సాక్షి, విజయవాడ: నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. విధానపరంగా పలు మార్పులు తీసుకొచ్చామన్నారు.
చదవండి: ‘వణుకుతున్నారు.. అందుకే గుంపుగా వస్తున్నారు’
ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యనేతల సమావేశం
పీన్లరీ నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.
ఘనంగా నిర్వహిస్తాం.. వైవీ సుబ్బారెడ్డి
వైఎస్సార్‌సీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మా పార్టీ అధ్యక్షులు దిశా నిర్దేశం చేయబోతున్నారన్నారు. చంద్రబాబు మతి భ్రమించిందని.. గ్రామీణ స్థాయి పిల్లలు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలనే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. నాడు-నేడు ద్వారా స్కూళ్లలో సంస్కరణలు చేపట్టారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
తొలిరోజు 9 తీర్మానాలు: పేర్ని నాని
రేపటి ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తొలిరోజు పార్టీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందన్నారు. సీఎం జగన్ పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీ ప్రారంభిస్తారని.. తొలిరోజు 9 రాజకీయ అంశాలపై తీర్మానాలున్నాయని వెల్లడించారు. మూడేళ్లలో ఏం చేశాం.. రెండేళ్లలో ఏం చేయబోతున్నామో చెబుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment