Breadcrumb
వైఎస్సార్సీపీ ప్లీనరీ.. ముగిసిన తొలిరోజు సమావేశాలు
Published Fri, Jul 8 2022 8:03 AM | Last Updated on Fri, Jul 8 2022 5:27 PM
Live Updates
వైఎస్సార్సీపీ ప్లీనరీ లైవ్ అప్డేట్స్
వైఎస్సార్సీపీ ప్లీనరీ.. ముగిసిన తొలిరోజు సమావేశాలు
తొలిరోజు వైఎస్సార్సీపీ ప్లీనరీలో నాలుగు తీర్మానాలు
తొలిరోజు మహిళా సాధికారత-దిశ చట్టంపై తీర్మానం
విద్యా రంగంలో సంస్కరణలపై రెండో తీర్మానం
నవరత్నాలు-డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్)పై మూడో తీర్మానం
వైద్యారోగ్య రంగంపై నాలుగో తీర్మానం
ఇకపై చంద్రబాబు,. దత్తపుత్రుడు ఆటలు సాగవు
టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తాము సంస్కారంతో మెలిగి ఓపిగ్గా ఉన్నామని, లోకేష్ కమెడియన్లా మాట్లాడుతున్నాడని అనిల్ కుమార్ విమర్శించారు.
2022 ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పాడె కడతామని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, దత్తపుత్రులు పవన్ కల్యాణ్‌కి లేదన్నారు. ఇకపై చంద్రబాబు, దత్తపుత్రుడి ఆటలు సాగవని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
మళ్లీ జగనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు
మళ్లీ జగనే రావాలి.. జగనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. వైద్యారోగ్య రంగంలో సీఎం జగన్ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా అప్పలరాజు తెలిపారు. టీడీపీ హయాంలో ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిన సంగతిని గుర్తు చేశారు మంత్రి. నవరత్నాలతో ప్రతీ కుటుంబంలో సీఎం జగన్ భరోసా నింపారన్నారు.
సంక్షేమం, ప్రజాహితం కోసమే సీఎం జగన్ పాలన: మంత్రి విడదల రజినీ
ప్రతి రోజూ పేదల సంక్షేమం కోసమే పనిచేసే సీఎం వైఎస్ జగన్ అని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ అన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన సంక్షేమం, ప్రజాహితం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. కొట్లాది మందికి ఉచిత, మెరుగైన వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగనేనని అన్నారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని, ఆరోగ్యశీతో పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారని తెలిపారు.
ఇది కార్యకర్తల పార్టీ.. కష్టంలో ఉద్భవించిన పార్టీ: ఎమ్మెల్యే చెవిరెడ్డి
పేదింట్లో పుట్టిన ప్రతిభావంతుడిని ఉన్నత చదువులు చదివించాలన్నేది సీఎం జగన్ ఆశయమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. రైతును రాజు చేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ‘పేద విద్యార్థులను సొంత అన్నలా చదివిస్తున్న నాయకుడు సీఎం జగన్. పిల్లలకు మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో విద్యాదీవెన, అమ్మ ఒడి, వసతి దీవెన అందిస్తున్నాడు.
ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. కానీ మన పార్టీ పదవుల కోసం, ఆస్తుల కోసం పుట్టింది కాదు.. తండ్రి ఆశయం కోసం పుట్టింది. ఇది కార్యకర్తల పార్టీ. కష్టంలో ఉద్భవించిన పార్టీ. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు అందించాలనుకున్న మంచి పాలనను సీఎం జగన్ తీసుకొచ్చారు’ అని అన్నారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95% హామీలు అమలు: ఎమ్మెల్యే భాగ్యలక్షి
రైతు భరోసా ద్వారా రైతులకు అండగా నిలిచిన ఘనత సీఎం జగన్‌ది అని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ‘దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే ఈరోజు మారుమూల గ్రామాల్లో నివసిస్తూ పోడు వ్యవసాయమే జీవనోపాధిగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు ఆదుకొని దాదాపు లక్షా ముప్పై అయిదు వేల మందికి హక్కు పత్రాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా గిరిజనుల ఇంటి గుమ్మం ముందుకు సంక్షేమ పథకాలను చేరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు నెరవేర్చారు. 2024 ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషిచేయాలి’ అని అన్నారు.
