సాక్షి, నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. రొట్టెల పండుగ పూర్తయ్యే వరుకూ బారా షాహీద్ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
మీడియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ...
రొట్టెల పండుగ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, నేతలు మాలెం సుధీర్‌కుమార్ రెడ్డి, దర్గా కమిటీ ఛైర్మన్ రజాక్,మున్నా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment