
సాక్షి, తాడేపల్లి: ప్లీనరీతో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో నూతనోత్సాహం వచ్చిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ ప్రాంతీయ పార్టీకి దేశంలో ఇంత ఆదరణ లేదని.. అంచనాలకు మించి పార్టీ కార్యకర్తలు ప్లీనరీకి వచ్చారన్నారు.
చదవండి: తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదు: కేఏ పాల్
చంద్రబాబు నాయుడు చెప్పుకోడానికి ఒక్క పథకం ఉందా.? విమర్శలు చేయడం కాదు.. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రమ్మంటే పారిపోతాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేరింది నిజం కాదా..? సామాజిక న్యాయం గురించి టీడీపీకి మాట్లాడే అర్హత లేదు. సామాజిక న్యాయంపై మీరు చర్చకు సిద్దమా..? మేము 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చాం. మీరు 18 మందికి ఇస్తాం అని మహానాడులో తీర్మానం చేయగలిగారా? అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment