
సాక్షి, కృష్ణా జిల్లా: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అదృశ్యంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ ఫిర్యాదుతో గన్నవరంలో పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత దుర్గ ఈ నెల 16న దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంది. టెర్మినల్ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌పరిశీలించగా, లాంజ్‌లో లగేజీతో ఉన్న దుర్గను పోలీసులు గుర్తించారు. టెర్మినల్ నుంచి బయటకొచ్చిన తర్వాత దుర్గ అదృశ్యమైంది. ఓ వ్యక్తిపై ఆమె భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. (చదవండి: ఎంత పని చేశావు తల్లీ?!)
Comments
Please login to add a commentAdd a comment