arrangements
-
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై భద్రాద్రిలో భక్తుల రియాక్షన్
-
తిరుపతిలా ఇక్కడ తొక్కిసలాట జరగనివ్వం
-
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు ప్రారంభం
-
మా వేతనాల్లో కోత వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరయ్యే తమకు సొంత రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కోత విధించవద్దని హోంగార్డులు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎన్నికల డ్యూటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి అలవెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ విధుల్లో లేనందున తమ వేతనాల్లో కోత పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు విధుల కోసం తెలంగాణ నుంచి మూడు వేల మంది హోంగార్డులు వెళ్లనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్లేందు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు అక్కడ ఇచ్చే బిల్లులతోపాటు సొంత రాష్ట్రంలో రోజువారీ వేతనం రూ.921ని కటింగ్ లేకుండా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
రైల్వే స్టేషన్లలో దీపావళి రద్దీ.. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీపావళితో పాటు ఛత్ పూజలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళుతున్నారు. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఉత్తర రైల్వే పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపడమే కాకుండా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రయాణికులకు భోజన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. అలాగే ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల గురించిన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ డెస్క్‌ను, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ఆర్సీఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని రైల్వే శాఖ మోహరించింది. స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ప్రతి సంవత్సరం పండుగలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. అయితే ఈసారి పండుగను రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
ఇంద్రకీలాద్రిలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
-
‘రథయాత్ర’కు రైల్వేశాఖ సన్నాహాలు
దేశంలోని ప్రజలు దూర ప్రయాణాలు సాగించాలనుకున్నప్పుడు రైలునే ముందుగా ఎంచుకుంటారు. రైల్వేశాఖ కూడా ప్రజల ప్రయాణ అవసరాలను గుర్తించి, ప్రత్యక రైళ్లను కూడా నడుపుతుంటుంది. జూలై ఏడు నుంచి ఒడిశాలో ప్రారంభమయ్యే రథయాత్ర ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఎంతో ఉత్సాహంతో పూరీకి తరలివెళుతుంటారు. అయితే ఈ సమయంలో అందరికీ రైలులో రిజర్వేషన్ దొరికే అవకాశం ఉండదు. దీంతో చాలామంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వస్తుంది. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, భక్తుల అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.ఈసారి జగన్నాథ యాత్ర వేడుకలు జూలై 7న ప్రారంభమై జూలై 16న ముగియనున్నాయి. దీనిలో ప్రధానంగా జరిగే రథయాత్ర జూలై 7న జరగనుంది. రథయాత్ర నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ కూడా పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.జగన్నాథ యాత్రను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పూరీ వరకు అనేక రైళ్లను పొడిగించనుంది. పూరీ యాత్రకు వెళ్లే ప్రయాణికుల కోసం వివిధ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్లను కూడా భక్తులకు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచనన్నారు. తద్వారా ప్రయాణికులు టిక్కెట్లను సలభంగా పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
TG: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అనేక నేరాలు, సామాజిక రుగ్మతలకు మానసిక ఒత్తిడి కారణం అనే విషయం మనకు తెలుసు. ఖైదీలకు యోగ శిక్షణ ఇవ్వటం ద్వారా వారిలో సత్ప్రవర్తనను మెరుగుపరవచ్చని అనేక సందర్భాలలో రుజువైంది. అదే సమయంలో నేరాలను అరికట్టే క్రమంలో పోలీసు సిబ్బందికి సైతం మానసిక ఒత్తిడి సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. వీటిని అధిగమించేందుకు కూడా యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి యోగా శిక్షణను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగతున్న సందర్భంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ళు, కార్యాలయాలో ఖైదీలకు, సిబ్బందికి విడివిడిగా యోగశిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు నాందిగా ప్రముఖ యోగా, ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో తెలంగాణ పోలీస్ అకాడమీలో 1200 మంది పోలీసు సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఒక గంట పాటు యోగసాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, మానవతావాది పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ స్వరంతో కూడిన ధ్యానంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణా పోలీసు అకాడెమీ డైరెక్టర్ జనరల్ అభిలాషా బిస్త్ మాట్లాడుతూ, కేవలం ఒక యోగా మ్యాట్ లేదా దుప్పటి, కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటే చాలు యోగ సాధన చేయవచ్చని, ఖరీదైన ఉపకరణాలేవీ లేకుండా ఆరోగ్యాన్ని పొందగలిగే ప్రక్రియ యోగ అని అన్నారు. “ఈ రోజుల్లో పని, హోదాలతో సంబంధం లేకుండా, పోలీసు సిబ్బంది సహా అందరికీ ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తిడి ఉంటోంది. మన మనసులో కలిగే ఆలోచనలకు మనం బాధ్యత తీసుకున్నపుడు, రోజూ కొంచెం సేపు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసినపుడు మన మనసును, ఒత్తిడిని మనం అదుపు చేయగలుగుతాం. ఈ దిశలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం.” అని ఆమె పేర్కొన్నారు. శ్రీమతి అభిలాషా బిస్త్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ సాధన చేయటం ద్వారా సిబ్బందిలో ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపారు.“మానవాళి అంతరంగ వికాసానికి తోడ్పడేందుకు భారతదేశం అందించిన ఈ ప్రాచీన కళను, ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది.” అని శ్రీశ్రీ రరవిశంకర్ అభిలషించారు. “గత కొద్ది సంవత్సరాలుగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. యోగాలో ఆసనాలు అనేవి ఆరంభ సూచిక మాత్రమే. యోగాలోని విజ్ఞానం చాలా లోతైనది. మనసును సమత్వంగా, భిన్న పరిస్థితులలో తొణకకుండా స్థిరంగా ఉంచటానికి, చేసే పనిపై ధ్యాసను, ఏకాగ్రతను పెంపొందించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏమిటి? అనే ప్రశ్న విజ్ఞానశాస్త్రానికి మూలమైతే, నేను ఎవరు? అనే ప్రశ్న ఆధ్యాత్మికతకు మూలం.” అని గురుదేవ్ తన సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ప్రదేశాలలో 55వేల మందికి పైగా యోగ సాధకులు, ఔత్సాహికులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణాలోని 30 జిల్లాలలో 65కు పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. తెలంగాణా పోలీస్ అకాడెమీ, వివిధ పోలీసు బెటాలియన్లు, శిక్షణా కేంద్రాలు, సి.ఆర్.పి.ఎఫ్ దళాలు, రైల్వే కార్యాలయాలు, ఉద్యోగులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. -
జులై-7 నుంచి తెలంగాణ బోనాలు
-
చంద్రాబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
-
జనసేనకు 4 మంత్రి పదవులు..
-
మోడీ ప్రమాణ స్వీకారానికి దేశాధినేతలు
-
AP: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు...!
-
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష
-
ఏపీలో కౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ పత్యేక దృష్టి
-
కాకినాడ జిల్లాలో పోలింగ్ కోసం స్వరం సిద్ధం
-
ఓటరు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
-
కడపలో పోలింగ్ కి ఏర్పాట్లు
-
పూర్తయిన ఓటర్ స్లిప్పుల పంపిణీ
-
ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు
-
ఏపీలో రేపటి పోలింగ్ కు సర్వం సన్నద్ధం
-
తెలంగాణ బరిలో 525 మంది..
-
YSRCP Memantha Siddham: మేమంతా సిద్దం సభకు ఏర్పాట్లు పూర్తి (ఫొటోలు)
-
అయోధ్యలో మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటు
-
బాలరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధం
-
Vijayawada Ambedkar Statue: విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు (ఫొటోలు)
-
అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 19న విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, సీం టూర్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 400 కోట్లకు పైగా వ్యయం చేసి అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశాం. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తరతరాల వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేద్కర్ కృషి మరువలేనిది. అంటరానితనం నిర్మూలించాలని పోరాడిన యోధులు అంబేద్కర్. సమసమాజ నిర్మాణానికి అంబేద్కర్ న్యాయ మహాశిల్పం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అంబేద్కర్ భారత గడ్డ పై పుట్టి ఉండకపోతే నేటికీ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది ఉండేవి కాదు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగానే నవరత్నాలను రూపొందించారు’’ విజయసాయి పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశాం. సమతా సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలిరానున్నారు. లక్షా 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుంది. 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. దార్శనికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదు. చరిత్రలో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం నిలిచిపోతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
పూల కళాతోరణం షర్మిల నిలయం
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, షర్మిలా అగర్వాల్ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్ టేబుళ్లు, కార్నర్ స్టాండుల్లో ఇకేబానా (జపాన్ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్ అరేంజ్మెంట్ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్‌లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి. షర్మిలా అగర్వాల్ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె. గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్ వర్క్‌బుక్స్ పోలిన పది పుస్తకాల సెట్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె. పువ్వు మాట్లాడుతుంది! ‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పెయింటింగ్స్ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేశాను. మీనియేచర్ పెయింటింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. నా స్టూడియోలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్ లమ్హే,, కహా అన్ కహా రాశాను. పెయింటింగ్ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్ రిఫ్లెక్షన్స్’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్‌కి ఆరుసార్లు వెళ్లాను. గతంలో ‘ఇకేబానిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇకేబానా ఫర్ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్‌కెళ్లి ఒహారా స్కూల్లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను. తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను. ఫ్లవర్‌పాట్ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్‌లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్‌వాజ్‌లుగా ఉపయోగించే పాత్రలు, పిన్హోల్డర్లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం. చిత్ర వైవిధ్య లేఖనం నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి. ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్‌గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్. ఈ పెయింటింగ్‌ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో సంతోషిస్తున్నారు. జపాన్ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అయోధ్య రామాలయం రెడీ
దేవతలు నిర్మించిన పవిత్ర నగరం. సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కింది అంతస్తు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇందులోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తన్నారు. ఇంతకీ ప్రస్తుతం అయోధ్య రామమందిర నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది ? జనవరి 22న జరిగే కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ? 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామ మందిర్ దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువులకు శుభవార్త అందింది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఆ జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు.. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపుగా 8వేల మందికి ఈ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. అయితే రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు.. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్ల నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు.. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ తయారు చేసింది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా.. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చరిత్ర విషయానికొస్తే.. దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు - రామ మందిరం వివాదం 2019 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది.సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత ఆ డిజైన్ కు 2020లో కొన్ని మార్పులు చేశారు. జనవరి 22న వచ్చే భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేసేందుకు అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. మాజా గుప్తర్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25 వేల మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండ్ వద్ద 30 వేల మందికి.. బాగ్ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్‌సేవక్ పురం, మణిరాం దాస్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం -
వాట్సాప్ గ్రూపులతో బందోబస్తు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించిన వాట్సాప్ గ్రూపుల విధానాన్ని.. ఇప్పుడు పోలీసులు ఎన్నికల బందోబస్తు, నిఘా కోసం అవలంబిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలతోపాటు స్థానిక సిబ్బంది పనిని ఈ గ్రూపులతో పర్యవేక్షిస్తున్నారు. పాయింట్ డ్యూటీలు, రూట్లలో ఉన్న సిబ్బంది తమ లొకేషన్, సెల్ఫీ ఫొటోలను గ్రూపుల్లో షేర్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఇక బందోబస్తు, భద్రత విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి బస, రవాణా, ఆహారం తదితరాల కోసం ఏర్పాట్లు చేశారు. ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో.. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ తరఫున ప్రచారం చేయడానికి, కాలనీలు, బస్తీల్లో జెండాలతో సంచరించడానికి చాలా మందిని నియమించుకున్నారు. వారికి రోజులు, వారాల లెక్కన చెల్లింపులు చేశారు. బృందాలుగా చేసి ప్రాంతాల్లో తిప్పారు. వారు తాము చెప్పిన చోటుకే వెళ్తున్నారా? స్థానికులను కలుస్తున్నారా? ప్రచారం చేస్తున్నారా? అన్నది పరిశీలించేందుకు వాట్సాప్ గ్రూపులను వాడారు. క్షేత్రస్థాయిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ లొకేషన్లు షేర్ చేసేలా, ప్రజలతో సెల్ఫీలు దిగిపోస్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇదే వ్యూహాన్ని బందోబస్తు, భద్రత చర్యల కోసం వచ్చి న అదనపు బలగాలను పర్యవేక్షించడానికి పోలీసు ఇన్స్పెక్టర్లు వాడుతున్నారు. కేంద్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక, సాయుధ బలగాలను పోలీసుస్టేషన్ల వారీగా కేటాయించారు. ఆయా పోలీస్స్టేషన్ల ఇన్స్సెక్టర్లే వారి విధులను పర్యవేక్షించాలి. ఎవరెవరు ఏ విధుల్లో ఉన్నారు? ఎక్కడ ఉన్నారన్నది సులువుగా తెలుసుకుని, పర్యవేక్షించేలా ఇన్స్పెక్టర్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. రూట్ పార్టీ ల్లో తిరుగుతున్న, పాయింట్ డ్యూటీల్లో ఉన్న సిబ్బంది కచ్చి తంగా తమ ఫొటోలు, లొకేషన్లను అందులో షేర్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా.. బందోబస్తు విధులంటే పోలీసులకు ఇబ్బందే. తాగడానికి నీళ్లుండవు, ఆహారం ఉండదు. కేటాయించిన ప్రాంతాన్ని వదిలి కదలడానికి లేదు. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లేందుకూ ఇబ్బందే. ఈసారి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సిబ్బంది రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి పాయింట్‌కు చేరడం కోసం, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడం కోసం వాహనాలు అద్దెకు తీసుకున్నారు. భోజనం, టీ, మంచినీళ్లుఅందేలా ఏర్పాట్లు చేశారు. -
సామాజిక సాధికార యాత్రకు భారీగా వస్తున్న జనం
-
కలసికట్టుగా పనిచేస్తేనే ఎన్నికల నిర్వహణ సాధ్యం.. కలెక్టర్..
సూర్యాపేట: జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన టీములు నిబద్ధతతో పనిచేస్తూ రోజు వారీ నివేదికలను అందించాలని కలెక్టర్ యస్. వెంకట్రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇంటలీజెన్స్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అక్రమ మద్యం, నల్లబెల్లం, నాటుసారా, నగదుపై గట్టి నిఘా ఉంచి తనిఖీలు చేపట్టాలన్నారు. పట్టుకున్న నగదు ను సత్వరమే అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. రూ. 5 లక్షల విత్‌డ్రాలను నిరంతరం పరిశీలించి నివేదికలు అందించాలన్నారు. చెక్ పోస్ట్‌ల్లో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, నగదు దొరికితే గ్రీన్ కమిటీకి అన్ని ఆధారాలతో సమర్పించాలని, రూ. 50 లక్షలకు పైబడి పట్టుబడితే వెంటనే డబ్బులతో పాటు వాహనాన్ని సీజ్ చేయాలని సూచించారు. లావాదేవీలు నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రోజూ వాణిజ్య పరమైన లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని , గృహోపకరణ గోదాంలను తని ఖీలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, అదనవు ఎస్పీ నాగేశ్వర రావు, ఏజీయం జ్యోతి, ఎకై ్సజ్ పర్యవేక్షకురాలు అనిత, ఎల్డీయం బాపూజీ, డీటీఓ రవి కుమార్, డీసీఓ శ్రీధర్, సీటీఓ యాదగిరి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల పరిశీలనకు టీములు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల పరిశీలనకు నియోజకవర్గానికి ఒక టీము చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ యస్. వెంకట్రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట నియోజక వర్గానికి జెడ్పీ సీఈఓ సురేష్, కోదాడకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావునాయక్, హుజూర్‌నగర్‌కు డీపీఓ యాదయ్య, తుంగతుర్తి నియోజకవర్గానికి డీఆర్డీఓ కిరణ్‌కుమార్‌ను నియమించామని వీరి ఆధ్వర్యంలో టీములు పనిచేస్తాయని తెలిపారు. ఈ టీముల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. -
గడప గడపకు కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లను నేతలు టచ్ చేశారు: సజ్జల
-
బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్ధం
-
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష
అమరావతి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై 'విప్'లతో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై చర్చించారు. చీఫ్ విప్‌లు ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. సమావేశాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఫలవంతం చేయాలని, అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు స్థానం కాదని విపక్ష నేతలకు సూచించారు. ఇదీ చదవండి: నేడు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్ -
G20 సదస్సుకు ముస్తాబైన హస్తిన
-
పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి 77వ భారత స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూస్తూ విస్తృత ఏర్పాట్లుచేయాలన్నారు. అదేరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా ఏర్పాట్లుచేయాలని సీఎస్ వారిని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటుచేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ ప్రొటోకాల్ సహా తగిన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కూడా సీఎస్ సూచించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు.. మరోవైపు.. వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పరంగా విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏపీఎస్పీ అదనపు డీజీపీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శకటాల ప్రదర్శనకు ఇప్పటివరకూ 13 శాఖలు ముందుకొచ్చాయని, పర్యాటక శాఖ శకటం కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ఈ వేడుకలను ప్రజలందరూ తిలకించేందుకు వీలుగా స్క్రీన్లు ఏర్పాటుచేయడంతోపాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ సహా వివిధ చానాళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. ఇక వేడుకల అనంతరం ఆయా శకటాలను విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో తిప్పనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు.. అనంతరం.. ఎన్టీఅర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కూడా మాట్లాడారు. అంతకుముందు.. రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం సంచాలకులు ఎం. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వివిధ శాఖలపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం ఘనంగా నిర్వహించాం
-
రంజాన్ కి ముస్తాబవుతున్న పాతబస్తి మీర్ ఆలం ఈద్గా
-
2,500 మందితో ‘జీ–20’కి బందోబస్తు
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ–20 సదస్సుకు 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. బందోబస్తులో 1,850 సివిల్ పోలీసులు, 400 మంది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, 4 గ్రే హౌండ్స్ యూనిట్లు, 2 క్యూఆర్టీ టీమ్‌లు, 6 స్పెషల్ పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లాటూన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఆదివారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. సదస్సు వేదిక వద్ద సిబ్బంది ధరించాల్సిన యూనిఫాం, అధికారులు, సిబ్బంది పాటించాల్సిన నియమాలు, ట్రాఫిక్, ఇతర విధుల నిర్వహణలో ఇప్పటికే పలు సూచనలు చేశామన్నారు. అంతర్జాతీయస్థాయిలో విధులు నిర్వహించే విధానాలపై ఇప్పటికే అనుభవజ్ఞులైన వారితో ప్రత్యేక తరగతులు ద్వారా అధికారులకు తెలియజేశామన్నారు. సిబ్బంది, అధికారులు తమ విధులను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని ఆదేశించారు. అతిథులు నగరంలో పర్యటించే ప్రాంతాల్లో పర్యాటకులకు ప్రవేశం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ప్రజలు, సదస్సుకు హాజరయ్యే వారికి ట్రాఫిక్‌లో అసౌకర్యం, అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 28, 29, 30 తేదీల్లో రాడిసన్ బ్లూ హోటల్ పరిసర ప్రాంతాలు, బీచ్‌రోడ్డు, ఇతర జంక్షన్లు రద్దీగా ఉండే అవకాశం ఉన్నందున నగరవాసులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎయిర్‌పోర్టు, తాటిచెట్లపాలెం, వేమన మందిరం, సిరిపురం, సీఆర్ రెడ్డి జంక్షన్, పార్క్ హోటల్, కురుపాం జంక్షన్, రాడిసన్ బ్లూ హోటల్ వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి.. ట్రాఫిక్ పోలీసులు నిర్దేశించిన ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిటీకి చేరుకున్న పోలీసులు జీ–20 సదస్సు బందోబస్తుకు శ్రీకాకుళం, పార్వతీపురం ప్రాంతాల నుంచి పోలీసులు ఆదివారం పోలీస్ బ్యారెక్స్‌కు బస్సుల్లో తరలివచ్చారు. అక్కడ నుంచి వారికి కేటాయించిన స్థలాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరు.. పోలింగ్ ఘట్టానికి సర్వం సిద్ధం
హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించారు. ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 137 పోలింగ్ కేంద్రాల్లో 29 వేల 720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 21 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 12 మంది సెక్టరోల్ అధికారులను, 29 మంది అబ్జర్వర్లను నియమించారు. ప్రాధాన్యత క్రమంలో బ్యాలెట్ విధానంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చిన పెన్నుతోనే బ్యాలెట్ పేపర్ లో ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్లలో పోలీసు బందోబస్తు, ఓటర్లకు మౌలిక సదుపాయాలు, మంచినీరు, టెంట్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా తెలిపారు. పొలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించనున్నారు. ఈ నెల 16న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితాల ప్రకటనకు 24 గంటలకు పైగా సమయం పట్టనుంది. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు (ఫొటోలు)
-
Global Investors Summit:గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే అతిథులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్దం చేశారు. జీఐఎస్ కి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులు సంఖ్య పెరుగుతుండగా వాహనాలు, వసతులకు డిమాండ్ ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‌కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు తరలిరానున్నారు. రెండు రోజుల సమ్మిట్ కోసంఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు. కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్‌కు తీసుకుంటున్నారు. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్‌కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి. ఇక వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్‌కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం -
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన ఏపీ మంత్రులు
-
తొలి వన్డేకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం
-
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది: మంత్రి హరీష్ రావు
-
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
-
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
రేపే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్
-
రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం
-
వైఎస్సార్సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
-
వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు
సాక్షి, విజయవాడ: నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. విధానపరంగా పలు మార్పులు తీసుకొచ్చామన్నారు. చదవండి: ‘వణుకుతున్నారు.. అందుకే గుంపుగా వస్తున్నారు’ ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యనేతల సమావేశం పీన్లరీ నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహిస్తాం.. వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మా పార్టీ అధ్యక్షులు దిశా నిర్దేశం చేయబోతున్నారన్నారు. చంద్రబాబు మతి భ్రమించిందని.. గ్రామీణ స్థాయి పిల్లలు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలనే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. నాడు-నేడు ద్వారా స్కూళ్లలో సంస్కరణలు చేపట్టారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తొలిరోజు 9 తీర్మానాలు: పేర్ని నాని రేపటి ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తొలిరోజు పార్టీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందన్నారు. సీఎం జగన్ పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీ ప్రారంభిస్తారని.. తొలిరోజు 9 రాజకీయ అంశాలపై తీర్మానాలున్నాయని వెల్లడించారు. మూడేళ్లలో ఏం చేశాం.. రెండేళ్లలో ఏం చేయబోతున్నామో చెబుతామన్నారు. -
పోలింగ్ కు సర్వం సిద్ధం
-
రాములోరి కల్యాణానికి వేళాయె...
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసంత ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేక మహోత్సవం ఆలయం వద్ద ఉన్న మిథిలా స్టేడియంలో జరగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీ స్థాయి లో జరిపేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత ఆరు బయట కల్యాణోత్స వం జరగనుండటంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. కాగా, కల్యాణానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒకవేళ సీఎం రాకపోతే ఆయన తరఫున కుటుంబసభ్యులు గానీ.. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని సమాచారం. అలాగే, జిల్లా ప్రజల తరఫున తాను స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పోచంపల్లి పట్టువస్త్రాలు ప్రత్యేకం రామయ్య కల్యాణానికి ఈ ఏడాది తొలిసారిగా పోచంపల్లి చేనేత కార్మికులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ చైర్మన్ జయరాజు ఆధ్వర్యం లో శనివారం ఈ పట్టు వస్త్రాలను రామాలయ ఈఓ శివాజీకి అందచేయనున్నారు. అలాగే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన భక్త బృందం గోటితో వొలిచిన 3 క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. అంతేకాకుండా సీవీఆర్ వస్త్ర దుకాణం వారు స్వామి వారి ముత్యాల కొనుగోలుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. 11, 12 తేదీల్లో గవర్నర్ పర్యటన పాల్వంచ రూరల్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శ్రీరామనవమి మరుసటి రోజు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారికి నిర్వహించే మహా పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరవడం ఆనవాయితీ. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో గవర్నర్, 11న భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, పట్టాభిషేకంలో పాల్గొంటారు. 12న దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటిస్తారు. -
AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. చదవండి: AP: కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతో పాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
-
హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు
-
బద్వేలు ఉపఎన్నికల పోలింగ్ కోసం పూర్తయిన ఏర్పాట్లు
-
ఎన్నికల ఏర్పాట్ల పై SEC పర్యవేక్షణ
-
Dussehra 2021: దసరా ఉత్సవాలకు భాగ్యనగరం సన్నద్ధం
దసరా ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో నగరంలో ఆధ్యాతత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. చారిత్రక భాగ్యనగరంలో దసరా సమ్మేళనం వైవిధ్యభరితమైన సాంస్కృతిక ఆవిష్కరణ. వందల ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వివిధ భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతింబించేవిధంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతేడాది వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈసారి సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అన్ని వర్గాల్లో దసరా జోష్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. శతాబ్దాల చారిత్రక ఉత్సవం... ► నిజాం నవాబుల కాలంలోనే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వివిధ వర్గాల ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ కాలంలో ప్రతి పండగకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ప్రజల ఆచార సంప్రదాయాలు గొప్ప ఆదరణ లభించింది. తెలుగువారితో పాటు బెంగాలీలు, కన్నడిగులు, మలయాళీలు తదితర వర్గాల ప్రజలు తమ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా దుర్గామాత వేడుకలను జరుపుకొంటున్నారు. ► బెంగాలీలు దసరా ఉత్సవాల్లో భాగంగా అయిదు రోజుల పాటు దుర్గామాత వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పంచమి, సప్తమి, అష్టమి, నవమి, దశమి రోజుల్లో పూజలు నిర్వహిస్తారు. బెంగాలీల ఆచారం ప్రకారం దుర్గామాతను తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు. ఇంటి ఆడపడచును సాదరంగా ఆహహ్వానించినట్లుగానే దేవిని ఆహహ్వానిస్తారు. దుర్గామాతతో పాటు ఆమె సంతానమైన సరస్వతి, లక్ష్మీ, వినాయకుడు, కార్తికేయుడు వంటి దేవ దేవుళ్లను కొలిచి మొక్కుతారు. ► కన్నడిగులు కూడా దసరా పండగలో భాగంగా నవరాత్రులు దేవీ ఆరాధన చేస్తారు. ఇళ్లలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. కొందరు పది రోజులూ వెలిగిస్తే, మరి కొందరు ఏడు, మరికొందరు అయిదు, కనీసం మూడురోజులు మాత్రం తప్పకుండా వెలిగిస్తారు. చాలా మంది ఇళ్ళల్లో బొమ్మల కొలువును పెడతారు. తొమ్మిది రోజులు ఉపవాసాలు ఆచరిస్తారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ అమ్మవారి ఆవాహన, మరుసటి రోజు సరస్వతి పూజ చేసుకుంటారు. దుర్గాష్టమి రోజు ఆయుధపూజ ఆచరిస్తారు. వంటింటిలో ఉపయోగించే కత్తి,కత్తెర, చాకులాంటి ఆయుధాలను కూడా పూజిస్తారు. ► కన్నడిగులు దసరా వేడుకలను తమ సంప్రదాయ పండగగా సంభ్రమానందాలతో ఆచరిస్తారు. సరదాల దసరా.. ► తెలంగాణలో ఇది సరదాల దసరా. అతి పెద్ద పండగ. ఇంటిల్లిపాదీ నూతన వ్రస్తాలు ధరించి రకరకాల పిండివంటలతో పాటు, నాన్‌వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపేస్తారు. ► దసరా తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా పండే మెట్ట పంటలకు ప్రతీక. అందుకే ప్రజలు ఏపుగా పెరిగిన జొన్న కరల్రను జెండాలుగా ఎత్తుకొని.. బ్యాండు మేళాలతో వెళ్లి పాలపిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. ► జమ్మి ఆకు, జొన్న కంకి, మారేడు పత్రిని (దీనిని బంగారంగా భావిస్తారు) దేవతలకు సమర్పించి ఆ తర్వాత ఒకరికొకరు జమ్మి ఆకు చేతిలో పెట్టుకొని అలయ్ బలయ్ (ఆలింగనం) తీసుకొంటారు. ► మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆత్మీయత, అనురాగాలను పంచిపెట్టే పండగ దసరా. గుండెల నిండా ఆర్తిని నింపుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొనే క్షణాలు మధురానుభూతులు. వేడుకలకు సిద్ధం.. ► దసరా వేడుకల్లో భాగంగా నగరవాసులు జమ్మి చెట్టును సందర్శించి పూజ కోసం జమ్మి ఆకును తెచ్చుకోవడం సంప్రదాయం. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది పెద్ద ఎత్తున జమ్మి మొక్కలు కూడా నాటారు. ► మరోవైపు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీ రాంలీలా గ్రౌండ్స్, అంబర్పేట్ పోలీస్ గ్రౌండ్స్, గోల్కొండ కోట ప్రాంగణం, సీతారాంబాగ్ దేవాలయం, ఆర్కే పురం అష్టలక్ష్మీ దేవాలయం, జిల్లెల గూడ వెంకటేశ్వర దేవాలయం, సైదాబాద్ పూసలబస్తీ, ఓల్డ్ మలక్‌పేట్, అక్బర్‌బాగ్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో, నగరంలోని వివిధ ప్రాంతాల్లోని కూడళ్లలలో జమ్మి కొమ్మలకు పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. -
దసరా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
-
ఎంపీపీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం
-
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
-
HYD : ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు
-
కృష్ణా జిల్లాలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు
-
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: 75వ స్వాత్రంత్య వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, సీపీ బత్తిన శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతి ఉంటుందని, మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారికే వేడుకలు వీక్షించేందుకు అనుమతి ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
Krishnapatnam Medicine: ఆనందయ్య మందు.. ‘ఔషధచక్ర’?
ముత్తుకూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు ఇస్తున్న మందు పేరును ‘ఔషధచక్ర’గా నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి ఆయుర్వేద మందు పంపిణీకి అవసరమైన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్స్‌లో మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం నిమగ్నమై ఉంది. సేకరణ పూర్తయిన తర్వాత రెండురోజుల్లో మందు తయారీ ప్రారంభమవుతుందని ఆనందయ్య సన్నిహితులు వెల్లడించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదటి ప్రాధాన్యతగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి ‘పి’ రకం మందు (కరోనా రానివారు వాడేది) అందచేయాలని నిర్ణయించారు. తర్వాత కరోనా రోగులకు అవసరమైన ‘పి, ఎల్, ఎఫ్’ రకాల మందు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అనంతరం ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని సంకల్పించారు. మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ -
సత్వర కరోనా సేవలే లక్ష్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ముందడుగు
-
ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడు మన దగ్గరే!
మేడిపెల్లి(వేములవాడ): దేశంలోని అన్ని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తుంటాడు. కానీ ఇక్కడ మాత్రం శివుడు నిజరూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా పేరు పొందింది. శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి.. తొంబర్రావుపేట శివాలయంలో మహాశివరాత్రిని పురష్కరించుకొని నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నెల 10న పుణ్యహవచనం, స్థాపిత దేవతల పూజలు, అభిషేకాలు, 11న స్వామివారి కల్యాణం, జాగారం, లింగోధ్భావం, 12న రథోత్సవం, అన్నదానం, 13న బద్దిపోచమ్మకు బోనాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చదవండి: నైట్‌షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు! -
ఏపీ: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది. కోవిడ్ వ్యాక్సిన్ రవాణా, భద్రపరచడంపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. స్టోరేజ్ పాయింట్లో 15 లక్షల డోసులు నిల్వ చేసే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.(చదవండి: గుడ్ న్యూస్ : ఈ నెల 16 నుంచే వ్యాక్సినేషన్) గన్నవరం సెంటర్ నుంచే 4 రీజనల్ సెంటర్లు, జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని, కర్నూలు, కడప, గుంటూరు, విశాఖలో ప్రాంతీయ వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. గన్నవరంలోని రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్లో ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం పరిశీలించారు. అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ రవాణాకు 19 వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనంలో 2 - 8 డిగ్రీల మధ్యలో వ్యాక్సిన్ భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ల భద్రతకు 36,381 వ్యాక్సిన్ కెరియర్స్, 3,108 కోల్డ్ బాక్స్‌లు1,50,700 ఐస్ ప్యాక్స్ అవసరమని కేంద్రానికి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.(చదవండి: అనసూయ ట్విట్.. మెగా ఫ్యామిలీలో కలకలం!) -
వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
సాక్షి, తిరుమల: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఐదు సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేంద్రాలను అడిషనల్ ఈవోతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఎల్లుండి నుంచి భక్తులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుంచి రావొద్దని భక్తులకు జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) -
హైదరాబాద్‌లో కరోనా వాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జనవరి రెండో వారంలోగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు వాక్సిన్ స్టోరేజీ, పంపిణీ ప్రక్రియ ముందే సిద్ధం చేసి ఉంచాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి తొలి విడతగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ పంపిణీకి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆయాల నుంచి డాక్టర్ల వరకు అందరి వివరాలను ఇప్పటికే సేకరించింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వ్యాక్సిన్‌ను చుట్టల్‌బస్తీ, బేగంబజార్, హరాజ్‌పెంట, శ్రీరాంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని స్టోరేజ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి నేరుగా అవసరమైన వారి చెంతకు చేరుస్తారు. ఇప్పటికే కోల్డ్‌స్టోరేజీ బాక్సులు కూడా నగరానికి చేరుకున్నాయి. సాధారణ వ్యాక్సిన్ మాదిరే కోవిడ్ వాక్సిన్ను కూడా 2 నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది 2.67 లక్షల మందిని గుర్తించగా...వీరిలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 76,804 మంది, రంగారెడ్డి జిల్లాలో 25,211 మంది, మేడ్చల్ జిల్లాలో 10,050 మందిని గుర్తించారు. గ్రేటర్ పరిధిలో 42 శాతం మంది ఉండగా, వీరిలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 28 శాతం ఉన్నట్లు అంచనా. రెగ్యులర్ వాక్సిన్లకు ఆటంకం కలగకుండా.. కోవిడ్ వాక్సినేషన్, పనితీరుపై జిల్లా స్థాయి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి నేటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. డీఎంహెచ్ఓ, డీఐఓ, సహా పలువురు మెడికల్ ఆఫీసర్లకు తొలి విడత శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత వీరు కంప్యూటర్ ఆపరేటర్లు, పీహెచ్సీలో పని చేస్తున్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వనున్నారు. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ వాక్సినేషన్‌కు ఇబ్బంది లేకుండా బుధ, శనివారాలు మినహాయించి మిగిలిన రోజుల్లో కోవిడ్ వాక్సిన్ వేయనున్నారు. ఒక్కో ఏఎన్ఎం రోజుకు ఎంపిక చేసిన ప్రాంతంలో వంద మందికి కరోనా టీకా వేయాల్సి ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. -
తుంగభద్ర పుష్కరాలకు రూ. 2.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం బుధవారం రూ.2.50 కోట్లు విడుదల చేసింది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల మాదిరిగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరైతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా పుష్కరాల కోసం ఏర్పాట్లు చేయొద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అధికారికంగా పుష్కరఘాట్లను కూడా ఏర్పాటు చేయటం లేదు. ఆలంపూర్లోని జోగులాంబ దేవాలయం వద్ద మాత్రమే ఆలయం పక్షాన ఏర్పాట్లు ఉంటాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయటం విశేషం. -
బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండను ముస్తాబు చేస్తున్నారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు. మాడవీధులలో శోభాయమానంగా రంగవల్లులు వేయించారు. టీటీడీ గార్డెనింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్‌రోడ్‌కు మరమ్మతులు చేసి పిట్టగోడలకు రంగులు వేస్తున్నారు. ఆలయం ఎదుట రంగవల్లిక.. -
డిగ్రీ, పీజీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. బుధవారం పాపిరెడ్డి ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ గతంలో ఒక రూమ్ లో 40 మందిని కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించే వాళ్ళమని, ఇప్పుడు 20 మంది మాత్రమే కూర్చొని పరీక్ష రాస్తారని అన్నారు. ప్రతి విద్యార్థికి మద్యలో ఒక బెంచ్ ఖాళీగా వుంటుందని, అయితే ఇన్విజిలేటర్లు మాత్రం బయటి నుంచి వస్తారని, సాధ్యమైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు పరీక్ష రాయలేని వాళ్లకు అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని, సర్టిఫికేట్లో మాత్రం రెగ్యులర్ అనే వస్తుందని పేర్కొన్నారు. కాగా ప్రతి విద్యార్థి మాస్క్ ధరించి పరీక్షకు హాజరవ్వాలని ఇప్పుడు మాత్రం చివరి సంవత్సర విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 6 యూనివర్సిటీలలో రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఒక వేళ బ్యాక్ లాగ్స్ వుంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు ఎంసెట్ రాయలేని వారి గురించి ప్రభుత్వ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పాపిరెడ్డి స్ఫష్టం చేశారు. -
నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు గంగమ్మ ఒడికి గణనాథుడు తరలనున్నాడు. దీంతో ఊరేగింపు, నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఘట్టం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అదనపు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల బైండోవర్, వారిపై నిఘా ఉంటుంది. ఏటా నిమజ్జన కార్యక్రమం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సాగుతోంది. దీంతో ఈ ఏడాది మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీల సహకారంతో మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాములోపు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. విగ్రహాల తరలింపునకు వాహనాలు లభించని వారికి పోలీసులే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు హ్యాండ్ హెల్డ్ కెమెరాలను వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు సాయుధ బలగాలూ మోహరించనున్నాయి. విధుల్లో ఉండే సిబ్బందికి షిఫ్ట్ విధానం అమలు చేస్తూ వారికి అవసరమైన ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్స్ అందిస్తున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీసు అధికారులు ఇతర విభాగాలతో పాటు శాంతి, మైత్రి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారు. ఏర్పాట్ల వివరాలివి నిమజ్జనం జరిగే ప్రదేశాలు: ట్యాంక్‌బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్‌పేట చెరువు, సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్, సఫిల్‌గూడ/మల్కాజ్గిరి చెరువులు, హస్మత్‌పేట చెరువు. హుస్సేన్‌సాగర్‌కు వచ్చేవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు శివారులోని మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని విగ్రహాలు. ఊరేగింపుల్లో డీజేలు నిషేధం: నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఇలాంటి తీవ్రమైన శబ్దం వచ్చే వాటివల్ల పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థకు నష్టం ఉంటుంది. మద్యం విక్రయాలు బంద్: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. -
వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు
కలియుగ వైకుంఠం తిరుమల వైకుంఠ ఏకాదశికి సిద్ధమైంది. సోమవారం వైకుంఠ ఏకాదశి, మంగళవారం ద్వాదశి దర్శనాలకు లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం వేకువజామున శ్రీవారికి ఏకాంతంగా పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 2 గంటలకే దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వైకుంఠ ఏకాదశికి టీటీడీ భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, వసతులపై ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుమల: భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలసి ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల కొండ. ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి. ధనుర్మాస నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామివారు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా వెలుపలికి వచ్చి భక్తులకు దర్శమిస్తారు. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠ ద్వారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో ఉన్న పుణ్య నదులన్నీ స్వామివారి పుష్కరిణిలో కలుస్తాయని వరాహ పురాణం చెబుతోంది. ఆరోజు పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. సర్వాంగ సుందరం.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 12టన్నుల పుష్పాలతో ఆలయం, అనుబంధ ఆలయాలను పరిమళభరిత పుష్పతోరణాలు, పలు రకాల పండ్ల తోరణాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీపాలంకరణలతో కొండ ప్రకాశిస్తోంది. ప్రధాన రహదారులన్నీ విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు. వాహన మండపంలో శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. పటిష్ట బందోబస్తు వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 మంది సిబ్బందితో బందోబస్తుకు నియమించారు.మరో 200మంది స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రముఖులకు బందోబస్తును కల్పిస్తున్నారు. ఘాట్ రోడ్లలో నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దొంగతనాలను ఆరికట్టడానికి ప్రత్యేకంగా స్పెషల్ క్రైం టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. 4 రోజులు ఆర్జిత సేవలు రద్దు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు, టైమ్‌స్లాట్, దివ్యదర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ద్వాదశి నాడు మాత్రం 2,500 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఇప్పటికే ఆన్లైన్లో భక్తులకు కేటాయించింది. ఈ రెండు రోజుల్లో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. పూజాది కార్యక్రమాలు, నైవేద్యం, విశ్రాంతి, ప్రముఖుల దర్శనాలను మినహాయిస్తే దాదాపు 43గంటల పాటు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలు నేరుగా వస్తేనే పాసులు వీఐపీల కోసం ప్రత్యేకంగా పద్మావతి అతిథి గృహం ప్రాంతంలోని రామరాజు, సీతా నిలయం వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వసతి, దర్శన పాసులను జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తేనే 6 టిక్కెట్లు, అధికారులకు 4టిక్కెట్లను జారీ చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా న్యాయమూర్తులతో పాటు 20మంది మంత్రులు, దాదాపు 150మందికి పైగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నట్లు టీటీడీకి సమాచారం అందింది. సర్వదర్శనం ఇలా.. సర్వదర్శనం క్యూకు సంబంధించి ఎంబీసీ 26 వద్ద నుంచి ప్రవేశించే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి వదులుతారు. క్యూ కాంప్లెక్స్ 1,2లోని 60 కంపార్ట్మెంట్లలో దాదాపు 30 వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది. నారాయణగిరి ఉద్యానవనం, కల్యాణవేదిక కలిపి మొత్తం 85వేలమంది భక్తులు కూర్చునేలా షెడ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి ముందు రోజు నుంచే భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. 5వ తేదీ ఉదయం నుంచే వీరిని కంపార్ట్మెంట్లలోకి వదులుతారు. వీరికి శ్రీవారి దర్శనం భాగ్యం 6 తేదీ ఉదయం 5గంటల నుంచి ప్రారంభం అవుతుంది. -
సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు
సాక్షి, చిత్తూరు: జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభా నికి ఈ నెల 9వ తేదీన చిత్తూరుకు విచ్చేయనున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లు పక్కా గా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, జాయింట్ కలెక్టర్ మా ర్కండేయులు, జేసీ–2 చంద్రమౌళి, చిత్తూరు ఆర్డీఓ రేణుక, వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్ర వి ద్యాశాఖ మధ్యాహ్న భోజన పథకం విభాగం జేడీ రవీంద్రారెడ్డి ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. 9వ తేదీన అమ్మ ఒడి పథకం ప్రారంభం, బహిరంగ సభకు చిత్తూరులోని పీవీకేఎన్ మైదానాన్ని ఖరారు చేశారు. మెసానికల్ మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భా గంగా పీవీకేఎన్ మైదానంలో జరిగే కార్యక్రమంలో దాదా పు 25 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అదనంగా సభావేదికను ఏర్పాటు చేయనున్నారు. రెండు గంటల పాటు జరిగే సీఎం పర్యటన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ప్రత్యేకంగా స్టాళ్లు సభావేదిక వద్ద పలు సంక్షేమ పథకాలకు సంబంధించి స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. నాడు–నేడు పథకం, మధ్యాహ్న¿ోజనం, అమ్మఒడి, వైఎస్సార్ కంటివెలుగు, ఇంగ్లిషు ల్యాబ్ స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ స్టాళ్ల ఏర్పాట్లను విద్యాశాఖ అధికారు లు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులను కార్యక్రమానికి తీసుకొచ్చే లా చర్యలు తీసుకుంటున్నారు. ఉప రవాణాశాఖాధికారు లు విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా బస్సుల ను ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించిన గ్రామాల్లో బస్సులను ట్యాగ్ చేసి వారిని క్షేమంగా తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అల్పాçహారం అందజేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో విద్యార్థుల పర్యవేక్షణకు సంరక్షకులుగా టీ చర్లను, పీడీ, పీఈటీలను నియమిస్తున్నారు. విద్యార్థులు యూనిఫామ్‌లో రావాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసే ప్రజాప్రతినిధులకు జ్ఞాపికలు అందజేయనున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి అధికారులంతా సమన్వ యంతో పనిచేసి, ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చే స్తున్నాం. బందోబస్తును క ట్టుదిట్టం చేస్తున్నాం. హెలీప్యాడ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న జగనన్న అమ్మఒడి పథకం చిత్తూరులో ప్రారంభించడం సంతోషకరం. ఈ పర్యటనను పక్కాగా నిర్వహించి విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణ భరత్ గుప్త, జిల్లా కలెక్టర్ ఎంఈఓ, హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించాం సీఎం పర్యటనపై జిల్లా లోని 66 మండలాల ఎంఈఓలు, గుర్తించిన ఆయా పాఠశాలల హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించాం. ముందస్తు ప్ర ణాళికలను సిద్ధం చేసు కుని ముందుకెళ్తున్నాం. క లెక్టర్ సూచనల మేరకు విభాగాల వారీగా బృందాలను ఏర్పాటుచేశాం. ఆ టీంలు చేయాల్సిన విధివిధానాలపై సూచనలు ఇచ్చాం. పర్యవేక్షణ, విద్యార్థులకు అల్పాహారం ఏర్పాట్లు చేస్తున్నాం. – వెంకటకృష్ణారెడ్డి, ఆర్జేడీ, వైఎస్సార్ కడప జిల్లా -
మున్సి‘పోల్స్’ ఏర్పాట్లలో ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమై న రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)..ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాష్ట్ర స్థాయి మున్సిపల్ ఎన్నికల అధికారిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (డీఎంఏ)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఎస్ఈసీ.. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ మినహా)లో ఎన్నికల నిర్వహణ విధులు, అధికారాలు సీడీఎంఏకు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. జిల్లా స్థాయిల్లో (హైదరాబాద్ మినహా) కలెక్టర్లను జిల్లా మున్సిపల్ ఎన్నికల అధికారులు గా నియమించారు. అన్ని కార్పొరేషన్ల (జీహెచ్ఎం సీ మినహా) కమిషనర్లను అదనపు జిల్లా అధికారులుగా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు/ సబ్ కలెక్టర్ల ను డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులుగా, జిల్లాల జాయింట్ కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు జిల్లా ఎన్నికల అధికారులుగా, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను సహాయ జిల్లా ఎన్నికల అధికారులుగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఎన్నికల ప్రక్రియపై చర్యలు.. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నమోదైన ఓట ర్ల జాబితాలకు అనుగుణంగా మున్సిపల్ ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు చేపట్టాల్సిన చర్య లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా జాబితాలు సిద్ధం చేసి ప్రచురించేందుకు అనుసరించాల్సిన విధానాలు, వార్డుల విభజన, ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు, ఫలితాల ప్రకటన వరకు అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ప్రచురణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, శిక్షణ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పేపర్ల పంపిణీ, కౌంటింగ్, స్ట్రాంగ్‌రూంల గుర్తింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల సామగ్రి సేకరణ వరకు వివిధ అంశాలపై దృష్టి నిలిపారు. 2019 జనవరి 1 ప్రాతిపదికగా.. ఈనెల 4న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు ప్రచురించనున్నారు. వీటిని సిద్ధం చేసే అధికారం మున్సిపల్ కమిషనర్లకు కల్పించారు. ►మున్సిపాలిటీలో వార్డుల వారీగా.. 2019 జనవరి 1ని ప్రాతిపదికగా తీసు కుని ఫొటో ఓటర్ల జాబితా లు సిద్ధం చేసుకోవాలి. ►ఇందులో ఓటర్ ఫొటో, పేరు, తండ్రి/తల్లి/భర్త పేరు, వయసు, లింగం, ఇంటి నంబర్, ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఉండేలా చూసుకోవాలి. ►వార్డుల వారీగా మున్సిపల్ కమిషనర్లు ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ప్రచురించాలి. ►ఓటర్ల జాబితాల్లో ఏ ఓటరు పేరు ఎదుటా వారి కులం, వర్గం, జాతి వివరాలు ఉండకూడదు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై... పోలింగ్స్టేషన్ల గుర్తింపు, వాటి జాబితా ఇతరత్రా బాధ్యతలను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించా రు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పో లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించిన భవనా లను మున్సిపాలిటీల రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 13న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన పోలింగ్స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు (ఫొటోలు లేకుండా) ఎన్నికలు జరగనున్న సంబంధిత మున్సిపాలిటీలతో పాటు టీఎస్ఈసీ వెబ్‌పోర్టళ్లలో ప్రచురిస్తారు. ఈ నెల 4న మున్సిపల్ కమిషనర్ల ద్వారా పోలింగ్స్టేషన్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి 5న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 7న మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహి స్తారు. 8న సాయంత్రం 5 గంటల వరకు క్లెయిమ్స్, సలహాలు, అభ్యంతరాల స్వీకరణ.. 9న వాటి పరిష్కారం, అదేరోజు పోలింగ్స్టేషన్ల తుదిజాబితా జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. 10న తుదిజాబితాను ఖరారు చేస్తారు. 13న తుది జాబితా ప్రచురణ.. 14న అధికారిక ప్రకటన ఉంటుంది. వారు పల్లె ప్రగతిలో పాల్గొనవద్దు: ఎస్ఈసీ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అదనపు జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న మున్సి పల్ కార్పొరేషన్ల కమిషనర్లు (జీహెచ్ఎంసీ మినహా) గురువారం నుంచి జరగనున్న రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీడీవోలు కూడా పాల్గొనకూడదని పేర్కొంది. 4 వరకు కామన్ సింబల్ దరఖాస్తులు... తమ వద్ద రిజిస్టరై, రిజర్వ్డ్ సింబళ్లు లేని ఏ పార్టీ అయినా కామన్ సింబల్ కేటాయింపు కోసం 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ ఈసీ తెలిపింది. అయితే సదరు పార్టీ ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డు స్థానాల్లో కనీసం పది శాతం సీట్లలో పోటీ చేయాలంది. ఎస్ఈసీ సెక్రటరీ పేరిట రూ.10 వేల డీడీని డిపాజిట్ చేయాలని తెలిపింది. ఒకవేళ పది శాతం మంది అభ్యర్థులను పోటీకి నిలపకపోతే కామన్ సింబల్తోపాటు డిపాజిట్‌ను కోల్పోతారంది. -
అక్కడే హామీ.. అక్కడే అమలు
సాక్షి, ఏలూరు: ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, పేర్నినాని, కలెక్టర్ ముత్యాల రాజు ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు జిల్లా వాసుల ఎన్నో సంవత్సరాల కల అని.. ఆ కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. శుక్రవారం మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన అనంతరం ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకంలో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తారని వెల్లడించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. ఏలూరు బహిరంగ సభలో ఆటోడ్రైవర్లకు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఏలూరులోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. జిల్లాలో 13,062 మంది ఆటో, ట్యాక్సీ వాహనదారులకు రూ.10 వేల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందజేయనున్నారని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. రొట్టెల పండుగ పూర్తయ్యే వరుకూ బారా షాహీద్ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ... రొట్టెల పండుగ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, నేతలు మాలెం సుధీర్‌కుమార్ రెడ్డి, దర్గా కమిటీ ఛైర్మన్ రజాక్,మున్నా తదితరులు పాల్గొన్నారు. -
డీజేలు,డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదు..
సాక్షి, హైదరాబాద్: గణేష్ మండలపాల వద్ద డీజేలు, సినిమా పాటలు, డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదని..ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు పిలుపునిచ్చారు. దేశ,దైవ భక్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలు దోహదపడాలని ఆకాంక్షించారు. అనంత చతుర్దశి రోజున మాత్రమే గణేష్ నిమజ్జనం చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. చిన్నారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించాలన్నారు. మనమంతా ఒక్కటి కావాలనే సందేశం ఇవ్వడం కోసం జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గణేష్ ఉత్సవాల్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ రహిత,స్వచ్ఛత,శుభ్రత గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంగా హారతి ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు. 10న రవీంద్రభారతీలో భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు.. ఈ నెల 12న జరిగే 40వ సామూహిక గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని భగవంతరావు తెలిపారు.8 గంటలకు లడ్డూ వేలం అనంతరం బాలాపూర్ గణేష్ శోభా యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, స్వామి ప్రజ్ఞనంద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. -
గణ నాథుని బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబు
సాక్షి, కాణిపాకం(యాదమరి): సత్యప్రమాణాల దేవుడు..ప్రథమ పూజ్యడు అయిన శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబవుతోంది. సెప్టంబర్ 2వ తేదీ నుంచి 22వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారు వివిధ వాహనాలలో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయనున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. ఆలయం, ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ధ్వజారోహణం.. వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణంతో శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. స్వామివారి వాహనమైన మూషికచిత్రపటాన్ని ధ్వజస్తంభానికి ఆరోహణ చేసి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాలు నిర్వఘంగా జరిగేలా దేవతలు ఆశీర్వదించేలా పూజలు చేస్తారు. హంస వాహన సేవ.. మొదటి రోజు రాత్రి హంస వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. హంస వాహన సేవను తిలకిస్తే సద్గుణాలు అలవడుతాయని భక్తుల నమ్మకం. ఈ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున హజరవుతారు. మయూర వాహన సేవ.. రెండవ రోజు మయూర(నెమలి) వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. మనిషిలో మంచిని గుర్తించేందుకు ఈ వాహన సేవను చూసి తరలించాలని పురాణాలు చెబుతున్నాయి. మూషిక వాహన సేవ.. మూషికాశురుడిని స్వామి వారు వధించి, అతని కోరిక మేరకు మూషికాన్ని తన వాహనంగా చేసుకుంటారు. మూడోవ రోజు గణపయ్య మూషిక వాహనంపై దర్శనం ఇస్తారు. గర్వం తొలగిపోయేందుకు ఈ వాహన సేవను భక్తులు దర్శిస్తారు. శేష వాహన సేవ.. నాగలోకానికి అధిపతి నాగరాజు. అలాంటి శేషుడ్ని వాహనంగా చేసుకొని వినాయకుడు నాల్గువరోజు భక్తులకు దర్శనం ఇస్తారు. ఉత్సవాల్లో చిన్న, పెద్ద శేషవాహనాలపై స్వామివారు ఉదయం, రాత్రి వేళలో భక్తులకు దర్శనిమిస్తారు. వృషభ వాహన సేవ.. వృషభానికి అధిపతి శివుడు. ఐదో రోజు ఉత్సవంలో వినాయకుడు వృషభ వాహనంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన సేవను తిలకిస్తే స్వామి వారి కరుణా కటాక్షాలతో పాటు శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రథోత్సవం.. ఏడో రోజున స్వామివారు భక్తులకు రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రథంపై విహరించే స్వామివారిని దర్శిస్తే సకల దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. గజవాహన సేవ.. ఏనుగు తలను తన శిరస్సుగా మార్చుకున్న స్వామివారు ఆరో రోజు గజవాహనంపై కరుణిస్తారు. ఈ గజ వాహన సేవను దర్శిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అశ్వవాహన సేవ.. మూషికాశురుని సంహారం తర్వాత బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధి, బుద్ధితో స్వామివారికి కల్యాణం జరుగుతుంది. అనంతరం స్వామి వారు స్వామివారు సిద్ధి,బుద్ధి సమేతంగా అశ్వవాహనంపై విహరిస్తు భక్తులకు దర్శనం ఇస్తారు. ఎనిమిదో రోజు అశ్వవాహన సేవ జరుగుతుంది. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏకాంత సేవ.. బ్రహ్మోత్సవాలు పూర్తిఅయిన తర్వాత ధ్వజావరోహణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత స్వామివారి మూల విగ్రహానికి పాయసం, వడలతో అభిషేకం నిర్వహిస్తారు. దీనిని వడాయిత్తు ఉత్సవంగా అంటారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వివరాలు.. -2వ తేదీ వినాయక చవితి సందర్భంగా ఉదయం అభిషేకం, సాయంత్రం పుష్పకావళ్లు, రాత్రి గ్రామోత్సవం. -3వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం -4వ తేదీ రాత్రి నెమలి వాహనం -5వ తేదీ రాత్రి మూషిక వాహనం -6వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి బంగారు పెద్ద శేషవాహనం -7వ తేదీ ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహనం -8వ తేదీ రాత్రి గజ వాహనం -9వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం -10వ తేదీ ఉదయం భిక్షాండి, రాత్రి తిరుకళ్యాణం, అశ్వవాహనం -11వ తేదీ పగలు ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, రాత్రి ఏకాంత సేవ ప్రత్యేక ఉత్సవాలు.. -12వ తేదీ రాత్రి అధికార నంది వాహనం -13వ తేదీ రాత్రి రావణబ్రహ్మ వాహనం -14వ తేదీ రాత్రి సూర్యప్రభ వాహనం -15వ తేదీ చంద్రప్రభ వాహనం -16వ తేదీ రాత్రి యాళివాహనం -17వ తేదీ రాత్రి విమానోత్సవము -18వ తేదీ రాత్రి కల్పవృక్ష వాహనం -19వ తేదీ రాత్రి పూలంగి సేవ -20వ తేదీ రాత్రి కామధేను వాహనం -21వ తేదీ రాత్రి పుష్పపల్లకి సేవ -22వ తేదీ రాత్రి తెప్పోత్సవం భక్తులకు విస్తృత ఏర్పాట్లు.. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్వాగత ఆర్చీలు ఏర్పాటు చేశాం. రంగవల్లులు, విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దాం. క్యూల ఆధునీకరణ, పుష్పాలంకరణ, అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాం. –దేముళ్లు, ఈఓ కాణిపాం దేవస్థానం -
సచివాలయ పరీక్షలకు సై..
సాక్షి, విజయనగరం గంటస్తంభం: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగా గాంధీజీ కలలు సాకారం చేసేందుకు అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి వ్యవస్థను పటిష్టపరిచేందుకు సచివాలయ ఉద్యోగుల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీవరకు నిర్వహించే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వారిని వైస్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈవో మెంబర్ కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్ –2, మరో 13 మంది జిల్లా అధికారులను సభ్యులుగా కమిటీ వేశారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను కమిటీ పర్యవేక్షిస్తోంది. విజయనగరం జిల్లాలో భర్తీ చేసే పోస్టులు: 5,915 -దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు: 1,00,783 మంది -జిల్లాలో పరీక్షా కేంద్రాలు: 198 -పరీక్షలను నిర్వహించేందుకు రూటు ఆఫీసర్లు: 61మంది -ఫ్లయింగ్ స్క్వాడ్లు: 20 బృందాలు -చీఫ్ సూపరింటెండెంట్లు: 272 మంది, -అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు: 128 మంది -సెంటర్ స్పెషల్ ఆఫీసర్లు: 198 మంది -హాల్ సూపరింటెండెట్లు : 1082 మంది -వెన్యూ కో– ఆర్డినేటర్లు: 97 మంది -ఇన్విజిలేటర్లు: 3,042 మంది -పోలీసు బందోబస్తు: 600 మంది రేపటి నుంచి పరీక్షలు.. విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 14 పరీక్షల్లో 10 పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లోను, 4 పరీక్షలు కేవలం ఇంగ్లిష్‌లో జరుగుతాయి. -సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 198 పరీక్ష కేంద్రాల్లో 58,812 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. ఆ రోజు మధ్యాహ్నం విజయనగరం జిల్లా కేంద్రంలో 22 పరీక్ష కేంద్రాల్లోను, పార్వతీపురంలో 12 పరీక్ష కేంద్రాలను కలిపి 34 కేంద్రాల్లో 11,139 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరుగుతాయి. విజయనగరానికి సంబంధించి 47 కేంద్రాల మ్యాపులను తయారుచేసి హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. అభ్యర్థులను సమయానికి పరీక్ష కేంద్రాలకు తరలించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. - సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 19 పరీక్ష కేంద్రాలలో 6,655 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 10 పరీక్ష కేంద్రాల్లో 4,383 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. -సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాల్లో 1336 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2 పరీక్ష కేంద్రాల్లో 739 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. - సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం రెండు పరీక్ష కేంద్రాల్లో 1178 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం ఒక పరీక్ష కేంద్రంలో 560 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 13 పరీక్ష కేంద్రాల్లో 6,858 మంది అభ్యర్థులు మధ్యాహ్నం ఒక పరీక్ష కేంద్రంలో 134 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాలలో 2,574 మంది అభ్యర్థులు మధ్యాహ్నం 16 పరీక్ష కేంద్రాలలో 6,424 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 198 పరీక్ష కేంద్రాల్లో 13 పరీక్ష కేంద్రాలలో దివ్యాంగులు పరీక్షలకు హాజరవుతున్నట్లు గుర్తించారు. వారిక పరీక్ష కేంద్రం నుంచి వారి స్థానం వరకు గ్రామ వలంటీర్ల సహాయంతో తీసుకుని వెళ్లేందుకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరవుతున్న అంధులైన అభ్యర్థులకు పదవ తరగతి విద్యార్థులను సహాయకులుగా నియమించారు. విజయనగరంలో 47 కేంద్రాలు గూగుల్ మ్యాప్, కేంద్రాల జాబితా డీటీసీతో ఆటో యూనియన్ల వారికి, పత్రిక విలేకరులకు అందించేందుకు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లోని బస్టాండులో రైల్వేస్టేషన్లు, కలెక్టరేట్ సర్కిల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసు శాఖ భద్రతతో పాటు అంగన్వాడీ, ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలు ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాల్లో స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరుకున్నాయి. అక్కడ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. నియమనిబంధనలు ఇలా... -పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఉదయం 10గంటలు, మధ్యాహ్నం 2.30 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. -ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుతించబడవు. -పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డుతో హాజరుకావాలి. -రాష్త్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకావద్దని, మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, అధికారులు ఇప్పటికే ప్రకటించారు. -ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్ష జరుగుతున్న విధానాన్ని కెమేరాల ద్వారా పర్యవేక్షిస్తారు. పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, విజయనగరం క్లస్టర్లుగా విభజించి అన్ని విభాగాలను సమన్వయ పరిచి అధికారులు పర్యవేక్షిస్తారు. బస్సు సర్వీసులు ఇలా... విజయనగరం అర్బన్: వరుస సెలవులు, మరోవైపు సచివాలయ పరీక్షలతో జిల్లాలో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఆర్టీసీకి పండగ వాతావరణం వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శి పోస్టులకు జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పోస్టులు భారీగా ఉండడంతో అభ్యర్థులు అధికమంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 140 బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక సర్వీసుల వివరాలను ఆర్టీసీ నార్త్ ఈస్ట్ కోస్ట్ ఆర్ఎం ఎ.అప్పలరాజు విడుదల చేశారు. -గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 6 బస్సులు -కొమరాడ, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట ప్రాంతాలకు 3 బస్సులు -పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, బొండపల్లి, విజయనగరం ప్రాంతాలకు 10 బస్సులు -సాలూరు, మక్కువ, సీతానగరం, పార్వతీపురం ప్రాంతాలకు 3 బస్సులు -సాలూరు– మక్కువల మధ్య రెండు, సాలూరు–పాచిపెంటల మధ్య మూడు, సాలూరు–విజయనగరం మధ్య 6 ప్రత్యేక సర్వీసులు -సాలూరు, రామభద్రపురం, బలిజిపేట మధ్య 2 బస్సులు -సాలూరు, రామభద్రపురం, బాడంగి, తెర్లాం ప్రాంతాలకు 4 సర్వీసులు -సాలూరు, రామభద్రపురం, పార్వతీపురం ప్రాంతాలకు 3 సర్వీసులు -సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు కలిపేందుకు 2 బస్సులు -సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు రెండు బస్సులు -సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు 6 సర్వీసులు -సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు 6 బస్సులు -భోగాపురం, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి 5 బస్సులు, అలాగే పూసపాటిరేగ, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి వైపుగా 5 బస్సులు వేశారు. -దత్తిరాజేరు, గజపతినగరం, విజయనగరం కలిపేందుకు 6, విజయనగరం, గజపతినగరం, మెంటాడ మధ్య 5, ఎస్.కోట, జామి, విజయనగరం మధ్య 6, విజయనగరం, జామి, ఎస్.కోట మద్య రెండు బçస్సులు నడపనున్నారు. -విజయనగరం, చీపురుపల్లి, విజయనగరం, డెంకాడ మద్య 6, విజయనగరం, భోగాపురం మధ్య 5, విజయనగరం, పూసపాటిరేగ మధ్య 5 బస్సులు వేశారు. -కొత్తవలస, విజయనగరం మధ్య రెండు, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస మధ్య 4 బస్సులు వేశారు. అలాగే, వేపాడ, ఎస్.కోట, జామి, విజయనగరం మధ్య నాలుగు, ఎస్.కోట, గంట్యాడ మధ్య 6 బస్సులు వేశారు. -ఇవి కాకుండా మండల అభివృద్ధి అధికారుల అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో మరిన్ని ఉంచామని ఆర్ఎం అప్పలరాజు తెలిపారు. -
సచివాలయ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అనంతపురం అర్బన్: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని ఎన్ఐసీలో సచివాలయ ఉద్యోగాల పరీక్ష నిర్వహణ, ప్రజాసమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదలైనందున.. వెంటనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. అలాగే పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని డీఆర్ఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఎక్కడా పొరపాట్లు దొర్లకూడదని సూచించారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది సిబ్బంది, కంప్యూటర్, ఇతర వసతులకు అనుగుణంగా ఉండే భవనాలను గుర్తించాలన్నారు. సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలి ప్రజా సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా హౌసింగ్, రేషన్ కార్డులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. పెన్షన్ల అర్జీలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ సీఈఓను నియమించాలని జెడ్పీ సీఈఓ శోభస్వరూపారాణిని ఆదేశించారు. సర్వే సమస్యలు 30 రోజుల్లోగా పరిష్కారం అవుతున్నాయో...లేదో పరిశీలించుకోవాలని సర్వే శాఖ ఏడీ మశ్చీంద్రనాథ్ను ఆదేశించారు. అలాగే ఆర్డీఓలు ప్రతి శనివారం కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్ఓఆర్, 1–బి, అడంగల్‌లో వివరాలు సరిజేయడం, తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ‘పల్లెపిలుపు’ కార్యక్రమం సందర్భంగా సమస్యల పరిష్కారాన్ని ర్యాండమ్‌గా పరిశీలించాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలోని పరిస్థితులను ప్రతిబింబించే ఫొటోలు తీయాలన్నారు. వాటిలో అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ అలీంబాషా పాల్గొన్నారు. -
జంట నగరాల్లో బోనాల సందడి
-
ఇక పుర పోరు!
ఆదిలాబాద్‌రూరల్: మున్సిపల్ ఎన్నికలు జూలైలో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నాయకుల్లో ఆశలు రేకెత్తాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండళ్ల గడువు జూలై 2తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ముగియగా.. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడున్న మున్సిపల్ చట్టం స్థానంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో పురపాలకశాఖ (ఎంఏయూడీ) ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. సూచనలతోపాటు ప్రభుత్వం పొందుపర్చనున్న అంశాల నేపథ్యంలో కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పన పూర్తయితే సకాలంలో ఎన్నికలకు జరగనున్నాయి. నాయకుల్లో ఉత్సాహం ప్రజల నుంచి వచ్చిన పురపోరుతో పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో ఉత్సాహం నిండనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బలబలాల అంచనాలపై చర్చలు సాగనున్నాయి. మరో 12 రోజుల్లో మున్సిపాలిటీల పదవీకాలం ముగియనుంది. వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో పార్టీలు సైతం ఇందుకు అనుగుణంగా సన్నద్ధం కానున్నాయి. ఇతర జిల్లాలో మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలపై వివాదాలు ఉన్నా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలపై ఎలాంటి వివాదాలు లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎలాంటి సమస్య తలెత్తలేదు. దీంతో శివారు గ్రామాలు కూడా పట్టణంలో కలిసిపోయాయి. దీంతో పురపోరుకు మార్గం సుగమం అయింది. మొదటి గణన.. బీసీ గణన పూర్తయ్యాకే ప్రక్రియ జరగనుంది. అక్టోబరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభా గణన చేపట్టినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేయలేదు. అయా చోట బీసీ గణనను రానున్న పది రోజుల్లో పూర్తి చేయగలిగితే వచ్చే నెలఖారు నాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఆ తర్వాత వెనువెంటనే రిజర్వేషన్ల ఖరారు, వార్డు విభజన జరిగిపోనున్నాయి. వార్డుల పెంపుపై స్పష్టత.. కొత్త పురపాలక చట్టం రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 36 వార్డులు ఉన్నాయి. వాటిని 41 వార్డులకు పెంచాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త మున్సిపాలిటీ చట్టంతో ఎన్ని వార్డులు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్త చట్టం రూపుదాల్చితేనే వార్డులపై స్పష్టత రానుంది. పట్టణంలో రాజకీయ వేడి.. కొత్త మున్సిపల్ చట్టం వచ్చాకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ శాసనసభ ద్వారా లేదా ఆర్డినెన్స్‌తో అయినా కొత్త చట్టం తీసుకొచ్చి ఎన్నికలను వచ్చే నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం తెలిపారు. దీంతో పట్టణ ప్రాంతంలో రాజకీయవేడి మొదలు కానుంది. పార్టీల కార్యకలాపాలు పెరగనున్నాయి. ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగనున్నారు. తమ వ్యూహాలకు పదును పెట్టనున్నారు. పునర్విభజనతో మారనున్న హద్దులు.. మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన కీలకం కానుంది. శివారు గ్రామాల విలీనం నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే ఇప్పటికీ వార్డుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు భావిస్తున్న చోట పెరిగే అవకాశం ఉందని, మిగతా చోట్ల గ్రామాలు విలీనం అయినా వార్డుల సరిహద్దులు మాత్రం మారనున్నాయి. ఉట్నూర్ మున్సిపాలిటీపై స్పష్టత కరువు కొత్త జిల్లాలో ఆదిలాబాద్ మాత్రమే మున్సిపాలిటీగా ఉంది. ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేయాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. కానీ అధికారంగా మాత్రం గెజిట్ విడుదల కాలేదు. ఈ ప్రాంతం నోటిఫై కావడంతో భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ కొనసాగింపు చట్టం ( పెసా), షెడ్యూల్ ఏరియా 9 గిరిజనుల ప్రత్యేక హక్కుల ప్రకారం గిరిజనులకు సంబంధించి ఎటువంటి మార్పులు, చేర్పులైనా కేంద్రం ద్వారా జరగాలి. అధికారంగా వస్తేగానీ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఇటీవల ఇక్కడ పంచాయతీలు ఎన్నికలు కూడా జరగలేదు. ద్వితీయశ్రేణి నాయకుల ఆశలు రిజర్వేషన్ల విషయంలోనూ ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ప్రక్రియపైనే ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇది వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. రానున్న పురపోరులో ఏ విధమైన ఆలోచన చేస్తారని అంచనాలు వేసుకుంటూనే పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకోనున్నాయి. -
మున్సి‘పోల్స్’కు కసరత్తు
కరీంనగర్‌కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జూలై 2తో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగుస్తుండడంతో ఆ లోపే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించడం తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అన్ని మున్సిపాలిటీల్లో పుర ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. ఓటరు జాబితాతోపాటు బీసీ రిజర్వేషన్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు పురపాలక శాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 21 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల రిజర్వేషన్లను పోలింగ్ కేంద్రాల వారీగా పూర్తిచేయాలని సీడీఎంఏ(చైర్మన్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసి ఏ ఇంటి నెంబర్ ఏ డివిజన్లో వస్తుందో ఆ ఇంటి నెంబర్‌ను టీపోల్ సాప్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఓటర్ల జాబితా ముసాయిదా ప్రదర్శన, జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, అభ్యంతరాలను పరిష్కరించడం, అనంతరం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీడీఎంఏ కార్యాలయంలో గురువారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులు ఎన్నికలపై సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. డివిజన్ల పునర్విభజనపై సందిగ్ధం కరీంనగర్ నగరపాలక సంస్థలో సమీపంలోని పద్మనగర్, సీతారాంపూర్, రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూరు గ్రామాలు విలీనం జరిగాయి. ఈ గ్రామాలను ఏ విధంగా డివిజన్లుగా మారుస్తారనేది సందిగ్ధంగా మారింది. డివిజన్ల పెంపు జరుగుతుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఉన్న డివిజన్లలోనే విలీన గ్రామాలను కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయా గ్రామాలకు ఆనుకొని ఉన్న డివిజన్లలో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలా జరిగితే శివారు డివిజన్ల ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా విలీన గ్రామాల ఓటర్లను కలుపుకొని పునర్విభజన చేస్తే డివిజన్ల స్వరూపం మారనుంది. పునర్విభజన జరగకపోతే శివారు డివిజన్ల రాజకీయ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పునర్విభజన జరిగితే మొత్తం నగర డివిజన్లపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పునర్విభజన జరపాలంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. జూలైలోనే ఎన్నికలు జరపాల్సి వస్తే ఎలాంటి మార్పులు లేకుండా విలీన గ్రామాలకు ఆనుకొని ఉన్న డివిజన్లలోనే కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయోమయంగా రిజర్వేషన్ల ప్రక్రియ... నగరపాలక సంస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. విలీన గ్రామాలకు సంబం«ధించిన ఓటర్ల జాబితా, నగర ఓటర్ల జాబితా పూర్తిచేయాల్సి ఉంది. మున్సిపాలిటీలకు కొత్త చట్టం తెస్తే రిజర్వేషన్లు పూర్తిగా మారుతాయని తెలుస్తోంది. పాత పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారమే యధాతథంగా రిజర్వేషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం జరుపుతారా... లేదా పాత పద్ధతినే చేపడతారా అనేది అయోమయంగా మారింది. తెరపైకి కొత్త పురపాలక చట్టం..? తెలంగాణ ప్రభుత్వం పురపాలికల్లో సమూల మార్పులు చేసేందుకు కొత్త పురపాలక చట్టాలన్ని అమలులోకి తేనుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పురపాలక చట్టానికి ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. లేని పక్షంలో ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తెస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కొత్త చట్టంలో పుర ఎన్నికల్లో మేయర్, చైర్మన్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరుగుతాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలా జరిగితే కార్పొరేటర్ల బేరసారాలు, అధికా రాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడం వంటివి ఘటనలకు చెక్‌పడనుంది. ఒక్క డిప్యూటీ మేయర్ ఎన్నికకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కొత్త చట్టంలో ఎన్నికల కంటే పౌరసేవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ఆశావహుల సందడి... మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో సందడి నెలకొం ది. ఇప్పటికే వివిధ డివిజన్ల నుంచి కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతోపాటు వివిధ పార్టీల నుంచి పోటీకి దిగేందుకు సమాయత్తం అవుతున్న నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అన్ని పార్టీలు మరోమారు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆయా డివిజన్లలో ఇప్పటికే ఇల్లిల్లు తిరుగుతూ తమ అనుచరులను కలుస్తూ ఎన్నికలు వస్తున్నాయని, తమకు మద్దతు తెలుపాలని కోరు తూ అంతర్గత ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారుతాయని, గ్రామీణ ప్రాంత స్థానిక ఎన్నికలకు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పుర ఎన్నికల ప్రకటనతో నగరంలో రాజకీయ సందడి నెలకొంది. మున్సిపాలిటీల్లో సందడి... రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం, వెంటవెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన చేపట్టడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సందడి మొదలైంది. కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావుడి కనిపించింది. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో జరిగే ఎన్నికల సమీక్ష సమావేశానికి మున్సిపాలిటీల్లో అధికారులు సమాచారాన్ని సిద్ధం చేయడం కనిపించింది. ఆశావహులు మున్సిపాలిటీలకు చేరుకొని ఎన్నికల ప్రక్రియపై ఆరా తీశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉండబోతుందనే అంశంపై పలు వురు చర్చించుకున్నారు. మేయర్, చైర్మన్ రిజర్వేషన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఏ డివి జన్, ఏ వార్డుకు ఎలా ఉంటాయనే నేతలు అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. -
మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి చకచక ఏర్పాట్లు
-
కోర్ కమిటీదే ఎంపిక బాధ్యత
మోర్తాడ్ (బాల్కొండ): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ అధిష్టానం మండలానికి ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండటంతో అన్ని పార్టీల్లో అలజడి మొదలైంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడానికి క్షేత్రస్థాయిలో కమిటీ అవసరం అని అధిష్టానం భావించింది. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునితో పాటు సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. కోర్ కమిటీ సభ్యులు అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహించి ఎంపీటీసీ అభ్యర్థుల ఆశావహుల పేర్లను సేకరించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి జెడ్పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులను గెలిపించాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంది. జిల్లాలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ జిల్లా అంతటిని అజమాయిషీ చేసే బాధ్యతను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఇచ్చారు. కోర్ కమిటీ సభ్యులు ఆశావహుల జాబితాలను తయారు చేసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించాల్సి ఉంది. ఎమ్మెల్యేలే అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపనున్నారు. కోర్ కమిటీ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో వారు రెండు మూడు రోజుల్లో ఆశావహుల జాబితాలను తయారు చేయడానికి గ్రామాల వారీగా సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే కోర్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు తీవ్రంగానే ఉందని స్పష్టం అవుతుంది. -
ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈనెల 11న జరగనున్న ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో విద్యుత్, ఫర్నీచర్, తాగునీటి వసతి, గదులు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వికలాంగులు ఓటు వేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక ర్యాంప్‌లు నిర్మించారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు ఇదివరకే గ్రామాలు, పట్టణంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. బీఎల్ఓలు, వీఆర్ఓలు, సూపర్వైజర్ల ద్వారా విస్తృతంగా ఓటుహక్కు ప్రాముఖ్యతపై వివరించిన అధికారులు ఓటరు స్లిప్పులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.26లక్షల మంది ఓటర్లు మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 2,26,399 మంది ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2,12,851 మంది ఓటర్లుగా నమోదు కాగా ప్రస్తుతం 13,548 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,13,248 మంది పురుషులు, 1,13,143 మంది మహిళలు, 8 మంది ఇతరులతో కలిపి మొత్తం 2,26,399 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 263 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు 268పోలింగ్ కేంద్రాలకు పెంచారు. గతంతో పోల్చితే ఈసారి 5కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ అర్బన్‌లో 184, మహబూబ్‌నగర్ రూరల్‌లో 37, హన్వాడ మండలంలో 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక వసతులు దివ్యాంగుల ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వారి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ర్యాంపులతో పాటు వీల్చైర్లను సమకూర్చనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు అదే తరహాలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా వికలాంగులను గుర్తించి వారికి అవవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించి ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిఘా అదేవిధంగా, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పారా మిలటరీ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించిన అధికారులు ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు విధిగా ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వికలాంగుల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌ల ఏర్పాటుతో పాటు వీల్చైర్లను సమకూర్చుతున్నాం. పోలింగ్ సిబ్బందికి కూడా అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని అధికారులకు సహకరించాలి. – వెంకటేశం, తహసీల్దార్, మహబూబ్‌నగర్ అర్బన్ -
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట నియోజకవర్గంలో శుక్రవారం నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సిబ్బందికి గురువారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సూర్యాపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని నాగారం మండలం మినహా మిగతా 13 మండలాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బందికి ఈ సామగ్రిని అందజేశారు. ఒక్కో మండలానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓపీఓ, వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రాఫర్, మైక్రో అబ్జర్వర్ చొప్పున సిబ్బందిని కేటాయించామని, సూర్యాపేట ఏవీఎం పాఠశాలలో అదనపు సిబ్బందిని నియమించామని ఆర్డీఓ వెల్లడించారు. 13 మండలాలకు 80 మంది సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ మోహ న్‌రావు, ఏఓ శ్రీలత, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ వెంకటేశ్వరరెడ్డి, సూర్యాపేట తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎలక్షన్ తహసీల్దార్ రాంరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పరిశీలన సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. -
‘లోక్‌సభ’కు కసరత్తు
సాక్షి, వరంగల్ రూరల్: లోకసభ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా అధికార యంత్రాం గం లోకసభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మొదటి దఫా ఈవీఎంల పరిశీలన పూర్తయింది. వివిధ రాజ కీయ పార్టీ నాయకుల సమక్షంలో ఈవీఎంలను అధికారులు పరిశీలించారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు లోకసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ లోకసభ పరిధిలో, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం మే నెలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు ఓటు హక్కు నమోదు చేయించుకునే అవకాశం కల్పించింది. మొదట జనవరి 25వరకు ఓటు నమోదు చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించగా దానిని ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4 వరకు ఓటరు నమోదు చేసుకున్న తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది జాబితాలను సైతం జిల్లా యంత్రాంగం ప్రకటించారు. అలాగే మార్చి 2, 3వ తేదీల్లో ఓటరు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. వీవీ ప్యాట్లపై అవగాహన.. ప్రజల్లో వీవీ ప్యాట్‌పై అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 16 మండలాలకు ఒక్కో మండలం మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనంలో వీవీ ప్యాట్లను ఉంచుతున్నారు. ఈ మొబైల్ వాహనాన్ని సోమవారం కలెక్టర్ హరిత ప్రారంభించారు. రోజుకు ఒక్క గ్రామం చొప్పున నెల రోజుల పాటు గ్రామాల్లో తిరిగి వీవీ ప్యాట్లపై అవగాహనతోపాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించనున్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు కమిటీలు.. జిల్లాలో లోకసభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో 20 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఒక్కో జిల్లా అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఈ కమిటీలు కృషి చేయనున్నాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు విడుదలయ్యే వరకు కమిటీలు పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఆయా కమిటీలతో నిత్యం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. -
లోక్‌సభకు రెడీ!
సాక్షి, నాగర్‌కర్నూల్: పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాచాటిన అధికార టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో అపజయాన్ని చవిచూసిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం చేయడం వల్లే ఓటమి చెందడానికి ఒక కారణమని ఏఐసీసీ దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. టీఆర్ఎస్ సైతం అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించాలన్న ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ముందుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలలోని నేతల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను సమీక్షించి సమన్వయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతె కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలతో పాటు పార్టీ సీనియర్ నేతలు లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుసమాచారం. మహబూబ్‌నగర్ స్థానానికి మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, రేవంత్‌రెడ్డి పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, వంశీచంద్‌రెడ్డి కూడా బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాన్ని వరుసగా రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ వరుసగా కైవసం చేసుకుంది. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య వయోభారం వల్ల మళ్లీ పోటీలో ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మల్లురవితో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సతీష్ మాదిగ, డాక్టర్ అనురాధ, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ చెన్నయ్య తదితరులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ స్థానానికి 36 మంది, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు 11మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం కొల్లాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన నేతలనే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతి పార్లమెంట్ స్థానానికి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి షార్ట్లిస్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపనున్నట్లు తెలిసింది. ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ప్రజల్లోకి వెళ్లాలనే ముందస్తు వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. టీఆర్ఎస్ కసరత్తు పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. గెలుపే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటినట్లుగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో విజయం సాధించి తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ముందుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించడంతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గంలో విభేదాలున్న నేతల మధ్య సమన్వయం కుదర్చడంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఈనెల 6వ తేదీన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం వనపర్తిలో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మహబూబ్‌నగర్ పార్లమెంట్ ని యోజకవర్గ సన్నాహక సమావేశం ఈనెల 11న మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తారు. ఈ రెండు సమావేశాలు కూడా మంత్రుల నేతృత్వంలో నిర్వహించనున్నారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ సన్నాహక సమావేశం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో, మహబూబ్‌నగర్ సన్నాహక సమావేశం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రెండు సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఈవీఎం, వీవీ ప్యాట్లను సిద్ధం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల తనిఖీ, ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. నాగర్‌కర్నూల్‌కు సంబంధించి సోమవారం కలెక్టర్ శ్రీధర్ 15బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, నోడల్ అధికారులను నియమించారు. మరోవైపు మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణకు ఢిల్లీ వెళ్లి వచ్చారు. -
ఆంగ్లం.. అలవోకగా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు నడుం బిగించారు. ఈమేరకు జిల్లాలోని 969 పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ‘జాలీ ఫోనిక్స్’ ఎడ్యుకేషన్ సొసైటీతో ఒప్పందం కుడుర్చుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని గత విద్యా సంవత్సరంలోనే నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లాలోని 10 పాఠశాలలకు సంబంధించిన 20 మంది ఉపాద్యాయులకు రెండు విడతల్లో శిక్షణ ఇప్పించారు. ఈ మేరకుశిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు తాము బోధించే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పడంతో విద్యా సంవత్సరం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలుకు నిర్ణయించారు. దీంతో అదే సంస్థ ఆధ్వర్యాన మిగతా ఉపాధ్యాయులకు కూడా త్వరలోనే మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 24వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇతర భాషలపై కూడా పట్టు ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు అంతర్జాతీయ సంస్థ అయినా జాలీ ఫోనిక్స్ ఆధ్వర్యాన తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన అనంతరం ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభిస్తే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2వ తరగతులకు చెందిన 24వేలమంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. కాగా, శిక్షణ పూర్తయ్యాక ప్రతీ పాఠశాలకు జాలీ ఫోనిక్స్ సంస్థ తరఫున 969 స్కూళ్లకు రూ.20వేలు విలువైన కిట్లు కూడా ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చారు. ఈ కిట్ ద్వారా విద్యార్థులకు సులువుగా ఆంగ్ల బోధన సాధ్యం కానుంది. ఈ కిట్‌లోని వస్తువుల ద్వారా పదాలను పలకడం, ఎలాంటి ధ్వనులను వెలువరించాలనే అంశం సులువుగా తెలిసొస్తుంది. ప్రవేశాలు పెరిగే అవకాశం విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు చాలా వరకు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ప్రభుత్వ బడుల్లో కేవలం తెలుగు మీడియం ఉండడంతో ప్రవేశాలు ఏటా తగ్గిపోతున్నాయి. కొన్నింట్లోనైతే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఈ మేరకు పేద విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల బోధన జరిపేందుకు సిద్ధమైన అధికారులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే పది పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది అన్ని పాఠశాలల్లో ప్రారంభించే ప్రవేశాలు పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. జిల్లా కేంద్రంపై ప్రత్యేక దృష్టి ఇంగ్లిష్ విద్యను అందించడంలో భాగంగా అధికారులు మొదట జిల్లా కేంద్రంపై దృష్టి కేంద్రీకరించారు. జాలీ ఫొనిక్స్ సంస్థ చేసిన అధ్యయనం లో కూడా జిల్లా కేంద్రంలోనే తొలుత అమలు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు లేకపోవడం, ఉన్నత పాఠశాల స్థాయికి వెళ్లాక అదే పరిస్థితి కొనసాగుతున్న కారణంగా పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పడిపోతోంది. అయితే హైస్కూల్ విద్యార్థులకు ఒకవేళ శిక్షణ ఇచ్చినా తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో నేర్చుకునే అవకాశం లేదని భావించి.. ప్రాథమిక స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థులకు ఎంతో మేలు... ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం లేని కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిది. ఈ నిర్ణయం ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన అందనుంది. – శ్యాంబాబు, ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల, మణికొండ ఇంగ్లిష్తో మంచి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. గతంలో శిక్షణ తీసుకుని మా పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్నాం. విద్యార్థుల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో బడుల్లో ఇంగ్లిష్ మీడియం లేదనే కారణంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపే వారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – ఎం.సునీత, ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల, మరికల్ ఆనందంగా ఉంది.. ప్రస్తుతం చాలా ప్రైవేట్ పాఠశాలలు కూడా జాలీ ఫోనిక్స్ సంస్థ వారు ఇచ్చే శిక్షణ ఆధారంగానే బోధిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు అందిస్తున్న నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందనుండడం ఆనందంగా ఉంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు అవకాశం ఉంది. – ఎం.శ్వేత, ప్రాథమిక పాఠశాల, పిల్లలమర్రి -
రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం
-
పంచాయితీ ఎన్నికలకు కట్టుదుట్టమైన ఏర్పాట్లు చేశాం
-
ఆమోదమే తరువాయి!
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ శాతాలను ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయిం చింది. ఈ శాతాలకు అనుగుణంగా జిల్లాలో కేటగిరీల వారీగా కేటాయించాల్సిన సర్పంచ్ స్థానాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలకు గాను, 74 పంచాయతీలను షెడ్యూల్ ఏరియా పంచాయతీలుగా ఎస్టీలకు కేటాయించింది. మిగతా 573 పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ల గణాంకాలకు అనుగుణంగా ఆయా కేటగిరీలకు మండలాల వారీగా నిర్ణయించాల్సి ఉంది. మండలాల వారీగా ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు రిజర్వు చేయాలనే అంశంపై జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు పూర్తి చేసి కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలకు గాను వంద శాతం గిరిజన జనాభా ఉన్న 74 పంచాయతీలను షెడ్యూలు పంచాయతీలుగా పేర్కొంటూ సర్పంచ్ పదవులను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 573 పంచాయతీలను నాన్ షెడ్యూలు పంచాయతీలుగా పేర్కొంటూ.. సర్పంచ్ పదవులను రిజర్వు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. నాన్ షెడ్యూల్డ్ పంచాయతీల్లో ఎస్టీలకు 19, ఎస్సీలకు 129, బీసీలకు 138 సర్పంచ్ పదవులతో పాటు, అన్ రిజర్వుడు కేటగిరీలో 278 మందికి కేటాయించాల్సిందిగా ఆదేశించింది. ప్రతీ కేటగిరీలోనూ మహిళల రిజర్వేషన్ కోటా 50శాతం ఉండాలని ఆదేశించింది. దీంతో జిల్లాను యూనిట్‌గా తీసుకుని తిరిగి మండలాల వారీగా సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ కోటాను జిల్లా పంచాయతీ విభాగం నిర్ణయించింది. మండలాల వారీగా ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు కేటాయిం చాలనే అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. గురువారం ఉదయం ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ ఆమోదించిన తర్వాత సంబంధిత ఆర్డీఓల పర్యవేక్షణలో ఈ నెల 29వ తేదీలోగా మండలాలు, కేటగిరీల వారీగా సర్పంచ్ పదవుల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే జిల్లాలోని 5,778 గ్రామ పంచాయతీ వార్డులకు గాను, 74 షెడ్యూల్డు పంచాయతీల్లోని వార్డులను మినహాయించి మిగతా వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయడంపైనా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు మండలాన్ని యూనిట్‌గా తీసుకుని, గ్రామ పంచాయతీలో ఏయే కేటగిరీలకు ఎన్ని వార్డులు కేటాయించాలనే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 29 నాటికి కేటగిరీల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. రొటేషన్ కథ మళ్లీ మొదటికి..! పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నాలుగు పర్యాయాలు సాధారణ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పంచాయతీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండగా, 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం త్వరలో జరిగే ఎన్నికలను తొలి సాధారణ పంచాయతీ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. దీంతో గత నాలుగు ఎన్నికల్లో జరిగిన రొటేషన్ విధానంతో సంబంధం లేకుండా, ఈసారి జరిగే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను తాజాగా నిర్ణయిస్తున్నారు. దీంతో గత నాలుగు పర్యాయాలు పంచాయతీ ఏ కేటగిరీకి రిజర్వు అయ్యిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మరోవైపు కొత్తగా వందకు పైగా పంచాయతీలు ఏర్పడటంతో.. గత రిజర్వేషన్లతో ఏ మాత్రం పొంతన లేకుండా.. ప్రస్తుత రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల శాతం కూడా తగ్గడంతో సర్పంచ్ పదవుల రిజర్వేషన్లలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో మాత్రం గత నాలుగు పర్యాయాలు జరిగిన రొటేషన్ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూ, తమ పంచాయతీ ఏ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉందనే కోణంలో ఔత్సాహికులు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 29 నాటికి పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై స్పష్టత రానుండగా, వివిధ పార్టీల నేతలు, ఔత్సాహికులు రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. -
శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
తిరువనంతపురం : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేయడంతో పాటు బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, మహిళలకు అనుకూలంగా ఉండేలా టాయ్లెట్ల నిర్మాణం వంటి పలు ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. హజ్ యాత్ర తర్వాత శబరిమల యాత్రనే ప్రపంచంలో రెండో అతిపెద్ద యాత్రగా పరిగణిస్తారు. దశాబ్ధాలుగా శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం లేని క్రమంలో సర్వోన్నత న్యాయస్ధానం ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును మేథావులు, అభ్యుదయవాదులు స్వాగతించగా, సంప్రదాయాలు, ఆచారాలకు ఈ తీర్పు విరుద్ధమని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. కాగా కోర్టు ఉత్తర్వులను అమలుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో మంత్రి దేవసోమ్ సురేంద్రన్, ఆలయ బోర్డు సభ్యులు, సీనియర్ పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. మహిళా యాత్రికులు శబరిమల సందర్శించేలా తాము అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని సమావేశానంతరం మంత్రి సురేంద్రన్ వెల్లడించారు. -
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట
-
తిరుమల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
-
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది శ్రీవారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు జేఈవో తెలిపారు. భక్తులు సౌకర్యార్థం గ్యాలరీలు విస్తరణ చేశామన్నారు. ఆగష్టు చివరికల్లా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఆగష్టు 26న పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడ సేవను బ్రహ్మోత్సవాల ట్రయల్‌గా నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం వాహన సేవలను 9 గంటలకు, రాత్రి వాహన సేవలును 8 గంటలకు, గరుడ సేవను రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. -
నేడు పాలీసెట్
సాక్షి, హైదరాబాద్ : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించనున్న పాలీసెట్–2018 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలీసెట్ చైర్మన్ నవీన్ మిట్టల్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుం దని పేర్కొన్నారు. విద్యార్థులు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవా లని నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించిన వివరాలకు 18005995577 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. పాలీసెట్‌కు 1,25,063 మంది దరఖాస్తు చేసుకోగా అందులో బాలురు 76,298, బాలికలు 48,765 మంది ఉన్నట్లు వెల్లడించారు. -
హనుమాన్ జయంతికి ఏర్పాట్లు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఈనెల 29నుంచి 31 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5లక్షలకు పైగా దీక్షాపరులు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇప్పటికే ఆలయ ఆవరణతో పాటు.. సెక్యూరిటీ గది సమీపంలో చలువ పందిర్లు పూర్తి చేశారు. బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత కోనేరుపై విమర్శలు వసున్నా.. నీటీ ఎద్దడి ఉన్నా.. ప్రత్యేక చొరవతో అందులో నీరు నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొనసాగుతున్న ఏర్పాట్లు.. హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు తాగునీరు, చలివేంద్రాలు, విద్యుత్, చలువ పందిర్లు, మరుగుదొడ్లు, భోజనం, భారీకేడ్లు, పార్కింగ్ వసతి, సీసీ కెమెరాలు, వైద్యం, శానిటేషన్, క్యూలెన్లు, దర్శనంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తాగునీటికోసం 20 చలివేంద్రాలు ఉండగా.. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరో 20 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిర్లు వేసిన చోట విద్యుత్ వైర్లలో డ్యామేజ్ లేకుండా.. వికలాంగులకు, వృద్ధులకు కొండగట్టు కిందినుంచి దొంగలమర్రి మీదుగా కొండపైకి వచ్చేందకు కలెక్టర్ శరత్ చొరవతో 24 గంటలు.. 4 మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 4లక్షల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచనున్నారు. నాచుపెల్లి గ్రామంలోని బావుల ద్వారా ట్యాంకర్ల సాయంతో కొండపైకి నీటిని తీసుకురావడం.. వందకుపైగా తాత్కాలిక మరుగుదొడ్లు.. వై–జంక్షన్ నుంచి బొజ్జ పోతన్న వరకు లైటింగ్, అదనంగా మరో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పాత కోనేరులో సైతం భక్తులు స్నానాలు ఆచరించేందుకు అందులో ఎప్పటికప్పుడు నీటిని అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు.. యేళ్లకేళ్ళుగా నెలకొన్న తాగునీటీ సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కొండ దిగువన, బొజ్జ పోతన్న వద్ద, కాలినడకన వచ్చే భక్తులకు చలివేంద్రాల ద్వారా నీరు అందిచనున్నారు. వీధిలైట్లు ఏర్పాటు.. రాత్రి సమయంలో దొంగలమర్రి నుంచి గట్టు మీదకు కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం దారికి ఇరువైపుల నూతనంగా విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో మరుగుదొడ్లు.. జయంత్యుత్సవాలకే వచ్చే భక్తులకోసం కొండ దిగువన.. ౖకొండపెన ఉన్న శాశ్వత మరుగుదొడ్లే కాకుండా, బొజ్జ పోతన్న ప్రాంతంలో, కొండపైకి వెళ్లే మార్గమధ్యలో తాత్కలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. -
రాష్ట్రంలో పెళ్లి పండుగ.. పెద్ద ఎత్తున వివాహాలు
సాక్షి, అమరావతి : మూడు నెలల విరామం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి ముచ్చట్ల సంబరాలు మొదల వుతున్నాయి. నేటితో మూఢాలు ముగియడంతో సోమవారం నుంచి భాజా భజంత్రీలు మోగనున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటివరకూ రెండు మూఢాలు రావడం, మంచి రోజులు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభ కార్యాలకు ముహూర్తాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఫాల్గుణ మాసంలో ఈనెల 19 నుంచి ముహూర్తాలు ఆరంభమవుతున్నాయి. మార్చి 3, 4వ తేదీల్లో వివాహాలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. ఇప్పటికే చాలామంది ఈ లగ్నాలను ఖరారు చేసుకున్నారు. శుభలేఖలు పంచి వివాహ వేదికలను బుక్ చేసుకుని పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జూలై 7 వరకూ శుభకార్యాల సందడి పండితుల సమాచారం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలంలో జూలై 7వ తేదీ వరకూ శుభ ముహూర్తాలున్నాయి. దీంతో సంబంధాలు ఖరారైన కుటుం బాలు ఫాల్గుణ, భాద్రపద, మార్గశిర మాసాల్లో వివాహాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర నగరాల్లో మార్చి 3, 4వ తేదీల్లో అత్యధిక కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. దూర ప్రాంతాల నుంచి పురోహితులు.. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటంతో కొందరు దూర ప్రాంతాల నుంచి పురోహితులను రప్పిస్తున్నారు. బ్యాండ్ మేళం, క్యాటరింగ్, వేదికల అలంకరణ బృందాలకు డిమాండ్ పెరిగింది. ఇక పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ఖర్చులకు తోడు జీఎస్టీ అదనపు భారంగా మారిందని మధ్యతరగతి కుటుంబాలు నిట్టూరుస్తున్నాయి. ఖరీదైన వేడుకలు... పెళ్లి వేడుకలు చూసేవారికి బాగుంటున్నా ఖర్చులు మాత్రం సాధారణ కుటుంబాలు భరించలేని స్థాయిలో పెరిగిపోయాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఏసీ సదుపాయం ఉన్న కల్యాణ వేదికల ఒకరోజు అద్దె హాల్ పరిమాణాన్ని బట్టి రూ. 70 వేల నుంచి రూ.1.3 లక్షల వరకూ ఉంది. ఏసీకి, నాన్ ఏసీకి మధ్య రూ.20 వేల వరకూ వ్యత్యాసం ఉంటోంది. విజయవాడలో మధ్యస్థాయి ఫంక్షన్ హాళ్ల అద్దె రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉంది. ఇక వివాహ వేదికల అలంకరణ ఖర్చు కనీసం రూ.లక్ష పైమాటే. సీమకు బెంగళూరు రోజా పూలు.. రాయలసీమలో పెళ్లి మండపాల అలంకరణకు రకరకాల రోజా పూలను బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు. అలంకరణ పనులను కాంట్రాక్టుకు ఇవ్వడం రివాజుగా మారింది. ఫంక్షన్ హాలు పరిమాణం, అలంకరణ తీరు ఆధారంగా లక్ష నుంచి రెండు లక్షల వరకూ తీసుకుంటున్నారు. అరటి పిలకలు కట్టడం, మామిడి తోరణాలు, పూలతో అలంకరణ దాకా అంతా వారే చూసుకుంటారు. భారీ కల్యాణ మండపాల అలంకరణ ఖర్చు ఐదారు లక్షల రూపాయల వరకూ ఉంటుందని బెంగళూరుకు చెందిన అలంకరణ కాంట్రాక్టరు విజయసింహరాజు తెలిపారు. పసందైన విందుకు భారీ ఖర్చు... కోస్తాలో పెళ్లంటే బొబ్బట్లు, జిలేబి, జీడిపప్పుతో కూడిన చక్కెర పొంగలి లాంటి స్వీట్లతోపాటు గారె, కూరగాయల బిర్యానీ, నోరూరించే పులిహోర తదితరాలు మెనూలో తప్పనిసరిగా మారాయి. ప్రాంతాన్ని బట్టి వంటకాలు మారుతుంటాయి. మాంసాహారమైతే మెనూ వేరుగా ఉంటుంది. గతంలో పెళ్లిళ్లకు వంటవాళ్లను పిలిపించి సరుకులు తామే తెప్పించి చేయించేవారు. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ కేటరింగ్ పార్టీలకే అప్పగిస్తున్నారు. ఎంతమంది వస్తారు? పిండివంటలు, ఆహార పదార్థాలు ఏం ఉండాలో చెబితే చాలు. వడ్డించడంతో సహా అంతా కేటరింగ్ పార్టీ వారే చూసుకుంటారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ లాంటి నగరాల్లో మధ్యతరగతి పెళ్లిళ్లకు ఒక్కో ప్లేటు భోజనానికి మెనూను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకూ తీసుకుంటున్నారు. ఉదాహరణకు వెయ్యి మందికి భోజనం పెట్టాలంటే ప్లేటు రూ.250 ప్రకారం రూ.2.50 లక్షలు అవుతుంది. ఉదయం అల్పాహారం బిల్లు దీనికి అదనం. డ్రోన్లతో చిత్రీకరణ.. గతంలో పెళ్లిళ్లకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు వచ్చి ఫొటోలు, వీడియోలు తీసేవారు. కాలంతోపాటు అదికూడా మారిపోయింది. ప్రస్తుతం డ్రోన్లతో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. -
మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు
-
భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
నార్కట్‌పల్లి(నకిరేకల్): బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరల్ ఉప్పల్ ఆదేశించారు. గట్టుపైన, కింద ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు, జేసీ నారాయణరెడ్డితో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ అసంపూర్తి పనులను త్వరలో పూర్తిచేయాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టుపైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పా టు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 58 సీసీ కెమెరాలు, 3 కంట్రోల్ రూంలు, షీటీమ్, అగ్నిమాపక కేంద్రం, ఆరోగ్య సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్ పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిం చాలన్నారు. అనంతరం జిల్లా జడ్జి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలును వివరించాలని అధికారులకు సూచించారు. ప్రొజెక్టర్ ద్వారా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖీమ్యానాయక్, జెడ్పీసీఈఓ హనుమానాయక్, పీడీ రాజ్‌కుమార్, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చైర్మన్ నల్ల వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, సీఐ క్యాస్ట్రోరెడ్డి ఎంపీడీఓ గుర్రం సురేశ్, ఈఓ అంజనారెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సర్పంచ్ మల్గ రమణాబాలకృష్ణ, ఎంపీటీసీ అనితవెంకన్న, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి ఉన్నారు. జాన్‌పహాడ్ ఉర్సు ఏర్పాట్ల పరిశీలన నేరేడుచర్ల(హుజూర్నగర్): ఈ నెల 25,26,27 తేదీలలో నిర్వహించనున్న జాన్‌పహాడ్ ఉర్సు ఏర్పాట్లను శుక్రవారం హుజుర్నగర్ సీఐ నర్సింహారెడ్డి, మిర్యాలగూడ డిపో మేనేజర్ సుధాకర్‌రావు దర్గా పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. వారి వెంట దర్గా కాంట్రాక్టర్ సుబ్బారావు, వర్క్ ఇన్స్పెక్టర్ ఫయాజ్, నాయకులు శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
శబరిమలలో తిరుమల మాదిరి సౌకర్యాలు
తిరువనంతపురం: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాదిరి శబరిమలలో కూడా అయ్యప్ప భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ త్వరలో తిరుమల సందర్శించి అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులు, వసతుల కల్పనపై అధ్యయనం చేయనున్నట్లు దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారన్నారు. శబరిమల ఆలయం నవంబర్-జనవరి మూడు నెలలే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లక్షలమంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. మళయాళ కేలండర్ ప్రకారం ఈ సీజన్లో పూజల కోసం నెలకు ఐదు రోజులు మాత్రమే ఆలయం తెరుస్తారు. ఈ సీజన్లో జనవరి 14 మకర విళక్కు వరకు ఆలయానికి రూ.225 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాది ఇదే సీజన్లో లభించిన దానికంటే రూ.45 కోట్లు అధికమని మంత్రి వివరించారు. ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం మళ్లిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఇక్కడ భక్తుల కోసం సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కోట్లలో ఖర్చు పెడుతోందన్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాలకు ఈ సీజన్లో రూ.38 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. సన్నిధానం పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్‌ను నిషేధించామని, కేరళ వాటర్ అథారిటీ ఔషధపరమైన నీటిని యాత్రికులకు అందిస్తోందని మంత్రి సురేంద్రన్ చెప్పారు. -
గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కృష్ణాదిత్య ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలు తయారు చేసుకోవాలని, గణతంత్ర వేడుకల సందర్బంగా శకటాలను ప్రదర్శించేందుకు సిద్ధం కావాలన్నారు. జిల్లా పౌర సంబందాల శాఖ ఆధ్వర్యాన ఫొటో ప్రధర్శన నిర్వహించాలన్నారు. అన్ని శాఖల కార్యాలయాల్లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఎగురవేసి, మహనీయులకు నివాళులర్పించాక 8.45 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే జెండా వందనానికి హాజరుకావాలని సూచించారు. ఇంకా సంక్షేమ శాఖల ఆధ్వర్యాన పేదలకు ఆస్తుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కొమురయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపఎన్నికల కోసం భారీ భద్రత ఏర్పాటు చేశాం
-
తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
-
వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ప్లీనరీకి ఏర్పాట్లు
-
హనుమాన్ ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు
– 250మంది పోలీసులతో బందోబస్తు హిమాయత్‌నగర్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే హనుమాన్ ర్యాలీకి పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సుమారు 250మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నట్లు అబిడ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె.రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. నారాయణగూడలోని ఓ ఫంక్షన్ హాలులో నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ ర్యాలీ గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై సూల్తాన్‌బజార్ పీఎస్ మీదుగా అబిడ్స్, నారాయణగూడ పీఎస్‌ల పరిధిలోకి వస్తుందన్నారు. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్ పీఎస్ పరిధిలో ఉన్న మసీదులు, మదర్సా, చిల్లాల్ల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి మీదుగా ర్యాలీ వెళ్తున్నప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చిల్లాల్ వద్ద కుంకుమ చల్లే అవకాశాలు ఉండటం వల్ల అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా కట్టెలతో వస్తారని, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ బండారి రవీందర్, క్రైమ్ ఇన్స్పెక్టర్ గవిడి రాంబాబు, ఇన్స్పెక్టర్లు గంగారాం, మోహన్, లక్ష్మణ్, ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు నాగార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు, ఇమ్మానియేలు, సైదులు, కవుద్దీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పది పరీక్షల ఏర్పాట్లపై కమిషనర్ అసంతృప్తి
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆమె ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జిల్లాలోని మూడు స్కూళ్లను తనిఖీ చేశారు. గోనెగండ్ల, కోడుమూరు, లద్దగిరి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించి.. లద్దగిరి కేంద్రంలో ఒకే బెంచీపై ముగ్గురు విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు రాయించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు ఇద్దరు విద్యార్థులకు ఒక బెంచీ చొప్పున ఏర్పాటు చేశారు. మరో కేంద్రంలో ఏకంగా కమిషనర్ ఎదుటే చీఫ్ సూపరింటెండెంట్ చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడంతో పరీక్ష కేంద్రానికి సెల్ఫోన్లు తీసుకురాకూడదని చెప్పినా మీకు అర్థం కాలేదా అని ఆగ్రహించారు. అత్యవసరం అయితే కీప్యాడ్ సెల్‌తో ఆఫీస్ రూంలో కూర్చొని మాట్లాడాలని సూచించారు. రెండవ రోజు 250 మంది గైర్హాజరు పదవ తరగతి రెండో రోజు పరీక్షలకు మొత్తం 50,275 మంది విద్యార్థులకు గాను, 50,025 మంది హాజరుకాగా, 250 మంది గైర్హాజరయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కమిషనర్‌తో పాటు, డీఈఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు మొత్తం 82 కేంద్రాలను తనిఖీ చేశారు. -
‘రామయ్య’ బ్రహ్మోత్సవాలకు కసరత్తు
ఒంటిమిట్ట రామాలయం(రాజంపేట): వచ్చేనెల 5నుంచి 14వరకు జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) కసరత్తు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆలయంలోని రంగమండపంలో అధికారులతో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ సమీక్షించారు. సీఈ చంద్రశేఖరరెడ్డి, డీఎఫ్ఓ శివరాంప్రసాద్, ఎస్ఈ రాములు, వెంకటేశ్వర్లు, విజలెన్స్ అధికారి సుకుమార్, ఏపీఎస్పీడీసీఎల్ డీఈ చంద్రశేఖర్, స్ధానిక తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ నాగరాజు, ఆలయ ప్రధానఅర్చకులు వీణారాఘవచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవీ నిర్ణయాలు.. ఒంటిమిట్ట రామయ్య బ్రçహ్మోత్సవాలకు రూ.3,86 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాశరధి కల్యాణాన్ని 70వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉత్సవాలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. రామాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించే అంశాలను ప్రస్తావించారు. కల్యాణవేదిక వద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణవేదిక నుంచి రామాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల విద్యుత్ పనులకు సంబంధించి రూ 1,01,75,000,00 ఖర్చు చేయనున్నారు. వివిధ సౌకర్యాలకు సంబంధించి ఏర్పాట్లు నిమిత్తం రూ.259లక్షలను వ్యయం చేస్తున్నారు. ఈ పనుల చేపట్టేం తేదిలను టీటీడీ ఖరారు చేస్తుంది. అలాగే రూ.977లక్షల వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సమన్వయంతో పనిచేయాలి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఆదేశించారు. రంగమండపంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అధికారికంగా రామాలయంలో జరిగే నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకముందుగా స్వామివారిని జేఈఓ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
- పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి - 144 సెక్షన్ అమలు చేయాలి - పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష కర్నూలు సిటీ: వచ్చేనెల 17వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సు సదుపాయాలు కల్పించాలని, రవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల దగ్గర మెడికల్ కిట్లు ఏర్పాటు చేసి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రశ్న పత్రాలను ఆయా కేంద్రాలకు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్ నుంచి స్కూళ్లకు చేర్చే సమయంలో బందోబస్త్‌తో వెళ్లాలన్నారు. ఎక్కడ కూడా విద్యార్థులకు వసతులు లేవనే ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలని, మాస్‌కాపింగ్‌కు అవకాశమే లేకుండా చూడాలన్నారు. పరీక్ష జరుగుతున్నంత సేపు నిరంతరంగా కరెంట్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమస్యాత్మకమైన కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. వచ్చే నెల17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలకు జిల్లాలో 240 కేంద్రాలను ఎంపిక చేశామని, మొత్తం 51462 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇన్చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానా కలెక్టర్‌కు వివరించారు. అన్ని రకాల సదుపాయలు ఉండే స్కూళ్లనే కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యువభేరికి చకచకా ఏర్పాట్లు
* నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన వేదిక * స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు * విద్యార్థులు, మేధావులు భారీగా తరలిరావాలని పిలుపు సాక్షి, అమరావతి బ్యూరో/ పట్నంబజారు: గుంటూరులో ఈనెల 16వ తేదీన జరిగే యువభేరి కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. విద్యార్థులు, మేధావులు,యువకులను చైతన్యపరిచి పెద్ద ఎత్తున యువభేరికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అనంతరం యువభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అ«ధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు ఆధ్వర్యంలో పోస్టర్‌ను విడుదల చేశారు. పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ప్రత్యేకహోదా సాధనకు ఆమరణ దీక్ష చేసిన నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కనున్న స్థలాన్నే యువభేరికి వేదికగా ఎంపిక చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని వారు వివరించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షతో పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన నేతలు... యువభేరి వేదిక వద్ద ఏర్పాట్లను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, , సలాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్ అహ్మద్, గుంటూరురూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరిఽ కొటే«శ్వరరావు పరిశీలించారు. పలు విభాగాల నేతలు కొత్తా చిన్నపరెడ్డి, డైమండ్ బాబు, మొట్టు వెంకట అప్పారెడ్డి, ఉప్పుటూరి నర్శిరెడ్డి, దాసరి కిరణ్, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, దుగ్గంపూడి యోగేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, జగన్‌కోటి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు యువభేరి నేపథ్యంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్ కృషి చేస్తున్నారన్నారు. దానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తలశిల రఘురామ్ మాట్లాడుతూ యువభేరికి అంతా సన్నద్ధమైందని, 16న జగన్ గుంటూరులో జరిగే యువభేరిలో పాల్గొంటారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా వినిపించడానికి యువతను దీనిలో భాగస్వాములను చేయడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ వివిధ రకాల ఒత్తిళ్ల ద్వారా తమను ఆటంకపరచడానికి ప్రయత్నించడం సరైన చర్య కాదన్నారు. జిల్లాలో ఉపాధి ఊసేలేదు.. జిల్లాలో ఉపాధి కల్పన సమస్యాత్మకంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి ఇప్పటి వరకు 51,959 మంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకోగా, వారిలో వెయ్యి మందికి మాత్రమే ప్రైవేటు ఉద్యోగాలు అందిన పరిస్థితి. ప్రతిఏటా జిల్లాలో 20వేలమంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 15వేల మంది డిగ్రీ విగ్యార్థులు, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు మరో 80వేల మంది చదువు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి. ఇతర ప్రాంతాలకు వెళుతున్నా ఉపాధి లభించని పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే రాయితీ ఉండటంతో పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
-
సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
బుక్కపట్నం : మండలకేంద్రంలో జరిగే ‘‘జన్మభూమి–మాఊరు’’ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుక్కపట్నం వస్తున్న సందర్భంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్ ఇతర అధికారులు ముమ్మరం చేశారు. స్థానిక చౌడేశ్వరీ ఆలయ సమీపంలోని డిగ్రీ కళాశాల మైదానాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఈ స్థలంలోనే సీఎం సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బుక్కపట్నంలో పోలీసు అధికారులు భారీగా మొహరించారు. అలాగే బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్, సర్పంచ్ సాకే యశోద, ఎంపీపీ రవి, టీడీపీ మండల కన్వీనర్ వెంకటనారాయణరెడ్డి, గూనిపల్లి సర్పంచ్ లత పాల్గొన్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి: తిరుపతిలో 104వ భారత సైన్స్ కాంగ్రెస్(ఐఎస్సీ) సమ్మేళనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఈ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జరుగనున్న సైన్స్ కాంగ్రెస్ కోసం శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయ ఆవరణంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విశ్వవిద్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రధానమంత్రికి స్వాగతం పలికే ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జనానికి చేరువచేసే దిశగా పలు ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించనున్నారు. తొమ్మిది మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో నిష్టాతులైన 200 మంది శాస్త్రవేత్తలు, జాతీయ ప్రయోగశాలల శాస్త్రవేత్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఇఆర్‌ఎస్ తదితర సంస్థలకు చెందిన 18వేల మంది ప్రతినిధులు సైన్స్ కాంగ్రెస్‌కు హాజరుకానున్నారు. -
పకడ్బందీగా ఏర్పాట్లు
నేటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు అనంతపురం సెంట్రల్ : పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లనిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 19 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్వహణలో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 5,697 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. అభ్యర్థులు పీటీసీ తూర్పు గేటు ద్వారా లోపలికి ప్రవేశించి రిపోర్టింగ్ పాయింట్లో రిపోర్టు చేసుకోవాలన్నారు. అనంతరం అభ్యర్థులకు బ్రీఫింగ్ చేస్తారని, ఆ తర్వాత సర్టిఫికేషన్, లగేజీ పాయింట్ వద్దకు పంపడం, బయోమెట్రిక్ ద్వారా సరిచూడటం చేయాలన్నారు. అవి అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీటెస్టులో భాగంగా 1600 మీటర్ల పరుగు, ఆ తర్వాత లాంగ్ జంప్, వంద మీటర్ల పరుగు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా కూడా పొరపాట్లు, లొసుగులు జరగరాదన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం కొం దరు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులచే ఉదయం అల్పాహారం కింద బిస్కెట్లు, మధ్యాహ్నం పులిహోరా, పెరుగన్నం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు మల్లికార్జునవర్మ, మహబూబ్‌బాషా, వెంకటరమణ, నాగసుబ్బన్న, నర్సింగప్ప, చిదానందరెడ్డి, వెంకటరామాంజనేయులు, వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ పాల్గొన్నారు. -
దుర్గగుడిపై చంటిబిడ్డలకు పాలకేంద్రాలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మ దర్శనానికి చంటిబిడ్డలతో వచ్చిన తల్లుల కష్టాలు ఇక తీరనున్నాయి. అమ్మవారి సన్నిధిలో చంటిబిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయాలని దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఈవో సూర్యకుమారికి పలువురు చంటిబిడ్డల తల్లులు పిల్లలకు ఆరు బయట పాలు ఇవ్వడాన్ని గమనించారు. ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రంతో పాటు రాజగోపురం ఎదుట మరో కేంద్రాన్ని ఆదివారం నాటికి ఏర్పాటుచేయాలని ఇంజినీరింగ్ విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాలకేంద్రాలలో తల్లులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఎండ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈవో ఆదేశాలతో అధికారులు పాలకేంద్రాల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. -
జగన్ సభా ఏర్పాట్లపై సమావేశం
నరసరావుపేట రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 16వ తేదీన నరసరావుపేట నిర్వహించనున్న బహిరంగ సభపై పార్టీ జిల్లా నాయకులు విస్త్రృత చర్చలు జరిపారు. యువ నాయకుడు కాసు మహేష్‌రెడ్డి ఈ సభలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహంలో శుక్రవారం రాత్రి పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, కాసు మహేష్‌రెడ్డి, కావటి మనోహార్నాయుడు, మిట్టపల్లి రమేష్‌బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల తర్వాత నరసరావుపేట నియోజకవర్గానికి మొదటిసారిగా జగన్ రానున్నడంతో సభను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభా ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. -
అంతర్జాతీయ నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
విజయవాడ : జనవరిలో జిల్లాలో జరపతలపెట్టిన అంతర్జాతీయ సంగీత నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ బాబు.ఏ తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సంగీత నృత్య ఉత్సవాలపై సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 19 నుంచి 22 వరకు పవిత్రసంగమం వద్ద ఈకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించారు. వయోలి¯ŒS విద్యాంసులు ఎల్.సుబ్రమణ్యం జేసీ జి.చంద్రుడు, సబ్–కలెక్టర్ సలోనిసిదాన, సాంస్కృతికశాఖ డైరెక్టర్ డి.విజయభాస్కర్, టూరి జం ఈఈ మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
గ్రూప్-2 కోసం పక్కా ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్షలను నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనన్ని ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్తుపరంగా అంతరాయం లేకుండా చూడటంతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అరుుంది. జిల్లా కలెక్టర్లతోనూ ఏర్పాట్లపై సమీక్షించింది. నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకు 12న సెలవు ఈ నెల 11, 13వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 12వ తేదీన సెలవు దినమేనని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి 12వ తేదీ రెండో శనివారం సెలవు దినమే. కానీ వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబరు 15వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దానికి ప్రత్యా మ్నాయంగా ఈ నెల 12న పాఠశాలలు నిర్వహించాలని పేర్కొంది. అరుుతే గ్రూప్-2 రాత పరీక్ష 11వ తేదీన, 13వ తేదీన ఉంది. 12వ తేదీన కనుక జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యాసంస్థలు కొనసాగితే ఆ పరీక్ష కేంద్రాల్లో 11వ తేదీన పరీక్ష కోసం వేసిన హాల్‌టికెట్ల నంబర్లను 12వ తేదీన విద్యార్థులు తుడిచివేసే అవకాశముంది. మళ్లీ 13వ తేదీన పరీక్ష ఉన్నందున 12న మళ్లీ హాల్‌టికెట్ నంబరు వేయాలంటే కష్టంగా మారనుంది. దీంతో 12న సెలవు దినంగా ప్రకటించింది. విద్యాశాఖతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకే ఇది వర్తిస్తుంది. మిగతా విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయి. -
బ్యాంకుల ముందు టెంట్లేశారు
భోపాల్: బ్యాంకులు కాలం తీరిపోయిన 500, 1000 రూపాలయల నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వడం ప్రారంభించాయి. ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయంతో రెండు రోజులుగా 500, 1000 రూపాయల నోట్లు తప్ప వేరే కరెన్సీ నోట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు ముందుగా బ్యాంకులకు పరిగెత్తుతున్నారు. బ్యాంకులు కూడా రద్దీని ఊహించి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. బ్యాంకులు అదనపు కౌంటర్ల ఏర్పాటుతో పాటు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కొన్ని బ్యాంకుల ముందు ఇలా టెంటు వేసి కనిపించింది. నోట్లను మార్చుకోవడానికి ప్రజలు భారీ ఎత్తున వస్తారని, వారికి అసౌకర్యం కలుగకుండా ఈ ఏర్పాట్లు చేశామని వారు చేబుతున్నారు. -
నేడు దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మీ యాగం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం మహాలక్ష్మి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్జున వీధిలోని మహా మండపం సమీపంలో ప్రత్యేక యాగశాల ఏర్పాటుచేశారు. వేద పండితులతో పాటు ఉభయదాతలు కూర్చునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకూ యాగం జరుగుతుంది. రూ.3,116 టికెట్ కొన్న ఉభయదాతలు యాగంలో పాల్గొనవచ్చు. యాగశాల నిర్మాణానికి ఆ ప్రాంతాన్ని మొత్తం చదును చేయడంతో పాటు యాగం నిర్వహించేందుకు రూ.2లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే, సరైన ప్రచారం లేక ఎంతమంది ఉభయదాతలు హాజరవుతారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏర్పాట్లు ముమ్మరం
ఆసిఫాబాద్/కెరమెరి : గిరిజన ఆరాధ్యదైవం కుమ్రం భీం 76 వర్ధంతిని భీం పురిటిగడ్డ జోడేఘాట్‌లో ఈ నెల 16న అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వర్ధంతి సభకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమైక్య పాలనలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ప్రజాప్రతినిధులు, అధికారులను జోడేఘాట్‌కు అనుమతించకపోవడంతో అధికారులు హట్టిబేస్ క్యాంప్ వద్దనే నివాళులర్పించేవారు. ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం తొలిసారివర్ధంతి సభకు హాజరై నివాళులర్పించారు. జోడేఘాట్ అభివృద్ధికి వరాల జల్లు ప్రకటించారు. రూ.25 కోట్లతో జోడేఘాట్‌లో స్మృతి చిహ్నం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండేళ్లుగా పనులు చురుకుగా సాగుతున్నాయి. పర్యాటక నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జల్‌జంగల్ జమీన్‌కు గుర్తుగా ముఖద్వారాలు నిర్మించారు. ఆదివాసీ గిరిజన సంస్కృతిని తలపించే మ్యూజియూనికి ఆకర్శణీయ రంగులు వేశారు. వర్దంతి ఏర్పాట్లలో భాగంగా భీమ్ స్మారక స్తూపం వద్ద గ్రానైట్ రాయితో శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్ల పరిశీలన జోడేఘాట్‌లో వర్ధంతి ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కుమ్రంభీం, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు చంపాలాల్, కర్ణన్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. భీం స్మారక పనులను పరిశీలించారు. భీం విగ్రహానికి రామన్న పూల మాల వేసి నివాళి అర్పించారు. తర్వాత భీం సృ్మతివనం, మ్యూజీయం, హంపీథియోటర్ల నిర్మాణాలను పరిశీలించారు. మ్యూజియంలో అలంకరించనున్న గుస్సాడీ ప్రతిమలు, వాయిద్యాలు వాయిస్తున్న కళాకారులు, కుమ్రం భీంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజల ప్రతిమలను పరిశీలించారు. గిరిజనుల సంస్కృతి, ఆచార వ్యవహారాలను చూసి ఆనందపడ్డారు. హంపీథియేటర్ పనులను చూశారు. గతంలో సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల్లో మ్యూజియం పనులు పూర్తయ్యే దశలో ఉండగా, డబుల్ బెడ్ రూం పనులు పూర్తి కాలేదు. మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ ర్ధంతి సభకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు, సీఎం పర్యటనకు సన్నాహాలు చేస్తున్నా సీఎం పర్యటనపై అనుమానాలు ఉన్నాయి. వర్ధంతిని పురస్కరించుకొని మూడు రోజులుగా పోలీసు బలగాలు జోడేఘాట్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నుంచి జోడేఘాట్ వరకు అడుగడుగునా పోలీసు బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
విజయవాడలో ఏర్పాట్లపై భవానిల అసంతృప్తి
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు వెల్లడించారు. అక్టోబరు 1 నుండి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదేస్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవ దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సు ట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు. -
బ్రహ్మోత్సవ సంబరానికి టీటీడీ సన్నద్ధం
- అక్టోబరు 3 నుండి11వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ప్రత్యేక ఆకర్షణగా దశావతారాల సైకత శిల్పం - సీసీ కెమెరా నిఘాలో బ్రహ్మోత్సవాలు - అన్ని ఆర్జిత సేవలు రద్దు, 7 లక్షల లడ్డూలు సిద్ధం తిరుమల: తిరుమలలో అక్టోబరు 3 నుండి 11వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిళ్ఆళ్వారు తిరుమంజనం వైదికంగా నిర్వహించారు. ఆలయం పరిమళంతో గుభాళిస్తోంది. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం పనులు పూర్తి చేశారు. గోపురాలకు వెల్లవేశారు. తిరువీధుల్లో రంగుల రంగవల్లులు అలంకరించారు. ఆలయానికి దేదీప్యమానంగా భారీ విద్యుత్ అలంకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈసారి ఎల్ఈడీ బల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రత్యేక ఆకర్షణ కానున్న శ్రీవారి సైకత శిల్పం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తకోటికి సైకత శిల్పం కనువిందు చేయనుంది. ఇక్కడి కల్యాణవేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పం దర్శనమివ్వనుంది. దశావతరాల్లోని మశ్చ లేదా నృశింహ అవతారంలో ఏదో ఒక సైకత శిల్పాన్ని నిర్మించాలని సంకల్పించారు. సుమారు ఏడు ట్రక్కుల ఇసుకతో మైసూరుకు చెందిన సైకత శిల్ప నిపుణులు ఎంఎల్ గౌరి (25), నీలాంబిక (23)తో కలసి సైకత శిల్పాన్ని రూపొందించనున్నారు. వరుసగా రెండేళ్లుగా వీరు రూపొందించిన 'వైకుంఠం నుండి భువికి ఆనంద నిలయం తీసుకురావటం', 'లక్ష్మీ భూ వరాహస్వామి' సైకత శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సీసీ కెమెరా నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి బ్రహ్మోత్సవాల్లో అన్ని విభాగాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ విషయంలో టీటీడీ, విజిలెన్స్, పోలీసు విభాగాలకు ఏపీ డీజీపీ సాంబశివరావు తిరుమల పర్యటన సందర్భంగా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ దిశగా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆలయంతోపాటు నిత్యాన్నప్రసాదం, కల్యాణకట్ట, ఇతర ముఖ్య కూడలి ప్రాంతాల్లో 400 పైచిలుకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం అదనంగా మరో 150 కెమెరాలు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాత్రిసదన్-4 వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్ కామాండెంట్ సెంటర్లో కంట్రోల్‌రూమ్ ద్వారా సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు. సుమారు 3000 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో 1000 మందిని నియమించనున్నారు. 24 గంటలూ రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే 3 నుండి 11వ తేదీ వరకు తిరుపతి, తిరుమల మధ్య రెండు ఘాట్‌రోడ్లను తెరిచి ఉంచి వాహనాలు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశారు. 7 లక్షల లడ్డూలు సిద్ధం చేయనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 03-10-2016 - ధ్వజారోహణం( సా:6గం) - పెద్ద శేషవాహనం 04-10-2016 - చిన్నశేషవాహనం - హంసవాహనం 05-10-2016 - సింహవాహనం - ముత్యపుపందిరి వాహనం 06-10-2016 - కల్పవృక్షవాహనం - సర్వభూపాల వాహనం 07-10-2016 - మోహినీ అవతారం- గరుడ వాహనం 08-10-2016 - హనుమంతవాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం - గజవాహనం 09-10-2016 - సూర్యప్రభ వాహనం- చంద్రప్రభ వాహనం 10-10-2016 - రథోత్సవం - అశ్వవాహనం 11-10-2016 - చక్రస్నానం - ధ్వజారోహణం -
విజయవాడలో దసరాకు వేగంగా ఏర్పాట్లు
-
దసరాకు తాత్కాలిక ఏర్పాట్లు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడిపై అక్టోబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో దేవస్థాన ప్రాంగణంలో తొలగించిన షెడ్డు స్థానంలో తాత్కలిక షెడ్డును సిద్ధం చేస్తున్నారు. వీఐపీలను ఘాట్ రోడ్డు మీదుగా అనుమతిస్తుండటంతో కొండపై ప్రొటోకాల్, దేవస్థాన అధికారులు వేచి ఉండేందుకు ఈ షెడ్డును ఉపయోగిస్తారు. సమాచార కేంద్రాన్ని ఓం టర్నింగ్ సమీపంలోని పొంగలి షెడ్డులో ఏర్పాటు చేశారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
- ఏపీ డీజీపీ సాంబశివరావు - ఆలయ వీధుల్లో భద్రత ఏర్పాట్ల తనిఖీ తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భద్రత పటిష్టం చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ వీధుల్లో సాగుతున్న బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని కితాబిచ్చారు. ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్ ఇనుప కంచె కారణంగా భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు ఉండే అవకాశం లేదన్నారు. టీటీడీ విజిలెన్స్, అర్బన్ జిల్లా పోలీసు విభాగాలు సమన్వయంతో భద్రతను కట్టుదిట్టం చేశాయన్నారు. తిరుమల ఆలయ ఆగమ శాస్రాల ప్రకారం డ్రోన్లు వినియోగించలేమన్నారు. ఈ సారి బందోబస్తుతోపాటు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు ప్రింట్స్‌తో అనుమానితులను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. భక్తుల సేవ కోసం ప్రత్యేంగా 150 మంది సిబ్బందితో 'పోలీస్ సేవాదళ్' ఏర్పాటు చేశామన్నారు. చైల్డ్ ట్రాకింగ్ పద్ధతి అమలు ద్వారా చిన్నారులు తప్పిపోయినా త్వరగా వారి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ యూనిట్ ప్రారంభించామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల కొరత తీవ్రంగా ఉందని, 8 మంది అదనపు డీజీలు, 25 మంది ఐజీలు మాత్రమే ఉన్నారన్నారు. అందువల్లే టీటీడీకి శాశ్వత సీవీఎస్వో పోస్టు నియమించలేదని, త్వరలోనే సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. తిరుమల భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసే అవకాశం లేదన్నారు. ఆయన వెంట ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ ప్రభాకర్‌రావు, టీటీడీ సీవీఎస్వో శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి జయలక్ష్మి ఉన్నారు. -
నిమజ్జన రోజు ప్రజలు సహకరించాలి
-
ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్-3 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య తెలిపారు. కూకట్పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్ష 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని, మొత్తం 56,153 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. వీరి కోసం రెండు రాష్ట్రాల్లో 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్‌టికెట్లను 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిముషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని చెప్పారు. బయోమెట్రిక్ విధానాన్ని పాటిస్తామని, అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆన్లైన్లో వారు పూర్తి చేసిన దరఖాస్తును కూడా తీసుకురావాలని కోరారు. ఎంసెట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు కూడా ఎంసెట్-3కు అనుమతిస్తున్నామని అన్నారు. -
కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనానికి ఏర్పాట్లు
యాలాల: తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జనానికి సంబంధించి మండలంలోని కోకట్ కాగ్నా నది వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది కాగ్నా బ్రిడ్జిపై బారికేడ్లతోపాటు విద్యుత్ దీపాల ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు, నిమజ్జన ప్రదేశంలో నీరు నిలిచేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. కాగా గతేడాది కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనం సమయంలో నీటికొరత తీవ్రంగా ఉండి ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా మండలంలో గత వారం కురిసిన భారీ వర్షాలతో కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో నదిలో నీరు పుష్కలంగా ఉండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. యాలాల పోలీసులు కాగ్నా నది వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
చకచక ఏర్పాట్లు..
కామారెడ్డి : కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పాటు కానుండడంతో ఆయా ప్రభుత్వ విభాగాలకు అవసరమైన భవనాల ఎంపిక ప్రక్రియ ముమ్మరమైంది. జిల్లా పోలీసు శాఖ భవనంతో పాటు ఎస్పీ నివాస గృహాలను ఎంపిక చేసిన అధికారులు కావలసిన ఏర్పాట్లను మొదలుపెట్టారు. పట్టణంలోని అడ్లూర్ రోడ్డులో గల ఎస్టీ హాస్టల్ భవనాన్ని ఎస్పీ కార్యాలయం కోసం ఎంపిక చేశారు. ఆ భవనాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే భవానీనగర్‌లో ఎస్పీ నివాస గృహం కోసం ఓ ఇంటిని పరిశీలించి, దానిని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసు శాఖ కార్యాలయాలు, నివాస గృహాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై నిఘా వర్గాలు ముందస్తుగా పరిశీలన చేపట్టాయి. ఎస్పీ కార్యాలయానికి ఎంపిక చేసిన భవనానికి వెళ్లే దారిని ట్రాక్టర్లతో చదును చేశారు. అంతేగాక భవనం వద్ద పోలీసు కాపలా ఉంచారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎటు వైపు నుంచి వస్తారు, ఎటువైపు వెళతారు, రక్షణ ఏర్పాట్ల తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 20 లోపు జిల్లా కార్యాలయాలకు సంబంధించి అధికారులు, సిబ్బంది చేరుకుని ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. దసరా రోజున కచ్చితంగా జిల్లా పాలన మొదలుకానున్న నేపథ్యంలో అన్ని విభాగాల్లో వేగం పెరిగింది. కొనసాగుతున్న ‘కలెక్టరేట్’ పనులు.. జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ కోసం ఎంపిక చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల్లో పనులు ముమ్మరమయ్యాయి. ప్రధాన గేటు వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అలాగే కలరింగ్ తుది దశలో ఉంది. అయితే, కార్యాలయానికి అనుకూలంగా చేపట్టాల్సిన పనులు ఒకటి రెండు రోజుల్లో మొదలవుతాయని భావిస్తున్నారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు భవనం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడంతో పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. కాగా, కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడానికి ఉన్న రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉంది. అలాగే కాంప్లెక్స్ కాంపౌండ్‌లో నల్లమట్టితో ఉన్న నేల కావడం వల్ల ఇబ్బందికరంగా ఉంది. కాంప్లెక్స్ ఆవరణలో మొరం నింపడమో, సీసీ పనులు చేపట్టడమో చేస్తే రాకపోకలకు అనువుగా ఉంటుంది. మరోవైపు, కలెక్టర్ నివాసానికి సంబంధించి ఇంకా ఏ భవనాన్ని ఖరారు చేయలేదని తెలుస్తోంది. కాంప్లెక్స్ ఆవరణలో ప్రిన్సిపల్ క్వార్టర్ ఉన్నప్పటికీ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి అంత అనుకూలంగా లేదు. దీంతో కలెక్టర్ నివాసం ఎక్కడా అనేది ఇంకా నిర్ణయించలేదు. మొత్తమ్మీద కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. -
5 నుంచి దుర్గగుడిపై గణపతి నవరాత్రులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 5 నుంచి 13వ తేదీ వరకు గణపతి నవరాత్రుల మహోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదో తేదీ ఉదయం గణపతి పూజ, కలశస్థాపన, విశేష పత్రి పూజతోపాటు కథా శ్రవణం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీగణపతి హోమం, సాయంత్రం ఆవాహన దేవతా హోమం నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పూర్ణాహుతిలో ఉత్సవాలు ముగుస్తాయని, సాయంత్రం 5 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు ఉంటుందని అధికారులు తెలిపారు. -
మునకలు లేకుండానే మమ..!
సాక్షి, అమరావతి : నది ప్రవాహ సమయంలో గతంలో భక్తులు పుణ్యస్నానాలు చేసే వారు. మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. ప్రస్తు తం కృష్ణానది నీటిలో నిండా తడిసే అవకాశం లేక జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్ని ము గించు కోవాల్సిన పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 54కు పైగా ఘాట్లలో నీళ్లు లేవు. దీంతో అధికారులు ప్రతామ్నాయాలు ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లా కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణానది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీపం నాగులేరులో మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నది లో పుష్కర స్నానాన్ని కాలువలో చేయిం చాలని భావించారు. దాదాపు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెండు రోజుల వృథాప్రయాసకు తెరదించారు. ప్రకాశం బ్యారేజీ ఎగువున దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగినంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా మునకలకు వీలులేకపోవడంతో భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు (షవర్) స్నానాలు ఏర్పాటు చేశారు. విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో నిలిచిన నీ టితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో వ్యాధుల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతం కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటుచేశారు. తీర ప్రాం తంలోని కృష్ణానది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పో సుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువున గుంటూరు జిల్లాలో చాలా ఘా ట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరి స్థితి నెలకొనడం కొసమెరుపు. -
అడ్డగోలు దోపిడీకి ఏర్పాట్లు
పనులు చేసినట్లు చూపించేందుకు యత్నం సహకరిస్తున్న ఇరిగేషన్ అధికారులు గొల్లపల్లి (నూజివీడు) : నీరు–చెట్టు పథకం అధికార పార్టీ నేతలకు వరంగా మారింది. పనులు చేయకుండానే చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి నిధులు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ఇరిగేషన్ అధికారులు కూడా సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పనుల్లో నూజివీడు మండలం గొల్లపల్లిలో ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. మట్టిసరిచేసే పనులు ఇక్కడ జరుగుతున్నాయి. నీరు–చెట్టు పనులు చేపట్టిన వ్యక్తులు మట్టి తోలకుండానే తోలినట్లుగా చూపించి అడ్డగోలుగా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తోచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామంలోని వడ్డీ చెరువుకు నీరు–చెట్టులో పూడికతీత పనులు చేయడానికి ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. దీంతో ఈ చెరువు కట్టకు మట్టిని తోలడంతో పాటు కొంతవరకు బయటకు తోలారు. ఆ తరువాతే అసలు దోపిడీ పని ప్రారంభమైంది. దీనిలో భాగంగా చెరువు లోపలి భాగమంతా పొక్లెయిన్‌తో సరిచేయడం, డోజర్‌తో సమానంగా సర్ధడం, అంచులను చెక్కడం తదితర పనులు చేస్తున్నారు. పని చేయకుండా పనిచేసినట్లుగా కొలతల కోసం ఇలా చేసి దోచుకునేందుకే చెరువులోని గోతులను పొక్లెయిన్‌తో సరిచేస్తున్నారని గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా మండలంలోని పోలసానపల్లిలో కూడా పనులు మంజూరు కాని చెరువులో పొక్లెయిన్లతో గోతులను సరిచేయడం, అంచులను చెక్కడం తదితర పనులను చేశారు. ఇలా అధికార పార్టీ నాయకులు అధికారం ఉందనే ధీమాతో వారి ఇష్టం వచ్చిన విధంగా నీరు–చెట్టు పనులను చేస్తూ జేబులు నింపుకుంటున్నారని, దీనిపై విచారణ చేయించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు. -
'పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేసాం'
-
కృష్ణమ్మకు పుష్కర శోభ
► రేపటి నుంచి పుష్కరాలు... సర్వం సిద్ధం ► ఉదయం గం.5.58కు ముహూర్తం ఖరారు ► 23వ తేదీ దాకా కొనసాగనున్న వేడుక ► భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ► పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో 81 ఘాట్లు ► మూడున్నర కోట్ల మంది స్నానం చేస్తారని అంచనా ► భారీగా ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సులు సిద్ధం ► గొందిమళ్ల ఘాట్‌లో రేపు ఉదయం 5.58 గంటలకు సీఎం దంపతుల పుష్కర స్నానం ► గవర్నర్ కూడా అక్కడే స్నానమాచరించే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మకు పుష్కర శోభ వచ్చింది. కృష్ణా పుష్కరాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 5.58 గంటల నుంచి పుష్కరాలు మొదలవుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 23వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో దాదాపు మూడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. పుష్కర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయ సమీపంలో గొందిమల్ల ఘాట్‌లో శుక్రవారం ప్రాతఃకాలంలో సతీసమేతంగా పుణ్య స్నానమాచరిస్తారు. సీఎం దంపతులు గురువారం సాయంత్రం ఆలంపూర్ చేరుకుని హరిత గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఉదయం 5.58 గంటలకు పుష్కర స్నానానంతరం జోగులాంబను దర్శించుకుంటారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా వస్తారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండలో 29 చొప్పున రూ.212 కోట్లతో 81 ఘాట్లు ఏర్పాటు చేశారు. పాలమూరులో బీచుపల్లి, ఆలంపూర్, రంగాపూర్, కృష్ణా, గొందిమల్ల; నల్లగొండ జిల్లాలో మఠంపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్, చాయసముద్రం తదితర ఘాట్లకు భక్తులు పోటెత్తేలా ఉండటంతో గజ ఈతగాళ్లను, మరబోట్లను సిద్ధం చేశారు. మొసళ్లు కొట్టుకొచ్చే ప్రమాదమున్నందున ఘాట్ల వద్ద నదిలో కంచెలు ఏర్పాటు చేశారు 15 వేల మంది బందోబస్తు 15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూములు, కాల్ సెంటర్లు పెట్టి సీసీ కెమెరాలు అమర్చారు దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. పుష్కర సమాచారంతో పాటు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-24750102, 24750020, 24752825, 2475 3850, 24757325; సెల్ నంబర్లు: 7995232 762, 7995231953, 7995232903, 7995 231963, 7995232781. వృద్ధులు, వికలాంగులు, పిల్లల కోసం ఘాట్ల వద్ద షవర్లు ఏర్పాటు చేశారు పూర్తి కాని పనులు శుక్రవారం పుష్కరాలు మొదలవుతున్నా చాలాప్రాంతాల్లో బుధవారం నాటికి కూడా పనులు పూర్తవలేదు రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల వల్ల నెల రోజులుగా పనులు సాగక పలుచోట్ల పనులు సగం కూడా పూర్తవలేదు సీఎం సమీక్ష పుష్కర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎగువన భారీ వర్షాలతో వరద ఉధృతంగానే ఉన్నందున పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. -
సన్నాహక సంరంభం
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలోని పీటీసీలో జరిగే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే బృందాలు చేస్తున్న సన్నాహక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి టి.అంజయ్య సమక్షంలో నగరంలోని జీసస్‌నగర్‌లోని పేస్ స్కూల్ విద్యార్థుల జెండా పాట, కేజీబీవీ పెద్దవడుగూరు విద్యార్థులు ‘ఎగరాలోయి ఎగరాలోయి’ పాట, ఎల్‌ఆర్‌జీ స్కూల్ విద్యార్థులు, కేఎస్ఆర్ గర్‌్ల్స హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ, ఎస్పీ పీటీసీలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖర్‌బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12లోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసేలా నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. నిఘా పటిష్టం జిల్లాలో రాష్ట్రస్థాయి స్వాంతంత్య్ర వేడుకలు జరుగుతున్న దృష్ట్యా శాంతిభద్రతలపై పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. పీటీసీలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ క్షుణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు విశ్వనాథ్‌చౌదరి, రంగడు, కాంత్రికుమార్లు మూడు బృందాలుగా విడిపోయి ఇంటింటికీ నోటీసులు అందజేశారు. వారం రోజుల పాటు సున్నిత ప్రాంతాలలో తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఈ వారం రోజుల వ్యవధిలో కొత్తగా ఎవరైనా వచ్చినా, అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆదేశిస్తున్నారు. నగరంలోకి ప్రవేశించిన వారు ఎక్కడో చోట సీసీ కెమెరాల్లో బందీ అయ్యేలా దాదాపు 150 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. -
భక్తులకు ఏ లోటు రాకూడదు
విజయవాడ సెంట్రల్ : పుష్కరనగర్లకు వచ్చే భక్తులకు రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ మంత్రి పి.నారాయణ సూచించారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్‌తో కలిసి మంగళవారం రాత్రి బస్టాండ్ సమీపంలోని పుష్కరనగర్‌ను మంత్రి పరిశీలించారు. పుష్కరనగర్లలో వసతులకు లోటు రానీయొద్దని చెప్పారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పుష్కరసెల్ నుంచి తాను ఎప్పటికప్పుడు ఘాట్లు, పుష్కరనగర్లలో ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. భోజన, వసతి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటివరకు నగరంలోని పుష్కరనగర్లలో ఏర్పాటుచేసిన వసతుల గురించి మేయర్ వివరించారు. ఈఈలు ధనుంజయ, టి.రంగారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణాపుష్కరాల కోసం ఏర్పాట్లు పూర్తిచేశాం
-
ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
-
బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లు, వేదికపై ఎంతమంది ఉండాలి, సభాధ్యక్షత, పార్టీలో అంతర్గతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శనివారం సమీక్షించారు. పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్న ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాకు వివరించారు. ఆదివారం ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.20కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలుకుతాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనంతకుమార్, ఎం.వెంకయ్యనాయుడు, హన్సరాజ్ గంగారాం అహిర్, బండారు దత్తాత్రేయ ఉంటారు. తొలుత గజ్వేల్‌లో కార్యక్రమాలు ముగిశాక మోదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి 40 నిమిషాలపాటు ప్రసంగిస్తారు. వేదికపైకి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నాయకుడు జి.కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. సభాధ్యక్షతపై సందిగ్ధం.. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న బీజేపీ మహాసమ్మేళన్‌కు ఎవరు అధ్యక్షత వహించాలనేదానిపై పార్టీలో సందిగ్ధం నెలకొంది. పార్టీ కార్యక్రమం కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలోనే సభ నిర్వహించడం సంప్రదాయం అని కొందరు నాయకులు వాదించారు. అయితే వివిధ కారణాల వల్ల పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్షనేత జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని బీజేపీ వర్గాలు ముందుగా వెల్లడించాయి. అంతర్గతంగా జరిగిన పరిణామాలేమిటో వెల్లడి కాకున్నా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సభకు అధ్యక్షత వహిస్తారని శనివారం సాయంత్రానికి పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంలో సందిగ్ధం ఎందుకు ఏర్పడిందో తెలియాల్సి ఉందని అంటున్నారు.