YSRCP Plenary 2022
-
విజయమ్మ ఎపిసోడ్: టీడీపీకి, ఆ వర్గం మీడియాకు నిరాశే మిగిల్చిందా!
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమి చేసినా విన్నూత్నంగా , పారదర్శకంగా ఉండేలా చేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా ఆయన అనుసరించిన విదానం అలాగే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాతృమూర్తి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన వైనం సంచలనంగా ఉంది. ఈ ఉదంతం దేశంలోనే అరుదైన ఘట్టంగా చెప్పాలి. ఒక కుటుంబం అందులోను రాజకీయ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయన్న ప్రచారం జరిగినప్పుడు ,వాటిని వివాదాస్పదం చేయాలని ప్రత్యర్ధి వర్గాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక రాజకీయ నేత ఇంత బహిరంగంగా తేల్చేస్తారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. తల్లి,కుమారుల మధ్య ఏదో జరిగిందని విస్తారంగా చెప్పడం ద్వారా వైసీపీకి నష్టం చేయాలని అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ప్రయత్నిస్తున్నప్పుడు జగన్ వ్యూహాత్మకంగా ఈ వైఖరి అనుసరించడం ఆసక్తికరమైన విషయమే. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా ఒక పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అదే పార్టీ ప్లీనరీలో ప్రకటించడం జరిగి ఉండదు. ఒకవేళ అలా జరిగితే పెద్ద గొడవగా మారుతుంది. కానీ అందుకు భిన్నంగా విజయమ్మ వ్యవహరించిన శైలి, జగన్ ఆమెను గౌరవించిన తీరు కచ్చితంగా అభినందనీయం. వైఎస్ కుటుంబంలో ఏది పెద్ద రహస్యం కాదని, చెప్పేదేదో ఫెయిర్ గా చెబుతామని వారు స్పష్టం చేసినట్లుగా ఉంది. అంతకుముందు జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత స్పందించిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంది. షర్మిల పార్టీ పెట్టడం తమకు ఆమోదయోగ్యం కాదని, అయినా ఆమె తన అభీష్టం ప్రకారం పెట్టుకున్నారని , ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రకటింపచేశారు. దాంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసింది. షర్మిల కూడా అంతే హుందాగా వ్యవహరించి తనకు సోదరుడితో విభేదాలు లేవని తెలిపారు. ఒక మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ విషయంలో చాలా సమయస్పూర్తిగా సమాధానాలు ఇచ్చారు. ఈ విషయాలపై చిలవలు,పలవలుగా కధనాలు వండి వార్చడానికి కొన్ని మీడియా సంస్థలు సహజంగానే ప్రయత్నిస్తుంటాయి. వార్త ఇవ్వడం వరకు ఎవరూ ఆక్షేపించారు. కాని ఉన్నవి,లేనివి చెప్పి వక్రీకరించడమే దారుణంగా ఉంటుంది. అమ్మ అవుట్ అని, బలవంతంగా రాజీనామా చేయించారని , ఇక మరో టార్గెట్ ఫలానా అని తమకు తోచిన కథనాలు రాశారు. వీటన్నిటికి చెక్ పెడుతూ విజయమ్మ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆమె ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. వ్యతిరేకార్దం వచ్చేలా మాట్లాడలేదు. ప్లీనరీలో మెదటి రోజు పాల్గొన్న సుమారు రెండు లక్షలమందికే కాక, టీవీల ద్వారా చూసే లక్షలాది ప్రజలకు అర్దం అయ్యేలా తన ఉపన్యాసం చేశారు.తన మధ్దతు ఎల్లవేళలా జగన్ కు ఉంటుందని, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీకి అండగా నిలవాలని అనుకున్నప్పుడు అనవసర వివాదాలు తలెత్తకుండా ఉండడానికే తాను ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని విస్పష్టంగా వివరించారు. విజయమ్మ పార్టీకి అదే హోదాలో ఉండాలని ఎక్కువ మంది కార్యకర్తలు కోరుకుని ఉండవచ్చు. కాని ఆమె తన కారణాలను తెలియచేశారు. కాగా విజయమ్మ ప్రసంగం ఆద్యంతం జగన్ తో సహా సభికులంతా ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత ఆమె తన సీటు వద్దకు వెళ్లినప్పుడు జగన్ ఆమెను సాదరంగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టారు. అంటే దీని అర్ధం ఏమిటి? తమ మధ్య విబేధాలు లేవని, ప్రేమాభిమానాలు తగ్గలేదని వారు రుజువు చేసుకున్నారు. సాధారణంగా ఒక పార్టీ నుంచి తప్పుకున్నానని చెప్పిన తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ విజయమ్మ అలా చేయకుండా తన కుమారుడి పక్కనే సాయంత్రం వరకు కూర్చోవడం గమనించదగ్గ అంశం. అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు కూడా ప్లీనరీలో పాల్గొని ఒక వర్గం మీడియాకు సమాధానం చెప్పారు. విజయమ్మ ఉపన్యాసంలోని కొన్ని అంశాలను చూద్దాం. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె ప్రకటించారు. ఇక్కడ ఎక్కడా ఆమె ఇద్దరు పిల్లల మధ్య తేడా చూపించాలని అనుకోలేదు. జగన్ ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజల మద్దతు పొందుతున్నందున ఆమె షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు భిన్నంగా షర్మిల గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటే అది చర్చనీయాంశం అయి ఉండేది. అలాంటి అవకాశం ఆమె ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా ద్వేషపూరిత ప్రచారం చేస్తోందని ఆమె కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్‌కు ఒక స్టాండ్ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా.జగన్ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్‌ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నాఅని అన్నారు. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా విజయమ్మ ఏదో జగన్ కు వ్యతిరకంగా ఉన్నారనో, లేక జగన్ తన తల్లిని విస్మరించారనో ప్రచారం చేస్తే ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారి గత చరిత్రను చూద్దాం. విజయమ్మ తన రాజకీయ సరళి మార్చుకుంటూ చేసిన ప్రసంగంలో జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తే, తెలుగుదేశం వ్యవస్థాపకుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తన అల్లుడు చంద్రబాబును ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది గుర్తుకు తెచ్చుకుంటే వీరి మద్య ఉన్న వ్యత్యాసం తేలికగా అర్ధం అవుతుంది. తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసే క్రమంలో వైస్రాయి హోటల్ వద్ద ఆయనపై చెప్పలు వేయడం మొదలు , తాను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్.టి.ఆర్.నిస్సహాయంగా నిండు శాసనసభలో నిలబడిన వరకు జరిగిన ఘటనలు చూస్తే ఎవరు ఎలా వ్యవహరించారో విదితమవుతుంది. ఆనాటి స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు పదే,పదే మైక్ కట్ చేసి ఎన్ టి.ఆర్.ను పరాభవిస్తుంటే, చంద్రబాబు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండిపోయారేకాని వారించలేదు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.ను పార్టీ నుంచి తొలగించి, అధ్యక్ష పదవిని కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు మరో వైపు విజయమ్మ పార్టీ ప్లీనరీలో మాట్లాడి పూర్తి గౌరవం పొందారు.ముఖ్యమంత్రి పక్కన కూర్చుని సభను ఆలకించారు. అయినా చంద్రబాబు మాత్రం వైఎస్ కుటుంబంలో ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా అయితే శరభ,శరభ అంటూ పూనకం వచ్చినట్లుగా వ్యవహరిస్తోంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. టిడిపిని తన అధీనంలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు తో ఆయన బావమరుదులు జయకృష్ణ, హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, స్వయంగా తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు వంటివారికి ఆయా సందర్భాలలో ఏర్పడిన విబేధాల సంగతి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. దగ్గుబాటి పుస్తకంలో ఏమి రాశారో చూస్తే పలు విషయాలు తెలుస్తాయి. రాజకీయాలలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతుంటాయి. పలు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్లీనరీలో మాత్రం ఎలాంటి గొడవలు,గందరగోళాలు లేకుండా ఈ ఉదంతం ముగియడం విశేషమే. టిడిపికి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు మాత్రం అది తీవ్ర నిరుత్సాహం కలిగించే విషయమే. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. బాబుకు నాగార్జున సవాల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో జన ప్రభంజనాన్ని చూసిన చంద్రబాబు, ఆయన తాబేదార్లకు మతి తప్పిందని, అందుకే అవాకులు చవాకులు పేలుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఈసారి కుప్పంతో సహా 175 స్థానాల్లోనూ ఓడిపోతారనే విషయం వారికి అర్థమైందని అన్నారు. జగన్ జన ప్రభంజన రథ చక్రాల కింద చంద్రబాబు, ఆయన అనుయాయులు నలిగిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికీ టీడీపీకి గెలుస్తామనే నమ్మకం ఉంటే కుప్పం ఎమ్మెల్యే సీటుకు చంద్రబాబు రాజీనామా చేసి వస్తే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కుప్పంలో మీరైనా, మీ కొడుకైనా సరే మా సత్తా చూపిస్తామన్నారు. మంత్రి నాగార్జున సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక తల్లిగా వైఎస్ విజయమ్మ సీఎం వైఎస్ జగన్ ఉజ్వల భవిష్యత్తుపై మాట్లాడిన మాటలను కూడా ఎల్లో గ్యాంగ్ వక్రీకరిస్తోందని చెప్పారు.14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ప్రశ్నించారు. ఆయన మార్కు పథకం ఒక్కటైనా చెప్పగలరా అని నిలదీశారు. ఎన్టీఆర్ 2 రుపాయలకు కిలో బియ్యం పథకాన్ని పెడితే, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా, అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన లాంటి లెక్కలేనన్ని పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడే వైఎస్ జగన్‌ను ఆదరించిన ప్రజలు ఆయనకు కంచుకోటలా అండగా నిలిచారన్నారు. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ను అస్సలు వదులుకోరని చెప్పారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఎన్ని వేషాలేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సత్తా చూపిస్తారన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబును ఈసారి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ స్థాయికి దిగజారి మాట్లాడలేమని ఓ ప్రశ్నకు సమాధానంగా నాగార్జున చెప్పారు. -
‘విమర్శలు చేస్తారు.. చర్చకు రమ్మంటే పారిపోతారు..’
సాక్షి, తాడేపల్లి: ప్లీనరీతో వైఎస్సార్సీపీ కేడర్‌లో నూతనోత్సాహం వచ్చిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ ప్రాంతీయ పార్టీకి దేశంలో ఇంత ఆదరణ లేదని.. అంచనాలకు మించి పార్టీ కార్యకర్తలు ప్లీనరీకి వచ్చారన్నారు. చదవండి: తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదు: కేఏ పాల్ చంద్రబాబు నాయుడు చెప్పుకోడానికి ఒక్క పథకం ఉందా.? విమర్శలు చేయడం కాదు.. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రమ్మంటే పారిపోతాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేరింది నిజం కాదా..? సామాజిక న్యాయం గురించి టీడీపీకి మాట్లాడే అర్హత లేదు. సామాజిక న్యాయంపై మీరు చర్చకు సిద్దమా..? మేము 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చాం. మీరు 18 మందికి ఇస్తాం అని మహానాడులో తీర్మానం చేయగలిగారా? అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. -
YSRCP PLenary 2022: కదనోత్సాహం.. టార్గెట్ 175
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత నిర్వహించిన ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతం కావడంతో వైఎస్సార్సీపీలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. 26 జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ప్లీనరీకి పోటెత్తాయి. గుంటూరు–విజయవాడ మధ్య జన మహా సముద్రాన్ని తలపించింది. జడివానను లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చారు. ప్లీనరీ ప్రాంగణం వద్ద గంటల తరబడి కాలుకదపకుండా నిల్చొని నాయకుల ప్రసంగాలు విన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో భోజనం చేస్తున్న వారు కూడా మధ్యలో వదిలేసి వచ్చి, ప్రసంగాన్ని వినడం పట్ల శ్రేణుల్లో పార్టీ పట్ల నిబద్ధత రెట్టింపైనట్లు స్పష్టంగా కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టెంట్ బయట ఉన్న వారు వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయక జగన్ ప్రసంగం ఆద్యంతం వినడమూ కనిపించింది. ప్లీనరీ ప్రాంగణంలో నాలుగున్నర లక్షలు.. ట్రాఫిక్‌లో వాహనాలు చిక్కుకుపోవడంతో అంతే స్థాయిలో రహదారులపై ఉండిపోయారు. కాలరెగరేసే పరిస్థితి.. నవరత్న పథకాలన్నీ అమలు చేయడం.. ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేయడం.. అన్ని వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్ పాలనను ఆదరిస్తుండటంతో రాష్ట్రమంతా మేం వైఎస్సార్సీపీ అని కాలరెగరేసే పరిస్థితి ఉండటం వల్లే.. ప్లీనరీకీ అభిమానసంద్రం పోటెత్తిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేలా కార్యక్రమాలను ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కర్తవ్య బోధతో కదనోత్సాహం వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్లీనరీలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న మంచి వల్ల కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించి.. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసేలా గెలిపించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 175 స్థానాలూ గెలవడం అసాధ్యం కాదని.. సుసాధ్యమేనంటూ శ్రేణుల్లో స్ఫూర్తి నింపారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టడానికి గ్రామ గ్రామాన సైన్యంగా ఏర్పడాలని సూచించారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలకు వివరించాలని చెప్పారు. చంద్రబాబుతో కూడిన కౌరవ సైన్యంపై గెలిచేందుకు అర్జునుడి పాత్ర పోషించాల్సింది మీరేనని శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నింపిన స్ఫూర్తి, కర్తవ్య బోధతో శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. మరింత నిబద్ధతతో గడప గడపకూ.. మూడేళ్లలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించి.. ఆశీర్వదించాలని కోరేందుకు మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్కార్ చేపట్టింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన లబ్ధిని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను అందిస్తూ.. ఆ పథకాలన్నీ వచ్చాయా? లేదా? అని ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిస లాడుతుండటంతో దాన్ని మరింత పెంచేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత నిబద్ధతతో నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మీ ఆత్మీయతకు మరోసారి సెల్యూట్ వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరై, ప్రభుత్వానికి మద్దతు తెలిపిన కార్యకర్తలు, అభిమానులకు సీఎం వైఎస్ జగన్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘నిరంతరం.. దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు.. ఇవే నాకు శాశ్వత అనుబంధాలు. కార్యకర్తలు, అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో.. చెక్కు చెదరని మీ ఆత్మీయతకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీరిస్తున్న మద్దతుకు.. మీ జగన్ మరోసారి సెల్యూట్’ అని ట్వీట్ చేశారు. -
చరిత్ర సృష్టించిన సీఎం జగన్.. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు
-
సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ చివరి ఘట్టానికి చేరుకుంది. ఇక ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రసంగించడమే తరువాయి . ఆ తరుణంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక విజ్ఞప్తి చేశారు. భోజనశాలలో ఉన్న కార్యకర్తలు కూడా తిరిగి సభా స్థలికి వచ్చి ,ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని కోరారు. ఆశ్చర్యం వేసింది. జగన్ స్పీచ్ ప్రారంభం అయ్యేసరికి నిజంగానే ఎక్కడెక్కడి కార్యకర్తలు వచ్చి తమ సీట్లో ఆసీనులవడంతో ఆ శిబిరంలో ఎక్కడా ఖాళీ కుర్చీనే దాదాపుగా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల సమావేశం పెడితే , ఇంత శ్రద్దగా సభలో కూర్చుంటారా? వక్తల ఉపన్యాసాలు వింటారా? అందులోను పార్టీ అధినేత స్పీచ్ వినడానికి అంతలా ఆసక్తి కనబరుస్తారా? అన్న భావన కలిగింది. జగన్ తన స్పీచ్‌లో ఎక్కడా కార్యకర్తలను విసిగించేలా మాట్లాడలేదు. వారిలో స్పిరిట్ నింపే విధంగా మాట్లాడారని చెప్పాలి.జగన్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే ఆయన హుందాగా మాట్లాడడానికి ప్రాధాన్యం ఇస్తూనే, తను చెప్పవలసిన విషయాలను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. నవరత్నాల గురించి ఎన్నికలకు ముందు ఏమి చెప్పింది వివరిస్తూ, ప్రతి అక్క, ప్రతి చెల్లికి చెప్పండి.. ప్రతి అన్న ..ప్రతి తమ్ముడికి చెప్పండి ..జగనన్న రెండు నెలల్లో అధికారంలోకి వస్తాడు. కచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పమన్నాను . అని అంటూ..ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నామా?లేదా అని ప్రశ్నించారు. పార్టీ చరిత్రను తెలియచేస్తూ ఒక ఎమ్మెల్యేతో ఆరంభం అయిన పార్టీ ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేల స్థాయికి చేరిందని, వచ్చే ఎన్నికలలో 175 సీట్లకు, 175 గెలుచుకోవడం అసాధ్యం ఏమి కాదని స్పష్టం చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలలో జోష్ నింపే యత్నం చేశారు. తాను చేసిన పనుల గురించి వివరించడం ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఆయన చేసిన ఒక కామెంట్ అందరిని ఆకర్షించింది. చంద్రబాబు తన చేతి వేలికి ఉన్న ఉంగరంలో చిప్ ఉందని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, చిప్ ఉండాల్సింది వేలికి కాదని, మెదడుకు, హృదయానికి అని ఆయన ఎద్దేవా చేశారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన నియోజకవర్గమైన కుప్పం ను రెవెన్యూ డివిజన్ చేయాలని తమ ప్రభుత్వానికి విజ్ఞప్తి పంపారని, దానిని కూడా తాము ఆమోదించామని జగన్ చెప్పినప్పుడు జనం నుంచి విశేష స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్యూడల్ పెత్తందార్లకోసం పనిచేస్తుందని, చంద్రబాబుది వెన్నుపోట్ల సిద్దాంతం అయితే, తమది నిబద్దతతో కూడిన విధానం అని,పేద, దిగువ మధ్యతరగతి వారికోసం పనిచేసే పార్టీ అని ఆయన పోల్చి చెప్పారు. ఇందుకు ఉదాహరణ ఇస్తూ చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల పిల్లలు, మనుమళ్లు ఆంగ్ల మీడియంలో చదవాలి కాని, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని వారు చెబుతున్నారని, ఇది ప్యూడల్ ధోరణి కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వారెవ్వరూ సమాధానం ఇవ్వలేకపోతున్న మాట వాస్తవం. రాజకీయ ప్రత్యర్ధుల వీక్ పాయింట్ మీద బలంగా కొట్టడం ఒక సూత్రం. దానిని జగన్ సమర్ధంగా పాటించారని అనిపిస్తుంది. ప్రత్యేకించి విద్యారంగంపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. కార్పొరేట్ స్కూళ్ల కోసం చంద్రబాబు పనిచేస్తే, తాను పేదలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్ల కోసం పనిచేస్తున్నానని ఆయన వివరించారు. విద్యారంగంలో తాను తీసుకు వచ్చిన సంస్కరణల నేపధ్యంలో జగన్ ఈ అంశాన్న పదే,పదే ప్రస్తావించినట్లు అనిపిస్తుంది.ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కి ఎంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆస్పత్రులను ఎలా మార్చుతున్నది, కొత్తగా 16వైద్య కళాశాలలను నెలకొల్పడానికి యత్నిస్తున్నది తదితర విషయాలను ఆయన వివరించారు. ఆరోగ్యశ్రీలో 2466 వ్యాధులను చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తదుపరి ఆయన రైతు భరోసా అంశానికి, ఆర్‌బికె లలో జరుగుతున్న కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. పేదలకు నేరుగా లబ్దిదారులకు లక్షా ఏభైవేల కోట్ల రూపాయలను నగద బదిలీ ద్వారా అవినీతిలేకుండా స్కీములు అమలు చేసిన విషయాన్ని ఆయన వివరించారు. ఉపన్యాసంలోని పలు అంశాలు గత కొంతకాలంగా చెబుతున్నవే అయినా, వాటిని వివరించిన తీరు పార్టీవారిని ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. కోనసీమ జిల్లాకు రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పేరు జత చేస్తే టీడీపీ, జనసేనలు ఎస్సి మంత్రి ఇంటిని, ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని దగ్దం చేస్తారా అని ప్రశ్నించినప్పుడు సభికులలో వచ్చిన స్పందనను బట్టి ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. ఈ వ్యవహారం తమకు రాజకీయంగా లాభం చేస్తుందని ఆశించిన టీడీపీ, జనసేనలకు వీరి రియాక్షన్ చూశాక, వారికి తీవ్ర ఆశాభంగం తప్పదని తేలుతుంది. అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అక్కడ పెట్టారని అన్నారు. దుష్టచతుష్టం అంటూ చంద్రబాబు, ఈనాడు, ఆంద్రజ్యోతి , టివి5ల తీరును ఆయన దుయ్యబడుతూ ఎల్లోమీడియా అబద్దాలు చెప్పినంతమాత్రాన అవి వాస్తవాలు కావని, గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామసింహాలు అసలు సింహాలు కాలేవని ఎద్దేవా చేశారు. పనిలో పని ఆయన దత్తపుత్రుడిని కూడా వదలలేదు. ఒక వైపు ప్రభుత్వపరంగా చేసినవాటిని చెబుతూనే, మరో వైపు రాజకీయంగా ప్రత్యర్ధులపై దాడి తీవ్రతను తగ్గించకుండా జాగ్రత్తపడ్డారని చెప్పాలి. అంతిమంగా 175 స్థానాలు గెలుపే లక్ష్యమని ఆయన పిలుపు ఇవ్వడం పార్టీ కార్యకర్తలలో జోష్ నింపే యత్నం చేశారు. విశేషం ఏమిటంటే జగన్ స్పీచ్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటూనే ఉన్నారు. సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడుకు పెద్ద ఎత్తున జనం వచ్చారని ప్రచారం చేసిన టీడీపీ మీడియాకు ఒకరకంగా ఈ ప్లీనరీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్లీనరీకే ఇన్ని లక్షల మంది వస్తారని వారు ఊహించి ఉండకపోవచ్చు. దీంతో మహానాడు వెలవెల పోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇలా జనం తరలివస్తే ఎన్నికల మూడ్ అనుకోవచ్చు.కాని ఇంకా రెండేళ్లు సమయం ఉండగా జరిగిన ఈ ప్లీనరీకి ఇంత భారీగా కార్యకర్తలు వచ్చారంటే,దాని అర్ధం ప్రజలలో వైసీపీకి ఆదరణ చెక్కుచెదరలేదనే తేలుతుంది. ఇంత భారీగా వచ్చినంత మాత్రాన గెలవాలని ఉందా అన్న ప్రశ్న రావచ్చు. కాని వచ్చినవారు స్పందించిన తీరు ముఖ్యం. ఆ విషయంలో జగన్ స్పీచ్‌కి కాని , మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్ వంటివారు మాట్లాడినప్పుడు కాని జనం హర్షద్వానాలు చేసిన తీరు కూడా గమనించవలసి ఉంటుంది. అందులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందకు,వంద శాతం మార్కులు పడతాయి.పార్టీ ప్రధాన వేదిక ఉన్న శిబిరంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో, అంతకు పలురెట్ల మంది బయట ఉండడం, రోడ్లన్ని జనం తో కిక్కిరిసిపోవడం స్పష్టంగా కనిపించింది. మాజీ మంత్రి పేర్ని నాని జరగబోయే ఎన్నికలు జగన్ కేంద్రంగా జరుగుతాయని, ఎమ్మెల్యేలు ఎవరూ శాశ్వతం కాదని, కార్యకర్తలే కీలకం అని, వారిలో అసంతృప్తి ఉండబోదని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సందేశం పంపించారని అనిపించింది. అదే సమయంలో పైర్ బ్రాండ్ గా పేరొందిన మరో మాజీ మంత్రి కొడాలి నాని ప్రసంగించనున్నారని ప్రకటించగానే , సభికులలో వచ్చిన రియాక్షన్ చూస్తే ఈయనకు ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. తొలి రోజు పార్టీ గౌరవాద్యక్షురాలు విజయమ్మ రాజీనామా ప్రకటన సంచలనత్మాకంగా ఉందని చెప్పాలి. అయితే ఆమె చెప్పిన తీరు, వివరించిన కారణాలు, రెండు రోజుల పాటు సమావేశాలలో జగన్ చెంతనే కూర్చోవడం ద్వారా తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేని తేటతెల్లం చేశారు. ఇది కూడా టిడిపి మీడియాకు నిరాశ మిగిల్చింది. విజయమ్మ ప్లీనరీకి రాకుండా రాజీనామా ప్రకటన చేస్తారేమోనని, ఒకవేళ వచ్చినా ఆమె రాజీనామా పార్టీలో ప్రకంపనలు రేపుతుందని వారు ఆశించినా, ఆమె మాత్రం చాలా హుందాగా, కుమారుడిపట్ల తన ప్రేమాభిమానాలు కనబరుస్తూనే, తెలంగాణలో తన కుమార్తె షర్మిలకు అండగా ఉండడానికే అని వివరించడంతో పార్టీకి సమస్య రాకుండా పోయింది. జగన్ ను పార్టీ శాశ్వత అద్యక్షుడిగా నియమావళి సవరించుకోవడం కూడా ఆసక్తిగా ఉంది. గతంలో కరుణానిధి కూడా తమిళనాడులో ఇలాంటి పదవిలోనే ఉన్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షుడు సాధారణంగా చాలాకాలం ఒకరే ఉంటారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో సోనియాగాంధీ గత 23 ఏళ్లుగా అద్యక్ష స్తానంలో ఉన్నారు. ఇది దాదాపు శాశ్వత అధ్యక్ష పదవి అన్నట్లుకాకుండా మరొకటి అవుతుందా? అంతదాకా ఎందుకు ఎన్.టి.ఆర్. తన కుటుంబమే తనను దారుణంగా అవమానించి తొలగించేంతవరకు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించిన చంద్రబాబు ఉమ్మడి ఎపి విభజన వరకు టిడిపి అధ్యక్ష పదవిలోనే ఉన్నారు. విభజన తర్వాత జాతీయ అధ్యక్ష పదవి క్రియేట్ చేసుకుని కొనసాగుతున్నారు. అంటే 27 సంవత్సరాలుగా ఆయన అధినేతగా కొనసాగుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం వైసిపిలో శాశ్వత అధ్యక్ష పదవి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తానేమో ఎన్నికైనట్లు, రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను నియమించినట్లు నాటకీయత నడుపుతున్నారే తప్ప, తానేమీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పుకోవడం లేదు. ఇక్కడే చంద్రబాబుకు , జగన్ కు తేడా తెలుస్తుంది. చంద్రబాబు ప్రతిదానిని మాయ చేయాలని అనుకుంటారు. జగన్ పెయిర్ గా ,పారదర్శకంగా ఉండాలని అనుకుంటారు. అందుకే బహుశా ఈ శాశ్వత అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. ఇక తీర్మానాల గురించి వస్తే నవరత్నాల గురించి బాగా పోకస్ పెట్టారు. అదే సమయంలో వక్తలంతా సహజంగానే ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఇది సహజంగా అన్ని పార్టీలలో జరిగేది. సమయాభావం వల్ల అన్ని తీర్మానాలపై వక్తలు పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోయారు. ఏది ఏమైనా తమ పార్టీ మహానాడు హిట్ అయిందని టిడిపి నేతలు చంకలు గుద్దుకుంటున్న సమయంలోనే వైసిపి ప్లీనరీ సూపర్ హిట్ అవడం ద్వారా ప్రజలు ఎటు వైపు ఉన్నది మరోసారి తేలిందని అనుకోవచ్చేమో! -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
2024 తర్వాత చంద్రబాబు ఏమైపోతాడో అని భయమేస్తుంది
-
పార్టీ క్యాడర్లో కొత్త జోష్.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: జూలై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీని సక్సెస్ చేసిన అందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 'జనసంద్రంగా ప్లీనరీ మారటం అందరూ చూశారు. పార్టీ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. అణగారిన వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్బీకేలు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాం. ఈ విషయాల్లో ప్రపంచమే మెచ్చుకుంటుంటే చంద్రబాబు భావదారిద్రంతో విమర్శలు చేస్తున్నారు. 4 లక్షల మంది ప్లీనరీ దగ్గర, 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. కానీ ఆంధ్రజ్యోతి, విగ్గురాజుకి మాత్రం జనం కనపడలేదు. ఈనాడు సైతం నిజం రాయక తప్పలేదన్నారు. చదవండి: (శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్) బాబు ఏమవుతాడోననే భయంగా ఉంది చంద్రబాబుకి మెదడులో ఉండాల్సిన చిప్ వేలికి వచ్చింది. తరువాత కాలికి వస్తుంది. అల్జీమర్స్‌తో బాధ పడుతున్న బాబు 2024 తర్వాత ఏమవుతాడోననే భయంగా ఉంది. టీడీపీ మహానాడులో వైఎస్సార్సీపీని తిట్టడం, తొడ గొట్టడమే జరిగాయి. కానీ మా ప్లీనరీలో మేము ఏం చేశామో? ఇంకా ఏం చేయాలో చర్చించాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు జగన్‌ని ఎదుర్కోగలడా?. నవరత్నాలు ఎలా అమలు చేశామో ప్రజలకి తెలుసు. నవరత్నాలను విమర్శించిన వారి నవరంధ్రాలు మూసుకుపోయేలా ప్లీనరీకి జనం వచ్చారు. పవర్లో లేమనే బాధతో చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లి ఒక శాడిస్టుగా మారాడు. చంద్రబాబు, ఆయన కుల మీడియా జగన్‌ని విమర్శించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. జగన్‌ని ఎప్పుడు దించేసి చంద్రబాబును సీఎం చేద్దామా అని కుట్రలు పన్నుతున్నారు. కానీ జగన్ వెన్నుపోటుతో అధికారంలోకి రాలేదు అని విమర్శించారు. చదవండి: (నాదంటే.. నాదే: కడప టీడీపీలో రగులుతున్న చిచ్చు) వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడు అమరావతి అనేది ప్రపంచంలో అతి పెద్ద స్కాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాడో ఇప్పటికీ లెక్క చెప్పలేదు. నెగెటివ్ భావాలతో బాధ పడుతున్న చంద్రబాబు ఇక రిటైర్ అవటమే బెటర్. చేతగాని వాళ్లు గోబెల్స్ ప్రచారాన్ని ఎన్నుకుంటారు. జగన్ ధైర్యంగా చేసిందే చెప్పుకుంటాడు. ప్లీనరీ జరగకుండా వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడు. అలాంటి శాడిస్టు మనస్తత్వం చంద్రబాబుదన్నారు. దినేష్ కుటుంబానికి అండగా ఉంటాం ప్లీనరీకి వచ్చిన దినేష్ చనిపోయారు. పోయిన ప్రాణం తీసుకు రాలేకపోయినా అండగా ఉంటాం, సాయం అందిస్తాం. వేమూరు ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జున పార్టీ తరపున ఐదు లక్షలు సాయం చేస్తున్నారు. ప్లీనరీకి ఆటంకం కలగకుండా పోలీసులు బాగా పని చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా జగన్‌ని ఎన్నుకున్నాం. అంతర్గత ప్రజాస్వామ్యం లేదనటం కరెక్టు కాదు. ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ జగన్‌ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అది పబ్లిక్‌గానే జరిగింది' అని విజయసాయిరెడ్డి అన్నారు. -
శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల విజయవంతానికి తనవంతు కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ విప్ హోదాలో చెవిరెడ్డి వారం రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. సమావేశాల నిర్వహణలో తనకున్న అనుభవం దృష్ట్యా అన్నీతానై వ్యవహరించారు. రెండో రోజు శనివారం ప్లీనరీ ప్రాంగణం చేరుకున్న సీఎంను మంత్రి పెద్దిరెడ్డితో పాటు చెవిరెడ్డి కలిశారు. ఆ సందర్భంగా ‘శభాష్.. భాస్కర్’ అంటూ చెవిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు) -
మీ మద్దతుకు.. మరోసారి సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు అత్యంత ఘనంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ప్లీనరీ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ప్లీనరీ జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఇరువైపులా దాదాపు 20 కి.మీ. మేర ఎటు చూసినా జన ప్రవాహం, బారులు తీరిన వాహనాలే కనిపించాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది కాలి నడకన వేదిక వద్దకు వచ్చారంటే జన ప్రవాహాన్ని ఊహించవచ్చు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకున్నారు. ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగియడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నారు. ‘నిరంతరం-దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు.. ఇవే నాకు శాశ్వత అనుబంధాలు.. కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో.. చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు... మీ జగన్ సెల్యూట్, మరోసారి!’ అని ట్వీట్ చేశారు. చదవండి: అమర్నాథ్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు.. సీఎం జగన్ ఆరా.. కీలక ఆదేశాలు నిరంతరం– దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు... ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో... చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు... మీ జగన్ సెల్యూట్, మరోసారి! — YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2022 -