ఆ ఘనత సీఎం జగన్‌దే: బుగ్గన
ఒకేసారి 4లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
నవరత్నాలు అంశంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీర్మానం
నవరత్నాలు, గ్రామ సచివాలయాలను స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పేదలందరికీ వైద్యం అందించే దిశగా సీఎం జగన్ కృషిచేస్తున్నారని అన్నారు. అమ్మ ఒడి లబ్ధిదారాలకు మూడేళ్లలో రూ. 19,600 కోట్లపైగా నగదు బదిలీ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 61 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పధకాలు అమలవుతున్నాయని, 31 లక్షలమంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు.
నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారుస్తున్నాము: మంత్రి బొత్స
విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా పనిచేస్తున్నారు. ప్రభుత్వం కార్పొరేటుకు ధీటుగా విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చింది. మంచి విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నాము. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారుస్తున్నాము.
పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి విద్య మాత్రమే: ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి విద్య మాత్రమే. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాము. అమ్మఒడి వంటి స్ఫూర్తిదాయక పథకాలు అమలవుతున్నాయి.
మహిళలను మహారాణులు చేసేందుకు సీఎం జగన్ పని చేస్తున్నారు
మహిళా సాధికారత-దిశ చట్టం తీర్మానంపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. మహిళలను మహారాణులు చేసేందుకు సీఎం జగన్ పని చేస్తున్నారని అన్నారు. ‘మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు. విపక్షాలు ఎన్ని దాడులు చేసినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు. వైఎస్సార్సీపీలో పని చేయడం మన అదృష్టం అని లక్ష్మీపార్వతి ప్రసంగించారు.
ఆశయం కోసం పోరాడే పులి వైఎస్ జగన్: మంత్రి రోజా
‘‘వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. ఆశయం కోసం పోరాడే పులి వైఎస్ జగన్’’ అంటూ మంత్రి రోజా కొనియాడారు.
పోరాటం ఉంది.. పౌరుషం ఉంది: మంత్రి రోజా
ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న నాయకుడు వైఎస్సార్ అని మంత్రి రోజా అన్నారు. సోనియానే గడగడలాడించిన పార్టీ వైఎస్సార్సీపీ. రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైఎస్సార్. వైఎస్సార్సీపీ జెండాలో పోరాటం ఉంది.. పౌరుషం ఉందని మంత్రి రోజా అన్నారు.
మహిళా సాధికారత-దిశా చట్టంపై తీర్మానం
ప్లీనరీలో మహిళా సాధికారత-దిశా చట్టంపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళలను శక్తివంతంగా తీర్చదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు. సామాజిక న్యాయం ఏపీలో సంపూర్ణంగా జరుగుతోందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో మహిళలంతా సంతోషంగా ఉన్నారన్నారు.
ఆ బాధ్యత ప్రభుత్వానిదే
అభివృద్ధి ప్రజల హక్కు. అందరికీ అభివృద్ధిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న ప్రభుత్వం మనదే. నాడు-నేడుతో పాఠశాల రూపురేఖలు మార్చేశాం.
పార్టీ సిద్ధాంతాలపై మంత్రి ధర్మాన ప్రసంగం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని వైఎస్సార్సీపీ పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ప్రతి పేదవాడికి అండగా నిలవడమే వైఎస్సార్సీపీ సిద్ధాంతం. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు. విద్య, వైద్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారని మంత్రి ధర్మాన అన్నారు.
వైఎస్ జగన్ మాస్ లీడర్: వైఎస్ విజయమ్మ
‘‘వైఎస్ జగన్ మాస్ లీడర్. యువతకు రోల్ మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్ చూసుకుంటారని’’ వైఎస్ విజయమ్మ అన్నారు.
జగన్ చెప్పినవే కాకుండా చెప్పనవీ కూడా చేస్తున్నారు..
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాలు తెచ్చారని వైఎస్ విజయమ్మ అన్నారు. ‘‘జగన్ చెప్పినవే కాకుండా చెప్పనవీ కూడా చేస్తున్నారు. హామీలన్నీ అమలు చేశాం కాబట్టే ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రూ.1.60 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని’’ వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.
అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు: వైఎస్ విజయమ్మ
ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్ విజయమ్మ అన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు.
ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది: వైఎస్ విజయమ్మ
వైఎస్సార్ అందరివాడని.. కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్సీపీ పుట్టిందన్నారు.
పార్టీ కోసం ఎన్నో కష్టాలను ఓర్చుకున్నాం: సీఎం జగన్
అధికారం అంటే అహంకారం కాదని నిరూపించాం: సీఎం జగన్
2019లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించాం. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు పరిమితం చేశాడు దేవుడు. అధికారం అంటే అహంకారం కాదని నిరూపించాం’’ అని సీఎం జగన్ అన్నారు.
గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదు: సీఎం జగన్
ఈ 13 ఏళ్లలో ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘‘మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు. సంకల్పం మారలేదు. నాన్న ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు’’ అని సీఎం అన్నారు.
కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్
2009 సెప్టెంబర్ 25న పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ అని సీఎం అన్నారు.
సీఎం జగన్ ప్రారంభోపన్యాసం..
వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. వేదికపై సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేస్తున్నారు.
వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం జగన్
ప్లీనరీ వేదికపై దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశాలకు వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. పండగలా వైఎస్సార్సీపీ ప్లీనరీ జరుగుతోంది.
పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించిన సీఎం జగన్
పార్టీ జెండాను ఆవిష్కరించి.. పీన్లరీని వైఎస్ జగన్ ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులతో ప్లీనరీ ప్రాంగణం నిండిపోయింది.
పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
పీన్లరీ ప్రాంగణానికి వైఎస్ విజయమ్మ, సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. పార్టీ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు.
కాసేపట్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రారంభం
కాసేపట్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రారంభం కానుంది. ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. మరికాసేపట్లో ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ రానున్నారు. జెండా వందనంతో ప్లీనరీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
గన్నవరం నుంచి ప్లీనరీకి బయల్దేరిన సీఎం జగన్
గన్నవరం నుంచి ప్లీనరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్.. పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ విజయమ్మ, సీఎం జగన్
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరి నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొననున్నారు.
మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి
మహానేత వైఎస్సార్ జయంతి సందర్బంగా ప్లీనరీ ప్రాంగణం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, స్కిల్ డెవలప్మెంట్ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయలుదేరిన సీఎం జగన్
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం కడప విమానాశ్రయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ నుంచి నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొననున్నారు.
అందరికీ ఒకే మెనూ
ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు.
పారదర్శకత అంశాలపై చర్చలు.. తీర్మానాలు..
పార్టీ ఆడిట్ ఖర్చుల స్టేట్మెంట్ను పి.కృష్ణమోహన్‌రెడ్డి ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా నియమావళికి సవరణలు ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. ఆ తర్వాత మహిళా సాధికారత – దిశ చట్టం, విద్య, నవరత్నాలు-డీబీటీ, వైద్యం, పరిపాలన-పారదర్శకత అంశాలపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెడతారు.
వందేమాతరం గీతాలాపనతో..
వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలవుతుంది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందేశం ఇస్తారు.
ప్లీనరీలో కార్యక్రమాలు ఇలా..
వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం జరుగుతుంది. అనంతరం సీఎం వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్లీనరీ వేదికపైకి సీఎం వైఎస్ జగన్‌ను, ప్రధాన నాయకులను ఆహ్వానిస్తారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం
మూడేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్, పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులను గుర్తు చేస్తూ నమూనా ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప కాంతులతో ప్రాంగణం ధగధగలాడుతోంది. రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు. కాగా, కాలర్ ఎగరేసుకుని తిరిగేలా సీఎం వైఎస్ జగన్ పరిపాలిస్తుండటంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ క్రమంలో ప్లీనరీకి భారీ స్థాయిలో శ్రేణులు తరలి వస్తున్నాయి.
సర్వత్రా ఆసక్తి..
అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రం నలు మూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. వర్షం వచ్చినా ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీ విస్తీర్ణంలో వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు.
నేడు, రేపు వైఎస్సార్సీపీ ప్లీనరీ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు.
Related News By Category
Related News By Tags
-
జనం ఎత్తిన జెండా
ఈ జెండా... అయాచితంగా అందుకున్నది కాదు. కుట్రలతో లాక్కున్నదీ కాదు. ఇది... ఇచ్చిన మాట కోసం... వ్యవస్థలన్నిటినీ గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేశ అత్యున్నత నాయకత్వాన్ని ఢీకొట్టి నిలిచిన ఓ యువకుడికి జనమిచ్చిన ...
-
ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్ విజయమ్మ
సాక్షి, తాడేపల్లి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. మహానేత వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని ...
-
మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా..
‘పావురాలగుట్టలో 13 ఏళ్ల క్రితం.. అంటే 2009 సెప్టెంబరు 25న ఈ సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకుని, 2011 మార్చిలో వైఎస్సార్సీపీగా ఆవిర్భవించింది. 11 ఏళ్ల క్రితం నాన్న గారి ఆశయాల సాధన క...
-
YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి ...
-
మహానేత వైఎస్సార్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు జనవాహిని పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్...
Comments
Please login to add a commentAdd a comment