
సాక్షి, నెల్లూరు: ఈ నెల 25న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం ఎన్టీఆర్ నగర్‌లో పర్యటించిన మంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 25 క్రిస్మిస్‌తో పాటు ముక్కోటి ఏకదశి కూడా ఉందన్నారు. ఈ రెండు పండగలు ఒకేరోజు వచ్చినందున్న ఆరోజే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. ఆ మహాకార్యాన్ని ఏ చంద్రబాబు కూడా ఆపలేడని ఆయన అన్నారు. ఇక ఎల్లో మీడియా తనపై రాస్తున్న పుకార్లపై స్పందిస్తూ.. ‘నా మీద కట్టుకథలు రాస్తున్న ఆంధ్రజ్యోతి పేపర్‌కు నేను భయపడను. కావాలంటే 365 రోజుల రాసుకోండి ఐ డోంట్ కేర్’ అని మంత్రి వ్యాఖ్యానించారు.