YSRCP Plenary: జడి వానలోనూ అభిమాన ప్రవాహం
వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ సీపీ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఇరువైపులా దాదాపు 20 కి.మీ. మేర ఎటు చూసినా జన ప్రవాహం, బారులు తీరిన వాహనాలే కనిపించాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ప్లీనరీ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ ప్రసంగాన్ని వినేందుకు 20 కి.మీ. మేర నడిచి ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నట్లు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం చంద్రాపల్లెకు చెందిన రంగయ్య ‘సాక్షి’కి తెలిపారు. ఆయన ఒక్కరే కాదు.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది కాలి నడకన వేదిక వద్దకు వచ్చారంటే జన ప్రవాహాన్ని ఊహించవచ్చు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిపై దక్షిణాన చిలకలూరిపేట నుంచి ఉత్తరాన విజయవాడ వరకూ కిలోమీటర్ల మేర ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ప్లీనరీ తొలి రోజైన శుక్రవారం జరిగిన ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ అగ్రనేతలు అంచనా వేయగా దాదాపు రెట్టింపు స్థాయిలో తరలివచ్చారు. రెండో రోజైన శనివారం విస్తృత స్థాయి సమావేశానికి నాలుగు లక్షల మంది రావచ్చని భావించగా అంతకు మించి హాజరయ్యారు. అంచనాలకు మించి జనం పోటెత్తడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా మొత్తం పది తీర్మానాలపై సమావేశాల్లో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. వైఎస్సార్ సీపీ జీవిత కాల జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనం మెచ్చిన పరిపాలన..: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల హామీల్లో 95 శాతం తొలి ఏడాదే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో రూ.1.60 లక్షల కోట్లను నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించడం ద్వారా పాలకులుగా చేశారు. విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే చేరవేసి అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. తాము కాలరెగరేసుకుని తిరిగేలా సీఎం జగన్ జనరంజకంగా పాలిస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో ప్లీనరీ విస్తృత స్థాయి సమావేశానికి కదలి వచ్చారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకోవడం గమనార్హం. ఉదయం 7 గంటలకే..: శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచే చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. కర్ణాటక సరిహద్దున ఉన్న శ్రీసత్యసాయి జిల్లా, ఒడిశా సరిహద్దున ఉన్న శ్రీకాకుళం వరకూ 26 జిల్లాల నుంచి కదలివచ్చిన శ్రేణులు ఉదయం 7 గంటలకే ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నాయి. 11.30 గంటలకే ప్లీనరీ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. చిరు జల్లులతో ప్రారంభమైన వాన ఉద్ధృతి అంతకంతకు పెరిగినా కదలలేదు. వాన ఉద్ధృతితో పోటీ పడుతూ ఉప్పెనలా పోటెత్తారు. వర్షం జోరున కురుస్తుండటంతో సాయంత్రం 4 గంటలకు ప్రసంగించాల్సిన సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్నం రెండు గంటలకే ప్రారంభించారు. ఉత్సాహపరుస్తూ దిశానిర్దేశం..: మహానేత వైఎస్సార్ 2009 సెప్టెంబరు 2న హఠాన్మరణం చెందినప్పటి నుంచి 2019లో అధికారంలోకి వచ్చే వరకూ అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తన వెన్నంటి నిలిచిన కార్యకర్తలు, అభిమానులకు సెల్యూట్ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించగానే.. శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీ జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటన వెలువడిన అనంతరం శ్రేణుల హర్షధ్వానాల మధ్య సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో వైఎస్సార్సీపీని గెలిపించారని.. ఘోర పరాజయంతో సైకిల్ చక్రాలు ఊడిపోయాయని టీడీపీపై చెణుకులు విసిరినప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలతో ప్రతిస్పందించారు. చక్రాలు లేని సైకిల్‌ను తొక్కలేక.. కొడుకుతో తొక్కించలేక చంద్రబాబు అరువుకు దత్తపుత్రుడిని తెచ్చుకున్నారన్న సెటైర్‌కు ఈలలు, కేకలతో ప్లీనరీ ప్రాంగణం ప్రతిధ్వనించింది. అర్జునులు మీరే..: ‘మన ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన దుష్ట చతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తుంది. గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలను చైత్యన పరచండి’ అని శ్రేణులకు సీఎం జగన్ నిర్దేశించారు. ‘చంద్రబాబు కౌరవ సైన్యాన్ని ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర మీదే..’ అంటూ సీఎం జగన్ బాధ్యత అప్పగించగా.. తాము తీసుకుంటామని కార్యకర్తలు ప్రతిస్పందించారు. ‘వచ్చే ఎన్నికల్లో మనం 175కి 175 స్థానాలూ గెలవాలి. అది అసాధ్యమేమీ కాదు సుసాధ్యమే. మనం చేస్తున్న మంచితో కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించారు. పంచాయతీ ఎన్నికల్లో, మండల పరిషత్, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. అదే రీతిలో 175 స్థానాలు గెలవాలన్నదే మన లక్ష్యం’ అని సీఎం జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం జగన్ ప్రసంగం ముగిశాక కూడా చాలాసేపు శ్రేణులు ప్లీనరీ ప్రాంగణం నుంచి కదల్లేదు. జాతీయ గీతాలాపన అనంతరం వెనుతిరిగాయి. గుండెల నిండా అభిమానం.. వైఎస్సార్సీపీ పట్ల కార్యకర్తల్లో ఎంత అభిమానం ఉందంటే ప్లీనరీ ముగిశాక పలువురు సీఎం జగన్ కటౌట్లను తమ వెంట భద్రంగా తీసుకెళ్లారు. ఒకవైపు కార్యకర్తలు తిరుగు ప్రయాణం కాగా మరోవైపు చాలా వాహనాలు ఇంకా ప్లీనరీకి వస్తూనే ఉన్నాయి. -
చరిత్రకెక్కిన సామాజిక విప్లవం
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో, ఊహకు అందని స్థాయిలో సామాజిక మహా విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని వైఎస్సార్ సీపీ ప్లీనరీలో పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సాధికారత గురించి మాట్లాడుకుంటే వైఎస్ జగన్ అధికారంలోకి రాక ముందు.. జగన్ వచ్చాక అనే తరహాలో చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. శనివారం ప్లీనరీ సమావేశాల్లో సామాజిక సాధికారతపై హోంమంత్రి తానేటి వనిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రవర్ణ పేదలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు చేస్తున్నారని తెలిపారు. అంతకు మించి అవకాశాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన దానికంటే అధికంగా సీఎం జగన్ అవకాశాలిచ్చారు. తొలి మంత్రివర్గంలో 60 శాతం, మలి విడత మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఆయా వర్గాలకే కేటాయించారు. బలహీనవర్గాలను బలవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. దళితులు దర్జాగా బతికేలా చేస్తున్నారు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తాం.. తోలు తీస్తాం అని చంద్రబాబు బెదిరిస్తే, టీడీపీ నేతలు మీకెందుకురా రాజకీయాలు? అంటూ ఎస్సీలను గేలి చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చంద్రబాబు కనీసం ఆలోచన కూడా చేయలేదు. – తానేటి వనిత, హోంమంత్రి మానవత్వం చాటుకున్నారు సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి జగన్. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంతో మేలు జరిగింది. అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలంటే ఆయా వర్గాల్లోనే పుట్టాల్సిన పనిలేదు. ఏ వర్గంలో జన్మించినా సమాజం పట్ల బాధ్యత, పేదల పట్ల కరుణ, మానవత్వం ఉంటే చాలని సీఎం జగన్ నిరూపించారు. మానవత్వమే నా కులం, మాట నిలబెట్టుకోవడమే నా మతం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఆయనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 2014లో టీడీపీ ఇచ్చిన 200 వాగ్దానాల్లో పది శాతాన్ని కూడా అమలు చేయలేదు. సీఎం జగన్ చేసిన వాగ్దానాల్లో నూటికి 96 శాతం అమలయ్యాయి. మనుషులనే కాదు.. చివరకు దయ్యాలను కూడా చంద్రబాబు మోసం చేయగలరు. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సామాజిక విప్లవకారుడు సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో చాటి చెప్పారు. బీసీలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన వాటాకు మించి పదవులు, ఫలాలు అందించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే బీసీలు తలెత్తుకుని నిలబడగలిగారు. దేశంలో సామాజిక విప్లవకారుడు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. ఇతర రాష్ట్రాలే కాకుండా కేంద్రానికి సైతం ఆయన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీసీల ఎదుగుదల చూసి ఓర్వలేక చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. ఆ విష ప్రచారాన్ని గడప గడపకు వెళ్లి తిప్పికొడతాం. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి ఓటు వేయని వారికి కూడా.. తనకు ఓటు వేయని వారికి కూడా అర్హతే ప్రామాణికంగా మేలు చేకూర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. సామాజిక న్యాయం అక్కడే మొదలైంది. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వారిలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు ఎంతోమంది ఉన్నారు. మంత్రి పదవులే కాకుండా రాజ్యాంగ పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూర్చోబెట్టి గౌరవించిన గొప్ప నాయకుడు సీఎం జగన్. ఓ రిక్షా కార్మికుడి కుమారుడు దివంగత వైఎస్సార్ తెచ్చిన ఫీజుల పథకం వల్ల అమెరికాలోని చికాగోలో ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి బాటలోనే నడుస్తూ సంక్షేమ కార్యక్రమాలతో సీఎం జగన్ సామాజిక విప్లవం తెస్తున్నారు. – కారుమూరి నాగేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మంత్రి -
మూడు రాజధానులకు మోకాలడ్డు
ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్ మీడియా రాసినంత మాత్రాన, చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు అయిపోవు. గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికీ ఈ మూడేళ్లలో చేసిన మంచిని చూపిస్తుంటే గ్రామ సింహాలు తట్టుకోలేకపోతున్నాయి. మనం బటన్ నొక్కి ప్రజలకు నేరుగా లబ్ధి కలిగిస్తుంటే.. వాళ్ల బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అనే భయంతో, దురుద్దేశంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని రోజూ అరుస్తున్నాయి. బాబు హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయ్యిందా? వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి : ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగేలా మూడు రాజధానులు ఇస్తామంటున్నాం. అందులో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామన్నాం. కానీ చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టయం కొనుగోలు చేసిన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడుతున్నారు. ఇదీ టీడీపీకి, దుష్టచతుష్టయానికి తెలిసిన ప్రాంతీయ న్యాయం’ అని వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. మూడు ప్రాంతాల ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. మన రాష్ట్రంలో మరోసారి ఎలాంటి ఉద్యమాలు రాకుండా, అన్యాయం జరిగిందనే వాదనలకు అవకాశం ఇవ్వకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తున్నాం. ఇలా చేస్తే బాబు అండ్ కో వారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దెబ్బ పడుతుందని కుట్రలకు తెర లేపారు’ అన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తారా! రాష్ట్రంలో 75 ఏళ్లలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే అదనంగా ఏర్పడితే.. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి.. మొత్తంగా 26 జిల్లాలను చేశాం. అందులో ఒక జిల్లాకు మన రాజ్యాంగ నిర్మాత, దళిత శిఖరం అంబేడ్కర్ పేరు పెట్టినందుకు ఏకంగా ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టించిన దుర్మార్గం చంద్రబాబుది, ఆయన దత్తపుత్రుడిది. పగటి కలలు కంటున్నారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న పథకాలకు డబ్బు పుట్టేందుకు వీల్లేదని వీరంతా ఒక్కటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వక్రీకరించి చెప్పింది. అమ్మ ఒడి బూటకం, విద్యా దీవెన నాటకం అని వీటన్నింటినీ ఎత్తేసేందుకు స్కెచ్‌లు కూడా గీస్తున్నారు. వీళ్లను ఎవరో నమ్మినట్టుగా.. అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారు. ఎన్నికలకు సన్నద్ధం కండి వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ, బూత్ కమిటీలు కూడా గడువులోగా పూర్తి చేయండి. ఎన్నికలకు సన్నద్ధం కండి. ప్రజలు ఏమైనా సమస్యలు చెబితే వెంటనే పరిష్కరించేలా పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యకర్తలు, అభిమానులు చొరవ చూపాలి. మారుతున్న మన గ్రామాన్ని చూపించండి.. వారితో కలిసి వివరించండి. సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయాలి బూత్ కమిటీల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 శాతం ఉండేలా.. అందులో 50 శాతం అక్కచెల్లెమ్మలు ఉండేలా చూడండి. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారాలు, దుష్టచతుష్టయం పన్నాగాలను తిప్పికొట్టేలా ప్రతి గ్రామంలోనూ సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయండి. మీ భవిష్యత్ బాధ్యత నాదీ మీ తోడు, మీ అండ నన్ను ఇంతటి వాడిని చేశాయి. అలాంటి కార్యకర్తలకు ఈ రోజు ఒక్కటే చెబుతున్నా.. ఈ పార్టీ మీది. జగన్ మీ వాడు. అని జగన్ అనే నేను చెబుతున్నా.. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, కార్యకర్తల భవిష్యత్తుకు నాదీ బాధ్యత. మీ కష్టాల్లో, సుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలి. 175 సీట్లు సుసాధ్యమే ► ఈ దుష్టచతుష్టయం రేపు ఎన్నికల కోసం దుర్బుద్ధితో దొంగ వాగ్దానాలు చేస్తారని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ► మన కార్యకర్తలు,అభిమానులు, మన సంక్షేమ పథకాలు అందుకుంటున్న కుటుంబ సభ్యులే మన సైన్యం. ఇంటింటికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఎలా అందిస్తున్నామో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ఇంటింటా వివరిస్తున్నారు. ప్రతి ఇంటికి అందిన ప్రయోజనాలను లెటర్ల రూపంలో చూపిస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి వలంటీర్ మమేకం కావాలి. మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడదామని చెప్పండి ► మీ అండదండలు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేద్దాం. ఇది అసాధ్యం కానే కాదు. ఎందుకంటే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం ప్రజలు కూడా మనం చేసిన మంచిని గుర్తించి స్థానిక ఎన్నికల్లో మనల్ని గెలిపించారు. -
తల్లిని మించిన స్థానం ఇంకొకటి ఉందా?
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు తన ఇద్దరు పిల్లలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎవరికీ ఇబ్బందిలేకుండా గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి తల్లిగా కొనసాగనున్నట్లు విజయమ్మ ప్రకటించారని మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కానీ, తల్లి విలువ తెలియని దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈ ప్రపంచంలో తల్లికి మించిన స్థానం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. రెండోరోజు వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘ఎల్లో మీడియా–దుష్టచతుష్టయం’ తీర్మానంపై జరిగిన చర్చలో ఆయనతోపాటు మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లతోపాటు మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 420 బ్యాచ్ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబులకు రాజకీయ సమాధి చేసి తీరుతామని.. వారికి పిచ్చిపట్టడం ఖాయమన్నారు. ఈ క్రమంలో ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం’ను అమరావతిలో ఐదు ఎకరాల్లో ఏర్పాటుచేసి అందులో వీరందరినీ చేర్పించి, అక్కడే వీరికి శాశ్వతంగా చికిత్స ఇప్పించే బాధ్యత తీసుకుంటామని వివరించారు. కొడాలి నాని ఇంకా ఏమన్నారంటే.. తల్లి విలువ తెలియని 420లు గతరెండు, మూడ్రోజులుగా విజయమ్మపై డిబేట్లు పెడుతున్నారు. జగన్ తన కుమార్తెను కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. లోకేష్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు, నీ కుటుంబ సభ్యులు అమెరికాకు నడుచుకుంటూ వెళ్లారా లేక సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారా? బాబును తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎం జగన్‌ను రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలనే కుట్రకు తెరలేపారు. రాష్ట్రంలో పేద పిల్లలు చదవాలన్నా, పేదల సొంతింటిæ కల నెరవేరాలన్నా, వారు ఆర్థికంగా పైకి రావాలన్నా సీఎం జగన్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ సింహం జగన్ కుళ్లు, కుతంత్రాలు తెలియని రాజకీయ సింహం వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్ జగన్ అనే నినాదమే మార్మోగుతోంది. చంద్రబాబుతో యుద్ధమైతే 5నిమిషాల్లో పూర్తి చేస్తాం.. కానీ, ఆయన వెనకున్న దుష్టచతుష్టయం రామోజీరావు, చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులతో యుద్ధం. వీరు జగన్ నుంచి అధికారాన్ని లాక్కునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఈ దుష్టచతుష్టయం నిత్యం కట్టుకథలు రాసి జగన్‌పై బురదజల్లుతున్నారు. వాటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంకావాలి. చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న ఆయన దత్తపుత్రుడికి కావాల్సింది ప్యాకేజీ మాత్రమే. మీటింగుల్లో ఆయనను సీఎం సీఎం అంటుంటే, ఆయన మాత్రం చంద్రబాబు సీఎం అంటున్నాడు. పార్టీ శ్రేణులంతా గడపగడపకు వెళ్లి జగనన్న సందేశాన్ని వినిపించాలి. – అంబటి రాంబాబు,జలవనరుల శాఖమంత్రి జగన్ అంటే తగ్గేదేలే.. సోనియా వంటి మహా నాయకురాలికే జగన్ భయపడలేదు. ఇక చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఎంత? భూదేవికి ఉన్నంత సహనం జగన్‌కు ఉంది. జగన్ అంటే తగ్గేదేలే. నలుగురు దొంగలు, మేకపిల్ల కథలోలా మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు అయితే మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో పిల్లదొంగ టీవీ5 నాయుడు. తమ వాడే అధికారంలో ఉండాలి, ఆయన కూడా తమ చెప్పుచేతల్లో ఉండాలనే దుర్మార్గమైన ఆలోచన వీరిది. కానీ, మా నాయకుడు ఆ నలుగురు దొంగలకు బుద్ధిచెప్పే ధైర్యశాలి. ‘సాక్షి’ ఉద్భవానికి కేవలం ఈ దుర్మార్గుల రాక్షస క్రీడే కారణం. ప్రజలకు నిజం చెప్పడానికే ఈ పత్రిక పుట్టింది. ఆ నలుగురిది కుల ఉన్మాదం. విజయమ్మ ఎంతో హుందాగా మాట్లాడితే విషం చిమ్మారు. పవన్, చంద్రబాబు వగైరా అంతా కట్టకట్టుకుని వచ్చినా జగన్ పొట్లాం కట్టి పంపిస్తారు. కార్యకర్తలు జగన్ కోసం పనిచేయాలి. ఆయనే శాశ్వతం. జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. – పేర్ని నాని, మాజీమంత్రి అభివృద్ధి చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది. చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడుకి ఇక్కడ ఇళ్లు కూడా లేవు. వైఎస్సార్సీపీ సైన్యం ధాటికి 2024 ఎన్నికల్లో దుష్టచతుష్టయం పారిపోవాల్సిందే. మాట్లాడితే మమ్మల్ని పీకుతామంటున్నారు.. కానీ, ఇప్పటికే వాళ్లని ప్రజలు పీకిపాతరేశారు. చంద్రబాబు హయాంలో వీళ్లంతా గజదొంగల ముఠాలా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారు. జగన్ పాలనలో వాళ్ల అరాచకాలు, అక్రమాలకు బ్రేక్ పడడంతో తెగబాధపడుతున్నారు. అందుకే పచ్చ మీడియాలో నిత్యం అసత్య వార్తలు.. డబ్బా చానల్స్‌లో తప్పుడు డిబేట్లు పెడుతున్నారు. బాదుడే బాదుడని తిరుగుతున్న చంద్రబాబుకి 2024 ఎన్నికల్లో కుమ్ముడే కుమ్ముడు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి -
గడపగడపలో జగన్నినాదం
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రతి గడపలోనూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే వినిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం తథ్యమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోరే జగన్ ప్రభుత్వం ఉందని, అది గాంధీ కోరిన స్థానిక స్వపరిపాలన అందిస్తోందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అందులో భాగమేనన్నారు. సీఎం జగన్ సంస్కరణలు ఓ తరానికి ఆదర్శమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు శనివారం అశేష జనవాహిని హోరుతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానం మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్‌తోపాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ విషాదాన్ని దిగమింగి అనేక అవమానాలను ఎదుర్కొని తన కుమారుడిని గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దడం దేశ చరిత్రలో మరువలేనిది. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడంలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. విద్యా, వైద్యానికి, సేద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పల్లెలకు కూడా అభివృద్ధి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎల్లో మీడియాకు కనిపించడంలేదా? అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో వీటికి తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు ప్రజల మనస్సు తెలుసు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం జగన్‌ను ఆ ధర్మమే కాపాడుతుంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో సంస్కరణలు, వికేంద్రీకరణ ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే జగన్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించాలి. అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న జగన్ అధికారం అంటే తాను మాత్రమే ఎదగడం, తన వర్గం వారు మాత్రమే బాగుపడడం అనుకునే స్వార్థపరుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మోసాలు, అబద్ధాలతోనే కాలం గడిపారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందేలేదు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న నాయకుడు జగన్. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ఈ విజయం సీఎం జగన్, కార్యకర్తలదే – పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా.. సమైక్య పోరాటంతో అధికారంలోకి వచ్చిన గొప్ప చరిత్ర వైఎస్సార్సీపీది. మనం 13 ఏళ్లలో సాధించిన ఘనత మరే పార్టీకి లేదు. ఈ విజయానికి కారణం ఒకరు సీఎం వైఎస్ జగన్ అయితే.. మరొకరు పార్టీ కార్యకర్తలు. ఈ ప్లీనరీ జగన్ సైనికులకు పెద్ద పండగలాంటిది. దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉండాలో 2004, 2009లో వైఎస్సార్ పరిచయం చేశారు. పారదర్శకత కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు ఆయన. వైఎస్సార్ సంకల్పాన్ని, ఆశయాలను సీఎం జగన్ నిజంచేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి – నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం. ఆయన, ఆయన వర్గం బాగుపడితే చాలనుకునే స్వార్థపరుడు. రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అధికారంలోకి రాగానే నూజివీడులో రాజధాని అని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా తుళ్లూరులో తన వర్గీయులతో భూములు కొనిపించి తర్వాత పేదల భూములను బలవంతంగా లాక్కొన్నాడు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేమని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే చంద్రబాబు కుట్రలతో పంటలు తగలబెట్టించాడు. అభివృద్ధి అనేది ఒకేచోట కేంద్రీకృతం కారాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం మరోసారి జరగకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి. -
కిక్కిరిసిన ఫుడ్ కోర్టులు
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరైన వారితో అక్కడ ఏర్పాటు చేసిన 250 ఫుడ్‌కోర్టులు కిటకిటలాడాయి. రెండోరోజు ఉ.7 గంటల నుంచి అల్పాహారం అందించారు. సా.4 గంటలకే ప్లీనరీ ముగిసినా రాత్రి 7 గంటల వరకు ఫుడ్‌కోర్టులలో రద్దీ కొనసాగింది. దూర ప్రయాణాలు చేసేవారు డిన్నర్ కూడా చేసి బయల్దేరారు. రెండ్రోజులూ ఏ చిన్న అవాంతరమూ లేకుండా పసందైన వంటకాలు అందించడంపై సీఎం వైఎస్ జగన్, పార్టీ సీనియర్ నాయకులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు తమ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారని ఫుడ్ కమిటీ కన్వీనర్ డా. చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. చెవిరెడ్డిని అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎంపీ విజయసాయిరెడ్డి ప్లీనరీకి ముందురోజు నుంచి ముగిసేవరకు 3,400 మంది కేటరింగ్ వర్కర్లు రేయింబవళ్లు పనిచేశారని చెవిరెడ్డి వివరించారు. చివరిరోజైన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల పాటు ఆహారాన్ని అందించామన్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కార్యకర్త నుంచి మంత్రుల వరకు అందరికీ ఒకే మెనూను అమలుచేశామని.. మొత్తం 25 రకాల వంటకాలను వడ్డించామని ఆయన తెలిపారు. మొదటిరోజు 2 లక్షల మంది వరకు భోజనం అందించామని, రెండోరోజు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది భోజనం చేశారని చెవిరెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీ జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికయ్యారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య ప్లీనరీ రెండో రోజు శనివారం పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి రోజు నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలో వైఎస్ జగన్ తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షునిగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వేదిక మీద ఉన్న నాయకులంతా సీఎం వైఎస్ జగన్‌ను అభినందనలతో ముంచెత్తగా.. ఆయన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ రాజ్యాంగానికి ప్లీనరీలో పలు సవరణలు చేశారు. ఈ సవరణల ప్రతిపాదనలకు కార్యకర్తలు హర్షాతిరేకాలతో ఆమోదం తెలిపారు. ‘ఆర్టికల్ ఒకటి ప్రకారం యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్సీపీగా గుర్తించవచ్చు’ అన్న సవరణకు ఆమోదం తెలిపారు. ఆర్టికల్ 8,9 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ అధ్యక్షులు జీవిత కాల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని చేసిన మరో సవరణకు ఆమోదం తెలిపారు. 10 తీర్మానాలకు ఆమోదం రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తొలి రోజు మహిళా సాధికారత–దిశ చట్టం, విద్యా రంగం, నవరత్నాలు–డీబీటీ, వైద్య ఆరోగ్యంపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ–పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు–ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణ తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. -
వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించాం
ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్నాం. కానీ ఇచ్చిన మాటకంటే మిన్నగా రూ.13,500 చొప్పున ఐదేళ్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 52.35 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.23,875.29 కోట్ల సాయం అందించాం. సున్నా వడ్డీ పంట రుణాలిస్తున్నాం. క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీరాయితీ ఇస్తున్నాం. టీడీపీ హయాంలో చెల్లించాల్సిన బకాయిలతో కలిపి రూ.1,282 కోట్ల వడ్డీ రాయితీ అందించాం. వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు వ్యవసాయంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై మంత్రి మాట్లాడారు. ‘రైతునని చెప్పుకునే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్’ వేరు శనగ ఎలా కోయాలంటే నిచ్చెన ఎక్కి కొయ్యాలన్నారు. వంకాయ పప్పు ఎలా వండాలో రూ. 20 వేలు ఖర్చు చేసి నేర్చుకున్నాడు లోకేష్. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు రైతులను పట్టించుకోలేదు. వీరు ముగ్గురూ ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ చంద్రబాబు హేళన చేశారు. విద్యుత్ బకాయిల కోసం ఆందోళన చేసిన రైతులను పిట్టల్లా కాల్చి చంపారు. రైతులపై అక్రమంగా కేసులు బనాయించారు. అదే చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు.’ అని ధ్వజమెత్తారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టింది మొదలు గడిచిన మూడేళ్లుగా ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలిచాం. చేయిపట్టి నడిపిస్తున్నాం. సీఎం జగన్ వ్యవసాయ రంగ చరిత్రను తిరగారాస్తున్నారు. అందుకే నిండు నూరేళ్లూ ఆయనే సీఎంగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. పాలకుడు మంచి వాడైతే ప్రకృతి సహకరిస్తుందని మూడేళ్లుగా చూస్తున్నాం. కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. సంపూర్ణంగా సాగు నీరు అందిస్తున్నాం. లక్ష్యానికి మించి పంటలు పండుతున్నాయి. జగనన్న పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి కాకాణి తెలిపారు. ఏపీలో వ్యవసాయాభివృద్ధిపై మంత్రి చెప్పిన అంశాలు.. ► పైసా భారం పడకుండా పంటల బీమా అందిస్తున్నాం. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఇప్పటి వరకు రూ.6,684.84 కోట్ల బీమా అందించాం. గత ఖరీఫ్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల బీమా సొమ్ము జమ చేశాం. ► సీజన్ ముగియకుండానే పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. పాత బకాయిలతో కలిపి రూ.1,612.80 కోట్లు ఇచ్చాం. ► ఇలా వివిధ పథకాల ద్వారా మూడేళ్లలో రైతులకు రూ.1.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూర్చాం. ► రైతుల కోసం గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి. ► నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. గ్రామ స్థాయిలో అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పరికరాలు అందిస్తున్నాం. ఇటీవలే సీఎం 3,800 ట్రాక్టర్లు, 320 హార్వెస్టర్లు అందించారు. గతంలో రైతురథాల పేరిట దోపిడి జరిగింది. ఏ కంపెనీ వద్ద ఏ మోడల్ ట్రాక్టర్ కొనాలో ప్రభుత్వ పెద్దలే నిర్ణయించేవారు. మార్కెట్ రేటుకంటే ఎక్కువ రేటుతో కొనాల్సి వచ్చేది. ఆ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లేది. కానీ నేడు 175 మోడల్స్ రైతుల ముందుంచాం. కోరుకున్న కంపెనీ నుంచి కోరుకున్న మోడల్ ట్రాక్టర్ కొనుగోలుచేసే అవకాశం కల్పించాం. -
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: గత మూడేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారని మండిపడ్డారు. ‘ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే ఆరోగ్యశ్రీ పేషంట్లు భయపడే పరిస్థితి ఉండేది. నెట్వర్క్ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండేవి. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండేవారు కాదు. వసతులు కూడా లేవు. సెల్‌ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేసేవారు. ఆస్పత్రిలో పిల్లలను ఎలుకలు కొరికిన సంఘటనలు. 108, 104 వాహనాల సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ మూడేళ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి’ అని కోరారు. ఈ మూడేళ్లలో నాడు–నేడుతో మొత్తంగా గవర్నమెంట్ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నామని, కొత్తగా 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని చెప్పారు. ‘ఆరోగ్యశ్రీ పరిధిని 1,000 రోగాల నుంచి ఏకంగా 2,466 రోగాలకు పెంచాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు, గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు దిశగా అడుగులు వేస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వైద్య, ఆరోగ్య రంగం మీద చేసిన ఖర్చు కేవలం రూ.7,464 కోట్లు మాత్రమే. మనందరి ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలోనే రూ.30 వేల కోట్లు ఖర్చు చేసింది’ అని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్లీనరీ రెండో రోజు భారీ సంఖ్యలో హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు అన్నదాతను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వమిది ► చంద్రబాబు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా దిగిపోయారు. సున్నా వడ్డీ ఎగ్గొట్టారు. ఇన్పుట్ సబ్సిడీ, కరెంటు, విత్తనాలు, ధాన్యం కొనుగోలులో కూడా బకాయిలు పెట్టివెళ్లారు. బీమాలో బకాయిలు పెట్టారు. ► అప్పట్లో ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా? ప్రతి ఇంటికీ వెళ్లండి.. రెండు నెలలు ఓపిక పట్టండి.. జగనన్న వస్తున్నాడు.. రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.13,500 మీ చేతుల్లో పెడతాడని చెప్పమని చెప్పాను. మన ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో కేవలం రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు మేలు జరుగుతోంది. ► ఈ మూడేళ్లలో ఉచిత విద్యుత్ మీద ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పంటల బీమాగా ఇచ్చింది మరో 6,684 కోట్ల రూపాయలు. ధాన్యం కొనుగోలు మీద 45 వేల కోట్ల రూపాయలు. ఇతర పంటల కొనుగోలు మీద 7 వేల కోట్ల రూపాయలు. గత ప్రభుత్వ కరెంటు బకాయిలు కూడా 9 వేల కోట్ల రూపాయిలు మన ప్రభుత్వమే చెల్లించింది. విత్తన బకాయిలు 385 కోట్ల రూపాయలు, ధాన్యం సేకరించిన బకాయిలు 960 కోట్ల రూపాయలు... ఇవన్నీ మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది. ► రైతును గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం కాబట్టే గ్రామ స్థాయిలో ఆర్బీకేలు స్థాపించాం. విత్తనం దగ్గర్నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నలకు సూచనలు, సలహాలు ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. ఈ మూడేళ్లలో వ్యవసాయ రంగం మీద రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఈ రోజు పామాయిల్ రేట్లు ఏకంగా టన్నుకు రూ.22 వేలు ఇక్కడ కనిపిస్తోంది. గతంలో తెలంగాణలో మాత్రమే మంచి రేటు ఉండేదని పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వాపోయేవారు. లక్షాధికారులుగా మన అక్కచెల్లెమ్మలు ► ఈ మూడేళ్ల పాలనలో ఒక్క జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44.49 లక్షల మంది తల్లులకు మేలు చేస్తూ రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటికే 78.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు సగం డబ్బు రూ.12,758 కోట్లు ఇచ్చాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించిన సొమ్ము రూ.9,180 కోట్లు. ప్రతి అక్కకు రూ.18,750 చొప్పున రెండు దఫాల్లో రూ.37,500 అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వారి పేరుతోనే 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే దాదాపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి పెట్టినట్టు అవుతుంది. ► అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. 1.20 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు వారి ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఐదుసార్లు ఫోన్‌ను షేక్ చేసినా.. ఎస్ఓఎస్ బటన్ నొక్కినా పది నిమిషాల్లో పోలీసులు వస్తున్నారు. ఈలోగా ఫోన్ చేసి ఏమైందని ఆరా తీస్తున్నారు. ► దిశా పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ఇవన్నీ చంద్రబాబు పాలనలో ఏనాడైనా చూశామా? పైపెచ్చు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు రూ.14,205 కోట్ల రుణాలను మొదటి సంతకంతో మాఫీ చేస్తానని చంద్రబాబు ఎగ్గొట్టారు. సున్నావడ్డీని కూడా రద్దు చేసిన పాపానికి ఏ, బి, గ్రేడులో ఉన్న ఆ అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. ఆ తర్వాత చాలా సంఘాలు ఎన్పీఏలకు దిగజారిపోయాయి. చేతల్లో సామాజిక న్యాయం చూపించాం ► చంద్రబాబు దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఎన్నికల సమయంలో వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం. మన సిద్ధాంతానికి, చంద్రబాబు సిద్ధాంతానికి తేడా చూడండి. మన ప్రభుత్వం తొలి కేబినెట్లో, రెండో క్యాబినెట్లో ఐదుగురు చొప్పున ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. ► శాసనసభ స్పీకర్‌గా కూడా బీసీ ఉన్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీ మహిళ ఉన్నారు. మండలిలో మన పార్టీ 32 మంది ఎమ్మెల్సీలను నియమిస్తే వారిలో 18 మంది ఎమ్మెల్సీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రాజ్యసభ సభ్యులు ఎనిమిది మందిలో నలుగురు బీసీలే. ► నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇవ్వాలని ఏకంగా చట్టం చేశాం. అందులో సగం మహిళలకే ఇవ్వాలని చట్టంలో చెప్పాం. తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది. వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా ప్రతి అక్క, చెల్లెమ్మకు, ప్రతి పేద కుటుంబానికి మంచి చేసేందుకు బటన్ నొక్కి నేరుగా ట్రాన్స్ఫర్ చేసింది అక్షరాల రూ.1.63 లక్షల కోట్లు. అలా లబ్ధి పొందిన వారిలో దాదాపు 80% నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు ఉన్నారు. చంద్రబాబు హేళన చేస్తే.. మనం అందలం ఎక్కిస్తున్నాం ► బాబు హయాంలో సామాజిక న్యాయం అంటే.. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవహేళన చేసిన రోజులు. బీసీల తోకలు కత్తిరిస్తా అని అపహాస్యం చేసిన రోజులు. ఎస్టీలకు, మైనార్టీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ► ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ అనే రాజ్యాంగ బద్ధ సంస్థను ఏర్పాటు చేయని పాలన చంద్రబాబు హయాంలో ఉండేది. ఈ రోజు అందుకు భిన్నంగా ఈ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు, ఏఎంసీలు, ఆలయ బోర్డుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మొత్తం మంత్రి మండలిలో 70 శాతం పదవులు ఇచ్చాం. ► పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు రకరకాలుగా కోర్టుల్లో కేసులు వేశారు. అమరావతిలో 54 వేల ఇళ్లు పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తుంటే అడ్డుకున్నారు. అమరావతిలో ఇళ్లు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టులో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది. బృహత్తర యజ్ఞంగా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం మీ ప్రభుత్వం చేస్తోంది. లంచాలు లేవు.. వివక్షా లేదు ► చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడూ ఇదే బడ్జెట్. మరి అప్పుడు వారు ఎందుకు చేయలేకపోయారు.. ఇప్పుడు మీ జగన్ ఎలా చేయగలుగుతున్నాడని ఆలోచించండి. అప్పట్లో చంద్రబాబు మీ అన్న జగన్ కంటే ఎక్కువగానే అప్పులు చేశారు. ► అయినా వారు ఎందుకు చేయలేకపోయారంటే.. ఇప్పుడు మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు.. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయి. చంద్రబాబు హయాంలో బటన్లు లేవు, నొక్కేది లేదు.. డబ్బులు నేరుగా దోచుకో.. పంచుకో పద్థతి ఉండేది. డబ్బులో ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కు, ఇంత తన దత్తపుత్రుడికి, మిగిలిందంతా తనకు అన్నట్టుగా ఉండేది. ఈ తేడాను గమనించండి. చెత్తబుట్టలో చంద్రబాబు మేనిఫెస్టో ► చంద్రబాబు వాగ్దానం చేసిన మేనిఫెస్టో చెత్తబుట్టకు పరిమితమైంది. వాళ్ల వెబ్సైట్లో కూడా మేనిఫెస్టో కనిపించకుండా తీసేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేసి.. 10% కూడా అమలు చేయని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. ► మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. ఇంటింటికీ వెళ్లి ఇదిగో మా పార్టీ మేనిఫెస్టో.. మూడేళ్లలో అక్షరాల 95 శాతం అమలు చేశాం..అని మన ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మీకు ప్రభుత్వ పథకాలు అందితేనే.. మీకు జగనన్న న్యాయం చేశాడని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి.. జగనన్నకు తోడుగా నిలవండి అని చెబుతున్న నిబద్ధత మనది. -
CM YS Jagan: మీరే నా సైన్యం
మనకు అసత్యాలు ప్రచారం చేయడం రాదు. వెన్నుపోట్ల ద్వారా అధికారంలోకి రావడం అంతకంటే రాదు. ఆ చరిత్ర మనకు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఎవరూ మనకు లేరు. మనకు ఉన్నదల్లా నీతి, నిజాయితీ. మాటకు ప్రాణం ఇచ్చే గుణం. నిబద్ధతతో పనిచేసే ఆలోచనలు. ప్రజలకు మేలు చేయాలనే తపన. అయినా దుష్టచతుష్టయం ప్రతి రోజూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో నాకున్న గుండె ధైర్యం మీరే. రెండు సిద్ధాంతాలు, భావాల మధ్య మనకు, వాళ్లకు జరుగుతున్న యుద్ధమిది. ఈ యుద్ధంలో న్యాయాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ పార్టీ మీది. జగన్ మీ వాడు. ‘సంక్షేమం, అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోవాలి.. వారి బాబు మాత్రమే సీఎం కుర్చీలో కూర్చోవాలన్నది దుష్టచతుష్టయం, వారి దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా లక్ష్యం. అప్పుడు చంద్రబాబు ఈనాడు కానుక, బాబు ఏబీఎన్ దీవెన, నారా టీవీ5 భరోసా.. లాంటి పథకాలు తీసుకొచ్చి, గతంలోలాగా దోచుకో.. పంచుకో అన్నదే ఆచరిస్తారు. ఇప్పుడు అది ఆగిందనే వీరికి కడుపు మంట. అందుకే దుష్ప్రచారం. ఈ దొంగల ముఠాతో తస్మాత్ జాగ్రత్త’ అని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో యుద్ధం మొదలైంది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుండడం ఒకవైపు, ఆ మేలు జరగకుండా ఆపాలనుకుంటున్న వారు మరోవైపు.. ఈ యుద్ధంలో మీరే నా సైన్యం.. కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే. న్యాయాన్ని ఎలా నిలబెడతారన్నది మీ చేతుల్లోనే ఉంది’ అని వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదలకు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీ, దుష్టచతుష్టయం ఎలా వాదిస్తున్నాయో.. ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తున్నాయో గమనించాలని కోరారు. విజయవాడ– గుంటూరు రహదారిని ఆనుకుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండవ రోజు శనివారం ఆయన ముగింపు సమావేశంలో భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దుష్టచతుష్టయం.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరి దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా నుంచి మనందరి ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు, లబ్ధిదారులపై ఉందని చెప్పారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా వేసినట్లేనని ప్రజలందరికీ వివరించాలని స్పష్టం చేశారు. ఈ మూడేళ్లలోనే 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చి, రాష్ట్రంలో 85 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నందున రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు గెలుచుకోవడమే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సుసాధ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలే తన ధైర్యం.. స్థైర్యం అని.. రాష్ట్ర భవిష్యత్, కార్యకర్తల భవిష్యత్ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అభిమాన సముద్రం.. ఆత్మీయ సునామీ ► విజయవాడ–గుంటూరు మధ్య ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. వర్షం పడుతున్నప్పటికీ ఏ ఒక్కరూ చెక్కుచెదరలేదు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల మహాసముద్రం కనిపిస్తుంది. ఇది ఆత్మీయుల సునామీ. దశాబ్దం పాటు కష్టాలు భరించి, అవమానాలు సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడుంది. ► మన పార్టీ భావాలను, విధానాలను, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఈ మహాసైన్యానికి నిండుమనసుతో సెల్యూట్ చేస్తున్నాను. 13 ఏళ్లుగా నాపై అభిమానం చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కడితో ప్రారంభమైన ప్రయాణం.. ► ఈ 13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.. 2009 సెప్టెంబర్ 2న దివంగత నేత, మన ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించడంతో ఇక తమకు ఎవరు దిక్కన్న భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 700 మందికి పైగా మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వీల్లేదన్న పార్టీని ఎదురించినందుకు అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ రెండూ కలిసి నాపై కేసులు వేశాయి. ► దేశంలో శక్తివంతమైన వ్యవస్థలను ఉసిగొల్పారు. అన్యాయమైన ఆరోపణలు, అరెస్టు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. అలాంటి బెదిరింపులకు జగన్ లొంగే వ్యక్తే అయితే.. ఈరోజు మీ జగన్.. మీ ముందు ఇలా ఉండేవాడే కాదు. ఆరోజు నన్ను టార్గెట్ చేసిన మనుషులు ఒకటి అనుకుంటే.. దేవుడి స్క్రిప్టు మరోలా రాశాడు. మరి ఈ రోజున ఆ పార్టీల పరిస్థితి ఏంటి? మన పార్టీ పరిస్థితి ఏంటి?.. అన్నది చూడండి. ► ఆ రోజున చట్టసభల్లో మన సంఖ్యా బలం కేవలం రెండు. నేను ఎంపీగా, అమ్మ ఎమ్మెల్యేగా.. అది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రయాణం ప్రారంభించాం. ఒకటితో ప్రారంభమైన ఎమ్మెల్యేల ప్రయాణం ఈ రోజు 151కి చేరింది. ఒక్కడితో ప్రారంభమైన ఎంపీల ప్రయాణం.. ఈ రోజు లోక్‌సభలో 22కు చేరింది. ఇక రాజ్యసభ సభ్యుల సంఖ్య సరేసరి. అన్యాయంగా అరెస్టు చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశారు ప్రజలు, దేవుడు. దేవుడి స్క్రిప్ట్ గొప్పగా రాశాడు ► 2014 ఎన్నికల్లో 45 శాతం ఓట్లు వచ్చి.. కేవలం 1 శాతం ఓట్ల తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా జగన్‌కు ఊపిరాడనివ్వకూడదని మళ్లీ కుట్రలు చేశారు. మనకున్న 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలను, 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారు. పార్టీ నిర్వీర్యం అయిపోవాలి.. జగన్ కనపడకుండా పోవాలని కుయుక్తులు, కుతంత్రాలు చేశారు. ► కానీ, దేవుడు మరోలా స్క్రిప్టు రాశాడు. మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిందో.. అదే పార్టీకి మళ్లీ 2019 ఎన్నికల్లో వచ్చింది సరిగ్గా 23 ఎమ్మెల్యే స్థానాలు.. 3 ఎంపీ స్థానాలు. దేవుడు స్క్రిప్టు చాలా గొప్పగా రాస్తాడు. అది కూడా మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుందనేందుకు ఇదే నిదర్శనం. మంచి చేయడంపైనే నా ఫోకస్ ► గత ప్రభుత్వం మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, ఆ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలు నేను ఎప్పుడూ చేయలేదు. నా ఫోకస్ ప్రతిపక్షం మీద పెట్టలేదు. ఎంత మంచి చేస్తాం.. ఎలాంటి పాలన అందించగలుగుతామనే అంశంపై దృష్టి పెట్టాను. ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉండే సభ్యులు, వారి అవసరాలు.. అణగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా, అధికారంలో వాటాపరంగా రెండు అంశాల్లో న్యాయం చేయడం. అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు న్యాయం చేయడం.. ఇలాంటి అంశాల మీదనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ► నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఏ మాటలు చెప్పానో.. ఆ మాటలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టాను. క్యారెక్టర్, క్రెడిబిలిటీయే మన పార్టీ ఫిలాసఫీ. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఐదు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించాం. ఏడాదిలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. ► అంతకు ముందు ప్రభుత్వం గ్రామాలను దోచుకోడానికి జన్మభూమి కమిటీలు పెడితే.. మనందరి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ దేశ పరిపాలన చరిత్రలోనే గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టింది. ఈ రోజు వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ స్థానిక పరిపాలనలో గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నాయి. మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా పాలనను అందించేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్ విభజన చేశాం. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేశాం. చిప్ మైండ్‌లో, గుండెలో ఉండాలి ► 44 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నాయని ఢంకా భజాయించుకొని కొంతమంది చెప్పుకుంటుంటారు. నేను అడుగుతున్నా.. ఏ రోజు అయినా ఇలాంటి విప్లవాత్మక ఆలోచన వచ్చిందా ? ఎందుకంటే ప్రజల కష్టాలు, వారి బాగోగుల గురించి అర్థం చేసుకొని ఆలోచించే చిప్ మైండ్లోనూ, గుండెలోనూ ఉండాలి. ► ఈ మధ్య చంద్రబాబు ఒక రింగ్‌ను చూపించి ఆ రింగ్‌లో చిప్ ఉందని చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరంలోనో, మోకాళ్లలోనో, పాదాల్లోనో చిప్ ఉంటే లాభం లేదు. చిప్ ఉండాల్సింది మెదడులో, గుండెలో. అప్పుడే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు వస్తాయని చంద్రబాబుకు తెలియజేస్తున్నా. దోచుకోవడం..పంచుకోవడమే చంద్రబాబు రాజకీయం ► చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచన, తపన లేదు. ఆయనకు ఉన్నది పదవి వ్యామోహం ఒక్కటే. అందుకే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. అప్పట్లో ఏమీ చేయలేదు. ప్రజల ఒత్తిడి మేరకు చివరకు తన నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా మార్చండని మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆ రెవెన్యూ డివిజన్ ఇచ్చింది మన ప్రభుత్వమే. ► కుప్పం ప్రజలకు మంచి జరగాలని చేశాం. చంద్రబాబు దృష్టిలో రాజకీయం అంటే ప్రజలతో వ్యాపారం చేయడమే. ప్రజలను ఎలా దోచుకోవాలి.. దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలన్నదే వారికి తెలిసిన నిర్వచనం. మనకు రాజకీయం అంటే ప్రజల మీద మమకారం. అదే మన నిర్వచనం. ► టీడీపీ అంటేనే పెత్తందారుల పార్టీ. పెత్తందారుల చేత, పెత్తందారుల వల్ల, పెత్తందారుల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం పార్టీ భావజాలంలోనే ఏ కోశాన మానవత్వం, పేదల పట్ల మమకారం అన్నవే కనిపించవు. చంద్రబాబు పార్టీ చరిత్ర అడుగడుగునా కనిపించేది వెన్నుపోట్లు. టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఎన్నికలప్పుడు ఆయన పేరునే ఉపయోగించుకోవడం బాబుకే చెల్లింది. టీడీపీ సిద్ధాంతం వెన్నుపోట్లే. వైఎస్సార్సీపీ శ్రేణులతో కిక్కిరిసిన ప్లీనరీ ప్రాంగణం రెండు కళ్ల సిద్ధాంతం ► తమ పిల్లలను, తమ మనవళ్లను ఇంగ్లిష్ మీడియం బడుల్లో చదివిస్తారట. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియం బడుల్లోనే చదవాలట. ఈ టీడీపీ, దుష్టచతుష్టయం భావాలకు.. పేద పిల్లలు చదివే గవర్నమెంట్ బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ఉండాలన్న మన పార్టీ సిద్ధాంతానికి మధ్య ఎంత తేడా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ► పేద కుటుంబాల పిల్లలు వారి పొలాల్లో కూలీలుగా, వారి వ్యాపారాల్లో, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేసేవారిగా మిగిలిపోవాలనేది ప్రతిపక్షాలు, దుష్టచతుష్టయం ఆలోచన. అణగారిన కులాలు, వర్గాలు ఏనాటికి ఎదగకూడదు అనేది చంద్రబాబు విధానం. ► ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతిలోకి వచ్చేసరికి మంచి ట్యాబ్ ఉచితంగా ఇచ్చి.. మార్కెట్లో రూ.24 వేలకుపైగా విలువ చేసే పాఠాలను ఆ పిల్లలకు ఉచితంగా అందించేందుకు బైజూస్ యాప్‌ను ఉచితంగా ఇస్తుంటే.. అదేం జ్యూస్ అని చంద్రబాబు వెటకారం చేస్తున్నారు. ► ఇలాంటి ఉద్దేశాలు ఉన్న చంద్రబాబును ఒక్కసారి చూడండి. టీడీపీ నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం, వారి బాగు కోసం శ్రమిస్తుంది. మన ప్రభుత్వం గవర్నమెంట్ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు పని చేస్తుంది. ► పేదల తల రాతలు మారాలంటే గవర్నమెంట్ బడుల్లో కార్పొరేట్ స్థాయిలో చదువులు అందాలని మనం శ్రమిస్తున్నాం. ఒక్క విద్యా రంగంలోనే తొమ్మిది పథకాలను అమలు చేస్తున్నాం. జగనన్న అమ్మ ఒడి ద్వారా ఇప్పటి వరకు మనం రూ.19,617 కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఒక్క బటన్ నొక్కగానే 44 లక్షల మంది ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. 80 లక్షల మంది పిల్లలకు మంచి జరుగుతోంది. ► నాడు–నేడు పథకం కింద 56,703 గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,352 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మూడేళ్లలో విద్యా రంగంలో మనం ఖర్చు చేసింది అక్షరాల రూ.52 వేల కోట్లని సగర్వంగా చెబుతున్నా. ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం జగన్. వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్యనేతలు నా కష్టం.. మీ త్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వమిది ► చంద్రబాబు తాను సైకిల్ తొక్కలేక.. తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని తెచ్చుకున్నారు. నా కష్టంతో పాటు, మీ త్యాగాలు, శ్రమ పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఇది. ఈ మూడేళ్లలో తీసుకువచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవం.. రైతు, మహిళా, విద్య, వైద్యం, వ్యవసాయ, పరిపాలన రంగాల్లో విప్లవాత్మక మార్పులు.. రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా గట్టి పునాదులు వేస్తున్నాం. ► ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడుతూ ఈ మూడేళ్లలో విద్య, వైద్య, వ్యవసాయ, పరిపాలన, సామాజిక న్యాయ విప్లవాలను తీసుకువచ్చాం. ఎక్కడా లంచాలుగానీ వివక్ష గానీ లేకుండా బటన్ నొక్కగానే అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అందుకే 2019 ఎన్నికల తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరిగితే సైకిల్ చక్రాలు ఊడిపోయాయి. -
జనరంజకంగా సీఎం జగన్ ప్రసంగం (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ గ్రాండ్ సక్సెస్
-
బట్టలైనా ఊడదీసుకుని తిరుగుతామంటారు: కొమ్మినేని విశ్లేషణ
-
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ హైలైట్స్
-
ఎన్నికలకు సన్నద్ధం కండి.. సర్వ సైన్యాన్ని సిద్ధం చేయండి..!!
-
ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
-
లక్షలాది మంది కార్యకర్తల్ని తన స్పీచ్ తో ఉర్రుతలూగించిన సీఎం జగన్
-
చంద్రబాబు ధరించిన ఉంగరం పై సీఎం జగన్ పంచులు
-
బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్
సాక్షి,గుంటూరు/విజయవాడ: చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది. అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందకొస్తారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. నాకున్న ఏకైక అండాదండా ప్రజలే’ అని సీఎం జగన్ ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఎన్నికలకు సిద్ధం కావాలి ‘మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లండి. దుష్టచతుష్టయం కుట్రలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టండి. పార్టీ నాయకత్వంతో కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలి. ఎన్నికలకు సిద్ధం కావాలి’ అని క్యాడర్‌కు సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం.. నిండు మనసుతో సెల్యూట్ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వైఎస్సార్సీపీ ప్లీనరీ: పోటెత్తిన అభిమానం -
వైఎస్సార్సీపీ ప్లీనరీ: పోటెత్తిన అభిమానం
-
మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం: సీఎం జగన్
సాక్షి,గుంటూరు/విజయవాడ: భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా.. రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంది ప్లీనరీ. అనంతరం జన సంద్రాన్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ‘‘ఈరోజు జన సునామీ కనిపిస్తోంది. ఇది ఆత్మీయుల సునామీ. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్ పేర్కొన్నారు. పార్టీని గట్టి పునాదిపై నిర్మించుకున్నాం. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవే చేస్తున్నాం. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని అన్నారాయన. నాన్న మరణ వార్త విని సుమారు 700 మంది చనిపోయారు. వారందరి కుటుంబాలను పరామర్శించడం నా బాధ్యతగా భావించా. నాపై కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయి. నాపై ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కుట్రలకు, తప్పుడు కేసులకు లొంగేవాడు కాదు జగన్. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఆనాడూ చంద్రబాబు మన పార్టీలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. 2014లో 23 ఎమ్మెల్యేలను కొన్న పార్టీకి.. 2019లో అన్నే సీట్లు వచ్చాయి అని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఒక్క ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరిందని గుర్తు చేసుకున్నారు. నిండు మనసుతో మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా అని ప్రజాభివాదం చేశారు సీఎం జగన్. చంద్రబాబుకు ఆ చిప్ లేదు ఈ మధ్య చంద్రబాబు రింగ్‌లో చిప్ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా రింగ్‌లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్ ఉంటే సరిపోదు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానం. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతం. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలంట. నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుంది. కానీ, మన ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ తీసుకెళ్లడానికి శ్రమిస్తోంది. ఒక్క విద్యారంగం కోసమే తొమ్మిది పథకాలు తీసుకొచ్చింది.. అంటూ ఇప్పటిదాకా వెచ్చించిన పలు సంక్షేమ నిధుల కేటాయింపులను సభాముఖంగా ప్రకటించారు సీఎం జగన్. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి జరగాలనే అలా చేశాం. మరింత పాదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. టీడీపీ అంటే పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోట్లు అని సీఎం జగన్ ప్రస్తావించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇది కూడా చదవండి: బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ఆర్ సీపీ జీవిత కాలపు జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక
-
నీ జీవితంలో వారికి పదవులు ఇచ్చావా బాబు ??
-
చంద్రబాబు ఏనాడైనా సామాజిక న్యాయం పాటించారా?: మేరుగు నాగార్జున
-
సీఎం వైఎస్ జగన్ మనందరి ధైర్యం: తానేటి వనిత
-
సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు: కొడాలి నాని
సాక్షి, గుంటూరు/విజయవాడ: చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5నాయుడు.. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ప్రభుత్వంపై ఉదయం నుంచి రాత్రి వరకు దుష్ప్రచారం చేయడమే వీరి పని. సీఎం జగన్‌ను దించాలని ఆ నలుగురు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చని వీరి ఆలోచన. ఈ ముఠాకి రామోజీరావు గురువు. ఈ 420లకి ఎవరూ భయపడరు. దుష్టచతుష్టయాన్ని పాతాళంలో పాతిపెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. చదవండి: (ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్) ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే విమర్శలు చేస్తున్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?. ఆరోపణలు చేస్తున్న వారి పిల్లలు ఏ మీడియంలో చదివారు?. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పెన్షన్లు పెంచుతూ పోతున్నారు. పేద పిల్లల కోసం తండ్రి స్థాయిలో సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా?. 95 శాతం హామీలను అమలుచేసిన వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చదవండి: (జగన్ అంటే తగ్గేదేలే.. సోనియాకే భయపడలే.. దుష్టచతుష్టయానికి భయపడతారా?) దేశంలో చంద్రబాబు లాంటి చవట దద్దమ్మ ఎవరూ లేరు. పుట్టిపెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచాడా?. దుష్టచతుష్టయం పర్మినెంట్‌గా పిచ్చాసుపత్రుల్లో చేరబోతున్నారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడు. గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే.. తల్లి పాత్ర పోతుందా?. తల్లిని మించిన హోదా ఉంటుందా?. లోకేష్ ఫారెన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా వెళ్లారు?. ఓట్లకోసం భార్యను బజారుకీడ్చిన 420 చంద్రబాబు. 2024 చంద్రబాబుకు రాజకీయ సమాధే' అని మాజీ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. -
దుష్టచతుష్టయాన్ని పాతాళంలో పాతిపెట్టేందుకు సిద్ధంగా ఉండాలి: కొడాలి నాని
-
రామోజీరావు నమ్మకద్రోహి అని ఎన్టీఆరే అన్నారు: పేర్నినాని
-
జగన్ అంటే తగ్గేదేలే.. సోనియాకే భయపడలే.. దుష్టచతుష్టయానికి భయపడతారా?
సాక్షి, విజయవాడ/గుంటూరు: చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు.. దుష్టచతుష్టయం కలిసి మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. 'దుష్టచతుష్టయంలో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు. ఈ నలుగురిది కూడా మనోడు మాత్రమే అధికారంలో ఉండాలని ఉన్మాద ప్రయత్నం. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు కూడా రోజూ విషపు రాతలు రాస్తున్నాయి. రామోజీరావు నమ్మక ద్రోహి అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. ఔటర్ రింగ్ కట్టానని చంద్రబాబు చెబుతారు. మరి భూసేకరణ వైఎస్సార్ ఎందుకు చేశారు?. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరు. డబ్బు కోసం రాధాకృష్ణ చేయని దుర్మార్గాలు లేవు. ఏపీలో కందిపప్పు రేటు ఎంత? తెలంగాణలో ఎంత? నీ హెరిటేజ్‌లోఎంత ఉంది?. ఆయిల్ ధరలు మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి. సీఎం జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. నాలాంటోళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం జగన్‌కోసం పనిచేయాలి. ఇంటింటికి తిరగండి.. పథకాలు అందినవా.. లేదా ఆరా తీయాలన్నారు. పథకాలు రాకపోతే భాధ్యత వహించి సరిదిద్దాలన్నారు. అర్హత ఉంటే ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలు అందాలని సీఎం చెప్పారు. ఎవరూ శాశ్వతం కాదు..జెండా మోసే కార్యకర్తలు శాశ్వతం. సింగిల్‌గా రాలేమని చంద్రబాబు, పవన్‌కు తెలుసు.. అందుకే అందరూ కట్ట కట్టుకుని రావాలని చూస్తున్నారు. సోనియా గాంధీనే గడగడలాడించిన వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, 16 మాసాలు జైల్లో పెట్టినా అడుగు వెనక్కు తగ్గలేదు. జగన్ అంటే తగ్గేదేలే. అలాంటి వ్యక్తి ఈ దుష్టచతుష్టయానికి భయపడతాడా? అంటూ పేర్ని నాని సభికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. చదవండి: (ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్) -
ఎల్లో మీడియాకు ఎందుకింత కుళ్లు: జోగి రమేష్
-
YSRCP Plenary 2022: విద్యా రంగంపై తీర్మానం: హైలైట్స్ ఇవే..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచి్చన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్క టీచరే ఉండటం వల్ల పిల్లలకు సరైన బోధన అందేది కాదన్నారు. కానీ ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌తో పిల్లలకు బోధన అందేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నాసిరకమైన విద్య.. గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలలి్న, స్కూళ్లను ప్రోత్సహించాయని.. పరీక్షలను చూసి రాయించాయని మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించి భారీగా దోచుకున్నారని మండిపడ్డారు. నాసిరకమైన విద్యను అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆరి్థక స్థితిగతులు మారిపోతాయన్నారు. ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. నేడు ప్రైవేటు స్కూల్స్‌ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు. హైలైట్స్ ♦విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి ♦రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు ♦ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు ♦ అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక ♦ఇంగ్లిష్ మీడియం విద్య.. ♦మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన ♦రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం ♦ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ♦మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ♦ ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు ♦గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం ♦ కార్పొరేట్‌కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు పేద పిల్లల పెద్ద చదువులకు అనేక పథకాలు అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక. పేదల పిల్లలు పెద్ద చదువులు చదివేలా సీఎం వైఎస్ జగన్ అనేక పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. దాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. విద్యా రంగంలో సంస్కరణల కోసమే రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వాలు విద్యను నిరీ్వర్యం చేశాయి. పాఠశాలల అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు.. ఆయన తల్లిదండ్రుల కమిటీలను అడిగితే వారే చెబుతారు. – కిలారి రోశయ్య, ఎమ్మెల్యే నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గతంలో ఎవరూ ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పి.. మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్. అమ్మ ఒడి గొప్ప పథకం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలతో సీఎం సంఘసంస్కర్తగా నిల్చారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆ చట్టాలను మార్చి ప్రైవేటు వర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అట్టడుగు వర్గాల మేలు కోసమే పథకాలు ఇంగ్లిష్ మీడియం విద్య.. మా హక్కు అని నినదించేలా సీఎం జగన్ పేదల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువులను అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు మేలు చేయాలన్న తపనతోనే వేల కోట్ల రూపాయలు వెచి్చస్తూ విద్యా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. రక్తం ధారబోసి అయినా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. – సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే బడుగుల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దా? రామోజీరావు, చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ నేతల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. బడుగుల పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ మీడియం అందకూడదన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్ చదువులకు పనికిరారన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. – నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
చంద్రబాబుతో కాదు యుద్ధం.. దుష్టచతుష్టయంతో: అంబటి
-
వైఎస్సార్సీపీ ప్లీనరీ భవిష్యత్ సీనరీ
ఆంధ్రపదేశ్‌లో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నిర్వహిస్తోన్న భారీ ప్లీనరీని ప్రజానీకం ఆసక్తిగా చూస్తోంది. ఈ ప్లీనరీ ఆ పార్టీ ఆవిర్భావం తరువాత జరుగుతున్న మూడోదీ, అధికారం అందుకున్న తర్వాత మొదటిదీ. భవిష్యత్తులో వేయబోయే అడుగులపై దిశా నిర్దేశం చేసేవిధంగా పలు తీర్మానాలు ఇందులో చర్చకు వస్తుండటం ముదావహం. పదేళ్లుగా ప్రజల్లో ఉండి పోరాటం జరిపిన పార్టీ, వారి ఆశీస్సులతో భారీ విజయాన్ని నమోదు చేసి మూడేళ్లుగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ మూడేళ్లూ ఆర్థికంగా కష్టకాలం. విభజన అనంతరం తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో పాటూ రెండేళ్ల కరోనా వల్ల వచ్చిన ఆర్థిక దుఃస్థితీ ఇబ్బంది పెడు తోంది. అయినప్పటికీ లక్షా నలభై వేల కోట్ల మేరకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ సాయం అందించడం, గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గర చెయ్యడం, లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడం కొనసాగించగలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతో సహా వివిధ రీతుల్లో విద్యార్థులకు చేయూత నిచ్చిన కారణంగా డ్రాప్ ఔట్ రేట్ తగ్గి, ఎన్రోల్మెంట్ శాతం పెరిగింది. వైద్య రంగానికి కూడా కేటాయింపులు పెంచి రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను మంజూరు చేసింది. అయితే రానున్నది గడ్డుకాలం. ఆర్థిక స్థితి మెరుగు పరచడంతో బాటు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు సమగ్ర ప్రణాళికలు అవసరం. మరో వైపు రాజకీయ ప్రత్యర్థులనూ, వారి ఆరోపణలనూ దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేసి ఉత్తేజితుల్ని చెయ్యాలి. ప్రజల అజెండాను చర్చించి ప్రజల మద్దతు నిలుపుకోవాల్సి ఉంది. ఏరకంగా చూసినా ఈ ప్లీనరీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. (క్లిక్: సామాజిక న్యాయమే పాలన అజెండా) – డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
వైఎస్ఆర్సీపీ సైనికులకు పెద్ద పండగ: పుష్ప శ్రీవాణి
-
ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోంది: తమ్మినేని
-
ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండవరోజు పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకతపై మొదటగా తమ్మినేని ప్రసంగించారు. తమ్మినేని మాటల్లో.. 'మూడేళ్ల ప్రగతిపై సమీక్షే ఈ ప్లీనరీ. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్లీనరీకి విప్లవంలా తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే మన ముందున్న లక్ష్యం అని అన్నారు. 'ఈ రోజు ఎల్లో పత్రికలు స్పీకర్ పదవిలో ఉండి ప్లీనరీకి ఎలా హాజరవుతారంటూ నాపై కథనాలు రాశాయి. రామోజీరావు, ఏబీఎన్‌లకు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ శివప్రసాద్ పాల్గొనలేదా?. ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా? (ఆర్ యూ డెఫ్ ఇయర్).. మీరు కనలేదా? (ఆర్ యూ బ్లైండ్). ఆయన ప్లీనరీకి హాజరవగా లేనిది.. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా?. నేను వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను..ఆ తర్వాతే స్పీకర్‌ను. ప్లీనరీ పండగ జరుగుతుంటే.. నేను ఇంటోల కూర్చోవాలా..?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చదవండి: (చంద్రబాబు చిత్తూరు టూర్ అట్టర్ ప్లాప్.. అడుగడుగునా అసహనం!) పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. వీటి గురించి ఎందుకు రాయదు ఎల్లో మీడియా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌తో ప్రయాణించేందుకు మేం అందరం సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ రథాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 స్థానాలు గెలిచి తీరుతుంది అని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. -
రైతుల భూముల్ని చంద్రబాబు లాకున్నారు: నందిగం సురేష్
-
పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు: సజ్జల
-
YSRCP Plenary: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. టీడీపీ హయాంలో హెల్త్ డిపార్ట్మెంట్ (వైద్య, ఆరోగ్య శాఖ) అప్పటి సీఎం చంద్రబాబు వెల్త్ (ఆదాయం) కోసం పనిచేస్తే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల వెల్నెస్ (ఆరోగ్యం) కోసం పనిచేస్తోందని చెప్పారు. బాబు వైద్య శాఖలో అవినీతిని విస్తరించారని, సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని వివరించారు. చదవండి: చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీలో శుక్రవారం వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద తీర్మానంపై మంత్రులు రజని, సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చర్చించారు. మంత్రి రజని మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వైద్య రంగంలో మార్పు తేలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో అద్భుత మార్పు తెచ్చారని చెప్పారు. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన రంజక పాలన అందిస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో చేపడుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధితో 2024లోనూ ఇదే విధమైన చారిత్రక విజయాన్ని అందుకుంటారని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్.. ♦రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు. తద్వారా రాష్ట్రంలోని 85 % (1.40 కోట్ల) కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్యం. ♦టీడీపీ హయాంలో ఈ పథకం కింద కేవలం 1059 చికిత్సలు అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,446 చికిత్సలు అందుతున్నాయి. చికిత్సల సంఖ్యను ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦వెఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య పెంపు. పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం ♦గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి రూ.5,171 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.5,100 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో రోజుకు సగటున 1500 మందికి వైద్యం అందించగా.. ఇప్పుడు రోజుకు సగటున 3 వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందుతున్నారు. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం 104, 108 సేవలకు జీవం పోసింది. మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 11 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను బలోపేతం చేస్తోంది. ♦రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చుతో రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చంద్రబాబుకు శ్రీరామచంద్రుడితో పోలికా! పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును లోకేష్ శ్రీరామచంద్రుడితో పోల్చడం హాస్యాస్పదం. లోకేశ్ తనను తాను రాక్షసుడితో పోల్చుకుంటున్నాడు. అతను రాక్షసుడు కాదు.. కమెడియన్. మా నాయకుడు జగన్ కోసం ఏమైనా చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 50 శాతానికి పైగా పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్. 2024లో 175కు 175 సీట్లు గెలుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ నాడు ఆరోగ్యశ్రీ ఉండి ఉంటే నా చెల్లి బతికి ఉండేది.. పుట్టుకతో ఉండే గుండె జబ్బు కారణంగా నా సోదరి 1999లో మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా చెల్లికి మెరుగైన వైద్యం అందించలేకపోయాం. అప్పట్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండి ఉంటే నా చెల్లి ప్రాణాలతో ఉండేది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ తనయుడిగా పథకాన్ని ఊహించని రీతిలో వైఎస్ జగన్ బలోపేతం చేశారు. రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు హయాంలో నిర్మించినవి కావు. టీడీపీ ప్రభుత్వ ఆస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. – మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు -
ఇది బహిరంగ సభ కాదు.. ప్రతినిధుల సభ: విజయసాయిరెడ్డి
-
ఒకటే చెప్తున్నా కుటుంబం జోలికి వస్తే... విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ బహిరంగ సభ కాదని.. ప్రతినిధుల సభ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'శుక్రవారం 1.68లక్షల మంది కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యారు. ఇవాళ 4.5 లక్షల మందికిపైగా పార్టీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం ఎక్కడా జరగలేదు. చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం. 175కు 175 స్థానాలు గెలుస్తాం. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని' విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో జోష్) -
రెండో రోజు ప్లీనరీ 4 లక్షల మందికి భోజనాలు సిద్ధం
-
Live Blog: ముగిసిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు
-
పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కమిటీ కన్వీనర్ వంగపండు ఉష ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు జానపద నృత్యాలు, గీతాలతో అలరించారు. చదవండి: అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి.. నవరత్నాలు, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బాణీలతో కూర్చిన గేయాలకు చిందేసి ఆడుతూ ప్లీనరీకి వచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సినీనటుడు జోగినాయుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం కాగా, ప్రజాప్రతినిధులు సైతం పాలుపంచుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సీఎంని కీర్తిస్తూ పాటపాడారు. వేదికపై ఆలపిస్తున్న వంగపండు ఉష, తదితరులు -
అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి..
జి.కొండూరు(ఎన్టీఆర్ జిల్లా): అభిమానం అనారోగ్యాన్ని లెక్క చేయనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వ్యక్తి.. ఇల్లు దాటడానికే ఇబ్బంది పడుతున్న పెద్దాయన తమ అభిమాన నాయకుడిని చూడాలనే ఆరాటంతో కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. యూరిన్ బ్యాగ్ చేత్తో పట్టుకుని ప్లీనరీ ప్రాంగణానికి వచ్చిన అభిమానిని చూసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. చదవండి: జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పోతురెడ్డి వీరారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరారెడ్డికి వైద్యులు యూరిన్ బ్యాగ్ ఆమర్చారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడకపోయినప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌పై గల అభిమానంతో శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీకి హాజరయ్యారు. ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతం ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. వర్షంలోనూ ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేయడం, మాంసాహార, శాఖాహార వంటకాలతో భోజనం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ పంపిణీ అన్నీ బాగున్నాయి. – జి.శ్రీనివాసరావు, ఎంపీపీ.. నక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా మళ్లీ జగన్ సీఎం అవడం తథ్యం రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారీ్టలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యం ఇచి్చంది. మళ్లీ జగనన్నే సీఎం అవడం తథ్యం. – తెన్నేటి ప్రకాష్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేయకపోయినా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎకరం మిరప పంట నష్టపోయిన వారికి భారీగా పంట నష్ట పరిహారం రావడం నిజంగా అద్భుతం. – డి.శివానంద, నరిగన్న, బెళుగప్ప మండలం, అనంతపురం జిల్లా -
ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో జోష్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: జలయజ్ఞ ప్రదాత, మహానేత వైఎస్సార్ వారసుడిగా, జనం కోసం ఇచ్చిన మాటపై నిలబడి వారి సంక్షేమానికే కట్టుబడి పరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు ప్రత్యక్షంగా వినాలని ఎందరో వృద్ధులు ప్లీనరీకి తరలివచ్చారు. ఏక ఛత్రాధిపత్యానికి చరమగీతం పాడుతూ, రాష్ట్ర చరిత్రలో సంచలనాలకు వేదికగా నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పండుగను కనులారా వీక్షించాలని, వయోభారాన్ని, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎందరో కార్యకర్తలు ప్లీనరీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. కార్యకర్తల్లో భావోద్వేగం నిండిన ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మూడు చక్రాల బండికి పార్టీ జెండాలను కట్టుకుని.. సిసలైన కార్యకర్తల్లా కొందరు దివ్యాంగులు బారులు తీరిన భారీ వాహనాలను దాటుకుని సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. మరికొందరు వైఎస్సార్ చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చారు. -
వన్స్‌మోర్ జగనన్న
వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘వన్స్‌మోర్ జగనన్న’ అన్నదే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళల నినాదం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, రక్షణ, సాధికారికతలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం వైఎస్ జగన్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు. గుంటూరు జిల్లాలోని ఏఎన్‌యూ సమీపంలో ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ ప్రాంగణం’లో శుక్రవారం ప్రారంభమైన వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘మహిళా సాధికారత–దిశ చట్టం’ తీర్మానంపై చర్చించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించగా మంత్రి రోజా, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి బలపరిచారు. మంత్రి రోజా ఏమన్నారంటే.. తన కుమార్తె ఉన్నత విద్యను అభ్యసించిన రీతిలోనే రాష్ట్రంలోని ఆడపిల్లలు అందరూ ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలకు చేరాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. మహిళలకు సంక్షేమ పథకాలు, రక్షణ, సాధికారత, రాజకీయంగా ఉన్నతస్థానాలు అందించడంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. అందుకే.. అమ్మ జన్మనిస్తుంటే జగనన్న జీవితం ఇస్తున్నారని మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ బిల్లు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కేంద్రం ఇంకా పెండింగ్ లో ఉంచినప్పటికీ దిశ చట్టం స్ఫూర్తిని పోలీసు శాఖలో తీసుకువచ్చి సీఎం మహిళల భద్రతకు భరోసానిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మహిళల పట్ల ఓ ఉన్మాదిలా వ్యవహరించారు. వనజాక్షిపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాడిచేస్తే చంద్రబాబు సెటిల్మెంట్ చేశారు. నాటి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా విజయవాడలో ఓ తల్లీకూతళ్ల ఆస్తి కోసం వారికి నరకం చూపిస్తే కూడా చంద్రబాబు చోద్యం చూశారు. ఇక బుద్దా వెంకన్న కాల్‌మనీ రాకెట్‌తో మహిళల జీవితాలను నాశనం చేస్తుండటాన్ని ప్రశ్నిస్తే నన్ను అసెంబ్లీలోకి రానీయకుండా అరెస్టుచేసి బలవంతంగా తీసుకువెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం వైఎస్ జగన్‌ను భయపెట్టాలని టీడీపీ, జనసేన సమావేశాలు పెట్టుకుంటున్నాయి. జగన్‌ను భయపెట్టాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరో జన్మ ఎత్తాలి. పవన్ రీల్ స్టార్ అయితే సీఎం జగన్ రియల్ స్టార్. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేయాలి. టీడీపీ మహానాడును రోజా ప్రస్తావిస్తూ.. ‘టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడుతున్నారు. మగవాళ్లు ఏడుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ జంబలకిడిపంబ పార్టీలా తయారైందనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు. ‘మహిళా సాధికారత–దిశ చట్టం’ తీర్మానం హైలైట్స్.. ►తన కుమార్తెలాగే రాష్ట్రంలోని ఆడపిల్లలు అందరూ ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలకు చేరాలన్నదే సీఎం జగన్ లక్ష్యం.. ►అమ్మ జన్మనిస్తుంటే జగనన్న జీవితం ఇస్తున్నారు.. ►మహిళల భద్రతకు దేశానికే స్ఫూర్తిదాయకంగా ‘దిశ’ బిల్లు ►మహిళల ఓట్లే జగనన్నకు రాఖీలుగా పంపాలి.. ►మహిళల పట్ల చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరించారు.. ►అంబేడ్కర్, జ్యోతిబాపూలే ఆశయాలను సీఎం జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారు.. ►చంద్రబాబుది సంక్షామ సర్కారు అయితే.. ఇప్పుడున్నది సంక్షేమ ప్రభుత్వం.. ►జగన్‌ను భయపెట్టేందుకు టీడీపీ, జనసేనలు ఎక్కడెక్కడో సమావేశమవుతున్నాయి.. ►టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడుతున్నారు.. మగవాళ్లు ఏడుస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలకు బెదిరేదే లేదు మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి వారి అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ కృషిచేస్తున్నారు. బాబు హయాంలో సం‘క్షామ’ ప్రభుత్వం ఉండగా ప్రస్తుతం సంక్షేమ ప్రభుత్వం ఏర్పడింది. జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఎన్ని కుట్రలకు పాల్పడినా బెదిరేదేలేదు. ఏపీ 2019 తరువాత జగన్ అడ్డాగా మారింది. – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏపీలోనే అత్యధికంగా మహిళలు కీలక స్థానాల్లో.. టీడీపీ హయాంలో పండుగకు కొత్త బట్టలు కొనుక్కోలేని దుస్థితి నుంచి ఇప్పుడు బంగారం కొనుక్కొని పండుగ చేసుకునే స్థాయిని మహిళలకు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న అమ్మఒడి, అందరికీ ఇళ్లు వంటి పథకాలతో మహిళల సంక్షేమం, విద్య, సాధికారతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది. మహిళలు కీలక స్థానాల్లో ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. తెలంగాణలో 28 శాతం మంది, రాజస్థాన్‌లో 24.7శాతం మంది, కేరళలో 25.9 శాతం మంది ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 51.6 శాతం మంది ఉన్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం జగన్ ఆచరణలో అంతకంటే ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళలు అందరూ తమ ఓట్లనే జగనన్నకు రాఖీలుగా పంపాలి. – ఉషశ్రీ చరణ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజకీయ సంస్కర్త సీఎం జగన్ రాష్ట్రంలో చెదలుపట్టి, పురుగులు పట్టిన రాజకీయాన్ని ప్రక్షాళన చేస్తున్న సంస్కర్త సీఎం వైఎస్ జగన్. అసమానలతో కూడిన వ్యవస్థలను సరిచేసి సమసమాజ స్థాపనకు తఆయన కృషిచేస్తున్నారు. మహిళా సాధికారత కోసం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ప్రవచించిన ఆశయాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మరోసారి అధికారంలోకి మహిళలే తీసుకొస్తారు. – నందమూరి లక్ష్మీ పార్వతి, రాష్ట్ర తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ సామాజిక న్యాయ సాధనే సీఎం వైఎస్ జగన్ ధ్యేయం సామాజిక న్యాయ సాధనే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేడ్కర్, జ్యోతిబాపూలే ఆశయాలను నెరవేరుస్తున్నారు. మహిళలు ఎలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరంలేకుండానే జగన్ బడుగు, బలహీన వర్గాలకు 55 శాతం రాజ్యాధికారం కల్పించారు. అంతటి ఉన్నత భావాలున్న ఆయన దేశంలో అతిగొప్ప సామ్యవాది. – పోతుల సునీత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ -
జనం ఎత్తిన జెండా
ఈ జెండా... అయాచితంగా అందుకున్నది కాదు. కుట్రలతో లాక్కున్నదీ కాదు. ఇది... ఇచ్చిన మాట కోసం... వ్యవస్థలన్నిటినీ గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేశ అత్యున్నత నాయకత్వాన్ని ఢీకొట్టి నిలిచిన ఓ యువకుడికి జనమిచ్చిన గౌరవం!. ఒక్కడిగా మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోని ప్రతి ఊళ్లోనూ తన సైన్యాన్ని సృష్టించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం!. అందుకే ఇది జనం ఎత్తిన జెండా!!. పన్నెండేళ్లుగా ఇంతకు ఇంతై ఎదుగుతూ... ఎగురుతున్న వైఎస్సార్సీపీ జెండా... శుక్రవారం ప్లీనరీ పండగలో పులకించిపోయింది. మూడేళ్ల కిందట ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ జగన్... కష్టాల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తూ ప్లీనరీని ఆరంభించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచీ హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు జై జగన్నినాదాలతో ప్లీనరీని హోరెత్తించేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఒంటరి పోరాటం సాగిస్తున్న తన కుమార్తెకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది కనక... తాను వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్ష పదవిని వీడుతానని వై.ఎస్. విజయమ్మ ప్రకటించగానే వద్దు వద్దంటూ శ్రేణులు నినదించాయి. కానీ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆమె భావోద్వేగపూరితంగా వివరించిన మీదట... అంతా ఆమె నిర్ణయానికే జై కొట్టారు. ప్రజా సేవలో 45 ఏళ్ల తమ బాంధవ్యాన్ని గుర్తుచేస్తూ... వైఎస్ జగన్ గెలుపు మళ్లీ తథ్యమనే విశ్వాసం వ్యక్తం చేశారామె. ఇక ప్రతి ఊళ్లో బడి, ఆసుపత్రి బాగుపడుతూ భవిష్యత్తు మెరుగుపడుతుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని, ప్రజలకు సంక్షేమం చేకూర్చడమంటే అభివృద్ధి కాదని ఎవరైనా చెప్పగలరా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలను నిలదీశారు. సీఎం స్ఫూర్తిదాయకమైన స్వాగతోపన్యాసం కార్యకర్తలలో ఫుల్‌జోష్‌ను నింపగా నాలుగు తీర్మానాలపై తొలిరోజు నేతలు చేసిన ప్రసంగాలు ఆలోచింపజేశాయి.... రెండో రోజు కోసం ఎదురు చూసేలా చేశాయి. వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ ప్లీనరీ అంటే.. ఆ పార్టీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమం. ఇంకో మాటలో చెప్పాలంటే అత్యంత ఇష్టమైన పండుగ. ఈ వేదికపై గతాన్ని మననం చేసుకుని, వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసుకోవడం జరుగుతుంది. మూడేళ్ల క్రితం అధికారాన్ని చేపట్టాక తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో.. తొలి రోజున ప్రతినిధుల సభకు అంచనాలకు మించి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలోని 26 జిల్లాల నుంచి కార్యకర్తలు ప్లీనరీకి పోటెత్తారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గావించి.. శుక్రవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్.. అనంతరం తల్లితో కలిసి ప్లీనరీ జరిగే వైఎస్సార్ ప్రాంగాణానికి చేరుకున్నారు. ఉరిమే ఉత్సాహం.. చిరు జల్లుల ఆహ్వానం వైఎస్సార్ ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోక ముందే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. శ్రేణుల ఉరిమే ఉత్సాహం నడుమ.. చిరు జల్లుల మధ్య.. ఆహ్లాదకర వాతావరణంలో వైఎస్సార్సీపీ జెండాను పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత శ్రేణుల హర్షధ్వానాల నడుమ ప్లీనరీ వేదికపైకి చేరుకున్న సీఎం.. తల్లి విజయమ్మ, పార్టీ నేతలతో కలిసి మహానేత వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కష్టాలు గుర్తు చేసుకుంటూ.. చేసిన మేలును వివరిస్తూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మహాభినిష్క్రమణం నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నా అంటూ సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ ప్రారంభోపన్యాసాన్ని ఆరంభించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడానికి.. అందరి ఆత్మాభిమానం కోసం ఆవిర్భవించిన పార్టీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రజలకు చేస్తున్న మంచిని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి శ్రేణుల నుంచి విశేష రీతిలో స్పందన లభించింది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. అధికారమంటే ప్రజల మీద మమకారం చూపించడమేనని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నామని శ్రేణులకు గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేయడం ద్వారా పరిపాలనలో.. ప్రజల జీవన ప్రమాణాల్లో.. సామాజిక, విద్య, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని.. మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయడమంటే ఇలా అని నిరూపించామని సీఎం వివరించారు. ప్రజలకు మేలు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం, దత్తపుత్రుడితో జాయింట్‌గా ఏర్పడిన గజ దొంగల ముఠా సాగిస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టారు. ప్రజల ఇంట ఉన్న మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టే రాక్షస గణాలన్నీ ఒక్కటవుతున్నాయన్న పదునైన విమర్శలకు శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. గజదొంగల ముఠా దాష్టీకాలపై మనమంతా ఆలోచన చేసి.. ప్రజలకు ఆలోచన కలుగజేసేలా చేసేందుకు ప్లీనరీలో తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పారు. మొత్తంగా వైఎస్ జగన్ ప్రసంగం శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. వైఎస్ విజయమ్మ ఉద్వేగపూరిత ప్రసంగం.. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశానని తాను లేఖ రాయకున్నా, రాసినట్లు సృష్టించడం.. ఎవరి కుటుంబంపైనా వేయని రీతిలో తమ కుటుంబంపై నిందలేస్తూ ఎల్లో మీడియా దుష్ఫ్రచారం చేస్తోందని వైఎస్ విజయమ్మ ఉద్వేగ పూరితంగా ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘షర్మిలమ్మ తెలంగాణలో పోరాటం చేస్తోంది. ఆమెకు నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సంతోషంలో ఉన్నప్పుడు కొడుకుతో ఉంటే అక్కడ నా రక్తం పంచుకున్న బిడ్డకు అన్యాయం చేసిన దాన్నవుతా. అది నా మనస్సాక్షికి నచ్చడం లేదు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా.. ఇందుకు క్షమించాలి’ అంటూ శ్రేణులను విజయమ్మ కోరారు. ‘వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు అండగా ఉన్నా, తల్లిగా జగన్‌కు, రాష్ట్ర ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాను’ అని విజయమ్మ స్పష్టత ఇవ్వడం శ్రేణులను ఆకట్టుకుంది. పోటెత్తిన పార్టీ శ్రేణులు ప్లీనరీ తొలి రోజున ప్రతినిధుల సభ.. మహిళా సాధికారత–దిశ చట్టం, విద్య, నవరత్నాలు–డీబీటీ, వైద్య రంగాల్లో గత మూడేళ్లలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చించింది. ఆ నాలుగు అంశాలపై తీర్మానాలను ఆమోదించింది. ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ నేతలు అంచనా వేయగా, అంతకంటే ఎక్కువగా శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ప్రాంగణంలో వేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో పెద్ద సంఖ్యలో జనం వెలుపల.. గుంటూరు–విజయవాడ జాతీయ రహదారి వరకు మైదానంలో కిక్కిరిసిపోయారు. వేదిక చుట్టూ ఇసుకేస్తే రాలనంతగా కార్యకర్తలు పోటెత్తడంతో వేదిక మీదకు నాయకులు చేరుకోవడం కష్టమైంది. అంచనాలకు మించి ప్రతినిధుల సభకే వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తడంతో పార్టీలో నూతనోత్సాహం నింపింది. తొలిరోజు ప్లీనరీ ఇలా.. (వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి): వైఎస్సార్సీపీ 3వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఉదయం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోని వైఎస్సార్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాలు ఇలా సాగాయి.. ఉదయం 7.00 : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వేదిక వద్దకు చేరుకోవటం ప్రారంభమైంది. 8.00: పార్టీ ప్రతినిధుల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున క్యూ కట్టారు. 9.00 : సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. 11.36: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిలను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం వారిరువురూ చేతులు జోడించి సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం చేశారు. 11.39: మహానేత వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగన్‌కి వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆకుపచ్చ కండువా కప్పారు. పార్టీ మహిళా నేతలు, మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మాజీమంత్రి పాముల పుష్పశ్రీవాణి సీఎం జగన్‌కు శాలువ కప్పారు. అనంతరం బాలికలు వందేమాతరగీతం ఆలపించారు. 11.42: పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్లీనరీని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారని ప్రకటించారు. 11.45: పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య సీఎం జగన్ ఉద్వేగపూరిత ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ఈలలు, చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. 12.13: సీఎం జగన్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. 12.15: పార్టీ గౌరవాధ్యక్షురాలు హోదాలో వైఎస్ విజయమ్మ తన ప్రసంగం ప్రారంభించారు. హ్యాపీబర్త్‌డే.. హ్యాపీబర్త్‌డే వైఎస్సార్ అని ఆమె అన్నప్పుడు సభలో ఈలలు, కేకలు ప్రతిధ్వనించాయి. 12.50: విజయమ్మ బాధాతప్త హృదయంతో తన గౌరవాధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తన స్థానంలో ఆశీనులయ్యారు, ఈ సమయంలో కన్నీటిపర్యంతమైన తన తల్లి విజయమ్మను సీఎం వైఎస్ జగన్ సముదాయించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పార్టీ జమా ఖర్చుల ఆడిట్ స్టేట్మెంట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్సీపీ సిద్ధాంతం–రాజ్యాంగ నిబద్ధత అనే అంశంపై ప్రసంగించారు. ఆ తర్వాత వివిధ అంశాలపై సాయంత్రం వరకు చర్చలు జరిగాయి. నాలుగు అంశాలపై తీర్మానాలు చేశారు. కార్యకర్తలకు పేర్ని నాని సముదాయింపు వేదికపైకి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారనగా.. కార్యకర్తలు పెద్దఎత్తున వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మాజీమంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి ఒక్కొక్కరిని బుజ్జగిస్తూ గ్యాలరీలకు తరలించారు. కార్యకర్తల కోరిక మేరకు వారితో ఒక సెల్ఫీ దిగటం వారిని చేయిపట్టుకుని గ్యాలరీలలో వదలటం ఆసక్తికరంగా మారింది. -
విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల
సాక్షి, గుంటూరు: టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా -
జన సంద్రమైన వైఎస్సార్సీపీ ప్లీనరీ (ఫొటోలు)
-
మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ
-
అభినవ అల్లూరి జగనన్న.. అది చంద్రబాబు జలగల సమూహం
-
విజయమ్మ ప్రసంగం వక్రీకరణ.. ఎల్లో మీడియాపై సజ్జల ఆగ్రహం
-
ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది: పెద్దిరెడ్డి
-
వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు (ఫొటోలు)
-
ఈ యువ నాయకుడి స్పీచ్‌కు దద్దరిల్లిన ప్లీనరీ ప్రాంగణం..
-
పేదింటి తల్లిదండ్రులు, పిల్లల అభిలాషకు విలువనిచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
-
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్
-
ఇదే ఉత్సాహంతో 2024లో కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం
-
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు
-
మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు: లక్షీ పార్వతి
-
ప్రతి పేదవాడికి అండగా నిలబడటమే వైఎస్ఆర్ సీపీ సిద్ధాంతం
-
ఆశయం కోసం పోరాడే పులివెందుల పులి సీఎం వైఎస్ జగన్
-
మహిళలను శక్తివంతంగా తీర్చి దిద్దాలన్నది సీఎం జగన్ సంకల్పం
-
యువతకు జగన్ రోల్ మోడల్: వైఎస్ విజయమ్మ
-
YS Vijayamma Speech: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా
-
ప్రాణమున్నంత వరకు మీ అప్యాయతను మరిచిపోం: వైఎస్ విజయమ్మ
-
జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ తొలిరోజైన శుక్రవారం ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆమె మాటల్లోనే.. మా అనుబంధాలు గొప్పవి.. మాది చాలా అభిమానం కలిగిన కుటుంబం. మా అనుబంధాలు, సంస్కారాలు గొప్పవే. తన అన్నకు ఇక్కడ ఏ ఇబ్బందీ కలుగకుండా ఉండాలనే తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసుకుంది. వాళ్ల నాన్న ఆశయాలను నెరవేర్చాలని, వాళ్ల నాన్న ప్రేమించిన ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలని, తన జన్మకు సార్థకత ఉండాలని గట్టిగా పోరాడుతోంది. రాజశేఖరరెడ్డి భార్యగా, ఓ తల్లిగా ఆ బిడ్డకు అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీకి, అక్కడ షర్మిల వైఎస్సార్టీపీకి ఒకే సమయంలో మద్దతు పలకడంపై రెండు పార్టీల్లో సభ్యత్వం ఉండవచ్చా? అన్న దానిపై చాలా ఆత్రుతగా, ఏదో జరిగిపోతోందన్నట్లుగా, ఉన్నవీ లేనివీ కల్పించి ఎల్లో మీడియాలో గొప్పగా రాశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఓ తల్లిగా ఇద్దరి భవిష్యత్తూ బాగుండాలని కోరుకున్నా. ఇంత వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు. రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతోంది. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్‌కు ఒక స్టాండ్ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా. రెండోసారి తిరుగులేని మెజార్టీతో.. రెండు రాష్ట్రాల మధ్య ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లోనైనా వక్రీకరణలకు, బురదజల్లే రాజకీయాలకు తావివ్వకుండా ఉండాలంటే పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో కొనసాగడం మంచిది కాదని నిర్ణయించుకున్నా. నా రాజకీయ జీవితంలో మీరంతా భాగమయ్యారు. నేను ఏదైనా జవాబు చెప్పాల్సి వస్తే మీకు (ప్రజలకు) మాత్రమే చెప్పాలి. అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పాలని నిర్ణయించుకున్నా. జగన్ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికీ అండగా ఉన్నా.. ఇద్దరిపై విమర్శలు చేసే వారు ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను రాజశేఖరరెడ్డి భార్యగా ఆదరిస్తారు. దిగజారుడుతనం తగదు.. నేను రాయని లేఖతో, చేయని సంతకంతో సోషల్ మీడియాలో నా రాజీనామా పేరుతో జగన్‌కు వ్యతిరేకంగా లేఖ విడుదల చేశారు. ఇటువంటి వాటిల్లో వారి దిగజారుడుతనం కనిపిస్తోంది. పిచ్చిరాతలు, జుగుప్సాకర రాతలతో కుట్రలు బయపడుతున్నాయి. ఇటువంటి నాయకులకు, ఇలాంటి రాతలు రాసేవారికి ఎవరి కుటుంబంపైనా గౌరవం ఉండనిపిస్తుంది. దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు.. రాజకీయం కాదు. రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజలకు చివరి నిమిషం వరకు సేవ చేసి చనిపోయే నాయకులు కావాలి. నాకు రాజశేఖరరెడ్డి లేని లోటు తీరనిది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిలమ్మ వైఎస్సార్ లేని లోటును తీరుస్తారు. మీరు బలం అయితే వారే మీకు బలం, అండ అవుతారు. వేరే రాష్ట్రంలో రాజకీయంగా షర్మిలకు అండగా ఉన్నా.. తల్లిగా జగన్‌కు, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటా. మాట కోసం పుట్టిన పార్టీ రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడితే.. వైఎస్సార్ సీపీ మాత్రం నల్లకాలువలో జగన్ ఇచ్చిన మాట నుంచి పురుడు పోసుకుంది. దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలన్నీ కలసి దాడి చేసినా.. తాను చేసేది న్యాయం, ధర్మం, మంచి అని నమ్మిన జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా లెక్కచేయకుండా ప్రజల కోసం నిలబడ్డాడు. అప్పుడు నా బిడ్డ జగన్‌ను మీ చేతుల్లో పెట్టా. మిమ్మల్ని నడిపించమంటే.. వెన్నంటే ఉండి ముఖ్యమంత్రిని చేశారు. మళ్లీ మీకే అప్పగిస్తున్నా.. మీరే అతనికి బలం కావాలి. మీ బిడ్డల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతాడని మాటిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పొమ్మనక పొగపెడితే 2011లో మానవత్వపు విలువలతో వైఎస్సార్సీపీ పురుడు పోసుకుంది. అరెస్టులతో భయపెట్టినా.. కష్టాల బాట ముందు ఉందని తెలిసినా వెరవకుండా నిలబడింది. జగన్ మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారు. ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం.. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే వ్యక్తిత్వంతో జగన్ పని చేస్తున్నాడు. అందుకే ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1.60 లక్షల కోట్లను డీబీటీ విధానంలో లంచాలు లేకుండా నేరుగా ప్రజలకు అందించాం. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఎవరికీ ఏ ఒక్క పథకం కూడా గుర్తు రాదు. నాన్న బాటలోనే నడుస్తా...! ‘‘జగన్ అప్పుడు చాలా చిన్నవాడు. పదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్ ఎక్కువగా ప్రజలతోనే ఉండేవారు. మాతో వారానికి ఒక్క పూటైనా గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సమయంలో జగన్‌తో.. నాన్నా నీకు రాజకీయాలు వద్దు. నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిపై కాలేసుకుని పది మందికి పని కల్పించే జీవితాన్ని ఎంచుకోమన్నా. కానీ 15 ఏళ్లు కూడా లేని జగన్.. అటువంటి జీవితం నాకొద్దమ్మ. నాన్న ఏ విధంగా నడుస్తున్నారో ఆ జీవితాన్నే నేను కోరుకుంటా అని చెప్పాడు. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్‌ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నా’’ –వైఎస్ విజయమ్మ చదవండి: ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్ విజయమ్మ -
మన జెండా తమ గుండెగా మార్చుకున్న కోట్ల మందికి సెల్యూట్: సీఎం జగన్