుతున్న విమానాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొత్త రన్‌వే నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయంలో మొత్తం రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరింది. దీనిపై ట్రయల్ రన్‌కు అనుమతిలిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమయ్యాక ఈ రన్‌వే దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైనదిగా గుర్తింపు వస్తుంది. (దేశీయ ప్రయాణాలకు ఊపు) -
గన్నవరం చేరుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ బయలు దేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ మంగళవారం సమావేశమయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటి కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మోదీతో సమావేశం ముగిసిన అనంతరం వీడియో కాన్సరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్ ఢిల్లీ నుంచి బయలు దేరి రాష్ట్రానికి చేరుకున్నారు. చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ -
గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలంటూ..
సాక్షి, కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఆన్లైన్ మోసానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగంలో చేరండి అంటూ మోసగాళ్లు ఆన్లైన్లో అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తుండటంతో నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆశతో ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన యువకులకు మోసం అని తెలియడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ విషయంపై గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ.. ఆన్లైన్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగం ఇస్తామని మోసం చేసినట్లు కొంత మంది ఫోన్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు. ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు ఎయిర్ లైన్స్ నిజమైన వెబ్సైట్లో చూసి వెళ్లాలని తెలిపారు. ఎయిర్ లైన్స్‌లో ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ముందస్తుగా నగదు డిపాజిట్ చేయించి అపాయింట్మెంట్ లెటర్ ఆన్లైన్లో పంపిస్తే అది ఫేక్‌గా గుర్తించాలని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిస్తే ఎయిర్ పోర్ట్ అథారిటీ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలు పేరిట మోసపోకుండా ముందస్తుగా తెలుసుకునేందుకు ఓ ఫోన్ నంబర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గతంలో కూడా మోసపోయిన వారు తమ దృష్టికి తీసుకురావడంతో విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. -
విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖుల బృందం
-
విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్, రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్‌రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్ ప్రసాద్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. భోజనం చేసి కొంత సేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రిని కలవనుంది. కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి కూడా సీఎం వైఎస్ జగన్‌తో వారు చర్చించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
గగనయానం షురూ
గన్నవరం/విశాఖపట్నం: లాక్డౌన్ కారణంగా విమానాశ్రయాల్లో రెండు నెలలుగా నిలిచిపోయిన పౌర విమాన సర్వీసులు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడాయి. బెంగళూరు నుంచి ఉదయం 7.20 గంటలకు 78 మంది ప్రయాణికులతో తొలి విమానం గన్నవరానికి చేరుకుంది. అనంతరం 8.20 గంటలకు బెంగళూరు నుంచి 49 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం వచ్చింది. ప్రయాణికులు టెర్మినల్‌లోకి ప్రవేశించగానే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు జిల్లాల వారీగా స్పందన వెబ్సైట్లో వివరాలు నమోదు చేశారు. అనంతరం రూట్ల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణికులను ఆయా జిల్లాల్లోని హోం క్వారంటైన్‌కు తరలించారు. ► కృష్ణా జిల్లాకు చెందిన 48 మంది ప్రయాణికులకు స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం హోం క్వారంటైన్ నిమిత్తం స్వస్థలాలకు పంపించారు. ► చెన్నై, ఢిల్లీ నుండి వచ్చిన ప్రయాణికులను మాత్రం ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ► ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు మాస్కులు, ఆరోగ్యసేతు యాప్ ఉన్నవారిని మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించారు. ► విశాఖకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నుంచి 3 ఇండిగో, ఎయిర్ ఆసియా నుంచి ఒక విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 581 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. అవే విమానాల్లో విశాఖ నుంచి 450 మంది ఆయా ప్రాంతాలకు వెళ్లారు. ► వచ్చిన ప్రయాణికులందరికి విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో అక్కయ్యపాలెంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారి చిరునామాలు, ఇతర వివరాలు తీసుకొని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. -
ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు
సాక్షి, విజయవాడ/విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం నుంచి దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాత అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లకు మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి. (చదవండి : 630 విమానాలు రద్దు) ఇప్పటికే బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఒక విమానం చేరకుంది. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. ప్రయాణికులు రెండు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్‌రావు సూచించారు. మరోవైపు ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి విశాఖకు 114 మంది ప్రయాణికులు చేరుకున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. స్వాబ్ కలెక్షన్ తర్వాత వారిని హోం క్వారంటైన్‌కు తరలించనున్నారు. కాగా, దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో సోమవారం నుంచే దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న
సాక్షి, విజయవాడ: కువైట్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను ప్రభుత్వం వెనక్కి రప్పించిందని ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక విమానం కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. గత నెలలుగా కువైట్‌లో ఉపాధి లేక ఏపీ వలస కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కువైట్‌లో చిక్కుకున్న బాధితుల్ని వెనక్కి తీసుకురావాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని తెలిపారు. (రాజకీయ కార్యక్రమాలొద్దు: సజ్జల) సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.. అమ్నెస్టీ సాయంతో 152 మంది బాధితులు ఏపీకి చేరుకున్నారని వెల్లడించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తామని వెంకట్ పేర్కొన్నారు. చొరవ తీసుకుని ఏపీకి రప్పించిన సీఎం వైస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. (విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత) సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితంగా.. గురువారం ప్రత్యేక విమానంలో కువైట్‌లోని 145 మంది వలస కార్మికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే.. వారిలో 126 మంది మహిళలు, 18 మంది పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని నూజివీడు త్రిబుల్ ఐటీలో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా వలస కార్మికులు దశల వారీగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటున్నారు. -
విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు
సాక్షి, విజయవాడ: యూకే నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు 156మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలోనే వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు తరలించనున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద అధికారులు 9 బస్సులు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఏపీకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వందే భారత్ మిషన్ 2లో భాగంగా మొత్తం 13 విమానాలు ఏపీకి రాబోతున్నాయని ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ చెప్పారు. నిన్న విశాఖ విమానాశ్రయానికి ఫిలిప్పీన్స్, అబుదాబి నుంచి ప్రవాస ఆంధ్రులు చేరుకున్నారన్నారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం సౌదీ అరేబియా జెడ్డా నుంచి 78 మంది గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని తెలిపారు. కువైట్ నుంచి రేపు, ఎల్లుండి 144 మంది గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని మేడపాటి వెంకట్ తెలిపారు. ఆమ్నెస్టీ ద్వారా కువైట్ నుంచి రెండు విమానాల ద్వారా గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని, ప్రవాస ఆంధ్రులు 14 రోజులు క్వారం టైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. -
గన్నవరానికి మూడు ప్రత్యేక విమానాలు
గన్నవరం: లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ‘‘వందే భారత్ మిషన్’’లో భాగంగా ఈ నెల 20 నుండి 27 వరకు మూడు ప్రత్యేక విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నాయి. ఎయిరిండి యాకు చెందిన తొలి విమానం (ఏఐ 1913) సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 20న బయల్దేరి రాత్రి 10.15 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. ఇదే విమానం (ఏఐ 1914) అర్ధరాత్రి 12 గంటలకు ఇక్కడి నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఈ నెల 23న ఎయిరిండియాకు చెందిన మరో విమానం (ఏఐ 1920) సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. అదే విమానం రాత్రి 11 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరుతుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులను తీసుకుని న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం (ఏఐ 1200) ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు గన్నవరం చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులు ఇక్కడికి చేరుకోగానే వైద్య పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ద్వారా ప్రయాణికుల ఎంపిక మేరకు ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వారి కోసం పెయిడ్ క్వారెంటైన్స్ : మాధవీలత
సాక్షి, విజయవాడ : లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారు సోమవారం స్వదేశానికి రానున్నారు. విదేశాల నుంచి ముంబైకి చేరుకుని అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. వీరందరినీ అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి గన్నవరం విమానాశ్రయంలోనే పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. దీని కొరకు హెల్ప్ డెస్క్, వైద్య బృందాలను ఇప్పటికే సిద్ధం చేశారు. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు వేల మంది గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై పర్యవేక్షణాధికారి, జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ.. వచ్చిన వారందర్నీ 14 రోజులపాటు క్వారంటైన్‌కు తరలిస్తామని తెలిపారు. (విదేశాల నుంచి వచ్చేవారి వివరాల నమోదు) ‘ప్రభుత్వ క్వారంటైన్లో ఉండేందుకు ఇష్టపడనివారి కోసం.. పెయిడ్ క్వారంటైన్లు కూడా సిద్ధం చేశాం. నాలుగు కేటగిరీలుగా రూమ్‌లను కేటాయించాం. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్స్‌కు తరలిస్తాం. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతాం. పెయిడ్ క్వారంటైన్స్ వద్ద మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంటుంది. ఆరోగ్యసేతు యాప్‌లో అందరినీ రిజిస్టర్ చేస్తాం. విదేశాల నుంచి వచ్చినవారందరికీ ఇండియా సిమ్‌కార్డులు ఇస్తామని’ మాధవీలత వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు) -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో దేశీయ, విదేశీయ ప్రయాణికుల కోసం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ) ఆమోదం తెలిపింది. సుమారు రూ.613 కోట్లతో నిర్మించనున్న ఈ టెర్మినల్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఇక లాంఛనంగా ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రసుత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పాత టెర్మినల్ భవనాన్ని ఇంటర్నేషనల్ కార్యకలపాలకు తాత్కాలికంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీని స్థానంలో 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను నిర్మించడానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఐదు నిర్మాణ రంగ కంపెనీలు బిడ్డులు దాఖలు చేయగా అందులో ఒక కంపెనీ సాంకేతిక అంశాల విషయంలో తిరస్కరణకు గురైంది. మిగిలిన నాలుగు కంపెనీల్లో ఎన్‌కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తక్కువ ధరను కోట్ చేయడం ద్వారా ఎల్1గా నిలిచినట్లు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించగానే పనులు మొదలుపెట్టి రెండేళ్లలో టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
అన్ని ఎయిర్‌పోర్టులలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు
-
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన స్పైస్ జెట్ విమానం దిగేందుకు విజుబుల్ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ట్రూజెట్, ఇండిగో విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం చుట్టపక్క గ్రామాలను పొగమంచు ఆవరించింది. ఉదయం 7 గంటల అయినా పొగమంచు వీడలేదు. రహదారులపై మంచుపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.