
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
గన్నవరం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు.
వైఎస్ జగన్‌కు స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్యే కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దుట్టా రామచంద్రరావు, బుడ్డి చంద్రశేఖర్, స్థానిక నేతలు ఉన్నారు. అనంతరం వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో గుంటూరు బయల్దేరి వెళ్లనున్నారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 68వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు.