![AP DGP Inspects Arrangements For Independence Day Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/14/dgp.jpg.webp?itok=0-rRmgF0)
సాక్షి, విజయవాడ: 75వ స్వాత్రంత్య వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, సీపీ బత్తిన శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతి ఉంటుందని, మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారికే వేడుకలు వీక్షించేందుకు అనుమతి ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment